1956 కు ముందున్నవారికే ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ ఇస్తామంటున్న తెలంగాణా ప్రభుత్వ నిర్ణయం సరయినదేనా?

ప్రశ్న పంపిన వారు పల్లా కొండల రావు.


అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు అధికారం రాగానే అపసవ్యపు ఆలోచనలు రావడం సహజంగా పాలకవర్గాల స్వభవంగా మారుతోంది. అధికారంలోకి రావడానికి చెప్పే మాటలకి అధికారం వచ్చాక చేసే చేష్టలకీ, పాలకవర్గాల ఆచరణకి బోలెడంత తేడా కనపడుతుంది. తెలంగాణా మాత్రమే కోరుతున్నామనీ ఆధ్రా ప్రజలు తమకు సోదరులవంటివారని గప్పాలు కొట్టిన కే.సీ.ఆర్ ప్రభుత్వం ఇప్పుడు విద్యార్ధుల తల్లిదండ్రులను ఆనొదోళనలో పడేస్తున్నారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ విషయంలో 1956 కంటే ముందు తెలంగాణా లో ఉన్న కుటుంబాల విద్యార్ధులకే వర్తింపజేస్తామంటున్నారు. ఇది ఒక రకంగా తుగ్లక్ చర్య. విద్యార్ధులను ఇరకాటంలో పెట్టడం తప్పు. ఇప్పటికే చాలామంది ఈ చర్యవల్ల నానా ఇబ్బందులు పడుతున్నారు. యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో ఫీజులు చెల్లించి మరీ సర్టిఫికెట్లు పొందుతున్నారు. తిరిగి స్కాలర్షిప్ వస్తేనే ఫీజు రిటన్ ఇస్తామని యాజమాన్యాలు తెగేసి చెప్తున్నాయి. ఇందులో తెలంగాణా విద్యార్ధులు సైతం ఉన్నారు. తెలంగాణా వారు సైతం స్తానికత నిరూపించుకోవాలంటున్నారు. ఉదాహరణకు ఖమ్మం జిల్లా 1959లో ఏర్పడింది. ఇప్పుడేమో 1956 కంటే ముందు తెలంగాణా వరిమే అంటూ సర్టిఫికెట్ తేవాలట. ఈ విషయంపై తెలంగాణా ప్రభుత్వం పునరాలోచన చేయాలి.

ఫీజు రియంబర్స్‌మెంట్ సమస్య పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవ్వాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి. రాఘవులు కోరారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆయన అన్నారు. 1956కు ముందు ఉన్నవారికే ఫీజు రియంబర్స్‌మెంట్ ఇస్తామన్న తెలంగాణ ప్రభుత్వ వాదనను ఆయన తప్పుపట్టారు. తెలంగాణలో స్థిరపడ్డ ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆదివారం రాఘవులు మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ ఇవ్వాలని అన్నారు. 1956కు ముందు ఉన్నవారికే ఫీజు రియంబర్స్‌మెంట్ ఇస్తామని చెప్పడం సరికాదని అయన అన్నారు. తెలంగాణలో శాశ్వతంగా స్థిరపడాలనుకునే ప్రతి కుటుంబానికి ఫీజు రియంబర్స్‌మెంట్ వర్తించే విధంగా ఉండాలని ఆయన సూచించారు. దీనిపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమవేశమై చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని రాఘవులు విజ్ఞప్తి చేశారు. అవసరమైనే కేంద్రం సహాయం కూడా తీసుకోవాలని ఆయన సూచించారు.

ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ లేదా ఇతర ఏ పథకాలైనా తెలంగాణా లో స్థిరపడ్డవారికి వర్తింపజేయకూడదనుకోవడం కక్ష సాధింపు చర్య కాదా? మీ అభిప్రాయం ఏమిటి?

Reactions:

Post a Comment

 1. మీ పక్కింటివాళ్ళ పిల్లలకి మీరు డబ్బులు ఇస్తారా? తెలంగాణలో ఉన్న ఆంధ్ర విద్యార్థులకి తెలంగాణా ప్రభుత్వం డబ్బులు ఎలా ఇస్తుంది? అలాగైతే మహారాష్ట్ర విద్యార్థులకి కూడా డబ్బులు ఇవ్వాలి కదా! కాపులు విశాఖపట్నం జిల్లాలో ఒ.సి.లని శ్రీకాకుళం జిల్లాలో బి.సి. ప్రమాణ పత్రాలు తీసుకోవడం నేను చూశాను. ఇలాగే ఆంధ్ర విద్యార్థులు తెలంగాణలో చదువుకోరని ఎందుకు అనుకోకూడదు?

  ReplyDelete
  Replies
  1. మీ పక్కింటి వాళ్ల పిల్లలకి మీరు డబ్బులు ఇస్తారా? నేను ఇస్తాను అంటే మీరు నమ్ముతారా? నేను ఇస్తే తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటుందా? ఇదేమన్నా వ్యక్తిగత ఆస్తుల సమస్యా? ప్రభుత్వాలు ప్రజలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలి.

   తెలంగాణాలో ఉన్న ఆంధ్రా విద్యార్ధులంటే ఎవరు ప్రవీణ్? ఆంధ్రావాళ్లు తెలంగాణాలో స్తిరపడాలనే ఆలోచన చేయకూడదా? స్తిరపడకూడదా? తెలంగాణా విద్యార్ధులని సైతం ఇబ్బందులు పెడుతున్నారు ప్రవీణ్. మహారాష్ట్రతో పోలిక అసంబంద్ధమైనది. 1956 కంటే ముందు అనే నిబంధన తుగ్లక్ చర్యే అవుతుంది. 1956 కంటే ముందు లేకుంటే తరువాత తెలంగాణాలో స్థిరపడకూడదా?

   Delete
  2. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది.అందుకనే అన్ని రాష్ట్రాలూ తమ రాష్ట్రం లోని విద్యాసంస్తల్లో చదువుకునే విద్యార్ధు లందరినీ ఒకే రకంగా ప్రోత్సహిస్తున్నారు!

   లోకంలో గాయత్రీ మంత్రం విశ్వామిత్రుడి కన్నా ముందే వుంది. భరద్వాజ గాయత్రి మొదలు చాలా వున్నాయి,వశిష్ట గాయత్రి కూడా వుంది, అయినా విశ్వామిత్రుడి గాయత్రికే యెందుకు పెద్ద పీట వేసారో తెలుసా?"ఈ భూమ్యాకాశముల మధ్యన వున్న జ్ఞానమనే వెలుగు (కేవలం బ్రాహ్మల మెదళ్లలోనే కాకుండా)సర్వులకూ లభించు గాక" అనే వున్నత భావం వుండటం వల్ల.

   ఇప్ప్పుడు మనం చర్చించుకుంటున్నది విద్య గురించి కాబట్టి అది జ్ఞానం అనే వున్నత గుణంతో అనుసంధానించబడి వుంది కాబట్టి ప్రస్తావించాను.అది కాక పోయినా మనిషయిన ప్రతివాడికీ ప్రతి క్షణమూ రెండు చీలుదారుల శృంగాటక జంఝాటం యెదురవుతుంది, ఔన్నత్యమా ఔధ్ధత్యమా అని.నా రాష్ట్రంలో పుట్టిన వాళ్ళే నాకు ముఖ్యం అని గిరి గీసుకుని కూర్చోకుండా సర్వుల్నీ సమాదరించటం అనేది ఔన్నత్యమా ఔధ్ధత్యమా అనేది మీరూ మీ ముఖ్యమంత్రీ తేల్చుకోవాలి.సాంకేతికంగా మీ ముఖ్యమంత్రికి స్థానికతను నిర్ణయించుకునే అధికారం వుంటే వుండవచ్చు, మా పిల్లలకి ఫీజులు మేమే కట్టుకుంటాం అని అన్నాక కూడా మళ్ళీ కోర్టులో కేసు వేస్తాం అనే పచ్చ తమ్ముళ్ళు సుప్రీం కోర్టుతో చివాట్లు పెట్ట్టించుకుంటే పేట్టించుకోవచ్చు గాక, విద్య విషయంలో లోభితనం చూపించడమా వుదారంగా వుండటమా అనెది మనోగతమయిన సంస్కారానికి సంబంధించిన విషయం.మీ ముఖ్యమంత్రి యెటూ ఔధ్ధత్యానికే తెగబడుతున్నాడు,మీరు కూడా అదే దారిలో వెళ్ళదల్చుకుంటే మా మాటకి విలువ వుండదు గనక నోరు మూసుకుని కూర్చోవడం, తెలంగాణాలో కాకుండా మరొక రాష్ట్రానికి వెళ్ళటం తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదు.మరి మీ సంగతేమిటి?ఈ రెండు చీలుదారుల శృంగాటక జంఝాటం మీకు యెదురయ్యింది ఇక్కడ! మీరు వున్నతంగా అలఓచించగలిగితే మీ ముఖ్యమత్రి కూడా ఔన్నత్యం ఔధ్ధత్యం కన్న గొప్పదని తెలుసుకుంటే మంచిది.శుభం!

   Delete
  3. నేను అడిగిన ప్రశ్న TRS నాయకులే ఇంతకు ముందు అడిగారు. తెలంగాణాలోని తమ బంధువుల ఇంటిలో కొంత కాలం ఉండి nativity certificate తెచ్చుకునేవాళ్ళు కూడా ఉంటారనే సందేహాన్ని మాత్రమే నేను కొత్తగా చేర్చాను.

   Delete
  4. అలా చేసేవారు తెలంగాణాలో ఉండే ఆంధ్రావారు మాత్రమే అనిపిస్తుందా ప్రవీణ్ గారు. ప్రపంచమంతా మానవ స్వభావం అలాగే ఉంటుంది. అటువంటివాటిని అరికట్టడం వేరు. 1956 అనే నిబంధన విధించి సహాయం చేస్తామనడం వేరు.

   Delete
  5. మీరు psychological factorsని పరిగణనలోకి తీసుకోలేదు. 1766లో నిజాం కోస్తా ఆంధ్రని ఆంగ్లేయులకి ఇచ్చేశాడు. అప్పటి నుంచి కోస్తా ఆంధ్ర, తెలంగాణాలు వేరువేరు గుర్తింపులతోనే ఉన్నాయి. 1956 తరువాత కూడా ఆ రెండు ప్రాంతాలూ మానసికంగా ఏకం కాలేదు. అటువంటప్పుడు 1956 తరువాత తెలంగాణలో స్థిరపడినవాళ్ళకి అక్కడ స్థానికులకి ఇచ్చే హక్కులు ఇవ్వమంటే ఎలా ఇస్తారు?

   Delete
  6. సైకలాజికల్‌గా అయితే నేతలు సృష్టించడమే తప్ప ప్రజలు కు ఇంత ద్వేషాలు లేవండీ. ఇప్పుడు పెరుగుతున్నాయి కాదు కాదు పెంచుతున్నారు. మీరన్నట్లు అంత ద్వేషమున్నవారు కావాలని అక్కడెలా నివాసం ఉండాలని వెళతారండీ.

   అక్కడ వారు ఇక్కడున్నా, ఇక్కడవారక్కడున్నా మీరన్న సైకలాజికల్ ఫీలింగ్స్ మనకేమైనా ఉన్నాయేమోగానీ ప్రజలు ప్రశాంతంగానే ఉన్నారు.

   Delete
  7. చదువుకున్న వారు అందునా హైదరాబాదులో ఉండే వారికి మాత్రమె ఈ రంది ఎక్కువ. నేను ఆంధ్రలో ఎన్నో ఊళ్లలో తిరిగాను ఎక్కడా తెలంగాణాను ద్వేషించే వారిని చూడలేదు.వీరిలో ఒక్కరు కూడా నాతొ బలవతంగా కలిసి ఉండే తీరాలని అనలేదు.

   Delete
  8. British Indiaలో అక్షరాస్యత 12% అయితే హైదరాబాద్ రాష్ట్రంలో అది 4% ఉండేది. నిజాం బలవంతంగా రుద్దిన ఉర్దూ మాధ్యమ విద్య చాలా మందిని నిరక్షరాస్యుల్ని చేసింది. అప్పట్లో చదువుకోలేక వెనుకబడిపోవడం వల్లే వాళ్ళ ప్రాంతంలోని ఉద్యోగాలని ఆంధ్రావాళ్ళతో నింపించుకున్నారు. ఇప్పుడైనా వాళ్ళు బాగుపడొద్దా?

   Delete
 2. ఇది చాలా సున్నితమైన సమస్య.

  పూర్వం ఆంగ్లేయులు భారతీయులమైన మనని విభజించి పాలించారని పాఠ్యపుస్తకాలలో చదువుకున్నాం. అందరి దృష్టిలో కాకున్నా కొందరి దృష్టిలో ఈ రోజున తెలంగాణాసర్కారువారు తమరాష్ట్రప్రజల్ని విభజించి పాలిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది.

  ఈ రోజు ఉదయం టీవీ9 దూరదర్శనిచర్చాకార్యక్రమంలో రాజకుమారిగారు ఒక వాదన చేసారు. ఇది మొదలు. ఈ విధానాన్ని రేపు ప్రామాణికం చేసి ముందురోజుల్లో తెలంగాణాదొరతనంవారు తమరాష్ట్రంలో స్థిరపడినవారిలో అందరికీ విద్యుత్తు ఇవ్వటం కుదరదనీ దానికీ‌ 1956వ సంవత్సరంలో ఇక్కడపుట్టి ఉండటం అనే విధానం ప్రకారమే విద్యుత్ప్రదానసౌభాగ్యం ఉంటుందని ప్రకటించే అవకాశం ఉందని ఆవిడ ఆందోళన వెలిబుచ్చారు.

  కేసీఆర్ అర్కారువారి వాదన ప్రకారం ఇటువంటి నిర్ణయం ఇతరరాష్ట్రాలలో ఇప్పటికే అమలులో ఉంది తామేమీ మొదలుపెట్తటం లేదు.

  ఐతే స్థానికతమీద భారతదేశస్థాయిలో ఒక చట్టం, అదీ ఒకే విధంగా అన్ని రాష్ట్రాలకూ అన్వయించేవిధంగా ఉంటే బాగుంటుంది. ఈ‌ విషయంలో ఏరాష్ట్రానికి ఆరాష్ట్రం తమ స్థానిక అవసరాలనో రాజకీయప్రయోజనాలనో అంటూ తమకు తాము ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉండటం మంచిది కాదు దేశానికి. అటువంటిది ప్రజల్లో అనైక్యతకూ తద్వారా మరొకసారి దేశవిఛ్ఛిత్తికీ దారితీస్తుంది. నాది ఊహాగానం అని ఎవరైనా ఆక్షేపిస్తే వాదించను, కాని ఈ విషయం కూడా అలోచించమని మాత్రమే నా మనవి.

  ప్రవీణ్‌గార్ తెలంగాణాలో‌ఉన్న ఆంద్రవిద్యార్థులు అన్న పదప్రయోగం చేసారు. కాని వారిలో అత్యధికులు తాము తెలంగాణా బిడ్దలమే‌అన్న భ్రమలో ఉన్నారని సర్కారువారు చెప్పే దాక తెలుసుకోలేదు! దానికి కారణం వారి తండ్రిగారు తెలంగాణాలో పుట్టకపోవటమూ, పైగా వారి తాతగారి కాలానికే తెలంగాణాలో స్థిరపడకపోవటమూ అనేవి అంటే వారికి మింగుడు పడుతుందా? ఇలా అయోమయానికీ‌ మనస్తాపానికీ గురైన పిల్లలు నాకు తెలుసు.

  సీమాంధ్రవాళ్ళంతా పుట్టుకతోటే తెలంగాణాద్రోహులని ఇంతకు పూర్వమే‌శ్రీమాన్ కేసీఆర్‌గారు ప్రకటించటమే కాదు ఆ భావనను వ్యాప్తిచేసే విధంగానే ఆయన పరిపాలన సాగుతోందని ఎవరైనా అక్షేపించేందుకు బోలెడు ఆస్కారం ఉంది.

  ReplyDelete
  Replies
  1. ప్రాంతీయవాదం శృతిమించితే దేశానికి ప్రమాదమే.

