ఈ ప్రశ్న ప్రజ బ్లాగులో Green Star గారు నన్ను అడిగారు. నేను వీలుచూసుకుని సమాధానం చెపుతానన్నాను. దీనిని ఓ పోస్టుగా ఇక్కడ సమాధానం చెప్పడం జరిగినది. ఆయన అడిగిన ప్రశ్నను కాపీ చేసి క్రింద యధావిధిగా ఇస్తున్నాను. క్రింద నా సమాధానం వ్రాస్తున్నాను.
========================================================
>> శ్రమతో సంపాదించిన సొమ్ము పెట్టుబడిగా పెట్టడం అంటే శ్రమ లేకుండా సంపాదించాలనుకోవడమేగా? శ్రమ చేయకుండా పెట్టుబడితో సంపాదిస్తే బూర్జువాలే అవుతారు.<<

అయితే కొండల రావు గారు, ఇది చెప్పండి.

మీరు, నేను రోజు ఎనిమిది గంటలు అడివిలో కట్టెలు ఏరుకొని/విరుచుకొని వాటిని విక్రయిస్తూ జీవనం చేస్తున్నాము. నేను మీకంటే శారీరకంగా బలహీనుడను, రోజు కష్టపడటం నా వల్ల కాక, ఒక వారం పాటు రోజు ఒక పూట తినటం మానేసి మిగిలిన డబ్బుతో లోహం కొనుక్కొని, దాంతో ఒక గొడ్డలి తయారు చేసుకొన్నాను. ఈ గొడ్డలి వలన రోజు అడవిలో చాలా దూరం వెళ్ళకుండా దగ్గర దగ్గరలోనే కట్టెలు కొట్టుకొని ఎనిమిది గంటల పనిని నాలుగు గంటలలోనే కానిస్తున్నాను. నాలుగు గంటలలోనే చెయ్యగలగ టానికి కారణం నా గొడ్డలి అనే పెట్టుబడి. మీరేమో పాత పద్దతిలో చేతులతోనే కట్టెలు విరుస్తూ రోజు ఎనిమిది గంటలు అలానే కష్టపడుతున్నారు.

నా గొడ్డలి పెట్టుబడి లాంటిదే? దీనిని మార్కిజం ఎలా వివరిస్తుంది? నేను గొడ్డలి తయారు చేసుకోవటానికి ఒప్పుకొదా? లేకా మీకు కూడా ఒకటి చేసియ్యమని నన్ను అడుగుతుండా? లేక మిమ్మలిని వారం పాటు ఒక పూట తిండి మాని గొడ్డలి తాయారు చేసుకోమంతుండా?
========================================================

ఎవ్వరూ తిండిమానుకోవాల్సిన పరిస్తితులుండకూడదని, కష్టపడకుండా మరొకరి శ్రమను దోచుకునే పరిస్తితులుండకూడదని మార్క్సిజం చెపుతుంది. 

కొనడం అనే స్తితి ఉన్నప్పుడు వచ్చే ఆలోచన ఇది. కొనడం - అమ్మడం అనేది ఎప్పుడు ప్రారంభమయింది? ముందునుండీ లేదు. మధ్యలో వచ్చింది. వస్తుమారకం తరువాత మారక సాధనంగా వివిధ వస్తువులు మారుతూ చివరకు డబ్బు వచ్చింది. ఇది చరిత్ర.

ఏ వస్తువయినా ఎలా తయారవుతుంది? అనేది ఆలోచిస్తే శ్రమతో అనేది తేలుతుంది. ఏ వస్తువులో అయినా ఉండేది శ్రమ మాత్రమే.  ఇది సైన్స్.

వస్తువు = ప్రకృతిపదార్ధము+మానవశ్రమ  దీనినే మరో రకంగా కూడా చెప్పాలంటే
వస్తువు = ప్రకృతిపదార్ధము+యంత్రపరికరము+మానవశ్రమ
రెండో ఉదాహరణలో యంత్రపరికరం లో కూడా ప్రకృతిపదార్ధం+మానవశ్రమే ఉంటుంది. ఈ రెండూ కలిపి యంత్రపరికరం అనే రూపం లో 
 ఉంటుంది. దీనిని డెడ్లేబర్ (నిర్జీవ శ్రమ) అంటాము. 

