దేవుడు !

ఉన్నాడా ? లేడా ?

ఉంటే ఏ దేవుడు ఉన్నాడు.

అసలు దేవుడు అంటే ఎవరు ?

దేవుడున్నాడనేది విశ్వాసమైతే లేడనుకునేవాల్లకు నష్టమేంటి ?

దేవుడుని నమ్మని వారితో నమ్మేవాల్లకు నష్టమేంటి ?

మనిషి తనకు అర్ధం కాని , అంతుచిక్కని ప్రతి శక్తికీ అబ్బురపడ్డాడు. సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. అవుతాడు. అవుతూనే ఉంటాడు.

ఎందుకంటే ఎంత తెలుసుకున్నా ఈ విశ్వం లో తెలుసుకోవాల్సింది ఇంకా ఎపుడూ ఉంటూనే ఉంటుంది.

అయితే  ఆశ్చర్యం లోనుండి  మానవ మస్తిష్కాలకు రెండు రకాల ఆలోచనలు వచ్చాయి.

ఈ శక్తుల వెనుక ఏదో అద్భుత శక్తి ఉండి నడిపిస్తుందనేది ఒకటి కాగా , ఈ విశ్వమంతా కొన్ని సూత్రాలప్రకారమే నడుస్తుందనేది మరోటి.

రెండో ఆలోచనమేరకు ఎప్పటికప్పుడు కొన్నింటి గుట్టు తెలుసుకుంటూ , ఎప్పటికప్పుడు కొత్త వాటిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ముందుకు పోవడం చేస్తుంటారు.

అలా చేసే సందర్భం లో కూడా మొదటి రకం ఆలోచనలకు లోనయ్యే సందర్భాలూ ఉంటాయి. అయితే ఈ స్థాయి ఆలోచనలు అందరూ చేయరు.

ఆ మాదిరి ఆలోచనలు సామాన్యులూ చేస్తారు. శాస్త్రజ్ఞులు ప్రయోగాల ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పోతే, సామాన్యులు విశ్వాసాల ఆధారం గా ముందుకు పోతుంటారు.

దేవుడు అనే భావన రావడానికి మరో కారణం మరణానంతర  జీవితం గురించి. ఈ మరణానంతర జీవితం , పాప పుణ్యాల ఆధారం గా ఉంటుంది కనుక పాపభీతి అనేది మానవులలో నైతిక విలువలను కాపాడేందుకు ఉపయోగపడుతుంది.

కానీ ఈ అంశం మత ఉన్మాదం గా మారనంత వరకు మాత్రమే. కానీ కేవలం పాపభీతితో మాత్రమే నైతిక విలువలు నిలబెట్టవచ్చనేది తప్పు.

దైవ భక్తి ఉన్న వారే బుద్ధిమంతులనుకుంటే పప్పులో కాలేసినట్లే.

బుద్ధి అనేది పరిసరాలను బట్టి , పరిస్తితులను బట్టి ఉంటుంది. ఆ బుద్ధిని బట్టే దైవాంశమున్నదా ? రాక్షసత్వమా? అనేది చెప్పవచ్చు.

కాబట్టి పరిస్తితులను - పరిసరాలను సరిచేసుకుంటూ దేవుడిని విశ్వసించేవారు - నమ్మని వారూ కలసి కాపాడవచ్చు. అంటే మనలోనే దైవత్వాన్ని చూడడం కళ్ళ ముందే దేవుడ్ని చూడడమే.

అలా చూడగలిగితే చేయగలిగితే అందరిలో దేవుడినీ , అడుగడుగునా ఆలయాన్నీ చూడొచ్చు.

దేవుడు ఉన్నాడనే వాల్లు దేవుడు ఉన్నాడని నిరూపించలేరు.

దేవుడు లేడనేవాళ్లు దేవుడు లేడని నిరూపించాల్సిన అవసరమూ లేదు.

అసలు దేవుడు గురించి వాదులాడుకోవడం మనిషిపై విశ్వాసం లేకపోవడమే.

మనిషి పై మనిషి కి విశ్వాసం ఉన్నప్పుడు , మనిషి చర్యలు దైవత్వం తో ఉన్నప్పుడు ఎదురుగా ఆ మనిషిలో దేవుడు కనపడుతున్నప్పుడు , దేవుడు గురించి - దేవుళ్లలో తేడాల గురించి - ఏ దేవుడు గొప్పవాడనే దాని గురించీ - అసలు దేవుడున్నాడా ? లేడా ? అనే పేరుతో వాదులాడుకునే రాక్ష్సత్వం లోనుండీ బయటపడవచ్చు.

