అందాల పోటీలు, ఫ్యాషన్‌ ప్రపంచపు తళుకు, బెళుకులకు...
తెలుగుదనాన్ని ఒలికించే సాంప్రదాయ దుస్తులుగా పేరున్న..
లంగా ఓణీలకు తాత్కాలికంగా బ్రేక పడినా...
నేడు క్రమంగా వాడుకలోకి వస్తున్నాయి...
నేటి బిజీ ప్రపంచంలో తల్లితండ్రులు కూడా తమ పిల్లలను
లంగా ఓణీల్లో చూసుకునేందుకు ముచ్చట పడుతున్నారు...
పండుగకైనా, పేరంటాలైనా, కాలేజీ ఫంక్షన్లయినా ...
తమకో ప్రత్యేకత ఉండాలని అమ్మాయిలు ఉవ్విళ్లూరుతున్నారు.

రోజు,రోజుకీ విస్తరిస్తున్న ఫ్యాషన్‌ రంగంలో కొత్త వెూడల్స్‌, కొత్త కొత్త డిజైన్స్‌తో కూడిన ఎన్నిరకాల దుస్తులు వచ్చినా తెలుగు అమ్మాయిలు లంగా, ఓణీల్లో కనబడినంత అందంగా మరే డ్రెస్‌ లోనూ కనిపించరన్నది వాస్తవం.పెద్ద పెద్ద కంపెనీలు సైతం మగువలకు ప్రత్యేకంగా డ్రస్‌ కోడ్‌ నిర్ధారిస్తుండటంతో విదేశీ దుస్తు ల ప్రభావం మన తెలుగు సంస్కృతిపైనా పడింది. దీంతో అచ్చ తెలుగుతనానికి ప్రతీకగా నిలచే లంగా, ఓణీలు కొన్నాళ్లు తెరమరుగు అయినా... నేడు కొత్త హంగులు సంతరించుకుని మళ్లీ మదిని దోచేలా మన ముందుకు వచ్చాయి.
ఫ్యాషన్‌ ప్రపంచంలోకి జీన్స్‌, స్కర్ట్స్‌, సల్వార్‌, కమీజ్‌ ఇలా పలు రకాల దుస్తులు మారుతున్న కాలానికి,అవసరాలకు తగ్గట్టు దూసుకు రావటంతో... తీరుబడి లేని చదువులతో బిజీ బిజీగా.. ఆఫీసులలో పనిచేసే సంద డి..హడావిడిగా బయట తిరగాల్సి రావటం...ఇలా ఉరు కులు పరుకుల జీవితానికి లంగా, ఓణీలు కాస్త అడ్డంకిగా మారు తుండటంతో మన మహిళలు వాటికి కొన్నాళ్లు దూరమైనా అదంతా తాత్కాలికమేనని, అసలు లంగా,ఓణీలు ధరిస్తే, ఆ ఆనందమే వేరన్నది మహిళా లోకంలో ఉందన్నది నిజం. ఒకొపðడు తెలుగువాకిళ్లలో ఈడొచ్చిన చిన్నారులకు ఓణీలు వేయటాన్ని పెద్ద పండుగలా నిర్వహించే వారు... తాతయ్యలిచ్చే పట్టు పరికిణీ, ఓణీలతో అలంకరించేవారు.

హిట్‌... సూపర్‌ హిట్టు...

మన వెండితెరపై విడుదలవుతున్న సినిమాలనే పరిశీలించడండి... హీరోయిన్ల్లు లంగా ఓణీలు ధరించి కనిపిస్తే... అవి హిట్‌ సూపర్‌ హిట్‌ అయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నా యి. పడుచుదనాన్ని పరవళ్లు తొక్కిం చాలనుకున్నా... చిలిపిదనంతో చిం దులు వేయించినా.. ముగ్ద వెూహ న రూపాన్ని ఆవిష్కరించాలని భావించిన దర్శకులకు గొప్ప వరం లంగా ఓణీలే అన్నది వాస్తవం కూడా... ఇందువల్లే... నిర్మాత లు ఎంత పరాయి భాష నుండి హీరో యిన్లని దిగుమతి చేసుకున్నా... వారితో లంగా, ఓణీలు వేయిస్తూ... తమని తాము బతికించుకుంటున్నారు.

