ప్రజ కామెంట్ మరియు చర్చల ప్రాసెస్ విధానం పై ఇప్పటివరకూ వున్న అనుభవం మేరకు ఓ నిర్ణయం తీసుకున్నాను. ఎప్పటిలాగే మీరంతా సహకరిస్తారని ఆశిస్తూ ఆ నిర్ణయాన్ని మీముందుంచుతున్నాను. కామెంట్ పాలసీ ఏ విధంగా ఉండాలి? అన్న ప్రశ్నకు తమ సలహాలు అందజేసిన శ్రీకాంత్, జై గొట్టిముక్కల, గ్రీన్‌స్టార్, శ్రీకాంత్ చారి, శ్యామలీయం గార్లకు ధన్యవాదములు. మెయిల్ ద్వారా సలహాలు అందజేసినవారికీ ధన్యవాదములు. ప్రజ లో ప్రశ్నలు కామెంట్లుకు సంబంధించిన లోపాలుగా నేను గుర్తించినవి, ఇతరులు విమర్శించినవీ కలిపి చూస్తే ముఖ్యమైనవిగా ఇవి తేలాయి: 1) అనవసరమైన కామెంట్లు ఎక్కువగా ఉంటున్నాయి. 2) వ్యక్తిగత ప్రైవసీని ఆటంకపరచేవిధంగా కొందరు ప్రవర్తిసున్నారు కామెంట్ల పరంగా. 3) ఒక వ్యక్తిని ప్రజనుండి తొలగిస్తే ప్రజలో చర్చలు సవ్యంగా జరుగుతాయి. 4) నేను ఓ వ్యక్తిమీద ప్రత్యేక అభిమానం చూపుతున్నాను. కామెంట్ల డిలీట్ పరంగా ఆ తేడా కనిపించింది. 5) అనవసర ప్రశ్నలు కూడా ఉంటున్నాయి.
వీటిపై నేను చేయగలిగేది ఇలా :
(1)
కామెంట్లు ఎక్కువగా ఉండడం, మాలికలో ఎక్కువగా ప్రజ కామెంట్లు విసుగెత్తేలా కనిపిస్తున్నాయని ఒక ఆరోపణ. దీనిలో వాస్తవం ఉందా? నేనేమి చేయాలి? అని ఆలోచిస్తే: వాస్తవం ఉంది. నేను చేయగలిగేది నాకు వీలయినంతమేరకు అనవసర కామెంట్లను తొలగించాలి. దానికున్న మార్గాలు రెండు. ఒకటి కామెంటు మోడరేషన్ ఉంచడం, రెండు బ్లాగర్లు స్వీయ నియంత్రణ పాటించడం. నేను రెండోదానినే ఎంపిక చేసుకున్నాను. ఆ మేరకు మొదట బ్లాగర్లకు విజ్ఞప్తి చేసి ఫలితం లేకపోతే తప్పనిసరిగా కామెంట్ మోడరేషన్ విధించడమే. కనుక ప్రజలో డిస్కషన్ చేసేవారు కామెంట్ల పరంగా స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
(2)
కొందరు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేక వ్యక్తిగతంగా దూషణలకు దిగడం, అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించడం, అనవసరమైన వేడిని పెంచే వ్యాఖ్యలను చేయడం జరుగుతోంది. అప్పుడప్పుడు అనుకోకుండా భావోద్వేగాలకు లోనుకావడం వాటిని అదుపు తప్పడం సహజమే. అవి మనం ఓ విషయం పై ఏర్పరచుకున్న గాఢమైన అభిప్రాయానికి భిన్నంగా అవతలివారు గట్టిగా వాదిస్తున్నప్పుడు లేదా ఎదుటివారు మనలను కావాలని రెచ్చగొడుతున్నప్పుడు జరుగవచ్చు. వీటినైనా అదుపులో పెట్టుకోవలసిందే. అయితే ఇలాంటివాటిని అర్ధం చేసుకోవచ్చు. కానీ తప్పు తెలుసుకున్నప్పుడు వెంటనే సరి చేసుకోవడం సారీ చెప్పడం