మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ - 2

(ఈ చిత్రాలను గూగుల్ సెర్చ్ ద్వారా సేకరించడమైనది. ఒరిజినల్ గా వాటిని ఉంచిన వారికి ధన్యవాదములు) 


వ్యక్తిత్వం అంటే ఏమిటి? వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటి?

క్లుప్తంగా చెప్పాలంటే!

వ్యక్తి + తత్వం = వ్యక్తిత్వం 

 చెడుని త్రుంచి మంచిని పెంచే శక్తిని పెంచుకునేందుకు నిరంతరం ప్రయత్నించడమే వ్యక్తిత్వ వికాసం!

వ్యక్తి అంటే మనిషి. మనిషిని నిర్వచనంగా చెప్పాలంటే 'మనసు ప్రధానమైన జీవి' అని చెప్పాలి. జీవులలో లేదా జంతువులలో మనిషి ప్రత్యేకతే వ్యక్తిత్వం. అంటే ఆలోచించగలగడం. ఆలోచించడం అనేది మనిషి ప్రత్యేకత. మనిషి మాత్రమే ఆలోచించి పని చేస్తాడు. పాతవాటిని ఆధారం చేసుకుని కొత్త విషయాలను కనిపెట్టగలడు. కొత్తగా శ్రమతో పనులు చేసి కొత్త వస్తువులను సృష్టించగలడు. తన అవసరాల రీత్యా ప్రక్రుతిపైనా, తోటి మనుషులపైనా ఆధారపడుతూ తన మేధస్సుతో ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ పురోగతి సాధిస్తుంటాడు. ప్రక్రుతిలో ఉన్నవాటిని యధాతధంగా వాడుకోవడం కాకుండా ప్రక్రుతిని ఆధారం చేసుకుని ప్రక్రుతిని తనకు అనుకూలంగా మార్చుకుంటుంటాడు.

ప్రక్రుతిలో ఇతర జీవులన్నీ సహజాతమైన అంశాలతో మనుగడ సాధిస్తుంటే మనిషి మాత్రమే భిన్నంగా ప్రవర్తిస్తాడు. అదే వ్యక్తిత్వం ప్రత్యేకత. ఇతర జీవులన్నీ తరతరాలుగా ఒకేలా ప్రక్రుతిని ఆధారం చేసుకుని ఒకే పద్ధతిలో మనుగడ సాగిస్తుంటే, మనిషి మాత్రం నిరంతరం అభివృద్ధి చేందుతున్నాడు. తనను తాను మార్చుకుంటూ ముందడుగు వేస్తున్నాడు. ఆదిమ మానవుని స్తితినుండి నేటి ఆధునిక మనిషి వరకూ ఎన్నో, ఎన్నెన్నో సాధిస్తున్నాడు.

వ్యక్తి యొక్క ప్రవర్తనను బట్టి అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తాము. ఓ వ్యక్తి ప్రవర్తన అనేది పరిస్తితులని బట్టి ప్రభావితమవుతుందే తప్ప పుట్టుకతోనే నిర్ణయం కావడం కానీ, తలరాతను బట్టిగానీ ఉండదు.

అయితే మనుషులంతా ఒకేరకంగా ప్రవర్తిసున్నారా? ఒకే రకంగా ఆలోచిస్తున్నారా? ఏ ఆలోచన సరయినది? ఎలా ఆలోచించాలి? ఎలా ప్రవర్తించాలి? ఈ ప్రశ్నలను బట్టి  'వ్యక్తిత్వ వికాసం' ను నిర్వచింపవచ్చు.

ప్రక్రుతిలో ప్రతీ దానిలో పరస్పర విరుద్ధ అంశాలున్నట్లే మనిషి ఆలోచనలలో, ప్రవర్తనలో కూడా పరస్పర విరుద్ధ అంశాలున్నాయి.

క్లుప్తంగా సూత్రీకరించాలంటే ఆ రెండు : 1) మంచి 2) చెడు. 

అయితే చాలా విషయాలలో ఏది మంచి? ఏది చెడు? తేల్చవచ్చు. కొన్ని విషయాలలో కొందరికి మంచి అనిపించింది కొందరికి చెడుగా అనిపిస్తుంది. కొందరి నమ్మకాలు కొందరికి నచ్చవు. ఇలా భిన్నమైన అంశాలున్నట్లే ప్రపంచ వ్యాపితంగా మనిషి ఎక్కడున్నా ఒకేరకమైన సారూప్యాలుంటాయి. మనుషులందరికీ ఆమోదయోగ్యమైన ప్రవర్తనా నియమావలి ఏర్పాటు చేసుకోవడం అసాధ్యం - అభ్యంతరకరం కాకపోవచ్చు. కానీ అంత తేలికైన అంశం మాత్రం కాదు.

మన చర్యల ద్వారా 'మంచిని పెంచడం - చెడుని త్రుంచడం' అనే రెండు కార్యాలు చేయగలిగే మనోశక్తిని నిరంతరం అభివృద్ధి చేసుకోవడమే వ్యక్తిత్వ వికాసం!

ఇతరులకు హాని కలుగకుండా ప్రక్రుతిని ఆధారం చేసుకుని తన జీవితాన్ని మెరుగుపరచుకుంటూ ఇతరులకోసం బ్రతకకగలిగే చైతన్యాన్ని పెంచుకోవడమే వ్యక్తిత్వ వికాసం అవుతుంది. జీవితంలో నిరంతరం ఎదురయ్యే సంఘటనలనుండీ, అనుభవాలనుండీ, గతకాలపు వ్యక్తుల జీవితానుభవాలనుండీ మంచి-చెడులను బేరీజు వేసుకుంటూ ఏమిటి? ఎందుకు? ఎలా? అనే హేతుబద్ధతతో మనలను మనం నిరంతరం మార్చుకుంటూ, తీర్చిదిద్దుకోవడమే వ్యక్తిత్వ వికాసం అవుతుంది.

ఇందుకు అనేక అంశాలు ఉపయోగపడతాయి. ఆయుధాలుగా పనికి వస్తాయి. పనికి వచ్చే ప్రతీ ఆయుధాన్నీ పదును పెట్టుకోవడం - సరిగా వాడుకోవడం చేసేవారు విజయాలు సాధించడం ఖాయం.

మీరూ 'విజేత'గా మారగలరు! - కొత్తగా  'ప్రయత్నించడం'  మొదలెట్టడమే చేయాల్సినది!

Best of work !
ఈ అంశంపై తరువాతి పోస్టు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Reactions:

Post a Comment

  1. వ్యక్తిత్వం వికాసం గురించి మీరు వ్రాసిన వ్యాసం బావుంది . విషయాన్ని సరళంగా చెప్పారు . అయితే ఈ వ్యాసం ముందు ముందు మీరు చెప్పదలచుకున్న ఎన్నో విషయాలకు ఒక ఉపక్రమణికగా ఉంది. వ్యక్తిత్వ వికాసం గురించి మీ వ్యాసంలో సూచనాప్రాయంగా పేర్కొన్న ఎన్నో అంశాలను వివరణాత్మకంగా , ఎన్నో ఉదాహరణలతో మరిన్ని వ్యాసాలను వెలువరించగలరని మనవి .

    ReplyDelete
    Replies
    1. కామెంట్ కు ధన్యవాదములు. వీలుని బట్టి నాకు తెలిసినవీ, నా అనుభవంలో వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే ప్రతీ అంశాన్నీ వివరించేందుకు ప్రయత్నిస్తాను రాజా కిషోర్ గారు.

      Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top