• ఆల్కహాలు నామమాత్రంగా (0.5% కన్నా తక్కువ) ఉండే పానీయాల్ని 'సాఫ్ట్‌ డ్రింక్స్‌' గా వ్యవహరిస్తారు. మామూలుగా వీటిని చల్లబరిచి తీసుకోవడం వల్ల వీటిని శీతల పానీయాలు (కూల్‌డ్రింక్స్‌) అని కూడా అంటారు. దీనిలో కరిగిన కార్బన్‌ డై ఆక్సైడ్‌ (కార్బానిక్‌ ఆమ్లం), తీపి కోసం స్వీటినర్‌ (పంచదార/ అధిక ఫక్ట్రోజ్‌ గల మొక్క జొన్న సిరప్‌) కలుపుతారు. వాసన కోసం ఎసెన్స్‌ వేస్తారు. దీనిలో కెఫిన్‌, ఫాస్ఫారిక్‌ ఆసిడ్‌ కూడా కలుపుతారు.
 • తరచుగా వీటిని తీసుకునేవారికి ఊబకాయం వస్తుంది. టైప్‌-2 మధుమేహమూ రావచ్చు. పళ్ల మధ్య ఖాళీలు ఏర్పడతాయి. కెఫిన్‌ వల్ల ఆందోళనకర మనస్తత్వం పెరుగుతుంది. కలతనిద్ర అధిక మవుతుంది. ఇవి అధికంగా తాగడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. పిల్లలు పాలు తాగడానికి ఇష్ట పడరు. దీంతో విటమిన్‌ డి, బి12, కాల్షియం, మాంసకృత్తులు తగ్గుతాయి. ఫాస్ఫరస్‌, అధికంగా ఉన్నప్పుడు ఎముకల్లోని కాల్షియం లోపం ఏర్పడి, అవి పెళుసుగా మారతాయి. వీటిని సేవించినప్పుడు దీనిలోని యాసిడ్స్‌వల్ల పళ్లమీద ఎనామిల్‌ దెబ్బ తింటుంది. అంతేకాదు, పళ్లు పుచ్చిపోతాయి. వీటి వల్ల జీర్ణవ్యవస్థలో రసాయనాల శాతం పెరిగి, ఎసిడిటీ సమస్య వస్తుంది. మన దేశంలోని భూగర్భజలాల్ని ఉపయోగించి, ఈ పానీయాల్ని తయారుచేస్తున్నారు. ఈ జలాల్లో సస్యరక్షణ మందుల అవశేషాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ఇవి కూడా కోకోకోలా, పెప్సీకోలాల్లో అధికంగా ఉండి, అనారోగ్యాన్ని కలిగిస్తాయి.
 • ఈనాడు సాఫ్ట్‌ డ్రింకులు పిల్లలకీ, పెద్దలకీ అతి మామూలు సరదా పానీయాలుగా మారిపోయాయి. వాటివల్ల దాహం తీరదనీ, వాటిలోని ఆమ్లం వల్ల అనేక సమస్యలు ఉద్భవిస్తాయనీ తెలిసినా, వాటి జోలికి పోవడం మానలేకపోతున్నారు ఎంతోమంది. అటువంటి సాఫ్ట్‌డ్రింకుల వల్ల వచ్చే మరో నష్టం ఇటీవలే వెలుగు చూసింది. చిన్నతనంలోనే సాఫ్ట్‌ డ్రింకులు తాగితే పెద్దయ్యాక గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికమని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. 12 సంవత్సరాల వయస్సున్న పిల్లలపై నిర్వహించిన అధ్యయనాలు ఈ విషయాన్ని తెలియజేశాయి. బాల్యదశలో రోజుకి కనీసం ఒక సాఫ్ట్‌ డ్రింక్‌ తాగిన పిల్లల్లో వారి కంటి వెనక ఉన్న ధమనులు (రక్తాన్ని గుండె నుండి తీసుకువెళ్ళే నాళాలు) కుంచించుకున్నట్టు తెలిసింది. ఈ పరిస్థితి అధిక రక్తపోటుకీ, హృద్రోగ అవకాశాలకీ సంకేతం.
మహేష్ భయ్యా ఇటో లుక్కేయాల నువ్వు !?
 • ఇంత ప్రమాదమని తెలిసే గతంలో చిరంజీవి ఇపుడు మహేష్ బాబు థమ్సప్ యాడ్ లో యాక్ట్ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. పవన్ కళ్యాన్, అల్లు అర్జున్ మరికొందరు కూడా ఈ యాడ్ లలో యాక్ట్ చేస్తున్నారు. ఇటీవల తానూ సిగరెట్ తాగడం మానేసానని, తన సినిమాలలో ఇక సిగరెట్ తాగే సీనులున్దవని మహేష్ చెప్పాడు. మంచిదే మరి ఈ డ్రింక్స్ మాటేమిటి ఓసారి ఆలోచించాలి. అందరు హీరోలు యాడ్స్ లో అదీ ఇలాంటి ప్రమాదకరమైన యాడ్స్ లో నటించకుండా నిజమైన హీరోలనిపించుకోవాలని విజ్ఞప్తి.
--------------------------------------------------------------------
వీటి పరిస్తితి ఇలా ఉంటే ఇతర ఎనర్జీ డ్రింకుల పరిస్తితి పట్లా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజాశక్తి పత్రికలో ఈ డ్రింకులపై వచ్చిన రెండు ఆర్టికల్స్ లో విలువైన సమాచారం ఉంది. సమాజం లో మంచి అలవాట్లను పెంచితే మంచి పౌరులు తద్వారా మంచి సమాజం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు మంచి అలవాట్లు ఏర్పరచుకోవాలి. క్రింద ఉన్న సమాచారాన్ని చదవండి. ఎనర్జీ డ్రింకులవల్ల పొంచి ఉన్న ప్రమాదాన్ని తెలుసుకోండి.
---------------------------------------------------------------------

