మనిషికి మానవ సమాజం గురించి తెలుసుకోవడమే  

అన్నింటికన్నా అవసరమైన జ్ఞానం   !


ఇంతకుముందు చర్చించిన అంశం :

ప్రస్తుతం డైరెక్టుగా అంశాలలోకి వెళదాం !

" కమ్యూనిజం గురించి సవ్యంగా చర్చిద్దాం " అనే దానిలో భాగంగా ఈ పోస్టు నుండి మొదలుకుని వివిధ అంశాలను విడివిడిగా చర్చను ప్రారంభిద్దాం!

మొదటిగా ఒక ప్రశ్న వేసుకుందాం? మనిషికి అన్నింటికనా ఏ జ్నానం ముఖ్యమైనది ?

నిర్వివాదంగా దీనికి మనం ఓ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. అదే మనిషికి మానవ సమాజం గురించి తెలుసుకోవడమే అన్నింటికన్నా అవసరమైన జ్నానం అని.

మానవ సమాజం అంటే మనుషుల సమాజం అనే అర్ధం. అంటే మనుషులకు సంబంధించిన అన్ని విషయాలు తెలుసుకోవాలి.

మనిషికి రెండే రెండు సంబంధాలు ఉంటాయి.
1 - ప్రకృతి తోటి సంబంధం    -    2 - మనిషి తోటి సంబంధం. 
ఇంతకు మించి మానవ అవసరాలకు మరే సంబంధమూ ఉండదు. 
అంటే ....... 
మనిషి ఈ రెండు కోణాలకు సంబంధించిన జ్నానం నేర్చుకోవాలి.

1-ప్రకృతికి సంబంధించిన జ్నానం  2- మానవులకు సంబంధించిన జ్నానం.

మనిషి తన అవసరాలకోసం ప్రకృతిపైననే ఆధారపడతాడు. తన సకల అవసరాలు తోటి మనిషితో తీర్చుకునేవి తప్ప మిగతావన్ని ప్రకృతినుండే పొందుతాడు. 

గాలి , నీరు , నివాసం , ఆహారం .. ఇలా అన్నీ ప్రకృతిలో నుండే పొందుతాడు. అంటే మనిషి ప్రకృతిమీద ఆధారపడి జీవిస్తాడు . కనుక ఈ ప్రకృతిని గురించి తెలుసుకోవాలి.

ప్రకృతిలో ఉండే ప్రతీదీ మనిషికి ఏదో ఒక సంబంధాన్ని , లేదా ప్రభావాన్ని చూపుతుంది. సూర్యుడు , చంద్రుడు , పక్షులు, జంతువులు, ఇతర జీవరాశులు , ఇతర గ్రహాలపై ఏమైనా జీవరాశులు ఉన్నాయా ? .. ఇలా ప్రతీ అంశం గురించి మనిషి తెలుసుకోవాలి.

ప్రకృతి అంటే ఏమిటి ? ఇది ఎలా ఏర్పడింది ? నిరంతరం ప్రకృతిలో మార్పులు ఎలా జరుగుతున్నాయి ? రేయీ - పగలూ , చీకటి - వెలుగు , నక్సత్రాలు .... ఇవి అన్నీ ఓ పద్ధతి ప్రకారం ఎందుకు నడుస్తున్నాయి .. 

ఇవి వాటంతట అవే నడుస్తున్నాయా ? వెనుక ఏదైనా శక్తి దీనిని నడిపిస్తుందా ? ఎప్పటికీ అలాగే ఉంటుందా ? ఈ మార్పులు ఎంతకాలం సాగుతాయి. ఇలాంటి అనేకం మనిషి నిరంతరం తెలుసుకుంటున్నాడు . తెలుసుకుంటూనే ఉంటాడు. 

కనుక  మనిషి ప్రకృతిపై నిరంతరం ఆధారపడుతూ ... పోరాడుతూ .. ప్రకృతిని గురించి తెలుసుకుంటుంటాడు. ఇప్పటికి మానవమేధకు అందిన ప్రకృతి అంశాలు స్వల్పం మాత్రమే. ఇంకా తెలియాల్సినవి ఎన్నో ఉన్నాయి.

