------------------------------------------------
ప్రశ్న సంఖ్య : 24

ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------

Reactions:

Post a Comment

 1. రావణుణ్ణి హీరో చేస్తే హిందూ మతం పోతుందా? ఆ ప్రతిపాదనలు అతని హిందూ వ్యతిరేక స్థాయికి కూడా తగినట్లు లేవు.

  ReplyDelete
 2. రావణుడు సీతను ఎత్తుకెళ్లడం, శ్రీరాముడు అతన్ని హతమార్చడం యధార్ధం కాదా?

  ReplyDelete
  Replies
  1. కథ వేరు, చరిత్ర వేరు. రామాయణం కేవలం ఒక కథ. దాన్ని మార్చి వ్రాస్తే ఏమిటి, మార్చకపోతే ఏమిటి?

   Delete
  2. ماو تسي تونغ గారు...అంటే మీ ఉద్దేశ్యంలో రామాయణం కేవలం కథయేనా? జరిగినది కాదనా?

   Delete
 3. ఎంతోమంది బఫూన్స్ మేధావుల పేరుతో తెలుగు ప్రజల మధ్య చలామణి అవుతున్నారు కదా. హతవిధీ ఏమి తెలుగు ప్రజల దౌర్భాగ్యం. అయినా ఫర్లేదులే అన్నీ తిరగరాసే కాలం వచ్చిందిగదా. ఎవడికి తోచింది వాడు తిరగరాయచ్చు.

  ReplyDelete
  Replies
  1. మీరు చెప్పింది యదార్ధం vkbabuగారు.రావణుడు మంచివాడైతే శ్రీరాముడు ఎందుకు చంపుతాడు?రామాయణం కేవలం కథ అనడం ఇంకా విడ్డూరం.నా దృష్టిలో ఇదంతా వింతగా వుంది.

   Delete
 4. రామాయణాన్ని ఒక భక్తుడు చదివితే, అతనికి ఆ నాటి సమాజం అత్యద్బుతంగా ఉన్నట్లు కనబడుతుంది. దశరధుడూ, రాముడూ భరతుడూ రాజ్యాలు పాలించిన కాలంలొ ప్రజలు సుఖ సంతోషాలతో ఓలలాడినట్లూ, అందరూ చివరికి స్వర్గానికి వెళ్లి నట్టూ,నమ్ము తాడు. అతను ఆ కధని భక్తితొ చూస్తాడు.
  అదే కధని ఒక నాస్తికుడు చదివినట్లైతే, అతనికి, ఆకధలో ఉన్న స్వర్గ నరకాలూ, పాప పుణ్యాలూ, వరాలూ, శాపాలూ లాంటి వన్నీ అసహజంగా కన బడతాయి. ప్రజలు మూర్ఖు ఉన్నట్టు కనబడుతుంది. అంతకు మించి ఆ కధ ద్వారా అతను తెలుసుకోగలిగినదేమీ ఉండదు.
  అదే కధను ఒక మార్క్సిష్టు చదివితే, ఆ కధలో ఉన్న వర్గ భేదాల్ని చూస్తాడు. ధనిక పేద తేడాల్ని చూస్తాడు. మానవ సంబంధాల్లో, శ్రం దోపిడీనీ, యజమానీ సేవకత్వాల్నీ చూస్తాడు. రాముడు చేసిన యుద్దాల్లో సాంరాజ్య కాంక్ష్ని చూస్తాడు. సీత పాతివ్రత్యం లో, స్త్రీ భానిసత్వాన్ని చూస్తాడు. రామాయణ కధా కాలం నాటికే దోపిడీ వర్గాది పత్యమూ, దాని రాజ్యాంగమూ ఎంత స్తిరపడి పోయాయో చూస్తాడు.
  --రంగ నాయకమ్మ.
  అలాగే కంచ ఐలయ్యకు ఇలా కనిపించటంలో తప్పేమిటీ?

  ReplyDelete
  Replies
  1. మనిషిని భావం కంటే భౌతికతే ఎక్కువ ప్రభావితం చేస్తుందనేది నిజమైనపుడు మతానికి వ్యతిరేకంగా దాని కంటే ఉన్నతమైనదాన్ని ప్రజలకి ఇవ్వాలి. దేవాలయ భూమిలో జెండాలు పాతి ఆక్రమించుకునే పేదవాళ్ళందరూ నాస్తికులు కారు. వాళ్ళని మతం కంటే భౌతిక ప్రయోజనం ఎక్కువ ప్రభావితం చేస్తుంది కాబట్టి వాళ్ళు ఆ పని చేస్తారు.

