ఇది పుస్తకం పేరు కాదు.  నాకు నేను బద్ధకాన్ని వదిలించుకోవడానికి వేసుకున్న ఎత్తుగడే ఈ పోస్టు.

నేను చదివిన పుస్తకం : 

ఇది లేబుల్ పేరు. ఈ పోస్టును ఈ లేబుల్ క్రింద వ్రాస్తున్నాను. ఓ పుస్తకం చదివి లేదా చదివిన పార్ట్ వరకూ అందులో మనకు అర్ధమయిన అంశాన్ని, దానివల్ల ప్రయోజనాలు, లోపాలు చర్చించేలా పోస్టులు వ్రాయడం కోసమీ లేబుల్ క్రియేట్ చేస్తున్నాను.

ఈ లేబుల్ క్రింద వచ్చే పోస్టుల వల్ల ముఖ్యంగా వ్యక్తిగత ప్రయోజనం కోసమే ఓ ఎత్తుగడగా వ్రాస్తున్నాను. దాని ద్వారా సమాజానికి ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చినవాళ్లమయితే కూడా సంతోషమే.

ఇది కేవలం నాకోసం వ్రాసుకుంటున్న పోస్టు. జనవిజయంలో సీరియస్‌గా పోస్టులు వ్రాద్దామనుకున్నాక నేనెందుకు పోస్టులు వ్రాయకూడదు? ఎందుకు వ్రాయలేక పోతున్నాను? సేకరణలు మాత్రమే పోస్టులుగా ఎందుకుంచాలి? మంచిగా వ్రాసేవారిలా మనమూ మంచి పోస్టులెందుకు వ్రాయకూడదు? అని ప్రశ్నించుకున్నప్పుడు కారణాలుగా తేలిన కొన్ని అంశాలను విశ్లేషించుకున్నాను. ఆ విశ్లేషణనే ఓ పోస్టుగా వ్రాద్దామని అప్పుడే అనిపించినది.

ఎందుకు వ్రాయలేక పోతున్నాను? 

1) సరిగా అధ్యయనం చేయకపోవడం. 
2) డిస్కషన్స్ మీద ఉన్న దృష్టి పుస్తక అధ్యయనం మీద లేకపోవడం.
3) బద్ధకం 
4) పరిస్తితులు అనుకూలించకపోవడం.
5) ప్రతికూల పరిస్తితులను అధ్యయనానికి అనుకూలంగా మరల్చుకోకపోవడం.

వీటిలో సరిగా చదవక పోవడం అనేదానిని , బద్ధకాన్ని వదిలించుకోవడానికీ ఈ పోస్టు ఓ ఎత్తుగడగా ఉపయోగపడుతుందని వ్రాస్తున్నాను. ఏదైనా అంశం ఆర్టికల్‌గా వ్రాయాలి అంటే అందుకు సంబంధించిన విషయం తెలియాలి. తెలియాలి అంటే చదవడమూ ఓ అవకాశమే. ఎందుకు చదవడం లేదు? నా దగ్గర షుమారు 300 కు పైగా పుస్తకాలున్నాయి. కానీ నేను చదివింది చాలా తక్కువ మాత్రమే. కొన్ని పుస్తకాలైతే కొని చదువుదాములే అంటూ వాయిదా వేసి చదవకుండా అలా ఉంచినవి చాలా ఉన్నాయి. కొన్ని కొంచెం చదివి తరువాత చదవచ్చులే అని వదిలేసినవి ఉన్నాయి. ఇలా మధ్యలో ఆపినవే ఎక్కువ. కొన్ని అయితే మనకు అవసరమైన చాప్టర్స్ వరకూ అక్కడక్కడా చదివినవి. ఇవి మన అవసరమైన సమాచారం కోసం చదివిన చాప్టర్లు మాత్రమే.

ఎప్పుడు చదువుతాము?

చదివింది తిరిగి చెప్పాలంటే బాగా చదవాల్సిన అవసరమేమిటో తెలుస్తుంది. మనమేదైనా అంశాన్ని క్లాసుగా చెప్పాలంటే  ఆయా క్లాసుల సందర్భంగా వినుకుంటూ పోయేవాళ్లున్నప్పటికీ , ప్రశ్నలు ఎదురయినప్పుడు మనకు తేడా స్పష్టంగా తెలుస్తుంది. ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఏమాత్రం తడబాటు లేకుండా ఉండాలీ అంటే ఆ అంశంపై అధ్యయనం చేసి హోంవర్క్ చేసి చెప్పిన క్లాసుకీ, అలా హోంవర్క్ చేయని క్లాసుకీ ఆచరణలో మనకు తేడా తెలుస్తుంది. ఇక్కడ నాకు ఐన్‌స్టీన్ చెప్పిన ఓ వాక్యం చెప్పాలనిపిస్తుంది. మనకోవిషయం సరిగా అర్ధమయినదీ లేనిదీ తెలిసేది ఎదుటివారికి అది మనం ఎంత బాగా అర్ధమయ్యేలా చెపుతున్నామనేదానిని బట్టి ఉంటుంది.

