ప్రశ్న పంపినవారు :  శ్యామలీయం.

ఈ రోజున టీఆర్ఎస్ మాజీ నాయకులూ, ఆ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన ప్రకాష్ తెలంగాణ ప్రజలం భారతీయులం కానే కాదు We are not Indians అంటూ చేసిన ఈ కామెంట్లు వినండి.. చూడండి..!!
క్రొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో కొలువుతీరిన  తెరాస పార్టీ భారతదేశ సార్వభౌమాధికారాన్నిధిక్కరిస్తున్నది!

భారతదేశపౌరులుగా మనం దీనిని ఎలా అర్థం చేసుకోవాలి?  ఎలా స్పందించాలి?

ఈ పరిణామానికి భారతదేశప్రభుత్వం ఎలా స్పందించవలసి ఉంది?

ఇది తేలిగ్గా తీసుకొంటే భారతదేశవిఛ్ఛిత్తి అనేది నేడో రేపో జరిగే పరిస్థితి వస్తున్నది అనటంలో ఎవరికైనా సందేహం ఉందా?

1956వ సంవత్సరంలో ఏ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందో, ఆ పరిస్థితుల్లోనే ఆ రాష్ట్రం యొక్క విఛ్ఛిన్నతా బీజాలూ కొందరు నాటటం జరిగింది. అందులో తప్పొప్పుల గురించి అనంతమైన చర్చలు జరిగాయి. అనేక ఆందోళనలూ జరిగాయి.  చివరకు ఆంధ్రపదేశ విఛ్ఛిత్తీ అత్యంతనాటకీయంగా జరిగింది.

లోక్‍సభ సభ్యురాలు కూడా ఐన కెసీఆర్‍గారి కుమార్తె, కవితగారు నిన్న మొన్న కాశ్మీర్ హైదరాబాద్ సంస్థానాలను బలవంతంగా ఇండియాలో కలిపారని వ్యాఖ్యానించడం, కాశ్మీర్‌లో కొంతభాగాన్ని ఇండియా వదులుకోవాలని వ్యాఖ్యానించడం జరిగింది.  అది అమిత్రవిదేశాలు చక్కగా వాడుకున్నాయి.

తెలంగాణా రాష్ట్రంలో ప్రజలకు  పాస్‍పోర్టు తరహాలో ‘తెలంగాణా సిటిజన్ కార్డు’లను ఇచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది.

ఈ రోజున టీఆర్ఎస్ మాజీ నాయకులూ, ఆ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన ప్రకాష్ తెలంగాణ ప్రజలం భారతీయులం కానే కాదు We are not Indians అంటూ చేసిన ఈ కామెంట్లు వినండి.. చూడండి..!!

ఈ పరిణామాలన్నీ ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయి.

తెరాస వారి వ్యూహం ఏమిటీ?  ఎందుకు వారు ఏకంగా భారతదేశం మీదే కక్షకట్టి ప్రవర్తిస్తున్నారూ?
ఇన్నాళ్ళూ మనం వారి ఆక్రోశం అంతా కేవలం సీమాంధ్రప్రజలమీదే అనుకుని పప్పులో కాలు వేసామా?
ఈ కథ వెనుక మనకు కనబడని నిర్దేశకులు ఎవరైనా ఉన్నారా?
Reactions:

Post a Comment

 1. http://indianexpress.com/article/india/india-others/no-one-guides-us-in-parliament/99/

  ReplyDelete
  Replies
  1. ప్రవీణ్. మీ రిచ్చిన లింక్ చదివాను.
   మీరు లింక్ ఎందుకు ఇచ్చారో తెలిసాక మీరు చెప్పదలచుకున్నది చెప్పాక మీకు అవసరమైతే సమాధానం చెబుతాను.

   Delete
  2. ఆమె దేశం నుంచి వేరుపడాలనుకోవడం లేదని ఆ లింక్ చదివిన తరువాత కూడా అర్థం కాలేదా?

   Delete
  3. ప్రవీణ్. కావచ్చును. కాకపోవచ్చును కూడా. అందులో ఆవిద ఉద్దేశాలు కొన్ని సమంజసంగా ఉన్నమాట వాస్తవం, కాని కాశ్మీరును తెలంగాణాను ఒక గాటనే కట్టే ప్రయత్నం వెనుక, ఈ రోజు కాశ్మీరు సరిహద్దులను మార్చుకోవాఅలని చెప్పిన నోటనే రేపు తెలంగాణను వదలుకోవాలని కూడా అవిడ భారతదేశానికి సుద్దులు చెప్పే అవకాశాలూ కనిపిస్తున్న మాటా అంతే నిజం. మీకలా అనిపించకపోతే ఆశ్చర్యపోను.

   Delete
  4. "రేపు తెలంగాణను వదలుకోవాలని కూడా అవిడ భారతదేశానికి సుద్దులు చెప్పే అవకాశాలూ కనిపిస్తున్న మాటా అంతే నిజం."

   ఇష్టం లేకపోతె రామ అన్న మాట కూడా ఏదోలా వినబడుతుంది అంటార్ కదండీ, లేని దురుద్దేహ్స్మ లు అంట కడుతున్నారు. ఇలా ఊహించకుంట పొతే ఎన్నైనా అనుకోవచ్చు. అంతం లేదు

   "కాశ్మీరును తెలంగాణాను ఒక గాటనే కట్టే ప్రయత్నం వెనుక,"

   ఎక్కడండి? పై లింక్ లో ఉన్నది ఏమిటి? పోలికలు చెప్పటం టప్పా?

   Delete
  5. చర్చలో పాల్గొన్న భాజపా ఎంపీ ప్రతాప్ సింహా అభ్యంతరం చెప్పలేదు. భాజపా కంటే ఆంధ్రోల్లకు దేశప్రేమ ఎక్కువుందా?

   Delete
 2. వీ ప్రకాష్ గారు ఏ కాన్తెక్స్తులో అన్నారో పూర్తి వీడియో చూస్తె అర్ధం కావొచ్చు. ఇంత చిన్న (17 సెకన్లు) క్లిప్పులో ఎటువంటి వివరాలు లేవు.

  ఇకపోతే అసలు పాయింటుకు వద్దాం. ప్రకాష్ గారు తెరాస పార్టీ అధికార ప్రతినిధి కాదు సరికదా కనీసం సభ్యులు కూడా కాదు.

  ReplyDelete
  Replies
  1. టీఆర్ఎస్ స్థాపకులలో ఒకరైన ప్రకాష్ టీఆర్ఎస్ మాజీ నాయకుడు అన్నది నిజమే కదా?
   మొన్నటి కవితాగారి 'బలంతంగా' భారతదేశంలో కలుపుకున్నారన్న రాగాలాపనా, ఈ రోజున తెలంగాణా సిటిజంలకు పాస్‌పోర్ట్‌ తరహా ప్రత్యేకంగా గుర్తింపు జారీచేయబోతున్నామన్న ప్రకటనలూ దేనికి సాక్ష్యాలు?

   ఈ రోజున ప్రకాష్‌గారు తె.రా.స.లో సభ్యుడు కాకపోవచ్చును సాంకేతికంగా. కాని ఆ తానులో ముక్క కావటం‌ కాదు ఆ తాను నేసిన నేతగాళ్ళల్లో ఒకడన్నది విస్మరించటానికి వీలు లేని నిజం కాదా?

   ఆ ప్రకాష్ "We are NOT Indians" అని అంత నిక్కచ్చిగా చెప్పినప్పుడు మీరు ఆయన పాపం ఏ సదుద్దేశంతో అభిభాషణం చేసారో అని తటపటాయిస్తున్నారా? సాంకేతికంగా మీ వాదన సబబే. ఆ ప్రసారం మొత్తం చూడాలి. అ ఇంటరర్వ్యూయర్ బాక్‌గ్రౌండ్ చెక్ చేయాలి. ఒక వేళ ప్రకాశ్ గారిని ఎవరైనా రెచ్చగొట్తరేమో చూడాలి. ఆ వీడియోలో ఉన్నది ఆయనేనా. అసలు ఆ వీడియో నిజమైనదేనా? ఇదంతా ఒక కుట్రకాదు కదా అని కూడా తేల్చుకోవాలి. ఇలా బోలెడున్నాయి. అంత పెద్ద అవసరం ఉంటే అలా చేయవచ్చును.

   అసలు శ్రీమాన్ కేసీఆర్‌గారు నిజాంనవాబుల కీర్తిగీతాలు ఆలపించటం మొదలు పెట్టినప్పుడే మనలో చాలా మందికి ఏదో మాడుతున్న వాసన రాకపోవటం మనదే పొరపాటు. ఎంత చెడ్డా వీరతెలంగాణా నాయకుడిగా ఆయనేమన్నా ఏం చేసినా అది వీరగాథ ఐ కూర్చుంది కాని ఆ ఉద్యమవేడిసెగలమధ్య ఈ విఛ్ఛినకరధోరణి గురించి వీరాతివీరవిధేయజనావళికి ఏమీ పట్టలేదు కాక పట్టలేదు. ఇప్పుడు ఆ పార్టీ ప్రస్తుత మరియు మాజీ నాయకులు రాష్ట్రవిభజనపర్వం గడిచేసాం కాబట్టి దేశవిభజనపర్వం మొదలు పెడుతున్నాం అంటున్నారు. ఆమాటా గట్టిగా అనటానికి ఇబ్బందే - విదేయగణం వెంతనే 'విషం కక్కటం' లాంటి వెగటు మాటలు వడ్డించేస్తారు. ' దక్షు లెవ్వార లుపేక్ష సేసిరది వారల చేటగు' అన్న భగవద్వాక్యం ప్రమాణంగా నోరు మూసుకోలేక మాట్లాడక తప్పదు. కానివ్వండి. కానున్నది కాకమానదు.

   Delete
  2. "ప్రకాష్ టీఆర్ఎస్ మాజీ నాయకుడు"

   అదేలేక్కలో కెసిఆర్ టీడీపీ మాజీ నాయకుడు. ఒక మాట అన్నరోజు పార్టీలో లేని వారి మాటకు పార్టీని అడగడం తమకే చెల్లింది.

   "ఆ తానులో ముక్క కావటం‌ కాదు ఆ తాను నేసిన నేతగాళ్ళల్లో ఒకడన్నది"

   ఇక్కడ తాను అంటే ఏమిటి? మా రాష్ట్రం మాకు కావాలన్ననేరానికి మేమందరమూ దేశ ద్రోహులమా?

   "అంత పెద్ద అవసరం ఉంటే అలా చేయవచ్చును"

   చేయోచ్చు కాదు చేయాలి. ఒక వ్యక్తి అందునా మహత్తర ఆశయం కోసం నిరంతరం కృషి చేసిన వారి గురించి ముందు వెనుకలు ఆలోచించకుండా అభాండాలు వేసే ముందు కొంతయినా పరిశోదించాలి. The onus of proof is on the accuser, not the accused.

   అలా కాదు నాకు కీబోర్డు ఉంది కాబట్టి నాకు తోచింది రాస్తాను, నా ద్వేషం కక్కే హక్కు నాది అంటారా? మీ ఇష్టం.

   "అసలు శ్రీమాన్ కేసీఆర్‌గారు నిజాంనవాబుల కీర్తిగీతాలు ఆలపించటం"

   ఘనత వహించిన మాజీ రాష్ట్ర మాజీ ప్రభుత్వం నిజాం బొమ్మను టాంకుబండు మీద పెట్టినప్పుడు లేని కంపు వాసన ఇప్పుడు ఎందుకు కొడుతుంది?

   "రాష్ట్రవిభజనపర్వం గడిచేసాం"

   మాజీ రాష్ట్రం! FYI India is an indestructible union of destructible states.

   Delete
 3. "కవితగారు నిన్న మొన్న కాశ్మీర్ హైదరాబాద్ సంస్థానాలను బలవంతంగా ఇండియాలో కలిపారని వ్యాఖ్యానించడం"

  What's the fault in this?

  "కాశ్మీర్‌లో కొంతభాగాన్ని ఇండియా వదులుకోవాలని వ్యాఖ్యానించడం జరిగింది."

  That's her opinion like few other Indians did in the past. What's wrong in it?

  "ఎందుకు వారు ఏకంగా భారతదేశం మీదే కక్షకట్టి ప్రవర్తిస్తున్నారూ?"

  Why do you say that?

  "తెలంగాణ ప్రజలం భారతీయులం కానే కాదు We are not Indians అంటూ చేసిన ఈ కామెంట్లు వినండి.. చూడండి..!!"

  What ever he said was correct, isn't it? He clearly mentioned that case was in 1948, not today?

  పతి దాంట్ల తప్పుల్ ఏటికితె ఎట్ల సారూ ?

  ReplyDelete
  Replies
  1. తెలంగాణా ప్రజలు భారతదేశంలో కలవాలని కోరుకోలేదా? వాళ్ళు నిజాం పాలనను అంతగా అస్వాదించారా? మరి నిజాం పై తిరుగుబాటు చేసిన ప్రజలు ఎవరు? ఇప్పటి (తెలంగాణా) నాయకులు ఎవరిని సమర్ధిస్తున్నారు? నాకేమీ అర్ధం కావటం లేదు.

   Delete
  2. "తెలంగాణా ప్రజలు భారతదేశంలో కలవాలని కోరుకోలేదా?"

   kalavaalani korukoledani evaru annaaru alaa? cheppandi?

   Delete
  3. బలవంతంగా కలుపుకున్నారు అంటే అర్ధం ఏమిటి? బలప్రయోగం చేసింది నిజాం మీద కాని, ప్రజల మీద కాదు కదా. మరి ఈ మాట నిజాం కి వత్తాసు పలుకుతున్నట్లే (ప్రజల అభీస్ఠానికి వ్యతిరేకంగా) కదా.

   Delete
  4. "బలవంతంగా కలుపుకున్నారు అంటే అర్ధం ఏమిటి? బలప్రయోగం చేసింది నిజాం మీద కాని, ప్రజల మీద కాదు కదా."

   ప్రజల అభీస్ఠానికి వ్యతిరేకంగా బలవంతంగా కలుపుకున్నారు - అనీ చెప్పలేదు. నచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు.

   Delete
 4. శ్యామలీయం గారు మొత్తం క్లిప్పింగ్ ఇవ్వగలరా? వీ.ప్రకాశ్ తీ. తెరాస లో సభ్యుడు కాదు. అలాంటప్పుడు మీరు తెరాస పై ఆరోపణలు చేయడం కరెక్టేనా?

