పల్లెప్రపంచం విజన్ :


   
మార్కెటింగ్ కంపెనీ ద్వారా  గ్రామీణ ప్రాంతాలలో  ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఓ విజన్‌ను రూపొందించుకుని పని చేయాలనే తలంపుతో 'పల్లె ప్రపంచం మార్కెటింగ్ సర్వీసెస్ సంస్థ' ను ఏర్పాటు చేయడం జరిగింది.   

గ్రామీణ ప్రాంతాలలోని వారికి మార్కెటింగ్ రంగం ద్వారా ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు ప్రకృతి జీవన విధానం, పల్లె సంస్కృతి, పర్యావరణం, మనో వైజ్ఞానిక శిక్షణ, గ్రంధాలయాల అభివృద్ధికి తోడ్పాటునందించాలనేది పల్లె ప్రపంచం లక్ష్యంగా నిర్ణయించుకోవడం జరిగింది. 

ఈ అంశాలకు సంబంధించిన ఆచరణ కార్యక్రమాలతో పాటు, ఆర్టికల్స్‌ని ఈవారం పల్లెప్రపంచం అనే లేబుల్ క్రింద ఈ బ్లాగులో ఉంచడం జరుగుతుంది.


'నెట్‌వర్క్ మార్కెటింగ్‌'ను ఓ 'ఆయుధం'గా ఉపయోగించుకోవచ్చు !

'పల్లె ప్రపంచం' విజన్ లో విజయం సాధించడం కోసం నెట్‌వర్క్ మార్కెటింగ్ రంగాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయైంచుకోవడం జరిగింది. 

ఏ విషయంలో విజయం సాధించాలన్నా వ్యక్తిగా కంటే సమూహంగా మాత్రమే సాధ్యం. మానవ సమాజం ప్రత్యేకతలో ప్రధానమైన ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని డబ్బుకి మాత్రమే అధిక ప్రాధాన్యమున్న ప్రస్తుత సమయంలో, ప్రతీది డబ్బుతోనే ముడిపడి ఉంటుంది కనుక పల్లెప్రపంచం విజన్ సాధనకోసం నెట్‌వర్క్ మార్కెటింగ్ రంగాన్ని ఓ 'ఆయుధం'గా ఎంచుకోవడం జరిగింది.

ఇదే మార్గం అని కాదు గానీ, ఉన్న అవకాశాలలో ఎవరికి వీలయినది వారు ఎంచుకుంటారు  కదా!  నాకు వీలయినది, గత అనుభవం ఉన్న అంశం కనుక ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. 

ప్రస్తుత పరిస్తితులలో నూటికి 90% చెడుగా ఉన్న ఈ రంగం ద్వారా వెళ్లాలా? వద్దా? అని గత సంవత్సర కాలంగా  తటపటాయించి అసలు మార్గమే తప్పయితే ఎంచుకోకూడదు తప్ప, ఆ మార్గాన్ని మనం మంచిగా ఉపయోగించుకుంటే తప్పు లేదనే నిర్ణయించుకున్నాను. 

నెట్‌వర్క్ మార్కెటింగ్ రంగాన్ని మంచిగా ఉపయోగిస్తే ఎంత ప్రయోజనం ఉన్నదో, చెడుగా ఉపయోగిస్తే అంత ప్రమాదమూ ఉన్నది. ప్రభుత్వమే ఈ విషయంలో కొన్ని మార్గదర్శక సూత్రాలు తీసుకొచ్చి ఈ రంగానికో ప్రత్యేక చట్టం తీసుకు రావాలనేది నా అభిప్రాయం. ఈ మేరకు కేరళ ప్రభుత్వం కొన్ని మార్గదర్శక సూత్రాలు సూచించింది. 

మార్కెటింగ్ రంగంలో విజయం సాధించడానికీ మిగతా విజన్ అంశాలకీ లింక్ అంతమేరకే. నెట్‌వర్క్ మార్కెటింగ్ ప్లాన్ ద్వారా లభించే జయాపజయాలతో నిమిత్తం లేకుండా మిగతా విజన్ అంశాల సాధనకు కృషి చేయడం జరుగుతుంది.

