Reactions:

Post a Comment

 1. 1. బ్లాగ్ స్పాట్, వర్డ్ప్రెస్ కన్నా గూగుల్ ప్లస్, ఫేస్ బుక్ వాడకం సులువుగా ఉండటం.
  2. Limited capability of the aggregators in handling so many blogs

  ReplyDelete
  Replies
  1. నాకు ఈ రెండు విషయాల్లోనూ ఎక్కువ అవగాహన లేదండీ. ఏమైనా ఇవి ఆలోచించవలసివ విషయాలో.

   Delete
  2. ఈ ప్రశ్న ఉంచడానికి మీ వ్యాఖ్యలే ప్రేరణ :)

   నా అభిప్రాయం గూగుల్ ప్లస్ + ఫేస్ బుక్ ను , బ్లాగులను కంపేర్ చేయలేము. ఈ రెండింటి ఫీచర్లు డిఫరెంటుగా ఉంటాయి. బ్లాగులలో ఉండే సదుపాయం మిగతా సోషల్ నెట్‌వర్క్స్ ఉండదు. బ్లాగు అనేది ఓపెన్‌గా ఉంటుంది. లేబుల్స్ వారీగా చూసుకోవచ్చు. ఎపుడేది కావాలన్నా అంశాలవారీగా చదువుకోవచ్చు. పర్సనల్ డైరీనుండి పబ్లిక్ మేగ్‌జైన్ లాగా బ్లాగును వాడుకోవచ్చు. మిగతా సోషల్ నెట్‌వర్కులలో వేరే సదుపాయాలున్నా బ్లాగు అనేదాని ప్రత్యేకత కోల్పోదనే అనుకుంటున్నాను.

   నా వరకూ అయితే ఫేస్‌బుక్ అర్ధం కాదు. గూగుల్ ప్లస్ బాగున్నా నెట్ స్లోగా ఉంటే ఓపెన్ కాదు. బ్లాగులతో ఆ ఇబ్బంది లేదు. కనుక నాకు బ్లాగులే సౌకర్యంగా ఉన్నాయి.

   అయితే మీరన్నట్లు బ్లాగర్లలో ఉత్సాహం కనుమరుగవుతున్నది. కారణాలు వేరే ఉన్నాయనుకుంటున్నాను. చూద్దాం అందరి అభిప్రాయాలు చెప్పాక.

   Delete
  3. I have more following on Facebook. Therefore I concentrate more there.

   Delete
 2. 128 MB usable RAM is not enough for an aggregator to update many blogs at a time.

  ReplyDelete
  Replies
  1. ఈ 128MB RAM దాటరాదు అనే నియమం ఏమిటీ? నాకేమీ అర్థం కాలేదు. కొంచెం వివరించగలరా?
   బ్లాగు అగ్రిగేటర్ల విషయం ప్రసక్తి ఎలా సంగతం అవుతున్నది? మనం చర్చించేది తెలుగుబ్లాగర్లకు ఉత్సాహం తగ్గుతోందా ఎందుకలా అని కదా?

   Delete
  2. ఒక dedicated serverకి 256MB RAM ఉంటే వెబ్‌సైత్ అందులో 128MB RAM మాత్రమే వాడుకోగకుగుతుంది. ఒకేసారి అనేక బ్లాగుల RSS లింకులు చూడడానికి అది సరిపోదు.

   Delete
 3. ఇంటర్నెట్ ని ప్రభుత్త్వాలు, మీడియా తమ శత్రువుగా పరిగణిస్తున్నాయి. అది అందరికీ శత్రువేనని ప్రచారం చేయడానికి యమా తాపత్రయపడుతున్నాయి. వాస్తవానికి అవి రెండూ ఇంటర్నెట్ ని చూసి గడగడా వణికిపోతున్నాయి. అందుకని దాన్ని కంట్రోల్ చేయడం కోసం నెటిజెన్లు ఏం రాసినా వివాదమంటూ కేసులు పెడుతున్నాయి. మెయిన్ స్ట్రీమ్ ప్రింట్/ ఎలక్ట్రానిక్ మీడియాలో ఏది రాస్తే నేరం కాదో అది నెట్ లో రాస్తే మాత్రం నేరమయిపోతోంది. చాలా చిన్న విషయాలకి చాలా పెద్దకేసులు పెట్టి నెటిజెన్ల పరువు తీస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూసి నెటిజెన్లు విరక్తి చెంది ఉన్నారు. నెట్ స్వేచ్ఛ కోసం ఏదైనా పెద్ద ప్రజా ఉద్యమం రావాల్సి ఉంది. అప్పుడు గానీ బ్లాగుల్లో ఇంతకు ముందటి కోలాహలం కనిపించదు.