దేవుడిని నమ్మే వారిని - వారి విశ్వాసాన్ని గౌరవించండి. అది వ్యక్తిగతమైననతవరకూ...

దేవుడు లేడనుకునే వారిని గౌరవించండి మీ విశ్వాసాలను అగౌరవపరచనంతవరకూ...
Reactions:

Post a Comment

 1. మీ చివరి conclusion ప్రస్తుత సమాజం లో చాలా అవసరం.

  ReplyDelete
 2. దేవుడు ఉన్నాడనుకోవటం వ్యక్తిగతమైన ఆలోచన ఐతే, లేడనుకోవటం కూడా వ్వ్యక్తిగతమే కావాలి. అలా కాకుండా దేవుడు లేడనటం పెద్ద ఫ్యాషన్ గా మారి,ఉన్నాడనుకునేవాళ్ళను ఎద్దేవా చెయ్యటం మొదలుపెట్టినప్పుడే ఈ ఇద్దరి మధ్య స్పర్ధ మొదలయ్యింది. నా దృష్టిలో దేవుడు ఉన్నాడనుకున్నా, లేడనుకున్నా రెండూ కూడా వ్యక్తిగతమైన అభిప్రాయాలుగానే ఉండాలి. ప్రపంచంలో ఎక్కడైనా సరే మత ప్రచారాన్ని, నమ్మకాల ప్రచారాన్ని (నాస్తికత్వం పేరుతో ప్రచారంలో ఉన్నదానితో సహా) పూర్తిగా నిషేధించాలి. దేవుడు ఉన్నాడనుకుంటే ఇంట్లో పూజించండి, లేడనుకుంటే లేదు. అంతేకాని లేడనుకున్నవాళ్ళు ఎంతో ఓర్పుతో ఉన్నాడనుకున్నవాళ్ళను భరిస్తున్నట్టుగా ఫోజులు ఇవ్వటం గర్హనీయం. అలాగే వైస్ వర్సా కూడా.

  ReplyDelete
 3. @శివరామప్రసాదు కప్పగంతు
  మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదములు ప్రసాద్ గారు.

  ReplyDelete
 4. >దేవుడు ఉన్నాడనే వాల్లు దేవుడు ఉన్నాడని నిరూపించలేరు.
  దేవుడు ఉన్నాడనే వాళ్ళు దేవుడు ఉన్నాడని నిరూపించాల్సిన అవసరం లేదు. ఎవరికి నిరూపించాలి? ఎందుకు నిరూపించాలి? వేదాంతశాస్త్రపరమైన వాదనలతో వివరణ యిస్తే మన పదార్థవిజ్ఞానవాదులు ఒప్పుకోరు గదా? అయినా పదార్థవిజ్ఞానవాదుల పథ్థతుల్లో నిరూపణలు వివరణలు యివ్వాల్సిన అవసరం మాత్రం దైవవిశ్వాసులకు ఉండితీరాలా? అదెలా తార్కికం? ప్రత్యక్షప్రమాణాలు పదార్థప్రమాణాలు ఒకటే ఆధారం అని వాదించే పదార్థవిజ్ఞానవాదులు ఒప్పుకోకపోయినా వారిపరిథికి మించి ప్రపంచం ఉండరాదని వారు శాసించటం యేమిటి? ఇది అసందర్భం.