  మేము భారతీయులం కాదని గర్వంగా అయన చెప్పుకోవలసిన అవసరం లేదు. భారత ప్రభుత్వ సహాయంతోనే హైదరాబాద్ సంస్థానం నిజం నీచ నిరంకుశ పాలననుండి విముక్తి అయి ఇండియాలో కలసింది. పూర్తీ క్లిప్పింగ్ చూస్తే తప్ప ఇటువంటి సెన్సిటివ్ అంశంపై వ్యాఖ్యానిమ్చలేము.

  ReplyDelete
  Replies
  1. మొత్తం క్లిప్పింగ్ కోసం వెదుకుతున్నానండీ. దొరికితే తప్పక ప్రదర్శిస్తాను ఇక్కడ.
   ప్రకాశ్ తెరాసవ్యవస్థాపకుల్లో ఒకడు. కేవలం సాంకేతికంగా ఇప్పుడు వారిలో ఒకడు కాదు. కవిత, కేసీఆర్‌ల కొత్త రాగాలు విన్నాక ఇదంతా పెద్ద విషయమే కాని విడివిడి అనుకోలేకపోతున్నాను.

   Delete
  2. మీరు "నిజాం నీచ నిరంకుశ పాలననుండి విముక్తి అయి ఇండియాలో కలసింది" అంటున్నారు. అటు కవిత, ప్రకాష్, ఇటు కేసీఆర్ వగైరా మహానుభావులు అది తెలంగాణాదేశం మీద భారతదురాక్రమణ అంటున్నారు. అది చిన్న విషయం కాదు.

   Delete
  3. "నిజాం పాలనా నీచమైనదే. నిజం ను పొగడడమూ నీచమైనదే" - ఇది నా అభిప్రాయం.

   భారత్ దురాక్రమణ చేసింది అన్నారా?

   Delete
  4. కొండలరావుగారూ,

   పూర్తి వీడియో అనలేను కాని, కొంచెం పెద్ద క్లిప్పింగ్ దొరికింది యూ-ట్యూబ్‌లో దాన్ని పొందుపరిచాను టపాలో.

   "మా మీద దురాక్రమణ చేసి మా దేశాన్ని ఆక్రమించుకున్నది భారతదేశం" ఈ వాక్యం వినవచ్చును ప్రకాశ్‌గారి నోట వీడియోలో.

   ప్రవీణ్ ఇచ్చిన ఆంగ్లపాఠం ఇంటర్వ్యూలో "... forcefully and at the same time annexed to the Indian Union. ... " వగైరా పలుకులున్నాయి కవితగారివి. ఈ రోజు తెలంగాణా సిటిజన్ అన్న మాట విడుదల అయింది ప్రభుత్వం నోట. ఇవన్నీ దేనికి సంకేతాలూ?

   ముఖ్యంగా ఇదంతా నా ఊహాగానం తప్ప ఈ విషయమై చర్చ అనవసరం అనుకుంటే తప్పకుండా ఈ‌టపా తీసివేయవలసింది కొంచెమో గొప్పగానో నేను ఆవేశానికి లోనవుతున్నమాట పూర్ణవాస్తవం. దాని అర్థం నేను సంయమనం కోల్పోయానని కాదు - నేను అలా అనుకోవటం లేదు. ఎవరైనా అనుకుంటే ఒక నమస్కారం‌ పెట్టి ఆమోదించేస్తాను.

   Delete
  5. వీడియో చూశాను. మీ ఆందోళనలో అర్ధం ఉన్నది. తె.రా.సా లేదా తెలంగాణాకు చెందిన కొందరు నేతలు కావాలని రెచ్చగొట్టే వ్యూహమేదో రచించినట్లు కనిపిస్తున్నది. ఇది ఎందుకోసం? అనేది వేచి చూస్తే తప్ప అర్ధం కాదు. దేశ విభజన జరిగేంత సీను క్రియేట్ కాదు. అంత ఆందోళన అయితే అవసరం లేదు. దురాక్రమణ అనడం తప్పు. అప్పటి పరిస్తితులపై సంపూర్ణ అవగాహన ఉన్నవారెవరూ దానిని దురాక్రమణ అనాల్సిన అవసరం లేదు. తప్పనిసరైన సైనిక చర్య అది. బుద్దున్నవాడెవడూ నిజాంను పొగడడం చేయకూడదనేది నా అభిప్రాయం. అలా చేసేవారిని సమర్ధించడం, వారేది మాట్లాడినా ఎందుకన్నారో, ఎలా అన్నారో, దానిలో తప్పేముంది.... అంటూ వెనుకోసుకొస్తే మనం చెప్పేదేమీ లేదు. ఈ పోస్టులో ఎంత చర్చించినా నాకు తెలిసి మళ్లీ రెండు బేచ్‌లు కావడమే తప్ప పెద్దగా ఉపయోగముండదు. చూద్దాం ఏమైనా ఉపయోగకర సమాచారం వస్తుందేమో. నేనైతే బహుశా ఇదే లాస్ట్ కామెంటు ఈ పోస్టులో.

   Delete
  6. సైనిక చర్య కేవలం కమ్యునిష్టులను ఊచకోతకోయడం కోసం జరిగింది- నిజాం అంగీకారం తోనే.

   Delete
  7. THIRUPALU P గారూ,
   రజాకార్లు కమ్యూనిస్టులన్న విషయం మాకు తెలీదండి. తెలియజేసినదుకు ధన్యవాదాలు ...!!

   Delete
  8. "ప్రకాశ్ తెరాసవ్యవస్థాపకుల్లో ఒకడు. కేవలం సాంకేతికంగా ఇప్పుడు వారిలో ఒకడు కాదు"

   ఎవరు ఎ పార్టీ సభ్యుడో కూడా మీరే నిర్ణయిస్తారా?

   Delete
  9. శ్రీ కాంత్‌ గారు,
   రజాకార్లకు, కమ్యునిష్టులకు పోలిక తెలియని అమాయకత్వమా మీది? ఆ సైనిక చర్యలో ఎంత మంది రజా కార్లు, ఎంత మంది కమ్యునిష్టు చనిపోయారో ఒక్క సారి తెలాలంగణ చరిత్ర చదవండి.

   Delete
 5. From Wikipedia

  "Nizam decided to keep Hyderabad independent. The leaders of the new Union of India however, were wary of having an independent - and possibly hostile - state in the heart of their new country. Most of the other 565 princely states had already acceded to India or to Pakistan voluntarily. The Indian government was therefore determined to annex Hyderabad into the Indian Union, by force if necessary.
  In September 1948, India launched a military operation named Operation Polo, led by Sardar Vallabhbhai Patel, then Minister of Home Affairs and Deputy Prime Minister of India. The Indian Armed Forces invaded the State of Hyderabad and overthrew Nizam."


  అందులో invaded అని రాసారు చుడిడి, ఇంకేం చెప్తారు

  ReplyDelete
  Replies
  1. జలంధర్‌గారూ.

   ఒక్కసారి తెలంగాణ విమోచనోద్యమం అనే వికీపీడియా పేజీ కూడా చదవండి.

   Delete
  2. శ్యామలీయం గారు,

   మనం పరిసితితినీ ఎలా అయిన్నా అర్థం చేసుకోవచ్చ్. చరిత్ర ప్రకారం భారత్ హైదరాబాదును ఆక్రమించింది అనేది సత్యం ఎలా కాదన్తున్నారో అర్థం కావటం లేదు? ఆక్రమణకు అక్కడ ప్రజల మద్దతు ఉన్నది కాని అది ఆక్రమనే కదా సార్? kavita చెప్పింది అదే, లింక్ లో ?

   Delete
  3. పైన ఆక్రమనే ను ఆక్రమణ గా చదువుకోగలరు

   Delete
  4. జలంధర్‌గారు.
   ఈ విషయమై ఎక్కువ చర్చించే తీరికా ఉద్దేశమూ లేవు నాకు. చరిత్రను అధ్యయనం చేయండి వీలుంటే.

   ప్రజల మద్దతు ఉన్నాక అది ఆక్రమణ ఏమిటి? దురాక్రమణ ఎలా అవుతుంది? హైదరాబాదు సంస్థానాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో నరమేధాన్ని అపటానికి సైనికచర్య ద్వారా భారతప్రబుత్వం ఆక్రమించింది. కాసిం రజ్వీని అదుపు చేయలేనని గ్రహించి నిజాం నవాబూ భారతప్రభుత్వానికి సహకరించినట్లు తెలుస్తున్నది. మీకు వీలుంటే ఆంధ్రభూమి ఎడిటర్ శాస్త్ర్రిగారు వ్రాసిన ఆంధ్రాయణం పుస్తకం చదవండి అదారాలతో సహా పూర్తికథనం ఉంటుంది - అభిప్రాయాలూ వినికిడులూ కాక.

   అదీకాక నిన్నటిదాకా తెలంగాణా విమోచనోద్యమం ఐనది కాస్తా శరవేగంగా ప్రత్యేక తెలంగాణా రాగానే తెలంగాణాపైన భారతదేశ దురాక్రమణ ఐపోవటం మీకు అనుమానాస్పదం కాకపోతే నా తరపున చర్చించవలసినది ఏమీ కనిపించటం లేదు.

   స్వాతంత్య్రం వచ్చే నాటికి బ్రిటిష్ వారి పాలనలో లేనివి వందల కొద్దీ సంస్థానా లున్నాయిక్కడ. అసలు ఇండియానే లేదూ మేమంతా వేరే వేరే రాజ్యాలం అనుకుంటూ కొత్త అలోచనలు చేయటమూ దానికి సమర్థనల మీద సమర్థనలు రావటమూ కేవలం చర్చకోసంలా కనిపించటం లేదు నాకు. అన్ని సంస్థానాలూ వేటికవి స్వతంత్ర దేశాలుగా బ్రిటిష్ వారు స్వయంగా ఏలిన భూఖండాలు మరికొన్ని స్వతంత్ర దేశాలుగా అనేక బుల్లిబుల్లి బుడగల్లాంటి దేశాలుగా ఏర్పడవలసినది కాని భారతదేశం అనే మిధ్యాదేశం కుట్రవల్లే అవన్నీ బలవంతగా కలేశిబాది ఇండియాను తయారు చేసాడు పటేల్ అంటే మీ వాదనకు దగ్గరగా, మద్దతుగా ఉంటుందా? ఒక దేశం మధ్యలో land lockedగా మరొక స్వతంత్రదేశం ఎలా ఉంటుంది అన్న అలోచన చేయలేరా? నిజాం పాకిస్తాన్‌తో కలవకుండా కుట్రచేసి భారత్ దురాక్రమణ చేయకపోతే పాకిస్తాన్‌లో భాగంగా తెలంగాణా సర్వతోముఖాభివృధ్ది చెంది ఉండేదని మీరూ భావిస్తున్నారా?

   మంచిదండీ. భారత్ దురాక్రమణదారు అనే సిధ్ధాంతం మీద మీకు ఉన్న నమ్మకం సంగతి అలా ఉంచి, భారతదేశానికి స్వతంత్రం ఇస్తే తమని తాము పాలించుకోవటం అక్కడి వాళ్ళకు ఏమాత్రం చేతగాదు కాబట్టి భారత్‌కు ఎట్టీ పరిస్థితుల్లోనూ స్వాతంత్రం ఇవ్వరాదని చర్చిల్ అన్న మాటల్ని మనం నిజం చేస్తున్నట్లు పరిస్థితులు సృష్టించుకుంటున్నా మన్నది మాత్రం చాలా భయంకరనిజం.

   Delete
  5. "ప్రజల మద్దతు ఉన్నాక అది ఆక్రమణ ఏమిటి?"

   As per international law it is called 'occupying' we like it or not.

   "దురాక్రమణ ఎలా అవుతుంది? "

   I was referring to Kavita's statements, I see no reason to answer to your reply. No one saying that they were not happy in India, even when Telangana movement is in peak.

   In-fact, when agitation was on peak, few Seemandra leaders wished their seemandra go as separate country or merge with USA. No one made this kind of fuss about their statement at that time. Why? Double standards.

   Delete
 6. మనకు రుచిన్చానంత మాత్రానా చరిత్ర మారాడు కదండీ

  Note: మీరు కల్పించిన తెలుగు బాక్స్ యూస్ ఫుల్ గా ఉంది, ఆ "తెలుగులో వ్రాయడం కోసం:" టెక్స్ట్ బ్లాక్ కాకుండా బాగా కనబడే కలర్లో ఉంటూ బాగుంటుంది

  ReplyDelete
  Replies
  1. చరిత్ర మొత్తం అధ్యయనం చేయాలండీ. వికీపీడియాలో వచ్చేదో, బ్రిటీషోడి కండీషన్లో మాత్రమే చరిత్ర కాదు.

   నిజాం నిరంకుశ పాలనను పొగడడం దారుణం కాదనే మీరనుకుంటున్నారా?

   తెలుగ్ బాక్స్ గ్రీన్‌స్టార్ గారిచ్చిన ఐడియామేరకు తయారు చేశామండీ. మీరు చెప్పిన విధంగా కలర్స్ ట్రై చేస్తాము.

   Delete
  2. "నిజాం నిరంకుశ పాలనను పొగడడం దారుణం కాదనే మీరనుకుంటున్నారా?"

   విషయం విషయం కు మారాటాయండి. కొన్ని విషయాల్లో బ్రితిస్ వారిని మెచ్చుకుంటాం, కాటాఆన్ విగ్రహం పెట్కున్నం. నిజం కాలం ల టాక్స్ ఎక్కువ ఉండేది, దారునల్ చేసింది రజాకర్ లు, రెండు వేర్ వేర్.

   "చరిత్ర మొత్తం అధ్యయనం చేయాలండీ"

   ఆపరేషన్ పోలో గురించి ఎవరి వర్షన్ చదివినా ఒకటే కదా సార్. ఆపరేషన్ ఉద్దేశమే బలవంతంగ్ హైదరాబాదు రాజ్యం భారత్ లో కలపటం, ఇంకేముంది ఇందులో అధ్యయనం చేయ్యతాంకి ?

   Delete
  3. జలంధర్‌గారూ, భేషైన మాటన్నారు "ఆపరేషన్ ఉద్దేశమే బలవంతంగ హైదరాబాదు రాజ్యం భారత్ లో కలపటం, ఇంకేముంది ఇందులో అధ్యయనం చెయ్యటానికి" అని. ఆపరిస్థితి ఎందుకు వచ్చిందో కథ ఎలా నడిచిందో, మీరు తెలుసుకో నక్కరలే దన్నమాట, సంతోషం. మీకు ఓపిక ఉంటే నేను పైన వ్రాసిన మరొకొంచెం విపులమైన వ్యాఖ్య చదువుకోండి. మీరు నేను ఎలాగూ సర్వజ్ఞడను కదా ఎందుకు చదవాలి అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. వాదన అంతకంటే లేదు.