   మతాన్ని సృష్టించే తెలివి కోతులకి ఉంటే అవి కోతుల కోసమే మతాన్ని సృష్టించుకుంటాయి. అలాగే రాచరిక భూస్వామ్య సమాజంలో మత గ్రంథాలు రాచరిక భూస్వామ్య వ్యవస్థకే అనుగుణంగా ఉంటాయి. రావణుణ్ణి హీరోని చేస్తే మూఢనమ్మకాలు పోతాయన్నట్టు మాట్లాడడం విచిత్రం కాదా?

   Delete
 5. ఐలయ్య కమ్యూనిస్టు కాదు. నాస్తికుడు కూడా కాదని భావిస్తాను. అటువంటప్పుడు రామాయణాన్ని ఆ కోణంలో దర్శించే అవకాశం లేదు.

  ఆయనొక దళిత వాది. ఆయన ప్రతిదాన్నీ దళిత కోణం నుంఛే చూస్తాడు. మన గ్రంథాలలో రాక్షసుల్లా వర్ణించబడ్డ వారందరూ ఒకప్పటి దళిత ప్రభువులుగా (వారు అప్పుడు దళితులేమీ కారు ప్రభువులే, కాకపోతే ఓటమి చెందిన తర్వాత దళితులుగా మారి వుంటారు) దళితవాదం భావిస్తుంది.

  వర్గపోరులో మార్క్సిజం దర్శించని కోణాలెన్నో వున్నాయి. కులవివక్ష, ప్రాంతీయ వివక్ష, మహిళా వివక్ష మొదలైనవి. అందుకనే ఆయా విషయాలపై ప్రత్యేక ఉద్యమాలు వచ్చాయి. దళిత వాది మిగతా విషయాల గురించి ఆలోచించడు, కేవలం తన జాతి, తన దేవుడు, తన రాజు, తన సంస్కృతి ఎలా తగ్గించి చూపబడుతున్నాయో దానిపైనే పోరాటం చేస్తాడు. అందులో భాగంగానే అతను రావణున్ని వెనకేసుకు రావడాన్ని గుర్తించాలి.

  అదే ఒక మార్క్సిస్టు దృష్టిలో రావణుడు కేవలం మరో రాజు. 'ఏ రాజు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం' అంటాడు. అదే దళిత వాది అందరు రాజులు ఒకటే అయినపుడు నా రాజును రాక్షసుడిగా ఎందుకు చూపాలి? అని ప్రశ్నిస్తాడు.

  మనం ఇంతకు ముందు ప్రశ్నలో నిజాం రాజును నిజాం పీడనలో వున్న ప్రజలకన్నా బయటివారే ఎక్కువ అసహ్యించుకోవడం, 'చెత్తా అని వర్ణించడం చూశాం. ఇదీ దాదాపుగా అలాంటిదే.

  ఒక కులాన్ని గాని, వర్గాన్ని గాని, ప్రాంతాన్ని గాని లోబరచుకొని exploit చెయ్యాలంటే ముందు వారి చరిత్రని, సంస్కృతిని నాశనం చేయాలి. అలా దోపిడీవర్గాలు నాశనం చేసిన పద్ధతి మనం ఇప్పటికే ప్రత్యక్షంగా చూశాం. ఐలయ్య బహుశా చరిత్ర, ఇతిహాసాల్లో దళితులకు సముచిత స్థానం కల్పించాలని భావిస్తున్నట్టు ఆయన మాటల ద్వారా తెలుస్తోంది.

  కాకపోతే ఇక్కడొక పెద్ద లోపం కనబడుతుంది. అనాటి రావణుడు, మహిషాసురుడు, నరకాసురుడు ఈ నాటి దళితులకు మూల పురుషులా కాదా అన్న విషయం నాకు తెలిసినంత వరకు శాస్త్రీయంగా ఋజువు కాలేదు. ఆ రకమైన వారసత్వాన్ని దళితులతో సహా ఎవరైనా నమ్ముతున్నారా అన్నది కూడా సందేహమే. అటువంటప్పుడు ఆ విషయాన్ని పాఠ్యాంశాలలో చేర్చమని డిమాండ్ చేయడం ఎంతవరకు సబబు అన్నది నా ఆలోచన.

  ReplyDelete
 6. రావణుడు ఒక స్త్రీని ఎత్తుకు వెళ్ళడం ఎందుకు తప్పు కాదో కొంచం ఆయన చెప్పడం మంచిది!
  అసలు రావణుడు సీతను ఎందుకు చేరబట్టలేదు అంటే, రావణుడు తన అన్న కొడుకు భార్యను చరిచాడు! అంటే తనకు కోడలు! ఆమె అతనిని శపించింది ఇంకో స్త్రీని చరిస్తే నీకు శిరస్సు విరిగి చనిపొతావు అని శపిస్తుంది!
  ఇవన్నీ వాళ్ళు చదవక రావణుడు ఇంకో స్త్రీని చరచ లేదు అనే అబద్దాన్ని అందరికీ ప్రచారం చేసి రావణుడు చెడ్డ వాడు కాదు అని ప్రచారం చేస్తున్నారు!
  వాళ్ళ ద్వేషం కేవలం బ్రాహ్మణుల మీద, కానీ వాళ్లకు తెలియదేమో రావణుడు కూడా బ్రాహ్మణుడే అని!

  ReplyDelete
  Replies
  1. సార్! చెరచడం వేరు. చరచడం (tsaratsaDam - thumping) వేరు.

   Delete
 7. Ahmed Chowdary గారూ..మరి గాంధీ మంచివాడే కదా గాడ్సే ఎందుకు చంపాడు?

  ReplyDelete
 8. ప్రవీణ్ చెప్పింది కరెక్టే, రామాయణం వాల్మీకి అనే కవి రాసిన ఒక కావ్యం మాత్రమే.అందులో యెలాంటి సందేహం లేదు.చరిత్రలో యెక్కడా సాక్ష్యాలు కూడా లేవు!

  ReplyDelete
  Replies
  1. తెలుగు హిందూత్వ బ్లాగర్లందరూ ఛాందసవాదులన్న నా అభిప్రాయాన్ని మార్చుకోక తప్పించికాదు మీకామెంటు చదివాక. (నా అర్ధం తెలుగు ముస్లిం బ్లాగర్లూ, క్రైస్తవ బ్లాగర్లూ అందరూ ఎదో గొప్ప rationality, logic వాడుతున్నారనికాదు.)

   దేవదాసు నవలచదివి, దేవదాసు ఒకప్పుడు దేవదాసు నిజంగా జీవించాడని అనుకోవడం ఎంతతెలివైనపనో religious fiction (అనగా పురాణాలు, బైబిలూ, కురానూ) చదివి, ఆ సంఘటనలన్నీ నిఝ్ఝంగా జరిగినవేనని అనుకోవడం అంతేతెలివైనపని. మతాలు, అవిచెప్పే గాధలూ మనుష్యులని ఒక మార్గంలో పెట్టడానికి (mould చెయ్యడానికి) ఉద్దేశ్యించబడినవి మాత్రమే. ఉద్దేశ్యించబడిన మార్గమూ, గాధల్లోని నీతీ సరైనవా కావా అన్నది మనం బుర్రపెట్టి ఆలోచించుకోవలసిందేతప్ప, 'ఏది నీతి' అన్న ఆలోచననాశ్రమను తప్పిచుకోడానికి ఉపయోగపడే short cutగా పురాణగాధల్ను చూడ్డంలోనే తప్పంతాఉంది.

   ఇక అసలు ప్రశ్న విషయానికే వస్తే, రామాయణం చరిత్ర అని ఐలయ్యగారు ఎలా తేల్చేశారో అర్ధంకాకుండా ఉంది. సదాగా దాన్ని రావణుణ్ణి హీరోగా మార్చి రాసుకోవడంతో నాకు అభ్యంతరంలేదుకానీ, చరిత్రగా దాన్ని బోధించడమన్న డిమాండు అర్ధంలేనిది. అసలు నీతిని బోధించడానికి ఎన్నో ఇతరసాహిత్యాలుండగా (ఉదా :- పంచతంత్ర కధలూ) మనిషిని religiously emotional stanceతీసుకొనే దిశగా ప్రేరేపించే ఇలాంటి వాటిని అందునా చరిత్ర, సైన్సు పేరుతో పిల్లలకు పరిచయంచెయ్యడం మంచిపనికాదు.

   Delete
  2. రాహుల్ సాంకృత్స్యాయన్ యెటిమాలజీ అనే టెక్నిక్ వాడి తెలుసుకున్న దాని ప్రకారం - శుంగ వంశపు రాజు పుష్యమిత్రుడి కాలపు కవి.ఆ రాజు ఆస్థాన కవి కూడా అయి వుండవచ్చు.కధలో రాముడికి వుపయోగించిన లక్షనాలు ఆ రాజు లక్షణాల నుంచి తీసుకున్నాడు అని రా.సాం భావం.

   కానీ అవతారికలో ఇతడు చూపించిన - ఈ ప్రపంచంలో పర్వతాలు స్థిరంగా వున్నంతవరకూ నా రామకధ వుంటుంది - అనే ధీమా ప్రపంచ సాహిత్యాలు అన్నింట్లోనూ మరే కవీ ప్రదర్శించ లేదు!

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top