  ReplyDelete
 4. నా వరకు నేను వ్రాసిన ప్రతీదానికి ప్రతిస్పందన రాక మరియు నేను చెప్పాల్సిన విషయం ప్రచురించలేక ఈ మధ్య తగ్గించాను!
  అదే కాకుండా నేను చాలా అక్షర దోషాలతో ప్రతులు ప్రచురిస్తున్నాను అని కూడా అనిపిస్తుంది!
  ఇదే కాకుండా ఏ విషయం మీద వ్రాయాలో అర్ధం కాక, ఇంకొంత మంది అనువాద ప్రచురికులను చూసి కూడా!

  ReplyDelete
 5. ఇది నా అభిప్రాయం మాత్రమే!!

  ఈ మధ్య నాకు బ్లాగ్ లు వ్రాయటానికి సమయం సరిపోవటం లేదు.
  అందరికీ ఉపయొగపడాలని మంచి విషయాలు వ్రాస్తున్నాను, అది కొంత మంది నెగెటివ్ గా తీసుకుంటున్నారు!

  నా బ్లాగ్ ని చూడటానికి అంత అందం గా ఉండదు

  ReplyDelete
 6. నా బ్లాగ్ పేరు ఈతరం

  ReplyDelete
 7. మిగతా తలనొప్పుల వల్ల సన్నగిల్లుతున్న ఆసక్తి, మరియు తెలుగు లో తప్పులు లేకుండా టైప్ చేసుకోవడం కోసం ఖర్చు అయ్యే సమయం, రెండూ ఓ రకం గా పరిమితుల్ని సృష్టిస్తున్నాయండీ నాకు. మరొక విషయం నాకు అనిపిస్తోంది, తెలుగు బ్లాగులు పెరుగుతున్నాయి కానీ, పాఠకులు దానికి తగ్గట్టు పెరగడం లేదు. తెలుగు సాహిత్యం, వ్యాసాలపై ఆసక్తి ఉన్న ఎంతో మంధి పాఠకులకు అసలు బ్లాగుల విషయం తెలీనే తెలీదు. మనం రాసింది ఎక్కువ మందికి చేరువు అవుతుంది అనే నమ్మకం రచయితకు స్పూర్థిని ఇస్తుంది. చాలా మంది బ్లాగర్లు, వెబ్ పత్రికలకు రాయడానికి బహుశా ఇదే కారణమేమో. ఆగ్రిగేటర్లను మించిన సాధనాలు కావాలి. మన ప్రధాన తెలుగు వార్తా పత్రికలు కనీసం తమ తమ వెబ్ సైట్లలో, ఆగ్రిగేటర్స్ కి లింక్ పెడితే బావుంటుందేమో.

  ReplyDelete
  Replies
  1. తెలుగు బ్లాగులని ప్రోత్సహించడానికి ఈ-తెలుగు అనే సంఘం ఉంది. వాళ్ళు తమ సంఘ లక్ష్యంతో సంబంధం లేని గ్రాంథిక భాషని ప్రోత్సహించడం వల్ల మొదటికే మోసం వచ్చింది. ఉదాహరణకి కంప్యూతర్‌ని సంగణకం అనీ, కీబోర్ద్‌ని మీటల బల్ల అనీ, CDని సంకోచక పళ్ళెం అనీ, ఇలా జనానికి అర్థం కాని భాష ఉపయోగించడం వల్ల జనం ఇటువైపు రావడానికే భయపడిపోయారు.

   Delete
  2. తమాషాగా ఉంది. ఇంకా radio activity అనే మాటకు చాలాకాల క్రితమే రశ్మ్యుద్గారత అనే పేరుని తెలుగుమీడియం సైన్సు పుస్తకాలలో చదివి విస్తుపోయాను. పదం సరైనదే కాని ఎవరికైనా నోరు తిరుగుతుందా అని సందేహం వచ్చింది. అప్పటికే దానికి 'అణు ధార్మిక శక్తి' అనే వ్యవహారం ఉంది. కొత్తపదాలు ప్రజలకు నచ్చకపోతే ఇంతే సంగతులు.

   Delete
  3. మనవాళ్ళకి బ్లాగులు వ్రాయడమేఒ కొత్త. వాళ్ళకి బ్లాగులు వ్రాయడం నేర్పించకుండా సంగణకం, సంకోచక పళ్ళెం లాంటి పదాలు నేర్పిస్తే వాళ్ళు బ్లాగుల వైపు ఎలా వస్తారు?

   Delete
 8. ప్రజలకు వినోదం ముఖ్యమా విజ్ఞానం ముఖ్యమా అన్న చర్చ పెడితే, అది వాడిగా వేడిగా జరిగితే జరగవచ్చును కాని వాస్తవ ప్రపంచంలో అసలు చర్చయే లేదని అనిపిస్తోంది.

