అంశం : హిందూ, ముస్లిం మతాలలో స్త్రీ స్వేచ్చ 

ప్రశ్న పంపిన వారు : Praveen Kumar 

స్త్రీలకి ఎక్కువ స్వేచ్ఛ హిందూ మతం ఇచ్చిందా, ఇస్లాం మతం ఇచ్చిందా? 

నేను పుట్టినది హిందూ కుటుంబంలోనే కానీ స్త్రీలకి ఎక్కువ స్వేచ్ఛ ఇచ్చినది ఇస్లాం మతమేనని నేను నమ్ముతాను. ఇందియాలో ఎక్కువ మంది స్త్రీలు ఉద్యోగాలు చెయ్యరు కానీ కొందరు స్త్రీలు రాజకీయాలలోకి వస్తారు. అరబ్ దేశాలలో స్త్రీలని doctor, teacher లాంటి కొన్ని రకాల ఉద్యోగాలు చెయ్యనిస్తారు కానీ మన దేశంలోలాగ ఎక్కువ మంది స్త్రీలని ఉద్యోగం చెయ్యనివ్వకపోవడం, కొంత మంది స్త్రీలని రాజకీయాలలోకి రానివ్వడం అక్కడ జరగదు. ముస్లింలు తమ నిజ జీవితంలో షరియా (Islamic law)ని ఆచరిస్తారు. ఇస్లామిక్ దేశాలలో షరియా ప్రకారం ఆడవాళ్ళని doctor, teacher లాంటి కొన్ని రకాల ఉద్యోగాలు మాత్రమే అనుమతిస్తారు. అక్కడ పెళ్ళైన స్త్రీలైనా, పెళ్ళి కాని స్త్రీలైనా షరియా ప్రకారం తమకి అనుమతించబడిన ఉద్యోగాలు చెయ్యొచ్చు. మన దేశంలో అలా కాదు. ఇక్కడ ద్వాక్రా గ్రూపులు లాంటి వాటిలో భర్త చనిపోయిన స్త్రీలనీ, భర్త వదిలేసిన స్త్రీలనీ చేరనిస్తారు కానీ భర్త ఉన్న స్త్రీలని చేరనివ్వరు. ఒక భర్త చనిపోయిన స్త్రీని దేశ ప్రధానమంత్రిని చేసి ఇతర స్త్రీలకి భర్త చనిపోయిన తరువాత బుట్టూ, గాజులూ పెట్టుకోనివ్వకుండా చేసేది కూడా హిందూ దేశంలోనే. స్త్రీల వికాసానికి ఇస్లాం మతం కంటే హిందూ మతమే పెద్ద అవరోధం కాదా? 

ఈ సమస్యకు మీ స్పందనని కామెంట్‌గానే గాక ఆర్టికల్‌గా వ్రాయదలచుకుంటే వ్రాసి మాకు పంపండి. 
Reactions:

Post a Comment

 1. Seems the Person who asked this Question is living in 19th Century.
  Hinduism is tailoring itself with time.

  "ఇతర స్త్రీలకి భర్త చనిపోయిన తరువాత బుట్టూ, గాజులూ పెట్టుకోనివ్వకుండా చేసేది కూడా హిందూ దేశంలోనే"
  I haven't seen any instance in last 10 years.

  ReplyDelete
 2. అసలు ఇస్లాం మతంలో స్త్రీ పట్ల ప్రవర్తించినంత అమానుషంగా, దుర్మార్గంగా ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అసలు ప్రపంచంలో నాగరికత కన్ను తెరచిన చాలా శతాబ్దాల వరకూ ఇస్లాంలో స్త్రీ కూడా మనిషే అన్న దృక్పథమే లేకపోయింది. ప్రపంచంలో అత్యంత రాక్షసమైన ఇస్లాం చరిత్రని సంపూర్ణంగా తెలుసుకుని ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడితే బావుంటుంది.