   అయితే మీరన్నంత స్థాయిలో దేశ విచ్చిత్తికి దారితీసేలా మాత్రం మన ప్రజలను నేతలు రెచ్చగొట్టలేరు. దానివల్ల ప్రజలకూ-నేతలకు ప్రయోజనం లేదు గనుక ఆ చైతన్యాన్ని కోల్పరనే నేను అభిప్రాయపడుతున్నాను శ్యామలీయం గారు.

   కే.సీ.ఆరే కాదు ఎవరు చేసినా ఆయనకంటే ముందు చేసినా ఇలాంటి పిచ్చి పనులను మనం సమర్ధించకూడదు. ముందు మనం భారతీయులం - తరువాత తెలుగువారం- ఆ తరువాతే తెలంగాణా- ఆంధ్ర ప్రాంతపు సోదరులం. అయితే ప్రభుత్వాలు బయటి ప్రాంతాల ఆర్ధిక భారాలను మోయడానికి నిబంధనలు ఏర్పాటు చేసుకోవడం తప్పు కాదు. అయితే కక్ష సాధింపుగానో అనాలోచితంగానో అసంబద్ధంగానో నిర్ణయాలుండకూడదు. అది ఎవరు చేసినా చంద్రబాబయినా, చంద్రశేఖరరావు అయినా మరో రాష్ట్రమయినా వ్యతిరేకించాల్సినదే. ముఖ్యంగా తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టే ఇలాంటి చర్యలను మనం ఖండించాలి. విదుత్ ఒప్పందాలప్పుడు బాబు నిర్ణయాన్ని మనం వ్యతిరేకించాము. ఇప్పుడు కే.సీ.ఆర్ ని వ్యతిరేకిస్తున్నాము. వీరిద్దరి అభిమానులకు నొప్పి కలుగుతుందనో, తెలంగాణా వాదాన్నో, సమైక్యవాదాన్నో బలపరచిన వారు ఆ సీక్వెన్స్‌ని ఇంకా కొనసాగిస్తామనో వాదనలు చేయడానికి తెలుగువారి రెండు ప్రభుత్వాలలోని లోపాలను ఎండగట్టడానికీ పోలిక ఉండకూడదు.

   నాకు తెలిసి కే.సీ.ఆర్ ఈ విషయంలో పునరాలోచించుకోకపోతే ప్రజా వ్యతిరేకతను తెలంగాణాలోనే తెచ్చుకుంటాడు. తెలంగాణా విద్యార్ధులే ఇబ్బందులు పడుతూ వ్యాఖ్యానించడం ప్రత్యక్షంగా చూశాను. అంతక్రితం తెలంగాణాను మీరు వ్యతిరేకించడం బాగాలేదని నాతో వాదించినవారు కావడం గమనార్హం.

   'స్థానికత' అనేదానికి దేశవ్యాపితంగా ఒకే పద్ధతి ఉంతే మరీ మంచిది. మీరన్నట్లు అది చట్టంగా రూపొందితే మరీ మంచిది. ఇలాంటి చేష్టలెక్కువైతే ఎక్కువమంది ముఖ్యమంత్రులకు ప్రాంతీయ పిచ్చ పీక్ స్టేజికి చేరితే అదీ తప్పదేమో. చూద్దాం ఏం జరుగుతుందో!

   ప్రవీణ్ వాదనలో పస కనిపించలేదు. తెలంగాణాలో ఉంటున్న ఆంధ్రా విద్యార్ధులకు ఫీజు రీ ఎంబర్స్‌మెట్ ఎలా ఇవ్వాలీ అన్నది ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రు కూర్చుని ఇరు రాష్ట్రాలలో ఉన్న తెలుగువారందరికీ ఈ పథకం గతంలోలానే వర్తింపజేయాలి. అవసరమైతే కేంద్రం సహాయం తీసుకోవాలన్న రాఘవులు సూచనను పాటించాలి. 1956 కంటే ముందు అనే నిబంధనను వ్యతిరేకించడానికీ తెలంగాణాలో ఉన్న ఆంధ్ర విద్యార్ధులకు ఫీజు రీ్ఎంబర్స్‌మెంట్ వర్తింపజేయడానికి తేడా ఉన్నదని ప్రవీణ్ గుర్తించినట్లనిపించలేదు

   Delete
  2. ఇది చాలా దారుణం, మూర్ఖత్వం. చివరికి వేరే దేశాల్లో స్థిరపడ్డా ఇంత దారుణంగా ట్రీట్ చేయరు. ఉదాహరణకి ఉద్యోగ రీత్యా అమెరికా కి వెళ్లి స్థిర పడితే విద్యా స్థాయిని బట్టి అయిదు నుండి పదేళ్ళలో గ్రీన్ కార్డు ఇస్తారు. అదే అమెరికాకి దేనికోచ్చారు అనే దానితో సంబంధం లేకుండా వారికి పిల్లలు పుడితే వారికి పౌరసత్వం ఇస్తారు. వారు అన్ని ప్రభుత్వ ప్రయోజనాలకి అర్హులు. అంటే సొంత రాష్ట్ర రాజధానిలో స్థిర పడటం కంటే వేరే దేశం లో స్థిర పడటం బెటర్ అన్నమాట. ఇంకా దారుణం ఏంటంటే చదువుకున్న మూర్ఖులు కూడా దానికి సపోర్ట్ చేయడం. ఏమైనా అంటే పక్క మీ రాష్ట్రం వారికి మీరు కట్టుకోండి అనటం. అంటే మీ వారిగా ఎవరిని పరిగణిస్తున్నారు? ఎన్ని సంవత్సరాలు ఉంటె మీ వారి కింద పరిగనిస్తారు? పాపం మెదడు 1956 లో స్ట్రక్ అయిపోయిందనుకుంటా వీళ్ళకి. 2014 కి వస్తే బాగుంటుంది వీళ్ళంతా.

   ఇది కొనసాగితే దేశ విచ్చిత్తి కి దారి తీస్తుంది అనటం తో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. కొండల రావు గారూ, మీ లాగానే నేను కూడా జాతీయ వాదిని. భారతదేశం అంతా నాది అనుకునే వాడిని. మా స్వచ్చంద సంస్థ ద్వారా ఎంతో మంది విద్యార్థులకి ప్రాంతం తో సంబంధం లేకుండా మంచి విద్యను అందించడానికి కృషి చేసిన వాడిని. అలాంటిది ఇప్పుడు తెలంగాణా అంటే అసహ్యించుకునే స్టేజి లో ఉన్నా. సీమాంధ్రుల మనసులని ఎంత గాయ పరిచారు అంటే నేను మాటల్లో చెప్పలేను. విభజన జరిగే వరకు ఎన్ని మాటలన్నా పోనీలే, ఏదో వేడిలో అలా అంటున్నారు అని సర్దుకు పోయాను. కానీ విభజన అయ్యాక ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు దేశం లో ఏ మూల ఉపద్రవం జరిగినా బాధ పడతాను కానీ తెలంగాణా ఏమయిపోయినా నాకు నొప్పి కాదు. చదువుకుని, అమెరికా కి వచ్చి ఉద్యోగం చేసుకునే వాడు కూడా ఆంధ్రోల్లు దోచుకున్నారు అనే వాడే. తెలంగాణాకు చెందిన మెజారిటీ ప్రజలు అడ్డంగా మూర్ఖంగా వాదించే వారే. మీకు తెలిసిన ఎంత మంది తెలంగాణా వాదులు మీ లాగా హేతుబద్ధంగా ఆలోచిస్తారు చెప్పండి. ఈ మూర్ఖులకి తెలియదు ఎంత మందిని అనవసరంగా గాయ పరుస్తున్నాం, శత్రువులని చేసుకున్నాము అనేది. దేశం మధ్యలో ఒక ఇండియా పాకిస్తాన్ ని తయారు చేస్తున్నారు.

   1956 రూల్ వల్ల నాకు పోయేదేం లేదు. అలాగే హైదరాబాద్ లో స్థిరపడ్డ ఉద్యోగస్తులకి, వ్యాపార వర్గాలకి ఇబ్బంది లేదు ఎందుకంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్‌మెంట్ తో పని లేదు, వారు అర్హులు కూడా కాదు. కానీ పొట్ట చేత బట్టుకుని ఇక్కడికి వచ్చి స్థిర పడ్డ ఏ భవన నిర్మాణ కార్మికుడో, ఏ ఆటో వాడో., ఏ ఫ్యాక్టరీ లో పని చేసే వాడో, ఏ అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ కి సెక్యూరిటీ గానో పనిచేసే వాడి పిల్లల పరిస్థితి ఏంటి? 1956 కి ముందు వాళ్ళ తల్లి తండ్రులు ఇక్కడ పుట్టలేదు కాబట్టి వారి పిల్లలు ఇక్కడా అనర్హులే, గత 10 ఏళ్ళు గానో, 20 ఏళ్ళు గానో ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ప్రాంతం లో నివాసం లేరు కాబట్టి అక్కడా అనర్హులే అంటే ఏంటి పరిస్థితి. ఏమైనా బుర్ర ఉందా కొంచెం అయినా. ఇది కేవలం ఆంధ్ర ప్రదేశ్ వాళ్ళ పరిస్థితి ఒక్కటే కాదు. వేరే రాష్ట్రాల వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ఉండొచ్చు. వారి పరిస్థితి ఏంటి? పైగా ఇక్కడ ఉన్నోల్లంతా మా వాళ్ళే. వారి కాలికి ముళ్ళు గుచ్చు కుంటే నా పంటితో తీస్తాను అని చాలా పెద్ద పెద్ద డైలోగులు కొట్టారు. ఇప్పుడు రాష్ట్రం వచ్చాక వెన్నుపోటు మీద వెన్ను పోటు పొడుస్తున్నారు.

   Delete
  3. మీ వాదనతో నేను ఏకీభవించను శ్రీ గారు.

   మీరెంతమంది తెలంగాణా ప్రజలతో మాట్లాడి మెజారిటీ అనే నిర్ణయానికి వచ్చారు. బ్లాగులలో వాదించే వారి సంఖ్య ఎంత? రాజకీయ పబ్బాలకోసం మాట్లాడే వారెంత? రెచ్చగొట్టడంలో ఆంధ్రాప్రాంతం వారూ తక్కువేమి తినడం లేదు.

   అసలాంధ్రా నేతల చీకటి లాబీయింగులు, అమ్మ దయకోసం ప్రాకులాటలు , చంద్రబాబు రెండుకళ్ల అయోమయ వంకర సిద్ధాంతం వల్లే తెలంగాణా ఏర్పడిందింత త్వరాగా అనేది నా అభిప్రాయం. ఆ విషయంలో వీళ్లకంటే డొంకతిరుగుడు లేని కే.సీ.ఆర్ వైఖరి ఎన్నోరెట్లు నయం కాదా?

   అంటే ఆంధ్రా ప్రాంతం వారికి బాధ్యత లేదా? మీ నేతలంతా బుద్ధిమంతులా? తెలంగాణా ఏమైనా ఫర్వాలేదనుకునే మీరు జాతీయవాది ఎలా అవుతారండీ? భారత దేశమంతా నాది అనుకునేవారయితే తెలంగాణాను వేరుగా చూసే హక్కు మీకెవరిచ్చారు? దానిని మీరెలా సమర్ధించుకుంటారు? అలా అనుకుంటూ జాతీయవాదిననై ఎలా చెప్పుకుంటారు? ఇదే రకం సిద్ధాంతం?

   తెలంగాణాను దేశంలో వేరుగా చూడాలని తెలంగాణా ప్రజలు కోరుకుంటున్నారని నేననుకోను. 1956 నిర్ణయం దారణమనేది నిజం.

   వేరే దేశాల్లో స్థిరపడ్డా ఇంత దారుణంగా ట్రీట్ చేయరనేది పరిశీలించాలి.

   దేశం మొత్తానికి స్థానికత విషయంలో ఒకేలా నిర్ణయం ఉండాలనేది నా అభిప్రాయం. కే.సీ.ఆర్ పోకడలు తెలుగు ప్రజల మధ్య అంతరాలు తగ్గించేలా లేవనేది నిజం.

   దయచేసి రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించడం తెలంగాణా వారివల్లే అలా మాట్లాడాల్సి వస్తుందని అనడం కూడా ఒకరకం తెలివితేటలు ప్రదర్శించడమే అవుతుందని నా అభిప్రాయం. నా అభిప్రాయం చెప్పాను తప్ప మిమ్ములను గాయపరచడం నా ఉద్దేశం కాదు. మీరు గాయపడినా నా అభిప్రాయం అదే. అర్ధం చేసుకోగలరని విజ్ఞప్తి.

   Delete
  4. ఇంకో విషయం, తెలంగాణా వాలా జాగో ఆంధ్రా వాలే భాగో అన్నా, ఆంధ్రా వాళ్ళ బిర్యానీ పేడ లెక్క ఉంటది అన్నా, అనపకాయ అన్నోడిని సెక్రటేరియట్ లోపలికి రానివ్వమన్నా, ఆంధ్రలో పుట్టినోల్లంతా రాక్షసులే అన్నా, 1956 కి ముందు ఇక్కడ ఉన్నోల్లకి మాత్రమె ఫీజు రియంబర్స్‌మెంట్ అన్నా ఇలా చెప్పుకుంటూ పొతే గత 5 ఏళ్ళలో కొన్ని వేల జాతి విద్వేష పూరిత ప్రసంగాలు చేసి, ఒక రాష్ట్ర ప్రజలని మానసికంగా విడదీసి బద్ధ శత్రువులుగా చేసినా ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం లో ఒక్క వ్యవస్థ కూడా స్పందించి దానిని ఆపలేకపోయిందంటే, ఇప్పటికీ ఆపలేక పోతోందంటే, ఎందుకు ఈ వ్యవస్థలు? ఇంత నిద్రాణ స్థితి లో వ్యవస్థలు ఉన్నా దేశం ఇంకా విచ్చిన్నం కాలేదంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కేవలం దైవభూమి కావడం వల్లనే అయ్యి ఉండాలి. ఇలాంటి వాళ్ళని ఇంకా ఉపేక్షిస్తే, శ్యామలీయం గారు అన్నట్టు దేశం విచ్చిన్నం అయ్యే రోజు ఎంతో దూరంలో లేదు.

   Delete
  5. కే.సీ.ఆర్ నోటిదూలను సమర్ధించమనీ, తెలంగాణా అంటే కే.సీ.ఆర్ ఒక్కరే కాదని నేను గానీ, తెలంగావాదులైన ఇతర బ్లాగర్లు గానీ గతంలో చాలాసార్లు చెప్పిన విషయం మీరు గుర్తించాలి శ్రీ గారు. ప్రశ్నిస్తానని చెప్పి నిద్రపోతున్న పవన్ ను , సామాజిక తెలంగాణా అంటూ మంత్రి పదవి కోసం పార్టీని కాంగ్రెస్‌కు అమ్మిన ఆయన అన్నను కూడా క్షమించినది ఈ పుణ్యభూమే కదా?

   Delete
  6. "మీరెంతమంది తెలంగాణా ప్రజలతో మాట్లాడి మెజారిటీ అనే నిర్ణయానికి వచ్చారు."
   నేను కేవలం బ్లాగుల్లో చూసి ఆ మాట అనటం లేదు. గత అయిదు సంవత్సరాలుగా మాధ్యమాలలో గమనిస్తున్నా(కేవలం రాజకీయ నాయకులు కాదు), నాకు తెలిసిన తెలంగాణా వాళ్లతో సంభాషణల్ని బట్టి ఆ నిర్ణయానికి వచ్చాను. ఏమో మీలాగా హేతు బద్దంగా మాట్లాడే వారు కొంత మంది తెలిస్తే అభిప్రాయం మార్చుకుంటానెమో. ఇప్పటికైతే నా అభిప్రాయం అది.