ఇక రెండోది :

మనిషి తోటి మనిషిపై అవసరాలకోసం ఆధారపడుతుంటాడు. ప్రకృతి సహజ అవసరమైన స్త్రీ పురుష సంబంధాలతో పాటు బాధ, ఆనందం, దుఖం లాంటి భావోద్వేగాలను పంచుకునేందుకు - ఇతర అవసరాలు కలసికట్టుగా పనిచేసి ప్రక్రుతి నుండి పొందేందుకు మనుషులు కలసే జీవించాలి. 

మనిషి సంఘజీవి . కలసికట్టుగా కాకుండా మనిషి ఒంటరిగా జీవించలేడు.  ఆదిమ మానవుడి నుండి , అంతకుముందు నరావతారం నుండి మానవుడిగా ఎలా రూపాంతరం చెందిందీ , అప్పటినుండి ఇప్పటి నాగరిక మానవుడిగా మనిషి ఎలా ఎదిగిందీ తెలుసుకోవాలి. 

అయితే మానవులందరూ ఒకే స్థితిలో ఎందుకు లేరు. కొందరు ధనికులుగా - కొందరు పేదలుగా ఉండడానికి కారణాలు ఏమిటి ? పేద -ధనిక అనేది ఎపుడు ప్రారంభం అయిందీ ? రాజులు - రాజ్యాలు, భూస్వాములు,బానిసలు, ప్రజాస్వామ్యం , సోషలిజం లాంటి వ్యవస్థలు , దేశాలు - రాజ్యాలు ఎలా వచ్చాయి. అన్ని దేశాలు ఒకేలా ఎందుకు లేవు. నిత్యం మనుషుల మధ్య కొట్లాటలెందుకు ? డబ్బు ఎలా ? ఎవరు? ఎందుకు ? సృష్టించారు ? కులం , మతం బేధాలు ఎందుకు ఏర్పడ్డాయి ? 

మానవ సమాజం లో పెరిగే ప్రతిమనిషి కొంత వయసు వచ్చే నాటికి ప్రకృతీ - సమాజం గురించి ఏదో ఒక అభిప్రాయానికి మాత్రం వస్తాడు . స్నేహితులో - పెద్దలో చెప్పినవి విని కొన్ని , పుస్తకాల ద్వారా కొన్ని తెలుసుకుని ఉంటాడు. అయితే ఇలా తెలుసుకున్నవాటిలో అందరు చెప్పేవి ఒకలా ఉండనపుడు ఏది నిజం ? దేనిని  నమ్మాలి? అనేది కీలక ప్రశ్న అవుతుంది ? 

రంగనాయకమ్మ గారు 'కేపిటల్ పరిచయం' లో చెప్పినట్లు " ప్రకృతి - సమాజం గురించి ఏది సత్యమైతే అదే తెలుసుకోవాలి . ఆ సత్యాన్నే అనుసరించాలి.  సత్యమైనదానిని తెలుసుకోవడమే జ్నానం . అసత్యమైనది అజ్నానం. అసత్యమైనదాన్నే సత్యమనుకుంటూ ఉంటే , ఆ మనిషి అజ్నానం లో ఉన్నాడని అర్ధం . అజ్నానం మనుషులకు అనేక సమస్యలు తెచ్చిపెడితే , జ్నానం ఆ సమస్యలను పరిష్కరిస్తుంది.  మనుషులకు తమ జీవిత మార్గాన్ని సుఖ శాంతులతో నిర్మించుకోవడం కోసమే ' సత్యం మీద ఆధారపడిన జ్నానం అవసరం ."

ప్రకృతి - సమాజం గురించి వాస్తవాలను ఎలా తెలుసుకోవాలో తరువాత పోష్టులో చూద్దాము.

Reactions:

Post a Comment

 1. ఒకపక్క కమ్యునిజం గురించి మాట్లాడుతున్నారు మరొపక్క సినిమాలగురించి తెగ పొస్టుచెస్తున్నారు మీరు ఉభయచర కమ్యునిస్టులా?

  ReplyDelete
 2. @ రామమొహన్ గారికి !

  కమ్యూనిస్టుల గురించి మాట్లాడేవాళ్లు సినిమాల గురించి పోస్టు చేయకూడదనేది ఏవాదన ? కమ్యూనిస్టులు సినిమాలకు వ్యతిరేకమని మీ ఉద్దేశ్యమా ? ఆర్.నారాయణమూర్తి , మాదాల రంగారావు , టీ.కృష్ణ ఎవరు ? ఇంక చాలా మంది ప్రముఖులు కమ్యూనిస్టులు సినిమాలలో ఆదినుండి ఉన్నారు.