  ReplyDelete
 3. అలాగే హిందూ సమాజంలో సాంఘిక దురాచారాలు ఉన్నాయి. దానివల్ల హిందూ సమాజం ఎంతగానో నష్టపోయింది. అయితే అలాంటి దురాచారాలు పెరిగిపోయినప్పుడల్లా హిందూ సమాజంలోనే ఎందరో మహనీయులు ఉద్భవించి సంఘ సంస్కరణలకు నడుం కట్టారు. ఇస్లాంలో చాందస వాడులకే గానీ, సంఘ, మత సంస్కర్తలకు చోటు లేదు. సంస్కరణలకు ప్రయత్నించినవారిని అతి క్రూరంగా చంపేస్తారు కూడా. ఇస్లాం చరిత్రే ఇందుకు సాక్ష్యం.

  ReplyDelete
 4. "Escape from the Taliban" అని ఒక హిందీ సినిమా వచ్చింది కొన్నేళ్ళ క్రితం. మనీషా కొయిరాలా నటించిన సినిమా. యూట్యూబ్ లో గాని మరెక్కడైనా గాని దొరికితే చూడతగ్గది. స్త్రీల పట్ల వారి దారుణ ప్రవర్తన తెలుస్తుంది. వాస్తవంగా జరిగిన సంఘటన మీద ఆధారపడి తీసిన సినిమా అంటారు.

  ReplyDelete
 5. ఇస్లాంలో ఒక వ్యక్తీ ఒకే సారి నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు . నచ్చకపోతే నోటి మాటతో మూడు సార్లు 'తలాక్' అని భార్యని వదిలించుకోవచ్చు . ఇస్లాం మతాచారాల ప్రకారం ఆమెకు భరణం కూడా ఇవ్వక్కర్లేదు . ఇక ఆ స్త్రీ ప్రపంచంలో ఎన్ని కోర్టులను ఆశ్రయించినా ఫలితం ఉండదు . 1980 లలో షాబానో అనే ముస్లిం మహిళా కేసులో ఏమయ్యింది ? ఆమెకు వృద్ధాప్యం వచ్చేక ఆమె భర్త 'తలాక్' అంటూ ఆమెను వదుల్చుకోవాలనుకున్నాడు . భరణం కోసం ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది . సుప్రీం కోర్టు ఆమెకు భరణం ఇవ్వాలంటూ తీర్పునిచ్చినా ముస్లిం ఛాందస వర్గాలన్నీ ఆ తీర్పును ముక్త కంఠంతో వ్యతిరేకించాయి . చివరికి ఎటువంటి ఆధారమూ లేకుండానే షాబానో మరణించింది . ఇదీ ఇస్లాంలో స్త్రీల బతుకు .

  ReplyDelete
 6. అంతెందుకు బంగ్లాదేశ్ లో స్త్రీలపై జరిగే అత్యాచారాలను గురించి ఆ దేశ రచయిత్రి తన 'లజ్జా' అనే నవలలో పేర్కొన్నందుకు ఆమెపై ఎన్ని రకాల దాడులు చేసారో . ఇవేవీ మీకు తెలియకుండానే మాట్లాడతానంటే ఎవరూ ఏమీ చెయ్యలేరు .

  ReplyDelete
 7. హిందూ సమాజంలో లెక్కలేనన్ని దోషాలున్నాయి . దానిని ఎవరూ కాదనటంలేదు . మీరు కూడా వాటిని మీకు తోచిన రీతిలో ఎంచక్కా ఎండగట్టండి . ఎవరికీ అభ్యంతరం లేదు . అలాగే మీరు హిందూ సమాజంలో సంస్కరణలు తీసుకువస్తానంటే అది తప్పకున్ద్ఫా స్వాగతనీయం . కానీ అదే సమయంలో మీరు హిందూ సమాజాన్ని ఇతర సమజాలతో పోల్చి మాట్లాడకండి . అది కేవలం మీ అవగాహనా లేమిని తెలియజేస్తుంది .

