మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ - 1

'వ్యక్తిత్వ వికాసం' సబ్జెక్ట్ కేవలం డబ్బు సంపాదించిపెట్టే 'సరుకు'గా మారకూడదు !

(ఒరిజినల్ గా ఈ చిత్రాలను ఉంచినవారికి ధన్యవాదములు. గూగుల్ సెర్చ్ ద్వారా ఈ పోస్టుకోసం సేకరించినవి)

" వ్యక్తిత్వ వికాసం "

ఈ పదం ప్రస్తుతం విస్తృతంగా వాడుకలో ఉంటోంది.

టీ.వీ లలో - పత్రికలలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఆర్టికల్స్ విస్తృతంగా చర్చిస్తున్నారు. పోటీ పరీక్షలలో నెగ్గేందుకు, విజయాలు సాధించేందుకు పర్సనాలిటీ డెవలపమెంట్ ట్రైనింగులు తీసుకుంటున్నారు. కౌన్సిలింగ్ సెంటర్లు, వ్యక్తిత్వ వికాస శిక్షకులు పెరుగుతున్నారు. 

ఈ అంశంపై శిక్షకులు ఇస్తున్న ట్రైనింగులు - వారు చెపుతున్న అంశాలపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నవారున్నారు.  ఇదంతా ఓ వ్యామోహంలా మారుతున్నదని ఈ శిక్షకులు చెప్పే విషయాలు అసలు సిసలు వ్యక్తిత్వం కాదని,  కేవలం విజయం సాధించడమో,  డబ్బు సంపాదించడమో మాత్రమే వ్యక్తిత్వ వికాసం అనుకోవడం పొరపాటే అవుతుందనే విమర్శలూ ఉన్నాయి.  డబ్బు సంపాదనను, విజయాలను సాధిస్తేనే వ్యక్తిత్వం వికసించినట్లు వీరు పదే పదే చెప్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. శిక్షకులు డబ్బు సంపాదించేందుకు వ్యక్తిత్వ వికాస శిక్షణ అనేది కూడా ఓ అంశంగా ఉపయోగపడుతోందంటున్నవారూ ఉన్నారు.

వ్యక్తిత్వ వికాసం అనే సబ్జెక్ట్ కేవలం డబ్బు సంపాదించిపెట్టే 'సరుకు'గా మారకూడదు.

పల్లెప్రపంచం విజన్ లో 5వ అంశం మనో వైజ్ఞానిక శిక్షణలో భాగంగా మేము గ్రామీణ ప్రాంతాలవారితో పాటు ఇతరులకు వ్యక్తిత్వ వికాసం శిక్షణ కోసం ఓ సబ్జెక్ట్ ని తయారు చేయడం జరిగింది. ' మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ' అనే శీర్షికతో ఉన్న ఆ సబ్జెక్ట్ ను, వ్యక్తిత్వ వికాసం కు సంబంధించి నేను శిక్షణ తీసుకున్నవి, చదివినవీ, నాకు సరయినవి అనిపించినవి, వ్యక్తిగత చైతన్యం పెంచేందుకు ఉపయోగపడేవి, చర్చలలో నేర్చుకున్నవీ, వ్యక్తిత్వం రూపు దిద్దేందుకు పనికి వస్తాయనుకున్న అంశాలను పోస్టులుగా ఈ బ్లాగులో ఉంచాలని నిర్ణయించుకున్నాను.  ఇంతక్రితం కూడా ఈ అంశంపై కొన్ని పోస్టులు వ్రాశాను. అప్పుడప్పుడు వ్రాసిన పోస్టులను డ్రాఫ్టులుగా మార్చడం జరిగింది. ఆ పోస్టులను కూడా తిరిగి అవసరమనిపించినప్పుడు పబ్లిష్ చేయడం జరుగుతుంది.

వ్యక్తిత్వ వికాసం అనే సబ్జెక్ట్‌ని శాస్త్రీయంగా రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నాను. 

ఈ పోస్టులకు సంబంధించి మీ అందరి అభిప్రాయాలు పంచుకుంటే మరింత మెరుగైన సబ్జెక్ట్ అందరికీ ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ సబ్జెక్టుకు సంబంధించి ఇప్పటికే జరుగుతున్న కృషికి పల్లెప్రపంచం చేస్తున్న ప్రయత్నం కూడా తోడవుతుంది. మన బ్లాగు ప్రపంచంలో కూడా ఈ అంశంపై ఆసక్తి ఉన్నవారు, పోస్టులు వ్రాస్తున్న వారూ ఉన్నారు. అలాంటి ఆసక్తి కలిగినవారు, ఈ పోస్టులు చదివిన వారు తమ అభిప్రాయాలను తెలియజేస్తే ఈ సబ్జెక్టుకు మెరుగులు దిద్దేందుకు ఉపయుక్తంగా ఉంటుంది.

ఈ అంశంపై తరువాతి పోస్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top