డబ్బు సంపాదనతో పాటు సమాజ శ్రేయస్సుకీ ప్రాధాన్యత ఇవ్వాలనుకునే వారితో కలిపి విజన్ లోని మిగతా ఐదు అంశాలు ( ప్రకృతి జీవన విధానం - పల్లె సంస్కృతి - పర్యావరణం - మనో వైజ్ఞానిక శిక్షణ - గ్రంధాలయాలు ) లో ప్రగతి సాధించేందుకు ప్రయత్నించడం జరుగుతుంది. 

అందుకు ఈ బ్లాగూ ఓ వేదికే !

ప్రకృతి జీవన విధానం అందరికీ ఆచరణీయమే !

లక్షల సంవత్సరాలుగా ప్రకృతే మనిషిని సంరక్షిస్తూ వచ్చింది. వస్తోంది. మానవ మనుగడకు వరప్రసాదమే ప్రకృతి. మనిషి ఈ ఆధునిక సమాజంలో నిండు నూరేళ్లు నవ్వుతూ ఉండాలంటే పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి.

ఒకప్పుడూ!అప్పుడూ!ఇప్పుడూ!ఎప్పుడూ!! మానవులందరికీ మార్గదర్శి ప్రకృతిమాతే. సకల జంతుజాలమే అందుకు నిదర్శనం. అటువంటి నిత్య దర్శనం మనకు అనునిత్యం "పాఠాలు" చెపుతున్నది. అయినా అవి మనకు గుణపాఠాలు కావడం లేదు. మన కళ్లకు కానరావడం లేదు.

రోజు రోజుకూ మనం రోగాల బాటలో పయనిస్తున్నాము. మన నిత్య జీవన విధానంలోనే, దిన చర్యలలోనే రోగాలకు సుఖ పోషణ జరుగుతుందని నిర్ధారణ అయింది.

ప్రకృతి ధర్మం అందరిది. మనందరిది. ఆరోగ్యం మన మనస్సుకు సంబంధించినది. మనస్సు మనిషికి సంబంధించినది. మనిషికి,  ప్రకృతికీ అవినాభావ సంబంధం ఉన్నది. ఆ అనుబంధం నుండి విడిపోయిననాడే మనిషి అనారోగ్యవంతుడవుతున్నాడు.

ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలంటే మహాభాగ్యంతో ఆరోగ్యాన్ని కొనుక్కుందామనుకునే అజ్ఞానంలో మనమున్నాం. ఆరోగ్యం కొనుక్కుంటే వచ్చేది కాదు. ఆరోగ్యం కాపాడుకోవాలంటే, ఏ రొగమూ రాకుండా ఉండాలంటే ప్రకృతి జీవన విదానమొక్కటే మార్గం. మరేదీ దీనికి ప్రత్యామ్నాయం కాదనే చెప్పాలి.

మన భారతీయ జీవన విధానంలో అనేక మంచి విషయాలున్నాయి. నేడవి పాత చింతకాయ పచ్చడిలా కనిపిస్తున్నా నిత్యసత్యాల్లాంటి ఆ విషయాలను జీవన విధానంలోని గొప్పతనాన్ని తిరిగి శాస్త్రీయంగా సరిచేసుకోవలసిన అవసరం ఉన్నది. మానవ మనుగడకు,  సమజహితంకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రకృతి జీవన విధానం ను అందరూ అర్ధం చేసుకోవలసిన అవసరం ఉన్నది. మంతెన సత్యనారాయణ లాంటి ప్రముఖులు చేస్తున్న కృషి ప్రశంసనీయం. అటువంటి కృషికి మనమంతా సహకరించాల్సిన అవసరం ఉన్నది. మన సమాజాన్ని, మానవ సమాజాన్ని మంచిగా తీర్చి దిద్దుకోవలసిన అవసరం మనుషులందరిపైనా ఉంది.

ప్రక్రుతి ద్వారా మనిషి శరీరానికున్న అసలు సిసలు పవర్ ని సక్రమంగా వినియోగించుకునేలా అత్యంత సహజ పద్ధతిలో జీవించే విధానమే ప్రకృతి జీవన విధానం. దీనికి సంబంధించిన కార్యక్రమాలను, అంశాలను ప్రచారం చేయడం, వీలయినంతమంది చేత ఆచరిమ్పజేయడమే 'పల్లెప్రపంచం' ఆశయంలో రెండవ అంశం. ఈ బ్లాగులో కూడా ప్రక్రుతి జీవన విధానంకు సంబంధిన ఆర్టికల్స్, మేము చేసే కార్యక్రమాల వివరాలను 'ప్రక్రుతి జీవన విధానంలేబుల్ క్రింద  ఉంచడం జరుగుతుంది.