రాకేష్‌ మార్కెటింగ్‌లో పని చేస్తున్న యువకుడు. రోజంతా ఎక్కడెక్కడో తిరుగుతుంటాడు. అలసిపోకుండా చలాకీగా ఉండాలంటే...మరింత 'శక్తి' కావాలి. అందుకే అతను ఎనర్జీ డ్రింక్‌ తాగుతుంటూడు.
దీపిక డిగ్రీ చదువుతున్న యువతి...కాస్త లావుగా ఉంటుంది. నాజూగ్గా ఉండాలన్నది ఆమె కోరిక. అందుకే ఆమె మామూలు ఆహారం తీసుకోవడం తగ్గించేసింది. ప్రొటీన్స్‌ ఉన్న పౌడర్‌ పాలలో కలుపుకుని తాగుతోంది.
ముకేష్‌ కృష్ణ క్రీడాకారుడు...ఎక్కువ సమయం ప్రాక్టీస్‌ చేయాలి. అందుకు అదనపు శక్తి అవసరం. అందుకే అతని ట్రైనర్‌ ఏదో ఎనర్జీ డ్రింక్‌ తీసుకోమని సలహా ఇచ్చాడు. ముకేష్‌ ఇప్పుడు దాన్నే తాగుతున్నాడు.
మరో వ్యక్తి...శృంగార సామర్థ్యం పెంచుకోవాలన్న తహతహతో మద్యంలో ఎనర్జీ డ్రింకు కలిపి సేవిస్తున్నాడు.

భారతదేశంలో ఎనర్జీ డ్రింకుల వినియోగం పెరుగుతోందట. త్వరగా అలసిపోకుండా ఉండడం కోసం, శరీరాకృతి కోసం, క్రీడల్లో రాణించడం కోసం, సెక్స్‌ సామర్థ్యం పెరగడం కోసం, ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడం కోసం...ఇలా రకరకాల లక్ష్యాలతో ఎనర్జీ డ్రింక్స్‌, ఎనర్జీ మాత్రలు, విటమిన్‌ ఆహారం వంటివి తీసుకోవడం భారీగా పెరుగుతోంది. ఈ డ్రింక్స్‌ దీర్ఘకాలంలో ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

ఎనర్జీ డ్రింక్స్‌ అంటే ఏమిటి?

తక్కువ సమయంలో శరీరానికి శక్తినిచ్చేవే ఎనర్జీ డ్రింక్స్‌, మాత్రలు. ఇవి విటమిన్లు, ఎక్కువ ప్రొటీన్లు, కెఫీన్‌, చక్కెర వంటి వాటితో తయారై ఉంటాయి. సాధారణంగా ఇవన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరానికి అందుతుంటాయి. అలాకాకుండా ఎనర్జీ డ్రింక్స్‌ రూపంలో నేరుగా వాటినే తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. వీటిని తీసుకోగానే వెంటనే శరీరానికి శక్తి అందుతుంది. సాయంత్రం తాగితే రాత్రంగా నిద్రపట్టదు. అలసట తెలియదు.
ఎందుకు ఉపయోగిస్తున్నారు?
ఈ డ్రింక్స్‌, ప్రొటీన్‌ మాత్రలను యువత ప్రధానంగా మూడు నాలుగు రకాల కారణాలతో వినియోగిస్తోంది. మెరుగైన ప్రదర్శన, సమర్థత పెంచుకోవడం, శరాకృతిని మలచుకోవడం, శృంగార సామర్థ్యం కోసం వీటిని ఆశ్రయిస్తోంది. రాత్రంగా అడిపాడే పబ్‌లలో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లలోని పబ్‌లపై ఇటీవల నిర్వహించిన దాడుల్లో ఈ డ్రింక్స్‌ కనిపించాయి. రాత్రంతా మేలుకుని ఆనందించేందుకు ఎనర్జీ డ్రింకులను సరఫరా చేస్తున్నారు. ఇంకా రాత్రిపూట జరిగే సినిమా ఫంక్షన్లు, సినీ ప్రముఖుల జన్మదినోత్సవాలు, ఇతర ఫంక్షన్లలోనూ ఎనర్జీ డ్రింకులు అందిస్తున్నారు.