కనీస సంస్కారం. ఇది కూడా చేయలేని మూర్ఖత్వం ఆ మనిషి తత్వాన్ని తెలుపుతుంది. దీనివల్ల వారు మనుషుల మనసులకు దూరం అవుతారు. ఇలా కాక కావాలని రెచ్చగొట్టేవారుంటారు. అవసరం లేకున్నా దూరి ప్రశాంతవాతావరణాన్ని రెచ్చగొట్టేవారుంటారు. పదే,పదే అసభ్యంగా వ్యాఖ్యలు చేసేవారుంటారు. తెలిసి చేసినా తెలియక చేసినా అసభ్యకరంగానూ, ఇతరులను కించపరచే విధంగానూ, సబ్జెక్టుకు సంబంధంలేని విధంగానూ ఉన్న వ్యాఖ్యలను నిర్మొహమాటంగా తొలగించడం జరుగుతుంది. ఇందులో వ్యక్తులను బట్టి ఉంచడం జరుగదు. అలా చేయని కామెంట్లు మీకు కనిపించినప్పుడు నాకు మెయిల్ ద్వారా వాటి వివరాన్ని తెలుపగలరు. అన్నింటిని కొన్ని సందర్భాలలో  గమనించలేక పోవచ్చు. 
(3)
నేను ఏ వ్యక్తినీ తొలగించాలని అనుకోవడం లేదు. ఆయా వ్యక్తుల విజ్ఞతకే దానిని వదిలేస్తున్నాను. అసలు ఎందుకు ఫలానా వ్యక్తికి అంత ప్రాధాన్యతను ఇవ్వాలి? మొదటనుండి నాకు వ్యక్తులకంటే విషయానికి ప్రాధాన్యతనివ్వడమే మంచిదనుకుంటాను. ఇప్పుడూ అదే పాటించాలనుకుంటున్నాను. స్ట్రిక్టుగా ఓ పాలసీని ఏర్పాటుచేసుకుంటే దానిని పాటించేవారే ప్రజలో ఉంటారు. అలా లేనివారి కామెంట్లను డిలీట్ చేసుకుంటూ వెళ్ళడమే. తప్పును సరిచేసుకోలేనివారిని, ఒక్క అడుగు కూడా వెనుకకు తీసుకోలేనివారిని ఎవరూ ఉద్ధరించలేరు. అలకలకు, గ్రూపులకు నేను సమాధానం చెప్పలేను. వాటిని పట్టించుకునే తీరికా నాకు లేవని విజ్ఞప్తి.
(4)
నాకు ఏ వ్యక్తిమీదా ప్రత్యేకమైన అభిమానం మరియూ శతృత్వం లేవు. అలా అనుకునేవారికి నేను 2 విషయాలు అంటగడతాను :) 1) అమాయకత్వం  2) అన్యాయం. అమాయకత్వం అనేది నా గురించి తెలీక మాత్రమే అలా అంటున్నందుకు, అన్యాయం అని ఎందుకంటున్నానంటే తెలిసీ కావాలని ఆరోపించడం వల్ల. ఈ వ్యాఖ్యలలో ఏమైనా తప్పనిపిస్తే సీరియస్‌గా తీసుకోకండి. విషయం మాత్రం అదే. నాకెవరిమీదా బ్లాగులోకంలో ప్రత్యేకమైన అభిమానం, ప్రత్యేకమైన శతృత్వం లేవు. నేనభిమానించే వారు, నాకు కోపం ఉన్నవారూ ఉన్నారు. అది వేరే విషయం.
(5)
అనవసర ప్రశ్నలంటే ప్రజ ఉద్దేశమే తెలియనిదానిని తెలుసుకోవడం. అయితే తెలిసీ కౌంటర్ ప్రశ్నలు కొన్ని వేయడం గమనించాను. వాటిపట్ల జాగ్రత్తగా ఉండడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఉన్న పోస్టులలో అవసరమైనవి మాత్రమే రీ పబ్లిష్ చేయడం జరుగుతుంది. అనవసరం అనుకున్నవి తొలగించాలని నిర్ణయైంచుకున్నాను. ఇప్పటినుండి ప్రజలో వచ్చే ప్రశ్నలు తొలగించడం జరుగదు. ఇదే చివరి మార్పు.