భారతీయ సంస్కృతీ అంటే పల్లె సంస్కృతే !

గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందుతుందని మహాత్మా గాంధీ అన్నారు. భారతదేశం యొక్క ఆత్మ పల్లెల్లో ఉందన్నారు. అది అక్షర సత్యం. కానీ స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ళ తరువాత కూడా మనం వనరులున్నంత మేరకు పురోగతిని పల్లెల్లో సాధించలేదనే చెప్పాలి. 

ప్రపంచానికే నాగరికతను, సంస్కృతిని నేర్పిన భారతదేశంలో నేడు విదేశీ సంస్కృతి విషం చిమ్ముతోంది. నాగరికత అభివృద్ధి పేరుతొ మన మూలాలను మరచి దిగజారుడుతనానికి పాల్పడుతున్నవారు ఎక్కువవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. 

ప్రపంచీకరణ పేరుతో పాశ్చాత్య సంస్కృతి వెర్రితలలు వేస్తోంది. మన సంస్కృతిని నాశనం చేసేందుకు శక్తిమేరకు అది కృషి చేస్తున్నది. దాని బారిన పడకుండా మనలను మనం కాపాడుకోవాలి. మన పల్లెలను కాపాడుకోవాలి.

ఉదయాన్నే నిద్రలేచిన దగ్గరనుండి రాత్రివేళ పెందలాడే నిద్రపోయే వరకు, శ్రమలో, మనవ సంబంధాలలో, నాగరికతలో, కుటుంబ వ్యవస్థలో, ఆచార వ్యవహారాలలో, పలకరింపులో, ఆప్యాయతలలో, నేనున్నాననే భద్రతలో ఇలా....... అనేక విషయాలలో ప్రపంచంలో భారత దేశ సంస్కృతి  నేటికీ ఆదర్శవంతంగా ఉందనడంలో అతిశయోక్తి లేదు.

ప్రక్రుతి జీవన విధానానికి, మనవ సంబంధాలకు అత్యంత విలువనిచ్చే పల్లె సంస్కృతిని కాపాడుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.

అదే సందర్భంలో పల్లెల్లో అజ్ఞానం సమసి పోలేదు. ఇప్పటికీ మూడాచారాలు, మూఢ నమ్మకాలతో మన పల్లెలు సతమతమవుతున్నాయి. 

భారతీయ జీవన విధానాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలన్నా పల్లె సంస్కృతిని కాపాడుకోవాలి. పల్లె సంస్కృతిని కాపాడుకోవాలంటే పల్లెల్లో అజ్ఞానాన్ని నిర్మూలించేందుకు కృషి చేస్తూ, ఉన్నతమైన పల్లె సంస్కృతిలోని విలువలను కాపాడుకోవాలి. 

పల్లెను ప్రేమించే ప్రతి హ్రదయానికీ స్వాగతం !! పల్లెను ప్రేమించే ప్రతి హృదయ స్పందనకు మేము శాల్యుట్ చేస్తున్నాము.

అందుకు తన వంతుగా 'పల్లె ప్రపంచం మార్కెటింగ్ సర్వీసెస్' తరపున కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమ వివరాలను ఈ బ్లాగు ద్వారా పల్లెప్రపంచం లేబుల్ క్రింద  మీతో పంచుకోవడం జరుగుతుంది.

పర్యావరణాన్ని కాపాడుకుందాం అందరం ! మనమందరం !!

"పల్లె ప్రపంచం" విజన్ లో నాలుగో అంశం 'పర్యావరణ పరిరక్షణ'. నేడు ప్రపంచంలో మానవాళి ముందున్న అతి పెద్ద సవాల్ ఇదే. 

దీనికి కారణం ప్రక్రుతి వనరులను మితి మీరి వాడటమే. పల్లెల్లో సైతం పర్యావరణ సమస్యలు సంభవిస్తున్న రోజులు. సెల్ రేడియేషన్ తో సహా వాహనాల వాడకం ఇతర అనీ రకాల కాలుష్యాలు పెరిగి పోతున్నాయి. 

