----------------------------
'వార్త-వ్యాఖ్య' లో మీరు ఏదైనా అంశాన్ని చర్చగా ఉంచాలనుకుంటే వివరాలకై ఇక్కడ నొక్కండి. వార్త-వ్యాఖ్య మొత్తం టపాలకోసం ఇక్కడ నొక్కండి.
------------------------------------------
వ్యవసాయం చేద్దాం... ముందుకు పోదాం..., ఆంధ్రప్రదేశ్ యువతకు చంద్రబాబు పిలుపు


అనంతపురం, జూలై 25 : యువత వ్యవసాయం చేయాలని, వ్యవసాయం పట్ల అభిమానం, మక్కువ పెంచుకోవాల్సిన అవసరం ఉందని.. వ్యవసాయం చేద్దామని, అందరం కలిసి ముందుకు పోదామని ఆంధ్రప్రదేశ్ యువతకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం ముదిగుబ్బలో జరిగిన రైతు చైతన్య సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రైతుల కష్టాలను చూసి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతోనే కొత్త రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా రుణ మాఫీ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

రైతు బిడ్డగా మీ సమస్యలు ఏమిటో నాకు తెలుసునని, రైతుల కళ్లల్లో ఆనందం చూడాలనేదే నా కోరికని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రైతుల కష్టాలు తీరుస్తానని ఆయన హామీ ఇచ్చారు. జిల్లాలో సమస్యలు ఉన్నాయని, ఇక్కడ వర్షపాతం తక్కువని, రాష్ట్రంలోనే కాదు... దేశంలో తక్కువ వర్షం వచ్చే జిల్లాల్లో రెండోది అనంతపురం జిల్లా అని ఆయన అన్నారు. డ్రిప్ ఇరిగేషన్‌తో జిల్లాలో కరువును తరిమికొట్టవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ గానీ, స్పింక్ ఇరిగేషన్ గానీ ఎక్కువగా ఉపయోగిస్తారని, దీనికి ఆనాడు నాంది పలికింది నేనే అని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. జిల్లాను స్ఫూర్తిగా తీసుకుని డ్రిప్ పెడితే తప్ప భవిష్యత్‌లేదని ఆ రోజేనే డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రాధాన్యం ఇచ్చామని ఆయన తెలిపారు. ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఇక్కడ నీరు తక్కువగా ఉందని, దీనిపై ఏం చేస్తే బాగుంటుందో ఆలోచన చేస్తున్నామని, ప్రతి ఒక్క రైతు ఒక శాస్త్రవేత్తగా తయారు కావాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

జిల్లాలో 50 వేల ఎకరాలకు స్పింకర్లు ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పండ్ల ఉత్పత్తుల కోసం కోల్డ్ స్టోరేజ్‌లు నిర్మిస్తామని ఆయన చెప్పారు. వీలైనంత త్వరగా హంద్రీ-నీవా త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. తుంగభద్ర నుంచి 30 టీఎంసీలు రావాల్సి ఉండగా కనీసం 20 టీఎంసీలు కూడా రావడం లేదని, మనకు రావాల్సిన వాటా కోసం గట్టిగా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వర్షం వచ్చినప్పుడు రైతులు భూగర్భజలాలుగా మార్చుకోవాలని, ఎక్కడ వర్షం వస్తే ఆ గ్రామంలోనే నీరు నిలువ చేసుకోవాలని ఆయన సూచించారు. అవసరమైతే రైతులు తమ పొలంలోనే నీటిని భూగర్భజలాలుగా మార్చుకోవాలని ఆయన అన్నారు.
(from andhrajyothy daily)
Reactions:

Post a Comment

 1. చంద్రబాబు ఎన్ని కబుర్లైనా చెపుతాడు. ఒక పల్లెటూరివాడు హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారి అయితే అతన్ని స్థిరాస్తి వ్యాపారిగానే చూస్తారు కానీ పల్లెటూరివానిగా చూడరు.

  ReplyDelete
  Replies
  1. అయితే బాబు మారలేదంటావా ప్రవీణ్ గారు!?

   Delete
  2. Now he is not a farmer of 3 acres. Isn't it true?

   Delete
  3. వ్యవసాయం దండుగ అన్న నోట నేనూ రైతు బిడ్డనే...... యువతను వ్యవసాయం చేసి ముందుకు పోవాలని పిలుపివ్వడం కళ్లు భూమిపైకి తెప్పించినట్లనిపించడం లేదూ.... !?

   Delete
  4. గ్లోబలైజేషన్ కాలంలో బతకడానికి IT ఉద్యోగం ఒక్కటే మార్గం అని జనాన్ని నమ్మించాలనుకున్నాడు. ఇంత చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి IT ఉద్యోగుల సంఖ్య మూడున్నర లక్షలు దాటలేదు.

   Delete
  5. ఉత్పాదక రంగాన్ని విస్మరించి కేవలం సేవారంగంతో ఎలా ఆర్ధికవ్యవస్థను గాడిలో పెట్టాలనుకున్నాడో! మంచి ఎకనమిస్టు అని చెప్తారు మరి.

   Delete
  6. అతను చెప్పేవి కబుర్లు అన్నది ఇందుకే కదా!

   Delete
 2. ఏ యండకాగొడుగు పట్టే రాజకీయకుల మాటలు వారిలో మార్పుగా చూడాలండీ?

  ReplyDelete
  Replies
  1. తిరుపాలు గారూ ! అలాగే చూడాలి. అయితే అలా అయినా కళ్లు నెత్తినుండి దిగిందనుకుంటాను. ఏ ఇజమూ లేదు ఇక టూరిజమే. వ్యవసాయం దండుగ లాంటి ఆకాశ విహారపు డైలాగులు ఇప్పుడు తప్పాయి కదా? :))

   Delete
 3. ఆయన అన్నీ నాకు తెలుసు, అన్నీ నేనే చేశాను అన్న భ్రమల్లోంచి బయటికి వచ్చి నిపుణుల సేవలను ఆయా రంగాల్లో వాడుకుంటే మెరుగైన పాలన అందించే అవకాశం వుంది. ఇప్పటికిప్పుడు ఆయన వేసిన Capital Comittee చూడండి, ఒక్క నిపుణుడూ లేదు, ఆంతా తన భజన బృందమే.

  ReplyDelete
  Replies
  1. గుడ్ సజెషన్. ధన్యవాదములు శ్రీకాంత్ చారి గారు. చంద్రబాబు ఎప్పుడూ అబధ్రతలో ఉంటాడు. అందుకే ఆయన ఓ కోటరీ ఏర్పరచుకుంటారు. తనకు తెలీకుండానే తప్పులు చేస్తుంటారు. మంచి క్రమశిక్షణ, దూరదృష్టి, ఏదో చేయాలనే తపన ఉన్నా రాజకీయంగా నేటి రోజులలో ఒక కీలక అంశమైన విశ్వసనీయత అంశంలో మాత్రం తన నిత్య అబధ్రతా రోగంతో ఫెయిల్ అవుతుంటాడు. ఇది బాబుపై నా అంచనా.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top