ప్రశ్న పంపినవారు : శ్యామలీయం


రవీంద్రభారతిలో దాశరథి 89వ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్యాంక్‌బండ్‌పై చాలా పనికిమాలిన విగ్రహాలున్నాయని అన్నారు. బళ్లారి రాఘవ ఎవరో తెలియదని, ఆయన విగ్రహం ఉందని,దాశరది వంటి గొప్పవారి విగ్రహాలు ఉండాలని అబిప్రాయపడ్డారు. తెలంగాణ సాహితీ లోకం గర్వించే విధంగా దాశరథి విగ్రహం ఏర్పాటు చేస్తామని అన్నారు. త్వరలో దాశరథి పేరిట స్మారక అవార్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ అవార్డుతో పాటు లక్షరూపాయల రివార్డు అందజేస్తామన్నారు. తెలంగాణ ముద్దు బిడ్డ దాశరథి అని కేసీఆర్ కొనాయాడారు.దాశరథి కుటుంబాన్ని ఆదుకుంటామని, ప్రభుత్వంలో వారికి తగిన పాత్ర ఇస్తామని హామీ ఇచ్చారు.

తెలుగు వన్ న్యూస్ నుండి ఈ పై వార్తను సేకరించి ఇచ్చాను.  బళ్లారి రాఘవ గా పేరొందిన తాడిపత్రి రాఘవాచార్యులు 1880 ఆగష్టులో అనంతపురం జిల్లా  తాడిపత్రి గ్రామంలో జన్మించారు. వారు సీమాంధ్రవారు కావటమే ఆయన శ్రీమాన్ కేసీఆర్‌గారి దృష్టిలో పనికిమాలిన వాడు కావటానికి కారణమా?  తెలుగుసాహిత్యంలో తగిన పాండిత్యం ఉందని అందరూ భావించే కేసీఆర్‌గారికి బళ్లారిరాఘవ ఎవరోనిజంగా తెలియదా? లేదా టాంక్‌బండ్ మీద ఉన్న సీమాంద్రప్రాంతపు మహనీయులు కానివ్వండి మరెవ్వరు కానివ్వండి తెలంగాణా వారు కాకపోతే వారు పనికిమాలిన వారని కేసీఆర్ ఎత్తిపొడుస్తున్నారా?

ఆసక్తి గలవారు ఆయన ప్రసంగభాగం  వీడియో  కూడా చూడండి.

*Republished
--------------------------------------------------------
మంచిని పం(పెం)చడానికి క్రింది లేబుల్ పై క్లిక్ చేయండి.

Post a Comment

 1. లోగడ తెలుగు పద్యసాహిత్యాభిమాని యైన ఒక తెలంగాణా బ్లాగరుగారు టాంక్‌బండ్ మీద విగ్రహాలు కూలిస్తే తప్పేమిటీ అని ఒక టపా కూడా వ్రాసారు.

  అప్పట్లో మరొక పెద్దమనిషితో కూడా వేరే సందర్భంలో ఫోన్‌లో నేను సంభాషించటం జరిగింది. ఆయన రాజకీయరంగ వారు కాదు. మనకు బ్లాగుల్లోనూ మరొక సోషల్ మీడియాలోనూ కనబడే వారు కాదు. నాతో నలభై యేళ్ళ పరిచయం. అచ్చం తెలంగాణా బిడ్డ, ఇక్కడ స్థిరపడిన సీమాంధ్రుడు కాదు. ఇదంతా ఎందుకు వివరణ ఇచ్చానంటే ఆయన కూడా టాంక్‌బండ్ మీద పెద్దల విగ్రహాలను కూల్చటం పట్ల ఆవేదన వ్యక్తం చేసారు. అలాగే ఒక అటోడ్రైవర్ కూడా చాలా చాలా తప్పుసార్ అన్నాడు దాని గురించి.

  అదంతా ఏదో అవేశంలో అప్పట్లో అల్లరిమూకలు చేసిన పొరబాటు అనుకుంటూ వచ్చాను.

  ఈ‌రోజు కేసీఆర్‌గారి మాటలు విన్నాక మనసంతా చేదు తిన్నట్లుగా ఐపోయింది.

  పాలకుల మనస్సులే ఇలా విద్వేషపూరితంగా ఉంటే సరైన -అంటే- నిష్పక్షపాతపూర్వకమైన పరిపాలన ఎలా ఆశించగలం?

  ReplyDelete
  Replies
  1. దినపత్రికలలో ఆ వార్త వచ్చిందా శ్యామలీయం గారు?

   Delete
  2. AP Today Statues on Tank Bund are useless, says KCR (Updated: Jul 22 2014 03:20 PM)

   Mirch9 KCR calls Tank Bund statues as ‘Useless’! Reads his words “There are several useless statues on the Tankbund and other chaurasthas of Hyderabad. They do not belong to our people. There is one statue of Bellary Raghava. There is also a lesson on him in school books. He is no one and there is no need to know about him”.

   Tupaki.com అవి పనికిమాలిన విగ్రహాలా

   Delete
  3. ఈ యూ-ట్యూబ్ వీడియో చూడండి, కేసీఆర్ గారి ప్రసంగం లైవ్:

   KCR on Tankbund statues and Dasaradhi

   Delete
  4. నేను ఔన్నత్యమా ఔధ్ధత్యమా అని జ్ఞానమనే వెలుగుకి సంబంధించి గాయత్రి మంత్రం లోని పవిత్రతను వారిలో ఆశించి ప్రశ్నిస్తే మీరు కూడా నన్ను తప్పు పట్టారుగా!

   Delete
  5. హరిబాబుగారూ, గాయత్రీమంత్రప్రాశస్త్యాన్ని ఏవిధంగానూ నేను అధిక్షేపణ చేయలేదండీ. ఆ చర్చలోనికి గాయత్రీమంత్రం ప్రసక్తి తీసుకొని రావటం అనవసరం అన్న అభిప్రాయం వెలిబుచ్చానంతే.

   Delete
  6. యేదేమయినా కేసీఆర్ గురించి కూడా మనం తొందరపడి ఒక నిర్నయానికి వచచసి విమర్శించదం కూడా తప్పేనేమో?మీడీయా మొదటి నుంచీ ఇలాగే వుంది!

   Delete
  7. కే.సీ.ఆర్ పట్ల మీడియా అతనిని తొక్కేయాలని చూసేమాట నిజం. తెలంగాణా ఉద్యమాన్ని కొత్త పోకడలతో ముందుకు తీసుకు పోయినమాట నిజం. తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని ముందుంచడంలో, తెలంగాణా సమాజాన్ని ఐక్యం చేయడంలో మంచి వ్యూహకర్త. అనీ పార్టీలను మంచిగానో, చెడుగానో జై తెలంగాణా అనిపించగలిగాడు. భిన్నమైన పద్ధతిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయాడు. కే.సీ.ఆర్ చెప్పేవి చాలా వాస్తవాలుంటాయి. చంద్రబాబు లాంటి వారికంటే కే.సీ.ఆర్ చాలా విషయాలలో మంచిగానే ఉంటాడు. కానీ నోటిదూల విషయం + తెలుగు ప్రజలను వేరు చేయడం దారుణంగా ఉంటుంది. తెలుగు వారు భారత్ పాకిస్థాన్ వారిలా కొట్టుకునేలా రెచ్చగొట్టడం, అదీ కావాలనే చేయడం క్షమించరాని దారుణమైన విషయం. ఎంత ఆఓచించినా ఈ విషయంలో కే.సీ.ఆర్ చేసేది చాలా చాలా ప్రమాదకరమైనది. తెలంగాణా ఏర్పాడ్డాక కూడా ఇంకా తీరు మారకపోవడం తప్పు. బహుశా ఆ వైఖరే అతనికి లాభమనుకుంటున్నాడేమో నాకు తెలిసి తీరు మార్చుకోకుంటే మొదటికే మోసం వస్తుంది. తెలంగాణా ప్రజల చైతన్యాన్ని తక్కువ అంచనా వేస్తే కే.సీ.ఆర్ దెబ్బతినడం ఖాయం. ప్రజలెప్పుడూ గొర్రెలా ఉంటారనుకోవడమంత మూర్ఖత్వం మరోటి ఉండదు. ప్రజలు ఇందిరాగాంధీ, ఎన్.టీ.ఆర్ లాంటి మాస్ లీడర్లనే ఓడించారనేది గుర్తుంచుకోవాలి. కే.సీ.ఆర్ వారిద్దరికంటే జనాకర్షణ ఉన్నవాడైతే కాదు.

   Delete
 2. Replies
  1. దాశరధి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం తప్పు కాదు. బళ్లారి పట్ల అనుచిత వ్యాఖ్యలు ముఖ్యమంత్రి స్థాయిలో చేయడం గర్హనీయమైనదే. నేనింతక్రితమే చెప్పినట్లు కే.సీ.ఆర్ ఇంకా ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేవిధంగా ఉంచాలనే చూస్తున్నారు. దానికి గొట్టిముక్కల గారు ఊహాగానాలు వేరు వాస్తవం వేరు అన్నారు. నేనూహించినది రైటేననిపిస్తోంది. జై గారు ఏమంటారో చూడాలి. ఇదయితే మంచి సాంప్రదాయం కాదు. పైగా మీడియా కాంట్రవర్సీ చేస్తుందంటున్నారు కే.సీ.ఆర్. కావాలనే కే.సీ.ఆర్ రెచ్చగొడుతున్నాడు. మీడియామీద పడడం కూడా ఎత్తుగడగానే ఉంటోంది. మీడియాలో వంకరలున్నా, తెలంగాణా కళాకారులకు జరిగిన అన్యాయం ను ఎలుగెత్తాలన్నా ఆంధ్రా కళాకారులను అవమానించడం ఇంగితమున్నవారెవరూ చేయకూడని పని.

   Delete
  2. కెసిఆర్ మాట్లాడే తీరు మారుతుందని నేను అనుకోను. ఆయన తన మాటలకు ఆంధ్రుల ప్రతిస్పందన ఎంజాయ్ చేస్తాడని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది.

   అయితే ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి: ఫలానా వ్యక్తి ఎవరో తెలీదు అనడం అవమానం కాదు. అలాగే *చాలా* పనికిమాలిన విగ్రహాలు ఉన్నాయి అంటే దానికి భుజం తడుముకోవాల్సిన అవసరం లేదు. ఫలానా విగ్రహం తాలూక వ్యక్తి పనికి మాలిన వాడంటే అవమానం కానీ గూదార్ధాలు వెతకడం ఎందుకు? Why read between lines? KCR being KCR will anyway make a more controversial statement that can be railed at in the next few days.

