చాలామంది సులువుగా వాగ్దానాలు చేస్తుంటారు. ఆ తర్వాత వాటిని నెరవేర్చరు సరికదా, వాటి గురించి మర్చిపోతారు కూడా. దీనివల్ల వారి వ్యక్తిత్వం దెబ్బతినడమే కాక ఇతరులకు ఎంతో అసౌకర్యం కల్గించిన వారవుతారు. ఇలా జరగడానికి కారణం చాలామందికి వాగ్దానం అంటే ఏంటో పూర్తిగా అవగాహన లేకపోవడమే.

వాగ్దానం అనేది ప్రమాణం వంటిది. ఎన్ని ఇబ్బందులు ఎదురయినా దాన్ని నెరవేర్చేందుకు వెనకాడకూడదు. తామిచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే ఆలోచన ఎక్కువమందిలో ఉండకపోవడం వల్ల సులువుగా వాగ్దాన భంగం చేస్తుంటారు. ఎంతటి చిన్న విషయమైనా సరే ఇచ్చిన మాట తమ శక్తిని పుంజుకుని నెరవేర్చి తీరాలి. వ్యక్తిత్వంలో ఇది ఎంతో ప్రాముఖ్యత గల విషయం.

కొన్ని సందర్భాలు

రంగారావు స్నేహితుడు గోవిందుని అడిగాడు 'బజారునుండి వచ్చేటప్పుడు నాకొక ఇంగ్లీషు గ్రామర్‌ పుస్తకం, రెండు పెన్నులు కొని తీసుకురండి' అని.

గోవిందుడు బజారునుండి వస్తూ వాటిని కొని తీసుకొచ్చి రంగారావుకి ఇచ్చాడు. ''సారీ! నా దగ్గర చిల్లర లేదు. వీటి బాపతు సొమ్ము రేపు ఇస్తాను'' అన్నాడు రంగారావు.

గోవిందుడు ఎప్పుడు ఎదురయినా ''నీకు డబ్బులివ్వాలి! గుర్తుంది'' అంటాడు కానీ ఇవ్వడు. ఇటువంటి మాటలకు గోవిందుడు ఏం జవాబు చెప్పగల్గుతాడు? 'ఫర్వాలేదు. మీకు వీలయినప్పుడే ఇవ్వండి!'' అని అంటుంటాడు.

ఈ పనికిమాలిన వాగ్దానాల వల్ల మనిషి వ్యక్తిత్వం ఎలా దిగజారిపోతున్నదో వారు గ్రహించరు. తరచూ మనుషులు కపట వాగ్దానాలు చేస్తుంటారు. రైల్వే బెర్త్‌ రిజర్వేషన్‌ చేయించడం మొదలు పరీక్ష కోసం తన పుస్తకం ఇస్తాననే వాగ్దానాలు చేస్తుంటారు. చివరకు ఏ వాగ్దానమూ కార్యరూపంలోకి రాదు. ఇటువంటి వాగ్దానాల ఫలితంగా అవతలి వ్యక్తులు ఎంత నష్ట పోయినా వారికి పట్టదు. 'వర్షంగా ఉంది. వెలిసిన తర్వాత ఇస్తానన్న పుస్తకం వెంటనే పట్టుకెళ్లి ఇవ్వాలనుకున్నాడు. తర్వాత ఆ విషయం మర్చిపోయాడు. ఇలా ఉంటాయి ఇటువంటి వారి ప్రవర్తనా పద్ధతులు. కొంతమంది వస్తువులు తీసుకెళ్తుంటారు. పని అయిన వెంటనే వాటిని తిరగి ఇచ్చేస్తామని వాగ్దానం చేస్తారు. నిర్లక్ష్యం చేస్తారు. ఆ వస్తువు ఎప్పటికీ తిరిగి ఇవ్వరు. ఇలాంటి వారిని ఎలా క్షమించడం?

అవకాశవాదులు!

కొంతమంది వాగ్దానాలు చేసి, తమ పని పూర్తిచేసుకునే అవకాశవాదులుంటారు. వీరికి వ్యక్తిత్వం, విలువలు పట్టవు. నేను మర్చిపోలేని సంఘటన ఒకటి ప్రస్తావిస్తాను.