మనిషి తన అవసరాల కోసం ప్రక్రుతి మీద ఆధార పడతాడు. ప్రక్రుతి మనిషికి కావలసిన అవసరాలతో పటు సకల జీవ రాసుల అవసరాలను తీర్చగలుగుతుంది. ప్రకృతిలో ప్రతి జీవి ఒకదానిపై మరొకటి ఆధారపడేలా ఓ సమతుల్యం  ఉంది. దానిని దెబ్బతీసేలా ప్రక్రుతి వనరుల వాడకం ఉన్దకూదదు. అలాంటి సాంఘిక వ్యవస్థ ఏర్పడాల్సి ఉంది. మానవ చైతన్యం ఆ మేరకు అభివృద్ధి కావలసి ఉంది. 

ఉదాహరణకు మనం ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డై ఆక్సైడ్ ను వదులుతాము. చెట్లు మనం వదిలిన  కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుని మనకు కావలసిన ఆక్సిజన్ ను ఇస్తాయి. ఇలా ప్రకృతిలో ఓ చక్కని ఏర్పాటు ఉంది. దానిని మనం దెబ్బ తీస్తున్నాం. విపరీతమైన లాభాపేక్షతో మితిమీరిన విధంగా ప్రక్రుతి వనరులను వాడుతున్నాం. ఇది చాలా ప్రమాదం . మనవ మనుగడకే పెను సవాల్ . 

లాభాపేక్షతో పాటు అవగాహనలేమి కూడా దీనికి కారణం. ప్రజలలో అవగాహన పెంచితే మనకు మనుగడకు అవకాశంగా ఉన్న ప్రకృతిని - నాశనం చేస్తున్న, పర్యావరణానికి అవరోధంగా నిలుస్తున్న శక్తులను అడ్డుకునే శక్తి పెరుగుతుంది. ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలు తీసుకునేల ప్రజలనుండి ఒత్తిడి పెంచవచ్చు. 

ప్రపంచ వ్యాపితంగా ప్రజలంతా కలసి కాపాడుకోవలసిన పర్యావరణ అంశంపై మనం చైతన్యం పెంచుకోవాలి. అవగాహన పెంచుకోవాలి. ఆ విషయాలను నలుగురితో పంచుకోవాలి. 

పర్యావరణ పరిరక్షణలో భాగంగా పల్లె ప్రపంచం మార్కెటింగ్ సర్వీసెస్ తరపున మేము కుడా చంద్రునికో నూలుపోగులా సహకరించాలని నిర్ణయించడం జరిగింది. 

ఆ మేరకు మా శక్తి మేరకు పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడంతో పాటు పర్యావరణ అంశాలపై చైతన్యం కలిగించే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఆ వివరాలను ఈ బ్లాగులో పొందుపరచడం జరుగుతుంది. పర్యావరణ అంశాలపై ఆర్టికల్స్ ను మీతో ఈ బ్లాగు ద్వారా పర్యావరణం లేబుల్ క్రింద పంచుకోవడం జరుగుతుంది. 

ప్రకృతిని మనం కాపాడుదాం!  ప్రక్రుతి మనలను కాపాడుతుంది !!

'వ్యక్తిత్వ వికాసం' శిక్షణ ఎలా సాగాలి ?

"వ్యక్తిత్వ వికాసం "  అనే మాట  దాదాపు ప్రతి నిత్యం వింటుంటాం. ఈ మధ్య టీ.వీ ప్రోగ్రాములలో కూడా ఉదయం లేదా ఏదో ఒక సమయంలో ఏదో ఒక టీ.వీలో ఈ కార్యక్రమం మనకు కనబడుతున్నది. వ్యక్తిత్వ వికాస శిక్షకుల సంఖ్యా పెరుగుతున్నది. 

ప్రతి సంస్థ తమ సభ్యులనుండి మెరుగైన సేవలందించేందుకు ఈ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాము. 

ప్రతి మేగజైన్‌లో ఈ అంశంపై ఆర్టికల్ తప్పనిసరిగా ఉంటున్నది. ప్రతి దినపత్రికలోనూ ఏదో ఒక రూపంలో వ్యక్తిత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ రోజూ వస్తూనే ఉన్నాయి.

ఇలా ఏదో ఒక రూపంలో వ్యక్తిత్వ వికాస అంశాలు మనకు వినిపిస్తూనో, కనిపిస్తూనో ఉంటున్నాయి. 