   Delete
  3. ఫలానా వ్యక్తి తెలీదు అనడం తప్పు కానేకాదు. ఫలానా వ్యక్తులందరు అందరికీ తెలియాల్సిన పనీ లేదు. తెలిసీ కావాలని వ్యాఖ్యానిస్తేనే దురుసుతనమవుతుంది. బళ్లారి రాఘవ గురించి చిన్నప్పుడెపుడో చదివిన గుర్తు. అది చదవకపోతే ఆ గుర్తూ రాదు. అంటే పుస్తకాలలో పాఠాలు పెట్టని తెలంగాణా గొప్ప వ్యక్తులకు అన్యాయం జరిగినట్లే కదా? నాకు చాలాకాలం వరకు కొమరం భీం గురించి తెలీదు. మహాత్మా పూలే గురించి తెలీదు. ఇప్పటికీ పూర్తిగా తెలీదు. మిగతావారి గురించి పాఠ్యాంశాలలో గొప్పగా వ్రాసినట్లు వీరిగురించి వ్రాయకపోవడం తప్పే కదా? దీనినంతా సరిచేయడం ద్వారా మాత్రమే బంగారు తెలంగాణా ఏర్పడుతుంది.(పూలె తెలంగాణావాడు కాదు) " ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలమెంతో! ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో!! అన్న దాశరధి భావగీతం గుర్తుకొస్తోంది. అన్యాయం జరిగినదానిని సరిచేసే సందర్భంలో అనుచితంగా మాట్లాడకుండమే మంచిది. అలా మాట్లాడితే జరిగిన అన్యాయం గురించిన వాదన పలచబడుతుందని నా అభిప్రాయం. అలా కాకున్నా నోరు మంచిదైతే ఊరు మంచిదంటారు కదా? ఏ విషయాన్నైనా మంచిగా చెప్పే అలవాటు పెంచుకోవడం కే.సీ.ఆర్ నేర్చుకోవాలి. క్రింద శ్రీకాంత్ చారి గారి వ్యాఖ్యలో పనికిమాలిన విగ్రహాలున్నమాట వాస్తవం అనేది చర్చ అవసరమా? నిజానికి టేంక్ బండ్ మీది విగ్రహాలలో పక్షపాతం లేదా సంపూర్ణతలేమి ఖచ్చితంగా ఉన్నది. ఇప్పటి కే.సీ.ఆర్ అప్పుడు ప్రభుత్వంలో మంత్రిగారే. ఆయన తన కుమారుడికి ఇష్టపూర్తిగా పెట్టుకున్న పేరు ఓ ఆంధ్రోడిదే. ఇప్పుడేమో ఎత్తుగడలరీత్యా కావాలనే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నాడు. టేంకు బండ్ మీద పనికిమాలిన విగ్రహాలు చాలా ఉన్నాయనేది నిజం. ముఖ్యమైనవి కాకుండా లేదా కావాలని వాటిని మరచిపోయినప్పుడు ఆవేశంలో వచ్చేమాట పనికిమాలిన అనేది. అయితే అలా వ్యాఖ్యానించకుండానే కావలసిన పని చేసుకోవడం విజ్ఞతతో కూడిన పని. ఆ సంస్కారం అవసరమైనవారు వృద్ధిపరచుకోవడమే మంచిది.

   Delete
  4. కొండలరావు గారూ, టాంకుబండు మీద విగ్రహాలు ఉండాలా ఉంటె ప్రాతిపదిక ఏమిటి అన్నది వేరే చర్చ. అలాగే కెసిఆర్ ఎలా మాట్లాడాలి అన్నది కూడా చర్చా విషయం కాదు.

   ఆయన బళ్ళారి రాఘవ గారిని పనికి మాలిన వాడిగా చిత్రీకరించాడా అన్నది ప్రస్తుత విషయం. వేర్వేరు వాక్యాలను కలిపి మీకు మీరే ఆ మాట ఊహించుకున్నారని అనిపిస్తుంది.

   మహాత్మా ఫూలే చేసిన పోరాటాలు లేదా ఆయన ఎక్కడ వారో అన్నదానితో ఈ ప్రశ్నకు అంగుళం కూడా సంబంధం లేదు.

   Delete
  5. నేనూహించుకుని చెప్పడం లేదు జై గారు. పూలే తలంగాణా వాడు కాదనే చెప్పాను. పుస్తకాలలో చరిత్రకారూలందరి చరిత్రను సమానంగా ఉంచకపోతే విద్యార్ధులకు చరిత్ర తెలుస్కుకోవడంలో లోపం ఏర్పడుతుందని ఉదాహరణగా చెప్పాను. అలా పోల్చడం వల్ల ఇక్కడ నేనేమి చెప్పదలచుకున్నానో మీకర్ధం కాలేదనిపిస్తోంది. చరిత్రను న్యాయంగా విద్యార్ధులకు బోధిస్తే అందరి గురించి తెలుస్తుంది. నిన్న కే.సీ.ఆర్ ప్రసంగం శ్యామలీయం గారు పంపిన లింకులో చూశాను. అందులో దాశరధికి జరిగిన అన్యాయం సందర్భంగా కే.సీ.ఆర్ వాడిన భాష మీదనే చర్చ హైలెట్ అయ్యింది. అంతమేరకే చూస్తే కే.సీ.ఆర్ కావాలనే రెచ్చగొట్టాలనే మాట్లాడినట్లు అర్ధం అవుతున్నది. బళ్లారి రాఘవ గురించి అతనికి తెలియదా? తెలుసు. తెలిసీ కావాలనే సొల్లు మాటలు మాటాడతాడు. దానివల్ల చర్చ పక్కదోవ పడుతుంది. దాశరధిని సమైక్య రాష్ట్రం సముచిత రీతిగా గౌరవించిందా? లేదు. కొమరం భీం విగ్రహాన్ని టేంకు బండ్ మీద ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఇలాంటివన్నీ చూసినప్పుడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణా కవులకూ, కళాకారులకు అన్యాయం జరిగినది తప్పక గుర్తుకువస్తుంది. కే.సీ.ఆర్ కూడా ఆ విషయాలను ఎలుగెత్తుతూనే ఉన్నాడు. అందుకే నేను ఆ విషయాన్ని సపరేటుగా పోస్టు ఉంచాను.

   నా ఉద్దేశం శ్యామలీయం గారు బాధ పడడంలో ఎంత అర్ధం ఉందో టేంకు బండ్ మీద ప్రస్తుతం ఉన్న విగ్రహాలకంటే ఉంచాల్సినవి కావాలనో పక్షపాతంతో మరచిపోయో ఏర్పాటుగాని తెలంగాణా ప్రముఖుల విగ్రహాలపట్ల తెలంగాణా వారికీ అంతే ఆవేదన ఉక్రోషం ఉంటాయి. తప్పక అది ప్రశ్నించినవారు విగ్రహాల ఏర్పాటు ప్రాతిపదికను తెలుసుకోవలసిన తేల్చుకోవలసిన అవసరం ఉందనే నా అభిప్రాయం. అది చర్చించకుండా ఉంతే సరయిన జవాబు రాదనే నా ఉద్దేశం. అది వేరేగా అయినా ఇక్కడైనా దీనికి డెఫినెట్‌గా రిలేటెడే అవుతుందని నా అభిప్రాయం. కే.సీ.ఆర్ ఎలా మాట్లాడాలన్నదీ ఇక్కడ రిలేటెడే. ఆయన మాట తీరు మార్చుకోవడం, మార్చుకోకపోవడం అన్నది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగత సమస్యమాత్రమే కాదు.

   Delete
  6. కొండలరావుగారూ, జైగారూ,

   టాంక్‍బండ్ మీద ఏర్పాటు చేసిన విగ్రహాలను ఏ ప్రాతిపదికన ఎన్నిక చేసారన్నది మనకు ప్రస్తుతం తెలియదు.. తెలంగాణాలో తెలుగువెలుగులు తక్కువ అనే దురభిప్రాయం నాకు లేదు. తెలంగాణాపెద్దల విగ్రహాలూ ఏర్పాబ్టు చేసి ఉంటే చాలా బాగుండేది - వివక్ష ప్రసక్తే ఉండరాదు కూడా.

   సముచిత గౌరవం నోచుకోని పెద్దలు ఎందరో తెలుగునాట! బాలాంత్రపురజనీ కాంతారావుగారికి కనీసం పద్మశ్రీ ఐనా ఇవ్వలేదు. బాపుగారికి కేవలం పద్మశ్రీ ఇవ్వటమూ ఒక గౌరవమేనా? ఇలా (తగిన)గౌరవం నోచుకోనివారిని ఎందరినో గుర్తుచేసుకోవచ్చును. అన్ని ప్రాంతాలకూ సమవివక్ష జరిగింది జాతీయస్థాయిలో.

   ముఖ్యమంత్రిస్థానం చాలా ఉన్నతమైనది. ఆ స్థానంలో ఉన్నవ్యక్తి తప్పని సరిగా సంయమనంతో హుందాగా ఉండే భావజాలమూ, భాషా వినియోగించాలి. అద్విరుధ్ధంగా ఉండటం ముమ్మాటికీ తప్పే. ఆయన రాజకీయకోణంలో రెచ్చగొట్టే కార్యక్రమంగా కాకుండా కూడా చక్కగా స్పందించగల విద్యా, అనుభవమూ ఉన్న వ్యక్తి అనటంలో నాకు సందేహం లేదు.

   Delete
  7. గతంలో ఎ ప్రాతిపదిక వాడారో అసలు ప్రాతిపదిక ఉండిందో లేదో మనకు తెలీదు. భవిష్యత్తులో అయినా ఒక ప్రాతిపదిక ప్రకారం ఉండాలన్న ప్రస్తావనకు అందరి అంగీకారం లభిస్తుందని ఆశిస్తాను.

   వివక్ష, సమ గౌరవం లాంటి విషయాలను ప్రస్తుతానికి పక్కన పెడుదాం. ఇమామ్ అలీ పేరు పెట్టుకున్న నగరంలో (అందునా వారు అమరత్వం పొందిన కర్బలా మైదానం పేరుతొ ఉన్న ప్రాంతానికి కూసింత దూరంలో) విగ్రహాలు ఉండడం సబబా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు వదిలేద్దాం.

   ఎక్కడో ఒక సముచిత స్థానంలో కొందరు గొప్పవారి విగ్రహాలు పెట్టాలనని కోరుకోవడం తప్పు కాదు. లక్షలాది మంది మహనీయులు ఉన్న మన దేశంలో కొందరిని మాత్రమె ఎంచుకోవడం అతి క్లిష్టతరం. This is why objectively defined criteria is crucial.

   "తెలంగాణా సంస్కృతిని లేదా చరిత్రను ప్రభావితం చేసిన మహనీయులు" అనే ప్రాతిపదిక వాడాలని ప్రజల ఆకాంక్ష. ఈ ప్రాతిపదిక కొందరికి నచ్చకపొవొచ్చు అది వారి ఇష్టం. అయితే దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న విగ్రహాలలో అన్నో కొన్నో (మర్యాదపూర్వకంగా) తొలిగిస్తే అభ్యంతరం ఉండకూడదు.

   Delete
  8. జైగారూ, మర్యాదాపూర్వకంగా తొలగించటం అనేది ఉద్దేశం‌ ఐన పక్షంలో మాట తీరు వేరేగా ఉండే దనుకుంటాను. కేసీఆర్‌గారి ప్రసంగాల్లో ఎప్పుడూ సీమాంద్రులను కట్టగట్టి పరుషంగా దూషించటమే కాని ఎన్నడూ‌ మర్యాదాపూర్వకంగా సంబోధించి మాట్లాడటం జరిగినది లేదు. ఆయన ధోరణి చూస్తే ఆయన తెలంగాణా భావోద్వేగతీవ్రతాజ్వాలల ఆధారంగా బండి నడిపించ దలచు కున్నట్లున్నారు కాబట్టి ఇకముందూ మాటవరస కైనా మర్యాద ఇచ్చి మాట్లాడే అవకాశమూ కనిపించదు. ఒక ఉద్యమనేతగా అయన ప్రసంగించే విధానం ఎంతదూకుడుగా నైనా ఉండి యుండనీయండి. ఒక ముఖ్యమంత్రిగా చాలా బాధ్యతారహితంగా అనిపించేలా మాట్లాడటం మాత్రం ఎంతో బాధాకరం.

