బాలానందం! బ్రహ్మానందం!! మార్కెట్ తెలియని మహదానందం!!!

 (దమ్ముఆనందం ఇప్పుడుందా మీలో......!?

ఈ ఫోటోలలో కొన్ని పెద్దరాజు సురేష్ గారి ప్లస్ ప్రొఫైల్ నుండి మరికొన్ని ఇతరుల ప్రొఫైల్స్ నుండి సెకరించి ఇక్కడ ఉంచుతున్నాను. బాల్యంలో ఉండే ఆనందం తరువాత జీవితంలో ఉండదు. జీవితాంతం బాల్యంలా గడపగలిగే అవకాశం ఉండదు కదా? అవకాశం ఉన్నా డబ్బుతో ప్రతీదీ ముడిపడి ఉన్న ఈ వ్యవస్థలో మనిషికీ అన్నీ అవస్థలే. కనుక మనకు బాల్యంలోలా ఆనదంగా ఉండే లేదా గడపగలిగే దమ్ము ఉందా? ఆలోచించండి. బాల్యంలో ఉండే ఆనందానికి గుర్తుగా ఉండే కొన్ని ఫోటోలను ఇక్కడ ఉంచుతున్నాను. ఈ పోస్టు పాతదే. కొత్తగా మరికొన్ని ఫోటోలు జతచేసి ఇక్కడ ఉంచుతున్నాను.

ఈ హాయి.. స్నేహం... దమ్ము పెద్దయ్యాక  ఉండవెందుకని?  
బ్రతకడానికీ ---- జీవించడానికీ తేడా ఇదేనా !? 
ఇప్పుడిలా (పెద్దవారికి మాత్రమే) ఆడే దమ్ము ఉందా మీకు?  
జూనియర్  ఎన్‌.టీ.ఆర్  తో సహా ఎవరికుందా దమ్ము? 

దెబ్బకాయ్.....! గోలీ కాయ్!! 

బడీ లేదు! గుడీ లేదు! ప్రకృతివనరులే హాయ్! హాయ్!

నే చేయలేనా!? I CAN DO IT యార్!

ఎయ్! చిందెయ్!! ఆనందో బ్రహ్మ!!

బుడి బుడి బుడుగుల నడకలు!
Reactions:

Post a Comment

 1. సూపర్ సార్! అదిరింది.....ఈ దెబ్బతో దమ్మున్నోడు ఎవడో తేలిపోతుంది...జోబు నిండా గోలీలు వేసుకొని రండి..బస్తీమే సవాల్:))

  ReplyDelete
 2. కొట్లోకి పోతే గోలీలు దొరకడంలా! అన్నీ కంప్యూటర్ గేంలు, సెల్ ఫోన్‌ గేంలే దొరుకుతున్నాయి.

  ReplyDelete
 3. దొరుకుతున్నాయ్ కొండలరావు గారూ.... పది గోళీలు, ఖరీదైన పేకింగ్లో , గిఫ్ట్ షాపుల్లో చుక్కలు కనిపించే రేట్ కి అమ్ముతున్నారు.

  ;)

  ReplyDelete
 4. హ హా...భలే ఉందండీ ఫొటో...మా చిన్నప్పుడు ఇప్పుడు పిలకాయల్లా జేబుల్లో సెల్ ఫోన్లూ, కెమెరాల్లేక మా ఫ్రెండ్స్ తో ఇలా చూసుకోలేకపోయాం...అయితేనేం ఎవరో భలే తీశారు, అప్పటి మా ఫ్రెండ్స్ తో మా గోళీలాట ని ;)
  ఇక "బస్తీ మే సవాల్" అంటూ దమ్మున్న పెద్దవాళ్ళంతా పుస్తకాల్తో రొప్పుతున్న పిల్లల్ని ఆటలకి పిలిచి, కంప్యూటర్ గేముల్లో ఎలాగూ గెలవలేం కదా అని కసి తీర్చేసుకుంటే ;)

  ReplyDelete
 5. @ రాజ్ కుమార్ గారికి , @ చిన్ని ఆశ గారికి కామెంట్ కు ధన్యవాదములు.

  పిల్లల్లు సహజమైన ఆటపాటలతో ఎదిగితేనే సమస్యలను తట్టుకునే నాయకత్వలక్షణాలు అలవాటవుతాయి.

  కానీ నేటి కార్పోటీకరణ విద్యాలయాల్లో పిల్లలను బందెల దొడ్లలో గొడ్లను కుక్కినట్లు కుక్కి వారిలోని సృజనాత్మకతను చంపేస్తున్నారు.

