మనిషి యంత్రంలా మారుతున్నాడు !
అర్ధంలేని పరుగు పెడుతున్నాడు !
బ్రతుకుతున్నామా ! జీవిస్తున్నామా ! అర్ధం కావడం లేదు !
కెరీరిజం ! ఇదో జాతరలా మహమ్మరిలా మారింది.
కంప్యూటర్ వ్యసనమైంది.
ప్రకృతినిగమనించేవారు లేరు.
అమ్మ చెప్పిన చిన్ని కథలు 
అందరికి మొదటి గురువు అమ్మే. ఇది అందరికి విదితమైన విషయమే.
మనకు చిన్నప్పుడు కథలు  వినాలంటే  ముందు అమ్మ దగ్గరకే వెళ్లి విసిగిస్తాం.
ఈ టపా రాసే ముందు చిన్నప్పుడు నేను అమ్మ దగ్గర ఏ ఏ కథలు చెప్పించుకొని విన్నానా 
అని ఒక సారి  అలోచించి చూస్తే చాల  కథలే గుర్తుకు వచ్చాయి.
మా అమ్మ పెద్దగా  చదువుకోలేదు 
కానీ కథలు చెప్పడం లో ఘనాపాటి.
ఎన్నెన్ని కథలు చెప్పేది. అందులో చాలా మటుకు జానపద కథలే 
ముఖ్యంగా సంతోషిమాత  వ్రత కథ నుంచి మొదలు పెడితే 
బాలనాగమ్మ కథ, సన్యాసమ్మ కథ, కావమ్మ కథ, కాంభోజ రాజు కథ,
భట్టి విక్రమార్కుని కథ, బొబ్బిలి యుద్ధం మొదలైన కథల నుండి 
మర్యాదరామన్న కథలు, తెనాలి రామకృష్ణుని కథల వరకు 
ఎన్నెన్నో కథలు చెప్పేది.

వీటిల్లో చాలా కథలను తరువాత టి.వి. లో సినిమాల రూపం లో చూసినప్పుడు 
అమ్మ చెప్పిన కథలతో వాటిని పోల్చి ఆశ్చర్యపోయేవాళ్ళం.

ఈ జానపద సాహిత్యమంతా మా అమ్మ కు కొట్టిన పిండి. 
ముఖ్యంగా చెప్పాలంటే చిన్నపుడు పిల్లలను అమితంగా ఆకర్షించేవి ఈ జానపద కథలే
ముఖ్యంగా మా అమ్మ పంచతంత్ర కథలను ఎంత బాగా వర్ణించి చెప్పేదంటే 
ఆ జంతువుల, పక్షుల పాత్రలు నిజంగా మాట్లాడుతాయా అన్నంత కుతూహలంగా కథను వినేవాళ్ళం.

నిజం చెప్పాలంటే అమ్మ చెప్పిన చిన్ని కతలు ఇప్పటికి నాకు మరపురాని జ్ఞాపకాలే.
Reactions:

Post a Comment

 1. కొండలరావు గారు కరెక్టుగా చెప్పారండీ..అందరికీ కంప్యూటర్ ఒక వ్యసనమైంది. నిజజీవితంలో బ్రతకడం కన్నా ఈ వర్చువల్ లైఫ్ లో గడపడానికే తాపత్రయపడుతున్నారు...
  నిజమే.. అమ్మ చెప్పిన కధలు ఎప్పటికీ మరపురాని జ్ఞాపకాలే.. మీరు చాలా అదృష్టవంతులు..

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు సాయి గారు. కానీ ఈ పోస్టు నేను వ్రాసింది కాదు. నా బ్లాగులో మంచి పోస్టులు మాత్రమే ఉంచి చెత్తను తొలగించే క్రమం లో పాత పోస్టులలో మంచి వాతిని రీ పబ్లిష్ చేస్తున్నాను. డ్రాఫ్ట్ గా ఉన్నదానిలో ఇది ఎవరు వ్రాసింది , ఎక్కడ నుండి సేకరించినది గుర్తు లేదు. మంచి పోస్టు కనుక పబ్లిష్ చేశాను.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top