ఇకపై ప్రశ్నలు పంపేవారికి విజ్ఞప్తి ఏమిటంటే : 

ప్రశ్న పంపేవారికి ఉండకూడని లక్షణం ఏమిటంటే :

మీకు తెలిసిన విషయాన్ని మీ ప్రతిభను ప్రదర్శించేందుకు ఉత్సుకతగా ప్రశ్న పంపకండి. ఇతరుల పై ద్వేషంతో ప్రశ్నలు పంపకండి అంటే కౌంటర్ ఎటాక్ అనేది విషయం మీద ఉండవచ్చు తప్ప వ్యక్తిని టార్గెట్ చేయకండి.

ప్రశ్నలు పంపాల్సిన పద్ధతి : 

మీరు ఏ విషయమైనా ఎంత చిన్న విషయమైనా తెలుసుకునేందుకు లేదా తెలిసినది మరింత మెరుగైన చర్చను జరిపేందుకు ప్రశ్నలు పంపండి. ప్రశ్న పంపండి అనే టేబ్ ద్వారా మీ ప్రశ్నలు పంపండి.

1) కరంట్ అఫైర్స్ ఉంటే వాటిని వెంటనే పంపాలి. భావోద్వేగాలను రెచ్చగొట్టేవి కాకుండా ప్రజలకు అవసరమైనవి ఉంటే మంచిది. ఇవి వెంటనే పబ్లిష్ చేయబడతాయి. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు సమస్య, విద్యార్ధుల ఫీజు రీ ఎంబర్సమెంటు నిర్ణయాలు లాంటివి.

2) సైద్ధాంతిక ప్రశ్నలు అయితే వాటికి సంబంధించిన ప్రశ్నలుకు మీవద్ద సమాచారం ఆధారం తెలియజేస్తూ ప్రశ్న పంపండి. ఈ చర్చ ద్వారా మీరేమి తెలుసుకోవాలనుకుంటున్నారో వివరించే ప్రయత్నం చేయండి. ఈ ప్రశ్నలు వీలును బట్టి పబ్లిష్ చేయడం జరుగుతుంది.

3) కులం - మతం - సంస్క్రుతి - ఆచార వ్యవహారాలు - మహిళల సమస్యలు వంటి సున్నిత విషయాలపై ప్రశ్నలు పంపేటప్పుడు భాషలోనూ, విషయ వ్యక్తీకరణలోనూ వీలయినంత సంయమనం పాటించాలి. వాటిని పాటికి పది సార్లు చెక్ చేసుకుని మీరెందుకు ఆ విషయాలను చర్చించదలచుకున్నదీ ఎదుటివారిని కన్విన్స్ చేసేలా మేటర్ రూపొందిస్తే ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. వీటిని వీలుని బట్టి పబ్లిష్ చేస్తాము. వీలయితే మేటర్ లో అవసరమైన మార్పులు చేస్తాము. లేదా పూర్తిగా తిరస్కరించడమూ జరుగుతుంది.

4) పరిపాలనకు సంబంధించి లేదా రాజ్యాంగం, న్యాయ వ్యవస్థకు సంబంధించిన వాటిలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఈ ప్రశ్నల వల్ల సమాజానికి దీర్ఘకాలికంగానైనా ప్రయోజనం ఉండేలా మేటర్ రూపొందించండి.

5) ఇతర ఏ విషయమైనా తెలుసుకోవాలనుకుంటున్న లేదా తెలియజెప్పాలనుకుంటున్న విషయాలపై తగిన కసరత్తు చేసి మరీ ప్రశ్నలు పంపండి.