ప్రతీ వస్తువులో ఉండేది శ్రమ అయినప్పుడు వస్తుమార్పిడి  సమాన శ్రమ విలువల మధ్య జరగాలి. శ్రమ విలువను సామాజిక సగటు శ్రమ కాలంతో నిర్ణయిస్తాము. 


లోహమైనా , కట్టెలైనా ప్రకృతిలోనివే. మనిషీ ప్రకృతిలో భాగమే. గొడ్డలితో కొడితే తేలికగా చెట్టును కొట్టొచ్చు అనే ఆలోచన అంతకు ముందు చెట్టును కొట్టే శ్రమ సందర్భంగా మెదడుకు వచ్చే ఆలోచన. ఈ ఆలోచనలు నిరంతరం మనిషి అవసరాల రీత్యా అభివృద్ధి అవుతూనే ఉంటాయి. గొడ్డలి నుండి కంప్యూటర్ దాకా అలా అభివృద్ధి అయినవే. అయితే గొడ్డలి నుండి కంప్యూటర్ దాకా గానీ ఇంకెంత టెక్నాలజీ పెరిగినా గానీ మనిషి లేకుండా పని చేయలేవు. టెక్నాలజీ అనేది కూడా ప్రకృతి మనకు ప్రసాదించే వరమే. ఉన్నదానినే కనిపెట్టగలం తప్ప మానవ మస్తిష్కం లోనుండి సృష్టించలేము. కార్యాచరణలో గమనించిన అంశాలద్వారా అవసరాలను తీరుచుకోవడం లో మెరుగైనది రాబట్టుకోవడంవల్లనే టెక్నాలజీ అభివృద్ధి అవుతుంది.

అలా పని చేసేదానిలో గొడ్డలిని ఉపయోగించి పనిచేయడం , ఉపయోగించకుండా పనిచేయడం అనేది తీసుకుంటే అందరికీ గొడ్డలిని ఉపయోగించే పని చేసే అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజం ఉమ్మడిగా తీసుకోవాలి. ఎవరి పని మేరకు వారికి ఫలితం అందాలి. అలా కాకుండా అసలు పనే చేయకుండా ఫలితం రావడం అనేది తప్పు. పెట్టుబడి లక్షణం అదే. వడ్డీ కానీ , షేర్ మార్కెట్ గానీ ,  మరొకటిగానీ శృమ లేకుండా చేసేది అదే.   

మీరన్నట్లే తీసుకుంటే అందరూ అదే ఆలోచన చేస్తారు కదా? అందరికీ మిగులు ఉంటుంది కదా? లేదా మిగుల్చుకునే అవకాశం (తినీ,తినకుండా) ఉండాలి కదా? కొందరికే ఎందుకుంటున్నది? ఉన్నవాడు మరింత ధనవంతుడిగా లేనివాడు మరింత లేనివాడిగా తయారు కావడానికి కారణాలేమిటి? 

ప్రకృతి వనరులు అందరికీ సమానమే. అందరూ శ్రమ చేయాల్సిందే. సోమరులుగా ఉండకూడదు. మనిషికి బ్రతకడానికి అవసరమైన వస్తువులను తయారు చేయాలి. బ్రతకడానికి అవసరమైన ఇతర కార్యక్రమాలుండాలి. ఆట - పాట - విద్య - వైద్యం ఇలా శారీరకమైనా, మానసికమైనా శ్రమ శ్రమే. సమాజానికి అవసరమైన శ్రమలు ఎవరికి ఏ టేలెంట్ ఉంటే అది చేయగలిగే స్వేచ్చ ఉండాలి. చేయాలి. 

అందరికీ పని - అందరికీ విశ్రాంతి అనే స్తితి ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టి సంపాదించాల్సిన స్తితి,  ఆలోచన మనిషికి రాదు. ఉన్న వ్యవస్థను బట్టి మనిషి ఆలోచన ప్రభావితమవుతూ ఉంటుంది. 
Reactions:

Post a Comment

 1. >>ప్రకృతి వనరులు అందరికీ సమానమే. అందరూ శ్రమ చేయాల్సిందే. సోమరులుగా ఉండకూడదు.

