------------------------------------------------
ప్రశ్న పంపినవారు : YJs.
------------------------------------------------
Name:YJs 
E-Mail:Deleted
Subject:స్థానికతని నిర్ణయించేది యెలా? 
Message:1956 కి ముందు నుండి తెలంగాణాలో ఉన్న కుటుంబాల వారి పిల్లలే FAST పథకంలో లబ్ధి పొందడానికి అర్హులు అని తెలంగాణా ప్రభుత్వం అంటోంది. ఇలాంటి పథకాలతో ప్రారంభించి ముందు ముందు ఇదే అంశాన్ని ఆయుధంగా చేసుకుని అన్నింటికీ ఈ నిబంధనను విస్తరించే ప్రమాదముందని సీమాంధ్ర ప్రజలు లేదా తెలంగాణాలో స్తిరపడాలనుకునేవారు ఆందోళన చెందుతున్నారు. FAST పథకానికైనా, మరే పథకానికైనా 1956 నాటి నిబంధన తప్పు కాదా? అలా అనుకుంటే ఆ లెక్కన, 1947 ఆగష్టు 15 నాటికి భారత దేశంలో ఉన్న కుటుంబాల వారికే ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తానంటే తెలంగాణా వారికి అన్యాయం జరుగదా? దేశంలో ఉండే పౌరులందరికీ దేశంలో ఎక్కడైనా నివసించే హక్కు ఉండాలి. నిబంధనల మేరకు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందే హక్కు ఉండాలి. అయితే స్థానికత అనేదానికి కొంత నిబంధన అవసరం కనుక అది ఎలా ఉండాలనేదానికి ఓ శాస్త్రీయ చర్చ అవసరం. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏమిటి?

Note :  " స్థానికతని నిర్ణయించేది యెలా?" అనే ప్రశ్నను మోడిఫై చేసి ఇక్కడ ప్రశ్నగా ఉంచాను. పాత పోస్టులో కామెంట్ లాక్ చేసినందున ఈ పోస్టుని ప్రశ్న పంపినవారి ఉద్దేశం మారకుండానే అవసరమైన కొన్ని మార్పులు చేసి ఇక్కడ ప్రశ్నగా ఉంచడమైనది. కామెంట్ చేసేవారు చర్చించేవారు కేవలం స్థానికతపై ఎలా నిర్ణయం ఉండాలి? అనేదానిపై చర్చించాలని విజ్ఞప్తి. వ్యక్తులను టార్గెట్ చేయకుండా పాలకుల నిర్ణయాలను శాస్త్రీయంగా విమర్శించండి. మీ చర్చవల్ల దేశవ్యాపితంగా ఏ పౌరుని హక్కులైనా కాపాడబడేలా, మెరుగుపడేలా సూచనలుంటే మంచిది. ఆ సూచనల మేరకు లేని ప్రభుత్వాలు లేదా పాలకులు ఎవరైనా వారికి కనువిప్పు కలిగేలా ఆ సూచనలలో మేటర్ ఉంటే మంచిది. ఆ దిశగా మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయాలని విజ్ఞప్తి.- పల్లా కొండల రావు.
Reactions:

Post a Comment

 1. నా దృష్టిలో ఒక వ్యక్తి యొక్క స్థానికతని ఆ వ్యక్తిని బట్టే నిర్ణయించాలి. అంతే తప్ప ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా అతని తాతలూ, ముత్తాతల గొడవ ఎత్తుకోవడం పూర్తి అసందర్భం, ప్రమాదకరం కూడా! ఎందుకంటే భవిష్యత్తులో వివిధ దేశాల్లోనూ, రాష్ట్రాల్లోనూ Reciprocal clauses (ఇచ్చిపుచ్చుకునే తరహా నియమ నిబంధనలు- అంటే, "మీరు మావాళ్ళ పట్ల ఎలా ఉంటారో, మేమూ మీవాళ్ళ పట్ల అలాగే ఉంటాం" అనే పాలసీ) ఉండే అవకాశం ఉంది. వాళ్ళు అవి ఏర్పాటు చేసుకుంటే అక్కడ నివసించే తెలంగాణావాళ్లు నష్టపోతారు. ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలంగాణావారు స్థానికత విషయంలో అక్కడి ఉదారవాద పాలసీల వల్ల లాభపడుతున్నప్పుడు తమ స్వరాష్ట్రంలో మాత్రం ఇతరుల పట్ల బిర్రబిగుసుకోవడం ఆ ఇతర రాష్ట్రాలకి ద్రోహం చేయడం అవ్వదా?

  నా అభిప్రాయంలో స్థానికతని ఈ క్రింది అంశాల ఆధారంగా నిర్ణయించాలి.

  1. ఒక వ్యక్తి జన్మప్రదేశం (బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా)
  లేదా
  2. అతను 7 వ తరగతి నుంచి 10 వ తరగతి దాకా ఎక్కడ చదివాడనే అంశం
  ఈ క్రైటీరియన్ ని అప్లై చేయడం కుదరకపోతే కనీసం పదో తరగతి నుంచి డిగ్రీ దాకా ఎక్కడ చదివాడనే అంశం
  లేదా
  గత పదేళ్ళ పాటు కంటిన్యూవస్ గా ఎక్కడ నివాసమున్నాడనే అంశం.
  లేదా
  తల్లిదండ్రుల్లో కనీసం ఒకరైనా స్థానికులవునా కాదా?

  ఈ ఆప్షన్సులో ఒకటని కాదు. ఇవన్నీ స్థానికత కోసం అప్లై చేసుకునేవాళ్ళకి ఇవ్వాలి. వారు ఏదో ఒక కేటగరీ కిందికొచ్చే అవకాశం ఉంటుంది. వీటిల్లో ఏ కేటగరీ కిందికీ రానివారు బయటివారుగానే జమ.

  ReplyDelete
  Replies
  1. వరుసగా యేడు సంవత్సరాలు యెక్కడ వుంటే అక్కడ నేటివిటి సర్టిఫికెటు / స్థానికత నిర్ధారణ పత్రం పొందచ్చు. దీనికి రుజువుగా పాఠశాల, కళాశాలలొ చదివిన సంవత్సరాలు [స్టడీ సర్టిఫికెటు] చూపించవచ్చు.

   నా వుద్దెశ్యంలో ఈ పద్దతి చాలా సులభతరం.

   Delete
 2. మిత్రులు కొన్ని విషయాలు గమనించాలి. స్థానికత (nativity; local vs. non-local) అనేది అడ్మిషన్లకు మరియు ప్రబుత్వ ఉద్యోగాలకు మాత్రమె వర్తిస్తుంది.

  ఇక్కడ చర్చిస్తున్నది ఆర్ధిక సాయం కోసం తీసుకునే స్థిర నివాసం (domicile; resident vs. non-resident) అనే ప్రాతిపదిక గురించి. ఇవి రెండూ వేర్వేరు విషయాలు.

  1956 కటాఫ్ ఆధారం చట్టవిరుద్ధం కాదు. అయితే ఈ ప్రాతిపదిక ఎంత సహేతుకమో ఆలోచించాలి. నా బ్లాగులో ఈ విషయాన్ని విసృతంగా విశ్లేషించాను.

  ReplyDelete
  Replies
  1. @ Jai Gottimukkala... మీకు నిజంగా తెలీదో, లేక తెలిసినా తెలియనట్లు వ్రాస్తున్నారో నాకు తెలీదు. 1956 స్థానికత పూర్తిగా చట్టవిరుద్ధం. రాజ్యాంగ విరుద్ధం కూడా. అది ఏ చట్టం ప్రకారం ఆమోదయోగ్యమో ఎవరైనా చెబితే వినాలనుంది. ప్రస్తుతం తెలంగాణాలో పరిస్థితి ఏంటంటే- సదరువాదులు ఏది మాట్లాడితే అదే చట్టంలా ఉంది. బహుశా మీరు ఆ దృష్టితో చెబుతున్నట్లున్నారు. సారీ, మీరు పొరపడ్దారని చెప్పడానికి విచారిస్తున్నాను. ఈ అంశం మీద రాష్ట్రపతి ఉత్తర్వులూ వగైరా చాలా ఉన్నాయి. ఇవి గాక ఆర్టికిల్ 371 (d) ఉంది.

   స్థానికతని బస్ పాసులతో, రేషన్ కార్డులతో సహా అన్నిటికీ ముడిపెడుతున్నప్పుడు మీరు చెబుతున్నట్లు అది కేవలం ప్రభుత్వోద్యోగాలకీ, అడ్మిషన్లకీ పరిమితం కాజాలదు. అసలు వాటిక్కూడా ఈ నిబంధన అన్యాయమే. మొగ్గలోనే తుంచకపోతే ఈ 1956 వెఱ్ఱి ఇంకా చాలా చాలా దూరం పోయేలా ఉంది. ఇది తెలంగాణకి ఉన్న సమస్యలకి తోడు భవిష్యత్తులో మరిన్ని కొత్త సమస్యల్నీ, తిరుగుబాట్లనీ, విప్లవాల్నీ అశాంతినీ సృష్టించే ప్రమాదం కనిపిస్తోంది. ఇలాంటి క్రూరమైన discriminative policies వల్లే శ్రీలంకలాంటి చాలా దేశాలు దశాబ్దాల తరబడి అంతర్యుద్ధాల్లో కూరుకుపోయి లేవలేనంతగా దెబ్బదిన్నాయని మర్చిపోకూడదు. కొత్త రాష్ట్రం ఏర్పడ్ద తొలివేడిలో తామే చేస్తున్నారో తమకే తెలియడం లేదేమో ననిపిస్తోంది.

   Delete
  2. మీరు నా టపా చదువుతే అర్ధం అవుతుంది. నేను అన్ని విషయాలలో క్లారిటీ ఇచ్చాను.

   Please read my post that covers all related subjects including nativity vs. domicile, article 371-D, fundamental rights. You can also look up the details of the caselaw I referred to yourself.

   Delete
  3. మీ పోస్టు ఇంగ్లీషులో ఉంది. నాకు ఇంగ్లీషు రాదు. ఎలా జై గారు. కొంచెం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి పంపితే జనవిజయంలో పబ్లిష్ చేద్దాము. చాలామనిద్ బాగుందంటున్నారు మీ ఆర్టికల్ ని . వీలవుతుందేమో ప్రయత్నించకూడదా?

   Delete
  4. ఒకటి రెండు రోజులలో టపాను కుదించి తెలుగులో తర్జుమా చేసి మీకు మెయిల్ చేస్తాను.

   Delete
 3. అమెరికా లో అయితే తల్లి, తండ్రులు ఎక్కడ నివాసం ఉంటారో(పన్నులు అక్కడ కడతారు కాబట్టి) వాళ్ళ పిల్లలు ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ లో పబ్లిక్ స్కూల్ లో చదవడానికి (ఎక్కడి నుండి వచ్చారు, ఎన్ని రోజులుగా ఉన్నారు, ఏ దేశం వారు అనేదానితో సంబంధం లేకుండా) అనుమతి ఇస్తారు. అందుకే ఇల్లు కొనేటప్పుడు మంచి పబ్లిక్ స్కూల్స్ ఉన్న స్కూల్ డిస్ట్రిక్ట్ లోనే కొంటారు. అలాగే అద్దెకి తీసుకోవాలన్నా మంచి స్కూల్ డిస్ట్రిక్ట్ లోనే తీసుకుంటారు. దీని మీద ఇలాంటి వ్యవహారంలో అనుభవం ఉన్న వాళ్ళు ఇంకా వివరంగా రాస్తే బాగుంటుంది. కొన్ని వివరాలు ఇక్కడ: http://en.wikipedia.org/wiki/School_district

  ఇక యూనివర్సిటీకి వచ్చేటప్పటికి ఇన్-స్టేట్, అవుట్ అఫ్ స్టేట్ ఫి అని ఉంటాయి. ఇక్కడ కూడా తల్లి తండ్రులు ఏ రాష్ట్రం లో ఉంటె ఆ రాష్ట్రానికి వాళ్ళ పిల్లలు ఇన్-స్టేట్ స్టూడెంట్ (ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు అనే దానితో సంబంధం లేకుండా). అలా కాకపొతే ఒక సంవత్సరం అక్కడ పని చేసి పన్నులు కట్టి ఉన్నా లేదంటే హై స్కూల్ అక్కడే చదివినా ఇన్-స్టేట్ స్టూడెంట్ కింద గుర్తిస్తారు. ఇన్-స్టేట్ స్టూడెంట్స్ కి ఫీజు చాలా తక్కువగా ఉంటుంది అవుట్-అఫ్-స్టేట్ స్టూడెంట్స్ తో పోలిస్తే. మరిన్ని వివరాలు, ఇన్-స్టేట్ స్టూడెంట్ కావాలంటే ఉండాల్సిన అర్హతలు ఇక్కడ.
  http://www.usnews.com/education/best-colleges/paying-for-college/savings/articles/2009/12/23/how-to-get-in-state-tuition
  http://www.finaid.org/otheraid/stateresidency.phtml

  ReplyDelete
 4. ఇక్కడ చర్చిస్తున్నది ఆర్ధిక సాయం కోసం తీసుకునే స్థిర నివాసం (domicile; resident vs. non-resident) అనే ప్రాతిపదిక గురించి. ఇవి రెండూ వేర్వేరు విషయాలు.

  ఎలా ? స్థాన్నికులందరికి ఒకే నియమం ఉండాలి. ఆర్ధిక సాయం కోసం ఒక స్థానికత, వోట్ వేయడానికి ఒక స్థానికత ఉంటాయా ?

  ReplyDelete
  Replies
  1. ఆర్ధిక సాయం సంగతి తెలియదు కాని, చదువుకోవడానికి ఓటేయడానికి ఒకే స్థానికత గనక వుంటే, పోయిన ఎలక్షన్లో బాబు గారికి కనీసం ఐదు లక్షల వోట్లు తగ్గేవి పాపం!

   Delete
 5. పల్లా కొండల రావు గారికి, నా ప్రశ్నను సరళీకరించినందుకు కృతఙ్ఞతలు.
  jalandhar101/కిరణ్ కుమార్ కే గారికి, మిమ్మల్ని జలకిరణ్ అని సంబోధించినందుకు యేమీ అనుకోకండి.
  గుండు మధుసూదనరావు గారికి, క్షమించండి. మిమ్మల్ని ‘మందు గుండు’ అని పిలవడానికి కారణం మీరు ‘fire brand’ అన్న ఉద్దేశ్యంతో తప్పితే వేరే దురుద్దేశం లేదు. మీరు ఎప్పటికీ ఇలాగే మందు గుండు దట్టించిన తుపాకి లాగ ఎవరు అక్రమం చేస్తే వారిని ఎండగట్టండి – తన పర భేదాలు లేకుండా.

  విపరీతమైన ప్రయాణాలు, పనుల వొత్తిడి వలన, నేను సమాధానం/వివరణ ఇవ్వడం ఆలస్యమైంది.

  నా ప్రశ్న: "స్థానికతని నిర్ణయించేది యెలా?" ఈ నా ప్రశ్న ఫీజు రీ ఇంబర్స్ మెంటుని దృష్టిలో వుంచుకుని వేసినది. అసలు ఈ ప్రశ్న లేవనెత్తింది 'ఫీజు రీ ఇంబర్స్ మెంటు పథకం 1956 నుండి ఉన్నవారికే' అని కేసీఆర్ ప్రకటించడం వలన.
  నా అసలు ప్రశ్నకు వ్యంగ్యం జోడించి కేసిఆర్ కి, ఆయన ప్రతిపాదనను సమర్ధించేవారికి నేను సంధించిన ప్రశ్న'1947 ఆగష్టు 15 నాటికి భారత దేశంలో ఉన్నవారే భారతీయులు అని అంటే తెలంగాణావాళ్ళు యేమవుతారు?' అని.

  నమస్తే తెలంగాణా పత్రికలో వచ్చిన వాక్యం : "ప్రభుత్వ నిర్ణయమే అమలులోకి వస్తే అసలైన తెలంగాణ వాసుల బిడ్డలకే ఫీజుల పథకం వర్తించే అవకాశం దక్కుతుంది.". అసలైన తెలంగాణా వాసుల బిడ్డలకే అనడం కంటే పేద విద్యార్దులకి [పేదరికానికి తెలంగాణా ఆంద్ర తారతమ్యం లేదు] అంటే బాగుండేది. తెలంగాణా వాళ్ళు భారతీయులే, అందులో నాకెలాంటి సందేహం లేదు.

  jalandhar101 /కిరణ్ కుమార్ కే రాసిన కామెంట్ల ప్రకారం : "
  https://www.youtube.com/watch?v=zd__5UwImCA
  పై విడియోలో 19.05 నుండి చూడండి. ఫీజు రిఎమ్బెర్స్మెంట్ పథకాన్ని రాదు చేసి, FAST అనే కొత్త పథకాన్ని మొదలు పెడుతున్నట్లు, ఆ పథకానికి 1956 నుండి ఉన్న వారిని అర్హులుగా తిసుకున్తున్నల్టు స్వయంగా కెసిఆర్ ప్రకటించారు."

  ప్రశ్న ఏంటి: కేసీఆర్ 1956 కి ముందు నుండి తెలంగాణాలో వున్నవారే తెలంగాణా వాళ్ళుగా గుర్తింపబడతారు అని అంటున్నారు. // నేనడిగిన ప్రశ్న అది కాదు. నా ప్రశ్న: "స్థానికతని నిర్ణయించేది యెలా?" :)
  నేనేమన్నాను: కెసిఆర్ కేవలం ఫీజు విషయం లోమాత్రమే అలా అన్నాడు (విడియో లింక్ ఇచ్చాను) // కేసీఆర్ అలా అన్నాడని ఒకప్రక్క ఒప్పుకుంటూనే మీరు మళ్ళీ ఏం రాసారు? “కెసిఆర్ అలా అనలేదు అనేది నిజమైతే, అడిగిన ప్రశ్ననే తప్పు అని నా ఉద్దేశం. అలా అనలేదు అనే దానికి నేను విడియో లింక్ జత చేసాను.”. We both are talking the same thing.

  కేసీఆర్ ఏ విషయంలో ఇలా అన్నాడో మనం పక్కన పెట్టనక్కరలేదు. ఫీజు రీ ఇంబర్స్ మెంటు కోసం మాత్రమె అన్నా, మరింకో దానికి మాత్రమె అన్నా, స్థానికత ఒక్కో విషయంలో ఒక్కోలా వుండదు.

  ఇక్కడ ‘1956 సంవత్సరం స్తానికతకి కొలమానం అనేది కేవలం ఫీజు రీ ఇంబర్స్ మెంటుకి మాత్రమె అడ్మిషన్లతో సంబంధం లేదు. కేసీఆర్ కూడా చెప్పేది అదే.' అంటున్నారు. అదెలా సాధ్యం? అంటే 1956 తరువాత వచ్చిన వాళ్ళు స్థానికులు కాదు. ఫీజుల విషయములో స్థానికులు కారుగానీ మిగిలిన వాటిలో స్థానికులుగా ఉంటారా? ఒకసారి స్థానికత నిర్ధారించిన తరువాత దానిని మార్చుకోవడం అంత సులభతరం కాదు.

  ఈ లింక్ చూడండి. [http://apland.ap.nic.in/cclaweb/certificates.htm#33]
  The Community, Nativity and Date of Birth Certificate issued by the Competent Authority in accordance with the provisions of the Act and Rules, shall be a permanent one as per Rule 16 of the Rules, 1997.

  నా అభిప్రాయం: ఒకే స్కూలులో, ఒకే క్లాసులో, ఒకే బెంచి మీద కూర్చున్న ఇద్దరు మిత్రులు ‘1956 స్థానికత నాకుంది నీకు లేదు. నువ్వు తెలంగానోడివి కాదు పో’ అనే పరిస్థితి రాకూడదు.

  ReplyDelete
  Replies
  1. "స్థానికత ఒక్కో విషయంలో ఒక్కోలా వుండదు"

   "ఫీజుల విషయములో స్థానికులు కారుగానీ మిగిలిన వాటిలో స్థానికులుగా ఉంటారా?"

   ప్రస్తుతం 371-డీ ప్రకారం అమలులో ఉన్న "స్థానికత" చదువుకు ఉద్యోగానికి ఒకటే కాదు. అంతెందుకు ఎమ్బీఎమ్బీబీయెస్ నాన్-లోకల్ ఎండీకి వచ్చేసరికి లోకల్ అవుతాడు. నేను లోకల్ కోటాలో చదుకున్నాను కాబట్టి ఉద్యోగానికి కూడా లోకలే అంటే ఎవరూ ఒప్పుకోరు.

   ఈ విషయాలు చాలా మందికి తెలుసు కాని తెలియనట్టు నటిస్తారు. వారి మాటల మాయలో పడి ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడా ఎన్నడూ లేని ఘోరాలు జరిగిపోతున్నాయని గగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు.

   ఇకపోతే ఆర్ధిక సాయం స్థిర నివాస (domicile) ఆధారంగా ఇవ్వడంలో తప్పు లేదు. ఇది స్థానికత (nativity) కాదు.

   "ఒకే స్కూలులో, ఒకే క్లాసులో, ఒకే బెంచి మీద కూర్చున్న ఇద్దరు మిత్రులు ‘1956 స్థానికత నాకుంది నీకు లేదు. నువ్వు తెలంగానోడివి కాదు పో’ అనే పరిస్థితి రాకూడదు"

   ఆర్ధిక సాయం ఇచ్చేది ఉన్నత విద్య కోసమండీ! బడులు బెంచీలు అంటారేంటీ?

   Delete
  2. మిమ్మల్ని జలకిరణ్ అని సంబోధించినందుకు యేమీ అనుకోకండి.

   నేనేమి అనుకోలేదండి, సరదాగానే తీసుకున్నాను. చిన్నప్పుడు నాకు జలంధర్, ఆనంద్ లలో ఏదోక పేరు పెడదామనుకున్నారట, ఎందుకో కిరణ్ అని పెట్టేసారు :)
   జలంధర్ అనే పేరు వాడుకోవటంలో నా కారణం అది.

   మరింకో దానికి మాత్రమె అన్నా, స్థానికత ఒక్కో విషయంలో ఒక్కోలా వుండదు.

   అక్కడ స్థానికత చట్టాలను ఆయన మారుస్తున్నట్లు చెప్పలేదు. మీ అనుమానం నివృత్తి చెయ్యటానికి కొంత సరళికృతం చేసి చెప్పటానికి ప్రయత్నిస్తాను.

   తెలంగాణాలో ప్రభుత్వ ఉద్యగానికి ఉన్న అర్హటలలో ఒక నియమం "ప్రస్తుత చట్టాల ప్రకారం స్థానికులు కావటం"
   FAST పథకానికి ఉన్న అర్హతలలో రెండు నియమాలు "1. వారు ప్రస్తుత చట్టాల ప్రకారం స్థానికులు కావటం 2. వారి పూర్వికులు 1956 నుండి తెలంగాణాలో నివసిస్తూ ఉన్న వారు అయి ఉండటం"

   అదెలా సాధ్యం? అంటే 1956 తరువాత వచ్చిన వాళ్ళు స్థానికులు కాదు. ఫీజుల విషయములో స్థానికులు కారుగానీ మిగిలిన వాటిలో స్థానికులుగా ఉంటారా?

   పైన చెప్పిన దాంతో మీ అనుమానం తిరి ఉంటుంది.

   నమస్తే తెలంగాణా పత్రికలో వచ్చిన వాక్యం

   నమస్తే తెలంగాణాలో ఉన్నది వారు అర్థం చేసుకున్నది, అలానే ఈనాడు , సాక్షి, దక్కన్ క్రానికల్ లలో వచ్చింది వారు వారు అర్థం చేసుకున్నది. ఇలా ఒక్కొక్కరు తీసే అర్థాలు ఒక్కో రకంగా ఉండొచ్చు. ఎవరు ఏ అర్థం తీసుకున్నను మనం వాటిపై ఆధార పడకుండా కెసిఆర్ విడియో చూసి మనమే అర్థం చేసుకోవచ్చు. మనకు అర్థం అయిన వాటిపైన చర్చలు చేసుకోవచ్చు. నావరకు, ఆ విడియో మొదట చూసి ఉన్నాను కాబట్టి వివిధి కమెంటార్ లు ప్రచురించిన లింకులు చదవనే లేదు, ఎందుకంటే విడియో ను మించిన సాక్షంను ప్రింట్ మీడియా ఇవ్వలేదు.

   Delete
  3. @JaiGottimukkala. You can change it as:
   "ఒకే స్కూలులో, ఒకే క్లాసులో, ఒకే బెంచి మీద "ఒకప్పుడు" కూర్చున్న ఇద్దరు మిత్రులు ‘1956 స్థానికత నాకుంది నీకు లేదు. నువ్వు తెలంగానోడివి కాదు పో’ అనే పరిస్థితి రాకూడదు"

   ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఈ లింక్ చూడండి.

   http://teluguone.com/news/content/video-on-kcr-government-household-survey-39-37290.html#.U--WXvmSySo

   ఆంధ్రోల్లని కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అని అన్న మాటలన్నీ బూటకమే అని కొద్ది కొద్దిగా బయటపడుతోంది.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top