రచయితను + మన ఆసక్తిని బట్టీ ఉంటుంది !

పుస్తకాలు చదివేటప్పుడు కొందరు రచయితలు వ్రాసే విధానం మనలను చదివిస్తుంది. కొందరి రచనలు బాగా కృషి చేస్తే తప్ప చదవలేము. మనకు ఆయా సబ్జెక్టుల మీదున్న ఆశక్తి కూడా పుస్తకాన్ని చదివించడం లో పాత్ర వహిస్తుందనుకుంటా. చిన్నప్పుడు సినిమా వారపత్రికలు , హీరోల ఇంటర్వ్యూలు , సినిమా సమీక్షలు బాగా చదివేవాడిని.

నేను కొన్న పుస్తకాలు !

నాకు చిన్నప్పటినుండీ పుస్తకాలు కొనడం అలవాటు. మా స్కూలు గోడలపై చినిగిన చొక్కానైనా తొడుక్కో గానీ మంచి పుస్తకం కొనడం మానొద్దు అని వీరేశలింగం గారి సూక్తి అనుకుంటా వ్రాసి ఉండేది. అదొకటి మనసులో బలంగా నాటుకుంది. అలాంటివే స్వామీ వివేకానంద కొటేషన్స్ కూడా మనలను ప్రేరేపించేవిగా ఉండేవి. మనిషి కూడా బాగుండేవాడు. అలా వివేకానంద బుక్స్ కొనేవాడిని. చిన్నప్పుడు సినిమా పాటల పుస్తకాలు కొనడం అనేది మొదటి పుస్తకాల కొనుగోలు అలవాటుగా చెప్పవచ్చు. 

ఖమ్మం లో పుచ్చలపల్లి సుందరయ్య గారి  సభలో లెనిని ఏరిన రచనలు బుక్  కొన్నాను. రష్యా వాళ్ల ప్రింటింగ్ బైండింగ్ బాగుందని కొన్నాను. రేటూ తక్కువే. అందరూ వేరేవి కొంటే నేనిలా కొనేవాడిని. ఈమధ్య కాలం వరకూ ఆ బుక్ ఉంది. కొన్ని పుస్తకాలు చెదలు పట్టి చినిగి పోయాయి. వాటిలో అదీ పోయింది.  ప్రతీ పుస్తక ప్రదర్శన శాలకు వెళ్లే వాడిని. ఆసక్తికరంగా అనిపించినవి కొనేవాడిని. ఆరోగ్యం , సైకాలజీ ..... ఇలా రకరకాలుగా కొనేవాడిని.

ఆరవతరగతి చదివేటప్పుడు ఉచితంగా వస్తున్నాయని ఏసుక్రీస్తు వారి పుస్తకాలకై ఉత్తరాలు వ్రాసేవాళ్లం. అవి వచ్చేవి. బైబిల్ ఉండేది చదవ లేదు. ఇప్పుడు లేదు.

బాలమిత్ర , చందమామ , విజ్‌డం  , బాలజ్యోతి లాంటి పుస్తకాలు కొనేవాడిని. అందులో కథలు మాత్రం చదివేవాడిని. చివరి పేజీలలో పదాల కాంపిటేషన్స్ ఉండేవి అవి పూరించి పోస్టు ద్వారా పంపేవాడిని. 


ఇలా చెప్పుకుంటూ పోతే పుస్తకాల కొనుగోలు చరిత్ర జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఇకపై పుస్తకాలు చదవాలి. ఇప్పటిదాకా చదవకపోవాడానికున్న కారణాలేమైనా ఇకముందు చదవాలంటే ఇక్కడ పోస్టులు వ్రాస్తానని మాట ఇస్తే కొంచెం అదైనా ముందుకు నడిపిస్తుందని ఆశ + నమ్మకం.

ప్రస్తుతానికి దొరికిన పుస్తకాలను దుమ్ము దులిపి ఓ చోట చేర్చాను. మిగతావి కూడా వెతికి అన్నింటినీ లిస్ట్ తయారు చేసి ఒక్కో బుక్ చదవాలి.

ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందేమో చూద్దాం !

వీటిని అధిగమించాలంటే చదివిన పుస్తకం లేదా చదువుతున్న పుస్తకం లో నాకు తెలిసిన అంశాలను ఇదే బ్లాగులో వ్రాస్తే ఉపయోగకరంగా ఉంటుందని అనిపించినది. ఇలా మీకు మాట ఇచ్చినందుకైనా బద్ధకం వదులుతుంది కదా? చూద్దాం ఈ ప్రయోగం ఎంతమేరకు సక్సెస్ అవుతుందో !
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top