   "అసలాంధ్రా నేతల చీకటి లాబీయింగులు, అమ్మ దయకోసం ప్రాకులాటలు , చంద్రబాబు రెండుకళ్ల అయోమయ వంకర సిద్ధాంతం వల్లే తెలంగాణా ఏర్పడిందింత త్వరాగా అనేది నా అభిప్రాయం. ఆ విషయంలో వీళ్లకంటే డొంకతిరుగుడు లేని కే.సీ.ఆర్ వైఖరి ఎన్నోరెట్లు నయం కాదా?"
   అసలు కెసిఆర్ ఈ లొల్లి మొదలెట్టక పొతే మీరు పై చెప్పినవన్నీ ఉండేవే కాదు కదా. చీకటి లాబీయింగులు, అమ్మ దయకోసం ప్రాకులాటలు , చంద్రబాబు రెండుకళ్ల అయోమయ వంకర సిద్ధాంతం వల్ల వాతావరణం ఇంకా కలుషితం అయ్యిందనే దానితో ఏకీభవిస్తున్నా. కానీ కెసిఆర్ వైఖరి ఎన్నో రెట్లు నయం అంటే నేను ఒప్పుకోను. మన దేశం లో ఇంతటి చీడ పురుగుని నేను చూడలేదు.

   "అంటే ఆంధ్రా ప్రాంతం వారికి బాధ్యత లేదా? మీ నేతలంతా బుద్ధిమంతులా? "
   బుద్ధిమంతులు కానే కాదు. ఆంధ్ర ప్రాంత నాయకులు బాధ్యత లేకుండా వ్యవహరించి తమను నమ్ముకున్న ప్రజలని నట్టేట్లో ముంచారు. కానీ తెలంగాణా వాళ్ళని తిట్టి, విద్వేష ప్రసంగాలు చేసి(నాకు తెలిసి ఒక్క పయ్యావుల కేశవ చేసిన వ్యాఖ్యలు తప్పితే) జనాల మధ్య చిచ్చు పెట్టలేదు.

   "తెలంగాణా ఏమైనా ఫర్వాలేదనుకునే మీరు జాతీయవాది ఎలా అవుతారండీ? భారత దేశమంతా నాది అనుకునేవారయితే తెలంగాణాను వేరుగా చూసే హక్కు మీకెవరిచ్చారు? దానిని మీరెలా సమర్ధించుకుంటారు?"
   నేను సమర్థించుకోవడం లేదు. నేను ఇంతకు ముందు ఎలా ఫీల్ అయ్యేవాడిని ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాను, దానికి దారి తీసిన పరిస్థితులని మాత్రమె చెప్తున్నాను.

   "తెలంగాణా వారివల్లే అలా మాట్లాడాల్సి వస్తుందని అనడం కూడా ఒకరకం తెలివితేటలు ప్రదర్శించడమే అవుతుందని నా అభిప్రాయం. నా అభిప్రాయం చెప్పాను తప్ప మిమ్ములను గాయపరచడం నా ఉద్దేశం కాదు"
   క్షమించాలి. నేను ఇక్కడ నా తెలివితేటల ప్రదర్శనకి రాలేదు. కేవలం నా ఆక్రోశం వెళ్లగక్కుతున్నాను అంతే. కొండల రావు గారూ, మీరు ఎలాంటి వారో మీరు చర్చల్లో చేస్తున్న వ్యాఖ్యల్ని బట్టి నాకు ఒక అభిప్రాయం ఉంది. అందుకే మీ బ్లాగ్ అన్నా, మీరు అన్నా నాకు గౌరవం. మీ అభిప్రాయంతో నేను ఏకీభవించక పోవచ్చు కానీ మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను, ఇంకోసారి ఆలోచిస్తాను. మీది గాయపరిచే మనస్తత్వం కాదని తెలుసు అందుకే I will not take any offense. మీ అభిప్రాయాల్ని, నా ఆలోచనల్లో తప్పుని దయచేసి నిర్ద్వందంగా చెప్పండి మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను.

   Delete
  7. కొంచెం చర్చ పక్కకి వెళ్తున్నట్టు ఉంది. Let me stick to the point.

   1956 అనే నిబంధన పెట్టడం ప్రజల్ని విడదీసి చూడటం అవుతుంది. దాని వల్ల నష్టపోయేది పేద విద్యార్థులు. ఇలాంటి కుత్సిత ఆలోచనలు మానేసి స్థానికతకి ఒక హేతుబద్ధమైన నిర్వచన ఇచ్చి వాళ్ళందరినీ తెలంగాణా వాళ్ళుగా చూస్తె తెలంగాణా కె మంచిది.

   Delete
  8. మీరు తెలివితేటలు ప్రదర్శించడానికి వచ్చారనే ఉద్దేఅశం లేదండీ. తెలంగాణా వారివల్లే అలా మాట్లాడుతున్నామని ఆంధ్రావారు కొందరు, ఆంధ్రావారు ప్రతీదానిలో మోసం చేసేవారన్నట్లుగా తెలంగాణా వారు కొదరు మాట్లాడడం మాత్రం ఒకరకమైన తెలివితేటలు ప్రదర్శించడమవుతుందనేది నా అసలు ఉద్దేశం. చర్చ పక్కకు పోయినా మళ్లీ గాడినపడింది లెండి. మీరన్న ఈ వాకుయమే ఈ పోస్టుకు సమాధానంగా సరిపోతుంది. " స్థానికతకు సహేతుకంగా నియమం ఏర్పరచి పేద విద్ద్యార్ధులు నష్టపోకుండా కే.సీ.ఆర్ ప్రభుత్వ వైఖరి ఉండాలి". నా అభిప్రాయాన్ని ఆలోచిస్తానన్నందుకు, నా పై మీకున్న సదభిప్రాయానికీ ధన్య్వాదములు శ్రీ గారు.

   Delete
 3. ఖమ్మం, కొత్తగూడెం, మధిర ప్రాంతాలు 1959 వరకు వరంగల్ జిల్లాలోనే ఉండేవి. ఈ ప్రాంతాలవాళ్ళకి 1956 స్థానికత నియమం వల్ల నష్టం ఉండదు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తీసుకొచ్చిన గ్రామాలవాళ్ళకే ఇక్కడ సమస్య ఉంటుంది.

  ReplyDelete
  Replies
  1. మీ వాదనతో ఏకీభవిస్తున్నాను. కానీ అధికారుల లెక్కలు రికార్డులు భద్రంగా ఉంటాయన్న నమ్మకం లేదు. ఖమ్మం జిల్లా ఏర్పడిన విషయం అంత ప్రాధాన్యత కాదు గానీ, స్థానికతకు 1956 నిబంధన తప్పు. దానిని మీరు సమర్ధించడం అదీ కమ్యూనిస్టునని చెప్పుకుంటూ.... నాకు ఆశ్చర్యమేసింది. 1956 తరువాత వచ్చిన వారు ఇక్కడ పన్నులు కట్టడం లేదా? వారి కొనుగోలు టేక్సుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదా? ఎందుకు ప్రజలను ఇలా హింసించాలి? ఆ నిబంధనను మాత్రమే నేను వ్యతిరేకిస్తున్నాను తప్ప పేదవారు కానివారిని, ఆంధ్రాలో ఆస్థులు ఉండి దొంగ సర్టిఫికెట్లుతో మోసం చేసేవారికి ఏ ప్రభుత్వమైనా అప్పనంగా సేవలందించాలనడం లేదు. పెట్టుబడిదారులను ఆహ్వానించడం కూడా 1956 నిబంధన వర్తింపజేస్తారా? ఇతర రాష్ట్రాల పెట్టుబడిదారూలను తెలంగాణా ప్రభుత్వం ఆహ్వానించదా? ప్రైవేటీకరణకు స్వాగతం పలకదా? అప్పుడూ నిబంధనిలాలాగే ఉంటాయా?

   Delete
 4. "1956 కు ముందున్నవారికే ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ ఇస్తామంటున్న తెలంగాణా ప్రభుత్వ నిర్ణయం"

  ప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ పథకాన్నిరద్దు చేసింది గమనించగలరు. దాని స్థానంలో తెలంగాణా విద్యార్తులకు ఆర్ధిక సాయం అనే కొత్త పథకాన్ని తెద్దామని అంటున్నారు.

  "ఖమ్మం జిల్లా 1959లో ఏర్పడింది"

  మరీ విడ్డూరంగా ఉంది. జిల్లా లెకపొవొచ్చు కానీ ఊళ్లు కొత్తగా పుట్టుకురాలేదు కదా?

  "చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని ఆయన అన్నారు"

  ఎవరితో చర్చించాలొ కూడా కామ్రేడు రాఘవులు చెబితే బాగుంటుంది.

  ReplyDelete
  Replies
  1. జైగారూ, మీరు సూచించింది గమనికలోనికి తీసుకోవటం అవసరమైనదే, కాని మౌలికమైన చర్చాంశంలో దానివలన వచ్చే మార్పు యేమీ లేదు కదా? 1956 కు ముందున్నవారికే ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ అన్న పదప్రయోగం కొంచెంగా మారి 1956 కు ముందున్నవారికే ఆర్ధిక సాయం అన్న పదప్రయోగం వచ్చింది. ఈ మార్పు సారాశం 1956 కు ముందున్నవారికే తెలంగాణావాసులుగా గుర్తింపు అన్నది. ఈ సారాంశం మీదే అసలు చర్చ నడుస్తున్నదని నా అభిప్రాయం.

   ఇకపోతే చర్చను ప్రస్తావించిన టపాలోనే స్పష్టంగా "రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమవేశమై చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని రాఘవులు విజ్ఞప్తి చేశారు." అని ఉటంకించటం జరిగిందికదా, అందుచేత ఇక్కడ అస్పష్టత లేదు.

   Delete
  2. శ్యామలీయం గారూ:

   అసలు విషయం గురించి కింద వ్యాఖ్యానించాను. చదివి మీ అమూల్యమయిన అభిప్రాయం వెలిబుచ్చ గలరు.

   ఆర్ధిక సాయం అంటే కేవలం ఫీసులు మాత్రమె కాకపోవొచ్చు. కాస్త ఓపిక పడితే తెలుసుతుంది.

   స్థానికత నిర్వచనం మారదు కనుక మిగిలిన 28 రాష్ట్రాల పిల్లలకు యథావిధిగా పోటీ పడే అవకాశం ఉంటుంది. అంచేత ఇది తెలంగాణా-ఆంద్ర (లేదా తెలంగాణా-కర్నాటక వగైరా) సమస్య కాదు.

   కామ్రేడు రాఘవులు గారి ఉద్దేశ్యం అర్ధం అయింది, thanks for the clarification. అయితే వారికి నాడో విన్నపం. 1956 ఆవాసం ముడి పెట్టడం వల్ల కర్నాటక వగైరా 27 రాష్ట్రాల నుండి వచ్చి స్థిరపడ్డ వారికి కూడా నష్టం. 28 మంది ముఖ్య మంత్రులను పిలిచి చర్చించడం జరిగే పనేనా?

   Delete
 5. చర్చ పూర్తిగా తప్పు దారి పట్టింది :)

  అసలు చర్చాంశాలు ఏమిటన్న మాట పలువురు పట్టించుకోవడం లేదు. ముందు కొన్ని విషయాలను పరిశీలిద్దాం:

  1. 371-డీ కింద వెలువడ్డ స్థానికత నిర్వచనం మార్చే హక్కు తెలంగాణా ప్రభుత్వానికి లేదు. వారు ఆ దుస్సాహసం చేయడం లేదు కూడా.
  2. స్థానికులకు రిజర్వేషన్ పోను మిగిలిన స్థానాలలో చేరే హక్కు స్థానికేతరులకు (ఆంధ్రతో సహా 27 ఇతర రాష్ట్రాలలో ఎక్కడి వారయినా) ఉంది.
  3. అలా చేరిన రాష్ట్రేతరులకు ఆర్ధిక సాయం చేయమని ముందటి నుంచే చెప్తున్నారు. ఈ విషయాన్ని కొందరు అభ్యంతర పెట్టినా, ఇది ప్రస్తుత చర్చా వస్తువు కాదు.
  4. పాత పథకంలో కూడా రాష్ట్రేతరులకు దమ్మిడీ ఇవ్వడం లేదని మనం గుర్తించుకోవాలి.

  ఇక్కడి వరకూ నాకు ఎటువంటి బేధం లేదు. కొత్తగా ప్రవేశ పెడుతున్న FAST పథకం పూర్తి వివరాలు ఇంకా రానప్పటికీ ఎక్కడో అక్కడ 1956కు లింక్ పెట్టె ఆలోచన మాత్రం సుస్పష్టం.

  1. ఆర్ధిక సాయం అయినా కరెంటు సబ్సిడీ లాంటి ఎలాంటి ఆంశమయినా హక్కు కాదు, కేవలం సౌకర్యం మాత్రమె.
  2. కానీ పథకాల అర్హతకు హేతుబడ్డ మార్గదర్శకాలు ఉండాలి. ఇవి పథకం యొక్క ఉద్దేశ్యానికి ముడి పది ఉండాలి మరియు ఆబ్జెక్టివ్ కావాలి.
  3. రాష్ట్రేతరులకు సాయం ఇవ్వాల్సిన అవసరం ఏకోశాన లేదు.
  4. తెలంగాణా విద్యార్తులకు ఆర్ధిక సాయాన్ని వారి సామాజిక (OBC/SC/ST)/ఆర్ధిక (EBC) స్తోమతుతో ముడి పెట్టడం శ్రేయస్కరం.
  5. 1956 అనే నిబంధనలో సహేతుకత లేదు అంచేత ఇది సమర్తనీయం కాదు

  ReplyDelete
  Replies
  1. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది.అందుకనే అన్ని రాష్ట్రాలూ తమ రాష్ట్రం లోని విద్యాసంస్తల్లో చదువుకునే విద్యార్ధు లందరినీ ఒకే రకంగా ప్రోత్సహిస్తున్నారు!

   లోకంలో గాయత్రీ మంత్రం విశ్వామిత్రుడి కన్నా ముందే వుంది. భరద్వాజ గాయత్రి మొదలు చాలా వున్నాయి,వశిష్ట గాయత్రి కూడా వుంది, అయినా విశ్వామిత్రుడి గాయత్రికే యెందుకు పెద్ద పీట వేసారో తెలుసా?"ఈ భూమ్యాకాశముల మధ్యన వున్న జ్ఞానమనే వెలుగు (కేవలం బ్రాహ్మల మెదళ్లలోనే కాకుండా)సర్వులకూ లభించు గాక" అనే వున్నత భావం వుండటం వల్ల.

   ఇప్ప్పుడు మనం చర్చించుకుంటున్నది విద్య గురించి కాబట్టి అది జ్ఞానం అనే వున్నత గుణంతో అనుసంధానించబడి వుంది కాబట్టి ప్రస్తావించాను.అది కాక పోయినా మనిషయిన ప్రతివాడికీ ప్రతి క్షణమూ రెండు చీలుదారుల శృంగాటక జంఝాటం యెదురవుతుంది, ఔన్నత్యమా ఔధ్ధత్యమా అని.నా రాష్ట్రంలో పుట్టిన వాళ్ళే నాకు ముఖ్యం అని గిరి గీసుకుని కూర్చోకుండా సర్వుల్నీ సమాదరించటం అనేది ఔన్నత్యమా ఔధ్ధత్యమా అనేది మీరూ మీ ముఖ్యమంత్రీ తేల్చుకోవాలి.సాంకేతికంగా మీ ముఖ్యమంత్రికి స్థానికతను నిర్ణయించుకునే అధికారం వుంటే వుండవచ్చు, మా పిల్లలకి ఫీజులు మేమే కట్టుకుంటాం అని అన్నాక కూడా మళ్ళీ కోర్టులో కేసు వేస్తాం అనే పచ్చ తమ్ముళ్ళు సుప్రీం కోర్టుతో చివాట్లు పెట్ట్టించుకుంటే పేట్టించుకోవచ్చు గాక, విద్య విషయంలో లోభితనం చూపించడమా వుదారంగా వుండటమా అనెది మనోగతమయిన సంస్కారానికి సంబంధించిన విషయం.మీ ముఖ్యమంత్రి యెటూ ఔధ్ధత్యానికే తెగబడుతున్నాడు,మీరు కూడా అదే దారిలో వెళ్ళదల్చుకుంటే మా మాటకి విలువ వుండదు గనక నోరు మూసుకుని కూర్చోవడం, తెలంగాణాలో కాకుండా మరొక రాష్ట్రానికి వెళ్ళటం తప్ప మాకు ప్రత్యామ్నాయం లేదు.మరి మీ సంగతేమిటి?ఈ రెండు చీలుదారుల శృంగాటక జంఝాటం మీకు యెదురయ్యింది ఇక్కడ! మీరు వున్నతంగా అలఓచించగలిగితే మీ ముఖ్యమత్రి కూడా ఔన్నత్యం ఔధ్ధత్యం కన్న గొప్పదని తెలుసుకుంటే మంచిది.శుభం!