  నిజమే. అయితే అందరి మేదస్సు ఒకటి కాదు కదా. కొందరు వారి మేదస్సు యుపయోగించి తక్కువ శ్రమతో, తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది, ఇలా జరగటం కూడా ప్రకృతి ప్రసాదించిన వివిధ పరిమాణాలలో ఎదిగిన మేదస్సు వలన, అంటే ప్రక్రుతి అందరికి సమన స్తాయిలో మేధస్సును ఇవ్వటం లేదు. ప్రక్రుతి మనిషికి ఇచ్చిన దానిలోనే ఇన్ని తారతమ్యాలు ఉంటె అలంటి మనుషులు ఎక్కువ తక్కువలు సంపాదిస్తే తప్పు ఏంటి?

  ఇంకొకటి

  >>ఏ వస్తువయినా ఎలా తయారవుతుంది? అనేది ఆలోచిస్తే శ్రమతో అనేది తేలుతుంది. ఏ వస్తువులో అయినా ఉండేది శ్రమ మాత్రమే.

  అయితే మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. గొడ్డలి అనే ఆలోచన కూడా శ్రమనే కదా మీ దృష్టిలో? మనిద్దరం ఒక వారం పాటు పని తేలికగా ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తే నాకు గొడ్డలి ఆలోచన వచ్చింది. కాని మీకు అది రాలేదు. అంటే ఇద్దరం ఒకే రకమయిన శ్రమ చేస్తే నాకు పలితం ఎక్కువ వచ్చింది. ఇందులో మోసం, శ్రమ దోపిడీ లేనే లేవు. ప్రక్రుతి అలా నడుస్తుంది. అలాంటప్పుడు అదే తెలివి తేటలతో నేను ఒక ఫాక్టరీ పెడితే తప్పు ఎలా అవుతుంది? మీరేమో అందరికి సమాన లాభం రావాలంటారు, ప్రక్రుతి అలా ప్రవర్తించటం లేదు. అంటే మీ సిద్దాంతం ప్రక్రుతి వ్యతిరేకమా?

  ReplyDelete
  Replies
  1. అందరి మేధస్సు ఎప్పటికీ ఒకటి కాదు. ఏ వ్యవస్థలోనూ ఇది సాధ్యం కాదు.

   పెట్టుబడికి మేధస్సుతో సంబంధం లేదు. పెట్టుబడి పెడితే పెట్టుబడి పెట్టినవాడు యజమానిగా వాడిక్రింద ఉద్యోగులుగా మేధావులు పనిచేస్తున్న సంగతి విదితమే. ఈ మేధావుల శ్రమ దోపిడీయే ఆ యజమానికి లాభంగా ఉంటున్నది.

   ఎక్కువ తక్కువలు సంపాదించాల్సిన అవసరం లేదసలు. ఎక్కువ తక్కువ శ్రమలుంటాయి. ఎక్కువ తక్కువ ఫలితాలుంటాయి. ఆ శ్రమలు మేధో శ్రమ కావచ్చు- శారీరక శ్రమ కావచ్చు.

   మీరు గొడ్డలి తయారు చేసుకుని చెట్టు తక్కువ టైం లో కొట్టడం వరకే చూస్తే మీ అవసరాలకోసం కట్టెలు కొట్టుకోవడం అనే పని గొడ్డలి లేని వ్యక్తితో పోల్చుకుంటే ఆ వ్యక్తి ఎక్కువ సమయం పనిచేయడాన్ని మీరు దోపిడీ చేసినట్లు కాదు. కానీ అతనికీ గొడ్డలి ఉపయోగించుకోవడానికి అతనికీ మీరన్న పద్ధతిలోనే అవకాశం ఉంటుంది కదా?

   ఒకరికి ఒక ఆలోచన ముందు రావచ్చు. దానిని సమాజంలో ఉపయోగంలో పెట్టినప్పుడు మరొకరికీ ఆలోచన వస్తుంది.

