------------------------------------------------
ప్రశ్న సంఖ్య : 19

ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------

మతం అనేది వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించినది. వివిధ మత విశ్వాసాలమధ్య ఘర్షణలు లేకుండా రాజ్య లేదా రాజకీయ విషయాలలో మత ప్రసక్తి లేకుండా ఉండడం లౌకికవాదం అవుతుంది. రాజకీయాలకు మతాన్ని వాడుకోవడం మతపరమైన ఘర్షణలు చోటుచేసుకోవడం , ప్రజలను కూడా అలా వేరు చేసి చూడడం విజ్ఞానవంతుల్లోనూ ఉండడం దురదృష్టకరమే. అలాగే ఓ వర్గం మతోన్మాదానికి పాల్పడుతుందంటూ మరో వర్గంపై అవసరానికి మించిన సానుభూతి ప్రకటించడమూ జరుగుతోంది. ప్రజలను మతపరంగా విభజించి చూడడం వారిని తమ స్వార్ధ రాజకీయాలకు వాడుకోవడం, బలి చేయడం అనేది ఓటుబేంక్ రాజకీయాలలో నిత్యం పెరుగుతున్నది. ఈ వైఖరి దేశప్రయోజనాలకు, సమాజ భద్రతకూ ఆటంకం కలిగించే అంశాలు. 

ఏది మతోన్మాదం - ఏది కుహనా లౌకికవాదం నిర్వచించడమెలా? 
వీటివల్ల సమాజానికి కలిగే ప్రమాదం పై మీ అభిప్రాయం?

ఈ నేపధ్యంలో రాజకీయాలలో మతం జోక్యం తగ్గాలన్నా, మతోన్మాదం - కుహనా లౌకికవాదం రెండింటి మధ్యా ప్రజలు బలికాకుండా ఉండాలన్నా చేయాల్సినది ఏమిటి? ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి?
Reactions:

Post a Comment

  1. మతం విషయంలో ఒక పార్తీ వైఖరి ఏమిటి అనే దాని కంటే ఆ పార్తీ ఆర్థిక విధానం ఏమిటి అనేది ఇక్కడ చూడాలి. బి.జె.పి. విదేశీ సంస్కృతిని వ్యతిరేకిస్తుంది కానీ విదేశీ పెట్టుబడులని వ్యతిరేకించదు. గుజరాత్‌లోని స్కూల్ పుస్తకాలలో పుట్టిన రోజు నాడు కేక్ కొయ్యకూడదు అని బోధించే పాఠాలు ఉన్నాయి కానీ ఆ రాష్ట్రం నుంచి వచ్చిన బి.జె.పి. నాయకుడు నరేంద్ర మోదీ విదేశీ పెట్టుబడులని బహిరంగంగా సమర్థిస్తున్నాడు. కాంగ్రెస్ 1991 నుంచి తాము గ్లోబలైజేషన్‌కి అనుకూలం అని చెప్పుకుంటోంది కానీ బి.జె.పి.లాగ నాటకాలు మాత్రం ఆడలేదు, సిక్కుల ఊచకోత విషయంలో తప్ప.

    ReplyDelete
    Replies
    1. నాకు చాలా కాలం నుండి తెలుసుకోవాలనుకుంటున్న ఓ ప్రశ్న? విదేశీ సంస్కృతినీ వ్యతిరేకించడానికీ-విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించడానికీ తేడా లేదా? అవి రెండూ ఒకటి ఎలా అవుతాయి?

      Delete
    2. విదేశీ పెట్టుబడిదారులు మనకి దేశ కరెన్సీ విలువ తగ్గించుకోవాలాని ఆదేశించి, అలా చేస్తేనే మన దేశంలో పెట్టుబడులు పెడతామంటారు. విదేశీ పెట్టుబడుల వల్ల దేశానికి నష్టమే కానీ విదేశీ సంస్కృతి వల్ల నష్టం లేదు. భా.జ.పా.వాళ్ళకి విదేశీ పెట్టుబడులు కావాలి కానీ విదేశీ సంస్కృతి మాత్రం వద్దట!