   Delete
  4. మీరన్నది అర్థం కాలే దండి

   'ఆపరేషన్ పోలో హైదరాబాద్ రాజ్యను బలవంతంగా ఆక్రమించటానికి' అని ఎవలైన చెపితే ఆపరిస్థితి ఎందుకు వచ్చిందో కథ ఎలా నడిచిందో అనేది కూడా ప్రతి స్టేజి పై తప్పక చెప్పాలా ?

   సరే అండి, "ఆపరిస్థితి ఎందుకు వచ్చిందో కథ ఎలా నడిచిందో" అంటే పరిస్తితి వలన ఆక్రమించింది అనేది ఒప్పుకున్నారు కదా? అంటే ఆక్రమణనే కదండీ? ఆక్రమిస్తే తప్పేముంది, ప్రజల మద్దతుతోనే కదా అది? అది తప్పని ఎవరు అన్నారు ఇపుడు? ఏంటి ప్రాబ్లం?

   Delete
  5. jalandhar101, భారత ప్రభుత్వం నిజాం సేనలని వోడించి తెలంగాణాని భారత భూభాగంలో విలీనం చేయడం తప్పా కరక్టా?

   Delete
  6. తప్పా కరెక్టా తెల్స్కోవటానికి నేను కింద సూచించిన సమయానికి నిన్న రాసిన రాసిన కామెంట్లు చదవండి
   July 25, 2014 at 9:04 PM
   July 25, 2014 at 9:21 PM

   Delete
  7. July 25, 2014 at 9:04 PM
   మనం పరిసితితినీ ఎలా అయిన్నా అర్థం చేసుకోవచ్చ్. చరిత్ర ప్రకారం భారత్ హైదరాబాదును ఆక్రమించింది అనేది సత్యం ఎలా కాదన్తున్నారో అర్థం కావటం లేదు? ఆక్రమణకు అక్కడ ప్రజల మద్దతు ఉన్నది కాని అది ఆక్రమనే కదా సార్? కవిత చెప్పింది అదే, లింక్ లో ?

   July 25, 2014 at 9:21 PM
   కలవాలని కొరుకొలెదని ఎవరు అన్నారు అలా? చెప్పండి?

   =================

   నా ప్రశ్న: భారత ప్రభుత్వం నిజాం సేనలని వోడించి తెలంగాణాని భారత భూభాగంలో విలీనం చేయడం తప్పా కరక్టా?
   పైన ఇచ్చిన రెండు కామెంట్లలో నా ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం దొరకలేదు. నా ప్రశ్న చాలా సరళమైనది. నా ప్రశ్నకు జవాబుగా 'తప్పు ' లేక 'కరెక్టు ' అని చెప్పకుండా 'అక్కడ చూసుకో, ఇక్కడ చూసుకో' అని అనడం దేనికి.

   Delete
  8. "భారత ప్రభుత్వం నిజాం సేనలని వోడించి తెలంగాణాని భారత భూభాగంలో విలీనం చేయడం తప్పా కరక్టా?
   పైన ఇచ్చిన రెండు కామెంట్లలో నా ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం దొరకలేదు. "


   మీకు సమాధానం దొరకదు. ఎందుకంటే మీ ప్రశ్న ఈ చర్చకు సంబంధం లేనిది అని నాకు అనిపించి సమాధానం రాయలేదు.

   మీ ప్రశ్నతో ఒక చర్చను ప్రారంబించమని కొండల రావు గారిని మీరు కోరవచ్చు. అప్పుడు మీ ప్రశ్నకు సూటి అయిన జవాబు దొరకొచ్చు :))

   Delete
  9. ఎందుకంటే మీ ప్రశ్న ఈ చర్చకు సంబంధం లేనిది అని నాకు అనిపించి సమాధానం రాయలేదు. //
   ====
   అబ్బబ్బబ్బా! యేం సెప్తిరి యేం సెప్తిరి! మరి అంతోటిదానికి "తప్పా కరెక్టా తెల్స్కోవటానికి నేను కింద సూచించిన సమయానికి నిన్న రాసిన రాసిన కామెంట్లు చదవండి" అని రాయడం దేనికి? :)

   Delete
  10. అని రాయడం దేనికి? :)

   టైం పాస్ పరశ్నకి టైం పాస్ అన్సర్ :))

   - Kiran

   Delete
 7. తప్పనిసరైన ఆక్రమణ దురాక్రమణ ఎలా అవుతుంది? ఆక్రమణకు దురాక్రమణకు తేడా లేదా?

  ReplyDelete
  Replies
  1. "ఆక్రమణకు దురాక్రమణకు తేడా లేదా?"

   ఆ అర్థాలు నాకు తెలియవండి, కాని మనని మనం దురాక్రమణ అంటే బాధగానే ఉంటుంది, తప్పు పదాలు వాడి ఉంటాడు.

   Delete
  2. నిన్నటి ఆంధ్ర జ్యోతిలో దాని ఎడిటర్‌ కె.శ్రినివాసుగారు ఈ అంశం గూర్చి ప్రస్తావిస్తు కవిత గారు కాశ్మీరు సమస్య పరిష్కారానికి ఒక సూచన చెసిందే తప్ప వేరే ఉద్దేశాలు అమెకు ఉండి వుండవని అన్నారు. అయినా వేరే ఉద్దేశాలు పెట్టు కోవడం అంత సులభమా? అను మాన పడటానికి?

   Delete
  3. కొండలరావుగారు "తప్పనిసరైన ఆక్రమణ దురాక్రమణ ఎలా అవుతుంది? ఆక్రమణకు దురాక్రమణకు తేడా లేదా?" అని అడిగారు.

   పై ప్రశ్నకు అనుబంధ ప్రశ్న: భారత ప్రభుత్వం నిజాం సేనలని వోడించి తెలంగాణాని భారత భూభాగంలో విలీనం చేయడం తప్పా కరక్టా?

   నా ఉద్దేశ్యం ప్రకారం: "నిజాం నిరంకుశ పాలన నుండి ప్రజలను విముక్తి చేయడానికి భారత దేశ సైన్యం అలా చేయక తప్పలేదు. అలా చేయడం తప్పు కాదు. బంగ్లాదేశ్ కూడా ఇలాగే ఏర్పడింది. పాకిస్తాన్ ఆగడాలు శ్రుతిమించి పోవడం తో భారత సైన్యం అక్కడి ప్రజలను ఆదుకోవడానికి నడుం బిగించింది. భారత భూభాగం కాకపోయినప్పటికీ ప్రజల క్షేమం కోసం పాకిస్తాన్ సైన్యాన్ని వోడించింది. అలాంటిది భారత దేశ భూభాగంలో ఉంటూ కూడా పాకిస్తాన్ కి మద్దతు తెలిపి ప్రజలను హింసించిన నిజాంను లొంగదీసుకోవడం తప్పా కాదా అన్న విషయం గురించి ఇంత చర్చ అనవసరం."

   Delete
 8. "ప్రకాష్ తెలంగాణ ప్రజలం భారతీయులం కానే కాదు We are not Indians అంటూ చేసిన ఈ కామెంట్లు వినండి.. చూడండి..!!"

  Kondala rao gaaru,

  I object to above statement. ఆయన 1948లో అలా అని అన్నాడు. ఆ సంవత్సరం విషయం ఆ సెంటెన్స్ లో మిస్ చేస్తే అర్థం మారింది, సంవత్సరాలుగా మీడియావాలు చేసే జిమ్మిక్. మార్చగలరు

  ReplyDelete
  Replies
  1. ఎందుకు అభ్యంతరమండీ? We ARE not Indians అని ఆ వీడియోలో ఆయన పదే పదే అన్నారు కదా? అదైనా ముందు ఒప్పుకుంటారా?

   ఆంగ్లభాషలో ARE మరియు WERE అనే మాటలు ఏవి ఏ కాలాన్ని సూచించటానికి వాడతారో మీకు తెలుసును కదా? అందు చేత ఆయన మాటల్లో మీరు భూతకాలాన్ని ఎలా అన్వయం చేసుకుంటూన్నారూ? ఆయన విస్పష్టంగా వర్తమాన కాలాన్ని ఉద్దేశించే చెప్పారుగా ముమ్మారు? అది కేవలం ఆంగ్లభాష వాడటంలో అయన వలన జరిగిన పొరబాటు అని సర్దుకోమంటారా? నాకైతె అది సమ్మతం కాదు. భావాలూ భాషా అన్నీ సమప్రాధాన్యం వహిస్తాయని నా అభిప్రాయం. ఆయన చదువుకోలేదు పెద్దగా అని మీరు సమర్థించుకుంటే సరే, మీ యుష్టం.

   Delete
  2. ఆయన అన్నది "1948కి ముందు we are not Indians "
   మీరు రాసింది "we are not Indians"

   "1948కి ముందు" అనేది ఎగర గొట్టేస్తే రెండిట్ కి అర్థం చాలా తేడా. గ్రామర్ మిస్తకె అయినా "1948కి ముందు" అనటం లో అయన ఉద్దేసం అర్థం అవుతుంది కదా. సరే మీరన్నట్లే ఆ గ్రామర్ తప్పుతో పాటు అయన అన్నది అన్నట్లు రాయడి సార్, సరి పోతుంది.

   Delete
 9. మనం వేరు అన్న ఆలోచన జనాల మనసులోకి చొప్పిస్తే మిగతా పని చాలా ఈజీ గా చేసేయోచ్చు .
  బావిష్యత్తు లో పూర్తీ గా తెలుగు దేశాన్ని దూరం పెట్టొచ్చు , మనకిమనం వాళ్ళు వేరు అన్న గొడవలు కూడా స్టార్ట్ చేయోచ్చు .
  ఇది కాశ్మీర్ తరహా ఆలోచనా , అక్కడ ఉన్న హిందువు లు ని వేల్లగోట్టిన తరువాత , కాశ్మీర్ ప్రజలు ప్రత్యకమైన వారు అన్న ఒక ప్రాపగాండా ని తేరా మీదకి తీసుకుని వచ్చారు . ఇప్పుడు కాశ్మీర్ ప్రజలు ప్రత్యకమైన వారు అని , వారు భారతీయులు కారు అని కొంతమంది బ్లాగుల్లో కూడా వాదిస్తుంటారు. ఇది కూడా అంతే
  ఇప్పుడు మెల్లగా సీమంధ్ర జాతి వేరు , మన తెలంగాణా జాతి వేరు అన్న ఆలోచన తీసుకుని రావాలి .
  మేము ఇండియా లో బలవంతంగా కలపబడ్డామ్ అన్న ఆలోచన జనాల లోకి తీసుకుని రావడానికి ఈ నాయకులు విపరీతంగా ప్రయత్నిస్తున్నారు, కాని తెలంగాణా ప్రజలు నిజాం చేసిన అకృత్యాలు అంత తేలిగ్గా మర్చిపోరు .
  ఈ రోజు తెలంగాణా లో రవాణా , వ్యవసాయం తక్కువ గా ఉండటానికి కారణం నిజం వంద సంవత్సరాలలో (?) చేసిన నిర్లక్ష్యమే , తన ఉంపుడు గత్తెల కోసం హైదరాబాద్ ని అందంగా ముస్తాబు చేసాడు కాని మిగతా ప్రాంతాలన్నింటిని పట్టించుకోలేదు .


  ReplyDelete
  Replies
  1. ఆమాట కేసీఆర్‌గారు ఒప్పుకోరుగదా! హైదరాబాదును అభివృధ్ధి చేసి సుసంపన్నం చేసింది నిజాంప్రభువుగారే. ఆయన తరువాత కొత్తగా వచ్చిన భవనాలేమీ లేవనే అయన ఒకసారి టీవీలో నిష్కర్ష చేసారు. తెలంగాణావాదు లెవరూ ఆ మాటల్ని ఖండించినట్లు నాకు గుర్తులేదు.

   Delete
 10. It seems the purpose of the post is not good, just as usual negativity towards TRS

  1) Wantedly ignored few words in his statement.

  2) And currently he is not in TRS, so no need to account him in TRS saying former TRS.

  3) Instead of "తె.రా.స భారతదేశ సార్వభౌమాధికారాన్నే ధిక్కరించాలనుకుంటున్నదా?" you can write "Telangana leaders భారతదేశ సార్వభౌమాధికారాన్నే ధిక్కరించాలనుకుంటున్నదా?"

  4) What Kavita said? and what we are discussing here? Anyone care to read atleast?

  ReplyDelete
 11. "ఈ రోజున టీఆర్ఎస్ మాజీ నాయకులూ, ఆ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన ప్రకాష్..."

  "క్రొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో కొలువుతీరిన తెరాస పార్టీ భారతదేశ సార్వభౌమాధికారాన్నిధిక్కరిస్తున్నది!"

  అడిగిన ప్రశ్నలోనే దోశం వుంది. ఒకటి TRS మాజీ నాయకులు అని వారే చెపుతున్నారు. రెండు, ఆయన మాటలను TRS పార్టీకి అన్వయించాలని చూడడం పృఛ్ఛకుడికి గల వైరి భావాన్ని ప్రకటిస్తోంది.

  "భారతదేశపౌరులుగా మనం దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా స్పందించాలి?"
  "ఈ పరిణామానికి భారతదేశప్రభుత్వం ఎలా స్పందించవలసి ఉంది?"

  పైన చెప్పిన దాని తర్వాత ఇవి రెండు పూర్తిగా అర్థ రహితమైన ప్రశ్నలు. ఒక వ్యక్తి మాటలపై ఇంత భారీ ప్రశ్నలు అనవసరం. వ్యక్తులుగా అనేక మంది సమైక్య ఉద్యమకారులు దేశం నుండి విడిపోతామని చెప్పినవారున్నారు... బ్లాగులు రాసిన వారున్నారు.

  ఇక పోతే ప్రకాష్ అన్న మాటలను కూడా ఇక్కడ వక్రంగా భాష్యించడం జరిగింది. ప్రకాష్ చెప్పిండి 1948కి పూర్వం మేం భారతీయులం కాదు అని. అందులో ఎవరికైనా సందేహించ వలసిన అవసరం ఏముంది. పైగా ఆ తర్వాత భారత దేశంలో కలిసామని గూడా ఆయనే అన్నారు. అయితే చర్చల్లో తన భావాలని కొంత తీవ్రంగా వ్యక్తపరచే అలవాటు ప్రకాష్ గారికి ఉన్న విషయం వాస్తవం. గతంలో కొన్ని సందర్భాల్లో ప్రకాష్ వాదనలతో తెరాసకి సంబంధం లేదని వారు ప్రకటించడం కూడా జరిగింది (అప్పుడు ఆయన పార్టీలు డబ్బులు వసూలు చేస్తే తప్పు లేదని వాదించాడు).