   కేలుక్యులేటర్ నుండే కంప్యూటర్ వరకూ ఇంప్రూవ్ అయింది. కేలుక్యులేటర్ ఆలోచన వచ్చిన వారికే కంప్యూటర్ ఆలోచన రావాలని లేదు. ఆ తరం తరువాత అయినా రావచ్చు. ఆలోచన అనేది మొత్తం సమాజంలో జరిగే కార్యాచరణలో నుండే పరస్పరం వస్తుంటాయి.

   మీరిద్దరూ ఒకే రకం శ్రమ కాదు చేసింది. మీరు నైపుణ్య శ్రమ చేశారు. ఆ నైపుణ్యం గొడ్డలి తయారు చేసినవాడి నిర్జీవ శ్రమలో నుండి వచ్చింది.

   మీరు ఫేక్టరీ పెట్టాలంటే భూమి ఇతర వనరులు అన్నీ అందరికీ సంబంధించినవి. వాటిపై సామాజికంగా మాత్రమే హక్కు ఉండాలి. ప్రకృతి వనరుల వాడకం, పెట్టుబడులు సామాజికంగానే ఉండాలి.

   నేను చెప్పేది ప్రకృతి అనుకూలమైనదే. ప్రక్రుతి అందరికీ సమానంగానే ఉపయోగపడుతుంది. సూర్యుడందరికీ సమాన వెలుగునే ఇస్తాడు. గాలి అందరికీ సమానంగానే వీస్తుంది.

   తెలివితేటలతో మెరుగైన సేవలు అందిస్తారు తప్ప పెట్టుబడి పెట్టకూడదు.నిజానికి పెట్టుబడి తెలివిని, నైపుణ్యాన్ని అవహేళన చేస్తున్నది. అవకాశాలు లేకుండా చేస్తున్నది. ఆస్థి ఉంటే, పోగుపడిన సంపద ఉంటే వాడు పని చేయకుండా పోరంబోకుగా తిరిగే అవకాశం ఉంటుంది. పని చేయాల్సిన అవసరం లేదు. అలా అని అందరూ అలా ఉంటారని కాదు. తెలివితేటలంటే కట్టెలు కొట్టే పని కంటే మెరుగైన డాక్టర్ వృత్తి చేయొచ్చు. ఎప్పుడైనా ఒకే పనిలో తెలివితేటలలో తేడాలుంటాయి. ఇప్పటి వ్యవస్థలో కూడా ఉంటాయి. ప్రస్తుత వ్యవస్థలో ఇద్దరు టీచర్లను తీసుకుంటే ఒకరు తెలివైనవారు మరొకరు తెలివతక్కువవారు ఉంటే వేరు వేరు జీతాలు ఇస్తారా? ఇవ్వరు. అలాగే ఏ పనిలో అయినా సామాజిక సగటు శ్రమకాలం లెక్కలోకి తీసుకుంటారు. అంటే ఓ కుండను తయారు చేయడానికి ఒకరికి గంట సమయం పడితే , మరొకరికి 2 గంటలు పడితే , ఓ వికలాంగుడికి 3 గంటలు పడితే మొత్తం సగటు తీసి కుండ తయారీకి 2 గంటల లెక్క గడతారు.

   అందరికీ సమాన లాభం కాదు, అసలు లాభం - నష్టం అనే అవసరం లేదంటాను.

   Delete
 2. >> ప్రతీ వస్తువులో ఉండేది శ్రమ అయినప్పుడు వస్తుమార్పిడి సమాన శ్రమ విలువల మధ్య జరగాలి. శ్రమ విలువను సామాజిక సగటు శ్రమ కాలంతో నిర్ణయిస్తాము.

  గొడ్డలి కనిపెట్టటం అనే నా ఆలోచన శ్రమ యొక్క విలువ ఎలా కడతారు? ఎందుకంటే ఈ ఆలోచన లక్షల/కోట్ల మంది శ్రమను తగ్గిస్తుంది. ఈ గొడ్డలి ఆలోచన వల్ల ఒక్కొక్కరికి రోజు నాలుగు గంటల శ్రమ తగ్గుతుంది కాబాట్టి, తక్కువలో తక్కువ ఒక్కొక్కరి నుండి ఒక అరగంట శ్రమ విలువ ప్రతిఫలంగా ఆశించవచ్చా? అలా జరిగినా నేను జీవితంలో మళ్ళి పని చెయ్యనవసరం లేదు.