  >దేవుడు లేడనేవాళ్లు దేవుడు లేడని నిరూపించాల్సిన అవసరమూ లేదు.
  దేవుడు లేడనేవాళ్లు దేవుడు లేడని నిరూపించలేరు. పతంజలి యోగసూత్రాలలో ఒకటీ 'ఈశ్వరాऽస్సిధ్ధే' అనేది. అంటే దేవుడిని సిధ్ధాంతాలతోనూ సూత్రాలతోనూ నిరూపించటం అసాధ్యం అని. ప్రపంచాన్ని ప్రస్తుత పదార్థవిజ్ఞానశాస్త్రాలతో సంపూర్ణంగా సంపూర్ణంగా తెలుసుకోలేము. అలా తెలుసుకోగలిగితే యింక అవి అభివృధ్ధి చెందవలసిన పని లేకుండాపోతుంది. అబివృధ్ధి చెందుతున్నాయంటే అవి అసంపూర్ణమనే అర్థం కదా. అవి యెప్పటికీ అసంపూర్ణమే. అసంపూర్ణమైన పదార్థవిజ్ఞానశాస్త్రాల పైన అచంచల విశ్వాసం ఉన్న వారు అవి ప్రస్తుతానికి తెలియజేయగలది మాత్రమే ప్రపంచం అనీ వాటికి తెలియటానికి అవకాశం లేని వ్యవహారాలన్నీ మూఢత్వాలనీ ప్రచారం చేయటం మెట్టమొదటి అశాస్త్రీయ భావన అని తెలుసుకోవాలి. తెలుసుకోవాలనే తపన ఉండటం మంచిదే, శాస్త్రీయమే, కాని, ప్రస్తుత పదార్థవిజ్ఞానశాస్త్రాల అవగాహనకు రానంత మాత్రాన అశాస్త్రీయం అని గోల చేసే దుడుకు తనం మంచిది కాదు. దృశ్యమానత్రిపరిమాణ పదార్థసంచయమూ, కాలమూ అనేవి తప్ప మరేమీ లేదన్న భావనతో ఉన్నారు నిరూపణలడిగే కుహనా శాస్త్రజ్ఞులు. విజ్ఞానశాస్త్రం అలా అడగటం లేదు. మనకి తెలియని పరిమాణాల్లోకూడా విశ్వం ఉందనీ, ఇంకా చెప్పాలంటె అసలెన్ని విశ్వాలు యెన్నెన్ని రకాల పరిమాణాల్లో ఉన్నాయో ననే భావన శాస్త్రలోకంలో బలంగా ఉంది. దీని గురించి ఇప్పట్లో తేలేది యేమీ లేదు. విజ్ఞానశాస్త్రం కూడా పరిమితం అని తెలిస్తే యెవరూ గర్వంతో విఱ్ఱవీగి యెదుటివారిని అజ్ఞానులనరు.

  ReplyDelete
 5. ఈ వ్యాసంలో అలఘులకారం చాలా చోట్ల లఘులకారంగా వాడారు. ఇది చింత్యం. మన భాషను మనం సరిగా గౌరవించుకోనక్కర లేదా? 'వాళ్ళు' అనటానికి బదులు 'వాల్లు' అని పదే పదే వాడటం చాలా బాధాకరం. ఆంగ్లంలో వ్రాసే వ్రాతలను ఒకటికి పదిసార్లు అక్షరదోషాలూ,వ్యాకరణదోషాలూ సరిచూసుకునే మనం అటువంటి దోషాలు తెలుగులో ధారాళంగా చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించటం సముచితం కాదని మనవి. భాషకు కూడా తనదైన వ్యక్తిత్వం ఉంది, అది కూడా క్షోభిస్తుంది అని భావించ గోరుతాను.

  ReplyDelete
 6. విజ్ఞానశాస్త్ర పరిధి చిన్నదే కానీ అది విస్తరిస్తున్నది. ఒకప్పుడు ప్రతిచిన్నదానికీ దేవుడంటూ వాడి చంకలునాకిన మనం, ఇప్పుడు చాలా కొద్దివాటికిమాత్రమే దేవుడిపై ఆధారపడుతున్నాం (ఇంకా కొదరు నాకుతూనే ఉన్నారు. మరికొందరు ఇతరులనుకూడా నాకమని ప్రోత్సహిస్తున్నారు అదివేరే విషయం). కొన్నాళ్ళ తరువాత దేవుడి అవసరం లేకుండానే మనం అన్నివిషయాలనూ వివరించగల స్థితికి చేరుకుంటాం. మీరు గమనించారో లేదోకానీ దేవుడి పరిధి కుచించుకుపోతున్నది.

  పంచేంద్రియాలకు బయట పంచేంద్రియాలకందని చైతన్యమేదో ఉమదనేది ఒక non-verifiable thesis అది గతంలో సోమరుల పొట్టలు నిపడానికీ, కష్టజీవుల పొట్టలుకొట్టడానికీ పనికివచ్చింది. ఇలాంటి అశాత్రీయమైన విషయాలను ప్రతిపాదించినవారికి వాటిని ఋజువుచెయ్యాల్సిన అవసరం ఉంది. "అవసరంలేద"నీ, "ఋజువుచెయ్యలేనంతమాత్రాన అది అబధ్ధంకాద"నీ వాదించడం గడుసుతనమో, కిందపడ్డా పైచేయేనని వాదించడమో అవుతుందికానీ అది భారతీయ తర్కశాశ్త్రం పరంగానే సరైన్న వాదనకాదు.

  ReplyDelete
 7. @Anonymous

  Thanks for your comment.