ఇక వాన పాటలు... పల్లె పదాలు ... ప్రకృతి అందాల మధ్య తిరుగాడే హీరోయిన్‌ పాడుకునే పాటల్లో తెలుగింటి సంప్రదాయాలను జోడి ిస్తు..సాగే సన్నివేశాల్లో లంగా,ఓణీకే ప్రధమస్థానం. ఈ డ్రస్‌తో హీరో యిన్‌ కనబ డితే ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు కొట్టిట్లే... ఇందుకు అప్పటి పదహారేళ్ల వయసులో శ్రీదేవి మొదులు... నిన్న మొన్న టి త్రిష, నయనతార, జనీలియా, కాజల్‌ ఇలా ఏ హీరోయిన్‌ని తీసుకున్నా... లంగా, ఓణీలతో నటించిన సినిమాలలో తెలుగుదనంతో పాటుగా కొత్త అందాలల్ని చూపి సూపర్‌హిట్స్‌ సాధించుకుని.. తమ కెరీర్‌ని నిలబెట్టు కున్నారన్నది. వాస్తవాన్నిఅంతా అంగీకరించాల్సిందే...

మార్పులెన్నొచ్చినా...

నేటి ఫ్యాషన్‌ రంగంలో మార్పులెన్ని వస్తున్నా... ప్రత్యేక సందర్భా లలో ఆహార్యానికి తగ్గట్టు కట్టూ, బొట్టూ ఉండాలన్న పెద్దల కోరికల్ని కూడా తీరుస్తూ...తమ ముచ్చటని తీర్చుకునేందుకు ఈతరం అమ్మాయి లు లంగా, ఓణీలకు ఇస్తున్న ప్రాధాన్యం రోజు రోజుకీ పెరుగుతునే ఉంది. విదేశాల నుండి ఆధునిక దుస్తు ల వెూడల్స్‌ కోకొల్లలుగా మన దేశానికి రావటంతో పాటు అవి అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉన్నాయన్న భావన తో మనసంప్రదాయ దుస్తు లని పక్కకు నెట్టేస్తున్నాం. దీంతో ఎన్నో ఏళ్లు పల్లె భామల అందాలను కను విందుచేసేలా చేసిన లంగా , ఓణీలు కనుమరుగై పోయే దశకు చేరుకున్న తరుణంలో విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారే కాకుండా అక్కడున్న విదేశీ వనితలు కూడా తెలుగుదనానికి ప్రతీకగా నిలిచే లంగా, ఓణీలవైపే మొగ్గు చూపడం ఆశ్చర్య కరమైన అంశంగా మారిందనటంలో సందేహం లేదెవ్వరి కీ... మన సంప్రదాయాలను గౌర విస్తూ. .. మన దుస్తు ల్ని ధరి స్తు ఆనందిస్తున్న విదేశీ యుల పై వివిధ వార్తా ప్రసార సాధనాల ద్వారా వస్తున్న కథ నాలు మన వారిపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పటికే చాలా మంది బాలికలు.. తాము ఇన్నాళ్లూ సౌలభ్యంగా వేసుకునే జీన్స్‌, షర్ట్‌, చుడీ దార్‌ల స్థానంలోలంగా, ఓణీ లు ధరించి ర్యాంప్‌ షోలు, స్కూల్‌ ఫంక్షన్స్‌, కళాశాల వార్షికోత్సవాలు, పెళ్లిళ్లు, పం డుగ ల్లో ప్రత్యేక సందర్భా లలో లంగా, ఓణీలు ధరించి కేరింతలు కొడుతూ.. సరి కొత్తగా అందర్నీ అలరి స్తూ కనిపిస్తున్నారు.

