• ఉన్న ఊరునీ, కన్న తల్లినీ మరచిపోకూడదంటారు. "జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ" అన్నారు. 
 • పల్లెటూరి గొప్పతనాన్ని చాటేందుకు, పల్లెల్లో అజ్ఞానాన్ని పారద్రోలేందుకు, నా వంతుగా పాటు పడేందుకు ఈ బ్లాగును ఉపయోగిస్తాను.
 • భారత దేశం యొక్క ఆత్మ పల్లెల్లో ఉందని మహాత్ముడంటే, పెట్టుబడిదారీ విధానాలతో మార్కెట్ విస్తరణకు - మార్కెట్ సౌకర్యానికి మాత్రమే పట్టణాలు వచ్చాయి తప్ప, మానవత్వపు విలువలు పల్లెల్లోనే ఉంటాయని కారల్ మార్క్స్ అన్నాడు.
 • వాస్తవంగా పల్లెలే ప్రగతికి, శ్రమకు, మానవత్వపు విలువలకు ప్రతి రూపాలు. 
 • అలాంటి పల్లెలు ప్రపంచీకరణ నేపధ్యంలో విలువలు కోల్పోతున్నాయి. ఇతర ఇక్కట్లకు గురవుతున్నాయి.
 • పల్లెలు వెనుకబాటుకు శ్రమదోపిడీ ఓ కారణమైతే - అజ్ఞానం మరో కారణం.
 • పల్లెల్లో అజ్ఞానాన్ని పారద్రోలితే భారత దేశాన్ని మరింత శక్తివంతమైన దేశంగా, అత్యున్నతమైన మానవ వనరులున్న దేశంగా మనం తయారు చేయొచ్చు.
 • భారతీయ సంస్కృతినీ, విలువలను మనం కాపాడాలంటే పల్లె సంస్కృతిని కాపాడాలి. పల్లెలనుండి మేధావుల వలసలను ఆపాలి. 
 • ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరూ ఆ దిశగా కృషి చేయాల్సి ఉంది.
 • పల్లె సంస్కృతిని కాపాడే ప్రయత్నంతో పాటు, పల్లెప్రపంచం విజన్ కార్యక్రమాలను మీతో పంచుకునేందుకు ఈ బ్లాగును ఉపయోగిస్తాను. 
 • పల్లెల అభివృద్ధికీ,  పల్లెల్లో అజ్ఞానాన్ని పారద్రోలేందుకు, పల్లెలనుండి మేధావుల వలసలను ఆపేందుకూ మీ వంతు సలహాలివ్వండి.
 • మీకు తెలిసి పల్లెల అభివృద్ధికీ లేదా జన్మభూమికీ సేవలు అందిస్తున్నవారి వివరాలు తెలిపితే ఈ బ్లాగులో వారి వివరాలను ఉంచుతాము. అందరికీ స్పూర్తినిచ్చేందుకు ఈ బ్లాగు ద్వారా కూడా ఓ ప్రయత్నం చేసేందుకు సహకరించాలని విజ్ఞప్తి.
 • పల్లెప్రపంచం లేబుల్ ద్వారా పల్లెప్రపంచం విజన్ గురించి , ఆచరణకు సంబంధించిన కార్యక్రమాలను కూడా పోస్టులుగా వ్రాయడం జరుగుతుంది.

(పోస్టులన్నీ క్రమబద్ధం చేసేదానిలో భాగంగా గతంలో వ్రాసిన ఈ పోస్టుని కొద్ది మార్పులతో రీ పబ్లిష్ చేస్తున్నాను)

Reactions:

Post a Comment

 1. తాడిగడప శ్యామలరావిOctober 18, 2012 at 1:32:00 PM GMT+5:30

  చాలా మంచి ప్రయత్నం.
  అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు శ్యామలరావు గారు.

   Delete
 2. చాలా మంచి ప్రయత్నమండి.గాంధీ గారి గ్రామ స్వరాజ్యం అయినా,పల్లెలు బలంగా తయారుకావాలని కలాంగారు చెప్పినా అందు కనుగుణమయిన వ్యవస్థ ఏర్పడి ప్రణాలికలు తీసుకు రావాలండి.మీ ఆలోచనావిధానం స్పూర్తిదాయకం.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు రవిశేఖర్ గారు. మీరన్నట్లు గాంధీ - అబ్దుల్ కలాం లాంటి వాళ్ల కలలు కలలుగానే ఉంటున్నాయి. వ్యక్తులంగా మనం కొంతమేరకు చేయగలం. ప్రభుత్వం లేదా ప్రజలంతా కలసి ఉద్యమిస్తే తప్ప గ్రాంస్వరాజ్యం అందుబాటులోకి వచ్చే పరిస్తితి లేదు. వ్యక్తిగతంగా నా వంతుగా కొంత ప్రయత్నం చేస్తాను.

   Delete
 3. చక్కని ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం.

  ReplyDelete
 4. Good attempt. All the best.

  ReplyDelete
 5. మీ ప్రయత్నం కి మనః పూర్వక అభినందనలు.
  ఈ బ్లాగ్ విజవంతం అయితే.. మన పల్లె బతికినట్లే!
  కేవలం జ్ఞాపకాలు మాత్రమే కాకుండా.. ఇప్పుడు పల్లె స్థితి ఎలా ఉంది..మనం ఏం చేయగాల్గుతున్నాం అని ఆలోచిస్తే..సగం లక్ష్యం నెరవేరినట్లే!
  మంచి ప్రయత్నం ఆరంభించినందుకు ధన్యవాదములు.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు వనజ గారు. నా శక్తి మేరకు పల్లెప్రపంచం విజన్ ను ముందుకు తీసుకు పోయేందుకు ప్రయత్నిస్తానండీ. ఆ అంశాలను కూడా ఇదే బ్లాగులో విజన్-ఆచరణ అనే లేబుల్ క్రింద పోస్టులు వ్రాస్తాను. మీ సలహాలు సూచనలు ఎప్పటిలాగే అందిస్తారని ఆశిస్తున్నాను.

   Delete
 6. Manchi initiative andi..
  Mee prayatnam vijayavantam avalani korukuntunna.

  ReplyDelete
 7. మీ ప్రయత్నం సఫలీకృతం కావాలని కోరుకుంటూ .మీకు .అభినందనలు .

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు నాగరాణి గారు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

vm అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top