  "ఇది తేలిగ్గా తీసుకొంటే భారతదేశవిఛ్ఛిత్తి అనేది నేడో రేపో జరిగే పరిస్థితి వస్తున్నది అనటంలో ఎవరికైనా సందేహం ఉందా?"

  ఇది పూర్తిగా ఊహాజనితమైన ఆలోచనలతో కూడుకున్న ప్రశ్న, పైగా ప్రకాష్ అన్న మాటలకనా కూడా అభ్యంతరకరమైంది.

  "తెరాస వారి వ్యూహం ఏమిటీ? ఎందుకు వారు ఏకంగా భారతదేశం మీదే కక్షకట్టి ప్రవర్తిస్తున్నారూ?"
  "ఇన్నాళ్ళూ మనం వారి ఆక్రోశం అంతా కేవలం సీమాంధ్రప్రజలమీదే అనుకుని పప్పులో కాలు వేసామా?"
  "ఈ కథ వెనుక మనకు కనబడని నిర్దేశకులు ఎవరైనా ఉన్నారా?"

  కథ మొత్తంలోనూ తెరాసకి ఎలాంటి సంబంధం లేదని తెలుస్తూనే వుంది. ఇది కేవలం ప్రశ్నించిన వ్యక్తి తెలంగాణా ప్రబుత్వం మీదా, లేదా తెరాస పార్టిమీద తన అక్కుసును వెళ్ళగక్కేందుకు ఈ వేదికను ఉపయోగిస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది.

  ఇంత చర్చించిన తర్వాత ఈ ప్రశ్నలకు వేరే సమాధానం ఇవ్వడం అవసరమా?

  ఈ సందర్భంగా కొండలరావు గారికి ఒక మనవి చేయదలిచాను. మీరు కామెంట్ల పాలసీకన్న ముందు ప్రష్నలకు ఒక పాలసీని నిర్ణయిస్తే మంచిదని నా అభిప్రాయం. ఇక్కడ వస్తున్న కొన్ని ప్రశ్నలు నిర్వికారంగా కాక, సమాధాన్ని ముందే ఊహించుకుని చర్చించే వారిని ఆ విధంగా తప్పుదోవ పట్టించేవిగా కనిపిస్తున్నాయి. మరికొన్ని ప్రశ్నలు వాటి అసలు ఉద్దేశ్యం ప్రశ్నించి సమాధానాలు తెలుసుకోవడం కన్నా, కొన్ని వర్గాలమీద దాడి చేయడం ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తుంది.


  ReplyDelete
 12. "1956వ సంవత్సరంలో ఏ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందో, ఆ పరిస్థితుల్లోనే ఆ రాష్ట్రం యొక్క విఛ్ఛిన్నతా బీజాలూ కొందరు నాటటం జరిగింది. అందులో తప్పొప్పుల గురించి అనంతమైన చర్చలు జరిగాయి. అనేక ఆందోళనలూ జరిగాయి. చివరకు ఆంధ్రపదేశ విఛ్ఛిత్తీ అత్యంతనాటకీయంగా జరిగింది."

  ఇది అనవసర పేరా, not related to post. Anti-telangana జనాలకు ఉత్పెరకంగా మాత్రమె పనికొస్తుంది

  ReplyDelete

 13. 1947కి పూర్వం ఇండియా అంతా (సంస్థానాలతోసహా ) బ్రిటీష్ ప్రత్యక్ష,లేక పరోక్ష పాలనలో ఉండేది.అందువల్ల సార్వభౌమాధికారం స్వతంత్ర భారతప్రభుత్వానికి లభించాక (transfer of power) హైదెరాబాద్ సంస్థానం అందులో భాగమైన తెలంగాణ భారతదేశంలో భాగమే.నవాబు మొండితనంవల్ల,రజాకార్ల దౌర్జన్యాలవల్ల ఇండియామధ్యలో మరో పాకిస్తాను ఏర్పడకుండా సైనికచర్య తీసుకోవలసి వచ్చింది.అందుకు ప్రజల సపోర్టుకూడా పూర్తిగావుండినది.నైజాము దుష్పరిపాలనకి వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ నాయకత్వంలో తెలంగాణా ప్రజలు సాగించిన వీరోచిత పోరాటాన్ని అప్పుడే మరచిపోయారా?
  ప్రకాష్ తె.రా.స.లో ఇప్పుడు సభ్యుడు కాడని అతని వ్యాఖ్యలు పట్టించుకోకపోయినా ,కవిత మాటల కేమంటారు ?అవి అత్యంత అభ్యంతకరమైనవి కాదా?తె.రా.స. అధికారకంగ ఈ విషయం పైన వైఖరి వెల్లడించాలి.లేకపోతే ఆ పార్టీ ఉద్దేశాల్ని శంకించవలసి వస్తుంది.

  ReplyDelete
  Replies
  1. "సార్వభౌమాధికారం స్వతంత్ర భారతప్రభుత్వానికి లభించాక (transfer of power) హైదెరాబాద్ సంస్థానం అందులో భాగమైన తెలంగాణ భారతదేశంలో భాగమే."

   మీరు రాసింది తప్పు, ఈ చట్టం చెక్ చెయ్యండి , మీరు రాసింది తప్పు
   Indian Independence Act 1947

   "కవిత మాటల కేమంటారు ?"
   మీరు ఎం మాట్ల గురించి చెప్తున్నారో కోట్ చెయ్యండి

   Delete
 14. "సైనికచర్య తీసుకోవలసి వచ్చింది"

  దానిని ఆక్రమనే అంటారు కదా. కవిత చప్పింది అదే కదా. ప్రజలు ఒప్పుకున్నరనీ చెప్పింది కదా. అన్ని సమయాల్లో ఆక్రమణ తప్పు కాదు కదా. ఇంకేంటి ప్రాబ్లం సార్ ? కవిత ఏమన్నాడో పైన లింక్ లో ఉంది చదివి చెప్పండి

  ReplyDelete
  Replies
  1. మీ ఇంట్లోకి మీరు రావడాన్ని ఆక్రమణ అనరు. స్వాధీనం చేసుకోవడం అంటారు.

   Delete
  2. నిజాం లోన్గాపోయాక తరువాత అది మన ఇల్లు అయ్యింది , ముందు కాదు.

   Delete
  3. నిజాం లొంగక ముందుకూడా స్వాతంత్రం వచ్చిన మరుక్షణం నుండి అవి మనవే..!!

   Delete
  4. You are wrong my friend.

   http://en.wikipedia.org/wiki/Indian_Independence_Act_1947

   termination of British suzerainty over the princely states, with effect from 15 August 1947, and recognized the right of states to accede to either dominion

   Delete
  5. @jalandhar101

   ఆ ఒప్పందం/ చట్టం గురించి తెలుసండీ, ఇదివరకే చర్చలో కొంత మంది దాన్ని ఉటంకించారు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, స్వతంత్ర పోరాటం అనేది బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగింది, వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా.. జరిగింది. వారి పరిపాలన, వారి నిబంధనలూ, వారి చేసిన చట్టాలు అన్నింటికీ వ్యతిరేకంగా జరిగింది. అలాంటిది పోతూ పోతూ ఆ తెల్లాయన ఒక చాట్టాన్ని చేసి పోతే దాన్ని గౌరవించుకోవాలని చెప్పడం స్వాతంత్ర కాక్ష కలిగిన భారతీయులకు ఆమోద యోగ్యమా? స్వాతంత్రం వచ్చిందా లేక బ్రిటీషువాడి చట్టాన్ని "జీ హుజూర్" అంటు పాటించే ఆచారం వచ్చిందా? తెలంగాణాలో ప్రజలు బ్రిటీషువారి నుండి స్వేచ్ఛ కోరుకుని, నిజాం నవాబుల పాలనలో జీవించాలని స్వాతంత్ర పోరాటములో పాల్గొన్నారా?

   అవేమీ కానప్పుడు, తెలంగాణా మన ఇల్లు కాకుండా ఎలా పోతుంది? అలా కాదు అనడానికి బ్రిటీషు వాడి ఒప్పందమూ, చట్టమే కారణమయితే, దాన్ని గౌరవించడం స్వాతంత్ర కాంక్ష కలిగిన ప్రజల అభీష్టమవుతుంది అని ఎలా అనుకుంటున్నారు? తెలంగాణా మన ఇల్లే, బ్రిటీషోడి చట్టం, ఒప్పందముతో పనేలేదు. అసలే వాడే మనకొద్దు అని తరిమేయడానికి పోరాటం చేసి, ఇప్పుడు వాడి నిబంధననే చూపి... "భారతీయులది దురాక్రమన/ ఆక్రమన" అనడం ఏమిటి? అది దురాక్రమన అయితే .. బ్రిటీషు వాడి ప్రకారం, భారత స్వాతంత్ర పోరాటం అనేది తీవ్రవాదం అవ్వదా? సుభాష్ చంద్రబోస్, భగత్ సింఘ్, అల్లూరి సీతారాం రాజు ఒకప్పుడు బ్రిటీష్ వారి దృష్టిలో తీవ్రవాదులే గా.. వారిని మనం ఇప్పుడు తీవ్రవాదులుగా గుర్తిద్దామా??

   Delete
  6. "అవేమీ కానప్పుడు, తెలంగాణా మన ఇల్లు కాకుండా ఎలా పోతుంది? "

   ఇప్పుడు మీ ప్రశ్నలకు సమాధానాలు ఆ ఇంకో టపాలో దొరికి ఉంటాయి. లేదంటే మనం ఆ టపాలో చర్చించుకుందాం.

   Delete
 15. కవిత ఇంటర్వ్యూ పూర్తి పాఠం, ఒరిజినల్‌ది ఇక్కడ చూడండి.

  http://indianexpress.com/article/india/india-others/no-one-guides-us-in-parliament/4/

  ఆమె సమాధానం కూడా ఇక్కడ కాపీ చేస్తున్నాను.

  K Kavitha: Jammu and Kashmir and Telangana were both formed forcefully and at the same time annexed to the Indian union. When I say I feel strongly, it’s because we were both separate countries, but were merged with the Indian union after independence. In 1947, we were not a part of India. After 1947, we became a part of India. Then the troubles really started. None of our people were very rich before. So it’s from the people’s perspective that I’ve started reading about Jammu and Kashmir. We need to solve issues, particularly the Kashmiri Pandits’ issue which is put up in the agenda of the BJP. They say we can all take them back home, but it is just a political statement. You have to create a safe environment before you take them there. We need to come out clean on Jammu and Kashmir. Few parts were not ours, we should agree, we should redraw the international lines, and move on. Development is suffering and you see frequent bombings. Our economy takes a toll. Even in the Budget, almost R2.50 lakh crore has been allotted to defence. If we have a peaceful environment in our bordering states, we don’t have to spend so much on defence. We can spend that money on education, women’s development or sanitation. Today, if I talk about no bathrooms in girls’ schools, I should be ashamed of myself being a citizen of this country.

  దీంట్లో ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేముందో నాకైతే అర్థం కావడం లేదు. Few parts were not ours, we should agree అనడంతో సహా, ఆమె చెప్పినవన్నీ అక్షర సత్యాలు. అవి వినడానికి కఠొరంగా వుంటే వుండొచ్చు గాక. ప్రశాంత్ భూషన్ వంటి AAP మేధావి కాశ్మీర్ లో referendum పెట్టాలని అనలేదా? కవిత అది కూడా అనలేదు. కొన్ని మనవిగా చూపిస్తున్న భూభాగాలు మనవి కాదు అని మాత్రమే అంది. అది నూటికి నూరు శాతం వాస్తవం. కాదని ఎవరైనా అనగలరా?

  ReplyDelete
  Replies
  1. ఒక పాకిస్తానీ వెబ్‌సైత్‌లో వచ్చిన వార్త ఆధారంగా కంభంపాటి హరిబాబు కవితని విమర్శిస్తే, తెలంగాణా వ్యతిరేకులతో పాటు తెలంగాణా భా.జ.పా. కార్యకర్తలు కూడా తమకి మేత దొరికిందనుకున్నారు.

   Delete
 16. బహుశా ఈ తెలంగాణ [TRS] వాళ్లు రాష్ట్రాన్ని కాస్తా దేశంగా మార్చేసి ఏలుకుంటారేమో సర్! అందుకనే ముందునుండీ భారతీయులం కాదని ప్రకటించుకుంటున్నారు.కాశ్మీరు కొంతవరకూ వదులుకోవాలన్న మాట...తెలంగాణలో కలిపేమనా? లేక పాకిస్తాన్ కి ఇచ్చేమనా?TRS వాళ్లు... పరిస్థితి ఎంతవరకూ తీసుకుపోతారో అర్ధం కావడం లేదు.

  ReplyDelete
 17. దీనికేమంటారు శ్యామలీయంగారూ?

  దయచేసి మీరు ఈ క్రింద ఇచ్చిన లింకులను తెరిచి చూడండి.

  In Seemandhra, cries for a separate Telugu nation
  In Seemandhra, cries for a separate Telugu nation
  TDP leaders demand new country for Seemandhra
  We demand Seemandhra Country: A TDP leader from Nuziveedu
  In Seemandhra, cries for independent Telugu nation

  ఇవన్నీ వాకృచ్చిన వారిలో లబ్ద ప్రతిష్ఠులు వేణుగోపాల రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి మొదలైన వారు ఇప్పుడు సీమాంధ్ర (సారీ ఆంధ్ర ప్రదేశ్) ప్రభుత్వంలో వున్నారు. దీనిపై తమరి అభిప్రాయం?

  TRS పార్టీతో సంబంధం లేని వ్యక్తి మాట్లాడిన మాటకే నానా యాగీ చేస్తూ ప్రశ్నాస్త్రం సంధించిన మీరు, పై లింకుల పైన అంతే ఘాటైన ప్రశ్నను వండగలరా?

  ReplyDelete
  Replies
  1. ఆవేశములోనో, బాధలోనో మాట్లాడే మాటాలకి ... ఏ విధమైన రెచ్చగొట్టే పరిస్థితులు లేనప్పుడు నింపాదిగా చెప్పే మాటలకి ఉన్న తేడా మీరు గ్రహించాలి. వారు ఆ మాటలన్నప్పుడు, పార్లమెంటులో తెలంగాణా బిల్లు అతి దారుణమైన పద్దతిలో పాస్ చేయబడింది. ఆ Frustrationలో అన్న మాటలే అవి. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అంతా ప్రశాంతంగానే ఉన్నారు.

   సో, ఫైనలుగా .. ప్రత్యేక తెలంగాణా అనేది, మేము భారతీయులం కాము అని చెప్పుకునేంత దూరం వచ్చిందన్న మాట. భేష్.

   Delete
  2. @శ్రీకాంత్ చారి:

   "వేణుగోపాల రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి మొదలైన వారు"

   వాళ్ళంతా తెరాస స్థాపకులు, సాంకేతికంగా మాత్రమె తెదేపా సభ్యులు :)

   Delete
  3. "Frustrationలో అన్న మాటలే అవి."

