• ఇపుడంటే రాజకీయాలకోసం విగ్రహాలు ఆగ్రహాలు చూస్తున్నాము. 
 • కానీ పాత తరం నేతల విగ్రహాలు చూసినప్పుడు దేశభక్తి గుర్తుకు రావడం సహజం. 
 • భారత దేశమంతటా గ్రామాలలో మనకు రెండు విగ్రహాలు కనిపిస్తాయి. 
 • అవి : - 1) జాతిపిత మహాత్మాగాంధీ 2) రాజ్యాంగనిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్. 
 • అయితే ఈ రెండూ విగ్రహాలు పరిశీలిస్తే ఓ విచిత్రం కనిపిస్తుంది.
 • సహజం గా వారి పుట్టి పెరిగిన కుటుంబాల పరిస్తితుల ప్రకారం కాక గాంధీజి వంటి పై బట్టలు లేకుండా  కనిపిస్తే , బాబాసాహెబ్ నిండుగా బట్టలతో సూటూ బూటుతో కనిపిస్తారు.
 • తాము పుట్టిన వర్గాలకు భిన్నమైన ఆకృతి కనుపడుతుందీ విగ్రహాలలో. 
 • కేవలం విగ్రహాలలోనే కాదు ఆయా వర్గాలలో కూడా సమాజంలో ఎదుగుదల రీత్యా చూసినా నేటికీ భిన్నమైన పరిస్తితే కనిపిస్తుంది.
 • దాదాపు ప్రతి పల్లెలో నేటికీ ఈ పరిస్తితి ఇంకా మెరుగుపడాల్సే ఉందని చెప్పవచ్చు.
 • వీరిరువురూ కోరుకున్న గ్రామ స్వరాజ్యం , అస్పృస్యతా నివారణ మాత్రం ఇన్నేళ్ల స్వతంత్ర భారతావనిలో నేటికీ రాకపోవడం దురదృష్టకరం. నేటికీ కులాల కొట్లాటలు, మత మారణ హోమాలు జరుగుతుండడం బాధాకరం.
 • వీరిరువురినీ ఏ ఒక్క వర్గానికో ప్రతినిధులుగా మనం చూడలేము. మన జాతీ చూడడం లేదనేది నిర్వివాదాంశం.
 • కులవివక్ష లేని గ్రామీణ భారతావని కోసం , గ్రామ స్వరజ్యం కోసం పోరాడాల్సిన అవసరం మనందరిపైనా ఉన్నది.
Reactions:

Post a Comment

 1. మంచి తేడాను పట్టారు.
  ఆయా వర్గాల ఆత్మన్యూనత, ఆకాంక్షలకు తగిన విధంగా అంబేత్కర్ విగ్రహారాధన చేసుకుంటే, అన్నీవున్నా త్యాగం చేసిన గుర్తుగా గాంధీ నిరాడంబరంగా కనిపిస్తాడు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top