చంద్రబాబు ‘పది’ కుట్రలు
 • హరీశ్‌ మండిపాటు
 • పది ప్రశ్నలతో బహిరంగ లేఖ

సిద్దిపేట, ఆగస్టు 10: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ రాషా్ట్రనికి వ్యతిరేకంగా పది రకాల కుట్రలు చేశారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆ కుట్రలను పేర్కొంటూ ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు. ఆదివారం సిద్దిపేటలో విలేకరుల సమావేశంలో ఆ లేఖను విడుదల చేశారు. కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోటు, మోసం అనే పదాలకు పర్యాయపదమే చంద్రబాబు అని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి అయ్యాక బాబు ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేశారో కానీ ప్రతి రోజూ తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు మాత్రం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్‌లో గవర్నర్‌ పాలన పునర్విభజన బిల్లు ప్రకారమే జరుగుతున్నదని అంటున్న ఆయన.. అన్ని విషయాలలో బిల్లు ప్రకారమే నడుచుకోవడం లేదెందుకని ప్రశ్నించారు.
హరీశ్‌రావు చంద్రబాబుకు సంధించిన పది ప్రశ్నలివే..
తెలంగాణలో అంతర్బాగమైన భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ఏపీలో కలుపుకోవడం విభజన బిల్లుకు వ్యతిరేకం కాదా?
తెలంగాణలో కరెంట్‌ కష్టాలున్నాయని తెలిసి కూడా రెండు రాషా్ట్రలలో ఉత్పత్తయే కరెంట్‌లో 54ు ఇవ్వకుండా పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్ల (పీపీఏ)ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోలేదా?
తెలంగాణలో కరెంట్‌ కోతలున్న సమయంలోనే కడప ఆర్టీపీపీ, విజయవాడ వీటీపీఎస్‌లలో ఉత్పత్తి బంద్‌ చేయడం విద్వేషపు పన్నాగం కాదా?
పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘన నుంచి పదవుల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగడం నిజం కాదా? ఆ క్రమంలోనే తెలంగాణ వారికి కేంద్ర మంత్రి పదవి రాకుండా మీరు అడ్డుకోలేదా?
ఎంసెట్‌ ఉమ్మడి అడ్మిషన్లకు తాము ఒప్పుకున్నా తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఉన్నత విద్యామండలి ద్వారా నోటిఫికేషన్‌ ఇప్పించడం తప్పు కాదా? కేసు కోర్టులో ఉండగానే నోటిఫికేషన్‌ ఇవ్వడం న్యాయ వ్యవస్థను కించపర్చడమేనని తెలియదా?
హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్బాగమని విభజన బిల్లులో స్పష్టంగా పేర్కొన్నా, శాంతి భద్రతల అంశాన్ని గవర్నర్‌కు అప్పగించాలని మీరు కేంద్రానికి రాసిన లేఖ అవకాశవాదం కాదా?,   విశాఖపట్టణం నుంచి నెల్లూరు దాకా లేని గవర్నర్‌ పాలన హైదరాబాద్‌లో అవసరమా? మీకు ప్రజలపై నమ్మకం లేదా?
తెలంగాణలోని వాతావరణం పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉన్నందున పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన టాటా, విప్రో, బిర్లా, మహీంద్రా తదితర పారిశ్రామికవేత్తలను భయపెట్టే ప్రయత్నం చేయలేదా?, తెలంగాణలో బాంబు పేలుళ్లు జరుగుతాయని, నక్సల్స్‌ సమస్య ఉంటుందని చెప్పి నివేదికలివ్వడమే కాకుండా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వలేదా?
తెలుగు ప్రజలు కలిసుండాలని నీతులు చెప్తూనే తెలంగాణకు 24 గంటల విద్యుత్‌ పథకం రాకుండా అడ్డుకున్నది మీరు కాదా?
తెలంగాణకు చెందిన నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్చర్‌(నాక్‌) సంస్థకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డైరెక్టర్‌ జనరల్‌ను నియమించడం.. గిచ్చి కయ్యం పెట్టుకునే కుట్ర కాదా?
తెలంగాణలో అక్రమాలకు చెక్‌ పెట్టడంలో భాగంగా అక్రమ నిర్మాణాల విషయంలో కఠినం గా వ్యవహరిస్తుంటే టీడీపీ ఎమ్మెల్యేలను పంపి అక్రమార్కుల పక్షాన ధర్నా చేయించలేదా?
చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన పది కుట్రలు తాను చెప్పానని, ఇంకా చాలా ఉన్నాయని హరీశ్‌ అన్నారు. తానడిగిన పది ప్రశ్నలకు జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. విద్వేషాలు రగుల్చుతూ తమ సమనాన్ని పరీక్షించవద్దని చంద్రబాబుకు సూచించారు.
Reactions:

Post a Comment

 1. విభజన చట్టం తయారయి చాలా నెలలు అవుతుంది కదా , మరి అప్పుడు ఈ అభ్యంతరాలను ఎందుకు లేవనేత్తలేదు కెసిఆర్ ప్రభుత్వం , ఇప్పుడు ఎందుకు ఇంత రభస , ఇంకొకరి మీద ఈ నిందలు వేసి ప్రజల లో ద్వేషం పెంచడం .
  ఒకవేళ నా అభిప్రాయం తప్పైతే Please educate me

  ReplyDelete
 2. Anthe kaadu...cheekati billu ni dongallaga pass cheyinchukunnadevaru? Bill lo vishayala meeda kaneesam charchindniki aanaadu noru raaledaa chetha blog s raase thothulatho prajalni thappudova pattisthaara?
  Telangan lo ....ilaati kontha mandini maathrame nammincha galige prasnalu ivi. Telangana vidyardhi lokam ee kapata raajakeeyulni nammadam manesindi. Ika vudyogulu thappanisari paristhithullo .. .. .. ni mosthunnaaru. Migatha vaaru athi koddi kaalam lo nijaalu grahisthaaru. Lekapothe anubhavisthaaru.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top