నా బ్లాగు అనుభవాలు - 6 

ఇంతక్రితం పోస్టు కోసం ఇక్కడ క్లిక్ చయండి.

నా బ్లాగులను ఎలా వ్రాయాలి? అనేదానిలో క్లారిటీ కోసం ఈ పోస్టు వ్రాస్తున్నాను. ఇకపై మేగజైన్ గా  "జనవిజయం" ,  పల్లెప్రపంచం విజన్ కార్యక్రమాల కోసం "పల్లెప్రపంచం",  చర్చావేదికగా " ప్రజ" బ్లాగులు , 
నేను వ్రాసేవి మరియు వివిధ అంశాలపై నా భావనలకోసం అంటే నా స్వంత బ్లాగుగా My Learnings and Feelings అనే బ్లాగుని నిర్వహించడం జరుగుతుంది.నేను బ్లాగు ప్రపంచం లోకి వచ్చాక మొదటిగా ఏర్పాటు చేసుకున్న బ్లాగు ఇది. ఆ పేరు పెట్టడానికి వెనుక వున్న కారణం విజయం అనేది ఏ ఒక్క వ్యక్తి వల్లనో రాదని. అందరూ అందరికి ఉపయోగపడే పనులు చేస్తారని. గతం ఆధారంగానే భవిష్యత్తు ఉంటుందని.  బ్లాగు పేరుకి టేగ్ లైన్ కూడా అదే అర్ధం లో ఉంచాను.

జనవిజయం (విజయం అనేది సమిష్టి కృషితో మాత్రమే లభిస్తుంది)

భావ ప్రసారం కూడా ఏ ఒక్కరి కృషో కాదని నా అభిప్రాయం. అందరం కలస్తేనే సమాజంలో మంచి భావాలను ప్రసారం చేయగలమనీ, అందుకు సోషల్ నెట్‌వర్క్‌లూ - బ్లాగులూ చక్కగా ఉపయోగపడుతున్నాయని భావిస్తున్నాను. తెలుగులో వీటి కృషి ఇంకా పెరగాలని అభిప్రాయపడుతున్నాను.

మీతో పాటు నేనూ సమాజానికి ఉపయోగపడే భావనలను వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ బ్లాగులో ఇతరులు వ్రాసినవాటిలో సమాజానికి ఉపయోగపడే ఆర్టికల్స్ సేకరణలుగా ఉంటాయి. 

బ్లాగు యూ.ఆర్.ఎల్ మార్పు....!

గతంలో www.janavijayam.com గా ఉన్న బ్లాగ్ యూ.ఆర్.ఎల్ ప్రస్తుతం content.janavijayam.in గా మార్చాను.  ఈ బ్లాగును మేగజైన్ గా మార్చడం జరిగినది. యూ.ఆర్.ఎల్, మేగజైన్ గా  మార్పును గమనించగలరని విజ్ఞప్తి.

ఈ విజయం నాది కాదు....! 

జనవిజయం బ్లాగులో నేను వ్రాసినవి చాలా తక్కువ. ఇకపై నేను అన్ని విషయాలపై నా అభిప్రాయాలు వ్రాయడానికి కృషి చేస్తాను. ఈ బ్లాగుకు ఇప్పటివరకూ 4,29,541 పేజీ వీక్షణలు, 44 మంది ఫాలోవర్స్ ఉన్నారు. వారందరికీ మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఎక్కువగా ప్రజాశక్తి దినపత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలలో ఆర్టికల్స్, ఇతర ఎక్కడ మంచి అనిపించినా సేకరించి జనవిజయంలో పోస్టులుగా ఉంచాను. నేను చేసిందల్లా వాటిని మంచిగా డిసైన్ చేసి పెట్టడమే. ఆయా సమాచారం ఒరిజినల్‌గా వ్రాసినవారందరూ ఈ ప్రొగ్రెస్ కు కారకులు. నా పాత్ర నామ మాత్రం మాత్రమే.  ఈ పేజీ వీక్షణలు - ఫాలోవర్స్ లిస్ట్ అంతా ఇకపై పల్లెప్రపంచం బ్లాగుకు చేర్చబడతాయి.


ctl 'c ' + ctl 'v ' కు పవర్ ఉంది సుమా ....! 

ఇప్పటిదాకా జనవిజయం లో ఉన్న పోస్టులను పల్లెప్రపంచం బ్లాగులో డ్రాఫ్ట్‌లుగా ఉంచాను. వాటిలో బాగున్నవి, సమాజానికి పనికివచ్చేవి తిరిగి పోస్టులుగా ఉంచుతాను. ఎప్పటిలాగే సమాజానికి అవసరమైనవి అనిపించినవి సేకరణలుగా ఉంచుతాను. ఎందుకంటే ఈ సేకరణలలోని అంశాల వల్ల తమకు మేలు జరిగిందని కొందరు నాకు మెయిల్ చేశారు. వాస్తవానికి అవి నేను వ్రాసినవేమో అనుకుని వారు నాకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా సమాజానికి ఉపయోగపడే అంశాలుగా నాకు తారసపడినవి సేకరణలుగా ఉంచి వాటి ఒరిజినల్ లింక్ ఇస్తాను.


వినదగు నెవ్వరు చెప్పిన........!

జనవిజయం బ్లాగు గురించి జీడిపప్పు గారి బ్లాగులోనూ, కొందరు వ్యక్తులతోనూ జరిగిన చర్చలో నేను నా బ్లాగును సరిచేసుకుంటానని హామీ ఇచ్చాను. నేననుకున్న సమయంలో చేయలేకపోయాను. గత డిసెంబర్ లో తెలుగు బ్లాగుల దినోత్సవం రోజునుండి ప్రారంబిద్దామనుకున్నాను. కుదరలేదు. ఈరోజుకి ఆ పని చేయగలుగుతున్నాను.