   ఇకపోతే ఇంతకు ముందొక వ్యాఖ్యలో ఇక్కడ నేను నా మిత్రుని సూచన ప్రస్తావించాను. ఆయన చెప్పినట్లుగా ఈ విగ్రహాలను అడ్డుపెట్టుకొని ఆ గతించిన పెద్దలను అవమానించే పరిస్థితిని నిస్సహాయంగాఆమోదించటం‌ బదులు వాటిని వాటికి తగు గౌరవం లభించే చోటికి వీలైనంత త్వరగా తరలించటం మంచిదేనని అనిపిస్తోంది.

   అప్పుడు టాంక్‌బండ్ ఖాళీ అవుతుంది. ఆ పిమ్మట తెలంగాణాదొరతనం వారు ఏమి నిర్ణయిస్తారో ఆ జాగాలో ప్రతిష్టించటానికి అనేది కనీసం సీమాంద్రులకు సంబంధం లేని విషయం.

   Delete
  9. మాస్టారూ, ఉద్యమక్రమంలో ఏది మాట్లాడినా ఫరవాలేదన్న ప్రస్తావనను *కూడా* నేను ఒప్పుకోను. ఎప్పుడూ నోరు జారకూడదు అన్న ప్రమాణమే బెటర్.

   Delete
  10. @ శ్యామలీయం గారు. "తెలంగాణా దొరతనం వారు " ఈ పదం మీరు ఉపస్‌మ్హరించాలని మనవి. :)

   @ జై గారు, బాగుగా చెప్పారు. ఎప్పుడూ నోరుజారకుండా ఉండడం చాలా మంచిది. అనుకోకుండా జారితే వెనుకకు తీసుకోవాలి. కావాలని వాడితే వాడినవారే నష్టపోక తప్పదు.

   "తెలంగాణా సంస్క్రృతిని లేదా చరిత్రను ప్రభావితం చేసిన మహనీయులు" అనే ప్రాతిపదికన విగ్రహాల ఏర్పాటు అనేది సహజమైన సముచితమైన ఆలోచన. ప్రస్తుత విగ్రహాలలో మర్యాదపూర్వకంగా తరలించడం తప్పూ కాదు. తప్పనిసరీ కాదు. అయినా ఈ విషయంలో తప్పనిసరై తరలించితే ఆంధ్రా ప్రజలు అర్ధం చేసుకోవాలి. గతంలో వివక్ష జరిగినందున ఆ విషయాన్ని గుర్తించి, ప్రస్తుత తరుణంలోని భావోద్వేగాలను గమనంలో ఉంచుకుని వారు ఆలోచించాలి. ఆ మేరకు నచ్చజెప్పే రీతిలో కే.సీ.ఆర్ వ్యవహారం + భాషా ఉండాలి. కే.సీ.ఆర్ నిజంగా చిత్తశుద్ధితో మాట్లాడితే ప్రస్తుతం ఉన్న తెలుగు నేతలలో అందరికంటే మంచిగా ఒప్పించగలిగే రీతిలో మాట్లాడగలడు. కే.సీ.ఆర్ కు అన్నింటా ఇకపై అలా మాట్లాడాలని కోరుకుందాం.

   Delete
 3. This comment has been removed by the author.

  ReplyDelete
  Replies
  1. ఈ వార్త బీ.జే.పీ నేత హరిబాబు కవితను ఖండించినట్లు రావడం చూశాను. అయితే ఆయన కవిత అన్నారో లేదో ఏ సందర్భంలో ఎలా అన్నారో వేచి చూడాలని అన్నట్లు ఆ వార్త ఉన్నది. ఇప్పుడు కే.సీ.ఆర్ మాట్లాడిన వీడియో చూశాను శ్రీరాం గారు. ఆయన మాట్లాడినది సమంజసంగా లేదు.

   Delete
 4. నాకు రెండో ఎక్కం రాదంటే అది నా అజ్ఞానం అవుతుందేకానీ ఇంకోటికాదు. నాకు గాంధీగారి గురించి తెలియకపోతే నేను నా GKని పెంచుకొనే ప్రయత్నంచెయ్యాలేగానీ, గాంధీగారినే ఆడిపోసుకోవడం సరైనపధ్ధతికాదు.

  కొందరికి తగిన గౌరవం లభించకపోతే, ఆ అంశాన్ని లేవదీయవచ్చు. పరిస్తితిని సరిదిద్దవచ్చు. ప్రస్తుత పరిస్థికి కారకులను రాజకీయంగా ఎండగట్టవచ్చు. అంతేగానీ కేసీఆర్‌కు ఆయనెవరో తెలియకపోతే, ఇంకెవరికీకూడా తెలీదనీ, ఆయా విగ్రహాల వ్యక్తులపై నోరుపారేసుకోవడం తగనిపని.

  ReplyDelete
 5. ఒక మిత్రులు నాతో అన్నమాట, "ఏదో ఓటమిగానో‌ చిన్నతనంగానో భావించకుండా టాంక్‌బండ్‌పై నున్న పెద్దల విగ్రహాలను సీమాంద్రప్రభుత్వం తరలించి వాటికీ ఏ విజయావాడలోనో‌మరొక చోటనో ఆశ్రయం కల్పించాలి. లేకుంటే ఏదో‌ఒక రోజున వాటిని తెలంగాణాప్రభుత్వంవారే సగర్వంగా ఛిన్నాభిన్నం చేస్తే చూడవలసిన పరిస్థితి తప్పకుండా వస్తుంది."

  ప్రజల్లో అనుమానాలూ భయాందోళనలూ రేకిత్తించటం మంచిది కాదు అని కేసీఆర్‌గారికి ఎవ్వరూ సలహా ఇవ్వలేరు. నిన్ననే కాబోలు కేసీఅర్‌ను ఎవరు విమర్శించబోయినా సహించేది లేదని కొందరు నాయకులుప్రకటించారు కూడా. ఇంక ఇష్టారాజ్యమే కదా. అవకాశం దొరికిందని నిందవేస్తున్నాననుకోకపోతే, ఆయన కావాలని ఇలా మాట్లాడుతున్నారు. తెలంగాణా సెంటిమెంటు ఆధారంగానే పాలన అన్నది ఆయన విధానం కావచ్చును.

  ReplyDelete
 6. ట్యాంక్ బండ్ మీదా పనికి మాలిన విగ్రహాలున్నాయి. బళ్ళారి రాఘవ ఎవరో తెలియదు అన్నవి వేరు వేరు వాక్యాలని గ్రహించాలి.

  ట్యాంక్ బండ్ మీద కొన్ని పనికిమాలిన విగ్రహాలున్నాయన్నది నేను కూడా అంగీకరిస్తాను.

  బళ్ళారి రాఘవ, దాశరథులను పోలుస్తూ... అతనికి విగ్రహం పెట్టకపోవడం వల్ల కలిగిన ఆవేదనతో KCR అలా అని వుండవచ్చును. అయినా కూడా బళ్ళారి రాఘవ పేరు ప్రస్థావించక పోతే బాగుండేది.

  ReplyDelete
  Replies
  1. ప్రవీణ్, లిష్టు నా బ్లాగులో ఉంచాను. ఈ మొత్తం విగ్రహాల లిష్టు పరిశీలించి చూసి అందులో పనిరానివి ఏవో కాస్త చెబుతారా మాకు?

   Delete
  2. మీరు ప్రవీణ్‌ని సంబొధించినా, నన్నే ఉద్దేశించి అన్నట్టున్నారు. మచ్చుకు కొన్ని చెపుతాను.

   అబుల్ హసన్ తానీషా. ఇతను చరిత్రలో ఒరగబెట్టిందేమీ లేదు. కేవలం రామదాసు కథలో "రాముడు కలలోకి వచ్చాడు" అన్న అభూత కల్పన తప్ప.

   పోతులూరి వీరబ్రహ్మం. ఇతను రాసిన పుక్కిటి పురాణానికి ఎలాంటి శాస్త్రీయత లేదు. ఇతన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదు.

   బ్రహ్మనాయుడు. ఇతడు కేవలం ఒక కావ్యం ద్వారా వెలుగులోకి వచ్చిన వ్యక్తి. చారిత్రక ఆధారాలు శూన్యం. ట్యాంకుబండుపై విగ్రహం నిలుపవలసిన స్థాయి కాదు.

   ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే. ఇతరులు వ్యతిరేకించ వచ్చు.

   Delete
  3. మీ బ్లాగులో నేను ఒక వ్యాఖ్య (కింద చూడండి) ఉంచాను. అది అక్కడ చర్చించాలా ఇక్కడా అనేది మీరే నిర్ణయించండి.

   =========================================================
   శ్యామలీయం మాస్టారూ, ఈ వ్యక్తుల ఎంపిక ప్రాతిపదిక ఏమిటి? (ఎవరు ఎలా చేసారు కాదు)

   The relevance or otherwise of the individual should only be seen vis-a-vis the criterion.

   Delete
  4. మీ వ్యాఖ్యనూ పైని శ్రీకాంత్‍గారి వ్యాఖ్యనూ కూడా నా బ్లాగులో పబ్లిష్ చేసానండి.
   శ్రీకాంత్‍గారి వాదన సబబుగానే ఉంది.
   ఎంపికలో ప్రాతిపదిక తెలియదు నాకు.

   Delete
  5. ఎంపిక ప్రాతిపదిక సరిగా లేనిమాట వాస్తవం. ఇప్పుడు సరిచేసుకునే అవకాశం వచ్చింది. సరిచేయడమే.

   Delete
  6. అబుల్ హసన్ తానీషా. ఇతను చరిత్రలో ఒరగబెట్టిందేమీ లేదు. కేవలం రామదాసు కథలో "రాముడు కలలోకి వచ్చాడు" అన్న అభూత కల్పన తప్ప.
   >>
   అతనికి అంతకన్నా ప్రాతినిధ్యం లేదని మీరు అనేస్తే సరిపోతుందా? ముస్లిములలో పరమత సహిష్ణుత వున్న వ్యక్తి.ఇతని భార్యా సైన్యాధిపతి ముస్లిం మతాభిమానం గలవాళ్ళు అయినా ఇతను మాత్రం సౌజన్యంతోనే వున్నాడు.కలలోకి రావడం అనేది పిట్టకధ కావచ్చు గానీ రామదాసు విషయంలో పొరపాటు చేసానని అనుకుని దాన్ని సరి దిద్దుకున్న ఔన్నత్యం వుంది కదా!భార్యా సైన్యాధ్యక్షుడూ కలిసి అక్కన్న మాదన్నల పట్ల అసూయతో వాళ్లని మంత్రులుగా తప్పించి ఔరంగజేబు కు కోటలోకి ప్రవేశం కల్పిస్తే వచ్చాక భార్యను బందీ చేసి ఔరంగజేబు తన క్రూరత్వాన్ని చూపించిన చరిత్ర మీకు యేమీ చెప్పదం లేదా?

   Delete
  7. సూరనేని గారు,

   అది కేవలం నా అభిప్రాయమేనని ముందే చెప్పాను.

   ఒక వేళ మీరు చెప్పిన భాష్యాన్నే ప్రాతిపదికగా తీసుకుంటే ట్యాంక్‌బండే కాదు... మొత్తం హుసేన్ సాగర్ కూడా విగ్రహాలకు సరిపోదు.

   Delete
  8. భార్యా సైన్యాధ్యక్షుడూ కలిసి అక్కన్న మాదన్నల పట్ల అసూయతో వాళ్లని మంత్రులుగా తప్పించి ఔరంగజే
   >>
   ఈ పార్టు నాకు ఇప్పుడు గూగుల్ లో వెతుకుతుంటే యెక్కదా కనపదలేదు గానీ నేను చదివినట్టు గుర్తు. అయినా మాలిక్ ఇబ్రహీం లాంటి అతి కొద్ది మంది హిందూ మతాభిమానులన ముస్లిం పాలకుల్లో ఒకడు కదా!

