మోహనరాగమహా మూర్తిమంతమాయే....
నాకు నచ్చిన మంచిపాటలలో ఇది ఒకటి. మహామంత్రి తిమ్మరుసు చిత్రంలోనిది. ఎన్.టి.ఆర్, దేవిక నటీనటులు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించారు. 1962లో విడుదలైన ఈ సినిమాను అట్లూరి పుండరీకాక్షయ్య, ఎన్.రామబ్రహ్మం నిర్మించారు. మధురగానం అందించినది ఘంటసాల మాష్టారు, సుశీలమ్మ. రచయిత వివరాలు దొరకలేదు.