వీలయినంతమేరకు ఏ విషయంలోనూ ఎవరినీ కావాలని కించపరచేలా కాకుండా ప్రశ్న ఉండేలా మీరే జాగ్రత్త వహిస్తే మనకు మరింత ఉపయోగం ఉంటుంది. దయచేసి పైన సూచించిన నియమాలు పాటించేందుకు మీరంతా సహకరించాలని విజ్ఞప్తి.

ప్రజ ఆర్టికల్స్‌
2012 నుండి ప్రారంభమైన ప్రజ బ్లాగు కొద్ది కాలంలోనే తెలుగు బ్లాగర్ల అభిమానాన్ని చూరగొన్నందుకు మీ అందరికీ ధన్యవాదములు. ప్రజ ఉద్దేశం ముఖ్యంగా చర్చల ద్వారా విషయాన్ని నిర్ధారణగా తెలుసుకోవడం. తెలిసిన విషయాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం. ఇందుకు నిరంతరం ఆరోగ్యకరమైన చర్చలు సహకరిస్తాయి. అలాంటి చర్చావేదికగా 'ప్రజ'ను నిరంతరం వృద్ధి పరచేందుకు కృషి చేస్తున్నాము. ప్రశ్నలు కూడా లేబుల్స్ వారీగా పబ్లిష్ చేస్తున్నందున పాతవాటిని చూడదలచుకున్న వారు విభాగాల వారీగా ప్రయత్నించగలరు. బ్లాగు ఆర్చివ్ లో కూడా రోజువారీగా పోస్టుల వివరాలు తెలుసుకోవచ్చు. ఓ విషయాన్ని చర్చ దాదాపుగా ముగిసింది అనుకున్నదానిపై నిర్ధారణగా ఆర్టికల్స్ వ్రాస్తే బాగుంటుందని భావిస్తున్నాను. వీటిని 'ప్రజ వ్యాసములు' అనే లేబుల్ క్రింద ఉంచితే బాగుంటుందనుకుంటున్నాను. ఎవరు ప్రశ్న పంపుతారో వారే చర్చను కంక్లూడ్ చేస్తూ ఆర్టికల్ వ్రాస్తే మరీ మంచిది. ప్రశ్న పంపినవారు ఆ పని చేయలేకపోతే శక్తి ఉన్నవారు ఆ ప్రయత్నం చేయవచ్చు.