   రామదాసు మా తెలంగాణా వాడు, తను కట్టించిన భద్రాచలం మాకు కావాలి అన్నారు, ఆ కధలో వచ్చే ఒక మంచి ప్రభువు పనికిమాలినవాడు అవుతాడా?

   Delete
  9. మొత్తం హుసేన్ సాగర్ కూడా విగ్రహాలకు సరిపోదు.
   8=P)
   ఇప్పటికి బోధ పడింది సత్యం! మీరు అన్ని సార్లు మావాళ్లలో ఫలాని ఆయన లేదు ఫలాని ఈయన లేడు అంటున్నప్పుడు మేము చెప్పిన జవాబూ ఇదే,అయినా మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వొచ్చింది మరి?

   Delete
  10. అక్కన్న, మాదన్నలే రామదాసుని విడిపించారని ఎం.బి.ఎస్. ప్రసాద్ గారు వ్రాసారే. ఇది తానాషా గొప్ప ఎలా అవుతుంది?

   Delete
  11. కేవలం మంత్రులు పాదుషా అనుమతి కానీ రాజముద్రతో వున్న విడుదల పత్రం కానీ లేకుండా యెలా విడిపిస్తారు?

   Delete
  12. సూరనేని గారు,

   నేనన్నది మీలాగ ప్రతి అడ్డమైన చెత్తకి భాష్యం చెప్పుకుంటూ పోతే హుస్సేన్ సాగర్ మొత్తం కూడా సరిపోదని. అంతేకానీ ఇప్పటికైన తెలంగాణా ప్రభుత్వం ఒక ప్రాతిపదిక ఏర్పాటుచేసుకొని చెత్త ఏరిపారేస్తే ఎందుకు సరిపోదూ?

   Delete
  13. అన్నా, మన రాష్ట్రంలో ఎవరికీ ఏ ప్రాతిపదిక మీద గౌరవం ఇవ్వాలి అనేది నిర్ణయిస్తే దాన్ని అమలు చేయొచ్చు. ఎన్ని ఉంచినా అన్నీ తీసినా వేరే రాష్ట్రం వారికి అభ్యంతరం ఉండదు.

   Delete
 7. "ట్యాంక్‌బండ్‌పై చాలా పనికిమాలిన విగ్రహాలున్నాయని"

  "బళ్లారి రాఘవ ఎవరో తెలియదని, ఆయన విగ్రహం ఉందని"

  ఈ రెండు మాటలను కలిపి చూస్తె బళ్ళారి రాఘవ గారిని పనికి మాలిన వాడు అన్నట్టు అనిపిస్తుందా?

  "తెలుగుసాహిత్యంలో తగిన పాండిత్యం ఉందని అందరూ భావించే కేసీఆర్‌గారికి బళ్లారిరాఘవ ఎవరోనిజంగా తెలియదా?"

  బళ్ళారి రాఘవ నాటక రచయిత, కవి కాదు. నాకు తెలిసి తెలుగు సాహిత్య బోధనలో కవిత్వానికి ఉన్న పెద్ద పీఠం నాటకాలకు లేదు. అంచేత కెసిఆర్ గారికి ఆయన తెలియక పోయినా ఆశ్చర్యం లేదు.

  ఇకపోతే కెసిఆర్ "పనికి మాలిన" అనే పదం బదులు "మన సంస్కృతితో లేదా మన చరిత్రతో సంబంధం లేని" అని ఉంటె బాగుండేది.

  ReplyDelete
 8. BSF శిబిరం దగ్గర నిలబడి జిహాద్ అని అరిస్తే మొదట్లో కొడతారు, తరువాత పిచ్చోడనుకుని వదిలేస్తారు. మీరు కె.సి.ఆర్.ని పిచ్చోడనుకి వదిలెయ్యొచ్చు కదా. అతను అన్న మాటలని ఎంఫసైజ్ చేసి దాన్నో పెద్ద వివాదంగా మారిస్తే ఏమీ రాదు.

  ReplyDelete
 9. ఒకరిని పనికిమాలినవాళ్ళు అనే ముందు చరిత్రలో మన స్థానం ఏంటో ఆలోచించుకోవాలి.లెనిన్, స్టాలిన్ లాంటి మహామహుల విగ్రహాలనే వారి స్వదేశస్థులు కూల్చేశారు. ఎందుకంటే వీరు తమ పూర్వీకుల విగ్రహాల్ని కూల్చేశారు.

  ReplyDelete
  Replies
  1. లెనిన్ ఎన్నడూ తనకి విగ్రహాలు పెట్టమని చెప్పలేదు. వ్యక్తి పూజ చెయ్యడం మార్క్సిజంకి వ్యతిరేకం కూడా. చెరువు గట్టు మీద విగ్రహాలు కూలుచినప్పుడు తెలంగాణావాదుల పక్షాన నేను కూడా మాట్లాడాను. విగ్రహాలు కూల్చివెయ్యడం వల్ల సిమెంత్, ఇనుము మాత్రమే పోతాయి కానీ ప్రాణాలు పోవు కదా అని ఒక బ్లాగ్‌లో నేను వ్యాఖ్యానించినట్టు నాకు గుర్తుంది. శ్రీశ్రీ విగ్రహాన్ని కూల్చినా మార్క్సిజంకి వచ్చే నష్టం ఏమీ లేదని శ్రీశ్రీ విగ్రహ ధ్వంశాన్ని ఉద్దేశించి అన్నాను.

   Delete
  2. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కాబట్టి విగ్రహాలని ఎవరూ కూల్చరు. అయినా విగ్రహాలకి ముళ్ళ కంచెలు, పోలీసులు, తుపాకులని కాపలా పెట్టిన రోజులు ఉండేవంటే దాని అర్థం విగ్రహాలకి ఏ శక్తీ లేదనే కదా!

   Delete
  3. ప్రవీణ్, ఎందుకూ‌ కూల్చరనుకుంటున్నారండీ?
   రామాయణం అంతా విని రాముడికి సీత యేమౌతుందని అడిగినట్లు మాట్లాడతారేం :)
   రాష్ట్రం విడివడినా, కేసీఆర్‌గారి ఆగ్రహజ్వాల అలాగే ఉండి సీమాంధ్రుల మీద. తాను పనికిమాలిన వనుకున్న విగ్రహాలకు మూడినట్లే కదా?

   Delete
  4. విగ్రహానికి పోలీసులు, తుపాకుల కాపలా ఉందంటే విగ్రహం ఏమీ చెయ్యలేదు అని కదా అర్థం. ఆ నిర్జీవ వస్తువులు ధ్వంసమైతే పోయేదేముంటుంది?

   Delete
 10. వీంద్రభారతిలో దాశరథి 89వ జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్యాంక్‌బండ్‌పై చాలా పనికిమాలిన విగ్రహాలున్నాయని అన్నారు. బళ్లారి రాఘవ ఎవరో తెలియదని, ఆయన విగ్రహం ఉందని,"
  పై వ్యాఖ్యలు కె.సి.యార్ చెయ్యడం చాలా దారుణం.ట్యాంక్ బండ్ పై పనికిమాలిన విగ్రహాలు చాలా ఉన్నాయి.బళ్లారి రాఘవ ఎవరో తెలియదని,ఆయన విగ్రహం ఉందని..అన్న మాట బళ్లారి కూడా ఒక పనికిమాలిన వాడని ఇన్ డైరెక్ట్ గా కె.సి.యార్ గారు దూషించారు.మొదటినుంచి కె.సి.యార్ కు ఆంధ్రావాళ్లంటే పడదు.ఆయన ఉన్నంతకాలం ఆంధ్రా, తెలంగాణను ఇండియా,పాకిస్తాన్ మాదిరిగా మార్చేస్తారు.

  ReplyDelete
  Replies
  1. BSF కేంప్ దగ్గర జిహాద్ అని అరిచే పిచ్చివాణ్ణి ఎలా ఇగ్నోర్ చేస్తారో, కె.సి.ఆర్.ని కూడా అలాగే ఇగ్నోర్ చెయ్యు. అతను నెలకొక వివాదాస్పద ప్రకటన చేస్తాడు. ఆ ప్రకటన గురించి సీమాంధ్రులు నెలంతా చర్చించుకుని కాలం వృథా చేసుకుంటారని తెలిసే అతను అలా చేస్తాడు. పక్కా సమైక్యవాద చానెల్ అయిన NTVకి కూడా లేని పట్టింపు ఒక సాధారణ సీమాంధ్ర పౌరునికి ఎందుకు?

   Delete
 11. http://venuvu.blogspot.in/2012/01/blog-post_31.html?m=1
  http://venuvu.blogspot.in/2011/03/blog-post.html?m=1

  ReplyDelete
  Replies
  1. thank you praveen. articles చదివాను బాగున్నాయి.

   Delete
  2. ఇది కూడా చదవండి:
   విగ్రహాలు కూల్చడం తప్పా? ( జనవరి 16, 2014 నాటి ఒక బ్లాగు టపా)

   Delete
  3. ఇప్పుడే చదివానండీ. ఆ కవితలో ఆవేదనకు అర్ధం ఉన్నా? విగ్రహాల కూల్చివేతను సమర్ధించుకోవడం తప్పని నా అభిప్రాయం శ్యామలీయం గారు. ఆవేదన ఉన్నవాడు ఏం చేసినా తప్పు లేదనడం తప్పే.

   Delete
 12. ఈ పోస్ట్ లో నాకు అందరి కామెంట్ల కన్నా నచ్చిన కామెంట్ ప్రవీణ్ . నాకున్నా inhibitions కారణం గా నేను అనలేని మాట మీరన్నందుకు థాంక్స్ ప్రవీణ్ .

  సరే ఇంతకీ ఈ చర్చ విగ్రహాల గురించి కాబట్టి నావో రెండు ముక్కలు :

  నిజం గానే టాంక్ బండ్ మీద ఎన్ని పనికిమాలిన విగ్రహాలు ఉన్నాయో , అసలు ఆ లిస్టు లో పనిమాలిన విగ్రహాలు ఎలా చేరాయో చెప్పాల్సిన బాధ్యత ముగ్గురి మీద ఉంది . ఒకటి ఎన్టీఆర్ ఆయన పోయి పైన ఉన్నారు కాబట్టి మనం కూడా అక్కడికి పోయిన రోజున అడిగి తెలుసుకుందాం . ఇహ ఇప్పుడు నిజాలు చెప్పాల్సిన భాద్యత ఇద్దరి మీదుంది . వారిద్దరూ ఎన్టీఆర్ కి రాజకీయ, సాంస్కృతిక సలహాదారులు గా వ్యవరించిన కెసిఆర్ & సినారె. ఆ లిస్టు లో ఎన్ని దిద్దుబాటులు, తీసివేతలు జరిగాయో ఎందుకో జరిగాయో చెప్పాల్సిన బాధ్యత వీరిద్దరి మీదా ఉంది .

  ఇహ వర్తమానం లోకి వస్తే ఆ ప్రాంత ప్రతిభాశాలులు, సృజనశీలులు, వైతాళికుల్ని పట్టించుకోవడం లేదని కదా తెలంగాణావాదుల వాదం! అంటే, ప్రాంతాన్ని బట్టి ప్రతిభని ఎంచే పక్షపాత ధోరణి తప్పనే కదా వారి వాదానికి అర్థం. నిజానికి తమ వాదనపై తమకే గౌరవముంటే, అదే ప్రాంతీయ దురభిమానం ఎలా తలకెక్కించుకుంటారు? సాహితీ సంపదలో భాగమైన వారికి ప్రాంతీయత ఎలా ఆపాదిస్తారు? వేరే వాళ్ళకి గౌరవం ఇవ్వటం అంటే మిగలిన వాళ్ళని అగౌరవపరచటం అనా అర్ధం?

