దీన  దీపికలు

మెరాజ్ ఫాతిమా


ఎవరివా నయనాలు? ..... దీన దీపికలై నను వెంటాడుతున్నాయి.

ఎవరిదా చిరుకదలిక? ..... మంద గమనమై నను చేరాలని చూస్తుంది.

ఎక్కడిదా పిలుపు? ..... అంత దీనంగా ఉండి నను నిలిపివేస్తుంది .

ఎందుకా చిట్టి కెరటం అంత వడిగా నను తడపాలని చూస్తుంది?

ఎక్కడిదా చిన్ని రూపం? ..... అంత ఆశగా నను హత్తుకోవాలని చూస్తుంది.

ఎలా పడ్డాయి ఈ వెన్నెల మరకలు నా హృదయాంబరం పై?

ఎందుకు ఈ చుక్కలు దిక్కులేనివై చెల్లాచెదురయ్యాయి?

ఏ దోషానికి ఈ ముత్యపు చిప్పలు ఇలా ఉప్పెనలో మునుగుతున్నాయి?

ఏ శాపానికి ఈ మేఘమాలికలు గగన గర్భం నుండి నేల రాలాయి?

పుట్టిన గడ్దనీ, కట్టిన బట్టనీ ఎరుగని ఈ బాల గంధర్వులను, ఏ అక్షయ పాత్రతో  ఆదుకోగలను.

ఆ పాల బుగ్గల పై జారే పసిడి ధారలను ఏ ఆపన్నవస్త్రం తో తుడవ గలను.

ఆ చిన్ని బోజ్జలను నింపటానికి ఏ అక్షయ పాత్రను ఆశ్రయించ గలను.

ఈ వెన్నెల కూనలను, ఈ కాళ రాత్రి కరకు సాక్ష్యాలను ఎలా న్యాయ దేవత కు నివేదించగలను?
Reactions:

Post a Comment

 1. కళ్ళల్లో ఆర్తీ ఆశా ఆరాటం
  వీధికీద్చిన విధి
  ఎటూ ఆ వీధికి రాదు
  ఏ మారాజైనా మావంక
  ఓ కంట చూసి
  ఓ చేయి విదిలించక పోతాడా
  అని చాచే చేతులు కన్నవారి ఎండిన
  కళ్ళ గుంతల్లో తడి తోడే కవాటాలే
  దోశమే వరిది ద్రొహమెవరిది
  కాల దోషం పట్టి బూజు
  వాసనేసే రా జ్యాంగం
  అకాల పదవులకు ఆత్మలమ్మే
  పాలకులున్న కాలమా ..
  అయినా ఇవన్నీ తెలీని
  ఆ చేతులు ఆదుకునే చేతికై
  చూస్తూనే ఉంటాయ్

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి
 
Top