  ReplyDelete
  Replies
  1. @ Raja Kishor D , మీ మెయిల్ ఐ.డీ చెప్పగలరా?

   Delete
 8. ఇస్లామిక్ షరియా అనేది ఏ దేశంలోనైనా దాదాపు ఒకేలా ఉంటుంది. మహ్రం ప్రకారం ఒక ముస్లిం తన మేనకోడలిని పెళ్ళి చేసుకోలేడు కానీ తన పెదనాన్న కూతురిని పెళ్ళి చేసుకోగలడు. అమెరికాలోనైనా, ఆర్మీనియాలోనైనా ముస్లింలకి ఈ నియమం వర్తిస్తుంది, ఇందులో ఎలాంటి మార్పూ ఉండదు. మార్పుకి అవకాశం ఇవ్వనివాళ్ళు సంస్కరణకి ఎలా ఒప్పుకుంటారు?

  హిందూ సంప్రదాయం మాత్రం ఇస్లామిక్ షరియాలాగ static కాదు. హైదరాబాద్ రాష్ట్రంలో 1870 వరకు సతీ సహగమనాలు ఉండేవి. అక్కడ విధవా వివాహాలు 1900 తరువాత, అది కూడా ఆర్యసమాజంవాళ్ళు ఆ రాష్ట్రంలో అడుగు పెట్టిన తరువాత జరిగాయి. ఇస్లామిక్ షరియా అన్ని కాలాలలోనూ ఒకేలాఉంటుంది. హిందూ సంప్రదాయమే ఒక్కో కాలానికి ఒక్కోలా ఉంటుంది. అందుకే 100 ఏళ్ళ క్రితం భోగం వృత్తి ఉంటే ఇప్పుడు వరకట్నం ఉంది.

  ReplyDelete
  Replies
  1. Back to false statements In Islam, the fact is a lady is seen as a girl giving birth and item used for ..x.
   So they allowed multy husband wife situation.
   In Hinduism it's treated as love not the latest generation love, so they never tried to get a widow married.
   There are many reason Hinduism disagreed for widow marriage
   1. If a men likes a married women he may kill the married husband.
   2. If the men died due to some transferred ..xual disease new one shouldn't get it.
   I know you will immediately ask a question why they didn't apply to men?
   The reason is obvious male dominant society.
   Even the above two rules applies to male also.

   How do you support Islam method of marrying father brothers daughter, in your last comment you mention 50% of the gene code comes from father also.

   Islam rules are made just to increase islam population.
   Hindus don't have that in mind.

   Delete
  2. Why not we think that a woman can kill the wife of a man if a man is allowed to remarry?

   Delete
  3. Widow marriages are permitted in Europe though gender discrimination even exists there.

   Delete
  4. జరిగిన ఉదంతాలు
   ఇస్లాం లోని అమ్మాయి మొగుడి యొక్క మొగతనాన్ని కోసేసింది తన ప్రియుడిని పొందడానికి
   ఇస్లాంలో ఇంకో సంకోచత్వం
   కొన్ని సంవత్సరాల క్రిత్రం మొగుడు తాగేసి తలాక్ అన్నాడు తరువాత నాకు నా పెళ్ళాం కావాలి అన్నాడు కానీ పెద్దలు వాళ్ళు తిరిగి కలవాలి అంటే ఆ అమ్మాయి మళ్ళీ పెళ్ళి చేసుకోవాలి ఆ తరువాత అతను(రెండవ భర్త) తలాక్ అన్నాకా మొదటి మొగుడిని మళ్ళీ పెళ్ళి చేసుకోవచ్చు అంట!
   ఇక సౌదీ లో SP కు vote వెయ్యాలి అని ఫత్వా జారీచేసారా?