  కమ్యూనిస్టులలో ఉభయచర కమ్యూనిస్టులంటే ఏమిటో నాకు తెలియదు. కమ్యూనిస్టు సినిమాల గురించి మాట్లాడకూడదు అని నేనెక్కడా చూడలేదు. నాకు తెలిసి కమ్యూనిస్టుకి సంబంధం లేని విషయం లేదు. మీకు ఎవరు చెప్పారో నాకు తెలియదు. అయినా నేను ముందే ఒక విజ్నప్తి చేసాను. సంబంధం లేని ప్రశ్నలు అనవసరమని.

  జనవిజయం లో పోస్టులకూ , కమ్యూనిజం పై చర్చకూ సంబంధం ఏమిటి? ఆ యాంగిల్ లో కాకుండా జనవిజయం లో పోస్టుల గురించి మీ సూచనలు ఇస్తే తప్పక స్వీకరిస్తాను. జనవిజయం పరిపూర్ణమైన బ్లాగు కాదు. దీనికంటే మంచి ఆర్టికల్స్ రాసే బ్లాగులు చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి జనవిజయం లో ఎక్కువగా కాపీలే ఉంటున్నాయి. అవి ఎవరివో క్రింద వివరం ఇస్తుంటాను. అన్ని పోస్టులు ఉంచాలనే ఉద్దేశ్యమే. బాగాలేనివి , ఇతరులకు ఇబ్బంది కలిగించేవి ఉంటే ఎవరు సూచించినా పరిశీలించి ఆ తప్పు జరుగకుండా చూస్తాను. జనవిజయం నిర్మాణ దశలోనే ఉంది.

  ReplyDelete
 3. కొండలరావు గారు ఉభయచరమంటె ఇటు నీళ్ళలొనూ అటు భుమిపైన జీవిచె జీవరాసులను ఉభయచర జీవులు అంటారు ఉదాహరణకు కప్ప. ఓట్లకొసం కమ్యునిస్టు చిలకపలుకులు మాట్లాడుతూ ఆచరణలొ బుర్జువా పద్దతులను అవలంభించె మీకమ్యునిస్టు ముసుగు పార్టీలాగన్న మాట ( దీనిగురించి ఎక్కువ వివరాలు కావలచినవాళ్ళు రంగనాయకమ్మ గారు రాసిన "ఉభయచర కమ్యునిస్టులూ జొహార్లు" అనె వ్యాసం చుడవచ్చు ) సి.పి.యం రాస్ట్ర కార్యదర్శి రాఘవులు గారు కొన్నిప్రశ్నెలు జవాబులు అనే పుస్తక వెశారు అందులొ చర్చించడానికి చాలా అంశాలు వున్నాయి కాని మచ్చుకి ఒక దాన్ని తీసుకుందాం ఒకపాటకుడు చైనాలొ యాభై సంవస్సరాలు అయినా అక్కడ సమస్యలు అన్నీ అలాగేవున్నాయి కమ్యునిజం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించాడు దానికి మన బుర్జువా కమ్యునిస్టు అక్కడ చాలా అభివ్రుద్ది సాదించారు ఈ మద్యనే బుల్లెట్ ప్రుప్ ట్రైన్ కుడా వెచాలు కమ్యునిజం నిదానంగా వస్తుంది అన్నారు. అంటె ఆయన ప్రకారం చైనాలొ వున్నాది కమ్యునిస్టు పార్టియెనన్నమాట .అక్కడవున్నాది కమ్యునిజం పెరుతొ బుర్జువాపార్టి వున్నాదని ప్రపంచం అంతా తెలుసు కాని ఈ కమ్యునిస్టు అక్కడ వున్నాది కమ్యునిస్టు పార్టీయే నంటాడు . పెట్టుబడి అభివ్రుద్దిని కార్మికవర్గానికి అంటకట్టెడన్నమాట . గతంలొ ఎంతొత్యాగాలు చెసినవారు చాలామంది వున్నారు పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వారు తెలంగాణా విప్లవ పొరాటంలొ గాని వ్యెక్తిగత జీవితంలొ గాలి నెను అలాంటి వారిగురించి మాట్లాడం లేదు .
  కత్తిని మంచికీ వాడవచ్చు చెడ్డకూ వాడవచ్చు అలాగే ఇప్పుడు వస్తున్న సినిమాలు యెలక్ష్యంతొ వున్నాయి అవి ప్రజలకు ఎలాంటి భవజాలాన్ని ఇస్తున్నాయి ? సినిమాలగురించి మాట్లాడకూదని నేనేమన్నా అన్నానా? రొండింతి మీదా ప్రయాణమంటే అది ఆచరణలొ సాద్యం కాదు నేను కమ్యునిజం పాటిస్తాను అలాగె భక్తినికుడా పాటిస్తానంటె ఎలావుంటుంది ? ఈ సమాజం ఇలాగే వుండాలి పెట్టుబడిదారులు కార్మికులూ కాని ఇద్దరికీ న్యాయం చెస్తానంటె ఎలావుంటుంది ? అలావుంది మీవాదన
  ఇక సినిమాలలొ వున్నకమ్యునిస్టుల గురించి మాదాల రంగారావు గురించిగాని ఇంకొకఆయనగురించి గానీ నాకు తెలియదు ఆర్ .నారాయన ముర్తిగురించి నాకు తెలుసు ఆయన సినిమాలు అలాగె ఆయన ఇంటర్యులు చుశాను ఆయన కమ్యునిస్టు కాదు కాకపొతె అందరికి మేలు జరగాలిని అనుకొంటాడు అంతవరకే.