  అందరికీ వినోదం కావాలండీ వినోదం.

  అలాగని జనం చదవటమూ విజ్ఞానమూ అంటే పారిపోతున్నారా అంటే పూర్తిగా అలా చెప్పలేము. తప్పనిసరిగా అవటం వల్ల మార్కుల కోసం చదువుతున్నారు - అదీ‌ గైడ్లూ కోచింగుల సాయంతో. ఇష్టపడి చదివే వారి శాతం చాలా తక్కువ. అ చదువుల పుణ్యమా అని ప్రపంచజ్ఞానం కోసమనో సాహిత్యానుశీలనం కోసమనో చదివే వారు మరీ తక్కువైపోయింది. ఇక చదువు కాస్తా ముగిసి ఉద్యోగజీవితం లోనికి వచ్చాక ఉద్యోగబాధ్యతతో పోరాడటానికీ రకరకాల డాక్యుమెంటేషన్లను నిత్యం పారాయణం చేయటంతో తోటకూరకాడల్లాగా ఐపోక తప్పని పరిస్థితి. ఇంకా ఇష్తమైన విషయాలూ వాటికోసం చదవటాలూ మూలపడుతున్నాయి. ఇదీ సగటుమనిషి గోల. అందుచేత ఆ మనిషి వినోదం కోసమే చదవటం చేస్తున్న పరిస్థితి కాని విజ్ఞానం కోసం చదివేది లేకుండా ఉంది.

  ఇది సాధారణ పరిస్థితి. మంచి అభిలాషతో పాటు పట్టుదలకూడా పుష్కలంగా ఉన్నవాళ్ళు బోలెడు మంది విజ్ఞానం కోసమూ చదువుతున్నారు.

  బ్లాగులోకం వినోదవిజ్ఞానాల మేలవింపుగా ఉంది. అలా ఉండటం అభిలషణీయం కూడా.

  అన్ని చోట్లా జరిగే వ్యవహారంలాగా, ఇక్కడా బోలెడు 'రొద' చేయటానికే పరిమితమైన బ్లాగులూ ఉన్నాయి. ఉండనివ్వండి. అన్నీ రత్నాలైతే దేనికీ విలువ ఉండదు - చాలా భాగం రాళ్ళు ఐనప్పుడే రత్నాలకు విలువ. అందుచేత చెత్తబ్లాగులని వేటినీ విసుక్కోవద్దు. కాని ఇప్పటికీ సగటు తెలుగు పాఠకుడికి అంతర్జాలంలో చదివే అలవాటు లేదు.

  సారాంశంగా చూస్తే, చదువరుల ప్రోత్సాహం లేక వ్రాసేవారికి ఉత్సాహమూ కరవైపోతున్నది. క్రమంగా బ్లాగులోకం నీరసంగా తయారవుతున్నది!

  ReplyDelete
  Replies
  1. విజ్ఞానం కోసమైనా వినోదంకోసమైనా పుస్తకాలవైపు మొగ్గుచూపేవారు తగ్గిపోయారు. అందునా తెలుగు పుస్తకాలవైపు మొగ్గుచూపేవారైతే మరీనూ. జనాలలో పుస్తకాలు చదవడానికి కావలసింది ఓపిక అనీ, ఆసక్తి కానేకాదనీ ఒక అభిప్రాయం ప్రబలిపోయింది. ఈమధ్య ఉద్యోగార్ధం నేర్చుకోవాల్సిన విషయాలక్కూడా యూట్యూబ్ మీదే ఆధారపడుతున్నారు. అక్షరాలతో ఈ తకరారు ఏమిటో నాకు అస్సలు అర్ధం కావడంలేదు.

   ఈ పరిస్థితి ప్రస్తుత టీనేజీ యువతరంలోనే మెరుగ్గా ఉంది. వారి కనీసం హ్యారీపాటరో, లార్డాఫ్ ది రింగ్సో ఏదో ఒకటి వేలకొద్దీ పేజీలు చదవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.


   అసలు ఈ ప్రోత్సాహం గురించి నాదో ప్రశ్న. నిరంతర ప్రోత్సాహం ఉంటేగానీ రాయలేకపోవడం ఒక బలహీనత కాదా? గుర్తింపు, ప్రోత్సాహాలకోసం వెంపర్లాడటానికీ, ఫేస్‌బుక్‌లో లైకుల కోసం వెంపర్లాడడానికీ తేడాఉందంటారా? ఎవరివో మెచ్చుకోళ్ళను లక్యించి, ఆశించి ఎందుకురాయాలి? అవి రానప్పుడు ఎందుకు నిరాశ చెందాలి?

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's p v satyanarayana videso vm vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top