సైకాలజీ శిక్షణలో నేను నేర్చుకున్నది. మీ అందరికీ తెలిసిందే పునశ్చరణ చేసుకుందాం !ప్రతి మనిషి లోనూ రాక్షసుడు - పిరికి పంద - మేధావి ఉంటారట.


ఎప్పుడూ రాక్షసుని - పిరికిపందను తొక్కిపట్టి మేధావిని మేల్కొలపి ఉంచాలి.


ఇది నిరంతరం - అనుక్షణం జరగాల్సిన ప్రక్రియ.

పూర్తిగా రాక్షసుని - పిరికిపందను చంపేయడం నూటికో కోటికో ఒక్కరికి సాధ్యమవుతుంది.

ఎందుకంటే మనిషి నిరంతరం పరిస్తితులతో ప్రభావితం అవుతుంటాడు.

పరిస్తితులనేవి నీ చేతులో మాత్రమే ఉండవు.

ప్రతీ రాయిలో శిల్పం ఉన్నట్లే ప్రతి మనిషిలో విజేత ఉంటాడు.

ఒక రాయిని ఎత్తేస్తే ముక్కలవుతుంది. కాస్త నైపుణ్యం తో కొడితే సైజు రాయవుతుంది(పునాది తరువాత బేస్ మట్టం కు ఉపయోగించే రాయి). శిల్పి ఉలితో దీక్షతో చెక్కితే శిల్పం అవుతుంది.

అయితే శిల్పం అనేది అక్కడ ఉన్నదే. రాయిలో అవసరం లేనిది తొలగిస్తే శిల్పం బయటపడింది.

మనలోనూ అనవసరమైనవి తొలగిస్తే మనమూ విజేతలు కావడం ఖాయం.

అయితే ఇక్కడ మనలను చెక్కే శిల్పులం మనమే. ఉలి అంటారా చాలా రకాలైన ఆయుధాలున్నాయి. ఒక్కో రకం ఉలితో ఒక్కో రకం అవసరం లేని ముక్కలను తొలగించుకోవలసి ఉంటుంది.

చెక్కడం మొదలెట్టండి.

రోజే .... ఇపుడే .............. ఇంకెందుకాలస్యం !

గుడ్ లక్ .
Reactions:

Post a Comment

  1. మేధావి అంటే నాకు చెడు జరగనంత వరకు నేను ప్రకృతిని నాశనం చేసినా పర్వాలేదు అనుకునే వాడా?

    ReplyDelete
  2. @గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు

    వాడు పిరికిపంద లేదా రాక్షషుడు అవుతాడు. అలాంటివాటిని రూపుమాపే చైతన్యం కలవాడు మాత్రమే మేధావి అవుతాడు. ప్రకృతిని నాశనం చేస్తే వాడికెలా మేలు జరుగుతుందండీ. ఊరు మొత్తం మునిగి నా ఇల్లు మునగకూడదంటే కుదురుతుందా ?

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top