నన్నోమారు బ్రతికించు

-  మెరాజ్ ఫాతిమా   
   ఆప్తుల నుండి  రాలిపడే నవ్వులను 
   నేను ఏరుకోవాలి.

   ఆరని  ఆత్మీయుల పాదముద్రలను 
   నేను ముద్దాడాలి.

   పిడికెడు గింజలకై వలస వచ్చే పిట్టల  చిట్టి కథలు 
   నేను వినాలి.

   అద్దాల కిటికీకి నా ముక్కునద్ది అందరినీ వెక్కిరిస్తూ ఇష్టంగా
   నేను ఆడుకోవాలి.

   అర్దాంతరంగా ఆపేసిన అమ్మమ్మ కథలో ముగింపేమిటో
   నేను తెలుసుకోవాలి 

   ఇంటివెనుక  జిల్లేడు మొగ్గలను  చిదిమి
   టప,టప్ లాడించాలి.

   పచ్చగడ్డిమోసే పల్లె పడచుల వెనుక కులుకుతూ నడిచి  
   వారిని వెక్కిరించాలి.

   ధాన్యపు గాదెల వెనుక నక్కిన నా దొంగ నేస్తాలను
   పోలీసునై  పట్టుకోవాలి.

   అర్దాంతరంగా నా శ్వాసను ఆపేశావు దయచేసి, ఒక్కసారి వెనక్కి  పంపు
   మదురమైన  ముత్యపు మూటలతో తిరిగివస్తా....
Reactions:

Post a Comment

 1. బ్రతుకు
  మరోమారు కాదు
  మరెన్నో మార్లు బ్రతుకు
  బ్రతుకుని బ్రతికించు
  బ్రతుకులను బ్రతికించడానికి బ్రతుకు
  బ్రతుకులోని బ్రతుకులన్నీ బ్రతికి మరీ బ్రతుకు
  నీ బ్రతుకు మరెన్నో బ్రతుకులకు బ్రతుకవనీ
  ఆకలి బతుకులకు
  నీ బ్రతుకు మెతుకవనీ
  బ్రతుకు
  బ్రతుకులనీ బ్రతికించు.. 

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top