ఎదగ  (నీయని) ని మొక్క.
- మెరాజ్ ఫాతిమా

   పసి చేతులలో    పాతచిరుగులు 
   నీ ఇంటి గచ్హు మెరిపిస్తున్నాయి.

   కాలిన  కడుపుల  ఆకటి కేకలు 
   అంట్ల గిన్నెల  చప్పుడులో  అస్తమిస్తున్నాయి.

   వెచ్చటి రగ్గులో సుఖమెరిగిన నిద్రకు 
   చిట్టి చేతుల చీపురు సవ్వడి  చికాకు కలిగిస్తుంది.

   భాల్యం  కోల్పోయిన  దాస్యం,
   మెట్లు లేని దిగుడు బావి నుండి  పైకి  పాకలేకుంది.

   ఇనుప చట్రాలలో  ఇరుక్కుని,
   ఉక్కు పిడికిలికై  వెతుక్కుంటున్నట్లుంది.

   నువ్వు  కడుతున్న   సమాదుల కింద, 
   భవిత పునాదిని వెతుక్కుంటుంది.

   కొన్ని తరాల  అణిచి వేత  కలసి,
   తనను  కత్తి అంచున  కూర్చోబెట్టినట్లుంది.
Reactions:

Post a Comment

 1. పొదుగులొనె ఎదిగిందేమో
  పొట్టి చేతులు
  గట్టి పడేలా
  ఆరిందాలా
  ఆడుకునే బాల్యం
  తనతో ఆడుకుందనీ
  అమ్మ గోరుముద్ద
  నోచని నోటికి
  చేతి గోరు గుచ్చుకుని
  ఉబికిన లేత రక్తం
  కన్నీటితో కలిసి తెలీనే లేదు.
  లాలిపాట వింటూ
  తాయిలాలు తింటూ
  హాయిగా బజ్జునే
  చిరు బొజ్జకి
  అంట్ల కంటిన మసి
  గిన్నెల చప్పుడే
  అలంకారమైంది
  బాల్యానికీ బరువైన
  చిన్ని జీవితం
  కాలపు గాలానికి
  గాయమై రసినోడుతుంది
  ఆ లేత చూపుల్లో
  కసినోడుతుంది
  దీదీ... 

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top