"తెలంగాణా పునర్నిర్మాణంతో బాటు, సామాజిక న్యాయం సాధించడం ఎలా?

ఈ ప్రశ్నను సూచించినవారు : జై గొట్టిముక్కల గారు.

తెలంగాణా ఏర్పాటు దాదాపు పూర్తయినట్లేనని చెప్పవచ్చు. ప్రస్తుతం నిజంగా తెలుగు ప్రజలపై ప్రేమ ఉన్నవారు ఇంకా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే ప్రయత్నాలు చేయడం వృధా అనుకుంటాను. మంచో చెడో బలవంతంగానో ఓట్లకోసమో అధికార ప్రధాన ప్రతిపక్షాలు తెలంగాణాను సమర్ధించాయి. 60 ఏండ్ల ఆ ప్రాంతవాసుల డిమాండ్ నెరవేరింది. ఇక చేయాల్సినది తెలంగాణా పునర్నిర్మాణం.

ఈ అంశంపై మీ అభిప్రాయాలను నిర్మాణాత్మకంగా తెలియజేయగలరా? 

Reactions:

Post a Comment

 1. తెలంగాణ పునర్నిర్మాణానికి ముఖ్యంగా ఇక్కడ నిర్లక్ష్యం చేయబడ్డ వ్యవసాయం, చేతివృత్తులకు యుద్ధప్రాతిపాదికన పునరుజ్జీవనం చేయాలి. క్రిష్ణా, గోదావరిలో తెలంగాణకు అలొకేట్ చేసిన నీటివాటాను పూర్తిగా వాడుకోవడానికి సరిపడా ప్రాజెక్టుల రూపకల్పన జరగాలి. అవి పూర్తయేలోపల చెరువులూ, కుంటలూ పూడికలకు ప్రభుత్వ సాయం ఇవ్వాలి, చెక్‌డాములు కట్టాలి, వర్షం ద్వారా పడిన ప్రతిబొట్టూ వాడకం జరగాలి. చేనేత, కుమ్మరి, కంసాలి, వడ్రంగ రంగాలకు ౠణసాయం, నూతన సాంకేతిక విధానాలు అందజేయాలి.

  తెలంగాణ సినిమాను అభివృద్ధి చేసుకోవాలి.

  తెలంగాణ అసెంబ్లీలో బీసీలు, మహిళలకు చట్టసభలలో రిజర్వేషన్లు ఏర్పాటుచేయాలి.

  ReplyDelete
  Replies
  1. Good ideas that are relevant to the question but I am still missing something.

   Delete
  2. ఇంకొన్ని ఐడియాలు:
   - అందరికీ క్వాలిటీ విద్యాబోధన అందుబాటులోకి రావాలి. డబ్బులు లేనివారుకూడా కేజీ నుండీ పీజీ వరకు ఉచితంగా చదవగలగాలి. దానికోసం గురుకుల పాఠశాలలూ, కళాశాలలకు పునరుజ్జీవనం జరగాలి, ప్రభుత్వ ఫండ్సు సరిపడేట్లుగా ఉండాలి (ప్రస్తుతం ఫండ్సు రావడంలేదు). కార్పోరేట్ విద్యకు పోటీగా గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో కూడా ఆంగ్లమాధ్యమంలో కూడా బోధన జరగాలి.
   -ప్రభుత్వరంగంలో ఇంజినీరింగ్, మెడికల్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీల రూపకల్పన జరగాలి.
   -ఇంటర్ వరకూ అన్ని స్కూళ్ళు, కాలేజీల్లో ఒకేరకం బోధన, సాధ్యమయినంతవరకూ ఒకే సదుపాయాలు ఉండాలి. ఒలింపియాడ్ స్కూల్లు, టెక్నో స్కూల్లు నిషేదించాలి.
   -గ్రామాల్లో వ్యవసాయం, వృత్తుల పునరుజ్జీవనం ద్వారా వలసలను అరికట్టాలి.

   Delete
  3. ప్ర్రాదమిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్న మీ సలహా చాలా బాగుంది. This is one of the answers I was looking for.

   Delete
 2. కనీసం, ఇప్పుడైనా అట్టడుగునుండి పునర్నిర్మాణం చేయవలసిన సీమాంధ్ర అనే దిక్కుమాలిన రాష్ట్రం ఒకటుందని గుర్తురావటం‌లేదు కదా?

  ReplyDelete
  Replies
  1. శ్యామలరావు గారు, ఈ ప్రశ్నను గొట్టిముక్కల గారు సూచించారు. మీరు ప్రజలో ప్రశ్నను ఉంచవచ్చనేది మరచిపోవడం మీ తప్పే. సీమాంధ్ర నేతలు చేసినట్లే మీరూ చేస్తే ఎలా సర్. అయినా ఈ బ్లాగులో ఈ ప్రశ్నకంటే ముందే " తెలంగాణా సాధన అనేది సీమాంధ్రులు ఓటమిగా భావించాలా? ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాలా? " అనే పోస్టు ఉంచాను చూడగలరు.

   Delete
  2. see this link sir : http://praja.palleprapancham.in/2014/02/blog-post_2463.html

   Delete
  3. శ్యామలీయం మాస్టారూ, ప్రశ్న ఉద్దేశ్యం సామాజిక న్యాయం. పునర్నిర్మాణ చర్యలలో బడుగు బలహీన అణగారిన వర్గాలకు సముచిత స్థానం లభించాలన్నదే నా తపన.

   తెలంగాణా ఆంద్ర రాష్ట్రాల సామాజిక నేపధ్యంలో తేడాలు ఉన్నాయి. ఈ కారణం చేత సామాజిక న్యాయం సాధించే మార్గాలు కూడా వేరేగా ఉండాలి. The question is the same but the answers are likely to be different. It therefore requires a separate post.

   భారత దేశంలో ఎ రాష్ట్రం కూడా దిక్కు మాలినది కాదు, కాకూడదు.

   Delete
 3. 1. మొదట చట్ట విరుద్దంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసున్న వారిని గుర్తించి సర్వీసు నుండి తొలగించాలి.
  2. విధ్యుత్ ఉత్పాదన కేంద్రాలు నెలకొల్పాలి.
  3. వీలైనంత త్వరగా తెలంగాణా వాటా నీళ్ళు ఉపయోగించుకోవటానికి ప్రాజెక్టులు మొదలు పెట్టాలి.
  4. చట్ట విరుద్దంగా ఆక్రమించిన భూములను గుర్తించి ప్రభుత్వ పరం చేసుకోవాలి.

  ReplyDelete
  Replies
  1. మీ సూచనలు పునర్నిర్మాణం & ప్రాంతీయ న్యాయం దిశలో ఉన్నాయి కానీ ప్రశ్న సామాజిక న్యాయం గురించి. I think you are answering a question that was not asked.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top