   ఇలా తెలంగాణా వాళ్ళు అన్నవి సమరదించుకొంటె ఓకేనా ?

   "ప్రత్యేక తెలంగాణా అనేది, మేము భారతీయులం కాము అని చెప్పుకునేంత దూరం వచ్చిందన్న మాట. "

   ఏడ చదివారు? గ్రేట్ ఆంధ్ర నా, తుపాకీ నా ?

   Delete
  4. @jalandhar101
   వాల్లు అన్నది Frustrationలోనే అయితే భేషుగ్గా అనుకోవచ్చు. కానీ, ఇప్పుడు వారంటున్నది ఫ్రస్ట్రేషనులో కాదుగా? కాబట్టి అలా అనుకుంటానంటే కుదరదు.

   //ఏడ చదివారు? గ్రేట్ ఆంధ్ర నా, తుపాకీ నా ?//
   ఎక్కడో ఎందుకు ఇక్కడే చదివాను, చూశాను.

   Delete
  5. నేను అనేది విభజనకు ముందు అన్నవి frustrationలో అన్నారు అంటే అర్తం చేసుకుంటారా ?

   "ఎక్కడో ఎందుకు ఇక్కడే చదివాను, చూశాను."

   Please quote snippets or provide your sources.

   Delete
  6. ఒక సంఘఠన జరిగినప్పుడు, అది మనకు నచ్చకపోతే వచ్చేది కోపం, తీవ్రవ్యతిరేకత. ఇది మొదటి దశ. దాని తరువాత ఆ సంఘఠన లేదా విషయం కాస్త బుర్రలోకి ఎక్కి ఆలోచన మొదలవుతుంది. ఇది రెండవ దశ. మొదటి దశలో అన్న మాటలు నిరభ్యంతరంగా మర్చిపోవచ్చు. మర్చిపోవాలి కూడా. ఎందుకంటే వారి అసలు అభిప్రాయం కానీ, బుద్ది కానీ అది కాదు. కానీ రెండవ దశలో కూడా వారు అలానే అంటున్నారు అంటే .. మాత్రం ఆలోచించాల్సింది. అది తెలంగాణా అయినా సరే, ఆంధ్ర ప్రదేష్ అయినా సరే.

   Delete
  7. This comment has been removed by the author.

   Delete
  8. "అది తెలంగాణా అయినా సరే, ఆంధ్ర ప్రదేష్ అయినా సరే."

   I can't help it, కాని నాకు ఆంధ్ర ప్రదేశ్ వారిచే చెయ్యబడిన అభ్యంతరకరమైన మాటలు కూడా రోజు వినబడుతున్నాయి. ఎవరి ఆంగిల్ లో వారు చూస్తున్నారు. ఈ విషయంలో మీరు ఇది అన్నారు అంటే మీరు అలా అనలేదా అని వందల చర్చలు జరిగాని, ఇంకా అలాంటి చర్చలు అనవసరం అని నా అభిప్రాయమా.

   Delete
 18. ఈ విషయంపై నేను ఒక సంవత్సరం క్రితం అనుకుంటా, నా ప్లస్ లో ఒక టపా వేసాను. ఆ టపా రాసినపుడు ఎవ్వరు పెద్దగా స్పందించలేదు, భరద్వాజ్(మాలిక) గారు స్పందించినట్లు గుర్తు. ఇప్పుడు మాత్రం ఇదే విషయం పై చాలా మంది టపాలు/కామెంట్లు వేసారు, జిన్నా గ్రేట్ అని అద్వాని అన్నా కూడా మన బ్లాగర్లు పెద్దగా పట్టించుకోలేదు, తెరాసాపై ఉన్న వ్యేతిరేకత వలన కాబోలు :-)

  అప్పుడు రాసిన ఆ టపా సారాంశ ఏమిటంటే (ఈ చర్చ కోసం ఇంకొన్ని విషయాలు కలిపాను)

  Indian Independence Act 1947 అనే చట్టం ప్రకారం అది వరకు బ్రిటిష్ పాలనలోనీ భారత ఉప ఖండంలో కల ఏదేని సంస్థానాన్ని కాని లేదా రాజ్యాన్ని కాని బలవంతంగా భారత్ లో కలుపుకోరాదు. నాకు తెలిసి ఈ చట్టానికి వ్యేతిరేకంగా హైదరాబాద్ మరియు జునఘడ్ అనే రెండు ప్రాంతాలను భారత్ ఆక్రమించారు. మనం భారతీయులుగా ఉంటూ ఇతర భూబాగాలను 'ఆక్రమించాం ' అని అనుకోవటానికి కష్టంగానే ఉంటుంది, కాని ఆ ప్రాంత ప్రజల మద్దతుతో జరిగిన ఆ ఆక్రమణ తప్పు కాదు. ప్రపంచంలో మరే ఇతర దేశంలోనూ మన భారత దేశ చరిత్ర చదివితే వీటిని ఆక్రమణలుగానే రాస్తారు, అంటే దీన్ని వారు తప్పు పడుతున్నట్లు కాదు. ఆ కటోర వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి.

  రీసెంట్ గా భారత్ ఆక్రమించిన భుబాగం 'సియాచిన్'. మనం ఆక్రమించాం అంటే మన వాళ్ళు ఎవ్వరు ఒప్పుకోరు, కాని అదే నిజం.

  ఇక కాశ్మీర్ విషయంలో అది ఆక్రమణ కాదు, Indian Independence Act 1947 కు అనుగుణంగానే జరిగింది.

  ఇక్కడ చిక్కు ఏమిటంటే,

  ౧. కాశ్మీర్ భారత్ విలీనానికి ఆక్కడి రాజు మద్దతు ఉంది కాని ప్రజల మద్దతు లేదు.
  ౨. హైదరాబాద్ మరియు జునఘడ్ విషయంలో ఆయా రాజుల(లేదా మోనార్క్ ల) ల మద్దతు లేదు, కాని ప్రజల మద్దతు ఉంది.

  ప్రజల మద్దతే ముఖ్యం అనుకుంటే మనం కాశ్మీర్ మొత్తాన్ని వదులుకోవాలి. రాజు అంగికారమే ముఖ్యం అనుకుంటే హైదరాబాద్ మరియు జునఘడ్ విలీనం విషయం తప్పని ఒప్పుకోవాలి. రెండు రైటు అని ఒప్పుకోలేము. అందుకే కాశ్మీర్ సమస్య అంత జటిలమై కూర్చుంది. ప్రస్తుతం సుమారు సగం కాశ్మీర్ పాకిస్తాన్, చైనా ఆధీనంలో ఉంది(ఇదే విషయం కవిత గారు ప్రస్తావించారు), ఈ విషయం కూడా చాల మందికి తెలియదు, ఆయా ప్రాంతాలు ఎన్నాడు భారత్ ఆధీనంలో లేవు. బలవంతంగా ఆ ప్రాంతాలపై సైనిక ఆక్రమణ జరిపితే తప్ప ఇంకో వందేళ్ళు ఎదురు చూసినా కాశ్మీర్ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం నాకు కనబడటం లేదు. ఆక్రమణ జరిపే అవకాశం లేదని అందరికి తెలుసు. ఈ సమస్య మూలంగా ప్రతి సంవత్సరం అక్కడ వందల కోట్ల టాక్స్ డబ్బు ఖర్చు. మరియు దేశం నిండా బాంబు దాడులతో అమాయకుల ప్రాణాలు పోవటం బోనస్.

  "మన ఆధీనంలో ఉన్న భూబాగాలు మాత్రమె మనవిగా మనం గుర్తించి మన ఆధీనంలో లేనివి వదిలేసి బోర్డర్ కొత్తగా గీసుకొని కాశ్మీర్ సమస్యకు మంగళం పాడుదాం" అని కవిత గారు తన అభిప్రాయం చెప్పారు, అభిప్రాయం చెప్పటంలో తప్పేముంది?

  మన భారతీయులతో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, ఏదేని సమస్య ఉంటె కూర్చొని మాట్లాడుకోరు, పైగా అసలు సమస్య లేనట్లే నటిస్తారు, దైర్యం చేసి ఎవరైనా ఏదైనా మాట్లాడితే(తప్పో, ఒప్పో) ఆ చర్చను కొనసాగించటం పక్కన పెట్టి ఆ మాట్లాడిన వారినే చీల్చి చెండాడేస్తారు. పోనీ కవిత గారి ఉపాయం నచ్చని వారు ఇంకేదైనా ఉపాయం చెపుతారా అంటే అది కూడా ఉండదు. ఇలాంటి నడవడికతో ఎవరికీ నష్టం? భారతియులకే కదా?

  తెలంగాణా విషయంలో కూడా అదే జరిగింది. సమస్య మొదలైనప్పుడే(పదేళ్ళ క్రితం ముందే మొదలైంది కదా) అసెంబ్లీలో ఓ నెల రేనేల్లు కూర్చొని చర్చ చేసి ఉంటె ఏం పోయేది? రాష్ట్రంలో అన్నిటి కంటే విభజన అతి పెద్ద సమస్య కదా, అంతకన్నా మునిగి పోయే సమస్యలు లేవు కదా? విభజన ప్రకటన వెలువడే వరకు ఏనాడు చర్చించిన పాపాన పోలేదు. చివరికి ఎవరికీ నష్టం? కాశ్మీర్ విషయం కూడా అలానే చేద్దామా? వ్యక్తులపై వ్యేతిరేకత ఉంటె అది వేరే విధంగా చూపిద్దాం, అంతేకాని ప్రతి విషయంలో వ్యేతిరేకించటం ఎందుకు?

  అక్కడ ఇక్కడ అన్నవి విన్నవి అన్ని అల్లి ఒక భయంకరమైనా భూతాన్ని తయారు చేసి జనాలను భయబ్రాంతులను చెయ్యటం ఎందుకు? సార్వభౌమాధికారాన్నే ధిక్కరించటమేమిటండి అదేం ప్రశ్న? భారత్ నుండి విడిపోతాం అని ఇంతకూ ముందు అన్నవారిని చూపమంటారా? డైరెక్ట్ గా అలా అన్నవారిని ఏమి అనకుండా అప్పట్లో వదిలి, ఇప్పుడు ఎవరో ఎదో అన్నదానికి మీకు నచ్చిన అర్థాన్ని తీసి ప్రశ్నిస్తే ఎలాగండి?

  ----------------------------------------
  కొండల రావు గారు, నమస్కారం. ఈ టపా చూసి రాయాలనిపించింది :)

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు కిరణ్ గారు. మీ వివరణలో ఆలోచించాల్సిన విషయాలున్నాయి. ఇది సెన్సిటివ్ అంశం గనుకనే ఈ పోస్టులో స్పందించదలచుకోలేదండీ.

   ఆక్రమణకు - దురాక్రమణకు తేడా ఉంటుంది . వీలయితే ఈ విషయాన్ని వేరే టపాగా చర్చించే ప్రయత్నం చేద్దాం.

   TRS నో తెలంగాణా వాదులనో టార్గెట్ చేస్తున్నట్లుగా ఉండకూడదని నా ఉద్దేశం. ఆల్రెడీ శ్రీకాంత్ చారి గారు TDP మహానుభావులు రాష్ట్రానీ విడదీస్తే తమకు ప్రత్యేక దేశం ఇవ్వాలని కోరిన లింకులు పెట్టినట్లున్నది.

   ఈ వాతావరణంలో ఇలాంటి చర్చలో పెద్దగా ఫలితం ఉండదు. ఇక్కడ ఎవడిగోల వాడిదే అన్నట్లుంటుంది :)

   తెలిసినా ఎవరి మానసిక భావోద్వేగాలనుండి వెనుకడుగువేసే ప్రయత్నం కనపడదని నా అభిప్రాయం.

   బహుశా ఈ బ్లాగులో మీది మొదటి కామెంటు అనుకుంటాను. అందుకే స్పందించాను.

   Delete
  2. కిరణ్ కుమార్ కే

   మీరన్నది చాలా కరెక్ట్. మనలో చాలామంది ఎమోషనల్‌గానే respond అవ్వగలరు రేషనల్‌గా కాదు. ఉదాహరణకి చాలామంది ఆలోచనాధోరణి ఎలా ఉంటుందంటే మాతృదేశం అనేది ఒక పవిత్రభావన. కాబట్టి దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనీ విమర్శించకూడదు. మాతృదేశాన్ని అడ్డగోలుగానైనా వెనకేసుకువచ్చి, 'శత్రుదేశాన్ని' మాత్రం తప్పుబట్టాలి. ఒకప్రాంత ప్రజలు మనదేశంలోనివారే అని మనం నిర్ణయించేశాక ఇహ ఆప్రజలకి ఇష్టమున్న లేకున్నా మనదేశంలో భాగమై పడుండాల్సిందే. మనం అక్కడి ప్రజల బాగోగులను పట్టించుకోకున్నా, మనం కేవలం ఆయా ప్రాంతాలను కేవలం వ్యూహాత్మకంగా పరిగణించి అక్కడి ప్రజల భద్రతను గాలికొదిలినా వారు కిమ్మనకుండా పడుండాలి. అలాకాక నోరెత్తితే వాళ్ళందరినీ దేశద్రోహులుగా పరిగణించేస్తాం. అలాంటి పరిస్థితి మనకు ఎదిరైతే ఈ దేశమ్నుండి విడిపోతేబాగుంటుందని నిష్టూరమాడుతాం. మనలాగే ఒకప్పుడు తెల్లవాళ్ళు ప్రవర్తిస్తేమాత్రం పోరాడి స్వాతంత్ర్యం తెచ్చుకున్నాం.

   Delete
  3. @ కిరణ్ కుమార్ గారూ ,

   మంచి కామెంట్ రాసారు విషయాలు అన్నీ కంపైల్ చేసి . కాకపొతే చిన్న కరెక్షన్ అండి , భారతప్రభుత్వం చేసింది 'విలీనం' మాత్రమే ఆక్రమణ కాదు.