శరీరాకృతిని మలచుకునేందుకు వీలుగా ఎక్కువ సమయం వ్యాయామం చేసేవారూ వీటిని సేవిస్తున్నారు. సిక్స్‌ ప్యాక్‌ బాడీ కోసం తహతహలాడేవారు కూడా ఈ మార్గంలోనే పయణిస్తున్నారు. పెద్దపెద్ద నగరాల్లోని జిమ్‌లలో ఎనర్జీ డ్రింకులు సరఫరా చేస్తున్నారు. శీతల పానీయంలాగే ఉండే వీటిని మద్యంలో కలుపుకుని తాగితే శృంగార సామర్థ్యం పెరుగుతుందన్న నమ్మకం ఉన్నవారూ ఉన్నారు.
ఊబకాయంతో బాధపడుతూ ఒబేసిటీ క్లినిక్‌లు, సెంటర్లను ఆశ్రయిస్తున్న యువతా పెద్ద సంఖ్యలోనే ఉంటోంది. వీరు శరీరంలోని కొవ్వును తగ్గించుకునేందుకు దగ్గర దార్లను అన్వేషిస్తున్నారు. తమ వద్దకు వచ్చే వారికి అధిక ప్రొటీన్లు ఉన్న పౌడరు, మాత్రలు వంటి వాటిని ఒబేసిటీ క్లినిక్‌లు అందిస్తున్నాయి. ఆహారం తినకుండా ఈ పౌడరు కలిపిన పాలను తాగమని సూచిస్తున్నాయి.
అనారోగ్యానికి హేతువు
ఎనర్జీ డ్రింకులు, మాత్రల వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యం పాడవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో లభ్యమవుతున్న ఎనర్జీ డ్రింకులకు సంబంధించి సరైన ప్రమాణాలు లేవని చెబుతున్నారు. ఇక్కడ దొరుకుతున్న డ్రింకుల్లో ఎక్కువ మోతాదులో కెఫీన్‌ ఉంటోందని సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అనే సంస్థ ప్రకటించింది. కృత్రిమంగా తీసుకునే విటమిన్లు, ప్రొటీన్ల వల్ల సమతుల్యత దెబ్బతి అనారోగ్యం పాలయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. నరాలు, గుండె సంబంధ వ్యాధులూ రావచ్చని చెబుతున్నారు. ప్రొటీన్లయినా, విటమిన్లయినా ఏవైనా శరీరానికి ఎంత అవసరమో అంతే అందాలి. అంతకు మించిన మోతాదులో అందితే శరీర వ్యవస్థే దెబ్బతినే ప్రమాదముంది.
రూ.1,500 కోట్ల వ్యాపారం
ఎనర్జీ డ్రింకులు, ప్రొటీన్‌ మాత్రల వ్యాపారం భారతదేశంలో భారీ స్థాయిలోనే జరుగుతోంది. ఇండియన్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ లెక్కల ప్రకారం ఏటా రూ.1,500 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ప్రొటీన్‌ మాత్రలు, పౌడర్ల పేరుతో ఒబేసిటీ క్లినిక్‌లు కోట్ల రూపాయాలు ఆర్జిస్తున్నాయి. మన దేశంలో ఎనర్జీ డ్రింకులు విచ్చలవిడిగా లభిస్తున్నాయి. వాటిపైన పెద్ద నియంత్రణ లేదు. రానురానూ వీటి వినియోగం పెరగడానికి ఇది కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడంతో ఇలాంటి డ్రింకులు ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోవడం యువతకు పెద్ద సమస్యగా లేదు. మరి ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో!
(from : prajasakti daily )
--------------------------------------------------------------------

ఎనర్జీ డ్రింకులు, ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడే మాత్రల వినియోగంపై నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైన విషయాలు విభ్రాంతి కలిగించేలా ఉన్నాయి. మన దేశంలో పట్టణ ప్రాంతాల్లోని యువత, ప్రత్యేకించి కిశోర వయసులోనివారు 78 శాతం మంది ఎనర్జీ డ్రింకో, ప్రొటీన్‌ మాత్రలో వినియోగిస్తున్నట్లు వెల్లడయింది. ఈ అంశంపై ఇటీవల అసోచాం ఓ సర్వే నిర్వహించింది. దేశంలోని ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పూణె, హైదరాబాద్‌ వంటి పెద్ద నగరాల్లో 2,500 మంది నుంచి వివరాలు సేకరించింది. వీరంతా 14-30 ఏళ్ల వయసువారే.