   Delete
  2. నాకు తెలిసి రాష్ట్రేతరులకు ఎవరూ ఆర్ధిక సాయం చేయడం లేదు. ఒకవేళ చేసినా అది వారి సొంత నిర్ణయం: అందరూ పాటించాల్సిన అవసరం లేదు.

   దానం మంచి విషయమా కాదా అన్న వాదనలో నేను దిగదలుచుకోలేదు. ఇక టపా విషయం కాని మరియు నాకు పెద్దగా తెలీని గాయత్రి మంత్రం గురించి నేను మాట్లాడడం అనవసరం.

   Delete
  3. నేను మీ కామెంటుని ఆలస్యంగా చూశానండీ. తరువాత మీరు - శ్యామలీయంగారు వాదనలన్నీ చూశాక ప్రత్యేకించీ నేను కామెంట్ పెట్టాల్సిన అవసరం లేదనిపించినది. 1956 నిబంధనను మీరు సమర్ధించలేదు గనుక ఇక పేచీలేదు. రాఘవులు ఉద్దేశం స్పష్టంగానే ఉన్నది. ఇరు ప్రభుత్వాలు చర్చించాలి. ఇక్కడివారక్కడ, అక్కడవారిక్కడా ఉన్నారు. ఇతర రాష్ట్రాలనుండి వచ్చినా స్థానికత అనేదానికి దేశవ్యాపితంగా ఒకే నిబంధన ఉండడం మంచిది. అవసరమైతే కేంద్రం సహాయం తీసుకోమన్నారాయన. కానీ వీరిరువురూ చర్చించుకునే స్థితిలో ఉన్నట్లనిపించడం లేదు.

   స్థానికతకు సహేతుకమైన క్లారిటీ ఇచ్చి మీరన్నట్లు తెలంగాణా విద్యార్ధులకు సామాజిక మరియూ ఆర్ధిక ప్రాతిపదికన సహాయం అందించాలి. ఆర్ధిక సహాయం హక్కు కాకున్నా అది అందించేదానిలో ప్రజలందరికీ ఒకే నిబంధన ఉండాలి.

   Delete
  4. జైగారూ, స్థానికత నిర్వచనం మార్చే హక్కు తెలంగాణా ప్రభుత్వానికి లేనప్పుడు తెలంగాణా ప్రభుత్వం వారు స్థానికతను 1956వ సంవత్సరాన్ని ప్రాతిపదికగా నిర్వచించలేరు. స్థానికత యొక్క నిర్వచనం మారనంత వరకూ సీమాంధ్రనుండి కాని దేశంలోని మరే యితర ప్రాంతం నుండి కాని వచ్చి ఇక్కడ అతెలంగాణాలో స్థిరపడినవారూ, వారిబిడ్డలూ ఆందోళన చెందనవుసరం ఏమాత్రం లేదు. ఈ 1956వ సంవత్సరం అనే కొత్త నిబంధనపైనా దాని చెల్లుబాటు లేదా తదనంతరపరిణామాల పైనా హెచ్చుగా అందోళన వ్యక్తం చేస్తున్నదీ, గడబిడపడుతున్నదీ ఆంద్రాసర్కారువారే కాబట్టీ, తెలంగాణాకు చెందరని భావించబడే అవకాశం‌ ఉన్న విద్యార్థుల్లో హెచ్చుగా ఉన్న వారు సీమాంధ్రజిల్లాలనుండి వచ్చి స్థిరపడినవారి బిడ్డలు కాబట్టి తెలంగాణా సర్కారు ముఖ్యమంత్రి ఆంధ్రాముఖ్యమంత్రితో చర్చిస్తే సరిపోతుందనటం ఆక్షేపణీయం‌ కాదు.

   ఇకపోతే తెలంగాణాప్రభుత్వం ముందుముందు పిడుక్కీబియ్యానికీ ఒకే మంత్రమన్నట్లుగా వీలుచూసుకొని ఈ 1956అనే కొత్త మాజిక్‌నంబర్ ఫార్ములా వర్తింపజేయటానికి ప్రయత్నిస్తుందోమో అన్న ఆందోళన కేవలం ఊహాగానం మాత్రమే అని కొట్టివేయలేమనే నా అభిప్రాయం. నిన్నమొన్ననే విద్యార్థుల బస్సుపాసుల విషయంలో కూడా ఈ 1956 నాటి స్థానికత ఆధారంగా ఇవ్వాలా అన్నదానిమీద ముఖ్యమంత్రిగారు వివరించవలసి ఉందని మరొక మంత్రివర్యులు సెలవిచ్చారు! ఇలా ఇది ఎంతదూరం ఐనా పోవచ్చును కద? మీరూ 1956 అనే నిబంధనలో సహేతుకత లేదు అంచేత ఇది సమర్థనీయం కాదు అనే అభిప్రాయం వెలిబుచ్చారు. దీనవలన స్పర్థలు పెరగటం తప్ప దీర్థకాలంలో వేరే ప్రయోజనం ఏమీ‌ ఉండదు.

   అయినదేదో అయింది. తెలుగునేల రెండయింది. ఇకనైనా ఇరుప్రభుత్వాలూ తమతమ ఇబ్బందులని అడ్డం‌పెట్టుకొని ప్రజల్లో అనవసరమైన వర్గీకరణలు చేసి వాతావరణాన్ని కలుషితం చేయటం మానుకుంటే ఉభయప్రాంతాలకూ మంచిదని నా అభిప్రాయం.

   Delete
  5. శ్యామలీయం గారు:

   ఆర్టికల్ 371-డీ & దాని కింద వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధి ఏమిటో ఒక సారి చూద్దాం:

   "admission to any University within the State or to any other educational institution which is subject to the control of the State Government" (article 371, section 2 b (iiI))

   దీని పరిధి అంతే తప్ప ఆర్ధిక సాయానికి వర్తించదు. స్థానికేతరులకు *కూడా* అవకాశం ఉన్న ఓపెన్ కోటా ఇతర రాష్ట్రాల పిల్లలకు access ఆపడం నియమాలకు విరుద్దం.

   ఆర్ధిక సాయం విషయంలో పరిసితి వేరే. నాకు సాయం చేయాల్సిందే అంటూ విద్యార్తులు లేదా మా పిల్లలకు సాయం చేయాల్సిందే అంటూ వారి "స్వస్థల" ప్రభుత్వాలు పట్టు పట్టలేరు. తమకు అనుకూలం అయిన నిబంధనలు నిర్ణయించుకునే పూర్తి హక్కులు ప్రతి ప్రభుత్వానికి ఉంటాయి. ఆయా నిబంధనలు రాజ్యాంగ విరుద్దం కానంతవరకూ ఎవరికీ జోక్యం చేసుకునే హక్కు లేదు. దీనికి రాజ్యాంగ సంక్షోభం లేదా టెర్రరిజం అంటూ నోరు పారేసుకోవడం లేదా 1956 కంటే ముందు వచ్చిన వారికే కరెంటు ఇస్తారా అంటూ గేలి చేయడం అలా మాట్లాడేవారి విజ్ఞతకు వదిలేస్తాను.

   భారతీయులుగా ప్రతి రాష్ట్రంలో వెలువడే ప్రతి నియమం పారదర్శకంగా ఉండాలని మనం కోరుకోవడం తప్పు లేదు, పైగా శ్లాఘనీయం. తెలంగాణా రాష్ట్రంలో ఆర్ధిక సాయం (లేదా బస్ పాసులు) ఆబ్జెక్టివ్ పరామీటర్స్ ఆధారంగా ఉండాలని నేనూ మీరూ కోరుకుంటున్నాం. కానీ లొల్లి చేస్తున్న వారందరూ ఇదే కోణంలో చూస్తున్నారా?

   ఆర్ధిక సాయం యొక్క నిబంధనల ఆహేతుకత వల్ల నష్టపోయే ప్రజలకు వారి "స్వస్థల" ప్రభుత్వం వకాల్తా పుచ్చుకోలేదు. ఇది కేవలం నిబంధనలు జారీ చేసిన రాష్ట్రానికి నష్టపోతున్న వ్యక్తులకు మధ్య విషయం. Others have no locus standii.

   Delete
  6. గొట్టిముక్కలవారూ, మీ వాదన బాగుంది. ఈ రోజున ఫీజు రీ-ఇంబర్స్‌మెంట్ కోసం ఆశపెట్టుకున్న పిల్లలు టీనేజర్లు. వారితండ్రులు నలభయ్యవపడిలోని వారు. 1956అంటే దాదాపు 60యేళ్ళ వెనుక సంవత్సరం. అప్పటికి ఈ తలిదండ్రులే పుట్టలేదు. ఈ పిల్లల తాతలు అప్పటికే తెలంగాణాలో స్థిరపడటం అనేది ఆధారంగా పిల్లల స్థానికతను నిర్ణయించటం అనేది సబబా అన్నది ప్రశ్న. మీ తాతగారు 1956నాటికే తెలంగాణాకు వలసరాలేదు కాబట్టి పిల్లలూ మీరంతా పరాయి రాష్ట్రంవారే అనటం అంత ఉచితం‌ కాదనుకుంటాను. అది పిల్లలను మానసికంగా వేరుచేసి క్రుంగదీస్తుంది కదా. అంటే వచ్చే తరాల్లో మనమే స్వపరబేధాల్ని కల్పించటం అవుతున్నది. మంచిదా? ఒక చిన్న ఆనుకూల్యత వెనుక ఇలాంటి ఇబ్బంది ఉంటే ఆలోచించవలసిదే కదా?

   తమకు అనుకూలం అయిన నిబంధనలు నిర్ణయించుకునే పూర్తి హక్కులు ప్రతి ప్రభుత్వానికి ఉండవలసిదే, కాని ప్రభుత్వం అంటే చివరకు ప్రజలే. దీర్ఘకాలికంగా ఆ ప్రజలకు ఈ‌నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయా అన్నది ముందు ఆలోచించవలసి ఉంది కదా. అమ్మా నాన్నా పుట్టి పెరిగిన చోట పుట్టి పెరుగుతున్న పిల్లవాళ్ళను మీరు పరాయిరాష్ట్రం వారు అని తేల్చి చెప్పటం నాకైతే అసమంజసమైన ఆలోచనగా అనిపిస్తున్నది. వారు తమది అనుకుంటున్న స్వస్థలాన్ని మన సర్కార్లు మరోచోటికి వారి ప్రమేయం లేకుండా బదిలీ చేసేయటమే!
   అన్నట్లు ఇక్కడ others ఎవరండీ? ఆంధ్రాసర్కారు వారేనా? ఈ పిల్లలదృష్టిలో వారు పరాయివారే మరి.

   Delete
  7. శ్యామలీయం మాస్టారూ, స్థానికతకు సంబందించిన అడ్మిషన్ హక్కును ఎవరూ కాదనడం లేదు. లోకల్ కోటా కింద ప్రెఫరెన్స్ ఉన్న వాళ్ళు ఇతర రాష్ట్రాల పిల్లలు కారు.

   ఆర్ధిక సాయం అనేది హక్కు కాదు. అంతెందుకు పదేళ్ళ క్రితం (వైఎస్ హయాము కంటే ముందు) ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ పథకమే లేదు. ఆ విషయం నన్నపనేనికి తెలీదు కామోసు.

   పిల్లలు తెలంగాణా వారు అలా కాదన్నందుకు క్రుంగిపోతారు అన్నారు. అంతవరకూ బాగుంది. తాము తెలంగాణా వారిమీ మొర్రో అని బాధ పడుతున్న వారి సాయానికి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు రావాలనీ అంటున్నారు. ఇది నాకు మీ వాదనలో వైరుద్ద్యం అనిపిస్తుంది. This discussion may be tangential to the main topic but I just thought of mentioning what looks like a contradiction.

   Delete
  8. @Jai
   "దీని పరిధి అంతే తప్ప ఆర్ధిక సాయానికి వర్తించదు."
   ఊరికే ఏదో ఒకటి పట్టుకొచ్చి దానికి మీకు నచ్చిన నిర్వచనం ఇవ్వకండి. అదే రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్థానికులు అంటే ఎవరో కూడా నిర్వచించారు (G.O. P. No. 646, para 3). అసలు ఫీజు చెల్లింపు పథకం పెట్టాలా వద్దా అనేది తెలంగాణా ప్రభుత్వం ఇష్టం. కానీ ఆ పథకం పెడితే ఇప్పుడున్న స్థానికత నిర్వచనాల ప్రకారం ప్రాంతీయ వివక్ష లేకుండా అందరికీ సమానంగా వర్తింపచేయాలి. అలా చేయకపోవటం సబబా కాదా అనేది ప్రశ్న.

   "నాకు సాయం చేయాల్సిందే అంటూ విద్యార్తులు లేదా మా పిల్లలకు సాయం చేయాల్సిందే అంటూ వారి "స్వస్థల" ప్రభుత్వాలు పట్టు పట్టలేరు"
   ఇక్కడ ఆంధ్రా లో స్థిర పడ్డ వారి పిల్లలకి ఫీజు చెల్లించమని అడగటం లేదు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ స్థిర పడ్డ(ఆంధ్రా నుండి వచ్చినా, ఇతర రాష్ట్రాల నుండి వచ్చినా) వారి పిల్లల ఫీజు చెల్లించడంలో ఎందుకు వివక్ష ప్రదర్శిస్తున్నారు, ఎందుకు వారికి న్యాయంగా రావాల్సిన హక్కులు నిరాకరిస్తున్నారు? ఒక్కసారి శ్రీలంకలో ఎందుకు తమిళ్ టైగర్స్ పోరాటం చేశారో గుర్తు తెచ్చుకోండి. తరతరాలుగా అక్కడ నివసిస్తున్నా వారికి శ్రీలంక ప్రభుత్వం హక్కులు నిరాకరించడం తోటే మొదలయ్యింది. అది వేరే దేశం. కానీ ఇక్కడ ఒకే దేశంలో వలస వచ్చి తరాలుగా ఇక్కడ ఉంటున్న పేద వారి పిల్లలకి హక్కులు నిరాకరించడం దుర్మార్గం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. వేరే రాష్ట్రాల్లో స్థిరపడ్డ వారి పిల్లలకి ఫీజు కట్టమని చెప్పట్లేదు. స్థానికత నిర్వచనం ప్రకారం (ఎక్కడ 4 ఏళ్ళు వరుసగా చదివితే అక్కడ లేదంటే ఏడు సంవత్సరాలు స్థిర నివాసం ఎక్కడ ఉంటె అక్కడ) అందరినీ ఒకేలా చూడాలి. మిగిలిన వాళ్ళు తెలంగాణాలో చదివితే ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అంతెందుకు 40 ఏళ్ళ క్రితం తెలంగాణా వాళ్ళు గుజరాత్ వలస వెళ్ళారనుకోండి వారికి అక్కడి ప్రభుత్వం ఏదైనా పథకం ఇలా 1956 లేదా 1947 ప్రాతి పదికన ఏదైనా పథకం వర్తింప చేయకుండా తెలంగాణా ప్రభుత్వాన్ని భరించమంటే మా వాళ్ళే కదా అని తెలంగాణా ప్రభుత్వం భరిస్తుందా?

   "1956 కంటే ముందు వచ్చిన వారికే కరెంటు ఇస్తారా అంటూ గేలి చేయడం అలా మాట్లాడేవారి విజ్ఞతకు వదిలేస్తాను."
   గేలి చేయమంటే చేయరా మరి. వాళ్ళ విజ్ఞతకి వదిలేయటం కాదు. మీరు విజ్ఞతతో ఆలోచించాలి. 1956 నుండి 2014 కి రావాలి మరి ఇలాంటివి సమర్థించే వాళ్ళంతా. నాకు ఇంకో సందేహం ఏంటంటే 1948 లో భారత్ లో కలిసింది కాబట్టి 1948 కి ముందు నిజాం రాజ్యంలో తెలంగాణాలో ఉన్న వారికి మాత్రమె ఫీజు (ఆ తరువాత ఇక్కడ స్థిరపడ్డ ఇతర భారత దేశ ప్రజలని మినహాయించి) ఇద్దామనే ఆలోచన కచరాకి ఎందుకు రాలేదో? ఆ దిశగా ఏమైనా ఆలొచించరాదూ?