   Delete
 9. ప్రవీణ్ ఈ టాపిక్ ఇంతకు ముందు ఎన్నో సార్లు ఏదో ఒక సందర్భం లో అడిగావు .
  ఏ ఇస్లామిక్ దేశం లో మహిళల కి ఎక్కువ హక్కులు ఉన్నాయో చెప్పు .

  సౌదీ అరేబియా లో డ్రైవింగ్ లైసెన్స్ కోసం పిచ్చోల్లా లా పోరాడుతున్నారు ఇప్పటికీ అక్కడ మహిళలు .
  వోట్ హక్కు ఉందొ లేదో ఇప్పటకీ ఈ మధ్యనే ఇచ్చినట్టు చదివాను .

  నువ్వు పుట్టి పెరిగిన హిందూ మతం లో నీకు కొన్ని లోపాలు కనిపించవచ్చు అది తప్పు కాదు, కాని వేరే మతం లో ఎక్కడా లేవు, ఇక్కడే ఉన్నాయి అనడం నీ సంకుచిత ఆలోచన తప్ప వేరే ఏది కాదు , హిందూ మతం మార్పు ని ఆహ్వానిస్తుంది , అందుకే మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు చేస్తున్నారు , ఆధునిక జీవితాన్ని గడుపుతున్నారు .

  ఇండియా లో ఎక్కువ మంది స్త్రీలు ఉద్యోగం చెయ్యరు ----- ప్రశ్న మత పరమైనది అడిగి మళ్లి ఇదేంటి . ఏ మతం లో చెయ్యరు హిందూ మతం లోనా , ఇస్లాం మతం లోనా ?? ఈ మధ్యన నేను చదివాను ఈనాడు వసుంధర అనుకుంటా , చాలా మంది స్త్రీలు ఉద్యోగాలు వదులుకోవడానికి కారణం ఫామిలీ కి ఎక్కువ టైం కేటాయించడానికి , పిల్లలు కోసం .

  భర్త చనిపోయిన తరువాత బొట్టు గాజులు పెట్టుకోకుండా చేసేది హిందూ మతం లోనే ----- ఇదే హిందూ మతం లోనే, భర్త చనిపోయిన మా కజిన్ ( అమ్మాయి )కి పెళ్లి చేసాం . ఊళ్ళో కాని, కుటుంబం లో కాని ఎవ్వరు అడ్డు చెప్పలేదు. నువ్వు చెప్పేవి పుస్తకాలలో ఉంటాయి, ఇప్పుడు బయట నువ్వు అనుకున్నంత వెనకబాటుతనం లేదు .

  డ్వాక్ర గ్రూపు లో భర్త ఉన్న మహిళా ని చేరనివ్వరా ??? ఎక్కడ చూసావు నువ్వు, ఏ గ్రూపు అది . నిజంగా అదేదో పిచ్చోళ్ళ గుంపు లా ఉంది, మా ఇంటి చుట్టు పక్కల లా , ఊళ్ళో అలా లేదు, స్వయంగా మా అమ్మ కూడా ఒక గ్రూపు లో ఉంది . మతానికి డ్వాక్రా కి ఏం సంభందం ???

  మారు మూల పల్లెటుల్లో ఉన్న మా పిన్ని, తన ఇద్దరు కూతుళ్ళని డిగ్రీ వరకు చదివించి న తరువాతే పెళ్లి చేస్తాను అని చెప్పింది . ఒక అమ్మాయి PG కూడా జాయిన్ అవుతుంది . ఇదే మార్పు . ఇది ఒక రోజు లోనో , ఒక సంవత్సరం లోనో రాదు . హిందూ మతం ఇలాంటి మార్పు లని అవలీల గా కలుపుకుంటుంది . ఇంకా మార్పులు వస్తాయి. ఆల్రెడీ చాలా మార్పులు వచ్చాయి ఇలాంటివి .