మార్క్సిజం గురించి , వ్యక్తిత్వ వికాసం గురించి నాకు తెలిసిన అంశాలు గతంలో కొన్ని పోస్టులు వ్రాసి వదిలేయడం జరిగింది. ఆ రెండింటి తో పాటు  ఇతర అంశాలపై వీలున్నంతవరకూ స్వంతంగా వ్రాయడానికి ప్రయత్నిస్తాను.పల్లెప్రపంచం విజన్ అంశాలపై - కార్యాచరణ అంశాలను పల్లెప్రపంచం బ్లాగులో వ్రాస్తాను. ఈ మార్పును గమనించగలరని మిత్రులందరికీ విజ్ఞప్తి. 


తెలుగువారి చర్చావేదిక 

నాకు డిస్కషన్స్ పై కొంచెం ఆశక్తి ఎక్కువ. ఏదైనా విషయం పై అందరం కలసి చర్చిస్తే నిర్ధారణలలో మేలైన, మెరుగైన ఫలితాలు వస్తాయనేది నా అభిప్రాయం. అనుభవం కూడా! అందుకే గతంలో జనవిజయం బ్లాగులో చర్చావేదికగా నడిపిన అంశాన్ని ప్రజ బ్లాగుగా క్రియేట్ చేయడం జరిగింది. ప్రజని కూడా వీలయినంత మెరుగుపరచడానికి నిరంతరం కృషి చేస్తున్నాను. 

కేవలం బ్లాగు గురించి తెలుసుకోవడానికీ,  బ్లాగును మంచిగా తయారుచేయాలనే తలంపుతో ఒకింత ఎక్కువ ప్రయోగాలు చేయడంతో ఇంత సమయం పట్టింది.  అయినా నా బ్లాగులను  ఆదరించారు. వారందరికీ ధన్యవాదములు.  నా ప్రయోగాలవల్ల  చాలామంది విసిగిపోయి ఉంటారు వారికి క్షమాపణలు.  బ్లాగు అగ్రిగేటర్లకు, కొందరి బ్లాగులలో జనవిజయం ను ఉంచిన బ్లాగర్లకు అందరికీ కృతజ్ఞతలు. 
నేను వ్యక్తిగతంగా నేర్చుకున్నవి,  వివిధ అంశాలపై నా అభిప్రాయాలను మీతో పంచుకునేందుకు అంటే నా స్వంత బ్లాగుగా My Learnings and Feelings అనే బ్లాగుని ఉపయోగిస్తాను. 

అందరూ స్పూర్తి ప్రదాతలే....! 

తాతినేని వనజగారు, కప్పగంతు శివరామప్రసాద్ గారు, నీలం రాజ్ కుమార్నల్లమోతు శ్రీధర్ వంటివారు చాలా మంచి విషయాలు తమ బ్లాగుల ద్వారా వ్రాస్తున్నారు. ఇంకా చాలామంది సమాజానికి ఉపయోగపడే మంచి విషయాలు వ్రాస్తున్నారు. వారందరి స్పూర్తితో నేనూ బ్లాగు వ్రాయడానికి ప్రయత్నిస్తాను. నా బ్లాగు అనుభవాలను, బ్లాగు ప్రపంచంలో స్పూర్తిగా నిలిచినవారి వివరాలను, బ్లాగులు ఎలా వ్రాయాలో తెలియని నాకు వివిధ రకాలుగా సహకరించి వివరాలు తెలిపినవారి గురించి,  నాకు నచ్చిన బ్లాగూల గురించీ నా బ్లాగు అనుభవాలు అనే లేబుల్ క్రింద జనవిజయం బ్లాగులో వ్రాస్తాను.

అనగననగ రాగమతిశయిల్లుచునుండు ....!

నాకు డిస్కషన్స్ పై ఉన్నంత ఆసక్తి వ్రాయడం మీద ఉండదు. అందుకే సహజంగా వ్రాయాలంటే భయం. అందంగా ఆకర్షించేలా వ్రాయడం రాకపోవడమూ ఓ కారణం. ఈ భయం బద్ధకంగా మారి ఎప్పటికప్పుడు బద్ధకంగా వాయిదా వేస్తూ పోతుంటాను. ప్రయత్నిస్తూ పోతే ఈ విషయం లో కూడా మెరుగుదల సాధించవచ్చనే అనుకుంటున్నాను. ఎప్పటిలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
Reactions:

Post a Comment

 1. అన్నయ్య మీరు చక్కగా వ్రాయగలరు.శుభాకాంక్షలు

  ReplyDelete
  Replies
  1. థేంక్యూ శశి చెల్లెమ్మా! నేను బ్లాగు సీరియస్‌గా వ్రాదామనుకుని మొదటి పోస్ట్ వ్రాశాక మొదటి కామెంట్ ఇదే. మీ నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నిస్తాను.

   Delete
 2. చక్కగా రాసేసారు ఆల్రెడీ !

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు లక్ష్మీ రాఘవ గారు.

   Delete
 3. mee yaatra digvijayamgaa konasaagaalani korukumtunnaanu

  ReplyDelete
  Replies
  1. థేంక్యూ దుర్గేశ్వర గారు.

   Delete
 4. రావు గారు,
  మీరు చాలా బాగా రాస్తున్నారు,already.
  ఇంకా బాగా రాయగలరు,కొనసాగించండి. గుడ్ లక్

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top