కామెంట్ పాలసీ : 
 • కామెంట్ అనేది తప్పనిసరిగా ప్రశ్నలోని సబ్జెక్టుకు సంబంధించినదై ఉండాలి. 
 • ఎదుటివారితో మీరు ఎంతైనా విభేదించండి. కానీ దూషణకు దిగకండి. ఒకవేళ ఎదుటివారు అలా దిగజారితే మీరు కౌంటర్‌గా తిట్లదండకం చదవకుండా నాకు మెయిల్ చేస్తే ఆ కామెంట్లను తొలగిస్తాను. వీలయినంతమేరకు నేనే అటువంటి వాటిని డిలీట్ చేస్తాను. అలా చేయకుండా మిస్ అయినవి మీరు సూచించవచ్చు ఎప్పుడైనా సరే. అయితే వాటిని తొలగించాల్నా? వద్దా? అనేది నిర్ణయం మాత్రం మేమే తీసుకుంటాము. ఎటువంటి రాగద్వేషాలకు ఇక్కడ తావుండదు.
 • చర్చల సందర్భంగా వ్యక్తిగత దూషణే కాదు, కుటుంబ సభ్యులను చర్చకీడ్చి రచ్చ చేయకండి. ఇది సభ్యతలేని వారు మాత్రమే చేసే పని. వ్యక్తి చర్చకు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను చర్చలోకి లాగడమనేది అనాగరికమే. అయితే ప్రత్యేక సమస్యలో అయితే అదీ ఆ వ్యక్తిని టార్గెట్ చేసి అడగకుండా కుటుంబ సంబంధాలను ప్రశ్నించాల్సి వస్తే దాని సమయం సందర్భాన్ని బట్టి మినహాయింపు ఉంటుంది. ఆ విషయంలో మీకు మీరే నిర్ధారణలకు పోవడం మంచిది కాదు.
 • ఒకరి మీద దాడి చేయడానికి ఇంకొందరిని గ్రూపుగా మద్దతు తెచ్చుకునే ప్రయత్నాలు చేయడం మంచిది కాదు. అది వ్యక్తిగత దాడిక్రిందకే వస్తుంది. వ్యక్తుల ప్రైవసీని కాపాడాలి. వ్యక్తిగత లోపాలను చర్చలో వేలెత్తి చూపడం తప్పు.
 • మీ కామెంట్లు డిలీట్ అయినప్పుడు వాటి వివరాలు తెలుసుకొవాలంటే నాకు మెయిల్ చేయండి. అక్కడే చర్చించడం వేదికకు ఆటంకం అవుతుంది. ఇతరులతో పోల్చుకుని చూడకండి. ఇతరూలవి ఆలాంటివి ఉంటే మీరు నాతో ఫలానా కామెంటు అంటూ ఉదహరించి తెలుసుకోవచ్చు. తేల్చుకోవచ్చు. ఇది మాకూ ఉపయోగమే. ఓవర్ లుక్ లో అలాంటివి డిలీట్ చేయకుండా ఉంచితే తిరిగి డిలీట్ చేసే అవకాశం ఉంటుంది.
 • ఇతరులకు ఉచిత సలహాలు చేయకండి. అలాంటివి ఉంటే వారికి మెయిల్ చేయండి. తప్పు లేదు. అలా చేయడం వల్ల వారు సరిచేసుకునే అవకాశం ఉంటుంది. మన కామెంటు వల్ల ఎదుటివారు తప్పులు దిద్దుకునేలా ఉండాలి తప్ప హర్ట్ అయ్యేలా కాకుండా చూడండి.
 • కామెంట్లు తెలుగులో మాత్రమే వ్రాయండి. 

దయచేసి ప్రశ్నలు - ఆర్టికల్స్ - కామెంట్ల విషయంలో పై నిబంధనలు పాటించి ప్రజ ను మరింత మెరుగుపరచడానికి అందరూ ఎవరికి వారే ఎప్పటిలాగే సహకరిస్తారని ఆశిస్తున్నాను.
Reactions:

Post a Comment

 1. aa paata tapalo naa prashnalku miru answer iste naaku clarity vacchi undedi.

  ReplyDelete
  Replies
  1. సర్ పాతవాటి సంగతి వదిలేయండి. నేను ఏమైనా తెలీక పొరపాట్లు చేసినా వాటిని వదిలేసి ప్రస్తుత చర్చలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి. పర్సనల్‌గా చెప్పాలనుకున్నవి మెయిల్ చేయవచ్చు. కామెంటుకు ధన్యవాదములు.

   Delete
  2. miru mistakes chesaarani kaadu, naa mistakes telusukundaamani.

   Ok Sir. Thank you, no bad feelings :)

   Delete
  3. నేనైనా, మీరైనా పొరపాట్లు అందరూ చేస్తాం. దిద్దుకుందామనుకునే ఆలోచన గొప్పది. దానికి చర్చలు ఉపయోగపడతాయి. ఈ విషయంలో కొందరు ఎందుకు మొండిగా వ్యవహరిస్తారో, తప్పని చెప్పినా ఎందుకు ఒక్క అడుగు కూడా వెనుకకు వేయరో అర్ధం కాదు. మీరు అన్నవి తప్పు కాకున్నా, అవి పోస్టుకు సంబంధం లేనివి కావడం, అంతకు ఒకరోజు ముందునుండే నేను కామెంట్లు డిలీట్ చేయడం ప్రారంభించడంతో అలా జరిగిపోయిందండీ. అది నేనూ గమనించాను. no bad feelings అన్నందుకు ధన్యవాదములు.

