• నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు కన్ను మూశారు. గత కొద్ది కాలంగా క్యాన్సర్  వ్యాధితో బాధ పడుతున్న ఆయన  ఆరోగ్యం విషమించడంతో కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి తుది శ్వాస విడిచారు. 
 • ఓ మారు మూల పల్లెటూరిలో పుట్టి అంతగా చదువుకోకున్నా పట్టుదలతో ఇంతింతై... వటుడింతై.... అన్నట్లు ఎదిగిన అక్కినేని జీవితం అనేక విషయాలలో స్పూర్తినిస్తుంది.
 • ఎఎన్ఆర్ తెలుగు పరిశ్రమ తొలితరం హీరో. ఆయన హీరోగా సుమారు 256 పైగా సినిమాల్లో నటించారు. 
 • తెలుగు పరిశ్రమలో హీరోగా చెరగని ముద్ర వేసుకున్న నాగేశ్వర్ రావు స్వస్థలం కృష్ణ జిల్లా వెంకటరాఘవాపురం. 1923 సెప్టెంబర్ 20న  వెంకటరత్నం, పుణ్ణమ్మలకు జన్మించారు. 
 • నాగేశ్వర్ రావు నటుడిగా ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. ప్రతిష్టాత్మక  దాదా సాహెబ్ పాల్కె అవార్డు, పద్మ విభూషణ్, రాఘుపతి వెంటయ్య అవార్డులు గెలుచుకున్నారు. 
 • 1944మే 8న 'ధర్మపత్ని' సినిమాతో సినీనటుడిగా తెరంగేట్రం చేశారు. అప్పటి నుంచి తన తుది శ్వాస విడిచే వరకు అవిశ్రాంతంగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. 
 • ఎన్టీఆర్ కు సమకాలికుడైన నాగేశ్వరావుకు  దేవదాసు,  మట్టి మనుషులు, ఒకే ఒక్కడు వంటి చిత్రాలు హీరోగా పేరు తెచ్చిన సినిమాలు. అలాగే ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘీక, సామాజిక చిత్రాల్లో నటించారు. 
 • అక్కినేనికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సినిమా రంగంలో తన కుమారుడు అక్కినేని నాగార్జున నటుడిగా రాణిస్తున్నారు. ఆయన మృతికి యావత్ సినీ ఇండస్ట్రీ షాక్ గురైంది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 

  Reactions:

  Post a Comment

  1. మన తెలుగు సినిమా మొదటి తరంతో సంబంధం తెగిపోయింది. చిన్నప్పుడు సినిమా అంటే నాగేస్పర్రావు సినిమా లేదంటే ఎన్‌టీవోడి సినిమా అంతే. అంతగా మనకు మన ఇంట్లో మనిషిలాగ తెలిసిన వ్యక్తి......వ్రాయాలేకపోతున్నాను, స్క్రీన్ కనపడటం లేదు.

   మన నాగేశ్వర్రావు ఆత్మకు శాంతి కలుగుగాక.

   ReplyDelete

  * మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
  * పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
  * నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
  * పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
  * ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
  * అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
  * తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
  * మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
  * మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
  * తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

  p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
   
  Top