Reactions:

Post a Comment

 1. రాష్ట్రాల అభిప్రాయాలకు తప్పక విలువ ఇవ్వవలసిందే.
  అసలు రాష్ట్రాల అభిప్రాయాలకు విలువ ఏమీ ఉండని పక్షంలో అది రాష్ట్రాల్ని బానిసల స్థాయికి నెడుతుంది.
  రాష్ట్రాల అభిప్రాయాలని పరిగణనలోనికి తీసుకొని చర్చించాలి.
  స్థానికప్రజల అవసరాలు సమస్యల గురించి రాష్ట్రానికి కాక రాష్ట్రేతరులకు మరింత బాగా తెలిసే అవకాశం‌ నిస్సందేహంగా తక్కువ.
  సకృత్తుగా ఒక రాష్ట్రం యొక్క అభిప్రాయాలు మొత్తంగా వీగిపోతే వీగిపోవచ్చును గాక. అసలు వాటి ముఖం చూడకుండానే నిర్ణయాలు చేయటం కేవలం పెత్తనమే. దాని లబ్ధిదారులు ఎగిరి గంతులు వేస్తూ అమోదించవచ్చును కాని అది నిర్మొగమాటంగా చెప్పాలంటే తీవ్రమైన దుస్సంప్రదాయం. అటువంటి నిరంకుశచర్యలు దేశవిఛ్ఛిత్తికి దారులు పరుస్తాయని గ్రహించాలి!

  ReplyDelete
  Replies
  1. రాష్ట్రం తనలోని ఒక ప్రాంతం వారి అభిప్రాయాలకు విలువనిస్తే, దానీ అభిప్రాయాలకూ తప్పక విలువ ఇవ్వవలసిందే.

   అసలు రాష్ట్రంలోని మూడుకోట్ల ప్రజలు కలిగిన ప్రాంతపు అభిప్రాయాలకు విలువ ఏమీ ఉండని పక్షంలో అది ఆ ప్రాంతపు ప్రజలను బానిసల స్థాయికి నెడుతుంది.

   తెలంగాణా ప్రాంతీయులకు విభజిస్తామని నమ్మబలికి, వారి అభిప్రాయాలని పరిగణనలోనికి తీసుకొని గత పదేళ్ళలో చర్చించకుండా మందబలంతో ఆపిన వారికి మంచి మాటలతో ఎంత నచ్చజెప్పినా ఫలితం ఉంటుందనుకోవడం ఒక పెద్ద అపోహ.

   మూజువాణి వోటుతో ధిక్కరించ జూసినవారికి అదే మూజువాణి వోటుతో సమాధానం చెప్పడమే సరియైన పద్ధతి.


   స్థానికప్రజల అవసరాలు సమస్యల గురించి ఆ ప్రాంతం వారికి కాక రాష్ట్రంలోని ప్రాంతేతరులకు మరింత బాగా తెలిసే అవకాశం‌ నిస్సందేహంగా తక్కువ. కాబట్టి ప్రాంతం వారు విభజన కోరినప్పుడు దాన్ని గౌరవించి సానుకూలంగా ప్రవర్తించడం మెజారిటీ ప్రాంతం వారి కనీస బాధ్యత. దాన్ని వారు విస్మరించారు, ఇంకా తమ పంతం నెగ్గించుకొని పెత్తనం చేయ జూస్తున్నారు.

   అసెంబ్లీలో మెజారిటీ లేక పోవడం వల్ల ఒక ప్రాంతం యొక్క అభిప్రాయాలు మొత్తంగా వీగిపోతే వీగిపోవచ్చును గాక. అసలు వాటి ముఖం చూడకుండానే సమైక్యవాద నిర్ణయాలు చేయటం, ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేసి కేంద్రాన్ని ప్రభావితం చేయ చూడడం కేవలం పెత్తనమే. దాన్ని దోపిడీదారులు ఎగిరి గంతులు వేస్తూ అమోదించవచ్చును కాని అది నిర్మొగమాటంగా చెప్పాలంటే తీవ్రమైన దుస్సంప్రదాయం. అటువంటి నిరంకుశచర్యలు దేశవిఛ్ఛిత్తికి దారులు పరుస్తాయని గ్రహించాలి!

   చూశారా శ్యామలీయం గారూ, మీమాటలు నిజానికి తెలంగాణాకే ఏవిధంగా వర్తిస్తాయో!