  ఇటువంటి సాహితీ వారసత్వానికి కాపాడటానికి తెలంగాణా వారికి మనస్సు రావటం లేదేమో గానీ , ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సులు ఇంకా అంత కురచ కాలేదు . ఈ ప్రతిభా మూర్తులు లో ఎవరు తెలంగాణా , ఎవరు ఆంధ్రప్రదేశ్ అని ఎంచే ధైర్యం కానీ, విశాలమైన మనస్సు కానీ నాకు లేదు . అందుకే నా తరపున నేను పైన శ్యామలీయం గారు చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ కి తరలించే ప్రయత్నం చేయమని ఆంధ్రప్రదేశ్ CM కి రిక్వెస్ట్ చేస్తూ లెటర్ వ్రాస్తాను . శ్యామలీయం గారి లాంటివారు అదే ప్రయత్నం చేస్తే సంతోషిస్తాను .

  సంస్కృతీ వారసత్వాన్ని రాయిరప్పలుగా బావించి ఆ రాష్ట్రానికి నచ్చకపోతే తీసేయొచ్చు అని చెప్పిన మహానుభావులకి ఒక విషయం గుర్తుచేస్తాను . ప్రస్తుత హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి కూడా రాజధానే !

  ReplyDelete
  Replies
  1. శ్రావ్య గారూ!
   మీ కామెంటు బాగుందండీ. చంద్రబాబుకు లేఖ వ్రాయడమూ బాగానే ఉన్నది. ఆ ప్రయత్నం చేయండి. 10 ఏళ్లలోపైనా ఎప్పుడైనా ఉన్నవి తొలగించే బదులు అంతక్రితం అన్యాయంగా పెట్టకుండా ఉంచిన ఆ స్థాయి వారి విగ్రహాలను పెడితే సరిపోతుంది కదా?
   డెఫినెట్ గా కే.సీ.ఆర్ ఆనాడు ఎన్.టీ.ఆర్ ప్రభుత్వంలో కీలకమైనవాడిగానే ఉన్నరు కనుక ఆయనకూ ఈ తప్పిదంలో భాగం ఉన్నది. అయితే ఆంధ్రప్రదేశ్ అంతటిలో ఏ ఒక్క ప్రముఖుడినీ అగౌరవపరచకూడదు కదా? విగ్రహాల ఏర్పాటుకు ప్రాతిపదిక ఉండాలి కదా?

   Delete
  2. @ శ్యామలీయం గారు,

   ఇది చంద్రబాబు నాయుడు official ఫేస్బుక్ page (https://www.facebook.com/tdp.ncbn.official/timeline) . మీరు ఫేస్బుక్ వాడుతుంటే డైరెక్ట్ గా అక్కడే పోస్ట్ చేయండి మెసేజ్ . ఈమెయిలు id / పోస్టల్ అడ్రస్ లేటెస్ట్ వి నేను రేపు ఇక్కడ కామెంట్ లో పోస్ట్ చేస్తాను .

   Thank you శ్యామలీయం గారు , కొండలరావు గారు !

   Delete
  3. "ప్రస్తుత హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి కూడా రాజధానే !"

   Hyderabad is only administrative capital for Andhra Pradesh, nothing more. AP govt has no legal jurisdiction outside of AP offices and buildings in Hyderabad.

   Delete
  4. So what is your point here? Did I request for some legal action or what ? Do read carefully before write / reply something.

   Delete
  5. >>> వారసత్వానికి కాపాడటానికి తెలంగాణా వారికి మనస్సు రావటం లేదేమో గానీ , ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సులు ఇంకా అంత కురచ కాలేదు

   ఆహా! ఏమి మహద్భాగ్యము? సీమాంధ్రలో ఎంతమంది తెలంగాణ వైతాళికుల విగ్రహాలున్నాయండీ శ్రావ్య గారు? కాస్త వేళ్ళ మీద లెక్క బెడతారా? అలాగే తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణాలో ఉన్న సీమాంధ్రుల విగ్రహాలను మీ కంప్యూటర్‌లో లెక్కించండి. మనస్సుల కుఱచదనం అంటే ఏమిటో అప్పుడైనా అర్థం అవుతుందని ఆశిస్తాను.

   Delete
  6. "సంస్కృతీ వారసత్వాన్ని రాయిరప్పలుగా బావించి ఆ రాష్ట్రానికి నచ్చకపోతే తీసేయొచ్చు అని చెప్పిన మహానుభావులకి ఒక విషయం గుర్తుచేస్తాను . ప్రస్తుత హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి కూడా రాజధానే !"

   Hyderabad is AP's administrative capital only. If Telangana do not like a statue or something they can remove it as they wish. AP has no jurisdiction to stop it by saying it is "joint capital"

   Delete
  7. @ శ్రీకాంత్ చారి గారూ ,
   ఓహో అంతంటి మహా భాగ్యం గా అనిపించిందా మీకు ?! తప్పులేదు ఒక్కోసారి తెలియని నిజం తెలుసుకున్నప్పుడు అలాగే అనిపిస్తుంది . భలే hypothetical క్వశ్చన్ అడిగారుగా . ఎందుకు hypothetical అని అంటారేమో దానికి వివరణ ఇది . ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో గతం లో ఉమ్మడి గా వ్యవరించిన కాపిటల్ లేదు, అలాగే ఒక prestigious ప్రాజెక్ట్ అయిన tankbund మీది తెలుగు వెలుగులు అనే ప్రాజెక్ట్ అంత కన్నా లేదు . కాబట్టి మీరు ఒకసారి దేన్నీ గురించి మాట్లాడుతున్నారో ఆ విషయం సరి చూసుకోండి , ఓహో కంప్యూటర్ లో కదా అదే మీ కంప్యూటర్ లో సరి చూసుకోండి . మనసుల కురచదనం ఎప్పుడో తెలిసింది నా పై కామెంట్లో ముందే చెప్పాను నేను ఎవరు ఈ ప్రాంతం నుంచి అనేది చూడను అని .

   పొతే సీమంధ్ర? ఇదేంటి ఆంధ్రప్రదేశ్ ఆ స్టేట్ పేరు ఇది కూడా ఒకసారి చూసుకోవాలి అనుకుంటా మీరు .

   Delete
  8. @Jalandhar101

   Then why are discussing here, please go and do it what you said. I hope by then you will understand what is exactly meant by 'Joint Capital" and "Law and Order" authority.

   Delete
  9. @ కొండల రావు గారు & others ,

   నా మొదటి కామెంట్ లో 'ఇటువంటి సాహితీ వారసత్వానికి కాపాడటానికి తెలంగాణా వారికి' ఇక్కడ పొరపాటున తెలంగాణ వారికి అని generalization చేసాను . అది నా తప్పే కాకపొతే intentional గా చేసింది కాదు, కామెంట్ compose చేసేప్పుడు దొర్లిన పొరపాటు . అక్కడ ఇలా రాసి ఉండాలిసింది నేను 'ఇటువంటి సాహితీ వారసత్వానికి కాపాడటానికి కొద్ది మంది తెలంగాణా వారికి' అని . ఎవరైనా నొచ్చుకుని ఉంటె మై అపాలజీస్ !

   Delete
  10. @Sravya
   "Then why are discussing here, please go and do it what you said."

   I think we did tried that before, isn't it? You gave me a precious advise, in return I give you one. Please go back to your internet or what ever it is and read "Andhra Pradesh Reorganisation Act 2014" one more time, you will understand Andhra Pradesh jurisdiction in Hyderabad. If AP govt. has jurisdiction, you won't think to write to CBN asking him to move the statues.

   Andhra pradesh do not own anything in Telangana or Hyderabad, including the buildings from where they are operating right now.

   For your convince.

   Andhra Pradesh Reorganisation Act 2014 (Part II)
   8. (1) On and from the appointed day, for the purposes of administration of the
   common capital area, the Governor shall have special responsibility for the security of life,
   liberty and property of all those who reside in such area.
   (2) In particular, the responsibility of the Governor shall extend to matters such as law and order, internal security and security of vital installations, and management and allocation of Government buildings in the common capital area.

   Delete
  11. Hello ,

   First of all, I am pretty much aware of re-organization bill, so you don't waste your energy and time. Got it?

   Now, come to the point,

   1)
   Do know the difference agitation and Government's Law & Order control? I think you don't know for sure. Why because if you know, you wouldn't have asked like 'I think we did tried that before, isn't it?'

   If you believe that, you are capable to show your muscle power in the name of that so called Law & Order power, Please go ahead and do it. (I guess it better to read your own comment before go ahead, anyway that is up to. I have no worries.)

   Am I clear at least now? I think I am.

   2)
   No, I don't request CBN, to build any more statues in Hyderabad, In fact I don't need any. If you want one such go and ask him, he may build one for you.

   Finally
   I request you come back with some valid argument next time, otherwise it is mere time waste for both of us.

   Delete
  12. శ్రావ్య గారు,

   Hypothetical అనుకుంటున్నారా? ఎక్కడో కూచుని కామెంట్లు రాస్తే అలాగే వుంటది మరి! కాస్త ఓపిక చేసుకొని మీ ఇష్టం వచ్చిన తెలంగాణా మరియు ఆంధ్ర గ్రామాలు చెరో పది సర్వే చెయ్యండి (హైదరాబాద్ వదిలేసి). అప్పుడు తెలుస్తుంది ఎవరి విగ్రహాలు ఎక్కడున్నాయో, బయట పడతాయి మనసుల కుఱచదనాలు.

   Delete
  13. http://www.hindustantimes.com/india-news/ysr-statues-top-mahatma-s-in-ap/article1-595383.aspx

   Delete
  14. శ్రీకాంత్ చారి గారు,

   నేను ఎక్కడ కూర్చిని రాసినా ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాజధాని లేదు అన్న విషయం నిజం అయిపోదు లెండి. మన ఉక్రోషాలు కాసేపు పక్కన పెడదాం

   ఇంతకీ మీరు మాట్లాడేది ysr విగ్రహాల గురించా ? ఆ మాట ముందే చెప్పొచ్చుగా, మనమేమో సాహితీ మూర్తులు, వైతాళికులు అని మాట్లాడుతుంటే మీరు రాజకీయ నాయకుల దగ్గరికి వెళతారు అని నేను ఎలా ఊహిస్తా ? ముందు ఒక విషయం చెప్పనివ్వండి సృజనశీలులకి , కేవలం రాజకీయ నాయుకులకి చాలా తేడా ఉంది . ఎలా అంటే ఒబామా అమెరికా కి మాత్రమే ప్రెసిడెంట్ , అలాగే David Cameron బ్రిటన్ కు మాత్రమే ప్రధాని , కానీ న్యూటన్ , ఆల్బర్ట్ ఐన్స్టీన్ , విలియం షేక్ స్పియర్ , రోనాల్డ్ రాస్ , మహాత్మా గాంధి, వట్టికోట ఆళ్వార్ స్వామి, అన్నమయ్య, త్యాగరాజ స్వామి , రామదాసు, ..... వీళ్ళు స్థలం , కాలం తో సంభంధం లేకుండా ప్రపంచమంతా గౌరవించే సృజనశీలులు . తేడా ఏమన్నా అర్ధం అయ్యిందా మీకు ?

   ఇక YSR విగ్రహాల విషయానికి వస్తే, నాకు తెలిసి ఆయన రాజకీయనాయుకులు పైగా వీరి గురించి నాకు పెద్దగా తెలియదు. కానీ ఎందుకు తెలంగాణా నిండా , ఆంధ్రప్రదేశ్ నిండా విగ్రహాలు నిండి పోయి ఉన్నాయో మనం అడిగి తెలుసుకోవటానికి చాల మందే ఉన్నారు .

   ఆంధ్రప్రదేశ్ సంగతి ఆ ప్రాంత ప్రజలు చూసుకుంటారు అనుకుంటా, ఇక తెలంగాణా ప్రాంతానికి వస్తే వీరు ఆయన గురించి చెప్పగలరేమో మీకు .

   1. జగన్ ఏమన్నా అంటరాని వాడా , మేము కలిసి పని చేస్తాం అని స్నేహహస్తం చాస్తున్న కెసిఆర్ గారు
   2. ysr చనిపోయినప్పుడు అత్యంత ఆర్తి తో పేపర్ తో శ్రద్ధాంజలి రాసి తమ గౌరవాన్ని తెలిపిన వేణుగోపాల్ గారు
   3. ఇప్పుడు తెరాస MLA అనుకుంటా శ్రీమతి కొండా సురేఖ గారు.

   వారి నుంచి ఆసక్తికరమైన విషయాలు తెలిస్తే ఇక్కడ కూడా చెప్పండి మేము కూడా తెలుసుకుంటాం . Btw Thanks in advance.

   Delete
  15. శ్రావ్య గారు,

   మీరు చర్చించే అంశం మీద నిలబడితే మంచిది.

   మీరన్న విషయం ఇది...

   >>> వారసత్వానికి కాపాడటానికి తెలంగాణా వారికి మనస్సు రావటం లేదేమో గానీ , ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సులు ఇంకా అంత కురచ కాలేదు

   మీరు కుఱచదనం గురించి మాట్లాడినప్పుడు తెలంగాణాలో వున్న సీమాంధ్రుల విగ్రహాలకు ఉదాహరణగా రాజశేఖర్ రెడ్డి విగ్రహాల గురించి చెప్పాను నేను. ఒక్క రాజశేఖర్ రెడ్డీ ఏమిటి NTR, పొట్టిశ్రీరాములు, LV ప్రసాద్, సంజీవయ్య, అల్లూరి, ప్రకాశం లాంటి ఏంతో మంది ఆంధ్రుల విగ్రహాలు కేవలం ట్యాంక్ బండ్ మీదే కాదు తెలంగాణా మొత్తంగా కనిపిస్తాయి. వారందరూ కూడా రాజశేకర్ రెడ్డి సమానులే నంటారా?

   అంతెందుకు? 369 మంది తెలంగాణా బిడ్డలను పొట్టన బెట్టుకున్న నరరూప రాక్షసుడి విగ్రహం కూడా తెలంగాణా నడిబొడ్డున బోర విరుచుకుని ఇంకా నిలబడే వుంది. ఎవరి కుఱచదనం, ఇంకెవరి హృదయ వైశాల్యం గురించి మాట్లాడుతున్నారు మీరు?

   మీరు ఎంత ప్రయత్నించినా సీమాంధ్రుల ఔన్నత్యాన్ని గాని ఔదార్యాన్నిగానీ నిరూపించలేరు. "ఆయనే వుంటే" అన్న సామెతగా అవే వుంటే విభజన వరకూ ఎండుకు దారితీస్తుంది?

   >>>1. జగన్ ఏమన్నా అంటరాని వాడా , మేము కలిసి పని చేస్తాం అని స్నేహహస్తం చాస్తున్న కెసిఆర్ గారు

   అది ఎవరి హృదయ వైశాల్యాన్ని సూచిస్తుందో?

   >>>వీళ్ళు స్థలం , కాలం తో సంభంధం లేకుండా ప్రపంచమంతా గౌరవించే సృజనశీలులు . తేడా ఏమన్నా అర్ధం అయ్యిందా మీకు ?

   అర్థం కావలసింది మీకు. మీరు ఎన్ని కప్పదాట్లు వేసినా... చివరికి అర్థం చేసుకోవలసింది ఒకటే. మీరు ఆంధ్రా రాయలసీమల లోని మొత్తం పదమూడు జిల్లాలు భూతద్దంతో వెతికినా తెలంగాణాలోని పది జిల్లాలలో వున్న సీమాంధ్రుల విగ్రహాల్లో ఒక శాతం కూడా చూపలేరు. దీనికై మీరు హైదరాబాదుని మినహాయించినా నాకు అభ్యంతరం లేదు. అందుకోసం ప్రాతిపదికగా మూరు సృజనశీలులనే తీసుకుంటారో, వైతాళికులనే తీసుకుంటారో, ఇంకేదైనా కొత్త criteria కనిపెడతారో మీ ఇష్టం.

   Delete
  16. శ్రీకాంత్ చారి గారు ,

   నేను రాసిన అ దానిలో అసలు ముక్క తీసేసి మీకు కావాల్సినది పట్టుకొచ్చి విడిగా మాట్లాడుతున్నారేంటి ? పైగా నామీద అపవాదు కప్పదాట్లు అని . నేను రాసినది 'సాహితీ వారసత్వానికి' . నేను కాదు టాపిక్ నుంచి పక్కకు మళ్ళింది మీరు . ఒక్కసారి చూడండి పోస్ట్ నుంచి కామెంట్ల వరకు ఎవరు కప్పదాట్లు వేస్తున్నారో , టాపిక్ మారుస్తున్నారో .
   ఏమి పర్లేదు నేనూ ఇక్కడే ఉంటా, మీరూ ఇక్కడే ఉంటారు మళ్ళీ ఒక్కసారి నాపోస్ట్, మీ కామెంట్లు సరిచూసుకోండి . విగ్రహాల విషయం కొస్తే అదే మాట మీద నిలబడతా నేను . ఇక్కడ ఖచ్చితం గా ఎక్కడో టాపిక్ తీసుకుని వచ్చి మాట్లాడుతుంది మీరు .

   ఇహ మీరేదో కెసిఆర్ , జగన్ ని మెచ్చుకోవటం హృదయ వైశాల్యం అన్తున్నరు. అయి ఉండొచ్చు, నేను మిమ్మల్ని తప్పు పట్టటం లేదు . మరి అంత హృదయ వైశాల్యం ఉన్న వారు అయిన కెసిఆర్ ని అడగక ఇక్కడకి వచ్చి మమల్ని అడుతారేమి ? ఇక్కడ మాట్లాడుతుంది వేరే విషయం అయితే ?

   భలే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ హృదయ వైశాల్యం నేనెందుకు నిరూపించలేను , మీరు సరిగా చూడాలే గానీ. ఇప్పుడు సడన్ గా తెలంగాణా ముద్దుబిడ్డ అని చెబుతున్నారు చూడండి PV నరసింహారావు గారిని , ఆయన్ని మీరు ముందు తెలుగువారి గా గౌరవించి పోటీ అంటూ లేకుండా పార్లమెంట్ కి పంపినది ఏ ప్రాంతమో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి . అలాగే కొమరం భీమ్ అని ఉద్యమ సమయంలో మాట్లాడి , ఆ తరవాత ఆయన వ్యతిరేకించిన పాలనే మాకు rosy బెడ్ అని చెబుతున్నారే ఆయన విగ్రహం నెల్లూరు లో ఉంది . అది తెలుసా మీకు ? అది కూడా హాడావుడి గా ఉద్యమ కాలం లో నిర్మించినది కాదు . R . నారాయణ మూర్తి గారు ఎక్కడి వారో తెలుసా మీకు ? రాములమ్మ - పూర్తి తెలంగాణా ప్రాంత బాక్గ్రౌండ్ తో తీసిన సినిమా ఎవరు తీసారో తెలుసా ?

   ఇలా చాలా చెప్పగలను నేను ? సరైన దృష్టి తో చూసి ఒప్పుకోవాలి గాని .

   నేను మళ్ళీ చెబుతున్నాను రాజకేయానాయుకుల విగ్రహాల ప్రస్తావన ఇందులో కలపకండి దయచేసి.

   Delete
  17. This comment has been removed by the author.

   Delete
  18. @శ్రీకాంత్ చారి,
   //మీరు ఎంత ప్రయత్నించినా సీమాంధ్రుల ఔన్నత్యాన్ని గాని ఔదార్యాన్నిగానీ నిరూపించలేరు. "ఆయనే వుంటే" అన్న సామెతగా అవే వుంటే విభజన వరకూ ఎండుకు దారితీస్తుంది?//

   తెలంగానా వారి విగ్రహాలను మేము కలిగి ఉంటేనే మాకు ఔన్నత్యమూ, ఆఉదార్యమూ ఉన్నట్లని మీరు ఆయా పదాలకు కొత్త అర్థాన్ని ఇస్తే మేము చేయగలిగింది ఏమీ లేదు కానీ, తమకు మేలు చేసినవాన్ని, అభిమానం ఆధరణ చూపిన వాన్ని గుండెల్లో పెట్టుకోవడం అనే అర్థాన్ని ఇస్తే మాత్రం ... సీమాంధ్రుల ఔధార్యానికి బోలెడన్ని ఉదాహరణలు చూపించగలం. మచ్చుకు ఓ ఇద్దరి పేర్లు ఇక్కడిస్తాను చూడండి..

   తెల్లోల్లు భారతీయులను బానిసల్లా చూశారు అన్నది మనకందరికీ తెలిసిన విషయమే. కానీ, ఆ తెల్లోల్లలో ఇద్దరు మాత్రం బోలెడంత గౌరవాన్ని పొందారు సీమాంధ్రలో...

   ఒకరు సర్ ఆర్థర్ కాటన్, రెండో ఆయన సి.పీ బ్రౌన్.

   Rajahmundry and Arthur Cotton
   http://reflectiveindian.wordpress.com/2013/01/16/rajahmundry-and-arthur-cotton/

   Sir Arthur Cotton remains revered in coastal Andhra Pradesh. His efforts are recognised as having transformed the economy and society of modern day Godavari and Krishna districts. Approximately 3,000 statues of him adorn these districts. In 1982, a new dam built upstream from the Dowleswaram barrage on the Godavari was named after Sir Cotton by the then President of India.

   Irrigation offices in this delta area remember Sir Cotton by putting a photograph and a poem dedicated to the great engineer under it.

   దాదాపుగా 3,000 విగ్రహాలున్నాయట గోదావరి, క్రిష్ణా జిల్లాలలో. ఆయన్ను అపర భగీరదుడు అని కీర్తిస్తున్నారు ఇప్పటికూడా..!! ఆనకట్టలకు కూడా ఆయన పేర్లు పెట్టుకున్నారు. మనల్ని బానిసలుగా చుసిన వారిలో కూడా మంచి తనం ఉంటే .. గుండెల్లో పెట్టుకునే మనస్సున్న వారు ఆంధ్రాలో ఉన్నారని చెప్పడానికి ఇంతకన్నా పెద్ద ఋజువులు కావాలా మాష్టారూ?

   పోలవరం ప్రాజెక్టు కూడా ఈ అపర భగీరధుని మదిలో ఉండేదని చెబుతున్నారిప్పుడు.
   The ‘Apara Bhageeratha’ envisaged Polavaram long time back, say officials

   http://www.hindu.com/2008/05/15/stories/2008051552750300.htm

   మరోకాయన, సీ.పీ బ్రౌన్, ముద్దుగా బ్రౌను దొర అని పిలుచుకుంటారాయన్ని. ఆయనంటే కడప ప్రజలకు వల్లమాలిన అభిమానం. ఆయన పేరు మీదుగా గ్రంధాలయం కూడా ఉన్నాయి (విగ్రహాలేం ఖర్మ) కడపలో. ఆయన కూడా తెల్లదొరే. కానీ, ఆయన తెలుగుకు చేసిన మేలు, కడప ప్రజలపై చూపిన అభిమానం ఆయన్ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకుని గౌరవించేలా చేశాయి.