శక్తి కోసం, అందం కోసం, సమర్థత పెంచుకోవడం కోసం, పునరుత్పత్తి సామర్థ్యం మెరుగుపరుచుకోవడం కోసం వీటిని ఉపయోగిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్నవారు చెప్పారు. ఇంకా క్రీడాకారుల కోటాలో కళాశాల సీటు సంపాదించడం కోసమూ ఇలాంటి ఉత్ప్రేరకాలు వినియోగిస్తున్నట్లు తెలిపారు. సర్వేలో పాల్గొన్న క్రీడాకారుల్లో 85 శాతం మంది ఒకేమాట చెప్పారు...అదేమిటంటే బాగా సాధన చేయడానికి ఉత్ప్రేరకాలు వాడాలని తమ కోచ్‌లే స్వయంగా ప్రోత్సహించినట్లు వెల్లడించారు. ఇంటర్మీడియెట్‌ స్థాయిలోని విద్యార్థుల్లో ఉత్ప్రేరకాల వాడకం పెరుగుతోందని, అందులోనూ అబ్బాయిల్లో ఎక్కువగా ఉందని సర్వే తేల్చింది. సర్వేలో పాల్గొన్నవారిలో 55 శాతం మంది, తాము బరువు తగ్గడం కోసం హై ఎనర్జీ డ్రింక్స్‌, ఫ్యాట్‌ బర్నర్స్‌, కెఫీన్‌ పిల్స్‌ వాడుతున్నట్లు చెప్పారు. విపరీతంగా పెరుగుతున్న ఉత్ప్రేరకాల వినియోగంపై ఈ సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. 
(from : యువతరంగం డెస్క్‌  ,prajasakti daily)
*Republished
Reactions:

Post a Comment

 1. ఆలోచించి పాటించాల్సిన విషయాలు చెప్పారండీ.
  నిజమే వీటిలో పురుగుల మందు అవశేషాలున్నాయని మానేసిన నేను, చిరంజీవి యాడ్ ఇస్తున్నాడని మళ్ళీ మొదలు పెట్టాను అప్పట్లో.
  మీ హీరో ఆ డ్రింక్ కి ఇస్తే, మా హీరో ఈ డ్రింక్ కి ఇస్తున్నాడన్న ఆనందం లో ఉన్నారు ఫ్యాన్స్. ఎంతలేదన్నా ఫాలోయింగ్ ఉన్న సెలబ్రిటీస్ ఇలాంటి వాటికి ఏడ్స్ ఇవ్వటం వల్ల ముప్పే.

  ఈ విషయం బట్టి చూస్తే, శీతల పానీయాలకి ప్రచార కర్త గా ఉండననీ, అవి చేటు చేస్తాయనీ చెప్పి, ఆఫర్ రిజెక్ట్ చేసిన పుల్లెల గోపీచంద్ హీరో.

  రెగ్యులర్ గా కాకపోయినా అప్పుడప్పుడూ కూల్ డ్రింగ్స్ తీసుకుంటాను నేను. మీ పోస్ట్ చదివాక ఆలోచిస్తున్నా...

  ReplyDelete
 2. ఆలోచిస్తున్న అన్నందుకు ధన్యవాదాలు రాజ్. మీ కామెంట్ ద్వారా పుల్లెల గోపీచంద్ విషయం తెలుసుకున్నాను. గోపీచంద్ కు అభినందనలు.

  ReplyDelete
 3. ఊబకాయాన్ని తగ్గించే ప్రయత్నం లో బాగంగా న్యూయార్కు నగరం లో 16 ఔన్సులకు మించిన శీతల పానీయాల అమ్మకాలను రెస్టారెంటుల దగ్గర, వీది ఆహార బండ్ల దగ్గర, సినిమా థియేటర్ ల దగ్గర.. మొదలయిన అన్ని ప్రదేశాలలో నిషేదించారు.

  ReplyDelete
  Replies
  1. @ Green Star గారూ!
   ఉపయోగకరమైన సమాచారం చెప్పినందుకు ధన్యవాదాలండీ.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top