ఎన్నో అందాలు...

పాత పద్ధతులే కాదు... దుస్తులు కూడా మారుతున్న కాలనికి అనుగణంగా కొత్త అందాలను సంతరిచుకుని తిరిగి మన ముంగిటకు వస్తు న్న నేటి తరుణంలో పల్లె, పట్నం అన్న తేడా లేకుండా లంగా, ఓణీ హవా మళ్లీ ప్రారంభమై తన అందాలను ఒలికి స్తున్నాయనటంలో అతిశయోక్తి లేదనిపిస్తోంది.
క్రొంగొత్త అందాలను, ఆధునికతను ఈ సంప్రదాయ వస్త్రాలకు జోడిస్తూ పట్టులోనే కాకుండా జార్జెట్‌, షిఫాన్‌లలో కూడా మంచి డిజైన్లు తయారు చేస్తున్నారు ఫ్యాషన్‌ డిజైనర్లు. పూర్తి స్థాయి డిజైనర్‌ వర్క్‌తో, ప్యాచ్‌ వర్క్‌తో వెరైటీలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి.

ఇవే కాకుండా హెవీ వర్క్‌ ఉన్న లంగాలపై ప్లెయిన్‌ ఓణీలు, హెవీ వర్క్‌ ఉన్న ఓణీలను ప్లెయిన్‌ పరికిణీలు, పూర్తిస్థాయి డిజైనర్‌ వర్క్‌తో, ప్యాచ్‌ వర్క్‌తో కుందన్స్‌, గోటాలు, సీక్వెన్‌లు, వర్క్‌డ్‌ లేస్‌లు, ఇలా అనేక రకాల వెరైటీలు మగువల్ని కట్టిపడేసంత ఆకర్షిస్తున్నాయి.

ఫ్యాషన్‌ ప్రపంచంలో వస్తున్న మార్పులను ఆహ్వానిస్తునే మన సంప్ర దాయ దుస్తుల్ని నిత్య జీవితంలో అడపా దడపా ధరించాల్సిన బాధ్యత మనపై ఉంది. తెలుగుజాతి నిండు గౌరవాన్ని తనదైన శైలిలో విశ్వవిఖ్యా తం చేసిన లంగా, ఓణీలను మన చిన్నారులతో, పిల్లలతో ధరింప చేయటం ద్వారా తెలుగుదనాన్ని కొంతమేరైనా కాపాడుకున్న వారమవు తామన్నది నిజం.

from: Andhraprabha daily
Reactions:

Post a Comment

 1. మన సంస్కృతిని పిల్లలకి తరచూ పరిచయం చేయాలి. అప్పుడే .. మన సంస్కృతి-సంప్రదాయం కనుమరుగు కాకుండా కాపాడుకో గల్గుతాం. సినిమాల్లో అమ్మాయిల వస్త్రధారణ చూసి యువత ఇన్స్పైర్ అయ్యేది నిజమే అయితే..నిత్యం లంగా ఒణీలనే ధరించాలి. కాని ట్రెడిషనల్ పేరిట అడపా దడపా మాత్రమే.. లంగా ఓణీ లలో దర్శనమిస్తున్న తీరు ని ..మనం గమనిస్తూనే.. మన సంప్రదాయ వస్త్ర ధారణకి ప్రాముఖ్యత నివ్వడం ని నేర్పించగల్గితే కొంత విజయం సాదించ గల్గినట్లే.. నండీ. లంగా ఓణీ .. ని ఎక్స్పోజింగ్ కోణంలో చూసే యువతకి మనం yemi చెప్పగలం? చిత్రసీమ నేర్పే మంచి అదే కదా!?
  మంచి వ్యాసం అందించారు. అభినందనలు.