నా శ్రీమతి ఎమ్‌.ఎ తెలుగు పరీక్షలకు వెళ్తుంది. నేను పని చేసిన కళాశాలలో ఒక తెలుగు లెక్చరర్‌ కూడా ఎమ్‌.ఎ పరీక్షకు వెళ్తున్నారు. ఎమ్‌.ఎ లో 55 శాతం మార్కులు వస్తేనే లెక్చరర్‌ అర్హత పొందినట్లు. ఆయనకు 52 శాతం మాత్రమే వచ్చాయి. ఎక్కువ మార్కులు తెచ్చుకోడానికి ఆయన మళ్లీ ఎమ్‌.ఎ పరీక్ష రాస్తున్నారు.

పరీక్షకు ఉపకరించే 'అప్పకవీయం' పుస్తకం ఆయనకు ఎక్కడా దొరకలేదు. మా ఇంటికి వచ్చి ''మీ దగ్గరున్న అప్పకవీయం పుస్తకం ఓసారివ్వండి. రెండు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను'' అని అడిగాడు.

నా శ్రీమతి కూడా ఎమ్‌.ఎ పరీక్షకు వెళ్తుంది. ఆమెకూ ఆ పుస్తకం అవసరమవుతుందని అతనికి తెలుసు. అయినా ఆ పుస్తకం ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదు. ఇటువంటి అవకాశవాదులు వాగ్దానాలు చేస్తుంటారు. తర్వాత వాటిని పట్టించుకోరు.

నిజాయితీపరులు

ఇచ్చిన మాట నిలబెట్టుకునే నిజాయితీపరులు కూడా ఉంటారు. ఎంతటి ఇబ్బందులనయినా అధిగమించి తమ వాగ్దానాలను నెరవేరుస్తారు. వీరు ఇతరులకు లాభం రావాలని ఆలోచిస్తారు.

నాకు తెలిసిన వెంకట్రావుగారు ఇటువంటి వ్యక్తులకు ఉదాహరణ. వాళ్లింటికి దగ్గర్లోనే ఉంటున్న రాంబాబుకు ఇంటర్వ్యూకి రమ్మని పిలులు వచ్చింది. రాంబాబు అప్పటికే ఒక ఇంటర్వ్యూలో సెలక్టయ్యాడు. జాయినింగ్‌ ఆర్డర్స్‌ కోసం ఎదురు చూస్తున్నాడు.

'ఆర్డర్స్‌ వస్తే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికి పట్టుకొచ్చి ఇస్తాను. నువ్వు ముందు ఇంటర్వ్యూకి వెళ్లు' అని రాంబాబుకు చెప్పాడు. రాంబాబు రైల్వే స్టేషన్‌కి వెళ్లాడు. ఇంతలో పోస్టు మాన్‌ ఉద్యోగ నియామకపు ఆర్డర్స్‌ పట్టుకొచ్చి ఇచ్చాడు. వెంకట్రావుగారు ఆ ఆర్డర్స్‌ పట్టుకుని హడావుడిగా రైల్వే స్టేషన్‌కి వెళ్లి రాంబాబుకి ఇచ్చారు. తిరిగి వచ్చాక చుట్టుపక్కల వాళ్లు ఎన్నో సానుభూతి వాక్యాలు పలికారు. 'నా మోటర్‌ సైకిల్‌ తీసుకెళ్లాల్సింది' అని ఒకాయన అన్నాడు. 'అబ్బే ఎందుకు? నాకు తెలిస్తే కార్లోనే తీసుకెళ్లి రైల్వే స్టేషన్‌ దగ్గర దింపేవాణ్ణి' అని మరొకాయన తన పరోపకార బుద్ధి ప్రదర్శించాడు.

చాలామంది వాగ్దానాలకు కట్టుబడి ఉండరు. అది వారి వ్యక్తిత్వానికి మచ్చ అవుతుందని గ్రహించరు. కాని కొంతమంది వెంకట్రావు గారిలాంటి వాళ్లుంటారు. 'మాట'ను పోషించుకుంటారు. ముఖ్యంగా ఉన్నత పదవులను ఆశించేవారు వాగ్దానాలు నిలబెట్టుకోవడం మరువకూడదు. ఇతరులు కూడా.

- సి.వి.సర్వేశ్వరశర్మ , ఫోన్‌ నెం: 9866843982 , sarma.chavali@gmail.com
(from : prajasakti daily )
Reactions:

Post a Comment

 1. Good post. Thanks for sharing.

  ReplyDelete
 2. Hello, Neat post. There's an issue with your website in web explorer, may test this… IE still is the marketplace leader and a good component to people will omit your great writing because of this problem.

  ReplyDelete
 3. @Anonymous
  Janavijayam.com is working properly in IE. May be it's Your internet connection problem.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top