  ReplyDelete
 4. @ రామమొహన్ గారూ !
  ఉభయచరమంటే నాకు అర్ధం తెలుసు.

  ఇక మీ అభిప్రాయాలు కొన్నింటితో ఏకీభవించడం లేదు. ఎందుకంటే పుస్తకాలు మాత్రమే చదివి ఆచరణ లేని వాళ్లు చేసే ఆరోపణలు ఇవి అని నేను అభిప్రాయపడుతున్నాను.

  చైనాలో కమ్యూనిస్టు పార్టీయే కాదు,సీ.పీ.ఐ-సీ.పీ.ఎం లు కమ్యూనిస్టు పార్టీలు కాదు.సుందరయ్య తప్ప ఎవరున్నారు ? ఈ వాదనలు అర్ధం లేనివి.చాలామంది ఫేషన్‌ కోసం ఇలాంటి విమర్శలు చేస్తూనే ఉంటారు.ఇది కొత్తా కాదు ఆఖరూ కాదు. ఈ వాదన వల్ల ఆచరణలో దోపిడీదారులకే మేలు జరుగుతుంది.
  చైనాతో సహా ప్రపంచంలో సోషలిజం అమలు ఎక్కడా ఇదీ మోడల్ అని చాలెంజ్ చేసేంతగా అమలు జరగలేదు అని నా వ్యక్తిగత అభిప్రాయం. దీనికి కారణాలు ఏమిటో ఖచ్చితంగా శాస్త్రీయంగా ఆలోచించాల్సిందే.
  కానీ పెట్టుబడిదారీ దేశాలతో దీనిని పోల్చడం సరైనది కాదు అని నేను నమ్ముతున్నాను.
  మీ సూచన మేరకు 'జనవిజయం' లో సినిమాలపై వ్రాసేటపుడు జనానికి ఉపయోగపడే విశ్లేషణలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాను . ఆ లోపం నేనూ గమనించాను. 'జనవిజయం' బ్లాగు లో ఉగాది నుండి అలాంటి కొన్ని మార్పులు వస్తాయి అని హామీ ఇస్తున్నాను.
  కమ్యూనిజం పాటిస్తూ భక్తిని పాటిస్తాను అని నేను అనడం లేదు కానీ అలా అన్నా తప్పు లేదు . ఒక భక్తుడు దోపిడీని వ్యతిరేకిస్తానంటే నేను అతనిని కలుపుకుంటాను . అతని విశ్వాసాన్ని గౌరవిస్తాను. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి.