  పంచేంద్రియాలకు బయట చైతన్యమనే ప్రశ్నే లేదు. మెదడుకు పంచేంద్రియాల అనుభూతులు-అవబోధల ద్వారా మాత్రమే చైతన్యం కలుగుతుంది. అది బాహ్యంగా ఉన్నవాటిని గ్రహించడం ద్వారా మాత్రమే. పదార్ధమే ఆలోచనకు మూలం. ఎగిరే పక్షిని చూసే విమానం కనుగొనాలనే ఆలోచన వస్తుంది. ఆలోచించే లక్షణం మాత్రమే మెదడు పని. ఇది తిరుగులేనిది.ఊహాజనితం కానిది.

  అయితే ఊహ అనేది చొరవకు సంకేతం. ఊహే రాకూడదనడం తప్పు. ఊహకు ఆధారం నిర్ధారించుకుని చెప్పగలిగితేనే అది సత్యం. లేనిదానిని లేదని ఋజువు చేయాల్సిన అవసరమే ఉండదు.ఉన్నదనే దానిని మాత్రమే ఋజువు చేయాలి. అదీ తర్కం కోసం కాదు. ఓ సత్యం ఆధారంగా దానిని ఉపయోగించుకునే అవసరాలకోసమే తప్ప మేధొజీవులమనిపించుకునే తర్కం లేదా వితర్కం కోసం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం.

  మీరన్న దానిలో దేవుడి పేరుతో మూఢ విశ్వాసాలను ప్రచారం చేసి పబ్బం గడుపుకునేవారినీ, దేవుడిని నమ్మి స్వాంతన పొందేవారినీ ఓకే గాటన కట్టకూడదు. మొదటిరకం వారి జీవనాధారం దేవుడిని నమ్మే వారి నమ్మకమే. కానీ దేవుడి మీద విశ్వాసం ఉన్నవారు మోసం చేయాలనుకునేవారు కాదు. పైగా మోసం చేస్తే పాపం తగులుతుందనుకునేవారు.

  ఈ రెండింటి మధ్య తేడా ఉంది. దేవుడ్ని అడ్డం పెట్టుకుని మోసాలకు, ఉన్మాదాలకు పాటుపడేవారిపై పోరాడాలి తప్ప, లేని దేవుడి మీదనే పోరాడడం అవసరంలేని పని. విశ్వాసాలను కించపరచేపని. ప్రజలను ప్రేమించేవారు చేయకూడని పని. స్పష్టమైన ఈ విభజనను సున్నితమైన ఈ అంశం పట్ల పాటించాలి.

  స్వామీ వివేకాందనూ, నిత్యానంద లాంటి వెధవలనూ పోల్చడానికే ఇబ్బంది కదా!? స్వామీ వివేకానంద వేదాంత విప్లవమూర్తి. కుక్క పిల్ల కూడా ఆకలితో చావకూడదని, మనిషిలోని అంతర్గత శక్తులను బయటకు తీయడం ద్వారా మనుషులు శక్తివంతులు కావాలన్నాడు. దేవుడిమీద ఆధారపడి సాగిలపడమనలేదు. వివేకానంద గురించి ప్రస్తావించినదానిని ఎవరూ తప్పుగా అర్ధం చేసుకోవద్దని మనవి.

  సైన్స్ సమాజం అభివృద్ధి అవుతున్నకొద్దీ , ఆ సైన్స్ ప్రజల చైతన్యం పెంచుతున్న కొద్దీ , మనిషిని మనిషి నమ్మే స్థితి పెరుగుతున్న కొద్దీ అశాస్త్రీయ భావాలు తొలగిపోతాయి.