మానసిక వైద్య రంగంలో కూడా బిహెవియర్ థెరపీకి ప్రాధాన్యత సంతరించుకున్న నేపధ్యంలో కౌన్సిలింగ్ సెంటర్లకూ ప్రాధాన్యం పెరిగింది.  నేటి బిజీ గజి-బిజి యాంత్రిక జీవన విధానంలో అసలు ఏది వ్యక్తిత్వమో ఏది కాదో అర్ధం కావడం, చర్చించడమూ కష్టంగానే ఉంది. 

కొందరైతే ఈ వ్యక్తిత్వవికాస శిక్షకుల అభిప్రాయాలను తప్పు పడుతున్నారు. వారు చెప్పేవి బోగస్ అంటూ కొట్టి పారేసేవారూ ఉన్నారు. కేవలం వ్యక్తులను డబ్బు సంపాదించే యంత్రాలుగా తీర్చి దిద్దడమే పనిగా వ్యక్తిత్వవికాస శిక్షకులు పని చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో 'వ్యక్తిత్వవికాసం' అంటే ఏమిటి? ఏది అసలు సిసలు వ్యక్తిత్వం? అనేది ఎలా తేల్చాలి? అనే అంశం కొంచెం సంక్లిష్టమైనదనే చెప్పాలి. 

వ్యక్తిత్వం గురించి చెప్పడం తేలికే. కానీ ఇప్పటి ట్రెండ్ లో దానిని ఒప్పించి మెప్పించడమే కొంచెం ఆలోచించాల్సిన విషయం. 

'పల్లెప్రపంచం' విజన్‌లో మనోవైజ్ఞానిక శిక్షణలో భాగంగా 'వ్యక్తిత్వ వికాసం' లేబుల్ ద్వారా చర్చించడం ప్రారంభించడం మొదటిది కాగా, అసలు వ్యక్తిత్వ వికాసం పేరుతో నేడు జరుగుతున్న చర్చలన్నీ సరైనవేనా? అనేదానిలో మీ అభిప్రాయాలు తెలుసుకోవడం రెండోది.

కనుక 'వ్యక్తిత్వ వికాసం' అనే అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? ఏది అసలైన వ్యక్తిత్వం? వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటి? ప్రస్తుతం ఈ అంశం పై జరుగుతున్న కార్యక్రమాలలో లోపాలు, మంచి చేడులు మీకనిపించినవి నిర్మొహమాటంగా తెలియజేయగలరు. 

ప్రతి ఆదివారం ఆసక్తి ఉన్న వారితో " మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ" అనే శిక్షణా కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది.

తాళపత్రం నుండి 'ఈ బుక్' వరకూ రూపమేదైనా 
గ్రంధాలకున్న ప్రాధాన్యం తగ్గదు కదా?

మనిషి మనసు ప్రధానమైనవాడు. తన కున్న జ్ఞానంతో మనిషి ప్రకృతిలోని అంశాలను పరిశీలిస్తుంటాడు. అనుభవాల ద్వారా వివిధ విషయాలపై కొన్ని భావాలు ఏర్పరచుకుంటాడు. వాటిని భాష ద్వారా వ్యక్తపరుస్తుంటాడు. ఆ భాష లేదా భావం ముందు తరాలవారికి ఉపయోగపడాలనే అవసరం లో నుండి పుట్టిందే గ్రంధం. తాళపత్రం నుండి 'ఈ బుక్' వరకూ రూపమేదైనా గ్రంధాలకున్న ప్రాధాన్యం తగ్గలేదు. తగ్గదు కూడా!

ప్రముఖ వ్యక్తుల అభిప్రాయాలు వారు మన మధ్య లేకున్నా నిత్యం సమాజాన్ని ప్రభావితం చేసేందుకు వారి రచనలు ఉపయోగపడతాయి.

మన చుట్టూ ఉండే వ్యక్తుల ప్రభావానికి మనం లోనవుతుంటాం. అలాంటప్పుడు వ్యక్తి చైతన్యం చుట్టూ ఉండే వ్యక్తుల స్థాయిని బట్టి కూడా వికసించే అవకాశం ఉంది. మన చుట్టూ ఉన్నవారు సాధారణ చైతన్యం కలిగిన వారైతే మనకూ చైతన్య స్థాయి పెరిగే అవకాశం ఉండదు. అదే ఓ పుస్తక అధ్యయనం అలవరచుకుంటే మన చైతన్యం చాలా రెట్లు ఎదిగే అవకాశం కలుగుతుంది. 