  ReplyDelete
 5. సరె మాలంటి వాళ్ళు ఫెషన్ కొసమే మాట్లాడతారనుకుంద్దాం మెము పుస్తకాలు సదివి మాట్లాడతాము మీలాంటి మేధావులు ఏమీసదవకుండానే మాట్లాడతారు మాలాంటి అజ్ఞానులకు జ్ఞానభొధచెయ్యాండి మీకమ్యునిస్టు పార్టి ఎలా సచ్చీలమైందొ .మాలంటి వాళ్ళవల్ల దొపిడీవర్గానికి మేలా? అప్పటికి మీరేదొ అడ్డుపడుటున్నాట్టు చైనాలొ గాని రశ్యాలొ గాని కమ్యునిజంవైపుగా కొన్ని అడుగులు వేసి తిరొగమనం పట్టినసంగతి అందరికీ తెలిసినవిషయమే అది మీవ్యెక్తిగత అభిప్రాయం ఏ మీకాదు. ఆ దేశాలను పెట్టుబడిదారీ సమాజాలతొ {తిరొగమనం పట్టిన తర్వాత కూడా ] పొల్సకూడం సరికాదంతున్నారు ఎలాసరికాదూ మాలాంటి తెలియని వారికి చెప్పాండి. ప్రజలను విప్లవంలొకి సమీకరిచెటప్పుడు మతాలు, కులాలు లాంటి సెకండరీ అంశాలు పరిగణలొకితీసుకొరని అందరికి తెలిసిన విషయమే నేను దానిగురించికాదు మాట్లాడేది ఒక హెతువాది గాని లేదా ఒక మార్కిస్టు గాని భక్తుడుగానూ ,అటు నాస్తికుడు గానూ, వుండగలడా? బుర్జువా పార్టీలకు మీ ముసుగు పార్టీలకు ఏ మైనా తెడావుందా ? వుంటె అది ఏమిటి ? మీలాంటి మేధావులు చెప్పాండి .
  ఈ సందర్బంగా మార్క్స్ నుంచి ఒక కొటెషన్ చుడండి { మాలాంటి అజ్ఞనులు పుస్తకాలపైనే ఆ దారపడవలసి వస్తుంది మరి } "మొతo జీతల వ్యవస్త లొ వున్న బానిసత్వన్ని అలా వుంచెదాం ఈదెనందిన పొరటాలు చివరకు ఎలా పిరిణమిస్తాయనె విషయంపై కార్మికవర్గం మరీ అతిశయబవాలకు పొకుడదు తాము పొరాడుతున్నది ఫలితాలకు వ్యతిరెకంగా మాత్రమెననీ వాతికిగ కారణాలకు వ్యతిరెకం కాదని మీరు మరచిపొకుడదు తాము పరిస్తితుల్ని దిగజారకుండా నిరొధిస్తున్నమెగాని అసలు మార్గాన్ని మార్సడంలెదని వ్యధి యొక్క తీవ్రతను తగ్గిన్సటనికి ప్రయస్తున్నమెగాని వ్యదిని నిర్మూలిన్సటం లెదని వారు గమనిన్సాలి కాబట్టి పెట్టుబడి దార్ల నిరంతరంసెచె దాడులనుంచి లెదా మార్కెట్టు యొక్క ఎగుడు దిగుడులనుంచి ఉత్పన్నమయ్యె అనిర్వర్యమైన గొరిల్లా పొరాటాల్లొనె వారు పొర్తిగా నిమగ్నం కాకుడదు నెటి ఆర్దిక వ్యవస్త కార్మికుల్ని ఎన్నొఇభందులకు గురి చెస్తున్నా ఆర్దికగా దాన్ని పుర్నిర్మించెందుకు అవసరమిన భవ్ తిక పరిస్తుల్ని సామాజిక రూ పాల్ని కూ డా అది ఏకకాలంలొ స్రుష్టిస్తూందనె విసెయాన్ని గ్నాపకముంచెకొవాలి ."*న్యాయమైన పనిదినానికి న్యయమైన జీతం అనె మితవాద నినాదంస్తానె వారు తమ పతాకం మీద "*జీతల పద్దతి రద్దుకావాలి "అనె విప్లవకర నినాదాన్ని చి త్రించుకొవాలి .మార్క్స్

  ReplyDelete
 6. @ రామమొహన్ గారూ!

  మీరు ఎవరినైనా విమర్శించొచ్చు.ఏకంగా పార్టీలను,విదేశాలలో ఉన్న వాటితో సహా మీకే తెలిసినట్లు రాఘవులుకు తెలియనట్లు విమర్శించవచ్చు.మిమ్ములను ఏమైనా అంటే మాత్రం ఇంత అక్కసు అన్నమాట.