   "ఇది కేవలం నిబంధనలు జారీ చేసిన రాష్ట్రానికి నష్టపోతున్న వ్యక్తులకు మధ్య విషయం. Others have no locus standii."
   I do not agree with that. Every citizen of this country has right to fight for rubbish divisive politics enacted by politicians. ఇలాంటి ప్రాంతీయ విద్వేష రాజకీయాలను, నిర్ణయాలని ఖండించే హక్కు, దానిపై పోరాడే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది.

   "ఆర్ధిక సాయం యొక్క నిబంధనల ఆహేతుకత వల్ల నష్టపోయే ప్రజలకు వారి "స్వస్థల" ప్రభుత్వం వకాల్తా పుచ్చుకోలేదు."
   మీకో సూటి ప్రశ్న. మీ దృష్టిలో ఒక కుటుంబం ఎన్ని సంవత్సరాలు తెలంగాణా లో స్థిర నివాసం ఏర్పరచుకుంటే మీరు స్థానికుడిగా పరిగణిస్తారు (అంటే ఎప్పుడు వారికి తెలంగాణా ప్రభుత్వం వారి ప్రభుత్వం అవుతుంది?)

   Delete
  9. << ఇలాంటి ప్రాంతీయ విద్వేష రాజకీయాలను, నిర్ణయాలని ఖండించే హక్కు, దానిపై పోరాడే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది. >>
   exactly. హక్కు ఉండడం కాదు ప్రతి గొంతూ స్పందించాలి ఐక్యంగా. అప్పుడే ఏలికల వంకర ఆలోచనలకు ఫుల్‌స్టాప్ పడుతుంది. కొంతకాలం అక్కడ స్తిర నివాసమేర్పరచుకుని ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులు కడుతున్న ప్రజలు ఆ ప్రభుత్వాలు కల్పించే అన్ని సదుపాయాలకూ హక్కుదారులై ఉండాలి. ఆ కొంతకాలం అనే నిబంధన దేశమంతటికీ ఒకేలా ఉండాలి.

   Delete
  10. మంచి మాట చెప్పారు. ధన్యవాదాలు.

   Delete
  11. @Sree:

   స్థానికత గురించి మీరు చూపించిన ఉత్తర్వులను ఒకటికి రెండు సార్లు చదివాను. నాకు *ఎక్కడా* ఆర్ధిక సాయం లేదా ఫీసులు గురించి *ఒక్క పదం కూడా* అగుపించలేదు.

   ఇంకొన్ని విషయాలు గమనించండి:

   1. ఉత్తర్వు పేరులోనే "చేరికల నియంత్రణ" అని ఉంది. AP Educational Institutions (Regulation of Admissions) Order
   2. ఈ ఉత్తర్వులు జారీ చేసే హక్కు ఆర్టికల్ 371-డీ నుండి వచ్చింది. ఇందులో అడ్మిషన్ల రిజర్వేషన్ల గురించి తప్ప ఇంకే మాటా లేదు.
   3. ఆర్టికల్ 371-డీ 32వ సవరణ ద్వారా వచ్చింది. అందుట్లో కూడా అడ్మిషన్ల గురించి మాత్రమె ఉంది.

   "అలా చేయకపోవటం సబబా కాదా అనేది ప్రశ్న"

   1956 కటాఫ్ తేదీ పెట్టడం ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉన్నా ఇది సహేతుకం కాదనేదే నా వాదన. దీనికి హక్కుల రంగు పులమే ప్రయత్నం మాత్రం పూర్తిగా నిరాధారం.

   "ఆలోచన కచరాకి ఎందుకు రాలేదో? ఆ దిశగా ఏమైనా ఆలొచించరాదూ?"

   మీరు ఆయన్నే అడిగితె పోలా? నడుమిట్ల పార్టీకి/ప్రభుత్వానికి సంబంధం లేని నన్ను అడిగితె ఎట్లా?

   "ఇలాంటి ప్రాంతీయ విద్వేష రాజకీయాలను, నిర్ణయాలని ఖండించే హక్కు, దానిపై పోరాడే హక్కు ప్రతి భారతీయుడికి ఉంది."

   ఈ "పోరాడే హక్కు" మీకు, నాకు (నేను 1956 కటాఫ్ తేదీకి వ్యతిరేకం అని మీకు అర్ధం ఇప్పటికి అయి ఉండాలి) భారతీయ పౌరులుగా ఉంది. అయితే మనం ఈ విషయంపై నష్టపోతున్న వారి తరఫున వెళ్ళడంలేదు, వెళ్ళలేము కూడా. ఒక సిటిజన్ హక్కుకు ప్రత్యక్ష బాదితుల హక్కుకు తేడా ఉంది.

   We (and the so called native state Govt.) have no locus standi nor can we implead ourselves in a suit. Our rights are limited to expressing our views like any other citizen.

   Delete
 6. హరిబాబుగారూ, గాయత్రీమంత్రం ప్రసక్తి ఎక్కడినుండి వచ్చింది? చర్చకు సంబంధం లేని విషయాలు ప్రస్తావించటం వద్దు. అలాగే అటువంటి ప్రస్తావనలకు ప్రతిస్పందనలూ వద్దు.

  తెలంగాణాలో కాకుండా మరొక రాష్ట్రానికి వెళ్ళటం తప్ప మీకు ప్రత్యామ్నాయం లేదనుంటే దానికి తెలంగాణా సర్కారుకేమి అబ్యంతరం ఉంటుంది. వేరే రాష్ట్రంలో ఫీజులు ఇచ్చి చదివిస్తే వెళ్ళటం మంచిదే కదా వీలైనప్పుడు.

  మీరు మరికొన్ని మాటలు రాజకీయకోణంలో మాట్లాడారు. అవి ఆరోగ్యకరమైన చర్చకు ఉపయోగించవని అనిపించింది నాకు.

  ReplyDelete
  Replies
  1. శ్యామలీయం గారికి, విద్య, జ్ఞానం, దానికి ప్రభుత్వాధినేఅతలు ఇవ్వాల్సిన ప్రోత్సాహం అనేవి సంబంధం లెనివి యెలా అవుతాయి సార్.యేది చేయందగు నేది కూడదు అని తెలియకనే చేస్తున్నారా?అంత గట్టిగా తన చర్యను సమర్ధించుకుంటున్న తెలంగాణా ముఖ్యమంత్రి మీ అభిప్రాయలతో తన దారిని మార్చుకుంటాదా, అసలు ఫీ రీ-ఇంబర్సుమెంటు పధకాన్నే రద్దు చేసేసి ఫాస్ట్ అనే కొత్త పధకాన్ని కూడా ప్రవేస పెట్టే ఆలోచనతో వున్నాడు కదా?వీటికి సంబంధించి హృదయ వైశాల్యం, వుదాత్త భావనలతో తప్ప సాంకేతికమయిన విషయాలతో పని జరుగుతుందనే అనుకుంటున్నారా మీరు?సాంకేతిక పరమయిన విషయాల్లో మీ అందరికన్నా నూరు ఆకులు యెక్కువ చదివి వున్నాడు తెలుసా!

   Delete
  2. హరిబాబు గారూ, హక్కులను ఎప్పుడూ సంకుచిత సాంకేతిక దృక్పథంతోనే చూడాలి.

   ఇక విశాల హృదయం, ఉదారత లాంటివి ఇచ్చి పుచ్చుకోవాలి తప్ప అడిగి తీసుకోలేము.

   Delete
 7. హరిబాబుగారూ, దయచేసి ఆవేశం ఉపసంహరించండి. 1956వ సంవత్సరాన్ని ప్రాతిపదికను చేసి విద్యార్థుల కుటుంబాల స్థానికతను నిర్థారిస్తామనటం సబబా అన్నదే చర్చిస్తున్నాం ఇక్కడ. విద్య - ప్రభుత్వప్రోత్సాహం అనే సాధారణ చర్చను మనం చేయటం లేదు కదా.

  తెలంగాణాముఖ్యమంత్రిగారు మా అందరికన్నా నూఱు ఆకులు ఎక్కువగా చదివి ఉంటే ఆనందమే. అప్పుడాయన మరింత బాగా అవగాహన తో‌నిర్ణయాలు తీసుకోగలరు.

  మరొక ముఖ్యమైన విషయం. ఒక ముఖ్యమంత్రిపదవిలో ఉన్నవ్యక్తిని వాడు వీడు అని సంబోధించటం అంత ఉచితం కాదని నా అభిప్రాయం. పదివిని గౌరవించి మాట్లాడటం హుందాగా ఉంటుంది. మన ఆవేశకావేశాలు సముదాచారాన్ని అతిక్రమించ రాదండి.

  ReplyDelete
  Replies
  1. "విద్యార్థుల కుటుంబాల స్థానికతను"

   రెండు విషయాలు. చిన్నవే అయినా వీటి ప్రాముఖ్యత దృష్ట్యా చెప్పక తప్పడంలేదు.

   1. స్థానికత బదులు "ఆర్ధిక సాయం అర్హత నియమం"
   2. కుటుంబీకులకు స్థానికత వర్తించదు. This is a personal matter linked to the individual.

   Delete
  2. వాడు వీడు అని సంబోధించటం
   >>
   ఒక మనిషిని చదువుకున్నవాడు అనే చోట ఆ 'వాడూ అనే దానికి యే అర్ధం వస్తుందో అలానే వాడాను.అయినా ఇక నుంచీ సరి చూసుకుంటాను.యెక్కదయినా వచ్చినా అది ఒక ఫ్లో అని మీరు కూడా క్షమిస్తే బాగుంటుంది!

   తెదెపా మంత్రివర్గంలో మంత్రిగా వున్నప్పటి నుంచీ వుద్యమకాలం లోనూ ఇప్పుడూ వారి ప్రవర్తన నుంచి మీరు యేమి తెలుసుకున్నారో నాకు తెలియదు గానీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక యెంత వ్యతిరేకత వచ్చినా లెక్క చెయ్యని వ్యక్తిత్వం తనదని నాకు తెలుసు.అన్నీ ఆలోచించి స్థానికతని గురించి నిర్నయం తీసుకునే తన హక్కు గురించి కూడా విప్పి చెప్పాక కూడా మీకు ఇంకా తెలియదం లేదు ఆ నిర్ణయం మారేది కాదని,మీ ఇష్తం.

   Delete
  3. జైగారూ. అవ్వపేరే ముసలమ్మ అన్నట్లూంది. 1956 కన్నా ముందు తెలంగాణాలో స్థిరపడిన కుటుంబాలకు చెందిన పిల్లలకే ఆ అర్హత అన్నాక కుటుంబీకుల స్థానికత వర్తించకపోవటం లేదుకదా.

   హరిబాబుగారూ. కేసీఆర్‌గారి ఖరాఖండి వైఖరి అందరికీ తెలిసిందే. సాధ్యమైనంతవరకూ ఇలాంటి చర్చల్లో విధానాంశాల గురించీ ప్రజాప్రయోజనాల గురించీ తప్ప వ్యక్తుల గుణదోషాలను గురించి సాధ్యమైనంత వరకూ చర్చించటం చేయవద్దు. అటువంటి చర్చ బాగుండదు. అనవసరమైన ఆవేశాలూ, అపార్థాలూ వస్తాయి. విషయం ప్రక్కకు పోతుంది.

   Delete
  4. ఇందాకే కె.సి.ఆర్. గారి ప్రకటన చూశాను. 1956 స్థానికత ఆరోగ్యశ్రీకి కూడా వర్తిస్తుంది. దాని వల్ల లబ్దిదారుల సంఖ్య తగ్గి ప్రభుత్వానికి ఖర్చు మిగులుతుంది.

   Delete
  5. నిజమా? ఐతే, ఇది తప్పక విచారించవలసిన సంగతి.

   బస్సుపాసులకూ ఇది వర్తించే అవకాశం‌ ఉంది కాని ముఖ్యమంత్రిగారు స్పష్టత ఇవ్వటం కోసం ఆగిందట. ఉదయన్నే, రాజకుమారిగారు 'రేపు విద్యుత్తుకీ 1956 అనరని ఏముందీ' అన్నారు. 1956 కంటే ముందు వచ్చిన వారికే కరెంటు ఇస్తారా అంటూ గేలి చేయడం తగదని జైగారు అభిప్రాయ పడుతున్నారు. ఈ పొగవెనుక నిప్పు ఉందన్న అనుమానం బలపడుతోంది కదా? ఇప్పుడు ఆరోగ్యశ్రీ చేరింది, ఇంకా ఎన్ని చేరుతాయీ ఈ కోవ లోనికి అని జనం గుంపుతంపీలు పడితే వారి తప్పేమన్నా ఉందా?

   విచారించవలసిన సంగతే కదా? ప్రజలో ఐకమత్యం పెంపొందించవలసిన ప్రభుత్వాలు వాళ్ళల్లో అనవసరవర్గీకరణలు చేయటం ద్వారా వచ్చే లాభాలగురించి ఆలోచించటం?

   Delete
  6. ఇక్కడ చర్చ ఉచిత పథకాల మీద జరుగుతోంది. విద్యుత్ డబ్బులు కట్టినవాళ్ళకే ఇస్తారు. అదేమీ ఉచిత పథకం కాదు. ఆ లెక్కన డబ్బులు కట్టేవాళ్ళు తెలంగాణాలోని ఏ కాలేజ్‌లోనైనా చదవొచ్చు. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఫీజ్ రీఇంబర్స్‌మెంత్ కోరేవాళ్ళకి మాత్రమే అది సమస్య.

   బస్ పాసులు కూడా ఉచితంగా ఇచ్చేవే. ఉద్యోగుల సీజన్ తికెత్‌లు మాత్రం డబ్బులు కట్టి కొనేవి కనుక అవి ఆంధ్రావాళ్ళు కూడా కొనొచ్చు.

   Delete
  7. అవునండీ ప్రవీణ్. కాని ఒకసారి స్థానికత విషయంలో 1956 అనేది స్థిరపరివాక, మెల్లగా స్థానికులు కానివారికి సదుపాయాల విషయంలో, ఛార్జీల విషయంలోనో వేరేవేరే పధకాలూ వగైరా అంటే?

   Delete
  8. సార్ స్థానికత అనే పదానికి రెండే రెండు చోట్ల అర్ధం ఉంది: ప్రభుత్వ ఉద్యోగాలు & ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఉన్నత విద్యాలయాలు.

   There is no point in invoking this term in other matters. It may suit the interests of some politicos but leads nowhere.

   Delete
  9. స్థానికత అనేది జై గారు చెప్పినత్లు రెండు చోట్లకే పరిమతమైతే మంచిదే. మరి ప్రవీణ్ చెప్పేది ఆరోగ్యశ్రీ వంటివాటికి కూడా వర్తింపజేస్తానని కే.సీ.ఆర్ అంటున్నట్లు చెప్తున్నారు. చూద్దాం ఏమి జరుగబోతుందో!

   Delete
  10. ఆరోగ్యశ్రీ అనేది ఒక భారమైన పథకం. దాన్ని పూర్తిగా వదిలించుకుని కొత్తగా ప్రభుత్వ ఆసుపత్రులు కడితే మంచిది. దానికి స్థానికత పరిమితి విధించడం వల్ల ప్రయోజనం తక్కువ.

   Delete
  11. మీరన్నట్లు ఓటుబేంక్ పథకాలను రద్దు చేసి లేదా సమీక్షించి మంచి పథకాలను ప్రవేశపెట్టి సక్రమంగా అమలు చెస్తే మంచిదే. కానీ స్థానికత పేరుతో ప్రజలమధ్య అంతరాలు అనవసర ఆందోళనలు పెంచడం చేయకూడదు. కావాలనే కే.సీ.ఆర్ అలా వ్యూహాత్మకంగా రెచ్చగొడుతున్నాడనిపిస్తోంది.

   Delete
  12. @praveen
   "ఆరోగ్యశ్రీ అనేది ఒక భారమైన పథకం. దాన్ని పూర్తిగా వదిలించుకుని కొత్తగా ప్రభుత్వ ఆసుపత్రులు కడితే మంచిది"
   నిజంగా మంచి ఆలోచన. గత కొన్నేళ్లలో కార్పొరేట్ హాస్పిటల్స్ కి దోచిపెట్టిన డబ్బుని ప్రభుత్వ ఆసుపత్రులకి ఖర్చు పెట్టి ఉంటె జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తయారయి ఉండేది.