  మొట్ట మొదట , నీ ప్రశ్న లోనే క్లారిటి లేదు . స్త్రీల వికాసం అంటావు , డ్వాక్రా అంటావు , నువ్వు ఒకసారి నీ ప్రశ్న ని విడతీసి అడుగు .

  చివరగా, నువ్వు చుసిన ప్రతీ విషయం హిందూ మతానికి ఆపాదించకు. హిందూ మతం ఎప్పుడు అభివృద్ధి నిరోధకం కాదు, ఆర్ధిక అవసరాలు తప్ప .


  ReplyDelete
  Replies
  1. వ్యక్తివాదం ఉన్నంతమాత్రాన చాంధసవాదం లేదనలేము. నేను భర్త చనిపోయిన స్త్రీని పెళ్ళి చేసుకుంటే మా వీధిలోనివాళ్ళకి అభ్యంతరం ఉండదు. కానీ ఆ అభ్యంతరం లేనివాళ్ళు తమ పుత్రులని భర్త చనిపోయిన స్త్రీలకి ఇచ్చి పెళ్ళిళ్ళు చెయ్యరు. వ్యక్తివాదం, సంకుచితవాదం రెండూ కలిసే ఉండగలవు.

   Delete
 10. కొండల రావు గారు,

  నాదొక సూచనా.

  ఆ మతం కంటే ఈ మతం మంచిది లేదా గొప్పది అనే ఆలోచన వచ్చిందంటే పతనం(ఎవరి పతనం?) మొదలైనట్లే. ఎవరి నమ్మకాలు వారివి.

  ఇస్లాం కంటే హిందూ మతం మంచింది అని నేను ఎన్ని రోజులైనా వాదన చెయ్యగలను. అలానే ఇంకొకరు హిందూ మతం కంటే ఇస్లాం మంచిది అని నాతొ పోటిగా వాదన చెయ్యగలరు. ఎన్ని రోజుల వాదన జరిగిననూ చివరగా పనికొచ్చే పలితం ఏమి ఉండదని నా గట్టి అభిప్రాయం. ఏ మతం అయిననూ ఛందసవాదుల మూలంగానే బ్రస్టు పట్టిపోతుంది. మతానికి, ఒక మంచి భావ్యిష్యత్తుకు సంబంధం లేనే లేదు.

  ఇలాంటి చర్చలను మీరు అనుమతించక పోతేనే బాగుంటుంది అని నా అభిప్రాయం.

  ReplyDelete
  Replies
  1. @ Green star గారు,

   ఏ మతంలోనైనా మంచి చెడూ రెండూ ఉంటాయి. నాకు తెలిసినంతవరకూ హిందూ మతం కంటే ఇస్లాంలో స్త్రీకి ఎక్కువ స్వేచ్చ ఉందని అనుకోను.

   నేను మతాలగురించి పెద్దగా పట్టించుకోను. నాకు తెలిసింది నేను పెరిగింది హిందూ మత జీవన విధానంలో గనుక హిందూ మతంపై నా అభిప్రాయాన్ని కొంతమేరకు చెప్పగలను.

   హిందూ మతంలో లోపాలపట్ల ఎప్పటికప్పుడు సంస్కరణలు ఉద్యమాలు విజయాలు జరుగుతుండడం మనం గమనిస్తున్నాము. హిందూ మతం ప్రత్యేకత ఏమిటంటే ఇతర మతాలలాగా అది ఒకేలా ఉండదు ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటూ అభివృద్ధిపరచుకుంటూ ఉంటుండడం ఈ మతం విశేషం అని నాకు తెలిసిన సమాచారం మేరకు చెప్పగలను. హిందూ మతం అనడం కంటే హిందూ ధర్మం అనడం సరయినదేమొ.