      Delete
  2. మతోన్మాదం:

    ఒక మతమే సర్వోత్కృష్టమైనదని కొంతమంది భావిస్తూ ఆ మతం యొక్క నియమ నిబంధనలకు నయానో భయానో సాధికారత, చట్టబద్ధత కల్పించాలని ప్రయత్నిస్తూ, తద్వారా ఇతర మతాలయొక్క ఆచార వ్యవహారాలను, నమ్మకాలను అణగదొక్కే ప్రయత్నం.

    కుహనా లౌకికవాదం:

    సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం లౌకిక వాదానికి తూట్లు పొడుస్తూ మైనారిటీగావున్న మతానికి అవసరానికన్నా ఎక్కువ లబ్ది చేకూర్చేవిధంగా ఆ మతం యొక్క తర్కవిహిత ఆచార వ్యవహారాలకు సాధికారత, చట్టబద్ధత కల్పించే ప్రయత్నం.

    కలిగే ప్రమాదం:

    పై రెండు ప్రయత్నాల వల్లా, మతాల మధ్య అపనమ్మకాలు పెరిగి, సామరస్యత నశించి అంతర్యుద్ధాలు లేదా మత తీవ్రవాదం చెలరేగే అవకాశం.

    ReplyDelete
    Replies
    1. శ్రీకాంత్ చారి గారు మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.

      Delete
    2. శ్రీకాంత్ చారి గారు మీ అభిప్రాయంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను.

      Delete
    3. శ్రీకాంత్ చారి గారూ, చాలా బాగా చెప్పారు! రెంటికీ మీరిచ్చిన నిర్వచనాలు అద్భుతంగా వున్నాయి.

      Delete
  3. ఈ దేశ చరిత్రలోని కొన్ని అనివార్యతలు నన్ను చాలా బాధ పెడుతున్నాయి.అనివార్యత అంటే ఒకటి - ముఖ్యంగా హాని చేసే దుస్సంఘటన - జరగబోతుందని తెలిసినా ఆపలేని నిస్సహాయత! యెందుకొస్తుంది?ఒకటి మనకి హాని కలిగిస్తుందనీ దాన్న్ని వొదిలేస్తే మంచి జరుగుతుందనీ తెలిసినాసరే వొదలకుండా గట్టిగా పట్టుకుని ఒక విధ్వంసం యెదురయ్యే వరకూ అకర్మణ్యంగా వుండిపోతున్నాం.మొదటిసారి జరిగినప్పుడు దాని నుంచి నేర్చుకుంటే రెండవసారి జరగ్కుండా ఆపవచ్చు, కానీ నేర్చుకునే చురుకుదనం మనలో లేనట్లుంది?!
    దారా షికో - గొప్ప పండితుడు, సజ్జనుదయిన ప్రభువు.మన భారతీయ సాంప్రదాయం పట్ల గౌరవాదరాలు వుండి మన సాహిత్యాన్ని పారసీ భాషలోకి తర్జుమా చేసి ప్రపంచాని కందించాలని కలలు గన్న దార్శనికుడు.ఔరంగజేబు - ఈ దేశాన్ని యెంత దుర్మార్గమయిన పధ్ధతిలో నైనా సరే తనకు నచ్చిన మతానికి అంటుగట్టాలని చూసిన సంకుచిత మనస్తత్వం గలవాడు.వీరిద్దరి మధ్యనా అధికార మార్పిడికి పట్టిన ఆ అయిదు నిముషాల కాలం హిందువులూ ముస్లిములూ అన్యోన్యంగా కలిసి వుండి వుండేవాళ్లేమో అని అనుకోవాల్సిన జరగని భవిష్యత్తు నుంచి ఇవ్వాళ మనం చూస్తున్న ఈర్ష్యా ద్వేషాలతో రక్తపుటేరులు పారించుకుంటున్న పరిస్థితి దాపరించింది!?
    Pls raeda full artikil at : http://harikaalam.blogspot.in/

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం అవినీతి ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి
 
Top