   To perpetuate the memory of C.P Brown, Savanth of Telugu Literature, a Library building was constructed at Cuddapah on the very site of Brown's Bungalow known in those days as Brown's College.

   http://kadapa.ap.nic.in/cp_brown.htm
   http://wikimapia.org/13181853/C-P-Brown-Library-Yerramullapalli

   ఇంత కంటే ఏమి కావాలండి, సీమాంధ్రుల మనస్సును తెలియ జెప్పడానికి??

   Delete
  19. శ్రావ్య గారు,

   సాహితీ వారసులని అన్నారా? నేను జరుగుతున్న చర్చను బట్టి అందరూ అనుకున్నాను లెండి. నా పొరబాటును ఒప్పుకుంటాను. ఇప్పుడు మళ్ళీ పేస్టు చేస్తున్నాను.

   >>> ఇటువంటి సాహితీ వారసత్వానికి కాపాడటానికి తెలంగాణా వారికి మనస్సు రావటం లేదేమో గానీ , ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సులు ఇంకా అంత కురచ కాలేదు

   సరిపోయిందిగా? మీరు "ఇంకా అంత కురచ కాలేదు" అనడంలోని ఉద్దేశం ఏమిటి? చెప్పండి ఏ సాహితీ మూర్తులను తెలంగాణా భరించలేక పోతుంది? ఇప్పటివరకు ఎంతమంది తెలంగాణా సాహితీ మూర్తులను సీమాంధ్ర అక్కున చేర్చుకొని విగ్రహాలు పెట్టి పూజలు చేసింది?

   Delete
  20. Sri kanth గారు,

   సీమాంధ్రుల మనసులు గొప్పవా కాదా అన్నది నేను అనలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సులు ఇంకా "అంత" కురచ కాలేదు... అంటూ తెలంగాణాను అన్యాపదేశంగా పోలుస్తూ అన్న మాటలకు సమాధానంగా వారు ఎంత ప్రయత్నించినా సీమాంధ్ర వారు తెలంగాణా వారికంటే ఎక్కువ అని చెప్పలేరు అని చెప్పడమే నా ఉద్దేశం. తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు.

   Delete
  21. అయినా ట్యాంకు బండు మీద విగ్రహాలు ఎందుకు పెట్టారు? రాజకీయాల కోసమా? కాదే? వివిధ రంగాలలో విశిష్ట సేవలు చేసిన వారిని గౌరవార్థం అక్కడ ఉంఛారు. అక్కడే ఎఉందుకు ఉంచారు? ఏ కడపలోనే, విజయవాడలోనో ఉంచలేదెందుకు? ఎందుకంటే .. ట్యాంకు బండు హైదరాబాదులో ఉంది, అది(హైదరాబాద్) ఒకప్పటి ఉమ్మడి రాష్ట్ర రాజధాని కాబట్టి, ఉమ్మడి రాష్ట్రములోని ప్రసిద్ద వ్యక్తులను కొంత మంది విగ్రహాలు అక్కడ పెట్టారు. దానిపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. అక్కడున్న విగ్రహాలేవీ పరాయి విగ్రహాలు కాదు అప్పుడు..!! వారందరూ గౌరవించ దగ్గ వ్యక్తులే. అక్కడున్న వారిలో రాష్ట్రానికి స్థాయిలో తమ సేవలు అందించిన వారు, కొంత మందైతే రాష్ట్రం, దేశం అనే పట్టింపులేమీ లేకుండ తమ సేవలు అందించిన వారే. అలాంటి వారికి, ప్రస్తుతం రాజకీయ సెగలు తగలడం శోచనీయం. విగ్రహాలు తొలగించినా వచ్చిన నష్టమేమీలేదు, కానీ వాటిని ద్వంసం చేయడం, మన సంస్కృతికి చెందినవి కాదనడం దారుణం.

   ఒకప్పుడు బమియాన్ బుద్ద విగ్రహాలను ఆఫ్ఘనులో నాశణం చేశారు. తమ సంస్కృతి కాడని. దాని వల్ల చాలా మనసులు నొచ్చుకున్నాయి. అవి విగ్రహాలే కానీ, వాటితో కొంత మందికి సాంస్కృతిక, మతపరమైన అనుబంధాలు ఉన్నాయి. కాబట్టే వాటిని కూల్చితే బాధనిపించింది. ప్రస్తుతం ట్యాంకు బండు మీద ఉన్నవి కూడా విగ్రహాలే, నాశనం చేస్తే ఒక వారం లేదా నెల రోజుల్లో తయారు చేయదగ్గవే. కానీ వాటితో ఉండే మానసిక, సాంస్కృతిక అనుబంధమే ... వాటి మీద ప్రేమకు కారణం. అందుకే, వాటిని ఆంధ్ర ప్రదేష్ ప్రభుత్వానికి జాగ్రత్తగా అప్పగిస్తే చాలు అని భవిస్తున్నాను నేను. లేదంటే గౌరవంగా వాటిని తీసేయండి, అంతే కానీ ద్వంసం చేయకండి అని మాత్రమే నేను కోరేది.

   Delete
  22. ముంబై (ఒకప్పటి బాంబే) మహారాష్ట్రలోనే ఉండాలని తేల్చి చెప్పేశారట అంబేద్కర్. తెలంగాణా వారు ఆయన చెప్పిన మాటలను బోలెడన్ని సార్లు ఉదాహరణగా చూపించారు హైదరాబాదు గురించి మాట్లాడేప్పుడు. అలాంటి అంబేద్కర్ విగ్రహాన్ని కూడా గుజరాత్ వారు ద్వంసం చేస్తున్నట్టు ఎక్కడా చదవలేదు. ఒకప్పుడు ఏమన్నా కొంత వ్యతిరేకత ఉంటే ఉండి ఉండొచ్చు. కానీ, అంబేద్కర్ అంతే గుజరాత్ వారికి కూడా గౌరవమే. అలాంటిది, ప్రస్తుతం రాష్ట్ర విభజనతో బీర పీచు సంబందం కూడాలేని కొంత మంది విగ్రహాలను అగౌరవ పరచడం ఎంత వరకు సబబు? "పనికి మాలిన విగ్రహాలు అనడం" ఎంత వరకు న్యాయం అని ఆలోచించాలని బ్లాగర్లకు విఙ్ఞప్తి చేస్తున్నాను.

   Delete
  23. మీరు "ఇంకా అంత కురచ కాలేదు" అనడంలోని ఉద్దేశం ఏమిటి? చెప్పండి ఏ సాహితీ మూర్తులను తెలంగాణా భరించలేక పోతుంది? ఇప్పటివరకు ఎంతమంది తెలంగాణా సాహితీ మూర్తులను సీమాంధ్ర అక్కున చేర్చుకొని విగ్రహాలు పెట్టి పూజలు చేసింది?
   -----------------------------------------
   కురచ కాలేదు అని చెప్పటం లో నా ఉద్దేశ్యం ఒక్కటే . ఉమ్మడి రాష్ట్రం అయినా, ఇప్పుడు ప్రత్యెక రాష్ట్రం ఈ విగ్రహాల గురించి కూడా గురించి ఆంధ్రప్రదేశ్ హేళన చేసే ప్రకటనలు చెయలెదు. అవి 'పనికి మాలినవి ' అనలేదు . పైగా కమిటీ ఉన్న తమ ప్రాంతం వాళ్ళని వదిలేసి వేరే ప్రాంతం వాళ్ళు చేసిన దారణం గా ప్రోజెక్ట్ చేయలేదు . నా ఉద్దేశ్యం అర్ధమయిందా మీకు ?

   Delete
  24. మీరు "తెలంగాణా వారికి మనస్సు రావటం లేదేమో గానీ , ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్సులు ఇంకా అంత కురచ కాలేదు" అని పలుకుతూ తెలంగాణా వారి మనసులు "కుఱచ" అని ఎలా అన్యాపదేశంగా చెప్పగలిగారో, ఆయనా కొన్ని విగ్రహాలు "పనికి మాలినవి" అని చెప్పి వుంటారు. మీరు మాట్లాడిన దానికన్నా ఆయన మాట్లాడిన భాషే కొంత సవ్యంగా వుంది. "అర్థమయ్యిందా" మీకు?

   Delete
  25. వావ్ ! నిజంగానా ? అయితే పర్లేదు నేనే ఒప్పుకుంటా ఆయన భాష కన్నా నాది అపసవ్యం అని .ఎందుకంటే ఆయన స్థాయి తో పోటీ పడి మాట్లాడగలిగే నైపుణ్యం నాకు లేదు . ఇది నిజం ! ఈ మాట ఇప్పుడేంటి ఇంతకు ముందు చాలా సార్లే చెప్పా మళ్ళీ అమ్మో ఆయనతో పోటీ పడే నైపుణ్యం నాకు లేదు . పొతే పైన కామెంట్లు అన్నీ మళ్ళీ ఒక్కసారి చదువుకోండి ఎవరో ఇంతకు ముందు చేసాం, ఇప్పుడు కూడా చేస్తాం అని చెబుతున్నారు ఆ స్థాయి లో మాట్లాడే నైపుణ్యం కూడా నాకు లేదు .

   Delete
  26. ఇప్పుడు నేను రెండు smilies పెడితే బావుంటుందా, ఉహు మూడు ... మరి మూడేనా ఒక పది ? అబ్బే పది మరీ తక్కువ ... సరేలెండి ఎన్నో కొన్ని smilies . (అంటే, ఆ స్మైలీ ఎందుకో అర్ధం కాని కన్ఫ్యూషన్ లోంచి వచ్చిన కామెంట్ ఇది,, ఇంకే దురేద్దేశ్యం లేదు )

   Delete
  27. చెప్పేదేమీ లేక నవ్వానండీ, అంతే. స్మైలీలంటారా... మీ ఇష్టం వచ్చినన్ని పెట్టుకొండి, కొండలరావు గారు ఒప్పుకుంటే!

   Delete
  28. @Sravya

   1) First of all, I am pretty much know difference between agitation and Govt. Law and Order. You gave me a provoking statement, so I gave you another fitting one. It burns, I know, both are meaningless. Let's stick to the original argument.

   2) I do not know why you are in 'attacking mode' from the beginning? All I said was AP govt has no jurisdiction in Hyderabad. I was simply trying to explain the Law, but I am not showing enmity towards you or AP. If you don't agree with my statment, please debate. Useless challenging, provoking wont help you winning your argument. I love to remind your own statement "అకారణమైన ద్వేషం పెంచుకుని అదేపనిగా ప్రతి దాన్ని నెగటివ్ టోన్ లో చూడటం అనేది అంత మంచి పద్దతి కాదు"

   3) You wrote "I request you come back with some valid argument next time"

   Should I laugh? I think it is not a joke, right? I gave you snippets from "Andhra Pradesh Re-organisation Act 2014" to back my statement, where is your's?

   4) I guess this time you will come back with some evidence to back your statement, so I can withdraw my original statement.

   Delete
 13. శ్యావ్యగారూ, మీ అభిప్రాయాలు అవశ్యం అబినందనీయం. సీమాంధ్రా ముఖ్యమంతిగారికి లేఖవ్రాయటంతో సహా. ఐతే ఆయనకు ఒక లేఖవ్రాయాలంటే ఆయన ఇ-మెయిల్ గాని చిరునామాగాని ఉంటే బాగుంటుంది. అవి రెండూ నాదగ్గర లేవు. మీరు దయచేసి వివరం ఇవ్వగలిగితే తప్పకుండా అలా చేయటానికి నేను సిథ్థం.