   1. జునాఘడ్ - సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వస్థలం కావటంతో ఆయన కి ఆ ప్రాంతం లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రశాంతం గా విలీనం చేయటం ఆయన ప్రెస్టేజ్ తో ముడిపడి ఉన్నా అంశం , అలాగే హైదరాబాద్ సంస్థానం విషయం లో నెహ్రు గారు విదేశీ పర్యటన లో ఉన్న సమయం లో వల్లాభాయ్ పటేల్ గారు Acting PM గా ఉన్న సమయం లో ఆపరేషన్ పోలో చేపట్టటం తో అది కూడా ఆయన వ్యక్తిగత ప్రెస్టేజ్ కి సంబంధించిన విషయం కావటం తో ఆయన ఈ రెండు విలీనాలని ఒక్క రక్తపు బొట్టు కూడా నేల రాలకుండా అత్యంత జాగ్రత్త తీసుకుని చేసారు అని చరిత్ర చెబుతుంది . పొతే కాశ్మీర్ అంశం ఇప్పటికి అలాగే ఉండటానికి కారణం మంచి ఉద్దేశ్యము తోనే నెహ్రు చేసి ఉండొచ్చు కానీ అది ఐక్యరాజ్యసమితి పరిధిలోకి తీసుకెళ్లటం . ఆనాడే సరైన నిర్ణయం తీసుకుని ఉంటె ఇప్పుడు ఇన్ని పాట్లు ఉండేవి కావు . unfortunately అది జరగలేదు . ఇక మా నాన్న ఆత్మశాంతి కోసం కాశ్మీర్ ని భారతదేశం నుంచి విడగొట్టే వరకు నిద్ర పోను అని ప్రతిజ్ఞ చేసినా ఆవిడే అదే దేశ తుపాకీల బుల్లెట్లతో శాశ్విత నిద్రలోకి వెళ్ళారు కాబట్టి , కాశ్మీర్ ని ఇండియా నుంచి అంత సులువైన విషయం కాదులెండి .

   2. మీ కామెంట్ లో సియాచిన్ అంశం. ఇది భారత ప్రభుత్వం ఎందుకు చేసిందో, ఎటువంటి పాకిస్తాన్ కవ్వింపులకు భారతదేశ సమాదానమో, ఎందుకు అంతర్జాతీయ మద్దతు ఇండియా కు దొరికిందో చెప్పమంటారా ? ఒకవేళ మీరు అవసరం అంటే ననేను తప్పక ఆపరేషన్ మేఘదూత్ గురించి పోస్ట్ రాస్తాను . పైగా అసలు సియాచన్ అనేది ఎవరి అధికారం లేని ప్రాంతం కూడాను, అది మీరు గమనించాలి . నేను ఈ విషయాన్ని ఎందుకు అంత స్ట్రెస్ చెబుతున్నా అంటే . ప్రపంచ చరిత్ర చూస్తే ఇప్పటి వరకూ ఇండియా మీద చాలా దండయాత్రలు చేసారు చేసారు కానీ , ఇండియా ఏనాడు ఆ పని చెయాలి. ఇది నేను చెబుతున్న ఎమోషన్స్ తో కూడిన ఒక స్టేట్మెంట్ కాదు. హిస్తోరియన్స్ ఏకగ్రీవం గా ఒప్పుకున్న నిజం . అయితే దానికి మన మంచితనమా కారణం అంటే కాకపోవచ్చు . ఉన్న సహజ వనరులు ఆ వైపు ఆలోచించే అవసరం రానిచ్చి ఉండకపోవచ్చు , పైగా లోపల లోపల కొట్టుకు చచ్చే అలవాటు మనకి ఇప్పటిది కాదు కదా కాబట్టి దానితోనే టైం పాస్ అయ్యి ఉండొచ్చు. ఇండియా - దురాక్రమణ ఇవి రెండూ ఒకే లైన్ ఫిట్ అయ్యే అంశాలు ఎప్పటికీ కావు . నిజానికి రాజకీయ నాయకులు స్వార్ధం తో చేసే స్టేట్మెంట్ కి ఈ అంశాన్ని ముడిపెట్టి రాయటం అనేది ఒకరకంగా మన మిలిటరీ ఫొర్చెస్ చేసే త్యాగాలను తక్కువ చేయటమేమో ఒకసారి ఆలోచించండి .

   3. జన్నాని అద్వాని పోగిడినప్పుడు, bloggers సంగతి పక్కన పెడితే , భారతదేశ ప్రజల స్పందన , బిజెపి స్పందన (దానికి అద్వాని అలక) అనీ మీకు గుర్తు ఉండే ఉంటాయి .

   btw థాంక్ యు , విభజనతో ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగింది అని మీరు ప్రస్తావించినందుకు

   Delete
  4. కిరణ్ గారు, అద్వానీ జిన్నాని పొగిడినప్పుడు మనవాళ్ళు నోరు మూసుకున్నది తె.రా.స.పై వ్యతిరేకతతో కాదు, తెలుగు దేశంపై అభిమానంతో. "హైదరాబాద్ లేకపోతే ఆంధ్రాకి మిగిలేది గెంజన్నం, అంబలి" అని బహిరంగంగా ప్రచారం చేసినవాళ్ళు విభజనకి వెనుక నుంచి పూర్తి మద్దతు ఇచ్చిన భా.జ.పా.తో తెలుగు దేశం పొత్తుపై ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. "భా.జ.పా. తెలంగాణా బిల్‌కి మద్దతు ఇవ్వదనీ, చివరలో మాటమారుస్తుందనీ" నమ్మించడానికి కూడా పచ్చ TV చానెల్‌లు ప్రయత్నించాయి. కులం "కమ్మ"నిది, మతం మూర్ఖమైనది అని గూగుల్ ప్లస్‌లో ఒకాయన వ్యాఖ్య వ్రాసాడు.

   Delete
  5. //ఇండియా మీద చాలా దండయాత్రలు చేసారు చేసారు కానీ , ఇండియా ఏనాడు ఆ పని చెయాలి//
   ఇండియా అనేది ఒకటి బ్రిటీషువాల్లకు ముందు లేదని గుర్తు తెచ్చు కుందాం.

   Delete
  6. సింధూ నదికి తూర్పున ఉన్న ప్రాంతాన్ని గ్రీకులు "ఇందియా" అనేవాళ్ళు. వాస్తవానికి ఇందియా అనేది అనేక కులాలుగా విభజితమై ఉంది తప్ప అది ఒక జాతిగా ఎన్నడూ లేదు.

   Delete
  7. This comment has been removed by the author.

   Delete
  8. @తిరుపాలు గారు

   హ హ :-))) భలే జోక్ వేసారే :-))))
   ఇంకా నయం 1956 అని ఇక్కడ ఇంకో మైల్ స్టోన్ పెట్టలేదు ! బ్రిటిష్ వాళ్ళకి ముందు బ్రిటిష్ ఇన్దిఆ లేదు ఇండియా ఉంది . 'వాస్కోడిగామా ఇండియా ని కనిపెట్టాడు' అని అదేదో స్టేట్మెంట్ చెబుతారు జనాలు మళ్ళీ వచ్చి మీరు అది కూడా చెబుతారేమో ముందు జాగ్రత్త గా చెబుతున్నా ఇండియా ఎప్పటి నుంచో ఇక్కడ ఉంది వాస్కోడిగామా కేవలం 1498 లో ఆయనకీ సముద్రమార్గం ద్వారా కనపడింది . అలాగే బ్రిటిష్ వాళ్ళు - 'బ్రిటిష్ ఇండియా' ని ఫార్మ్ చేసారు ఇండియా ని కాదు .

   Delete
  9. గ్రీకులు ఈ ప్రాంతానికి ఇందియా అని పేరు పెట్టినంతమాత్రాన ఇందియా ఒక జాతి అయిపోదు. రష్యన్ సామ్రాజ్యవాదులు తుర్కెస్తాన్‌ని ఆక్రమించుకున్న తరువాత అక్కడి స్థానిక జాతులవాళ్ళందరినీ రష్యన్ భాష మాట్లాడేవాళ్ళుగా మార్చడానికి ప్రయత్నించారు. మన భారతీయులకి ఏ విషయంలో uniformity ఉంది? హిందూ మతం అనేది ఉన్నా ముస్లింలకి వ్యతిరేకంగా హిందువులలోని రెండు కులాలు ఏకం కావు కానీ హిందువులకి వ్యతిరేకంగా సున్నీలూ, షియాలూ ఐక్యంగానే ఉంటారు.

   Delete
  10. // 'వాస్కోడిగామా ఇండియా ని కనిపెట్టాడు'//
   :) నిజమే గానీ ఆయన కనిపెట్టినపుడు ఆ ప్రదేశానికి ఇండియా అనే పేరు లేదు. ఆ తరువాత చరిత్ర కారులు ఉటంకించిందే! నేనన్నది కూడా ఈ భూ భాగానికి ఆ పేరు లేదనే గానీ ఆ భూబాగం కాదనలేదు. ఆ భూభాగం వివిధ సంస్థానాలుగా, చిన్న రాజ్యాలుగా విడి పోయి ఉంది. నిజాం రాజులు స్వపరిపాలన చేసుకున్న రేమో కానీ అదీ భ్రిటిషు వారి అండదండలతోనే. ఎందుకంటె నవాబులకు స్వతతంత్ర సైన్యం లేదు. మిగతా అన్ని హంగులు ఉన్నప్పటికీ!

   Delete
  11. ఇహ లాభం లేదండి నేను ఇప్పుడు 2600 B.C. నుంచి మొదలు పెట్టి రాయాలి అనుకుంటా కాదో పెద్ద కామెంట్ :-))) అంతకు ముందు ఆ పేరు లేకపోవటం ఏంటండి :-)))

   Delete
  12. గుప్తులు బర్మాని ఆక్రమించుకున్నారు కానీ దక్షిణ భారతాన్ని ఎందుకు ఆక్రమించుకోలేకపోయారు?

   Delete
  13. This comment has been removed by the author.

   Delete
  14. This comment has been removed by a blog administrator.

   Delete
  15. This comment has been removed by the author.

   Delete
  16. కాశ్మీర్ భారత్ విలీనానికి ఆక్కడి రాజు మద్దతు ఉంది కాని ప్రజల మద్దతు లేదు. *

   కిరణ కూమార్ కి తెలుసోలేదో దేశ విభజన సందర్భంలో భారత ఉపఖండం లో మతకలహాలు జరిగితే, ఆ ప్రభావం ఏమాత్రం లేకుండా ఉండిన ప్రాంతం కాష్మీర్ ఒక్కటే. కాష్మీర్ లో మొదటి చొరబాటు సంఘటన గా చెప్పబడేది, జిన్నాగారి నాయకత్వం లో ఉన్నపుడు, పాక్ గిరిజన తెగలను పంపి అల్లర్లు చేస్తే, వారిని పట్టుకొని భారత ప్రభుత్వానికి అప్పజెప్పింది కాష్మీరి ప్రజలే.కాష్మీరి ప్రజలకు పాకిస్థాన్ పై ప్రేమ, మనదేశం పై కోపం ఉంటే అలా చొరబాటు దారులను భారత దేశానికి పట్టిస్తారా?
   అప్పటి వరకెందుకు ఇప్పుడు కూడా పాక్ లో కలవటానికి 70% కాష్మీరిలు సిద్దంగా లేరు. పాక్ వాళ్లు కాష్మీర్ లో చేయించుకొన్న సర్వేలే ఆ విషయాన్ని తేల్చాయి.

   Delete
  17. @sravya gaaru, (this is Kiran Kumar K)

   హైదరాబాదు విషయంలో ఇది సులభంగా అయిపొవటానికి కారణం అప్పటికే రైతాంగ పోరాటం ఉదృతంగా కొనసాగటం. దాని వలన రజాకార్లు భారిగా బలహీన పడి పోవటం.

   ఎవరి అధికారం లేదు కాబటి అది మనది కూడా కాదు. మనం చేసిన పనికి ఇతర దేశాల మద్దతు ఉన్నట్లు నాకు తెలియదు.

   జిన్నాను పోగిడినప్పుడు వేరే వారు స్పందించారు, వారి కారణాలు వారికి. ఇప్పుడు మన వాళ్ళు స్పందించారు, మన వారి కారణాలు మనవారికి.

   ఆంధ్ర ప్రదేశ్కు అన్యాయం జరిగిందా లేదా అని పాయింటు రాయలేదండి. విభజనకు చర్చను ఎవరు చెయ్యలేదు, దానివలన ఎవరు నష్టపోయారు అనే ప్రశ్న వేసాను.

   మీరు మేఘదూత్ పై టపా రాస్తే తప్పక చదువుతాను. మీ బ్లాగ్ ని మీ స్ట్రీం లో ఫాలో అవుతూనే ఉన్నాను. :))

   Delete
  18. @ కిరణ్ కుమార్ గారు ,

   ఈ id మీదా ? ఇదే ID తో వేరే బ్లాగ్ లోను, ఈ బ్లాగ్ లోను వేరే టోన్ లో కామెంట్స్ చదివిన )గుర్తుంది నాకు (ఒకవేళ నేను పొరపాటు పడితే మై apologies) . Now I am really surprised :-) Anyway that న't doesn't make any difference .

   జిన్నాని పోగిడినప్పుడు కారణాలు వేరు కాకపోయి ఉండోచ్చండి . మనకు 24 X 7 చానల్స్ తెలుగు లో వచ్చిన తరవాత మన స్టేట్ లో జరిగే చిన్న చిన్న petty issues మీద దృష్టి పెట్టినట్లుగా , నేషనల్ లెవెల్ లో అంశాల మీద ద్రుష్టి పెట్టటం మర్చిపోయాం . అదే ముఖ్య కారణం అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను . అదే అద్వాని తెలుగు వారైతే బ్లాగులు, పేపర్లు , టీవీ లు హోరెత్తి పోయేవి . అవునండి ఆపరేషన్ మేఘదూత్ కి ఇండియా కి అంతర్జాతీయం గా మద్దతు ఉంది , ఆ ప్రాంతం ఎవరి ఆధీనం లోను లేనిది .

   ఎవరు నష్టపోయారు అని ప్రశ్న వేసారా? నేను 'చూసారా ఎవరు నష్ట పోయారో ' అని అన్నారు అనుకోని సంతోషపడ్డాను .

   Delete
  19. Sravya V గారు ,

   అదే కారణం :)

   నాకు గూగుల్ ప్లస్ ఓపెన్ కాదండీ. పల్లెటూరు కనుక నెట్ స్లో. నిన్న మీరేదో మేటర్ ఉంచారనుకుంటాను. ఒక్క లైనే కనపడుతుంది.

   Delete
  20. ఆ సరిహద్దులు గురించి అడిగారు కదా ఆ పోస్ట్ కి related అండి . అక్కడ పోస్ట్ చేసా చూడండి .

   Delete
  21. శ్రావ్య గారు ,

   "ఇదే ID తో వేరే బ్లాగ్ లోను"

   ఈ ఐడితో చాలా కాలం ఇదే బ్లాగ్ లో రెండు మూడు కామెంట్లు చేసిన గుర్తు కాని , మరెక్కడా వాడినట్లు గుర్తు లేదు. ఇది క్రియేట్ చేసి కొంత కాలం అయ్యింది కాబట్టి బహుశా నాకు సరిగా గుర్తు లేక పోవచ్చు. నాకున్న రెండు ప్రాజెక్ట్ లలో ఒక ప్రాజెక్ట్ లో పని చేసేప్పుడు గూగుల్ లాగిన్ పనిచేయ్యదండి. ఇక్కడ anonymous ఆప్షన్ లేదు, అందుకే ఇలా.