   ఇస్లాం మతం గురించి నాకు పెద్దగా తెలీదు. హిందూ మతం లో స్త్రీలను అణచివేసే అంశాలుమాత్రమే కాక స్త్రీలను ఉన్నతంగా చూపే అంశాలు చాలా ఉన్నాయి. అవి నేటికీ పాటించాలని మన సమాజం కోరుకుంటున్నది ఎంతోకొంత ప్రయత్నం జరుగుతున్నది. హిందూ మతంలో స్త్రీలపట్ల పైత్యపు చేష్టలపై ఆనాడే ఎందరో సంస్కర్తలు పోరాడారు. విజయం సాధించారు. హిందూ సమాజం వారిని ఆదరించింది. నేటికీ ఆదరిస్తూనే ఉన్నది.

   ఇతర మతాలకంటే హిదూమతంలో ఈ విషయం ఆహ్వానించదగినదే. ముఖ్యంగా ముస్లింలతో పోల్చుకుంటే స్త్రీల విషయంలో హిందూ మతమే బెటర్ అని నా అభిప్రాయం.

   ప్రవీణ్ ఈ విషయంలో ఆర్టికల్ వ్రాస్తానంటున్నాడు కనుక చూద్దాం అతనేమి చెపుతాడో.

   ఇక డ్వాక్రా గ్రూపులలో భర్త చనిపోయిన వారినే చేర్చుకుంటారనేది హాస్యాస్పదంగా ఉన్నది. ప్రవీణ్ అలా ఎందుకు నిర్ధారణకు వచారో తెలీదు. దానికి ప్రవీణే సమాధానం చెప్పాలి. మా ఏరియాలో అయితే డ్వాక్రాలో అందరూ ఉన్నారు.

   ఈ వాదనవల్ల చివరకు తేలేదేమీ ఉండదనే మీ వాదనతో ఏకీభవిస్తున్నాను.

   చర్చకు అనుమతించకూడదనడం చించాల్సిన విషయం.

   Delete
 11. నేను గతంలో చెప్పాను మనం చదువు అనే అబద్దంలో బ్రతుకుతూ మన పెద్దలు నేర్పిన మంచి చిట్కాలు మరచిపోతున్నాము!

  ReplyDelete
 12. I am going to write an article on the evolution of Islam. It will be published in Janavijayam.

  ReplyDelete
  Replies
  1. షియాలు సున్నీలు గొడవలతో మొదలవుతుందా?
   లేకపోతె ఘజనీ దండయత్రా?
   లేకపోతె తుగ్లక్ పాలనా?
   లేకపోతె ఫత్వాల గురించా?
   లేకపోతె modles ను పక్కలో పడుకోమనే ప్రస్తుత ఇస్లాం రాజుల గురించా?

   Delete
  2. Not the above but Satanic verses

   Delete
  3. అంటే బౌద్ధులను ఇస్లాం పుట్టిన రాజ్యంలో చంపినా విధం అన్నమాట!

   Delete
  4. Read this story: http://content.janavijayam.in/2014/05/satanic-verses.html

   Delete
  5. బాబు పర్వీను ...తొందర్లో అ....అని 5 పూటలా అరిచేలా ఉన్నావు ...కోసుకునే ముందు జగ్రత్త నాయన ....అసలు కోసుకునే ముందు మగ పిల్లాడికే దిక్కు లేని స్వేచ్చ ఆడపీనుగలకి ఏడ్చిందా .....అవును కోస్తారే. ..అప్పుడు 4 యేళ్ళ పిల్లాన్ని అడిగి ఇష్టం తెలుసుకుని కోస్తారా ...కసక్క్ మని కోసి పరేస్తారా.....
   మగ పీనుగలకే లేని స్వెచ్చ ఆడ జీవాలకి ఎక్కడిచ్చింది నీ ఎడారి న్యాయం!!

   Delete
  6. సైతాన్ సందేశాలు ఆర్టికల్ లో ఇస్లాం లో హిందూ మతం కంటే స్త్రీ స్వేచ్చ ఎక్కువ గురించి ఏమీ వ్రాయలేదుగా ప్రవీణ్ గారు.