  ReplyDelete
  Replies
  1. Emails are read by secretariat workers but not by ministers.

   Delete
  2. మీరే ఏదో మంచి ఉపాయం చెప్పి పుణ్యం కట్టుకోండి ప్రవీణ్. (మీ విగ్రహం పెట్టించనని వాగ్దానం చేస్తున్నాను.)

   Delete
  3. విగ్రహాల ఏర్పాటుకు మన ప్రవీణ్ వ్యతిరేకం సర్.

   Delete
 14. నాకు అర్ధంకాని విషయం ఒక్కటే! తెలంగాణా సాంస్కృతిక, సాహిత్య, సారస్వత వారసులను చిన్నబుచ్చేవిధంగా ఆంధ్రులు వివక్ష చూపించారంటున్నారు. దాదాపు రెండు దశాబ్దాలు ఉద్యమానికి నేతృత్వం వహించిన తె.రా.స. ప్రజలను చైతన్యపరచేవిధంగా తెలంగాణా మహాత్ముల విగ్రహాలు ఎందుకు కట్టించలేదు? ఇదంతా దేనికి, తెలంగాణా ఉద్యమంలో మేధోపరంగా కె.సి.ఆర్.కు వెన్నుదన్నుగా నిలచి కీర్తిశేషుడైన ప్రొఫెసర్ జయశంకర్‌గారికి తె.రా.స. ఇచ్చిన గౌరవం ఏపాటిది? ఓ జంతు ప్రదర్శనశాలకు ఆయన పేరు పెట్టటమా! ఎవరో, ఎప్పుడో, ఏదో చేయలేదని పళ్ళునూరటం దేనికి?

  ReplyDelete
 15. బళ్ళారి రాఘవ ఎవరో తనకి తెలియదని కె.సి.ఆర్. అనడం తప్పే కానీ 58 ఏళ్ళ పాలనలో సమైక్యవాద ప్రభుత్వం దాసరథిని ఎన్నడూ పట్టించుకోలేదనేది నిజం కాదా?

  ReplyDelete
  Replies
  1. మంచిగా చెప్పారు ప్రవీణ్ మీ వాదనతో ఏకీభవిస్తున్నాను.

   Delete
  2. ప్రవీణ్ః 58 ఏళ్ళ పాలనలో సమైక్యవాద ప్రభుత్వం దాశరథిని ఎన్నడూ పట్టించుకోలేదనేది నిజం కాదా?

   అది నిజం కాదండీ ప్రవీణ్. శ్రీదాశరథి కృష్ణమాచార్యగారు ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేసారు. ఆయన విగ్రహం ఏర్పాటు చేయకపోవటమో స్మారకచిహ్నం ఏర్పాటు చేయకపోవటమో గురించి ఐతే చెప్పలేను కారణాలు.

   Delete
  3. మీ వివరణకు ధన్యవాదములు శ్యామలీయం గారు. ఆయన విగ్రహం కూడా పెట్టి ఉంటే బాగుండేది.

   Delete
  4. శ్యామలీయం మాస్టారూ, ఎన్టీఆర్ ఆస్థాన కవి పదవిని "ఒక్క సంతకంతో" రద్దు చేసినప్పుడు డా. దాశరధి అనుమానం ఫీల్ అయ్యారు. తనతో ఒక్క మాట చెప్పకుండా ఉన్నఫళంగా వెళ్ళగొట్టారని చాలా నొచ్చుకున్నారు. నాకు తెలిసి కెసిఆర్ ఉదహరించిన అన్యాయం ఇదే.

   Delete
  5. Here is the answer for you Praveen.
   http://telugu.greatandhra.com/articles/special-articles/tank-bund-vigrahala-pai-54390.html

   Delete
  6. వైజాగ్ బీచ్ రోద్‌లో ఒక్క తెలంగాణా నాయకుని విగ్రహం కూడా లేదు.

   Delete
  7. జైగారూ, శ్రీఎన్‌టీఅర్‌గారి ఆ చర్యను అవమానంగాభావించి మంగళంపల్లివారూ నొచ్చుకున్నారు చాలా తీవ్రంగా. ఇక్కడ కేవలం దాశరథిగారిని ఒక తెలంగాణావాడన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రియైన రామారావుగారు ప్రత్యేకంగా వివక్షచూపి చేసిన అవమానం ఏమీ లేదు. ఆయన ఆస్థాన కళాకరుల పదవులు ఫ్యూడలిష్టిక్ అనుకున్నారో ఏమో రద్దుచేసారు. అది వేరే సంగతి.

   Delete
  8. ప్రవీణ్ వైజాగ్ ఉమ్మడి రాష్ట్రం లో రాజధాని నగరమా ? నాకు తెలియదు ఇంతవరకూ మరి . హైదరాబాద్ లో hitech సిటీ ఉంది , hitex ఉంది , శిల్పారామం ఉంది , imax ధియేటర్ ఉంది , మీ ప్రాంతమే అనుకుంటా సుబ్బిరామిరెడ్డి ఆయన రెన్యూ చేయించిన తెలుగు కళా తోరణం ఉంది ..... అలాగే తెలుగు వెలుగుల నిక్షిప్త కళా ప్రాంగణం కూడా అక్కడ విగ్రహాలు ఉన్నాయి . దీనిలో మీరు ఒక్క విగ్రహాలు అడగటం లో లాజిక్ ఏంటి నాకు అర్ధం కావటం లేదు .

   అలాగే రేపో మాపో ఆంధ్రప్రదేశ్ కి రాజధాని వస్తే ఇలాంటి ప్రాజెక్ట్ వస్తే తప్పక సజెస్ట్ చేయొచ్చు అది ఏ ప్రాంతానికి చెందిన వారిదైనా , అందులో ఎవరికీ అభ్యంతరం ఉండదు . ఇప్పుడు లేదూ మీరు చెప్పటం ఏంటో నాకు అర్ధం కావటం లేదు . అకారణమైన ద్వేషం పెంచుకుని అదేపనిగా ప్రతి దాన్ని నెగటివ్ టోన్ లో చూడటం అనేది అంత మంచి పద్దతి కాదు . మీరు ఎటూ ఎవరి మాట వినరు మీ ఎనర్జీ ని ఇలానే వాడతారు కాబట్టి నేను ఈ కామెంట్ రాయటం అనవసరం అని కూడా నాకు తెలుసు . ఇక ఉంటాను .

   Delete
  9. ఇది మరీ బాగుంది! ఉమ్మడి రాజధాని నగరం లోనే ఉమ్మడి విగ్రహాలుండాలన్న మాట! అంటే రాజధాని కాక మిగతా తెలంగాణా ప్రాంతం లోని ఉమ్మడి విగ్రహాలూ, ఇప్పుడు కేవలం అడ్మినిస్ట్రషను రాజధానే కాబట్టి హైద్రాబాదులోని ఉమ్మడి విగ్రహాలు ఇకపై ఉండనవసరం లేదన్న మాట!

   Delete
  10. @ శ్రీకాంతాచారి
   ఏంటి ఈ డొంక తిరుగుడు వాదన. హైదరాబాద్ రాజధాని కాబట్టి ఆ ప్రాజెక్ట్ చేపట్టారు అంటే, వేరే చోట పెట్టకూడదా అంటే పెట్టుకోవచ్చు. వేరే చోట పెట్టి ఉంటే తెలంగాణా లో ఎందుకు పెట్టలేదు, ఇంత వివక్షా అని ఏడిచే వాళ్ళు. ప్రతీ దానికీ ఏడుపేనా. ఇన్ని రోజులు ట్యాంక్ బండ్ కూడా ఒక అసెట్ హైదరాబాద్ కి. చివరికి దానిని కూడా వివాదాస్పదం చేయడం ఏంటి. Grow up guys. It seems pretty silly and stupid.

   Delete
  11. Vizag beach road is a host for many idols. Therefore I've proposed the installation of idols of Telangana leaders. The state has been bifurcated but the Telugu linguistic group still exists.

   Delete
 16. This comment has been removed by the author.

  ReplyDelete
  Replies
  1. శ్రీరామ్‌గారూ రాఘవగారి గురించి మంచి విషయాలు ప్రస్తావించారు. ఇందులో కొన్ని నాకూ తెలియవు! ఇంకా అనేక మందికీ సరిగా తెలియకపోయినా ఆశ్చర్యం లేదు. ఈ సంగతులు అందరూ తెలుసుకోవాలి, వేర్పాటువాదులు గుర్తించాలి అన్న ప్రసక్తి ప్రత్యేకంగా అవసరం అనుకోను.

   ఒక వేళ కేసీఆర్‌గారు పొరబటున యదాలాపంగా రాఘవగారి గురించి అన్నమాటలో తప్పుడు అర్థాలు ధ్వనించాయేమో అన్న అనుమానంతో ఆ వీడియో క్లిప్పింగుని మరలా పరిశీలించాను. ఐతే అటువంటు అపోహ అవసరం లేదు. ఆయన చాలా హేళనా పూర్వకంగానే బళ్ళారి రాఘవ గారిని ప్రస్తావించారు. కాని అది ఆయన వ్యక్తిగతమైన దూకుడు ధోరణి - ఎప్పుడూ ఉన్నదే. కొత్తేమీ‌ లేదు. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సంయమనమూ బాద్యతా లేకుండా మాట్లాడటం బాధాకరం. కాని వేర్పాటువాదులైనంత మాత్రాన అందరూ అలా అవహేళనాపూర్వకమైన పధ్ధతిలో ప్రవర్తిస్తారనీ అనుకోనవుసరం లేదు. కేసీఅర్ గారి ధోరణిమాత్రం అవహేళనను పెంచిపోషించేదిగా ఉందన్నది నిర్వివాదం. ఇది ఇరుప్రాంతాలకూ చెరుపు చేస్తుంది!

   Delete
 17. కొండలరావుగారూ,
  ఇప్పటికే చాలా చర్చ నడిచింది. ఇక దీన్ని ముగించటం బాగుంటుందేమో పరిశీలించండి. నూటికిపైగా ఉన్న కామెంట్లకు కొత్తవి ఎవరు జోడించినా వెదికి చదువుకోవటమూ ఇబ్బందే కొంచెం.

  ReplyDelete
 18. It is painful to wait for many comments to be loaded on my mobile. Therefore I too suggest the same. There is an option in blogger.com to disable new comments for individual posts.

  ReplyDelete
 19. శ్యామలీయం సర్, ప్రవీణ్ మీ సూచన సరైనదే. మీ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ఈ పోస్టుకు కామెంట్ డిసేబుల్ చేస్తున్నాను.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.

అవినీతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంగ్లీషు నేర్చుకుందాం ఇజం ఇంటర్వ్యూలు ఎన్నికలు కత్తెరింపులు కాంగ్రెస్ కార్యక్రమాలు కుటుంబం కృషి విద్యాలయం కొబ్బరి నీరు చట్టం చరిత్ర జనవిజయం జర్నలిజం జ్ఞాపకాలు తెలుగు వెలుగు తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేర్చుకుందాం పరిపాలన పర్యావరణం పల్లెప్రపంచం పిల్లల పెంపకం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రముఖులు భారతీయం భాష మతం మనం మారగలం మహిళ మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మీరేమంటారు? మెదడుకు మేత మై వాయిస్ రాజకీయం రిజర్వేషన్లు వస్త్రధారణ వికాసం విగ్రహాలు విజ్ఞానం విటమిన్ సి విద్య వినదగునెవ్వరుచెప్పిన వినోదం వీడియోలు వ్యక్తిగతం సమాజం సంస్కృతి సాంప్రదాయం సాహిత్యం సినిమా సేకరణలు
 
Top