  ReplyDelete
 2. వనజ గారు !
  కామెంట్ కు ధన్యవాదాలు. ఈ పోస్టు నేను వ్రాసినది కాదు. అవసరమైనదనిపించి పెట్టా. ఆంధ్రప్రభ డైలీ లోనిదీ వ్యాసం. సినిమాల ధోరణి మారాల్సి ఉంది. మీ లాంటి వాళ్లు ఇంకా మంచి పోస్టులు సంస్కృతికి సంబంధించినవి అలా రాస్తూ పోతే కొంతమందైనా ఆలోచిస్తారు. ఈ విషయం లో మీ ప్రయత్నం బాగుంది. కామెంట్ కు ధన్యవాదములు.

  ReplyDelete
 3. పల్లా కొండల రావు గారు,
  నమస్తే! తె ని వి వి -అనే మీ ఈ టపా, title చూడగానే చాలా సంతోషమేసింది.మీరు చెప్పినట్లు నిజంగా ఆరోజు వస్తే సంతోషించేవరిలో మొదటి వ్యక్తిని నేనే.
  మన సంప్రదాయాలన్న,సంస్కృతి అన్న నేను గర్వ పడతాను.
  నేటి fashion లోకంలో కొట్టుకుపోతున్న నేటి తరం చూసి చింతిస్తూ నేను ,
  వేశాదారణ, అనే ఒక టపాను "మనము ఏమీ చేయలేమా...? అనే నా బ్లాగ్లో ఉంచాను.చదివి మీ అభిప్రాయాన్ని తెలియచేయగలరు.వీలుంటే నా టపాలన్నీ చదవ గలరు

  ReplyDelete
 4. కామెంట్ కు ధన్య వాదములు. మీ పోస్టు చదువుతానండీ !

  ReplyDelete
 5. దయచేసి తెలుగు వ్యాకరణం, గుణింతాల పట్ల సాధ్యమైనంత శ్రధ్ధ వహించవలసినదిగా రచయితలకు/రచయిత్రులకు మరియు వ్యాఖ్యాతలకు మనవి.

  మితృలకు వందనం --> మిత్రులకు వందనం
  వేశాదారణ ---> వేషధారణ

  మనం తప్పనిసరిగా రోజూ ఆంగ్లం వాడుక చేస్తూ ఉంటాము. తప్పులేదు. అవుసరం కూడా. అందులో భాగంగా (౧) ఆంగ్ల వాక్యాల్లో వ్యాకరణం (౨) ఆంగ్లపదాల spelling అనే వాటి పట్ల చాలా చాలా జాగ్రత వహిస్తాము. కాని ఎందుచేతనో తెలుగులో వ్రాసేటప్పుడు తప్పొప్పుల గురించి దృష్టి పెట్టము. ఇది చాలా శోచనీయం.

  ReplyDelete
 6. శ్యామలీయం గారూ! మీరు చేసిన సూచనకు ధన్యవాదాలు. కానీ ఈ పోస్టు నేను ఆంధ్రప్రభ నుండి కాపీ చేసాను. అయినా సరిచేసి ఉండాల్సింది. ధన్యవాదాలు.

  ReplyDelete
 7. @శ్యామలీయం గారు!
  మీ సూచనకు ధన్యవాదాలు.టైపు చేయడంలో పొరపాటు జరిగినది. ఒక లెటర్ టైపు చేయగానే ,దానికి సంబందించిన 3 లేక 4 పదాలువస్తాయి.అలా వచ్చినప్పుడు select
  చేసుకోవడం లో జరిగిన తప్పిదము.
  21-01-2012 న నేను వేషధారణ అనే ఒక టపా "మనము ఏమీ చేయలేమా...? అనే బ్లాగ్ లో పెట్టాను. మీ అభిప్రాయం చెప్పగలరు. వీలుంటే అన్ని చదవగలరు

  ReplyDelete
 8. ఆంధ్రప్రభ వారి వ్యాసం అయినా పది మ౦దికి తెలియాలనే భావన మాత్రం అభిన౦దనియ౦.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

 
Top