   మొదట్లో నేను ఎవరో ఎవరికీ తెలియకుండా కామెంట్స్ చేద్దామని నా గురించి చెప్పలేదు. కాని ఎవరు ఏమిటి అని తెలియక పొతే ఒక్కో సారి వాదనలు దారి తప్పి స్నేహాలు పాడవుతాయని అనిపించింది, ఆ విషయం అర్హ్తం అవగానే అది నేనే అనీ చెప్పేసాను. ఇదివరకు కాస్త కటువుగా స్పందించినందుకు నా క్షమాపణలు.

   జిన్నా కాకపొతే మరో ఉదాహరణ
   తెలంగాణా అడిగే వారు దేశ ద్రోహులు అని కావూరి
   సీమంద్ర బిరియాని పెండలా ఉంటుంది అని కెసిఆర్

   పై రెండింటిలో మొదటిది చాలా తీవ్రమైన వ్యాఖ్య. కాని దేని గురించి ఎక్కువగా రచ్చ జరిగి ఉంటుంది?

   నన్ను అడిగితె, దేశ ద్రోహం విషయంలో సీమంద్ర బ్లాగర్లు పెద్దగ పట్టించుకోలేదు. బిరియాని విషయంలో తెలంగాణా బ్లాగర్లు పట్టించుకోలేదు. ఈ పక్క వారికి ఆ పక్కది తీవ్రంగా కనబడుతుంది , ఆ పక్క వారికి ఈ పక్కది.

   మీరన్నది కరెక్టే అద్వాని తెలుగు వాడు కాదు కాబట్టి ఈ చర్చ లేదు.

   అయితే నేను అనేది కూడా చూడండి, తెలుగు వారు కాబట్టే ఇంత చర్చ అంటే, అప్పట్లో తెలుగు రాష్ట్రానికి చెందిన ఏంఐఏం నాయకుడు ఒకరు (అసరుద్దిన్?) అవాకులు చవాకులు పేలితే తెలుగు బ్లాగర్లు/పాటకులు ఇంతగా స్పందించినట్లు గుర్తులేదు. వారు తెలుగు రాష్ట్రం వారే కదా. తీరా చూస్తే ఇప్పుడు కవిత అన్నదాంట్లో తప్పేమిటో అనేది తేల్చటానికి ఇంత చర్చ జరిగినన్ను ఇది తప్పు అని నిర్దారించినట్లు అనిపించలేదు.

   Delete
  22. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భింద్రన్‌వాలేలు ఉన్నారని లగడపాటి అన్నప్పుడు, మన తెలుగు బ్లాగర్లు "లగడపాటి తెలంగాణా ప్రజల్ని భింద్రన్‌వాలేలు అనలేదు, తెలంగాణా అతివాదుల్ని మాత్రమే భింద్రన్‌వాలేలు అన్నారు" అంటూ లగడపాటిని వెనకేసుకొచ్చారు. కావూరిని జస్తిఫై చెయ్యడానికి కూడా ఇలాంటి సమాధానాలు దొరుకుతాయి.

   Delete
 19. అప్పుడు మేము మా వాదన వినిపిస్తాం అని విశాలాంధ్ర మహా సభ వాళ్ళు వస్తే జర్నలిస్ట్ లే తన్ని పంపారు. ఒక్కరిని అయినా అభిప్రాయం చెప్పనిచ్చారా తెలంగాణా లో? ఆంద్రప్రదేశ్ కి ఎంత మంది వెళ్లి వాళ్ళ వాదన వినిపించారు? ఇక తెరాస శాసన సభ్యుల సంగతి ఏమి అడుగుతావు లే. మొదలు పెడితే అడ్డంగా వాదిస్తే ఎన్ని దశాబ్దాలు వాదిస్తే తెగుతాయి?

  ReplyDelete
  Replies
  1. కె.సి.ఆర్. ఆంధ్రాలో మీతింగ్ పెడితే అతనిపై దాడి చేసే పరిస్థితి అప్పట్లో లేనట్టు?!

   Delete
  2. హ హ అదంతా ఏమో గానీ ప్రవీణ్ ఒకవేళ మీరు పొరపాటున తెలంగాణ లో పుట్టి ఉండి , ఇలా ఆంధ్రప్రదేశ్ కి సపోర్ట్ చేస్తే వాళ్ళు ఒక పేరు పెట్టేసి ఉండేవారు అదేంటో చెప్పండి :-))))

   Delete
  3. http://kattashekar.wordpress.com/2013/06/25/aathmeeya-yatra-attacked-in-amalapuram-e-g-dist/

   http://www.greatandhra.com/viewnews.php?id=47458&cat=15&scat=16

   Delete
  4. This comment has been removed by a blog administrator.

   Delete
  5. "ఆంద్రప్రదేశ్ కి ఎంత మంది వెళ్లి వాళ్ళ వాదన వినిపించారు? "

   You asked one question, I provided you what I found. Why you are getting angry? Silly.

   Anyway you are completely off topic.

   Kondala Rao gaaru, please delete this an all above unrelated comments. Thanks.

   Delete
 20. ఒక అవసరమైన పునరాలోచన.

  ఈ టపాను వ్రాయటానికి నాకు గల అవకాశం దుర్వినియోగం ఐనట్లుగా ఎవరైనా అక్షేపిస్తే వారిమాటల్లో నిజం ఉందనే నాకు అనిపిస్తోంది. దానికి కారణం దీన్ని వ్రాయటం నేను పాటించవలసినంత సంయమనం పాటించలేకపోయానని నాకే స్పష్టంగా అనిపిస్తున్నది. ఈ టపాలో విషయంతో పాటే వ్రాయసకాని భావావేశాలు హెచ్చుమోతాదులో మిళితం కావటం అనేది నిర్మొగమాటంగా చెడ్డవిషయం. కొద్దోగొప్పో లేకుండా వ్రాయటం అరుదుగానే జరుగుతుంది ఎవరివిషయంలో నైనా, అది సహజం. కాని ఇక్కడ భావావేశం పాలు ఎక్కుగానే ఉంది. అది నాకే ఇప్పుడు నచ్చటం లేదు.

  Published on Aug 29, 2013 అని నేను ఇచ్చిన వీడియో క్రిందనే స్పష్టంగా ఉంది. అది నేను ఎందుకు చూసుకోలేదు? అది చాలా పెద్ద పొరపాటు. విషయసేకరణలో పొరపాట్లు ప్రమాదకరం.

  శ్రీమతి కవితగారూ, శ్రీ కేసీఆర్‌గారూ ఈ మధ్యకాలంలో చేసిన ప్రస్తావనలను చూసినా, అప్పట్లో పార్టీవ్యవస్థాపకుల్లో ఒకరైన శ్రీప్రకాష్‌గారు వెలుబుచ్చిన అభిప్రాయంలోనైనా అంతర్లీనంగా భారతదేశపుప్రాదేశికసమగ్రతను ప్రశ్నించటం కనిపిస్తోందన్నది ప్రస్తావించటమే ఈ టపా ఉద్దేశం. ఒకరి ఉద్దేశాన్నో మరొకరి అభిప్రాయాన్నో వ్యగతం అనుకోవటం సంగతం కావచ్చును. హెచ్చుమంది క్రమంగా ఇటువంటి ధోరణిలో మాట్లాడటం బహుశః పార్టీ ధోరణి అయ్యే అవకాశం ఉన్నది అన్నది నా భావన.

  ఒక వ్యాఖ్యాత సూచించినట్లుగా ప్రశ్నలకూ ఒక విధానం ఉండాలి అన్నది చాలా మంచి అభిప్రాయం.

  ఈ రోజు పన్నుల వ్యవహారంలో బిజీబిజీ. కాబట్టి వ్యాఖ్యలన్నీ క్రోడీకరించే తీరిక లేనందుకు క్షంతవ్యుడను.

  ReplyDelete
  Replies
  1. గుడ్ సర్. మీనుండి నేనీ స్పందనను ఊహించాను. మీ విజ్ఞతకు ధన్యవాదములు. అభినందనలు. ఇది చాలామందికి మార్గదర్శకమైనది. మీ ఆందోళన అయితే అర్ధ రహితమైనది కాదు.

   Delete
 21. ఇందులో తప్పేముంది? తెలంగాణాను ప్రత్యేక దేశంగా అడగడంలో/గుర్తించమని అడగడంలో తప్పు లేదని నా అభిప్రాయం.
  అలానే, నాకు తెలిసిన కొందరి [ఇంకా దోచుకోబడుతున్న తెలంగాణా వారి] అభిప్రాయం ప్రకారం:

  1. హైదరాబాదుని UT చెయ్యాలి.
  2. తెలంగాణను విభజించి ఉత్తర తెలంగాణా మరియు దక్షిణ తెలంగాణా చెయ్యాలి.

  ఎందుకంటే "India is an indestructible union of destructible states." కదా!

  ReplyDelete
 22. ఇవి ఈ టపా విషయమై విచారణ జరిపాల్సిన అంశాలు:

  1. పది నెలలు కిందటి వీడియోను తిరగతోడి ద్వేషం రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది ఎవరు? వారి ఉద్దేశ్యం ఏమిటి?

  2. తెరాస స్థాపకులు ఎందరు? వారి పేర్లు పూర్వాపరాలు ఏమిటి? వేరేరకంగా చూడాలంటే ఈ "తాను నేతగాళ్ళు" ఎవరు? ఇంకా మిగిలిన నేతగాళ్ళ (అభాండాలు వేసేవారి దృష్టిలో) మీద ఇంకా ఏవేవి రాబోతున్నాయి?

  3. తెలంగాణా ఏర్పడిన మరుక్షణం పొలోమంటూ పదుల సంఖ్యలో ప్రాంతాలు (లేదా వందల సంఖ్యలో జిల్లాలు) ప్రత్యెక రాష్ట్ర డిమాండ్లు వస్తాయని ఖండితంగా చెప్పిన అపర వీరబ్రహ్మల జోస్యం నిజం కానందుకు వారు జవాబు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా?

  4. గిసొంటి కోతలు వినాల్సిన ఖర్మ తెలంగాణాకు ఎందుకు వచ్చింది?

  5. ఏం పాపం చేసుకుంది నా తెలంగాణా? कैकु ऐसे लोगोंको पाला पढ़ना पड्रा है? ऐसे लोगोंका जिनके मू हम लगना ही नहीं चाहते हमारे पीछे क्यों पड़े है?

  ReplyDelete
  Replies
  1. జై గారు, ఈ పోస్టుకి సంబంధించి మీరు చెప్పిన అంశాలు ఖచ్చితంగా రివ్యూ చేసుకోవలసిన అంశాలేనన్నది నిజం. ఈ అంశాలపైనా, ఈ పోస్టులోని కామెంట్లన్నీ క్రోడీకరించి శ్యామలీయంగారినే రివ్యూ ఆర్టికల్ వ్రాయమని మెయిల్ చేయడం జరిగింది. ఆయన రివ్యూ ఆర్టికల్ చూశాక మీరు మిగతా వ్యాఖ్యలు చేయడం సబబుగా ఉంటుంది.

   Delete
 23. "క్రొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో కొలువుతీరిన తెరాస పార్టీ భారతదేశ సార్వభౌమాధికారాన్నిధిక్కరిస్తున్నది!"

  తమరు మోపే అభాన్డాలకు రుజువు చూపాల్సిన బాధ్యతా తమదే. You sir can't be judge jury prosecution and executioner rolled into one.

  "భారతదేశపౌరులుగా మనం దీనిని ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా స్పందించాలి?"

  ఆధారాలు లేని రుజువు కాని విషయాలను అర్ధం చేసుకోవాల్సిన ఖర్మ భారత దేశానికి లేదు.

  "ఈ పరిణామానికి భారతదేశప్రభుత్వం ఎలా స్పందించవలసి ఉంది?"

  పై జవాబు చూసుకోండి. ఇంతోటి దానికి ప్రభుత్వ స్పందన ఎందుకు?

  "ఇది తేలిగ్గా తీసుకొంటే భారతదేశవిఛ్ఛిత్తి అనేది నేడో రేపో జరిగే పరిస్థితి వస్తున్నది అనటంలో ఎవరికైనా సందేహం ఉందా?"

  తెలంగాణా ఏర్పాటుతో దేశ విచ్చిన్నత జరుగుతుందనే వాదనలో పస లేదనీ, తెలంగాణా వ్యతిరేకులు కుళ్ళుతో కక్కుతున్న విషంలో ఒక్క శాతం కూడా నిజం లేదనే విషయాలపై ఇంగిత జ్ఞానం ఉన్న వారెవెవరికీ సందేహం లేదు

  "1956వ సంవత్సరంలో ఏ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందో, ఆ పరిస్థితుల్లోనే ఆ రాష్ట్రం యొక్క విఛ్ఛిన్నతా బీజాలూ కొందరు నాటటం జరిగింది. అందులో తప్పొప్పుల గురించి అనంతమైన చర్చలు జరిగాయి. అనేక ఆందోళనలూ జరిగాయి. చివరకు ఆంధ్రపదేశ విఛ్ఛిత్తీ అత్యంతనాటకీయంగా జరిగింది."

  బోడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ఉంటె ఎంత లేకపోతె ఎంత. దేశానికి పట్టిన పీడా పోయింది.

  "లోక్‍సభ సభ్యురాలు కూడా ఐన కెసీఆర్‍గారి కుమార్తె, కవితగారు నిన్న మొన్న కాశ్మీర్ హైదరాబాద్ సంస్థానాలను బలవంతంగా ఇండియాలో కలిపారని వ్యాఖ్యానించడం, కాశ్మీర్‌లో కొంతభాగాన్ని ఇండియా వదులుకోవాలని వ్యాఖ్యానించడం జరిగింది. అది అమిత్రవిదేశాలు చక్కగా వాడుకున్నాయి."

  ఆమె మాటలు ప్రత్యక్ష సాక్షులయిన భాజపా నాయకులే విమర్శించలేదు, ఆంధ్రోల్ల కుళ్ళు మాత్రం యధావిదీ!

  "తెలంగాణా రాష్ట్రంలో ప్రజలకు పాస్‍పోర్టు తరహాలో ‘తెలంగాణా సిటిజన్ కార్డు’లను ఇచ్చేందుకు తెలంగాణా ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తున్నది."

  ఆ కార్డు పాస్పోర్ట్ కాదని చూసిన వాళ్లకు (కళ్ళున్న కబోదులకు తప్ప) ఎవరికీ అయినా అర్ధం అవుతుంది.