   Delete
  2. ప్రభుత్వం ఆంద్ర శాసనసభ్యుల అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదని అనలేము. రెండు ఘంటల సేపు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ముగ్గురు ఆంద్ర మంత్రులు కూడా ఉన్నారు.

   ఈ మాత్రం మర్యాద & విచక్షణ ఆంధ్ర ముఖ్యమంత్రికి లేకపోయింది. తెలంగాణా ప్రాంత మంత్రులకు ఒక్క మాటయినా చెప్పకుండా, కేవలం ఆంద్ర వారిని మాత్రమె సంప్రదించి అన్ని నియమాలను తుంగలో తొక్కి తన ఇష్టానుసారంగా విర్రవీగాడు. ఆయనకు ఆంద్ర మంత్రులు & సభాపతులు వంతపాడారు.

   Delete
  3. "స్థానికప్రజల అవసరాలు సమస్యల గురించి రాష్ట్రానికి కాక రాష్ట్రేతరులకు మరింత బాగా తెలిసే అవకాశం‌ నిస్సందేహంగా తక్కువ"

   నిజమే సుమండీ. మరి ఇన్నేళ్ళుగా తెలంగాణా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని తాఖీదులు ఇచ్చిన ఆంద్ర వారిని ఎందుకు నమ్మాం చెప్మా.

   Delete
 2. ప్రస్తుతం జరిగినది, జరుగుతున్నది ఏమిటంటే ఇన్నాళ్ళు మరొకరిపై(రాష్ట్రంలో) మంద బలం చూపిస్తూ ఎదురులేని అధికారాలు అనుభవిస్తూ అవతలి వారి నిస్సహాయతకు వెక్కిరిస్తూ హప్పిగా ఉన్నారు. ఇప్పుడు అదే మంద పలం(కేంద్రంలో) ఎదుర్కోవలసి వచ్చి ఎదుర్కోలేక బిక్కర మొహాలు పెట్టుకొని ఏడుపులు పెడ బొబ్బలు పెడుతున్నారు. చేసుకున్నోనికి చేసుకున్నంత అని ఊరికే అనలేదు.

  ఇక అసలు ప్రశ్నకు జవాబు అసెంబ్లీ సక్రమంగా జరిగి అన్ని వర్గాల వారు స్వతంత్రంగా అభిప్రాయాలు వ్యక్తపరిస్తే అప్పుడు దానికి విలువ ఇవ్వొచ్చు. ప్రస్తుతం అసెంబ్లీలో జరిగింది అది కాదు కదా!

  ReplyDelete
 3. Srikanth chary garu!
  What a fitting reply! well done!
  During the discussions in State Assembly, many Telangana MLAs explained how Telanagana was ditched and humiliated in last 58 years. None of the Seemandhra MLAs could reply and condemn those facts. They could not answer Eetela Rajender. They could not answer Akbaruddin Owisi. They could not answer Ramarao. They could not answer Kishan reddy... Harish rao.... whom so ever. Leave the case of Congress. Can they answer why majority of parties in the Parliament are supporting Telangana, if it is injustice? If they had not taken any undue advantage by suppressing Telangana for last 58 years, what is that they are losing now? Why are they crying? Why are they behaving indecently? Entire world is laughing at their selfishness and crookedness.

  ReplyDelete
 4. అమ్మ తనకు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చినందుకు అమ్మ కోరిక మేరకు ఈ నాటకాన్ని విజయవంతం చేయడం తన బాధ్యతగా భావించారు కిరణ్‌. ‘‘విష్ణుభక్తులైన జయవిజయులు స్వామి ఆగ్రహానికి గురై శాపం పొందబోతూ భక్తులుగా ఆరు జన్మలు స్వామికి దూరమౌతారా? శత్రువులుగా మూడు జన్మలు దూరమౌతారా అని అడిగితే స్వామిని తొందరగా తిరిగి చేరుకోవడానికి శత్రువులుగానే ఉంటాం అని ఎంచుకున్నారట. హిరణ్యకశిపాది దృష్టాంతాలు దానికి సంబంధించినవే.’’ ఆ తరహాలో అధినేత్రి సోనియమ్మను అతిత్వరగా ప్రసన్నం చేసుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా వైరభక్తి మార్గాన్ని ఎంచుకున్నారు.. From GreatAndhra.

  ReplyDelete
 5. ఈ విషయంపై లేవనెత్తిన దుమారాన్ని ఎండకట్టే నా టపా చూడండి:

  http://jaigottimukkala.blogspot.in/2014/02/article-3-federalism-and-bommai-case.html

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top