తెలంగాణే లక్ష్యం 2019లో అధికారమే మన టార్గెట్‌

-    గడప గడపకూ పార్టీ వెళ్లాలి.. ప్రజల తరఫున పోరాడండి.. ఎన్నికల్లో 23% ఓట్లు వచ్చాయి
-    కష్టపడితే మరింత పెరుగుతాయి.. మనం బలపడతాం... నాకు ఆ నమ్మకముంది!
-    రాష్ట్ర పథకాల అమలు తీరు చూడండి.. తప్పులు ఎండగట్టండి.. నేతలకు అమిత్‌ కర్తవ్యబోధ
-    అమిత్‌షాతో పవన్‌ చర్చలు.. భవిష్యత్‌ కార్యాచరణపైనే చర్చ.. నేడు బాబు-అమిత్‌ భేటీ?
-    బీజేపీలో టీఆర్‌ఎల్‌డీ విలీనం.. కాషాయ జెండా పట్టిన దిలీప్‌ బృందం, మాజీ డీజీపీ దినేశ్‌ రెడ్డి

హైదరాబాద్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): సూటిగా, సుత్తిలేకుండా... ఒకే ఒక్క మాట! ‘2019లో తెలంగాణలో కమలం జెండా ఎగరాలి. మనం అధికారంలోకి రావాలి!’... ఇది బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ శ్రేణులకు నిర్దేశించిన భవిష్యత్‌ బాట! గుజరాత్‌ రాష్ట్రాన్ని బీజేపీకి పెట్టని కోటగా నిర్మించి... మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ను బీజేపీని తిరుగులేని శక్తిలా మార్చిన అమిత్‌షా... తన తదుపరి గురి తెలంగాణపై పెట్టారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గురువారం తొలిసారిగా ఆయన తెలంగాణపై అడుగు పెట్టారు.  బీజేపీని గడపగడపకూ తీసుకెళ్లాలని పిలుపునిస్తూనే... టీఆర్‌ఎస్‌ సర్కారు చేసే తప్పులపై  ‘ప్రతిపక్షం’లాగా పోరాడాలని ఆదేశించారు. ‘2019లో అధికారంలోకి రావడమే పరమావధిగా పని చేయాలి’ అని దిశా నిర్దేశం చేశారు. సెంటర్‌ ఫర్‌ సోషల్‌ అండ్‌ ఎకనామిక్స్‌(సెస్‌)లో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారి, అధికార ప్రతినిధులు, కార్యదర్శులతో అమిత్‌షా భేటీ అయ్యారు. అంతకుముందు... బీజేపీ గ్రేటర్‌ హైదరాబాద్‌ కమిటీ, రంగారెడ్డి జిల్లా (అర్బన్‌) కమిటీల ఆధ్వర్యంలో జరిగిన అభినందన సభలోనూ పాల్గొన్నారు. ‘‘మొన్నటి ఎన్నికల్లో దేశంలోని ఉత్తర, మధ్య, పశ్చిమ రాష్ట్రాల్లో పార్టీకి వచ్చిన ఎంపీల బలంతోనే కేంద్రంలో అధికారంలోకి వచ్చాం. వచ్చే ఎన్నికల్లో తూర్పు, దక్షిణ ప్రాంత రాష్ట్రాల్లో పార్టీకి లభించే ఆదరణతో అధికారంలోకి రానున్నాం. వాటిలోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల పాత్ర కీలకంగా మారనుంది. 2019లో బీజేపీ కేంద్రంలో తిరిగి అధికారం చేపట్టడానికి తెలంగాణ నాయకత్వం వహించాల్సి ఉంటుంది’’ అని అభినందన సభలో తెలిపారు.

పదాధికారుల సమావేశంలో మాత్రం ‘తెలంగాణలో అధికార సాధనే మన లక్ష్యం’ అని అమిత్‌షా ముక్కుసూటిగా చెప్పినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరుపై ఒక కన్నేసి ఉంచాలని చెప్పారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ‘‘తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా పరిశీలించండి. చేరకపోతే... ప్రతిపక్షపార్టీగా ప్రజల తరఫున ఉద్యమించండి. ప్రజలకు పథకాలు అందేలా గురుతర పాత్ర  పోషించండి’’ అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలోని ఎన్డీయే  ప్రభత్వం సహకరిస్తుందని తెలిపారు. ‘‘పరస్పరం సహకరించుకోవడమనేది  కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశం. రాష్ట్ర పార్టీకి  ఆ విషయంతో సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలు, కార్యక్రమాలపై దృష్టి పెట్టండి. అధికార టీఆర్‌ఎస్‌ చేసే తప్పులను ఎప్పటికప్పుడు ఎండగట్టండి. ప్రజలతో మమేకమై బీజేపీని బూత్‌ స్థాయి వరకు తీసుకెళ్లండి. 2019లో అధికారంలోకి రావడమే పరమావధిగా పని చేయండి’’ అని పిలుపునిచ్చారు.  ఇటీవలి ఎన్నికల్లో తెలంగాణలో 23 శాతం ఓట్లు సాధించామని... ఇంకా కష్టపడితే 2019 నాటికి ఇది మరింత పెరుగుతుందని తెలిపారు. ‘‘తెలంగాణలో పార్టీ తప్పకుండా బలపడుతుంది. 2019 ఎన్నికల్లో పార్టీ తెలంగాణలో విజయం సాధించి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం నాకుంది ’’ అని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. మెదక్‌ లోక్‌సభ ఉప ఎన్నిక గురించి ప్రత్యేకంగా ప్రస్తావించకపోయినా... ప్రతి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు పోటీలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు.
టీడీపీ, జనసేనలతో ‘బంధం’
ఒకవైపు 2019 నాటికి తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యం పెట్టుకుంటూనే... ప్రస్తుతం మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేనలతో బంధం కొనసాగింపుపై అమిత్‌షా దృష్టి సారించారు. గురువారం రాత్రి జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌ అమిత్‌షాతో భేటీ అయ్యారు.  అలాగే... టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుతో శుక్రవారం ఉదయం అమిత్‌షా భేటీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
చేరికలు, విలీనాల ప్రక్రియ
తెలంగాణలో బీజేపీ బలోపేతం దిశగా ఇప్పటికే అడుగులు పడుతున్నాయి. తెలంగాణ రాషీ్ట్రయ లోక్‌దళ్‌(టీఆర్‌ఎల్‌డీ) పార్టీ గురువారం బీజేపీలో విలీనమైంది. టీఆర్‌ఎల్‌డీ నేత, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌ కుమార్‌, వివిధ జిల్లాల అధ్యక్షులు గురువారం అమిత్‌ షా సమక్షంలో బీజేపీలో చేరారు.  అలాగే... వైసీపీ టికెట్‌పై మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓడిపోయిన మాజీ డీజీపీ దినేశ్‌ రెడ్డి కూడా బీజేపీలో చేరారు. జీహెచ్‌ఎంసీలో కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ డి.రాంబాబు, కాంగ్రెస్‌ కార్పొరేటర్‌(బేగంబజార్‌) శంకర్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ రాష్ట్రనేత సురేందర్‌, పద్మశాలి సంఘం నాయకురాలు అర్సనపల్లి సుజాత, పీఆర్‌పీలో ఇదివరకు పని చేసిన జి.లక్ష్మణ్‌, ఆప్‌ నాయకురాలు ఉండవల్లి ప్రమీల, ప్రముఖ ఆర్థోపెడిషీయన్‌ శివరామ్‌ నాయక్‌ అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరారు.
(from andhrajyothy daily)
Reactions:

Post a Comment

 1. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీకి తోకగా ఉన్న భాజపా సొంతంగా అధికారంలోకి రావాలంటే ముందు ఆ బంధాన్ని తెంచాలి. ఇది జరిగే పనేనా? పక్కరాష్ట్రంలో రెండు మంత్రి పదువులు వదులుకోవడం సులభం కాదు.

  ReplyDelete
  Replies
  1. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే దారుణమైన పెర్ఫార్మెన్స్ చూపించింది. ఇప్పుడు మోదీ పేరు చెప్పుకుని ప్రచారం చేస్తే ఎవరు వోత్‌లు వేస్తారు? మూడు నెలల క్రితం దేశంలోని TV చానెల్‌లు అన్నీ మోదీకి గాలి ఊదాయి కనుక బిజెపి గెలిచింది కానీ ఇప్పుడు అలా అవ్వదు.

   Delete
 2. తెలుగురాష్ట్రాల్లో BJP అధికారంలోకి రావడం
  అమెరికాలో కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రావడం
  రెండూ ఒకేసారి జరుగుతాయి.

  ReplyDelete
  Replies
  1. 1950లలో అమెరికా కమ్యూనిస్త్ పార్తీ క్రుష్చేవ్‌ని సమర్థించడం వల్ల ఆ పార్తీ దాదాపుగా కార్యక్రమాలు లేకుండా పోయింది. ఇప్పుడు అమెరికా సామ్రాజ్యవాదం మరింత బలపడింది కనుక ఆ దేశంలో విప్లవం వచ్చే అవకాశాలు ఇప్పట్లో లేవు. బిజెపి విషయం వేరు. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టు వాళ్ళు చంద్రబాబుని నమ్ముకుంటున్నారు.

   Delete
 3. పాతవాట్ని మళ్ళీ తవ్వినట్టు వుంటుందేమో గానీ, నేను యెన్నికల ముందే చెప్పాను.భాజపా కి ఈ రెందు రాష్త్రాల్లోనూ సొంత బలం లేదు, ఇప్పుదప్పుడే రాదు - అని.కొంతకాలం పాటు తెదెపాతో జట్టు కట్టటం తప్ప వేరే ఆల్టెర్నేటివ్ లేదు.అతిగా ఆశపడి సానియా మీర్జా తెలంగాణా బ్రాంద్ గురించి గొదవ చేస్తూ ముస్లిం బూచిని చూపించీ దూకుడుగా వెళ్తే ఇద్దరూ మట్టమయి పోతారు!

  భాజపా విభజన బిల్లు ఇలా వుండటం వల్ల రేపటి యెన్నికల్లో వొచ్చేది మనమే కాబట్టి మన నెత్తిమీదకి చాలా సమస్యల్ని తీసుక్కొస్తుందని అడ్వాణీతో సహా అందరూ వ్యతిరేకించడానికి నిశ్చయించుకున్నారు.ఇప్పుదు బిల్లుని వ్యతిరేకించేసి మనం వచ్చాక ఇద్దాం అని అడ్వాణీ అన్నా గానీ సందట్లో సదేమియా అని బాబు మిగతా పార్టీల్ని కూడగట్టి బిల్లుకి వ్యతిరేకంగా వోటు చేయించటానికి చూట్టం, కాంగ్రెసు - అదిగో మేము తెలంగాణా ఇవ్వాలని బిల్లు పెడితే భాజపా వ్యతిరేకించింది అనే ప్రెషర్ ట్రిక్ పని చెయ్యటంతో వెనక్కి తగ్గింది.(ఇది కేవలం నా పరిశీలన మాత్రమే దీని మీద వాదోపవాదాలకి తెర తీయవద్దు?!)

  భాజపా విభజన వల్ల తను సొంత మైలేజీ తెచ్చుకోవాలనుకుంటే ఒకరిస్తుంటే మరొకరు పుచ్చుకుంటుంటే పక్కతాళం వేసినట్టు కాకుండా అప్పుడు వ్యతిరేకించి ఇప్పుడు చేస్తే బాగుండేది.భాజపా అయితే ఇంత దరిద్రంగా విభజన జరిగి వుండేది కాదు.విభజన సజావుగా జరిపిస్తే ఆ గుడ్విల్ కొంత పని చేసేది.కానీ ఇప్పుడా అవకాశం లేదు.

  నా అంచనా ప్రకారం ఆంధ్రాలో తెదెపా సహకారం మరికొంత కాలం తప్పని సరి భాజపాకి.తెలంగాణాలో తెరాసాతోనూ తెదెపా తోనూ తనకున్న ఇంటెరాక్టివిటీని డిస్టర్బ్ చెయ్యకుండా కాంగ్రెసుని పూర్తిగా ఖాళీ చేసి ఆ స్థానాన్ని ఆక్రమించే విధంగా వెళ్తే కొంత లాభకరంగా వుండొచ్చు తెలంగాణాలో .

  ReplyDelete
  Replies
  1. చంద్రబాబు సమన్యాయం పేరు చెప్పి తెలంగాణాని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు తెలంగాణా తెలుగు దేశం నాయకులు ఏమీ మాట్లాడలేదు. వీళ్ళ తోక పట్టుకుని గోదారి ఈదితే భాజపా తెలంగాణలో నట్టేట మునుగుతుంది.

   Delete
  2. ఆంధ్రాలో భాజపాకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో ఒకరు సమైక్యాంధ్ర ఉద్యమ నాయకుడు. భాజపా కూడా తెలుగు దేశంలాగే రెండు కళ్ళ పార్తీ. వాళ్ళని తెలంగాణాలో ఎవరు నమ్ముతారు? మత విశ్వాసాలు బలంగా ఉన్న కొంత మంది వాళ్ళకి వోత్‌లు వేస్తారు, అంతే.

   Delete
  3. తెలంగాణా లో తెలుగుదేశం పార్టిని భాజపా లో విలీనంచేసి బాబు గారు ఆంధ్రా రాజకీయల మీద ఫోకస్ చేస్తే బాగుంట్టుంది.

   Delete
  4. ఐదేళ్ళ తరువాత తెలంగాణలో తెలుగు దేశం దాదాపుగా ఖాళీ అయితే బాబు ఆ పని చేస్తాడు.

   Delete
 4. ప్రవీణ్‌కుమార్‌గారికి నాదొక ఉబోస (ఉచిత బోడి సలహా). దయచేసి మీరు ఒకే ఐడిని వాడుతూ ఉంటే చదురులకు ఇబ్బందిగా ఉండదు. ఈ మాటను లోగడ కూడా ఒకసారి చెప్పినట్లున్నాను. నొప్పిస్తే మన్నించవలసింది.

  ReplyDelete
 5. I have two browsers on my mobile. Android default browser has my English name and Chrome has the Arabic name stored in the settings.

  ReplyDelete
 6. తెలంగాణలో అధికారంలోకి రావాలంటే బిజెపికి టిడిపి సహకారం కావాలి. ఒంటరిగా బిజెపి గెలవలేదు.
  భవిష్యత్తులో కేంద్రంలో బిజెపికి పూర్తి మెజారిటీ వస్తుందన్న గారంటీ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో టిడిపికి మద్దతు ఇవ్వాలి. కలిసిఉంటేనే ఇద్దరికీ మంచిది.

  ReplyDelete
 7. Never dream that BJP would come into power in Telangana. In the recent elections, BJP won only 5 seats in Telangana, 4 in Hyderabad and 1 in Rangareddy.

  ReplyDelete
 8. This comment has been removed by the author.

  ReplyDelete
 9. This comment has been removed by the author.

  ReplyDelete
 10. శ్రీరాం గారు, మీ కామెంటుని బ్లాగిల్లులో చదివాను.
  నేనో మామూలు వ్యక్తిని. VIPని కాను. నా అభిప్రాయాలు మీకు నచ్చకపొతే వాటిని సీరియస్‌గా తీసుకోకండి. లైట్‌గా తీసుకొండి.

  ReplyDelete
 11. బోనగిరిగారు,
  నేను లైట్ గానే తీసుకొన్నానండి. నితిష్ ప్రధాని అయితే అందరిని కలుపుకుపోగలడు అని చెప్పినదాన్నిని సీరియస్ గా ఎవరైనా తీసుకొంటారా చెప్పండి? :) నిన్నటి వరకు ప్రధాని గా మోడి అందరిని కలుపుకొనిపోలేడు అనిచెప్పిన వారు, అప్పుడే భవిష్యత్తులో కేంద్రంలో బిజెపికి పూర్తి మెజారిటీ వస్తుందన్న గారంటీ లేదు అని మీరు రాసింది చదివి ఆ వ్యాఖ్య రాశాను. మీరే కాదు నేను కూడా మీలాగే మామూలు వ్యక్తిని. VIPని కాను.

  బ్లాగిల్లంటే ఎమిటో నాకు తెలియదు. ఇక్కడ తొలగించిన వ్యాఖ్య బ్లాగిల్లు లో ఉండడమేమిటో నాకర్దం కాలేదు.

  ReplyDelete
 12. బీహార్ ఉప ఎన్నికల ఫలితాలు చూసాక మళ్ళీ ఈ ప్రశ్నపై ఆసక్తి కలిగింది!

  ReplyDelete
 13. ఈ విధంగా బిజెపి తెలంగాణాలో తన గొయ్యి తానే తవ్వుకుంది. (సోర్స్: http://missiontelangana.com/the-7-big-mistakes-that-ruined-bjp-in-telangana/).

  1. ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు. పైకి రెండు కళ్ళ సిద్దాంతం ప్రవచించినప్పటికీ తెలంగాణా రాకుండా ఆపడానికి చంద్రబాబు చెయ్యని ప్రయత్నం లేదన్న సంగతి పసి పిల్లవాడికి కూడా తెలుసు. అలాంటి మనిషి నాయకత్వంలోని పార్టీతో పొత్తు ఆ పార్టీ కొంప ముంచింది.

  2. 'తల్లిని చంపి పిల్లను కాపాడారు' అని తెలిసీ తెలియక అన్న నరేంద్ర మోడీ నినాదం తెలంగాణా ప్రజలను గాయపరిచింది.

  3. పవన్ కళ్యాన్ పనికి మాలిన డైలాగులు. ఒక వైపు తెలంగాణా ఏర్పాటుకు కారణం కెసిఆర్ అని ప్రజలు నమ్ముతుంటే, పవన్ కళ్యాన్ అనే పిల్లకాకి ఆయనపై పిచ్సివాగుడు వాగడం జనానికి అస్సలు నచ్చలేదు.

  4. బిజెపికి చంద్రబాబు ప్రచారం. ఒకవేపు తెలంగాణలో తనపార్టీకే దిక్కు లేక పోయినా చంద్రబాబు బిజెపి ప్రచారానికి తయారవడం ఆ పార్టీకి అస్సలు ఉపయోగ పడలేదు.

  5. మతాలకతీతంగా చార్మినార్ ను తెలంగాణా ప్రజలు తమకు గర్వకారణంగా భావిస్తారు. అటువంటిది తెలంగాణా అధికార చిహ్నంలో చార్మినార్ ఉండడాన్ని వ్యతిరేకించి ప్రజల్లో బిజెపి మరింత చులకనబారి పోయింది.

  6. తెలంగాణా బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జా నియామకాన్ని వ్యతిరేకించి మరోసారి బిజెపి పప్పులో కాలేసింది. అందుకోసం ఆ పార్టీకి పార్లమెంటులో సర్ది చెప్పుకోవాల్సి వచ్చింది.

  7. తెలంగాణా ప్రజలు ఒకవైపు వ్యతిరేకిస్తుంటే హైదరాబాదులో గవర్నర్ పాలనను సమర్థించడం. పైగా ఆ పార్టీ అధ్యక్షుడు మరో అడుగు ముందుకేసి అందరు ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాయడం తెలంగాణా ప్రజలకు పుండు మీద కారం రాసినట్టయింది.

  8. పంద్రాగస్టు రోజున గోల్కొండ మీద జెండా ఎగరెయ్యడానికి మతం రంగు పులమడానికి ప్రయత్నించి మరోసారి తనకు తాను బురద గుంటలో పడింది బిజెపి. చివరికి గోల్కొండ నిర్మాణాన్ని మొదట నిర్మించింది హిందూ రాజులేనని తేలడంతో ఆ పార్టీ పరిస్థితి తేలు కుట్టిన దొంగ చందంగా మారింది.

  ReplyDelete
  Replies
  1. BJP has dug it's own grave in Telangana by giving ticket to Jaggareddy.

   Delete
  2. BJP has dug it's own grave in Telangana by giving ticket to Jaggareddy.

   Delete
  3. తెలంగాణాలో బిజెపి ఎంత గోతిలో పడితే అంధ్రావారికి అంత మంచిది. బిజెపి తెలంగాణాలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా సాధించిన పురోగతి సున్నా. అవకాశాలను అందిపుచ్చుకొనే ఆంధ్రులు , కేంద్రం లో బిజెపి గాలి వీచి వస్తుందంటే ఆ పార్టికి ఓట్లు వేసి,యం.పి.సీట్లు పళ్ళెంలో పెట్టి ఇస్తారు. ఈ ప్రాంతం పైన దీర్ఘకాలిక ప్రణాలికతో (కనీసం 10సంవత్సరాల తరువాత) దృష్టి ఉంచితే బిజెపి కి భవిషత్ లో లాభం. ఒకప్పటి ప్రాంతీయ పార్టిలు , కుల పార్టిలు గా రూపాంతరం చెంది, నేడు కుటుంబ పార్టిలుగా మారాయి. ఈ పార్టిలన్ని వ్యక్తిగత చరిస్మా పై ఆధారపడి ఉంటాయి. నాయకుడి వారసులు అందరు విజయవంతం అవుతారని ౠజువులేమి లేవు. ములాయం సింగ్ యాదవ్, దేవ గౌడా, కరుణానిధి కోడుకులే ఉదాహరణ. ఆంధ్రా పై దీర్ఘకాలిక ప్రణాలికతో పనిచేస్తే, రానున్న రోజులలో బాబుగారి తరువాత రాజకీయ శూన్యత ఏర్పడితే దానిని బిజెపి పార్టి భర్తి చేయటానికి వీలుగా ఉంట్టుంది.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top