  "ఈ రోజున టీఆర్ఎస్ మాజీ నాయకులూ, ఆ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన ప్రకాష్ తెలంగాణ ప్రజలం భారతీయులం కానే కాదు We are not Indians అంటూ చేసిన ఈ కామెంట్లు వినండి.. చూడండి..!!"

  పది నెలల సంది ఏమి చేస్తున్నారండీ!!!! (మాకు కూడా ! టైపు చేయడం వచ్చు)

  "ఈ పరిణామాలన్నీ ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయి."

  అయ్యో పాపం:)

  "తెరాస వారి వ్యూహం ఏమిటీ? ఎందుకు వారు ఏకంగా భారతదేశం మీదే కక్షకట్టి ప్రవర్తిస్తున్నారూ?
  ఇన్నాళ్ళూ మనం వారి ఆక్రోశం అంతా కేవలం సీమాంధ్రప్రజలమీదే అనుకుని పప్పులో కాలు వేసామా?
  ఈ కథ వెనుక మనకు కనబడని నిర్దేశకులు ఎవరైనా ఉన్నారా?"

  ఇంకా తెలీదా ఈ కూత వెనుక సీఅయిఎ/కేజీబీ/అయిఎసాయి/మోస్సాద్ వగైరాల కుట్ర ఉంది. జాగ్రత్త సుమండీ!

  ReplyDelete
  Replies
  1. తెలంగాణా వాళ్ళు టెర్రరిస్టులని, నక్సలైట్లనీ, జిహాదీలని, మతొన్మాదులని తమరు ఎంతోకాలంగా సెలవిచ్చారు. తెలంగాణా ఏర్పడగానే ఆంధ్రోల్లని వెళ్లగొట్టే కార్యక్రమం షురూ అవుతుందని కూడా కాలజ్ఞానులు చెప్పారు.

   తదనుగుణంగా జూన్ 2 నుండి అదే పని మీద ఉన్నాం. ఆంధ్రోల్ల ఇళ్ళు, వ్యాపారాలు కొల్లగొట్టి వాళ్ళని తరిమేసాం. ఆంధ్రా మేస్సులను తగుల బెత్తం. కొబ్బరి బొండాలు అమ్మే వాళ్ళని బొండాల లక్క నరికేశాం. ఆంధ్రా కరీ పాయింట్లను బొక్కలు నమిలినట్టు నమిలేసాం. అందరు ఆంధ్రోల్లు ఖతం అయ్యిన్రు ఒక్క ఇద్దరు తప్ప. ఆ ఇద్దరినీ మర్నాడు రంజాన్ పాడుగా నాడు కర్బలా మైదానులో బలి (ఇది బక్రీదు కాదని మా లాంటి అలగా వెధవలకు తెలీదు లెండి) ఇస్తున్నాం.

   ఆఖరి నిముషంలో చిన్న ధర్మ సందేహం వచ్చింది దయ ఉంచి జవాబు చెప్పండి. రేపటి కెల్లి మేము నక్సలైట్లగా ఉండాలా రజాకార్లగానా? ఇంకో ప్రశ్న: అన్నం వండడం మాకు తెల్వదు ఏమి తినాలె? గట్లనే నిజాముకు పూజ చెయ్యాల్నా మావోకా? అనవసరంగా ఆంధ్రోల్లను చంపినం బై! వాళ్ళే ఉంటె అన్ని చెప్పెటొల్లు :)

   Delete
  2. సీమాంధ్ర రాక్షసులంతా తెలంగానోల్లని చంపి పడేసిన శవాల గుట్టలు ఎక్కడున్నాయో చెబితే మిగిలిన విషయాలన్నీ మాట్లాడుదాం.

   "తెలంగాణా ఏర్పడగానే ఆంధ్రోల్లని వెళ్లగొట్టే కార్యక్రమం షురూ అవుతుందని కూడా కాలజ్ఞానులు చెప్పారు"
   ఓహ్! అయితే సీమంద్రులని భయ బ్రాంతుల్ని చేసి వెళ్లగొట్టే కార్యక్రమం కేవలం మా కలల్లో మాత్రమె వస్తోందంటావా. రూల్ ప్రకారం ఉద్యోగం తెచ్చుకుని 20-30 ఏళ్ళుగా హైదరాబాద్ లో ఉంటున్న వాళ్ళని సాక్షాత్తూ ముఖ్యమంత్రే మేము లోపలి రానియ్యం, జీతాలియ్యం అంటారు. అంటే వాళ్లకి హక్కులుండవా? అది భయపెట్టి వెళ్ళగొట్టడం కాదా? అక్రమంగా ఉద్యోగం తెచ్చుకున్నాడు అని తేలితే ఉన్న పళంగా చర్య తీసుకుంటే మేము కూడా సమర్థిస్తాం కానీ జరుగుతున్నదేమిటి? ఇవ్వాళ 1956 ముందు ఉన్నోల్లకే ఫీజు అని మొదలు పెట్టారు. గురుకుల్, అయ్యప్ప సొసైటీ భూముల్లో పైసా పైసా కూడబెట్టి కొనుక్కున్న వాళ్ళ ఇల్లు కూల్చారు. కానీ అందులోనే ఉన్న మంత్రి మహేందర్ రెడ్డి ఇల్లు మాత్రం అస్సలు ఎవ్వరికీ కనబడలేదు. దానికి కూడా మీకు ఏదో లాజిక్ ఉండే ఉంటుంది అది కూడా సెలవియ్యండి చూసి తరిస్తాం. మీ చేతికి మట్టి అంటకుండా భౌతిక దాడితో కాకుండా మానసిక దాడితోనే పని అయిపోతోంది. ఇంకా మీకు కర్రీ పాయింట్ మీద, కొబ్బరి బొండం అమ్మే వాడి మీద దాడి చేయాల్సిన అవసరమే లేదు.

   ఓహ్ ఇంకో విషయం మాదీ నక్సల్ అజెండానే అని అన్న మాటలు అప్పుడే మర్చిపోయినట్టున్నారు. అయినా మీరు నక్సల్ గా ఉంటారో, రజాకార్లుగా ఉంటారో మాకెందుకు. మీకు ఎలా సౌకర్యంగా ఉంటె అలా కానీయ్యండి.

   "తెలంగాణా వాళ్ళు టెర్రరిస్టులని, నక్సలైట్లనీ, జిహాదీలని, మతొన్మాదులని తమరు ఎంతోకాలంగా సెలవిచ్చారు."
   ఎవరన్నారు ఆమాట? శ్యామలీయం గారా? ఎక్కడ అన్నారో చూపించి కాస్త పుణ్యం కట్టుకోండి బాబూ. గత కొద్ది సంవత్సరాలుగా అతివాద తెలంగాణా వాదులు AKA తెలబాన్లు, ఆంధ్రా ప్రజలపై ప్రాంతీయ విద్వేషం తో చేసిన మానసిక దాడికి మానసిక ఉగ్రవాదులు అనేది కరెక్ట్ గా సరిపోతుంది. డౌట్స్ ఏమైనా ఉంటె అడుగు నా దగ్గర దాని మీద ఒక థియరీ ఉంది తీరికగా చెప్పుకుందాం.

   Delete
  3. "తెలబాన్" లాంటి పదాలని ఈనాడు లేదా సాక్షి ఉపయోగించి ఉంటే ఆ పత్రికలు తెలంగాణాలో అమ్ముడుపోయేవా? బ్లాగులంటే తమ ఇష్టం అనుకుని అందులో అలాంటి పదాలు ఉపయోగించారు.

   Delete
 24. This comment has been removed by the author.

  ReplyDelete
 25. ఆమె మాటలు ప్రత్యక్ష సాక్షులయిన భాజపా నాయకులే విమర్శించలేదు,
  @జై గారు,
  నమో నాయకత్వంలో ని బలం గా అవతరించిన భా.జ.పా. నాయకులు, ప్రాంతీయ పార్టిల వారు చేసే వ్యాఖ్యల పై వెంటనే స్పందించరేమో! ఒక కారణం ఆమే కాష్మిర్ అంశం ప్రస్థావించటం. వారు స్పందిస్తే అది పక్కదేశాలలో, అంతర్జాతీయం గా పెద్ద వార్త అవుతుంది. అయితే బిజెపి కి మద్దత్తిచ్చే థింక్ టాంక్ వారు కవిత గారి మాటలను పట్టించుకొన్నారు. స్పందించారు.
  http://www.mid-day.com/articles/what-if-shiv-sena-had-sought-a-nativist-policy/15479188

  ReplyDelete
  Replies
  1. శ్రీరాం గారూ, కంచన్ గుప్తా గారికి భాజపాలో ఏ హోదా ఉందొ నాకు తెలీదు. Ascribing his views to BJP is like treating Prakash's word as TRS policy.

   పార్టీ తరఫున చర్చలో పాల్గొన్న ప్రతాప్ సింహా గారికి వెంటనే అభ్యంతరం చెప్పే అవకాశం ఉండింది. ఈ అవకాశాన్ని ఆయన వేరే విషయంలో వాడినట్టు స్పష్టంగా తెలుస్తుంది. For example he attacked TRS's stand on LoP saying: "Pratap Simha: If they (TRS) are so generous, they would have merged their party with the Congress. They went back on their word and they are preaching to us".

   Delete
  2. JaiGottimukkala
   ఆమె మాటలు ప్రత్యక్ష సాక్షులయిన భాజపా నాయకులే విమర్శించలేదు// అంటే బాజాపా వాళ్ళు విమర్శించలేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఊరుకోవాలా?
   చర్చలో పాల్గొన్న భాజపా ఎంపీ ప్రతాప్ సింహా అభ్యంతరం చెప్పలేదు. భాజపా కంటే ఆంధ్రోల్లకు దేశప్రేమ ఎక్కువుందా?// మిగతా వాళ్ళ దేశ భక్తి గురించి కామెంట్ చేయడానికి తమరికున్న అర్హత ఏంటో కొంచెం సెలవిస్తే బావుంటుంది.

   For example he attacked TRS's stand on LoP saying: "Pratap Simha: If they (TRS) are so generous, they would have merged their party with the Congress. They went back on their word and they are preaching to us".//
   Attacked? He stated a fact. Choose your words carefully JaiGottimukkala :) Attack is a very strong word to use in this context.

   తల నరుక్కుంటా గాని మాట తప్పను అని అన్న ఒక అవకాశ వాది ఇప్పుడు సి యం అయ్యాడు.
   When next generation kids ask 'How did Telangana form?', what will be your answer? 'Lights, Camera off, Telangana. ???'
   చరిత్ర సిగ్గుపడేలా ఒక రాష్ట్రాన్ని ఆవిష్కరించారు.
   నాకు తెలంగాణా అన్నా, రాయలసీమ అన్నా, కోస్తా అన్నా ఒక్కటే. అవి నా దేశంలో భాగాలు.
   నా స్నేహితులు కొంత మంది హైదరాబాద్ నుండి కాకినాడ వచ్చి చదువుకున్నారు. భోజన మెస్ ఓనర్లతో గోదావరి యాసలో మాట్లాడేవారు - వెటకారంగానే! మూడు నెలలు సుబ్బరంగా మెస్ లో తిని, డబ్బులు ఇవ్వకుండా నైసుగా జారుకున్నవాళ్ళు కూడా వున్నారు [ఇద్దరు వరంగల్ నుండి]. ఆ మెస్ వోనరు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళను తలుచుకుని యెంత బాధ పడ్డాడో [వాళ్ళు చాల మంచోల్లని చాల రోజులు నమ్మాడు. ఆ తరువాత మిగతా ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఏంటంటే వాళ్ళు వరంగల్ లో పార్టీ చేసుకుంటుంటే మెస్ ఒనరుకి డబ్బులు ఎగ్గొట్టటం గురించి జోకులు వేసుకున్నారని ]

   ఒక మెదక్ అబ్బాయి కూడా మర్చిపోయి, వాళ్ళ ఇంటికి వెళ్లి మనీ ఆర్డర్ చేసాడు. డబ్బు పంపిన మెదక్ అబ్బాయి అబ్బాయి గురించి ఆ మెస్ వోనరు అందరికి చెప్పాడు. మోసం చేసే వాళ్ళు, దోచుకునేవాళ్ళు, హేళన చేసే వాళ్ళు అన్ని చోట్లా వుంటారు.

   Please don’t generalize.

   Delete
  3. "చరిత్ర సిగ్గుపడేలా ఒక రాష్ట్రాన్ని ఆవిష్కరించారు."

   ఎవరు? కాంగ్రెస్ వారు కదా? నిజమే. మీతో పాటు వారిపై నన్ను కూడా కొన్ని రాళ్ళు వెయ్యనివ్వండి.

   ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కోసం తెలంగాణకు అనేక ఒప్పందాలు చేసి, ఆ చేసిన తెల్లారి నుండే ఆ కాంగ్రెస్ వారు తప్పారు చూడండి అక్కడ కూడా చరిత్ర సిగ్గు పడ్డది.

   ముల్కి విధానం చట్ట బద్ధమే అని సుప్రీం కోర్టు తిర్పునిస్తే సుప్రీం కోర్టు నిర్ణయాన్ని కాదని , ఆ తీర్పును పార్లమెంటులో మార్చిన కాంగ్రెస్ ను చూసి చరిత్ర సిగ్గు పడుతుంది

   భారత దేశ అత్యున్నత సభపై పెప్పర్ స్ప్రేలతో విరుచుకు పడి అంతర్జాతీయంగా భారతీయుల పరువు తీసిన కాంగ్రెస్ వారిని చూసి చరిత్ర సిగ్గు పడుతుంది.

   I am with you bro.

   Delete
  4. @YJs, @కిరణ్ కుమార్ కే:

   I don't see why you dislike the word "attack" but change it to "oppose" if you think it makes sense. అసలు పాయింటు అది కానే కాదు. కాంగ్రెస్ ప్రతిపక్ష నాయక హోదా అంశంలో కవిత మాటను తప్పు పెట్టిన భాజపా ఎంపీ ఆవిడ మిగిలన వ్యాఖ్యలకు అభ్యంతరం చెప్పలేదు. ఆయన చేయని రాద్దాంతం "మనవాళ్ళు" ఎందుకు చేస్తున్నట్తో?

   రాజ్యసభలో యధావిధి టెలికాస్ట్ జరిగిందని మీకు తెలీదా? ఇకపోతే రాష్ట్ర ఏర్పాటు చట్టం అంగీకారం పొందిన ఘడియలను తప్పక లైవు టెలికాస్ట్ చేయాలనే నిబంధన పెడితే 1953లొ ఆంద్ర రాష్ట్ర అవతరణ రద్దయి పీడా విరగడ అవుతుంది.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి