బాగున్నదానిని బాగుందన్నట్లే , బాగాలేనిదానిని బాగాలేదనీ అనాలి.

మంచిని ప్రోత్సహించడం - మంచిని పంచడం అంటే మంచిని కాపాడుతున్నట్లే.

చెడును వ్యతిరేకించడం - చెడును నిరోధించడం అంటే చెడును నాశనం చేస్తున్నట్లే.

అయితే .....

ఏది మంచి ? ఏది చెడు ? అనేది జాగ్రత్తగా తెలుసుకోవాలి.

వ్యక్తి మీది కోపం విషయం మీద చూపకూడదు. విషయం నేర్చుకునేటప్పుడు వ్యక్తి మీద కోపం చూడకూడదు.

నీకు నచ్చినది మాత్రమే మంచి కాదు . నీకు నచ్చనిది మాత్రమే చెడూ కాదు.

ఒకరికి మంచి అయినది మరొకరికి చెడు కాకూడదు. అందరికీ అన్నిచోట్లా మంచి మంచే కావాలి. చెడు చెడే కావాలి.

ఎందుకంటే నిజం ఏదైతే ఉందో అదే నిజం. ఒకరు చెపితే నిజం నిజం కాదు. అలా అని నిజం చెప్పేవారి మీద ద్వేషం తోనో , కోపం తోనో , వీడు చెపితే వినేదేమిటిలే అనో కాకుండా పాజిటివ్ గా ఆలోచించండి.

ఏ ఒక్కరికీ ఎప్పటికీ అన్నీ తెలియవు అనేది గుర్తుంచుకోండి.

ప్రతి ఒక్కరూ నిరంతరం విధ్యార్ధి - ఉపాధ్యాయుడు అనేది గుర్తుంచుకోండి.

అలా కాక , తా బట్టిన కుందేలుకు మూడే కాళ్లనే మూర్ఖుడిలా, రాజు కంటే బలవంతుడైన మొండివాళ్లుగా తలబిరుసుగా, తలతిక్కగా కుచించుకు పోతే అజ్ఞానమే మిగులుతుంది. అహంకారమే పెరుగుతుంది.

సో నేస్తం ! తెలుసుకునేది సత్యమైతే అది ఉన్నదానిని మాత్రమే అనీ దానినెవరూ సృష్టించరనీ గుర్తెరగడం మంచిది కదా!

అజ్ఞానానికీ జ్ఞానానికీ ఒక్క అక్షరమే తేడా !

తెలుసుకుంటూ ఉండడమే జ్ఞానం. తెలుసులే అనుకోవడం అజ్ఞానం.

తెలిసింది పదిమందికీ తెలపడం ద్వారా పెరిగేది పరిజ్ఞానం.
Reactions:

Post a Comment

  1. చాలా అర్థవంతంగా చెప్పారు సర్!ఇలాంటి post లు ఎక్కడ దొరుకుతాయా అని చూస్తుంటాను.ఇలాంటివి ఇంకా వ్రాస్తూ ఉండండి.

    ReplyDelete
  2. @oddula ravisekhar
    ధన్యవాదములు రవిశేఖర్ గారు.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top