------------------------------------------------
ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------


మీలో ఎవరు కోటీశ్వరుడు ఎలా ఉంటోంది?

ఎప్పుడూ సీరియస్ ప్రశ్నలే కాకుండా వినోదంపై దృష్టి మళ్లిద్దామనిపించి ఈ ప్రశ్న మీ ముందుంచుతున్నాను :)

ఈ మధ్య ఎక్కడ విన్నా ఈ ప్రోగ్రాం గురించి ఎక్కువగా చర్చించుకోవడం కనిపించింది. చాలా బాగుంది..... నాగార్జున బాగా చేస్తున్నాడు ..... అనేది టాక్.  దీనివల్ల మా టీవీ తెలుగులో నంబర్ వన్ స్థానానికి చేరుకుందట.

ఎక్కువగా టీ.వీ చూసే అలవాటు లేని నేను ఈ ఎపిసోడ్స్ ని నెట్‌లో ఉన్నవి చూశాను. ఈ రోజు లైవ్ కూడా చూశాను. ఈ రోజు ఆడినవారిలో శివకృష్ణ బాగా ఆన్సర్ చేశాడు. నెట్‌లో చూసిన పాత ఎపిసోడ్స్ లో ఉమాకాంత్ బాగా ఆన్శర్ చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నటి విద్యాబాలన్, శ్రేయ, లక్ష్మి మంచు, అల్లరి నరేష్, యాంకర్స్ ఝాన్సీ, సుమ తదితరులు గెస్ట్�లుగా విచ్చేశారు. ఈ షోలో చిరంజీవి వంటి ప్రముఖులూ పాల్గొనబోతున్నారట.  

 వీలయితే ఉమాకాంత్ పాల్గొన్న ప్రొఫైల్ క్రింది లింకు క్లిక్ చేసి మీరూ చూడండి:


Meelo Evaru Koteeswarudu : Umakanth Profile - Episode 27ఈ కార్యక్రమం పై మీ అభిప్రాయం ఏమిటి? బుల్లితెర ప్రేక్షకులకు-సమాజానికి ఏమైనా మేలు జరుగుతున్నదా?

Reactions:

Post a Comment

 1. ఈ ప్రోగ్రాం బాగానే ఉంటోంది.

  ఇది హిందీ కెబీసీకి నకలు.
  అది అమెరికావారి NBCలో వచ్చే Who Wants To Be A Millionaire కు కాపీ.

  నాగార్జునకు ఇచ్చే సమాచారంలో కూడా, ముఖ్యంగా పౌరాణికప్రశ్నల సమాధానాలలో కొన్ని పొరపాట్లు వస్తున్నాయి అక్కడక్కడా.

  మొన్న నకులసహదేవుల్లో సహదేవుడు పెద్ద అని చెప్పారు!

  శ్రీకృష్ణుడు ఎవరిని చంపి పాంచజన్యం అనే శంఖం తీసుకున్నాడు అంటే పాంచజన్యుడు అని చెప్పారు. వాడి పేరు పంచజనుడు. పంచజనుడి నుండి పుట్టింది కాబట్టే ఆ శంఖం పాంచజన్యం.

  పాండురాజును శపించిన ముని పేరు కిందాముడు అన్నారు. సరి యైన పేరు కిందముడు.

  ఉమాపతికి నాగార్జున ఆచార్య బిరుదు ఇచ్చారు. బాగుంది. అలాగే పిలుద్దాం. అతడి హడావుడి చూస్తే బాపు జోక్ ఒకటి గుర్తుకు వస్తోంది. విఎకె రంగారావుగారు గ్రామఫోన్ రికార్డుల సమాచారం సేకరించేవారు. ఆయన మీద బాపు ఒక కార్టూన్ వేసారు. దాని కేప్షన్ "రంగారావుగారూ రికార్డు ఆగనివ్వండీ వివరాలు వ్రాసుకుందురు గాని" అని. ఆయన రికార్డుతో పాటే దాని చుట్టు తిరిగేస్తూ ఉన్నారు మరి. అలాగే, "ఉమాపతిగారూ ఆగండీ, నన్ను ప్రశ్మకు అప్షన్లు చెప్పనివ్వండీ సమాధానం చెబుదురు గాని" అని ఇక్కడ నాగార్జున ఒకటే మొత్తుకోలు.

  ReplyDelete
  Replies
  1. NBC program itself is copied from ITV original.

   అంటే ఈ కార్యక్రమం నకలుకు నకలుకు నకలు! ఇంకా దీనికి నకలు ఒస్తుందేమో సార్.

   Delete
  2. ధన్యవాదములు శ్యామలీయం గారు. మీరు చెప్పినవి కొన్ని నేనూ గమనించాను. మీకున్నంత నాలెడ్జ్ నాకు లేదు. సహదేవుడు పెద్దవాడని చెప్పారు. నాకు ఆశ్చర్యమేసింది. అదే రైట్ అనుకున్నాను. నకుల సహదేవులలో ఎవరు పెద్ద సర్?

   Delete
  3. నకులుడు పెద్దండీ సహదేవుడు అందరికంటే చిన్న

   Delete
  4. జై గారు, నాకు తెలిసినంతమేరకు కూడా మీరన్నట్లు నకులుడే పెద్దవాడు. ఆ ప్రోగ్రాములో అందరూ అలా అనుకుంటారు, కానీ సహదేవుడు పెద్దవాడు అని నాగార్జుణ వివరణ ఇచ్చారు. ఇటువంటి క్విజ్ ప్రోగ్రాములలో బాగా స్టడీ చేసే ఆన్స్వర్స్ తయారు చేస్తారు కదా? అని అనుమానించాను. చూద్దాం ఇంకా ఏమైనా తెలిసినవారు వివరణ ఇస్తారేమో!

   Delete
  5. స్త్రీగర్భంలో పిండోత్పత్తిక్రమాన్ని బట్టి అమడల్లో జేష్ఠశిశువు పైభాగంలోనూ కనిషష్ఠశిశువు అధోభాగంలోనూ ఏర్పడతారు. అందుచేత సహజంగా కనిష్టశిశువు జననమే మొదటగా జరుగుతుంది. కాని జననక్రమాన్ని బట్టే లోకవ్యవహారంలో జేష్ఠ మధ్యమ కనిష్ఠాదులు గుర్తింపు. అందుచేత నకులసహదేవులనే కవలసోదరుల్లో నకులుడు పెద్ద, సహదేవుడు చిన్న. ఇందులో విప్రతిపత్తి యేమీ లేదు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top