   Delete
 2. ఒక సూచన:చర్చ నిరంతరంగా కొనసాగుతున్నట్టుగా వుంచకుండా ఇక చర్చించడానికి యేమీ లేదని అనిపించినప్పుడు కంక్లూజన్ లాగా భరత్వాక్యం ఒకటి వేసి చర్చ ముగిసిందని తెలియజేసే విధానం గురించి ఆలోచించండి.

  ReplyDelete
  Replies
  1. మంచి సూచన అండీ. ఇది నా ఆలోచనలో ఉన్నది. ఒక చర్చపై ఆర్టికల్ వ్రాశాక ఇక ఆ ప్రశ్నకు కామెంట్స్ డిసేబుల్ చేస్తే సరిపోతుందనుకుంటున్నాను. ఒకవేళ ఆ తరువాత కామెంట్లేమైనా ఉంటే ఆర్టికల్ పోస్టులో వ్రాసుకోవచ్చు. ఇదెలా ఉంటుంది హరిబాబు గారు?

   Delete
 3. కొండల రావు గారు,

  కొన్ని రోజులుగా నేను ప్రయాణంలో ఉన్నాను, అందుకే మీకు రాయటానికి కుదరలేదు, సుమారు ఇంకో రెండు నెలలు ఇంతే. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ప్రదేశంలో ఔట్లుక్ ఈమెయిల్ పని చెయ్యనీ కారణంగా ఇక్కడ రాస్తున్నాను.
  విషయంకు సంబందించిన టపా కనబడనందున ఇక్కడ రాస్తున్నాను, మీరు చదువుకున్నాకా డిలిట్ చెయ్యగలరు.

  క్షమించాలి. మీరు రాసిన ఈ మెయిల్ బాక్స్ పెద్దగా చెక్ చెయ్యను. మీకు నా పర్సనల్ ఐడి ఇచ్చానని అనుకోని, అందులో కనబడలేదు కాబట్టి రాలేదని అన్నాను.

  కోడింగ్ లో నాకు అనుభవం ఉంది కాని, ఇలాంటి వాటి కోడింగ్ లో పెద్దగా లేదు. సమయం చిక్కినప్పుడు నేను ప్రయత్నిస్తాను, ఆ ప్రయత్నం కాస్త ఆశాజనకంగా ఉంటె మిమ్మల్ని తప్పక సంప్రదిస్తాను.

  ప్రస్తుతం చాలా రోజుల నుండి అనుకుంటున్న ఒక సూచన మాత్రం చెయ్యగలను. మీ బ్లాగులో కొంత మంది తెలుగులో రాయటానికి ఇబ్బంది పడుతున్నారు, కొందరికి తెలియక, ఇంకొందరికి లేఖిని లాంటి సైట్ లకు వెళ్లి రాసి కాపి చేసీ ఇక్కడ పేస్ట్ చేసే ఓపిక లేక.

  మీ బ్లాగులో కామెంట్ బాక్స్ పక్కనే లేఖిని లాంటి ఒక బాక్స్ పెడితే అక్కడే తెలుగులో రాసి కాపి పేస్ట్ చేస్తే సౌకర్యంగా ఉంటుంది అని అనిపించింది. తెలియని వారు కూడా సులభంగా ప్రయత్నం చెయ్యగలరు. నేను కొన్ని వారాల క్రితం ప్రయత్నించి చూసాను, బాగా వర్క్ అవుతుంది. మీ బ్లాగ్ లో ఈ మార్పులు చెయ్యటానికి మీ అరవింద్ కి ఇది రెండు నిముషాల పని.

  http://www.techprevue.com/embed-google-input-tool-near-blogger-comment-box/

  ఇది ఎలా ఉంటుందో తెలియాలంటే నేను ప్రయత్నించిన ఈ సైట్ లో మీరు ప్రయత్నించి చూడొచ్చు http://newgreenstar.blogspot.com/

  ---------------------------------------------------------------------

  చివరగా మీరు నాకు రాసిన కామెంటు దానికి వివరణగా చాలా రాద్దామని వచ్చాను కాని మీరు పాత విషయాలు వదిలెయ్యమని పైన రాసారు, కాబట్టి క్లుప్తంగా ఒక వివరణ.