  ReplyDelete
 3. >> ఉన్నవాడు మరింత ధనవంతుడిగా లేనివాడు మరింత లేనివాడిగా తయారు కావడానికి కారణాలేమిటి?

  అది పెట్టుబడి దారి దేశాలలోనే కాక కమ్యునిస్టు దేశాలలో కుడా జరుగుతుంది. నేను చుసిన అమెరిక దేశంలో ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నను పేదవాళ్ళ ఆర్టిక స్తితి, జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి. పెట్టుబడి వ్యవస్తను కుడా పటిష్టమయిన చట్టాలతో నియంత్రించవచ్చు, ఉదాహరణకు పెద్ద పెద్ద కంపినిలు పోటి పడకుండా ఒకే కంపినిగా కలిసి పోయి మార్కెట్ లో నియంతృత్వం ఏర్పాటు చేసుకోవటానికి అమెరిక చట్టాలు అనుమతించవు. వాటి కలయికకు చట్ట సభల అనుమతి తప్పని సరి. కొన్ని రాష్ట్రాలలో ఎంత తక్కువ ధరకు వస్తువును అమ్మాలో ప్రభుత్వమే నిర్నయిన్స్తుంది. అంత కన్నా తక్కువ ధరకు అమ్మటానికి వీలు లేదు (చిన్న వ్యాపారులను పెద్ద కంపినిల నుండి రక్షించుటకు).

  నా ఉద్దేశం ఏమిటంటే ఎక్కడ కూడా సక్సెస్ కాని కమ్యునిజం మిద ఇంకా ఇంకా ప్రయోగాలు చేసే బదులు అంతో ఇంతో బాగా పని చేస్తున్న పెట్టుబడి వ్యవస్తను పైన ఉదహరించిన చట్టాలు లాంటివి చేసి ఎవరికీ అన్యాయం జరగకుండా పటిష్ట పరుచుకుంటే బాగుంటుందని. కమ్యునిజం నియంతృత్వం లేకుండా నిలబడలేదని ఎన్నో సార్లు రుజువు కూడా అయినది కదా.

  ReplyDelete
  Replies
  1. http://janavijayam.palleprapancham.in/2013/02/blog-post_5606.html

   Delete
 4. అసలు డబ్బు అనేది ఎందుకు వాడుకలోకి వచ్చింది? ఈ విషయాన్ని ఆలోచిస్తే చాలా విషయాలు బోధ పడతాయి. ఒక వ్యక్తి తాను చేసే శ్రమను మరో వ్యక్తి శ్రమతో పోల్చడం చాలా కష్టం. దానికంటూ ఒక కొలమానం ఉండాలి. ఆ కొల మానం ఏమిటి?

  సమయం: సమయాన్ని కొల మానంగా తీసుకోవడం అనేది అంత ఆమోదయోగ్యమైనది కాదని చెప్పొచ్చు ఎందుకంటే, వ్యక్తి సంఘ జీవి. ఒక వ్యక్తి చేసే పనికి విలువ సంఘములో ఆపనికి ఉన్న అవసరాన్ని భట్టి మాత్రమే ఉంటుంది. అలా లేనప్పుడు ఆ వ్యక్తి ఒక రోజు కష్టపడి చేసిన పనినీ, మరో వ్యక్తి సంఘానికి ఉపయోగ పడేలా చేసిన 10 నిమిషాల పనితో కూడా పోల్చలేం. ఉదాహరణకు తీసుకుంటే ... ఒక వ్యక్తి పడుకోవడానికి మంచాన్ని తయారు చేశాడు అనుకుందాం. అది చక్కగా మంచి నవారుతో అల్లాడు ఒక వ్యక్తి. మరొక వ్యక్తి అదే మంచాన్ని ముల్ల తీగలతో అల్లాడు (ఫెన్సింగ్). సమాజానికి నవారుతో అల్లిన మంచం ఉపయోగ పడుతుంది కానీ ముల్ల తీగలతో అల్లిన మంచం కాదు. (ఇక్కడ అవసరం అందులో విశ్రమించడం మాత్రమే అయితే). కాబట్టి, నవారుతో మంచం అల్లిన మంచమే సమాజానికి ఉపయోగం. కాబట్టి కాలం అనేది వ్యక్తి శ్రమను కొలవడానికి కొలమానంగా తీసుకోలేం. సమాజానికి ఏది ఉపయోగం అన్నది మాత్రమే మనం కొల మానంగా తీసుకోవాలి.

