నిజాయితీగా ఆలోచించండి !


తెలుసుకోవడం ద్వారా క్రింది వాటిలో మీకేమి కలుగుతుంది ? 


1) తెలుసుననే అహంకారం  2) తెలుసుకున్నానన్న ఆనందం 3) తెలిసింది పంచుకోవాలన్న తపన.


ఈ మూడూ వేరు వేరు అంశాలు. కానీ ఈ మూడూ తెలుసుకోవడం ద్వారా వస్తాయి.

మొదటిదైన అహంకారం కంటే తెలియనివారు చాలా నయం. వీరు ఇక ఏమీ తెలుసుకోలేక, ఎవరికీ తెలపలేక ఇబ్బంది పడుతుంటారు. ఇబ్బంది పెడుతుంటారు. అహంకారంతో జ్ఞానమున్న అజ్ఞానులుగా మిగిలిపోతారు. ఎవరితోనూ కలవలేరు. ఏమీ సాధించలేరు. నిత్యం దానవత్వ లక్షణాలైన ఈర్ష్యా, ద్వేషం, అసూయ, కఠినపు మాటలాడడం, అనుమానం, ఇత్యాదివాటితో రగిలిపోతుంటాడు.నాకు తెలుసుననే అహంకారంతో భ్రమపడుతున్నవారిలో ఈ అహంకారం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. తామెంత అజ్ఞానులుగా జనానికి దూరమవుతున్నారో రివ్యూ చేసుకోరు. జనం లేకుండా వీళ్లు జనం కోసం ఏమి చేస్తారో అర్ధం కాదు. వాళ్లకీ - మనకీ.

రెండొదైన తెలుసుకున్నామనే ఆనందం మరింతగా తెలుసుకోవడానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇలా జీవితాంతం అది కొనసాగుతుంది.

ఇక మూడోది : తెలిసింది పంచుకోవాలన్న తపన. ఇది చాలా కీలకమైనది. సమాజం ను ప్రభావితం చేస్తుందిది. నీవెలాంటివాడివో చెప్పాలంటే నీ చుట్టూ ఉన్నవాళ్లెవరో చూడాలనేది ఓ నానుడి. మనం చెప్పడం ద్వారా మన చుట్టూ ఉన్నవారు మారతారు. మన చుట్టూ ఉన్నవారు చెప్పడం ద్వారా మనం మారతాము. అందుకే మనం ఎప్పుడూ చెప్పేవారూ , వినేవారూ ఉన్న మధ్యలో ఉంటుండాలి. తెలిసింది పంచుకోవడమంటే సమాజాన్ని మార్చడమే. పది మందిలోకి ఓ మంచి భావాన్ని వ్యాప్తి చేస్తే అదే అలా వ్యాపించి తీరుతుంది. భావజాలానికున్న శక్తి అటువంటిది.

భావజాలం భౌతిక శక్తిగా మారితే ప్రపంచమే మారి తీరుతుంది. సో మీరు తెలుసుకున్నదానితో అహంకారం పెంచుకోవద్దు. మీలోనే ఆనందించడంతో సరిపెట్టవద్దు. అందరికీ పంచండి.

పంచేకొద్దీ పెరిగేది జ్ఞానం మాత్రమే ! జ్ఞాన సముపార్జకు అంతం లేదు !!
Reactions:

Post a Comment

 1. చాలా బాగా చెప్పారు.మీరు చెప్పింది నిజం.అహంకారం పై నా బ్లాగులో వ్యాసాలూ వ్రాస్తున్నాను.గమనించగలరు .
  http://ravisekharo.blogspot.in

  ReplyDelete
 2. @oddula ravisekhar
  కామెంట్ కు ధన్యవాదములు. తప్పనిసరిగా మీ బ్లాగును చూస్తాను రవి గారు.

  ReplyDelete
 3. కొన్ని సార్లు నిర్లిప్తమైన శాంతి, అనుభవంలోకి వస్తుందండి, ఒక గొప్ప ఫీలింగ్,.....
  మంచి విషయం , రాస్తూ వుండండి.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top