  ఒక వేలు మనం చూపితే మనకు నాలుగు వేళ్లు చూపుతుంటాయి. ఎవరు ఎవరినైనా విధానపరంగా విమర్శించవచ్చు. నేను అదే చేశాను. రామ్మోహన్‌ గారిని వ్యక్తిగతంగా నాకు విమర్శించాల్సిన అవసరం లేదు. ఒక విమర్శ చేసినపుదు ప్రతి విమర్శకు తట్టుకోవాలి.

  ఒక హేతువాది లేదా మార్క్సిష్టు భక్తుడుగానూ,నాస్తికుడు గానూ ఉంటాడని, ఉండాలనీ నేనలేదు. అలా ఎవరైనా ఉంటానంటే నాకు వ్యక్తిగతంగా అభ్యంతరం లేదు. నా అభిప్రాయం లో దైవభక్తిని సాగదీయాల్సిన అవసరం లేదు. అలా ఉన్నవారు కూడా తెలుసు నాకు. దోపిడీ పోవాలి అనేది ప్రధానమైతే సెకండరీ అంశాలు వదిలేయడం పెద్ద తప్పేమీ కాదు.

  ముసుగు పార్టీలని మీరంటే సరిపోదుగా.మీ అభిప్రాయం మీరు చెప్పారు. నా అభిప్రాయం నేను చెప్పాను. దీనికి నేను జ్నానిని - మీరు అజ్నాని అయిపోతారని గానీ , నేను మార్క్సిజం బాగా చెప్పే జ్నానినని గానీ చెప్పలేదు.చెప్పను.మార్క్సిజాన్ని చర్చించడానికి జ్నాని కావాల్సిన పనిలేదు. మార్క్సిజం బోధించడానికి కావాలి గాని. నేను మార్క్సిజమ్లో విభేదించే అంశాలూ లేదా నాకు తెలియని అంశాలూ చాలా ఉన్నాయి. అవన్నీ ముందు-ముందు వస్తాయి.
  మీరు మార్క్స్ కొటేషన్‌ ఇచ్చారు. దానికీ మార్క్సిష్టు పార్టీ చేసేదానికీ ఏ పొంతన లేదో మీరే చెప్పాలి.మార్పు క్రమంగా వస్తుంది.అయినా ఏ దేశ పరిస్తితులకు అనుగుణంగా ఆ దేశం లో మార్క్సిజాన్ని అమలు చేయాలి తప్ప మార్క్స్ చెప్పాడు - లెనిన్‌ చేశాడు అనేదానికి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకం. నా అభిప్రాయాలు వేరు.మార్క్సిజం వేరు.
  నేను మళ్ళీ చెపుతున్నాను మీకు మాత్రమే అనుకోకండి - కేవలం పుస్తకాలు మాత్రమే చదివితే సరిపోదు. చదివినదానిని ఎలా నిర్ధారించుకోవాలో లెనిన్‌ అన్న వాక్యాలు నాకు నచ్చినవి ఇక్కడ ఉంచుతున్నాను : " కమ్యూనిజమంటే పుస్తకాలనుండి ఏరుకున్న నిర్ధారణల వల్ల అంధవిశ్వాసం కాదు. తను చదివిన దానిని గురించి మంచి చెడ్డలను బేరీజు వేసుకుని , దానిని గురించి కూలంకషంగా ఆలోచించి, తన నిర్ధారణలను ఋజువులతో సరిపోల్చుకుని, అనుమానాలకు ఎటువంటి తావూ లేకుండా అవి ఋజువయ్యాయని తృప్తి చెందిన తరువాత చేరుకోవలసిన అభిప్రాయాలు " - కా // లెనిన్‌ .