  సరే, ఇప్పుడు మనం సమాజానికి ఉపయోగ పడే పనులను మాత్రమే తీసుకుందాం. అందరూ సమాజానికి ఉపయోగ పడే పనులే చేస్తాఋ అని అనుకుందాం. ఈ సందర్భములో కూడా మనం కాలాన్ని కొలమానంగా తీసుకోవడం కుదరదు. ఎందుకంటే, ఒక వ్యక్తి చేసిన పని వలన సంఘానికి కలిగే మేలు లేదా సంఘములోని వ్యక్తులకు కలిగే ఉపయోగం ఎంత వరకూ ఉంది అనేది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అన్ని పనులూ అందరికీ ఒకేలా ఉపయోగ పడవు, ఒకే రేంజులో ఉపయోగ పడవు. కొన్నింటికి శారీరక శ్రమ అధికంగా ఉండాలి, మరికొన్నింటికి మేధో శ్రమ అధికంగా ఉండాలి. మరో పనికి అంతగా శ్రమ పడక్కర్లేదు. కానీ, రెండు పనులూ తీసుకునే సమయం మాత్రం ఒక్కటే అనుకుందాం. అప్పుడు పరిస్థితి ఏమిటి? ఉదాహరణకు, తోటలో మొక్కలకి నీళ్ళు పోయడం. 10 నిమిషాలు పోస్తే పనైపోతుంది. అదే ఒక భవనం తగల బడుతోంది. దాన్ని ఆర్పడానికి నీళ్ళు పోయాలి. అక్కడ కూడా 10 నిమిషాలలోనే పని అవుతుంది అనుకుందాం. ఇద్దరూ ఒకే సమయం పని చేశారు, ఇద్దరు చేసిన పనీ సమాజానికి ఉపయోగ పడేదే కాబట్టి, ఇద్దరికీ ఒకే ప్రతిఫలం అన్న సూత్రం ఇక్కడ పనిచేయదు. ఎక్కువ రిస్క్ తీసుకుని, ఎక్కువ బాధలకు ఓర్చుకొని పనిచేసే ఫైర్ ఫైటర్ కే ఎక్కువ ప్రతిఫలం దక్కాలి.సమాజానికి ఎక్కువ ఉపయోగం కూడా ఇతడి వల్లే ఉంటుంది. (మిగిలిన భవనాలను కూడా ప్రమాదములో పడకుండా కాపాడతాడు కాబట్టి)

  అంటే, వస్తు మార్పిడి లేదా సేవల మార్పిడి, అవి తీసుకునే సమయం ఆధారంగా లెక్కించి చేయడం అశాస్త్రీయమైనది, ఆమోదయోగ్యం కానిది అని చెప్పొచ్చు. మరి దీనికి మార్గమేమిటి? వస్తువు లేదా సేవల అవసరాన్ని లేదా ప్రజలకు కలిగే ఉపయోగాన్ని భట్టి దాని ప్రతిఫలాన్ని నిర్ణయించడం. తక్కువ సమయములో అయినా, ఎక్కువ మందికి ఉపయోగపడే పని చేయగలిగినప్పుడు సహజంగానే ఎక్కువ ప్రతిఫలం లభించాలి. ఎందుకంటే ఇక్కడ సంఘానికి అది ఎంతగా ఉపయోగ పడుతోంది అనేది కొలమానం కదా. అది కూడా ఎలా చేయాలి? దానికి కూడా ఒక మాధ్యమం ఉండాలి. ఆ మాధ్యమమే డబ్బు. చేసిన పని, సంఘానికి కలిగే ప్రయోజనాల్నీ, తీర్చే అవసరాల్ని భట్టి దానికి ధర నిర్ణయించి, దాన్ని డబ్బుతో కొనుక్కోవాలి.