  ReplyDelete
 8. @శ్యామలీయం

  1- ఎవరు ఎవరికి వివరణ ఇవ్వడం కాదు. ఎవరు ఏది సత్యమని చెపుతున్నారో దానికి సంబంధించిన వాటిని నిరూపించాలి. నిరూపించేది పండితులమని ఫోజు పెట్టడానికి కాదు. సత్యం వల్ల కలిగే ప్రజా ప్రయోజనం అందరూ పొందడానికి. సత్యం అనేది అందరికీ ఒకటే ఉంటుంది. ఉండాలీ.
  2- పదార్ధవాదులు వారిపరిధికి మించి ప్రపంచం ఉండరాదని శాసించరు. ఆధారాలు లేకుండా , అశాస్త్రీయ విషయాలను సైన్స్ గా చెప్పడం నమ్మకం వరకూ అయితే ఫర్వాలేదు కానీ అదే విజ్ఞానమనీ అంతకుమించి విజ్ఞానాన్ని నమ్మమనీ చెప్పడాన్ని అసలంగీకరించరు. ఇది ఈనాటిది కాదు. భూమి గుండ్రం గా ఉందంటే చంపేసారు. సైన్స్ పుట్టుకతోనే అజ్ఞానాన్ని , అహంకారాన్ని సవాల్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. కానీ చాలా బలిదానమూ చేస్తోంది. ఆ బలిదానం మరింత కొనసాగకూడదనేదే పదార్ధవాదుల తపన. చంద్రుని చుట్టూ భూమి తిరుగుతుందనే నమ్మకం ఆధారం గా మాత్రమే పంచాంగం లెక్కలిప్పటికీ కడుతున్నది వాస్తవం కాదా ? మరి అసలు వాస్తవం భూమి చుట్టూ చంద్రుడు , సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందనేది కాదా? చంద్రునిపై దిగి అక్కడా మట్టే ఉందని నిరూపించాక కూడా పంచాంగం శక్తివంతం గానే ఉంది. అంత మాత్రాన పంచాంగం వాస్తవం, శక్తివంతమవుతాయా? మనకు అందిన ఆధారలమేరకు ఉన్నదానిని నమ్ముతూ , తెలియని అంతుచిక్కని విషయాలను మానవ మేధ ఎప్పటికప్పుడు పురోగమించడానికి పదార్ధ్వాదమే పనికివస్తుంది తప్ప , నమ్మకాలు - విశ్వాసాలు - అజ్ఞానం ఎంత మాత్రం కావు.
  3- దైవ విశ్వాసులెవరికీ సమాధానం , వివరణలు ఇవ్వాల్సిన అవసరం లేదు. అది వ్యక్తిగతం గా ఉన్నంతవరకూ. సమాజపరం గా మేము ఆ విశ్వసాలను బలవంతంగా ఆధారాలుగా చేస్తామంటేనే తేడా.
  4- ఇపుడున్న పదార్ధ విజ్ఞానాన్ని బట్టి ప్రపంచం మొత్తాన్నీ తెలుసుకోలేము. మీరన్నదానితో ఈ విషయం లో ఏకీభవిస్తున్నాను. ఇపుడున్నది సంపూర్ణ విజ్ఞానమని ఎవరన్నారు? కానీ పదార్ధ విజ్ఞానం తో తెలుసుకున్న ప్రతీదీ తిరుగులేకుండా ఋజువులకు నిలబడుతుంది. అది మరింతగా కొనసాగుతుంది. అలా కొనసాగుతూనే ఉంటుంది. మనిషి శక్తివంతుడవుతూనే ఉంటాడు.
  5- << దృశ్యమానత్రిపరిమాణ పదార్థసంచయమూ, కాలమూ అనేవి తప్ప మరేమీ లేదన్న భావనతో ఉన్నారు నిరూపణలడిగే కుహనా శాస్త్రజ్ఞులు. విజ్ఞానశాస్త్రం అలా అడగటం లేదు. మనకి తెలియని పరిమాణాల్లోకూడా విశ్వం ఉందనీ, ఇంకా చెప్పాలంటె అసలెన్ని విశ్వాలు యెన్నెన్ని రకాల పరిమాణాల్లో ఉన్నాయో ననే భావన శాస్త్రలోకంలో బలంగా ఉంది. దీని గురించి ఇప్పట్లో తేలేది యేమీ లేదు. విజ్ఞానశాస్త్రం కూడా పరిమితం అని తెలిస్తే యెవరూ గర్వంతో విఱ్ఱవీగి యెదుటివారిని అజ్ఞానులనరు.>>

  ఈ వాదన పదార్ధవాదులు చేయరు. మనకు తెలియని విజ్ఞానం చాలా ఉందనే వారూ చెపుతారు. తెలియకుండా తెలుసుననే అజ్ఞానం - అహంకారాన్నే వారు ప్రశ్నిస్తారు. విజ్ఞానం తెలిస్నదానిపై ఆధారపడుతూ , తెలియనివాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వెళ్లాలనే పదార్ధవాదులు చెప్పేదానిని వక్రీకరించడమే అసలైన గడుసుదనం .

  ReplyDelete
 9. @శ్యామలీయం
  భాష మీద అభిమానం , గౌరవం ఉన్నాయండీ. కానీ కంప్యూటర్ వాడేటప్పుడు లేఖిని లో టైప్ చేసి మళ్లీ దానిని కాపీ చేసి పేస్ట్ చేయడంలో సమయం తీసుకునే దానిలో తొందరవల్ల ఒకటి కాగా , ఏ అక్షరం ఎలా టైప్ చేయాలనే అనుభవలేమి మరో కారణం. భాష పట్ల నిర్లక్ష్యాన్ని వీలయినంతమేరకూ తగ్గించుకునే ప్రయత్నం చేస్తానండీ. విలువయిన మీ సూచనకు ధన్యవాదములు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top