  ReplyDelete
 7. కొండల రావు గారు మీరు ఏ స్తాయిలొ వున్నారొ మీ సమాదానాన్ని పట్టి అర్దమైది నేను అడిగిన వాటికి ఒక్క దానికి కూడా సమాదానం సుటిగా చెప్పకుండా విదేశాలలొ వున్నా పార్టీలను విమర్శిస్తావా, మా మహానాయకుడు రాఘవులును విమర్శిస్తావా అని ధభాయింపు మీనాయకుడికి మీకు అన్నీతెలిస్తె నేను అడిగిన వాటికి సమాదానం చెప్పవచ్చు కదా? సినిమా సిమీక్షలు రాసుకుంటూ ఏ హిరొపక్కన పొటొ పెట్టుకొని సినిమాహాలు దగ్గర పెద్దపెద్ద కటవ్ట్లు మనపొటొ ప్రదర్శిస్తామా అనే తాపాత్రెయం తప్ప ఇంకేమీలేదు . నేనడిగి ప్రశ్నె ఏంటి మీరు చెప్పిన సమాదానం ఏంటి ? నేనేమైనా మతాన్ని ప్రదానం చెసి మాట్లాడినానా? ఏమనిషైనా రొండు రకాలుగా వుండం సాద్యం కాదు అన్నాను . మీరు సాద్యం అంటున్నారు . ఉదాహరణకు యురొపియన్ దేశాలు కమ్యునిస్టు పార్టీల వాళ్ళు భహిరంగంగానే సాయుద పొరాటం ద్వారా కాక శాంతియుత మార్గాలలొనే కమ్యునిజాన్ని చెరుకుంటామన్నారు అది ఆచరణలొ ఎలాసాద్యం ? ఇటు కార్మిక వర్గానికి అటు పెట్టుబడి వర్గానికి రొండింటికి అనుకూలం అంటున్నారు ఆచరణలొ ఎలాసాద్యం. అంతిమంగా అది పెట్టుబడి వర్గానికే సాయపడిందన్నామాట .ఎన్నికలనే ప్రదాన ఆయుదంగా తీసుకొని సర్వశక్తులన్నీ దానిమీదే వడ్డి పార్లమెంటుకు పొయి ఎమిచెయగలరు? చిట్టి పొట్టి సంస్కరణమీద కొంచంసెపు అరవగలరు లేదా రొడ్లమీద భైటాఇంచగలరు ఇదికుడా దొపిడీవర్గానికే సాయపడుతుంది .నేను చైనా గురించిగాని రశ్యా గురించిగాని నేను నిరాదారంగా మాట్లాడం లేదు దనికి వందల సాక్ష్యాలు వున్నాయి మావొ తర్వాత పెట్టుబడిదారీ పంతా ఎలా అధికారంలొకివచ్చిందీ అంతకు ముందు సాంస్రుతిక విప్లవంలొ సాదించిన విజయాలను ఎలాతిరొగమనం పట్టెయొ ఎలాంటి మార్పులు జరిగాయొ అన్నీ ఆదారాలతొసహ వున్నాయి అసలు కమ్యునిజం అంటె సమాజంలొవున్నా ఆస్తినతా ఉమ్మడిగా మారిస్తె అదే కమ్యునిజం అనుకున్నారు సాంస్రుతిక విప్లవం ప్రదానగా, పునాది మారిపొఇంది ఉపరితలన్ని మార్సాలని ప్రారంభించారు తర్వాత అర్దమైంది ఇంకా పునాదే మారలేదని . మార్కిజం తొ విభేదించె అంశాలు చాలావున్నాయి అన్నారు అవి ఎమిటొ కొంచం చెప్పండి . ఎదేశ పరిస్తులకు ఆదేశంలొ మార్కిజాన్ని అమలు చెయ్యాలా అంటె ఒకదేసంలొ శ్రమదొపిడీ వుండి మరొ దేశంలొ శ్రమదొపిడీ వుండదా? దీనిపైన వివరణ ఇవ్వందే చర్చించటం సాద్యం కాదు. అవును నేను చెప్పుతున్నది అదే కేవలం మీ ముసుగు పార్టీల పుస్తకాలు మాత్రమే చదివి మార్కిజం గురించి అరకొరకగా తెలుసుకొని మీ ఇస్టం వచ్చినట్టు అన్వ ఇంచుకొవద్దు మానవహక్కుల నేత భలగొపాల్ చెసినట్టు తానేదొ కొత్తగా కనిపెట్టినట్టు మానవ వాదాన్ని. మీ ముసుగు పార్టీల పుస్తకాలు ఇటు మార్కిజం పుస్తకాలు రొండింటిని పరిసీలించి ఏ ది తార్కికంగా వుంటె దాన్ని తీసుకొవాలి

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top