  >>అనేక సార్లు తింగరిగా వాదిస్తాడు.

  అపుడు ప్రతివాది ఇర్రిటేట్ అయితే ఎవరి భాద్యత?

  >>ప్రవీణ్ పై నాకు ప్రత్యేక అభిమానం ఏమీ లేదు.

  అప్పుడు అలా రాసినందుకు క్షమించాలి, నేను రాసేప్పుడు సరి అయిన పదాలు ఎంచుకోలేదు. సుదిర్గంగా కాకుండా క్లుప్తంగా ఒక ఉదాహరణతో చెపుతాను.

  తెలంగాణా వాదులు చెప్పినంవి ఇంచు మించుగా అన్ని నాకు సరి అయినవే అనిపిస్తాయి. అదే తెలంగాణా వ్యేతిరేకులకు అవన్నీ తప్పనే అనిపిస్తాయి. కారణం ఏమిటంటే వారు వారు నమ్మే విషయాలను బట్టి ఒక వ్యక్తీ మాటలు ఎక్కువ సానుకూలంగా అనిపించవచ్చు, ఇంకొకరివి తక్కువ సానుకూలంగా అనిపించవచ్చు. అది తప్పు కూడా కాదు, మానవ నైజం. ప్రవీణ్ గారికి, మీకు మద్య అలాంటి సారుప్యత ఉండి ఉండవచ్చు అనేది నిజానికి నా భావన. నా ఆలోచన తప్పు కూడా కావొచ్చు. ఎందుకంటే ప్రవీణ్ గారు నన్ను కించపరిచినట్లుగా నాకు అనిపించిన కొన్ని కామెంట్లు డిలిట్ కాబడలేదు. ఎందుకు కాలేవు అని ఆలోచిస్తే 'బహుశా అవి మీకు తప్పుగా అనిపించి ఉండవు' అని సరి పెట్టుకున్నాను. జలంధర్ గారు రాసిన దానికి నేను నా అర్థం చెపితే ఇద్దరి కామెంట్లు డిలిట్ కాబడ్డాయి. కాని తరువాత చూస్తే జలంధర్ గారి ఉద్దేశం వేరు అని ఆయనే చెప్పారు. ఇదంతా గందర గోళంగా ఉందని మీకు అనిపించటం లేదా?

  >>నేనే ఈ బ్లాగు నిర్వాహకుడిని కాబట్టి నా ఇష్టం వచ్చినట్లు చేద్దామని నేనేనాడూ అనుకోలేదు.

  మీరు అనుకోలేదు, కాని ఒక్కో సారి అలానే జరుగుతుంది కదండీ? ఒక వ్యాఖ్య శ్యామలియం గారికి సబబుగా అనిపించక మీకు చెపితే మీరు వారితో విభేదించారు. దాని అర్థం ఏమిటంటే ఒక విషయం పై ఒక్కొక్కరి అవగాహన ఒక్కో రకంగా ఉంటుంది, అందుకే కోర్టుల్లో ముఖ్యమైన కేసుల్లో ఒకటికి మించిన జడ్జులు ఉంటారు. అయితే ఇక్కడ మీ బ్లాగులో వచ్చిన చిక్కు ఏమిటంటే, ఒక వ్యాఖ్య ఎవరికైనా సబబుగా అనిపించక తీసివెయ్యమని కోరితే దానిని మీరు రివ్యు చేసి మీరు వారి అభిప్రాయం తో విభేదించి ఆ వ్యాఖ్యను ఉంచెయ్యగలిగే అవకాశం ఉంది. కాని ఒక వాఖ్య మీకు సబబుగా అనిపించక పొతే "మీరు ఇంకొకరితో చర్చించే అవసరం లేదు", ఎవరిని సంప్రదించకుండానే మీరు దానిని తీసి వెయ్యగలరు. మీకు సబబుగా అనిపించని వ్యాఖ్యలు అందరికి అలానే అనిపించాలని లేదు కదండీ? ఒక్కో సారి ఒకరు ఒక ఉద్దేశంతో రాస్తే, ఇంకొకరికి అందుకో ఇంకో ఉద్దేశం కనిపించవచ్చు కదండీ? {పైన జలంధర్ గారీ కామెంట్ గురించి}

  >>పోస్తుకు సంబంధం లేని కామెంట్లను పూర్తిగా డిలీట్ చేస్తున్నాను.