  టూకీగా చెప్పాలి అంటే డబ్బు అనేది, శ్రమకు మరో రూపం మాత్రమే. ఒక్కసారి శ్రమకు ఒక రూపాన్ని ఇచ్చిన తరువాత మిగిలినవన్నీ సులభమైపోతాయి. తోటమాలికి ఒక వేతనం (అతను చేసే పనిని భట్టి) ఉంటుంది. ఫైర్ ఫైటరుకు మరో వేతనం ఉంటుంది. ఇది లోపాలు లేనిదా అంటే, ఉన్నాయి. దీనిలో కూడా లోపాలున్నాయి కానీ, సమయాన్ని భట్టి విలువను లెక్కించడం కన్నా మెరుగైనది అని నా అభిప్రాయం.

  ReplyDelete
 5. అలానే ఫ్యాక్టరీ పెట్టే వాడికి కూడా. ఒక వస్తువు తయారీలో ...

  ముడి సరుకు + శ్రమ ఉంటాయి. కానీ, ఒక్కసారి డబ్బు అనే మధ్యమం అవసరం ఏమిటో గుర్తించిన తరువాత ఇక్కడ కూడా శ్రమ విలువను డబ్బుతోనే చూడాల్సి ఉంటుంది. (నిజానికి ముడి సరుకు విలువ్ను కూడా, ఎందుకంటే అన్నీ ప్రకృతిలో అంత విరివిగా దొరకవు. కొన్నింటి కోసం ఎక్కువ శ్రమ పడాలి). శ్రమ (మేధో శ్రమ + శారీరక శ్రమ) చేసిన తరువాత వచ్చిన లాభాలు అంటే పెట్టుబడి దారుడు పెట్టిన పెట్టుబడి అతనికి ఇచ్చేసిన తరువాత, ఎవరి పనికి తగ్గ ప్రతి ఫలం వారికి జీతాల రూపములో ఇచ్చిన తరువాత (అంటే యజమాని మేధో శ్రమకు కూడా) మిగిలిన వాటిని లాభాలు అని అంటాం. ఇక్కడ మళ్ళీ రెండు పద్దతులు ఉన్నాయి..

  లాభాలు అందరం పంచుకోవడం: లాభాలు వస్తే పంచుకుంటాం సరే, మరి నష్టాల మాటేమిటి? నష్టాలు వచ్చినప్పుడు అక్కడ పని చేసిన కార్మికులంతా తలా కొంత డబ్బును ఆ యజమానికి ఇస్తారా? ఇవ్వరు. అంటే యజమాని ఇక్కడ రిస్క్ తీసుకుంటున్నాడు. ఆ రిస్క్ అనేది పూర్తిగా యజమానిదే. అలాంటప్పుడు లాభాలు వచ్చినప్పుడు మాత్రం వాటిలో వాటా అడిగే హక్కు శ్రామికులకి ఎక్కడిది? అందుకే వచ్చిన లాభాలను పంచుకోవడం అనేది కూడా శాస్త్రీయమైన ఆలోచన కాదు.

  మరేం చేయాలి? అదే రెండవది. యజమాని రిస్కు యజమానిది. దానితో పనిచేసే కార్మికునికి సంబందం లేదు. అతనికి కేవలం అతను చేసిన పనికి, బయట ప్రపంచములో ఉన్న విలువను, అవసరాన్ని భట్టి వేతనం ఇవ్వడం. అదే ప్రస్తుతం అందరూ చేస్తున్నారు. ఒకవేల యజమానికి లాభాలు బాగా వస్తే, అతను బోనసులు గట్రా ఇవ్వొచ్చు. తక్కువున్నప్పుడు లేదా నష్టాలు ఉన్నప్పుడు కేవలం వేతనం మాత్రమే ఇవ్వొచ్చు. ప్రత్యేక పరిస్థితుల్లో అంటే బయట ఆ శ్రామీకుడి శ్రమకు అంత విలువ లేనప్పుడు, వేతనం కాస్త తగ్గించనూ వచ్చు.