   @ కొండల రావు గారూ
   "స్థానికత అనేది జై గారు చెప్పినత్లు రెండు చోట్లకే పరిమతమైతే మంచిదే"
   ఏ రెండు చోట్లకి ఏ స్థానికత పరిమితం అయితే మంచిదండీ? కొంచెం వివరంగా రాయండి.

   Delete
  13. జై గారి వ్యాఖ్యలో ఉన్న ప్రభుత్వోద్యోగాలు- ప్రభుత్వ ఆధీనంలోని ఉన్నత విద్యాలయాలు శ్రీ గారు.

   Delete
  14. ఈ చర్చా విషయం పైన కేవలం ముగ్గురు మాత్రమే స్పష్టమయిన అవగాహనతో వాస్తవికంగా ఆలోచిస్తున్నారు. దీన్ని ప్రతిపాదించిన తెలంగాణా ముఖ్యమంత్రి స్పష్టంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్న వ్యక్తికి ఈ స్థానికత విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు వుందని తెలుసు, తన హక్కును వుపయోగించుకుంటానని చెప్పాడు.ఇక్కద జై ఇలాంటివన్నీ హక్కులుగా రావు వుదారంగా ఇస్తే తీసుకోవదమేనని తేల్చేశాడు.ఇంకా చర్చని పొడిగించడం అవసరమా?అనవసరం అని నాకు తెలుసు!
   మేము ముగ్గురం మాత్రమే ఈ విషయంలో స్పష్టమయిన అవగాహనతో వున్నాము.మిగిలిన వారంతా అమాయకమయిన గందరగోళంలో వున్నారు, అవునా కాదా?

   Delete
  15. హరిబాబు గారూ, కెసిఆర్ ఉటంకించిన తీర్పులు చదవిందే ఆయన ధీమా వాస్తవాధారం అని అనుకోలేము.

   ఇంకా ప్రచురితం కాని పథకం గురించి పూర్తి స్పష్ట రానేరదు. వచ్చాక దాని మీద ఎలా కొట్లాడాలో ఆలోచిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. I intend to fight *after* studying the full text and the complete connotation.

   Delete
  16. స్థానికతకు సంబంధించిన సాంకేతికాంశం కేసు సుప్రీం కోర్టులో వున్నట్తుంది, ఆ తీఎర్పు తనకి అనుకూలంగా వొస్తే మన అభ్యంతరాల్ని పట్టించుకోకుండా ముందు కెళ్ళదంలో అతన్ని యెవవరూ ఆపలేరు.తీర్పు వ్యతిరేకంగా వొస్తే ముందు కెళ్లే మూర్ఖత్వమూ తనలో లేదు, అది నాకు తెలుసు.
   >>
   ప్రవీన్ గారు చెప్పిన
   "ఇందాకే కె.సి.ఆర్. గారి ప్రకటన చూశాను. 1956 స్థానికత ఆరోగ్యశ్రీకి కూడా వర్తిస్తుంది. దాని వల్ల లబ్దిదారుల సంఖ్య తగ్గి ప్రభుత్వానికి ఖర్చు మిగులుతుంది"
   అనే ముక్క చాలా విలువయిన పరిశీలన!

   Delete
  17. హరిబాబు గారూ, నాఉకు తెలిసి స్థానికత అంశం ప్రస్తుతం సబ్ జుడీస్ కాదు. 371-డీ తత్సంబంధమయిన ఉత్తర్వులు అన్నిటినీ తెల్చబడిన విషయాలుగా (res judicata i.e. settled matter) పరిగణించవచ్చు.

   ప్రవీణ్ గారికి మల్లె ఇంకొందరు కూడా లోప భూయిష్టం & లీకులమయం అయిన ఫీసు/108 లాంటి పథకాలకు 1956 కటాఫ్ గండి కడుతుందని అనుకుంటున్నారు. లీకులకు గండి కట్టడానికి ఇలాంటి వాటికంటే మంచి మార్గాలు ఉంటాయి. There is no point in trying to fix a problem by giving up a fundamental principle like objectivity.

   Delete
  18. 371-డ్ లేదా ప్రెసిదెంటీల్ ఆర్దర్ ప్రకారం స్థానికత నేది నాన్ గెజిటేద్ వుద్యోగాల్లో ప్రవేశానికీ విద్యా సంస్తహ్లలఓ ప్రవేశానికీ మాత్రమే పరిమితం.గిర్గ్లానీ రిపోర్టును నేను చదివాను, ఒక పోస్తు కూదా వేశాను అందులో ప్రధానమయిన భాగాల్ని వేటినీ వదల్లేదు.ఇక్కడ ఫీజుల చెల్లింపులు అనేది ఆ క్యాటగిరీకి రాదు, కాబట్టి తెలంగాణా ముఖ్యమంత్రి ప్రతిపాదన 1956 స్థానికత అనే అంశం యే విధంగా చూసీనా తన ఇష్టానిష్టాల ప్రకారం జరగాల్సిందే తప్ప యే సాంకేతికమయిన అడ్దంకులూ తనకి లేవని నా అభిప్రాయం.

   ప్రస్తుతం స్థానికతను నిర్దేశించే యే రాజ్యాంగ పరమయిన సాంకేతికాంశాలూ పని చెయ్యవు.ప్రజల్లో వున్న ఆందోళననీ వ్యతిరేకతని చూసిన్ తను వెనక్కి తగ్గడం తప్ప మరో మార్గం లేదని నాకనిపిస్తున్నది.

   Delete
  19. @jai
   లీకులకు గండి కట్టడానికి ఇలాంటి వాటికంటే మంచి మార్గాలు ఉంటాయి.
   ?
   నిజమే,తేలు మంత్రం తేలుకీ పామ్మంత్రం పాముకీ వెయ్యాలి
   8=P)
   There is no point in trying to fix a problem by giving up a fundamental principle like objectivity.
   100% correct, and if we need to fight really, this is our best stature.

   Delete
  20. This comment has been removed by the author.

   Delete
  21. తేలు మంత్రం తేలుకీ పామ్మంత్రం పాముకీ
   ?
   రివర్స్ లో వెళ్తే తేలూ పామూ క్షేమంగానే వుంటాయి, వాటితో కరిపించుకున్న అభాగ్యుదు చస్తాడు
   8=<)

   Delete
  22. "ప్రజల్లో వున్న ఆందోళననీ వ్యతిరేకత"

   "ప్రజలలో ఆందోళన వ్యతిరేకత వస్తే" అని సవరిస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి లొల్లి చేస్తున్న గంటా, రావెల్ల, నన్నపనేని తదితురల కంఠశోష ఈ కోవకు చెందదు.

   Delete
 8. "ఒక రాష్ట్రంలోని స్థానికత అంశాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది కానీ దాని పక్క రాష్ట్రం ఎలా నిర్ణయిస్తుంది?" అని మంత్రి జగదీశ్ రెడ్డి అడిగారు.

  ReplyDelete
  Replies
  1. ఎవరిని అడిగారు?

   Delete
  2. చంద్రబాబుని అడిగారు.

   Delete
  3. చంద్రబాబు ఏమన్నారు? స్థానికత అనేది 1956 కంటే ముందు అనేది దుర్మార్గమని మీకనిపించడం లేదా?

   Delete
  4. 1956 తరువాత తెలంగాణలో స్థిరపడినవాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరి పిల్లలకీ ఫీజ్ రీఇంబర్స్‌మెంత్ ఇస్తే ఖజానాకి భారం. నిన్న TRS అధికారిక చానెల్ అయిన T Newsలోనే ఈ విషయం చెప్పారు.

   Delete
  5. నేనడిగేది కే.సీ.ఆర్ డొంకతిరుగుడుగా ఏమి చేయాలనుకుంటున్నాడు? ప్రజలను ఇబ్బందులు పెట్టైనా ఖజానాను నింపుకుందామనుకుంటున్నాడా? అనేది మీ అభిప్రాయం ఏమిటి? మీరు మార్క్సిష్టునంటారు కదా? మీరు ప్రజల పక్షాన ఉంటున్నారా? పాలకవర్గం పక్షాన ఉంటున్నారా? ఇతరులనైతే ఇంత సూటిగా ఈ ప్రశ్న అడగను. మీ వాదనేమిటో నాకర్ధం కాలేదు ఈ సమస్యపై.

   Delete
 9. రెండు రాస్త్రాల ముఖ్య మంత్రులు ప్రజల్ని మభ్య పెట్టి తమ పబ్బంగడుపు కోవటానికీ చేస్తున్న సర్కస్‌ పీట్లు ఇవన్ని. వీల కంటే సీనియర్‌ అయిన శివ సేన ప్రజల్ని రెచ్చ గొట్ట గొడుతుందేమో గానీ అంత కంటే ఒక్క అడ్గు ముందు కెయ్యలేదు. దాని కంటే ఈ రెండు పార్టీలు ఎక్కువకాదు.

  ReplyDelete
  Replies
  1. తిరుపాలు గారు సత్యం చెప్పారు.

   Delete
 10. తెలంగాణా ప్రభుత్వం మీద ఏ విధంగా దండయాత్ర చేద్దామా అని మధన పడుతున్న సీమాంధ్ర నాయకులకు, మీడియాకు ఆ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన విద్యార్థుల ప్రవేశ రుసుము సహాయ పథకం (FAST) ఊతమిచ్చింది.

  ముఖ్యంగా ఆర్ధిక సహాయానికి 1956ను కొలబద్ద చేయడంతో సీమాంధ్ర మీడియా అగ్గికి ఆజ్యం పోసినట్టయింది. అలా కాక ఇప్పుడున్న స్కీమునే అమలు చేస్తే 39000 సీమాంధ్ర విద్యార్థులకు తెలంగాణలో ఉచిత చెల్లింపులు జరపాలి. ఉమ్మడి రాజధాని కావడం వలన కొన్ని వేలమంది ఉద్యోగులు తెలంగాణాలో నివసిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో పని చేస్తున్నారు. వారి పిల్లలకి తెలంగాణా ప్రభుత్వం ఎలా ఫీజులు చెల్లిస్తుంది?

  అలాగే గత ఎన్నికల్లో సుమారు ఐదు లక్షలమంది ఇటు తెలంగాణలో, అటు సీమంధ్రలో కూడా వోటు వేశారని వార్తలు వచ్చాయి. ఏపీలో పౌరసత్వం కొనసాగిస్తున్న వారికి తెలంగాణలో ఫీజు పథకం లబ్ది చేకూర్చడం ఎంతవరకు సబబు?

  తెలంగాణా ప్రభుత్వానికి ఉదారంగా విద్యాదానం చేసే ఆర్థిక వెసులుబాటు గాని, అవసరం గాని లేవు. ఇది దగా పడ్డ తెలంగాణాని పునర్నిర్మించాల్సిన సమయం. రాష్ట్రానికి చెందిన ప్రతి పైసా అందుకోసం మాత్రమే వినియోగించాలి తప్ప దానధర్మాలకు కాదు.

  ఇంత చెప్పినప్పటికీ, నాక్కూడా ఎందుకో 1956వ సంవత్సరాన్ని స్తానికతకు కొలబద్దగా తీసుకోవడం హేతుబద్ధంగా కనిపించడం లేదు. తన పథకాల లబ్దిదారులను నిర్వచించుకునే పూర్తి హక్కు తెలంగాణా ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, 1956ని కొలబద్ద చేయడం వల్ల కొంతమంది నిజాయితీగా తెలంగాణాలో స్థిరపడ్డ బీదవారికి నష్టం చేకూరే విధంగా వుంది.

  దానికన్నా పధకాన్ని "TELANGANA CITIZENS' CHILDREN EDUCATION ASSISTANCE" గా మార్చి తండ్రి స్థానికతను బట్టి ఆర్ధిక సహాయం చేస్తే బాగుంటుందని KCR గారికి నా సూచన.

  ReplyDelete
  Replies
  1. దానికన్నా పధకాన్ని "TELANGANA CITIZENS' CHILDREN EDUCATION ASSISTANCE" గా మార్చి తండ్రి స్థానికతను బట్టి ఆర్ధిక సహాయం చేస్తే బాగుంటుందని KCR గారికి నా సూచన.
   >>
   ఇది కూడా మంచి సూచనే!అన్నిటికన్నా నాకు ఈదే సబబుగా వుంది.

   Delete
  2. సీమాంధ్ర మీడియా అంటూ ప్రతీదానిని బూతద్దంలో చూడడం తప్పవుతుంది. ఇక్కడ స్థానికత అనేది 1956 కంటే ముందు అనేది సహేతుకం కాదు. దాని ఆధారంగా ఏ పథకానికి సంబంధించిన లబ్ధినైనా ఇవ్వలాని తెలంగాణా ప్రభుత్వం అనుకుంటే అది తప్పు. దీనికి సీమాంధ్ర మీడియా మీద పడడం ఎందుకు? ఆంధ్రాలో నివాసముంటూ తెలంగాణాలో లబ్ది పొందాలనుకునేవారికి ఏ కోశానా ఎలాంటి చెల్లింపులూ తెలంగాణా ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి ఏ మీడియా ఏమి కూసినా పట్టించుకోవలసిన పనిలేదు.

   ఇక సీమాంధ్ర విద్యార్ధులు అంటే ఎవరు? తెలంగాణాలో గత నాలుగేళ్లుగా నివాసముంటున్నవారు లేదా ఇకముందు కూడా తెలంగాణాలోనే ఉందామనుకుంటున్నవారు సీమాంధ్ర విద్యార్ధులు అనకూడదు.తెలంగాణా ప్రభుత్వం ఏర్పడేనాటికి తెలంగాణాలో ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్నవారందరినీ తెలంగాణా వారిగానే చూడాలి. వారిలో బాగా డబ్బున్నవారు సీమాంధ్రలో ఆస్థులు కలిగిన వారు ఉంటే వారికి లబ్ధి పథకాలు తొలగించవచ్చు. అసలు పేదల కంటే పెద్ద పందికొక్కులకు చాలామందికి తెల్ల కార్డులు ఉన్నాయి. గత ప్రభుత్వాలలో గల్లీ నేతలు చెప్పిన వారికే రెవెన్యూ అధికారులు ఇష్టమొచ్చినట్లు కార్డులిచ్చారు. ఇలాంటివి అన్ని పథకాలలోనూ అడుగడుగునా అక్రమాలున్నాయి. కే.సీ.ఆర్ చేయవలసింది గత ప్రభుత్వాలు చిల్లరమల్లరగా చేసిన ఈ పనులను తిరగదోడి అర్హులైనవారికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరేలా చూడాలి. అలా చేస్తే ఏ మీదియా అది ఆంధ్రజ్యోతి అయినా మరొకటి అయినా ఎంత కూసినా ప్రజలు కే.సీ.ఆర్ కు బ్రహ్మరధం పడతారు. ప్రజామద్ధతు మీడియాతో వచ్చేది ఏ కొద్దిగానో మాత్రమే.

   సీమాంధ్రా తెలంగాణా అంటూ ప్రజలను వేరు చేసి చూడడం మూర్ఖత్వం. ఎక్కడ నివాసముండాలనుకునేవారికి అక్కడ హక్కులు , లబ్ధి నిబంధనలమేరకు ఉండి తీరాలి. స్థానికత అనేది దేశం మొత్తానికి ఒకే ప్రాతిపదిక ఉండాలి. అది తెలంగాణాలో ఉండే సీమాంధ్రులకైనా, సీమాంధ్రలో ఉండే తెలంగాణా వారికైనా ఒకటే ఉండాలి.

   Delete
  3. @శ్రీకాంత్ చారి:

   మన దేశంలో రాష్ట్రాలకు పౌరులు ఉండరు. No state can have citizens.

   @Kondala Rao Palla:

   "తెలంగాణాలో ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్నవారందరినీ తెలంగాణా వారిగానే చూడాలి"

   ఇవేంటి ఖర్మ రెండేసి వోటర్ కార్డులతో రెండు చోట్లా వాళ్ళున్నారు. వారి పుణ్యమా అంటూ గెలిచిన నాయకులూ ఉన్నారు.