  ఎలా నిర్ధారిస్తారు? నాకు ప్రవీణ్ గారీ కామెంట్లలో నూటికి తొంబైకి పైగా సంబంధం లేనివే అనిపిస్తాయి.

  ReplyDelete
  Replies
  1. ముందుగా ఓ మాట. దయచేసి మీరు ఎప్పటిలాగే ప్రజ చర్చలలో పాల్గొనాలని విజ్ఞప్తి. బహుశా ఇలా ఓపెన్‌గా ఆహ్వానం చెప్పినది మీకే అనుకుంటాను. కనుక మీరు వెంటనే చర్చలలో పాల్గొనాలి. ప్రవీణ్ గురించి నేను ఒక్క ముక్క కూడా ఇక్కడ చర్చించదలచుకోలేదు. ఆల్రెడీ అతను మీ పట్ల తప్పు చేశాడని చెప్పాను. మీరు ఓ విషయంలో చాలా పొరపాటుబడుతున్నారు అని మాత్రం చెప్పగలను. మీ మెయిల్ ఐ.డీ నాకు మెయిల్ చేయగలరు.

   తెలుగు కామెంట్లకు సంబంధించి మీ సూచనను అరవింద్ కు చెప్పాను. మంచి సూచన. ధన్యవాదములు. కోడింగ్ గురించి సహకరిస్తానన్నందుకు ప్రత్యేక ధన్యవాదములు.

   ఈ కామెంటులో మీరు చెప్పిన విషయాలలో నేను గ్రహించాల్సినవి ఉన్నాయి. అవి నేనిక్కడ చర్చించదలచుకోలేదు. కానీ నాకు ఉపయోగపడేవి కనుక ఆ విషయంలోనూ మీకు ధన్యవాదములు. శ్యామలీయం గారు, మీరు చెపితే నేను ప్రత్యేకంగా పరిశీలిస్తాను. గతంలో భరద్వాజ్ గారితో వాదించేటప్పుడు మాత్రమే కొంచెం జాగ్రత్తగా పరిశీలించేవాడిని. అయినా మీ ముగ్గురినీ పరిశీలించినా నా నిర్ణయం నేనే తీసుకునే అలవటుందండీ. అది తప్పు కాదు కదా? నా నిర్ణయంలో లోపాలుండవచ్చు. కాదనను. కానీ అంతే అవకాశం ఉంటుంది కదా?

   మీరు ఎప్పుడైనా నాకు ఏ విషయమైనా మెయిల్ చేయవచ్చు. మీరు ఎప్పటిలాగే ప్రజలో చర్చలలో పాల్గొనాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు లేని లోటు ఖచ్చితంగా కనపడుతున్నది. మీ మెయిల్ ఐ.డీ లేనందునే నేను కూడా ఇక్కడే కామెంట్ ఉంచాను. మిగతా మరికొన్ని పర్సనల్ విషయాలు మీ మెయిల్ ఐ.డీ పంపాక మెయిల్ చేస్తానండీ.

   Delete
  2. ధన్య వాదములు కొండల రావు గారు. నేను కూడా అప్పుడు అతిగా స్పందించాను.

   ప్రస్తుతం ఒక నెల నెలన్నర వరకు చర్చలలో పాల్గొనటం కష్టమే. ఆ తరువాత తప్పక వస్తాను. మరో సారి ధన్యవాదములు. నా పర్సనల్ మెయిల్ ఐడి తో తరువాత మెయిల్ చేస్తాను.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top