ఏది నిజం ?

నిజమేదో అదే నిజం. ఏదైతే ఉన్నదో అదే నిజం. ఉన్నది మాత్రమే నిజం.

అయితే, ఉన్నదీ అని ఎలా తెలుస్తుంది?

ఒకసారి నిరూపించబడింది - ఎప్పుడైనా నిరూపణకు అదే పద్దతిలో సాధ్యమయ్యేది నిజం. 

దీన్నే మనం శాస్త్రీయత అంటాం.

అయితే, కంటికి కనిపించేవి మాత్రమే నిజాలు అనుకోకూడదు. మనకు కనిపించకుండా ఉన్నవి ఎన్నో ఉన్నాయి. అవి కూడా నిజాలే.

గతంలో మనకు కనిపించకుండా ఉండి, తరువాత కనిపెట్టబడిన వాటిని బట్టి మాత్రమే ఇంకా మనకు తెలియని నిజాలు ఉన్నాయి అని చెప్పగలుగుతున్నాం.

అంతే తప్ప,

మన విశ్వాసాల ఆధారంగా, మన నమ్మకాల ఆధారంగా నిజాలను గుర్తించకూడదు. మన విశ్వాసాలు, నమ్మకాలు ఒక వేళ భవిష్యత్తులో పైన చెప్పిన పద్దతిలో నిరూపణకు ఋజువైతే అప్పుడవి నిజాలుగా మారుతాయి.

ప్రతి విశ్వాసమూ, నమ్మకమూ నిజాలు కావచ్చు, కాకపోవచ్చు. నిజాలుగా నిరూపితం కానంతవరకు విశ్వాసాలూ, నమ్మకాలూ వ్యక్తిగతాలు మాత్రమే.

వీటి ఆధారంగా కొన్ని భావాలు ఏర్పరచుకుని వాదించే ధోరణిని స్వీయమానసిక ధోరణి అంటారు. ఇది సరైనది కాదు.

విశ్వాసం కలిగి ఉండటం వేరు, నాకున్న విశ్వాసమే నిజమని వాదించడం వేరు. మొదటి దానిని గౌరవించవచ్చు, రెండవది ప్రమాదకరమైనది.

నేను నమ్ముతున్నాను కాబట్టి , నేను అన్నాను కాబట్టి అదే నిజమని నేను చెపితే మాత్రమే అది నిజం కాదు.

నిజం నిరూపణకు సిద్ధం కావాలి. ముఖ్యం గా అది ఉన్నట్లు కనీసం నీకైనా ఋజువు కావాలి.

నీకు ఋజువులతో నిరూపితమై, తిరుగులేని సత్యంగా తోచిన నిజాన్ని లక్షలమంది  అజ్ఞానంతో వ్యతిరేకించినా ఝంకాల్సిన అవసరంలేదు.

ఏనాటికైనా అందరూ సత్యాన్ని మాత్రమే అనుసరించాల్సి ఉంటుంది. అది సత్యం.

సత్యమేవ జయతే !
Reactions:

Post a Comment

  1. కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు..... కంటివెనక దాగివున్నవి కూడా నిజాలవ్వచ్చు..!!
    మంచిపోస్ట్ అండీ...!!చాలా బాగుంది

    ReplyDelete
  2. నీకు ఋజువులతో నిరూపితమై, తిరుగులేని సత్యంగా తోచిన నిజాన్ని లక్షలమంది అజ్ఞానంతో వ్యతిరేకించినా ఝంకాల్సిన అవసరంలేదు.

    అవునండీ !! బాగా చెప్పారు. మంచి పోస్ట్. Thank you very much!!

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం అవినీతి ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి
 
Top