   Delete
  7. ముస్లింలతో పోలిస్తే హిందువులలో మతోన్మాదం తక్కువ. ఆర్.ఎస్.ఎస్.లాంటి సంస్థలవాళ్ళు రెచ్చగొట్టినప్పుడు మాత్రమే హిందువులు రెచ్చిపోవడం జరుగుతుంది. హిందువులకి వ్యతిరేకంగా సున్నీలూ, షియాలూ ఐక్యంగానే ఉంటారు కానీ ముస్లింలకి వ్యతిరేకంగా రెండు హిందూ కులాలు ఏకంకావడం ఎన్నడూ జరగదు. ఈ విషయం హిందువులని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పకుండా "హిందూత్వం అనేది ఒక మతం కాదు, అది ఒక జీవన విధానం" అంటూ సాధారణ జనానికి అర్థం కాని ఏవేవో చెపుతారు. ఇదే బ్లాగ్‌లో వరసల గురించి చర్చ జరిగినప్పుడు కూడా ఒకాయన "ఇస్లాంలో ఉన్న మహ్రం, రదా వంటి నియమాలు హిందూ మతంలో లేవు, హిందూ మతం అనేది కేవలం పరిణామంలో భాగం" అన్నాడు. సైతాన్ వచనాల గురించి వ్రాసినది అటువంటి వాదనలకి సమాధానం చెప్పడానికి. అంతే కానీ అది స్త్రీలకి ఇస్లాం మతం ఎక్కువ స్వేచ్ఛని ఇచ్చిందని చెప్పడానికి కాదు. నేను హిందూ మతాన్ని మాత్రమే విమర్శిస్తున్నానే ఆరోపణ కూడా కొందరు చెయ్యగలరు. ఆ ఆరోపణ రాకుండా ఉండేందుకు కూడా సైతాన్ వచనాల గురించి వ్రాశాను.


   Delete
 13. దూరపు కొండలు నునుపు. మనమెక్కి కూర్చున్న కోండ ఎగుడు దిగుడుగా కనిపిస్తుంది. ఇది దూర ద్రుష్టి లేని వాని ప్రపంచం. మనమెక్కిన కోండ ఎగుడు దిగుడుగా ఉంటె దూరపు కొండలు నున్నగా ఎలా ఉంటాయి...ప్రపంచంలో ఎక్కడ ఏ మతమున్నా జరిగేది ఒక్కటే... కాకపొతే మనమున్న ప్రాంతపు విశేషాలు మనకు తెలుస్తాయి... మిగిలినది మీడియా నాలెడ్జే. కాబట్టి ఎవరినీ వేనకేసుకుని రానవసరం లేదు.

  ReplyDelete
 14. అసలు ఆడవాళ్ళ స్వేచ్ఛ గురించి మనకెందుకు వాదన ? అది వాళ్ళ గొదవ. మనం మన మగజాతి ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచించాలి. ఏం చేస్తే ఆడవాళ్ళు మన చెప్పుచేతల్లో ఉంటారా అనేదే మనం ఆలోచించాలి. ఆడవాళ్ళ స్వేచ్ఛ వల్ల మగవాడికి పూరా నష్టమే తప్ప లాభమేమీ లేదు. వాళ్ళ చేత విశాలహృదయుడైన మగవాడంటూ పొగిడించుకోవడం కోసమో, లేదా అభ్యుదయవాదులం అనిపించుకోవడం కోసమో, లేదా మన కూతుళ్ళ కోసమో మనం ఆడవాళ్ళ స్వేచ్ఛని సమర్థిస్తే ఆఖరికి క్షవరమయ్యేది మనకే. ఏ మతస్థులైనా మగవాడన్నాక ఆలోచించాల్సింది ఇదే. ఆలోచించండి.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's p v satyanarayana videso vm vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top