   "సీమాంధ్రా తెలంగాణా అంటూ ప్రజలను వేరు చేసి చూడడం మూర్ఖత్వం"

   తెలుగు వారు తెలుగేతరులు అంటూ వేరు చేస్తే మీరు ఈ మాట అన్నారా?

   Delete
  4. అన్నారా? అంటున్నారా?... అంటారా? అంటున్నారా? జై గారు. స్థానికత అనేది - దాని నిబంధన అనేదే నా పాయింట్. బీహార్ వాడొచ్చి బ్రతికినా నా వాదన అదే. ఇప్పుడున్న పరిస్తితులలో సీమాంధ్రా - తెలంగాణా అంటూ విడదీసి చూస్తున్నారు కనుక ఆ విషయం ప్రాధాన్యంగా వినిపిస్తుందంతే. ముఖ్యంగా కే.సీ.ఆర్ ఇంకా తెలంగాణా ప్రజలను ఒకరకమైన్ ఎమోషన్ నుండి బయటపడనీయకూడదనుకుంటున్నాడేమో వ్యూహాతమకంగా అని నా అభిప్రాయం. అయితే నా అభిప్రాయాన్ని ఆయనపై రుద్దడం సరయినది కాదు గనుక, ప్రభుత్వ నిర్ణయాలనే ప్రశ్నిస్థాను.

   మీరన్నట్లు రాష్ట్రానికి పౌరసత్వముండదు. నేను దేశంలోని ప్రజలే కాదు ప్రపంచంలోని ప్రజలంతా ప్రక్రుతిపై సమాన హక్కులు కావాలనేవాడిని. మీకనుమానం అక్కర్లేదండీ. కాకుంటే పాలనాపరమైన నిబంధనలు ఉన్నప్పుడు తాత్కాలికంగా అలాంటివి గౌరవించాలి. ప్రస్తుతం గ్రామాలలో దొంగ కార్డులేరేస్తున్నారు. బాగుంది. చూద్దాం తిరిగి నిజమైన లబ్ధిదారులకే ఇస్తారా? గతం మాదిరిగా టీ.ఆర్.ఎస్ గల్లీ నేతలు చెప్పిన లిస్టు వస్తుందా? అనేది ఆచరణలో తేలాలి. ముందయితే అక్రమార్కుల భరతం పట్టాల్సిందే.

   Delete
  5. @Kondal Rao gaaru,

   You have just earned my respect with this comment. Keep going sir. People like you should voice out opinions !

   Delete
  6. "ఇప్పుడున్న పరిస్తితులలో సీమాంధ్రా - తెలంగాణా అంటూ విడదీసి చూస్తున్నారు కనుక ఆ విషయం ప్రాధాన్యంగా వినిపిస్తుందంతే"

   ఒకే మున్ముందు చూద్దాం.

   "గతం మాదిరిగా టీ.ఆర్.ఎస్ గల్లీ నేతలు చెప్పిన లిస్టు వస్తుందా?"

   "అధికార పార్టీ గల్లీ నేతలు" అంటే బాగుంటుందేమో?

   "ఆచరణలో తేలాలి"

   వేచి చూద్దామా లేక ముందే ఊహాగానాలు చేద్దామా?

   Delete
  7. ప్రస్తుతం అధికార పార్టీ టీ.ఆర్.ఎస్ కాదా? గతంలో ముఖ్యంగా టీ.డీ.పీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ గల్లీ నేతలతో పాటు ఈనాడు స్ట్రింగరల హవా కూడా నడిచేది.

   మున్ముందు చూద్దాం అనేది ఊహాగానం లేకుండా ఉండదు. ఎవరి ఊహలు వారికంటాయి. నేతల గత ఆచరణను బట్టి భవిష్యత్తుని అంచనాగా వేసేది ఊహ. అలాగే ఉంటారా? ఉండరా? అనేది ఆచరణ చెప్తుంది. ఇది ఎవరికైనా ఒకటే.

   మీరెప్పుడు చూసినా నేను అంతర్జాతీయవాదినే. మానవాళి మొత్తానికి సంబంధించిన సూత్రాలను అబ్జర్వ్ చేస్తాను. మనం తెలంగాణాలో ఉంటున్నాము కనుక ఇక్కడి విషయాలు కాస్త ఎక్కువ పట్టించుకుంటాము. తెలంగాణా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పేడదామనుకునేవారు ఇరకాటంలో పెడదామనుకునేవారు ఈ చర్చలను ఆనందంగానూ, సీమాంధ్ర ప్రభుత్వ తప్పీదాలప్పుడు మరో రకంగానూ చూస్తారు. అప్పుడు తెలంగాణా ప్రాంతీయాభిమానులూ సీమాంధ్రవారిని అంతే ఇరకాటం పెట్టాలని చూస్తారు. కానీ రెండుచోట్లా విశాలంగా ఆలోచించేవారు తప్పక ఉంటారు. మున్ముద్ను వారి సంఖ్య మరింత పెరగాలని ఆశిస్తున్నాను.

   Delete
  8. మీ ఉద్దేశ్యం: "గతంలా కాంగ్రెస్/టీడీపీ గల్లీ నేతలు చెప్పిన లిస్టులు వచ్చినట్టే ఈ తడవ తెరాస గల్లీ నేతలు చెప్పిన లిస్టు వస్తుందా?" అనుకుంటా. Am I right?

   ఊహాగానాలు చేయడం మానవసహజం. అయితే వీటికి కూడా హేతుకత ఉంటె బాగుంటుంది. ఉ. కెసిఆర్ నోటి దూల మనకు తెలిసిందే కాబట్టి మున్ముందు కూడా మారడని చెప్పడం వేరే, నోటి దూల ఉంది కాబట్టి వేల కోట్లు తింటాడని జోస్యం చెప్పడం వేరే. Loose tongue is no predictor of widespread corruption.

   Delete
  9. ఇక్కడ సీమాంధ్ర మీడియా అని నేననడానికి కారణం సదరు మీడియా ఇప్పటికీ కొనసాగిస్తున్న వివక్ష. ఏపీలో మానిఫెస్టోని వమ్ము చేస్తూ, రుణ మాఫీపై వెనుకడుగు వేసినా స్థుతించడం, చంద్రబాబు అసలు ఫీజు రె-ఇంబర్సుమెంటు అసలు అమలు చేస్తాడా చేయడా అన్న విషయం కూడా ఇప్పటివరకూ స్పష్టంగా ప్రకటించక పోయినా ఆ ఊసే ఎత్తక పోవడం, పైగా తెలంగాణా ప్రభుత్వ పథకాన్ని దానిపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి గల హక్కునే ప్రష్నిస్తూ కథనాలు రాయడం ఎలా అర్థం చేసుకోవాలి?

   1956 కంటే ముందు అనేది సహేతుకం కాదు అని నేను కూడా చెప్పాను. ఆ మాటకొస్తే తెలంగాణలో పుట్టిన సీమాంధ్ర ఉద్యోగుల పిల్లలు తెలంగాణా స్థానికులనడం సహేతుకమా? సీమాంధ్రలో ఇల్లూ, పొలాలు కలిగి వుంటూ... ఎలక్షన్‌లో వోటు కూడా వేస్తూ... తెలంగాణా పథకాలపై లబ్ది ఆషించడం సహేతుకమా? ప్రతి పథకానికి ఒక exclusion criteria వుంటుంది. పైన ఉదహరించిన అపాత్రులను ఫిల్టర్ చేయడానికి తెలంగాణా ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకుండి. అటువంటి నిర్ణయం తీసుకోవడానికి దానికి రాజ్యాంగ పరమైన పూర్తి హక్కు వుంది. దాన్ని తుగ్లక్ చర్యగా అభివర్ణించడం సరి కాదు. అలా అభివర్ణించే వారు పైన చెప్పిన anomalies రాకుండా మరింత మంచి పథకాన్ని సూచిస్తే బాగుంటుంది.

   >>> ఎక్కడ నివాసముండాలనుకునేవారికి అక్కడ హక్కులు , లబ్ధి నిబంధనలమేరకు ఉండి తీరాలి. స్థానికత అనేది దేశం మొత్తానికి ఒకే ప్రాతిపదిక ఉండాలి.

   పొరబాటు. స్థానికతను నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానిదే. అదే సరియైనది. అందుకు విరుద్ధంగా కావాలని కోరడం వలసలని ప్రొత్సహించడమే. అలాంటి నియమాలని అధారం చేసుకొని అండమాన్, లక్కదీవులు మొదలైన ప్రాంతాలలో నాగరికులు చొరబడి ఆయా జాతులనే అంతరింపజేసే ప్రమాదం లేదా?

   Delete
  10. నేను మొదట్లో కొంచెం కవితాత్మక వచనం తో గంభీరంగా ప్రయత్నించుదామని అనుకున్నప్పటికీ శ్యామలీయం మాస్టారి నుంచీ శ్రీకాంత్ చారి గారి వరకూ ప్రతి వొక్కరూ గూబ గుయ్యి మనిపించటంతో మామూలు భాషలోకి వచ్చేసాను.సాదర సంభాషణలో దొర్లే చిన్న చిన్న వ్యంగాలకి నొచ్చుకోగూడదని తెలుసు గాబట్టి తర్వాత జరిగిన చర్చలో బుధ్ధిని భూమార్గం పట్తించాను!

   కేసీఆర్ గొప్ప మేధావి, ఆయన ప్లానింగ్ అమోఘం.నేనిది వెటకారానికి అనదం లేదు - మంచి భావం తోనే అంటున్నాను. లక్ష తిట్లు తిన్నా సరే వుద్యమ పధం నుంచి వెను తిరగను అన్నాడు, అలాగే సాధించాడు. యెప్పుడయీతే ఇక రాష్ట్రం యేర్పడిందో ఆ రోజునే ఇక ఆంధ్రా వాళ్లని యేమీ అనకందని స్టేట్మెంటు ఇచ్చి తను దానికి పూర్తిగా కట్టుబడి వున్నాడు,తను అన్న ప్రతి మాటకీ పెదర్ధాలు తీసే మీడియా వార్తల్ని భూతద్దం లోంచి చూడకుండా వుంటే బాగుంటుంది.

   మొదటి నుంచీ తను తెలంగాణా సాధించగలనని ధీమాగానే వున్నాడు, ఆఖరి నిముషం వరకూ దశల వారీగా ఒక వ్యూహం తోనే కదిలాడు, కానీ అనివార్యంగా విధివిలాసం వల్ల ఆఖరి యెత్తులో లెక్క తప్పింది.యెంత ధీమా లేకపోతే మాకు తెలంగాణా ఈస్తే చాలు, ఆంధ్రావాళ్లకి మీరు యేమి ఇచ్చుకున్నా అభ్యంతరం లేదని తెలంగాణా పునర్నిర్మాణానికి కనీసపు సాయం కూడా అదగకుండా నిర్భయంగా వున్నాడో?మరొక ధీమా కూదా వుండటం కారణ మేమో, తెలంగాణా ఇచ్చిన మైలేజితో యూపీయాఎ-3 యెటూ కేంద్రంలో వస్తుంది అని గాంక్రెసు లాగే తనూ విశ్వసించాడు.కానీ పెచ్చు మీరిన అవినీతి చరిత్రా యువరాజా వారి అనుభవ లేమి గాంక్రెసుని కనీసం ప్రధాన ప్రతిపక్షం గా కూడా సభలో నిలబడలేని స్థితి తెచ్చిపెట్టింది.

   సరే అయిపోయింది.తెదెపా ఆంధ్రాకి కేంద్రం నుంచి కొన్ని హామీల్నీ ప్రోత్సాహకాల్నీ మాటమాత్రంగా నైనా తెచ్చుకుంది.కేవలం మాటసాయమే కాబట్టి దాని గురించి కూడా ఆంధ్రా రొమ్ము విరుచుకోవాల్సిన పని లేదు.భాజపా కూడా యెక్కడా రాత పూర్వకంగా కమిట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా నడుపుకుని వస్తున్నది.మాట సాయం వుండి కూడా ఆంధ్రా పరిస్తితి అలా వుంటే అసలు మాటసాయం కూడా లేని పరిస్తితి తెలంగాణాది.

   ఒకవేళ గట్టిగా పోట్లాడి సాధించుకుందామన్నా కుదరని పరిస్తితి ఈ రెండు రాష్ట్రాలకీ సమానమే.మోదీ గారు చేదు మాత్ర అని రైల్వే బడ్జెట్ లోనూ వార్షిక బడ్జెట్ లోనూ డబల్ ధమాకా చూపిస్తే యెవ్వరం కాదన లేకపోయాము కదా!అక్కడా కుండ ఖాళీగానే వుంది.కాబట్టి శ్రీకాంత్ చారి గారు చెప్పినట్టు ప్రతి రూపాయినీ పొదుపుగా వాడుకోవటం తప్పని సరి.

   కొందల రావు గారు, ఇంకా కొందరు కేసీఆర్ గారికి దురుద్దేశాలు అంటగడుతున్నారు కానీ ఆయనా ఈ పరిస్తితి వల్లనే ఇలా చేస్తున్నాడేమో?యే రాజకీయ వాది అయినా ఇమేజి కోసమే గదా చూసేది, ఇచ్చేది ఇవ్వగలిగితే ఇచ్చి మంచిపేరు తెచ్చుకోవాలనే చూస్తాడు గదా?మీరు దీనికే అతన్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు, దీని బాబు లాంటి సమస్య - ఋణమాఫీ యెదురు చూస్తున్నది, కరెంటు సమస్య వుంది,పెండింగు ప్రాజెక్తులు వున్నాయి!

   కాబట్టి తను ఒక మెట్టు దిగినా దిగకపోయినా చెయ్యగలిగింది లేదు.శ్రీకాంత్ చారి గారికీ జై గారికీ ఒక సూచన - ఈ సమస్య పూర్తిగా తెలంగాణాది.ఆంధ్రాలో ఈ సమస్య లేకుండా రెండు కౌన్సిలింగులు అయినాయని ఇవ్వాళే చదివాను.అయినా మేము కూడా సమస్య మనది అనుకునే ఆలోచిస్తున్నాం.ముందు ముందు కూడా ఇదే దారిలో వెళ్తే బాగుటుంది కదా!

   Delete
  11. సీమాంధ్ర మీడియా అనడం కంటే చంద్రబాబు అనుకూల మీడియా అనాలేమో. సాక్షి ఎలాగూ జగన్ ది కాబట్టి. మిగతా ప్రధాన పత్రికలు ఈనాడు-జ్యోతి. ఇవి రెండూ బాబును రాష్ట్రంలోనూ, బీ.జే.పీని కేంద్రంలోనూ అధికారంలో ఉంచి ఇక్కడ తమ పెట్టుబడులను కాపాడుకోవాలని చూస్తుంటారు. ఆంధ్రజ్యోతి అయితే తెలంగాణా ప్రభుత్వంపై పనిగట్టుకుని వార్తలు వ్రాస్తున్నట్లే అనిపిస్తోంది. అయితే జనాలకు కూడా తెలిసిపోతున్న్నది ఏ పత్రికలో వార్త ఏ ఉద్దేశంతో వస్తున్నదనేది.

   శ్రీకాంత్ చారి గారు, అండమాన్ లాంటి ప్రత్యేక ప్రాంతాలు వేరు. ఇతర రాష్ట్రాలు వేరు. రాష్ట్రాలన్నింటా స్థానికత ఒకేలా ఉండాలనేది నా అభిప్రాయం. రాష్ట్రాలకు ఆ హక్కు ఉన్నదా? లేదా? అనేది కాదు. రాష్ట్రాలకు హాక్కులున్నాయని ఏ నిర్ణయం తీసుకున్నా సమర్ధించాలని నేననుకోవడం లేదు. 1956 నిబంధన మాత్రం తుగ్లక్ నిర్ణయమేనన్నది నా ఆరోపణ. దానితో ఏకీభవించాల్నా? వద్దా? ఆ నిర్ణయాన్ని అంగీకరిస్తారా? లేదా? కావాలంటారా? ఎవరి అభిప్రాయం వారికుంటుంది. అంతిమంగా ప్రజలే తీర్పు చెప్తారు. మీరన్న పద్ధతిలోని అక్రమార్కులను ఇరు రాష్ట్రాలలోనూ ఉంటారు కనుక వారికి లబ్ధిని చేకూర్చాల్సిన పనిలేదు. నేనలాంటివారి గురించి మాట్లాడడం లేదని గమనించగలరు.