అయితే, ఏ పుస్తకాలు చదవాలి? అనేది ఎంచుకునే చైతన్యం మళ్లీ ఇందులో ప్రధానం. కొందరు మహానుభావుల రచనలు, సైద్ధాంతిక గ్రంధాలు, శాస్త్రీయ అవగాహనను కలిగించే గ్రంధాలు చదివితే మనకొచ్చే అనేక సందేహాలు తొలగిపోతాయి.

చిన్నపిల్లలకు బుక్స్ చదవడం అలవాటు చేయాలి. గతంలో బాలమిత్ర-చందమామ వంటి పిల్లల సాహిత్యం ఉండేది. ఇపుడేమో టీ.వీల మయం. అధ్యయనానికి ఆసక్తి  తగ్గుతున్నది. నేర్పేవారూ తక్కువే. బిజీ గజిబిజి జీవన విధానం కదా? కానీ టీ.వీ లు వచ్చినా పుస్తకానికుండే ప్రాధాన్యత ఇంకా ఉందనే నా అభిప్రాయం.

పుస్తక అధ్యయనాన్ని అందరిలో పెంచాలనేది పల్లెప్రపంచం విజన్ లో చివరి అంశం. అలా ఆశక్తి ఉన్నవారి ప్రతి ఇంటా అవసరమైన మంచి సాహిత్యంతో ఇంటింటా గ్రంధాలయాలు ఏర్పరచాలన్నది లక్ష్యం. 

ఎంత వీలయితే అంత కృషి ఈ మేరకు చేయాలన్నదే ఆలోచన. ఎంతమేరకు సక్సెస్ అవుతామో చూడాలి. సంస్థ ద్వారా మార్కెటింగ్ చేసే బుక్స్ లో మంచి పుస్తకాలను ఎంపిక చేసి మార్కెటింగ్ చేయాలనేది నిర్ణయైంచడం జరిగింది. అలా చేసే కార్యక్రమ వివరాలను ఎప్పటికప్పుడు ఈ బ్లాగులో కూడా సాహిత్యం అనే లేబుల్ క్రింద ఉంచడం జరుగుతుంది. మీ అందరి మద్దతు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి.


మంచి బుక్స్ ఏవి? చిన్న పిల్లలకు అధ్యయనం అలవాటుగా పెంచేందుకు ఉపయోగపడే సాహిత్యం, వారిలో శాస్త్రీయ భావాలను రేకెత్తించేవి, సమస్యలను ఎదుర్కునే శక్తిని పెంచేవి ఏవి ఉన్నా మీలో చదివి అనుభవం ద్వారా గ్రహించినవారు వివరాలు తెలియజేస్తే ఈ కార్యక్రమానికి మీరు మేలు చేసినవారవుతారు. ఆ మేరకు మీరు మద్దతు ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి.

పై ఐదు అంశాల ద్వారా మా వంతుగా కార్యక్రమాలు నిర్వహించేందుకు నిర్ణయించడం జరిగింది. ఓ ఏడాదిపాటు చర్చల అనంతరం ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నాము. ఇప్పటికే కొందరు ఆచరణలో ఉన్నారు. వాటి వివరాలను ఈ వారం పల్లెప్రపంచం లేబుల్ క్రింద ప్రతి వారం విజన్ ఆచరణకు సంబంధించిన కార్యక్రమాలను వివరించే ప్రయత్నం చేస్తాను. మీరూ మా కార్యక్రమాలకు మద్దతివ్వలని కోరుతున్నాం. ఓ మంచి పనికి మీరిచ్చే మద్దతు కూడా తప్పక ఉపయోగపడుతుంది. మీ బ్లాగులలో పల్లెప్రపంచం కు మద్దతివ్వదలచుకుంటే క్రింది కోడ్ ను ఉపయోగించండి. 
<center><a href='http://blog.palleprapancham.in' target='_palle'><img src="http://3.bp.blogspot.com/-hkzz3MBLbUY/Uj6S4yN3EII/AAAAAAAAG_A/EEGrrW-xm8U/s1600/Palle+Prapancham.jpg" /></a></center>
అందరికీ ధన్యవాదములు.
Reactions:

Post a Comment

  1. bagundi mee vision ...nenu elanti project prepare chestunna...mee list lo vunna anni naa list lo vunanduku naku chala santosham ga vundi....updates regular ga post cheyagalaru....

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top