  అలా కాదు, శ్రామీకుడు నష్టాలు వస్తే తన డబ్బును యజమాని నష్టన్ని భర్తీ చేయడనికి ఇస్తాడు అనుకున్నప్పుడు లేదా, పెట్టుబడి యజమానితో సమానంగా పెట్టినప్పుడు అతను భాగస్వామి అవుతాడు. ఈ విధానం కూడా ప్రస్తుతం ఉండనే ఉంది.

  ReplyDelete
  Replies
  1. http://incrediblegeek.wordpress.com/2013/02/07/%e0%b0%b6%e0%b1%8d%e0%b0%b0%e0%b0%ae-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%b2%e0%b1%81%e0%b0%b5%e0%b0%a8%e0%b1%81-%e0%b0%b2%e0%b1%86%e0%b0%95%e0%b1%8d%e0%b0%95%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%a1%e0%b0%be%e0%b0%a8/

   Delete
  2. శ్రీకాంత్ గారు,

   చాలా రోజుల క్రితం కొండల రావు గారు రాసినది ఏమిటంటే, (తప్పులుంటే సరి చెయ్యండి కొండల రావు గారు)

   ఫాక్టరీ యజమాని ప్రభుత్వమే ఉండాలి, వ్యక్తులు యజమానులుగా ఉంటె మీరు చెప్పినట్లు లాబాలు/నష్టాలు ఎవరు పంచుకోవాలి మొదలయిన ప్రశ్నలు. అదే ప్రభుత్వమే యజమానిగా ఉంటె (indirectly the people) లాబాలు వస్తే ప్రజలకే ఖర్చు పెడుతారు, నష్టాలు వస్తే శిస్తు రూపంలో ప్రజలే భరిస్తారు. ఇదే సోసలిస్ట/మార్కిస్టు/కమ్యునిస్టు (ఇవన్నీ ఒకటేనా?) సిద్దాంతం అని.

   Delete
  3. http://janavijayam.palleprapancham.in/2013/02/blog-post_5606.html

   Delete
 6. @ గ్రీన్‌స్టార్, శ్రీకాంత్ గారు మీరడిగిన ప్రశ్నలకు మార్క్సిజంలో సమాధానులున్నాయి. వీటిని విడిగా పోస్టులుగా వ్రాస్తాను. వీలుచూసుకుని వ్రాయడం జరుగుతుంది.

  <> కేపిటలిజం లో అసలు మంచే ఉండదు అనేది తప్పు. కేపిటల్ ముఖ్య లక్షణం లాభం. లాభం కోసం అది ఎంతకైనా తెగిస్తుంది. ఆఖరకు యజమాని ప్రాణం తీయడానికైనా. లాభం కోసం ప్రతీదానిని సరుకుగా మార్చేసి మానవతావిలువలను మంటగలిపే లక్షణం పెట్టుబడికున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థను చట్టాలతో నియంత్రించవచ్చనేది భ్రమ మాత్రమే. పెట్టుబడి కడుపులోనే సంక్షోభాల పుట్ట ఉన్నది. అది సూత్రరీత్యా వ్యతిరేకించాల్సినదే.

  నియంతృత్వం లేకుండా కమ్యూనిజం నిలబడలేదని ఋజువయింది అనేది కాదు. శ్రామికవర్గ నియంతృత్వం అనేది అవసరమని మార్క్సిజమే చెపుతుంది. అయితే ఈ విషయం లో నేను వ్యక్తిగతంగా కొంత భిన్నాభిప్రాయం ఉన్నవాడిని. నిర్ధారించుకోకుండా మీతో ప్రస్తుతానికి వాదించను. ఆ విషయం మాత్రం నేనింకా అధ్యయనం చేసి నిర్ధారించుకున్నాకే వాదిస్తాను. అలా అని పెట్టుబడిదారీ వ్యవస్థే అంతిమం అనేదానిని అంగీకరించను. సామ్యవాదాన్ని తీసుకురావడంలో నిలబెట్టడంలో అనుసరించాల్సిన పద్ధతులలో నాకు అనుమానాలు , భినాభిప్రాయాలున్నాయి.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top