  కెరీరిజం మోజులో తల్లిదండ్రులు కూడా పిల్లల లో సహజత్వాన్ని - నైతిక మానవతా విలువలను పెంచాలనే విషయాన్ని మరచిపోతున్నారు.

  అందుకే పెద్దలకు దమ్ముందా? అని సరదాగా అడగాలనిపించి ఈ ఫోటోను షేర్ చేశాను.

  పెద్దలకు ఆ దమ్ము పెరగాలనీ - ప్రభుత్వానికి విద్యను కార్పోటీకరణనుండి బంధవిముక్తం చేసే దమ్ము పెరగాలనీ ఆశిద్దాం !

  ReplyDelete
 6. సూపర్...చాలా బాగా చెప్పారు కొండలరావు గారు...చివరలో మీరన్న మాటలు నిజంగా జరగాలని ఆశిద్దాం!
  Best Wishes,
  Suresh Peddaraju

  ReplyDelete
 7. అలాగే సురేష్ గారు. ఈ పోస్టుకు కారకులయిన మీకు కృతజ్ఞతలు.

  ReplyDelete
 8. నాకుంది బాబు....ఎదురుగా ఆడేవాల్లకి అది ఉండేది కాదు అప్పట్లో
  ఇపుడు కూడా అంతే లెండి...ఎందుకు వచ్చిన బాధ అని గెలుపు ఇచ్చి వెళ్లి
  పోతుంటారు..భలే ఫోటో వేసారు ))

  ReplyDelete
 9. :)))) హమ్మయ్య! దమ్మున్నవాళ్ళు ఇప్పటికి ఒక్కరు వచ్చారన్నమాట. కామెంట్ కు ధన్యవాదములు శశికళగారూ!!

  ReplyDelete
 10. నేను రెడీ ..అండీ!! ఈ మధ్యే బ్లాగ్లో కూడా వ్రాసాను. గురి చూసి బరిలో కువ్వ ని కొడితే చెల్లా చెదురు అవ్వాలి. తొండి ఆట ఆడితే.. నుదుటున బోట బొటా రక్తం కారాలా! అది.. ఆట:)))

  ReplyDelete
 11. :))) అవును వనజ గారూ ! పెద్దలందరూ డబ్బు సంపాదన - కెరీరిజం మోజులో పడి మన సంస్కృతిని మంచి ఆట పాటలను మరచి పోతున్నారు. పిల్లలను కూడా వాటికి దూరం గా పెంచుతున్నారు. అందుకే మనసులు కలుషితమవుతున్నాయి. చందమామను మనసారా చూడలేని రోజులివి. ఈ విధానం మారాలి. అందరూ కలసి ఉండే ఆటలు - సంస్కృతిని పెంచాలి. అపుడు కొంతైనా మనసుల లో ఏర్పడిన మాలిన్యం తగ్గుతుంది. కామెంట్ కు ధన్యవాదాలు.

  ReplyDelete
 12. చిన్ననాటి గోలీలాటను గుర్తుకు తెచ్చారండి!ఆ picture చూస్తూ ఉంటె మేమాడుకున్న గోలీలాట
  గుర్తొచ్చిందండీ!an excellent collection.ఇప్పుడా దమ్ము ఎవరికి లేదనీది వాస్తవ మండి.
  "పెద్దలకు ఆ దమ్ము పెరగాలనీ - ప్రభుత్వానికి విద్యను కార్పోటీకరణనుండి బంధవిముక్తం చేసే దమ్ము పెరగాలనీ ఆశిద్దాం !"
  మీ మా ఆశ నెరవేరాలని ఆశిద్దాం.

  ReplyDelete
  Replies
  1. స్పందనకు ధన్యవాదములు హరి గారు. మన విద్యా వ్యవస్థలో - సమాజం లో ఆ మార్పులు రావాలని కోరుకుందాం.

   Delete
 13. సూపరండి. ముఖ్యంగా ఆ చివరి GIF చిత్రం. ఇప్పటికీ రోడ్డుమీద ఎక్కడైనా మడుగు కనిపిస్తే వదలను. ఆ బుడతడు చూసారా, leash ని ఎంత జాగ్రత్తగా నేలమీద పెట్టాడో.

  ReplyDelete
  Replies
  1. :)) అయితే మీకు దమ్మున్నట్లే కిషోర్ గారు.

   Delete
p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సేకరణలు సైన్స్ స్పూర్తి
 
Top