   Delete
  12. @Hari Babu SuraneniJuly 23, 2014 at 7:11 PM, మీ సమాధానం ఏ ఉద్దేశంతో ఏమి చెప్పారో నాకు సరిగా అర్ధం కాలేదు.

   Delete
  13. @Jai GottimukkalaJuly 23, 2014 at 11:05 AM

   << మీ ఉద్దేశ్యం : " గతంలో కాంగ్రెస్/టీడీపీ గల్లీ నేతలు చెప్పిన లిస్టులు వచ్చినట్లే ఈ తడవ తెరాస గల్లీ నేతలు చెప్పిన లిస్టు వస్తుందా?" అనుకుంటా? Am I right?>>
   exactly జై గారు.

   కే.సీ.ఆర్ వేలకోట్లు తింటాడని నేననలేదు. ఆ ఉద్దేశమూ లేదు. కే.సీ.ఆర్ నోటిదూల + ఆంధ్రాప్రాంతంపై అవాకులు తప్పితే మిగతా అన్ని విషయాలలోనూ బాబుకంటే ఎన్నోరెట్లు బెటర్. కే.సీ.ఆర్ ను అవినీతికి పాల్పడతాడని నేనెక్కడా జోస్యం గానీ ఊహాగానం కానీ చెప్పలేదు జై గారు. మరోసారి చెక్ చేయండి.

   Delete
  14. @కొందల రావు గారు,
   అదేంటి సార్ అలా అనేసారు?నేను స్పష్తంగానే చెప్పానే!శ్రీకాంత్ చారి గారి జవాబునే సమర్ధించాను.తెలంగాణా పునర్నిర్మాణానికి యెన్నో సమస్యలు వుండటం వల్ల పొదుపుగా వెళ్ళాల్సిన అవసరం వుంది కదా, అందుకే అలా పొదుపు మంత్రం జపిస్తున్నాదేమో నని నా అభిప్రాయం.బాబు కన్నా తెలివయిన వడే నని మీరూ కితాబు ఇచ్చారు కదా - చూద్దాం తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడేమో!లేని పక్షం లో పోరాడి సాధించే వీలు లేదు కదా?

   Delete
  15. >>>అండమాన్ లాంటి ప్రత్యేక ప్రాంతాలు వేరు. ఇతర రాష్ట్రాలు వేరు. రాష్ట్రాలన్నింటా స్థానికత ఒకేలా ఉండాలనేది నా అభిప్రాయం.

   అవి వేరు అని ఏ విధంగా అంటున్నారు?

   రాష్ట్రాల మధ్యకూడా అభివృద్ధిలో అవకాశాలలో హెచ్చు తగ్గులుంటాయి. అందుకనే స్థానికత నిర్ణయించుకునే హక్కు రాశ్త్రాలకే వుండాలి. ఫెడరల్ విధానం కూడా అదే చెపుతుంది.

   ఉదాహరణకు ఏ మోదీ లాంటివరో వచ్చి అసలు స్థానికత అనేదే లేదు, ఎవరైనా ఎక్కడైనా స్థానికులే అన్నారనుకోండి. బెంగాల్ లోని విద్యాధికులు వచ్చి చత్తీస్‌గఢ్ ఉద్యోగాలన్నీ కొల్లగొడితే పరిస్థితేమిటి?

   Delete
  16. అక్కడ ప్రత్యేక పరిస్తితులు ఉంటాయి కనుక.

   Delete
  17. కొండలరావు గారు,

   చర్చించలేని / కూడని ప్రత్యేక పరిస్థితులా? అవే పరిస్థితులు రాష్ట్రాల మధ్య ఎందుకు వుండవు? రాష్ట్రాల హక్కును కేండ్రానికి ఎందుకు బదలాయించాలి?

   నేను ఉదాహరించిన West Bengal/Chattisgarh పరిస్థితి పై మీ అభిప్రాయం?

   Delete
  18. ఆంధ్ర తెలంగాణా మద్య ప్రత్యెక పరిస్తితులు ఉన్నాయానీ పాత అం.ప్ర లో రెండు ప్రాంతాల్ కు వేర్ వేరు లోకల్ రూల్ ళ్ళు ఉంన్దేవి

   Delete
  19. @ శ్రీకాంతాచారి
   "స్థానికతను నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానిదే."
   అసలు రాష్ట్రం దాకా ఎందుకు, ఏ ఊరికి ఆ ఊరు పరిమితం చేస్తే బాగుంటుంది కదా. ఎంచక్కా ఎవరి ఊర్లో వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవచ్చు, ఉంటే. ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణా వాళ్ళు హైదరాబాద్ కి వచ్చి చదువుకోవడమో, ఉద్యోగమో చేసారనుకోండి, అది అక్కడి ప్రజల అవకాశాల్ని దూరం చేసినట్టే కదా. అందుకే ఎవరి ఊరిలో వాళ్ళు ఉండాలి. ఏమంటారు?

   Delete
  20. Town nativity and regional nativity are not same. My maternal grandfather, who is a migrant from Orissa, had been in Andhra since 1950 but he has been in Hyderabad for not more than 30 years.

   Delete
  21. Ofcourse they are not the same. Who said they are same.

   BTW, What's your point Praveen?

   Delete
  22. It was you who suggested to confine nativity to the village.

   Delete
  23. << కొండలరావు గారు,

   చర్చించలేని / కూడని ప్రత్యేక పరిస్థితులా? అవే పరిస్థితులు రాష్ట్రాల మధ్య ఎందుకు వుండవు? రాష్ట్రాల హక్కును కేండ్రానికి ఎందుకు బదలాయించాలి?

   నేను ఉదాహరించిన West Bengal/Chattisgarh పరిస్థితి పై మీ అభిప్రాయం? >>

   ఈ కామెంటుని ఆలస్యంగా చూశాను శ్రీకాంత్ చారి గారు. వెస్ట్ బెంగాల్ అయినా చత్తీస్‌గడ్ అయినా దేశం మొత్తం మీద ఆయా స్థానికతలపై దేశం మొత్తం మీద కూడా చర్చించి ఓ నిర్ణయం తీసుకోవచ్చు.ఎవరు ఎక్కడ నివసించినా ఆయా ప్రభుత్వాలకు వారి శ్రమఫలితం నుండి ఆదాయ వాటా దక్కుతున్నప్పుడు నిత్యావసర లబ్ధి పథకాలకు ఆయా కుటుంబాల ఆర్ధిక పరిస్తితి రీత్యా మేలు అందాల్సినదే. ఇక దీర్ఘకాలికమైన విద్య-ఉద్యోగాలకు సంబంధించినవాటిలో కూడా కొంత తేడా ఉన్నప్పటికీ దేశవ్యాపితంగా ఒకే నిబంధన ఏర్పాటుచేసుకోవడమే మంచిది. స్థానికత విషయం రాష్ట్రాలకే సంపూర్ణంగా ఇస్తే దేశ సమైక్యతకు ఆటంకం అవుతుంది. ప్రజల మధ్య అంతరాలు పెరుగుతాయి.

   స్థానికత అంటేనే స్థానికులు వలసవచ్చినవారుంటారనే గదా? అలాంటప్పుడు ఎవరు స్థానికులు అనేదానికి నిబంధనలుండాల్సినదే. కానీ దేశ పౌరులందరికీ ఒకే నిబంధన ఉంటే మంచిదనే నా అభిప్రాయం. ప్రత్యేక పరిస్తితులున్నా అవీ కేంద్ర పరిధిలో చర్చించి నిర్ణయం తీసుకునేలా ఉంటేనే సంకుచితత్వాలు తగ్గుతాయి.

   ఈ అంశంపైన ఓ ప్రశ్న ఉంచి అభిప్రాయం తీసుకుందామని నాకు అనిపించిందండీ. కేవలం నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. విగ్రహాలు - కే.సీ.ఆర్ భాషపై ప్రశ్నలలో మీ అందరి కామెంట్లు, కొందరు సూచించిన ఇతర లింకులలోని మేటర్ ద్వారా చాలా విషయాలు తెలుసుసుకునే వీలు కలిగింది. ఈ అంశంపైనా మిగతా విషయాలు ఆ ప్రశ్నలో చర్చిద్దాం. వీలయితే స్థానికతపై మీరే ప్రశ్నను పంపే ప్రయత్నం చేయగలరు.

   Delete
 11. తెలంగాణా రాష్ట్ర రవాణాశాఖామంత్రి మహేందర్ రెడ్డి గారి ప్రకటనగా ఆదివారం 20-07-2014 డెక్కన్ క్రానికల్ (హైదరాబాద్) మెయిన్ పేపర్లో ఆరవ పేజీలో వచ్చిన బాక్స్ ఐటెం.

  " If any travel agency wants to run buses in Telangana, it should stop services in AP. "

  ఇక్కడ చర్చ నడుస్తున్నది "స్ధానికత" అనే విషయం మీద అని తెలుసు గాని పేపర్లో ఈ క్రింది వార్త చూసిన తర్వాత ఇలాంటి షరతులు కూడా రాబోతున్నాయా అనిపించి బ్లాగ్మిత్రులతో షేర్ చేసుకోవాలనిపించింది.

  ReplyDelete
  Replies
  1. స్థానికత మీద మా జిల్లాలో విద్యార్ధులు ఉద్యమ చేస్తున్నారు సర్. ఫీజు రీ ఎంబర్స్మెంటు నిధులు ఆపారనీ, ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. అందుకే నేను నిర్ధారించుకున్నాకే ప్రశ్న ఉంచాను. మీరన్న లింక్ నేను చూడలేదు. అలా అంటారా? ఏ సందర్భంలో ఎలా అన్నారు? ఆ పతిర్కలో వచ్చిన వార్త సరయినదేనా? అన్నది చూస్తే తప్ప వ్యాఖ్యానించలేము.

   Delete
 12. 1959లో చేరిన అశ్వారావుపేట ప్రాంతాన్ని మాత్రమే స్థానికత నియమం నుంచి తప్పిస్తే సరిపోతుంది. ఆ నియమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మార్చడం ఎందుకు?

  ReplyDelete
  Replies
  1. ఈ వాధం సరైతే ఆర్యులు మనదేశానికి వలస వచ్చిన వారు. వారు యుద్దాల్లో తరమగా దక్షిణాని కి వచ్చిన వారు ద్రావిడులు. చివరికి ఈ దేశ మూల వాసులు ఇక్కడ నివసించే గిరిజనులు, ధలితులూను. ఆర్యులు ఎప్పూడు ఈ దేశానికి వచ్చారో అప్పటి నుండి లెక్కలుదీసి దేశ పౌరసత్వం ఇద్దామా?

   Delete
  2. ఇదెక్కడి న్యాయం ప్రవీణ్ గారు. ఇది మీ బుర్రకి పుట్టినదేనా?

   Delete
  3. This comment has been removed by a blog administrator.

   Delete
  4. 1766లో ఆంగ్లేయులు కొండపల్లి కోటపై దాడి చెయ్యడం వల్ల నిజాం చిలికా సరస్సు నుంచి గుండ్లకమ్మ నది వరకు ఉన్న ప్రాంతాన్ని ఆంగేల్యులకి ఇచ్చేశాడని అందరికీ తెలుసు. 1766 - 1956 మధ్యలో అటు, ఇటు వలస వెళ్ళినవాళ్ళు చాలా మంది ఉంటారు. అయినా రెండు ప్రాంతాలూ వేరువేరు అస్తిత్వాలతో ఉన్నాయి కాబట్టే కె.సి.ఆర్. అలా అన్నాడు.

   Delete
  5. ఫీజులు స్థానికులకే ఇవ్వాలా అందరికీ ఇవ్వాలా యెంతమేరకు ఇవ్వవాలి అనేది కేసీఆర్ ఇష్టం.ఈ రోజు పేపర్లో మరింత స్పష్తమయిన వివరణ చూశాను.ఆ వివరాల్ని వదిలేస్తే స్థానికతని నిర్ణయించడానికి ప్రాచీన కాలం లోనే దేసంలో ఒక న్యాయ పరమయిన నియమం వుండి వుండేదని నాకు అనిపిస్తున్నది.

   రామాయణంలో కైక 14 యేళ్ళ వనవాసం యెందుకు పెట్టింది? మహా భారతంలో ద్యూత నియంగా 13 యేళ్ళ వనవాసం (12+1) యెందుకు వచ్చింది?

   రావణ వధానంతరం తిరిగి అయోధ్యకు వెళ్ళబోయే ముందు రాముడు హనుమంతుడ్ని పిలిచి విషయం చెప్పి తను తిరిగి రావడం భరతుడికి ఇష్టమా కాదా అని అడిగి భరతుడి ముఖలక్షణాల్ని కూడా నిశితంగా పరిశీలించమంటాడు, భరతుడికి తన పట్ల యేమాత్రం వ్యతిరేకత వున్నా తను అయోధ్యకు వెళ్ళననీ ఇక్కడే వుండిపోతాననీ చెప్తాడు.దానికి కారణం కైక పెట్టిన నియమం ప్రకారం అన్నేళ్ళు రాజ్యానికి దూరంగా వుండటం వలన సాంకేతికంగా తన హక్కుని పూర్తిగా కోల్పోయాడు గనక్!ధర్మరాజు ద్యూతనియమంలోని చిక్కు కూడా ఇదే.అరణ్యవాసం అనంతరం తన రాజ్యం మీద తనకి హక్కు ఇంకా వుండి వుంటే అయిదూళ్ళు ఇమ్మని రాయబారం యెందుకు చేస్తాడు, వెళ్తున్నానహో అని ఒక కబురు పెట్టి తిన్నగా తన రాజ్యాంకీ తను వెళ్తాడు గానీ?

   ఒక వ్యక్తి తన భూమికి గానీ రాజ్యానికి గానీ మరేదయినా స్థిరాస్థికి పది సంవత్సరాలూ యే విధమయిన సంబంధమూ లేకుండా వుంటే అతని హక్కులు పోతాయి అనే నియమం వుండేది, కాదంటారా?ఇప్పుడు స్థానికతకి కూడా ఆ పదేళ్లనే ప్రామాణికం చేస్తే యెలా వుంటుంది?పదేళ్ళు మరీ తక్కువా మరీ యెక్కువా కాకుండా న్యాయమయిన లిమిట్ అనే అనుకుంటున్నాను!

   నా ప్రతిపాదన ఇది:తను యెక్కడయితే స్థానికతను కోరుకుంటున్నాడో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తను అక్కడ 10 సంవత్సరాలు పూర్తిగా అక్కదే వున్నానని రుజువులు చూపిస్తూ ఒక అప్ప్లికేషన్ పెట్టుకుంటాడు,రుజువులు సరిపోతే అభ్యంతరాలేమీ చెప్పకుండా అతనికి స్థానిక హక్కును ఇవ్వవచ్చు.రుజువులుగా యెలెక్ట్రిసిటీ బిల్స్ గానీ గ్యాస్ డెలివరీ బిల్లుల్ని గానీ తీసుకుంటే బాగుంటుంది.యెందుకంటే ఆ బిల్ల్లులు సర్వీస్ డెలివరీ అయిన తర్వాత ఇచ్చే బిల్లులు కాబట్టి సాక్ష్యం బలమైనదే కదా.

   Delete
 13. తెలంగాణా ఉద్యమం జరిగినదే 1956కి ముందు నుంచి తెలంగాణలో నివసిస్తున్నవాళ్ళ కోసం. అది లేకపోతే ఆ ఉద్యమం ఎందుకు?

  ReplyDelete
  Replies
  1. అంటే తెలంగాణాలో ఇతరులెవరూ నివాసం ఉండొద్దంటావా ప్రవీణ్?

   Delete
  2. It is the question about the rights of the natives who have been living for many years in the region.

   Delete
 14. ఈ పోస్టుపై చర్చ విస్తృతంగా నడిచినందున దీనిపై ఓ ఆర్టికల్ వ్రాయడం జరుగుతుంది. కనుక మిగతా విషయాలు అక్కడ చర్చిద్దాము. ప్రస్తుతానికి కామెంట్స్ డిసేబుల్ చేయడమైనది.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి