రాజధానిపై ఊహాగానాలు వద్దు!

- శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక అందలేదు
- చంద్రబాబు స్పష్టీకరణ
- తలోమాట వద్దని మంత్రులకు సూచన
- రాజధాని అక్కడే ఉంటుంది: ప్రత్తిపాటి
- అక్కడ వద్దని కమిటీ చెప్పలేదు: నారాయణ
- కచ్చితంగా అక్కడే ఉంటుంది: రాయపాటి
- 1న కేబినెట్‌ భేటీలో ‘స్పష్టత’

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధానిపై శివరామకృష్ణన్‌ కమిటీ తమకు ఎలాంటి నివేదికా ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధానిపై కల్పితాలు, వూహాగానాలు తగవని సూచించారు. ఈ అంశంపై తలోమాట వద్దని మంత్రులకూ స్పష్టం చేశారు. విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు వాంఛనీయం కాదంటూ శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను ఉటంకిస్తూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇది సామాన్యుల నుంచి సర్కారు పెద్దల వరకు అందరిలో సంచలనం సృష్టించింది. గురువారం మధ్యాహ్నం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం రాజమండ్రి బయలుదేరుతూ చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక పేరిట వచ్చిన వార్తలపై కాసింత అసహనం వ్యక్తం చేశారు. ‘‘రాజధాని ఎక్కడ నిర్మించాలన్న దానిపై నాకు, అధికారులకు ఎలాంటి నివేదిక అందలేదు. మీడియాకు మాత్రం ఎలా వచ్చింది??’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. ఈ అంశంపై ఊహాగానాలు తగవని హితవు పలికారు. అంతకంటే ముందు చంద్రబాబు మంత్రులతో సమావేశమయ్యారు. రాజధానిపై ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు మాట్లాడవద్దని సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా తాము నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నామని కూడా అన్నారు. సెప్టెంబర్‌ ఒకటిన జరిగే మంత్రివర్గ సమావేశంలో రాజధాని ఏర్పాటుపై చర్చిస్తామని.. అనంతరం కేంద్రంతో సంప్రదించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక, ఇటీవల ఢిల్లీ పర్యటనపై చంద్రబాబు మంత్రులకు వివరించనున్నారు. 
అయినా ఆగని మంత్రులు...
రాజధానిపై తలోమాట చెప్పవద్దని ముఖ్యమంత్రి సూచించినా మంత్రులు మాత్రం తమ అభిప్రాయాలు ఏమాత్రమూ దాచుకోలేదు. మరీముఖ్యంగా వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు... రాజధాని విజయవాడ-గుంటూరు మధ్యే ఉంటుందని, దానిపై అపోహలు అనవసరమని తేల్చిచెప్పారు. రాజధానిపై మొదటి నుంచి ముఖ్యమంత్రి అదే చెబుతున్నారని కూడా తెలిపారు. రాజధానిపై సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ కలిసి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఇక, విజయవాడ- గుంటూరు మధ్య రాజధాని వద్దని శివరామకృష్ణన్‌ కమిటీ ఎక్కడా చెప్పలేదని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. కమిటీ నుంచి తమకు ఎలాంటి నివేదిక అందలేదని చంద్రబాబు చెప్పగా... కమిటీ బుధవారం కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చిందని.. దానికి కొనసాగింపుగా మరో నివేదిక కూడా ఇవ్వనుందని నారాయణ తెలిపారు. రాజధాని అవసరాలకు వ్యవసాయ భూములు తీసుకోవాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. 
ప్రభుత్వానిదే నిర్ణయం: యనమల
రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక కేవలం ప్రభుత్వానికి సలహాలు, సిఫారసుల కోసమేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కేంద్రం రాజధానిపై తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ‘‘రాష్ట్ర విభజనపై శ్రీకృష్ణ కమిటీ పలు ఆప్షన్లు సూచించినట్లే... శివరామకృష్ణన్‌ కమిటీ కూడా ప్రత్యామ్నాయాలు చూపిస్తుంది. ఇందులో ఉత్తమమైన దాన్ని ప్రభుత్వం ఎంపిక చేసుకుంటుంది’’ అని తెలిపారు. చిన్న పట్టణాల మధ్య రాజధాని పెడితే, రాజధానితో పాటు పరిసర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని యనమల అభిప్రాయపడ్డారు. రాజధాని ఎంపిక విషయంలో ప్రతిపక్షాలకు ఏమైనా అభ్యంతరాలుంటే శివరామకృష్ణన్‌ కమిటీకి చెప్పుకోవచ్చన్నారు. ‘అసెంబ్లీలో ప్రతిపక్షానికి గొంతు ఉంటే కదా మేం నొక్కడానికి!’ అని యనమల ఎద్దేవా చేశారు. జగనే తన పార్టీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదన్నారు. జగన్‌ ప్రసంగంలో విషయం ఉండటం లేదని వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు గుంటూరులో స్పందించారు. ‘ఎవరెన్ని ప్రకటనలు చేసినా గుంటూరు జిల్లా కేంద్రంగానే రాజధాని ఉంటుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. నవ్యాంధ్రలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేది గుంటూరు జిల్లానే’’ అని తెలిపారు. 
అఖిలపక్షం పెట్టాలి: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు
రాష్ట్ర రాజధాని విషయంలో ప్రజలందరి మనోభావాలతోపాటు రాజకీయపక్షాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు డిమాండ్‌ చేశారు. ఏలూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజధాని పేరిట ఇప్పటికే రకరకాల ప్రచారం జరుగుతోందని, ఈ అనిశ్చితిని ప్రభుత్వమే తొలగించి స్పష్టత ఇవ్వాలన్నారు.
(from andhrajyothy daily)
Reactions:

Post a Comment

 1. సమైక్య రాష్ట్రంలో ఏ ప్రాంతానీ అభివృద్ధి చెయ్యకుండా హైదరాబాద్‌ని మాత్రమే అభివృద్ధి చేసి, ఇప్పుడు కొత్త ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా అలాంటి తప్పే చెయ్యాలా?

  ReplyDelete
 2. సమైక్య రాష్ట్రంలో జరిగిన పొరపాటుకూ ఇప్పటి రాజధాని గొడవకీ బోడిగుండుకీ మోకాలికీ వున్న సంబంధం వుంది.ఆ శివరాంకృష్నన్ పెద్ద మెంటల్ లాగా వున్నాడు.రాజధానిని వికేంద్రీకరించట మేమిటి నా బొంద? రాజధాని అంటే ఏమిటి?సెక్రటేరియట్, అసెంబ్లీ,హై కోర్టు ఇంకా రాష్ట్ర పరిధిలో వుందాల్సిన శాఖల ముఖ్య కార్యాలయాలు.వీట్ని తలో చోటా తగలేస్తే పరిపాలన యెలా వుంటుందో తెలుసా?ఇప్పటికీ డాక్యుమెంటేషన్ అంతా పేపర్ వర్క్ తోనే జరుగుతుందా లేదా?ఒక ఫైలు ఒక శాఖ నుంచి మరో శాఖకి వెళ్ళాలంటే పొరుగూరు వెళ్ళాలా?

  రాజధానిని చీల్చమంటాడు మెదడు వుందా అసలు, ఒక దేశానికి ఒక రాష్ట్రానికి రాజధానులు యెన్ని వుంటాయి, యెన్ని వుండాలి - కమిటీ వేశారు గదాని వేళాకోళాలు ఆడుతున్నాడేమో?అసలు కమిటీ యెవరు యెందుకు వేసారు?ఆ కమిటీ సూచనలు ఇస్తుందా, ప్రభుత్వన్నీ మంత్రివర్గాన్నీ శాసిస్తుందా?రాష్ట్ర ముఖ్యమంత్రి నేను రాజధాని ఒక చోట పెట్టాలనుకుంటున్నాను అని చెప్పాక ఆ కమిటీ మరోలా చెప్తే ఆ కమిటీ నిర్ణయాన్ని కంగారు పడి పోయి పాటిస్తే తన ఇంటెగ్రిటీ దెబ్బ తినదా? కమిటీలు సూచనలూ సలహాలూ ఇవ్వడానికే తప్ప శాసించడానికి కాదుగా వున్నది.

  ఇదివరకు జరిగిన పొరపాటు రాజధానిని పెంచడం కాదు, అభివృధ్ధి నంతా వొక్కచోట పోగెయ్యటం.అది యెలాగూ చెయ్య నంటున్నాడుగా, రాజధానిమాత్రం వొకే వొకచోట వుండటమే మంచిది. విదేశాల నుంచి వొచ్చే వాళ్ళు యేదో వొకచోట వుండే రాజధాని కే వస్తారు తప్ప పది రాజధానుల్ని చుట్టే వోపిక వుండదు వాళ్ళకి.మంత్రివర్గ నిర్ణయమే ఫైనల్.వాళ్లేదో ఐదున మాట్లాడుకుంటామన్నారుగా.అయినా చంద్రబాబు చాలా సార్లు చెప్పాక నిర్ణయం మరోలా వుంటే తను యెదవ అవుతాడు.

  అసలు కమిటీ వేసింది హడావుడి విభజనలో అప్పటికప్పుడు యే నగరం పేరు చెప్తే యేమవుతుందో అని - యే నగరం మంచిది, ప్రభుత్వ భూములు యే నగరానికి యెక్కువగా లభ్యమవుతాయి అనే సాంకేతిక కారణాల కోసం.ఇప్పుడు చంద్రబాబు భూసేకరణ కోసం కూడా పనులు మొదలు పెట్టాక - బజవాద వొద్దు అని కమిటీ సలహా ఇవ్వద మేమిటి,ఇస్తే మంత్రివర్గం కమిటీ నిర్ణయాన్నే పాటించాలనడ మేమిటి అర్ధం లేని పని!

  ReplyDelete
 3. Chattisgarh has secretariat at Raipur and High Court at Bilaspur.

  ReplyDelete
  Replies
  1. అన్నీ ఒక్క చోట వుందతం వల్ల సౌకర్యమే తప్ప అసౌకర్యం, అంటూ యేమీ వుండదు.చత్తీస్ గడ్ మోడ్ల్ సర్వోత్తమ మయినదేం కాదుగా?రాజధాని అంటే రాజధానే!

   Delete
 4. 1940 నుండి ఆంద్ర లోల్లంతా రాజధాని కోసమే. ముందు మదరాసు కావాలన్నారు. తరువాత బెజవాడ కర్నూల్ మద్దతుదారులు కొట్టుకొని సిగపట్టులు పట్టారు. రెంటి మధ్య "రాజీ" పడి హైదరాబాదు మాదన్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రహసనం షురూ :)

  ReplyDelete
  Replies
  1. విభజన కి సంబంధించి తమరి లొల్లు కూడా ఆ రాజధాని కోసమేగా!అందరూ పెంచారని కళ్లకి కనబడుతున్నా మా ప్రాంతంలో వుంది కాబ్ట్టి మాదే అని ఆదాయాన్ని లెక్కేసి న్యాయంగా పంచమన్నా కుదరన్న మీ లొల్లు సంగతి గురించి యేమిటో?! ముఖ్యమంత్రి తన నిర్ణయం చెప్పాక మరోలా జరగదు, అక్కద సమస్య యేమీ లేదు.

   Delete
  2. హైదరబాదు లేకుండా తెలంగాణా ఇస్తే మీకూ తెలిసేది ఆ బాధ యేంటో!

   Delete
  3. @Jai
   తేరగా వచ్చిన హైదరాబాద్ ఉంటె ఇలాంటి బలిసిన మాటలు ఎన్నైనా మాట్లాడొచ్చు.

   Delete
  4. http://ideechadavamdi.blogspot.in/2014/08/blog-post_28.html

   Delete
  5. @హరిబాబు: కర్నూల్ శామియానాలలో ఇంకా ఉండుంటే తెలుస్తుండే!

   @శ్రీ: మా ఊరు మాక్కాక ఇంకోల్లకు ఎందుకు వస్తది బై? పుక్కిటికి వచ్చింది గదా అని మంది సొమ్ము ముట్టే బుక్కడ వేషాలు మాకు రావు.

   Delete
  6. అవునా?గిర్గ్లానీ గారు అన్ని ప్రాంతాల వాళ్ళకీ అన్యాయం జరిగిందని ఢంకా బజాయించి చెప్తే మాకు మాత్రమే జరిగిందనే అబధ్ధాల సొల్లు చెప్పడం మాత్రం వచ్చు.ఒక చోట అవకాశాలు వుంటే వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళి లాభ పడ్డారు, వెళ్ళలేని వాళ్ళు నష్టపోయారు అని తెగేసి చెప్పాడు ఆ పెద్దమనిషి.మీరేమో ఆ గిర్గ్లానీ గారినే సాక్షాని పెట్టి టము కేశారు. ఈ రకంగా అబధ్ధాలు వాగడం మాత్రం చేతనవునా?ఆ పెద్దమనిషీ మీ green star వొప్పుకున్నట్టు యెక్కడో కృష్ణా జిల్లా వాళ్ళు రాగిలిగారు కానీ పక్కనే వున్న మీరు మాత్రం రాలేకపోవడానికి కారణ మేమిటి?యాభయ్యెళ్లయినా వందేళ్లయినా ఆ అంధ్రోళ్లని తరిమి కొట్టాకే బాగు పడదాం అని వెనక్కి బడ్దారా?ఈ టైపు వంకర పనులు మాకు చేత కావు, యేదయిన బస్తీ మే సవాల్, చెన్నయ్ ని పైకి లేపింది మేమే నని ఇవ్వాళ్తి తమిళులు కూడా వొప్పుకుంటారు, వెళ్ళి అడిగి చూడు - సాక్ష్యా లున్నాయి గాబట్టే అంత ధీమా మాకు!
   హైదరాబాదు యెదుగుదలలఓ అసలు ఆంధ్రావళ్ల భాగం నయాపైసా కూడా లేదని గుండెల మీద చెయ్యేసుకుని ధెమ్మాగా చెప్పగలవా?

   Delete
  7. This comment has been removed by the author.

   Delete
  8. నిన్నటి చరిత్రలోని నీ ప్రాంతపు పెద్దమనుషులంతేనె గౌరవం లేదు నీకు, మా కర్నూలు గుడారాల గురించి మాటిమటికీ యెత్తుతావేం?ఆనాడు హైదరాబాదు అసెంబ్లీ స్వచ్చందంగా యేకగ్రీవంగా ఆంధ్రాలో కలవడానికి వొప్పుకుంటే అది కూడా బలవంతంగా ఆంధ్రోళ్ళు వొప్పించారు అంటావు, అంటే అప్పటి మీ ప్రాంతపు నాయకుల మీద కూడా గౌరవం లేదా?మీవాళ్ళు యెదవలై వొప్పుకున్నారా?ఆంధ్రాలో కలిసాక కూడా మీరు విడిగా వొండొచ్చునని పెట్తిన డెడ్ లైనుకి ముందే కలిసిపోతాం అన్నది మీవాళ్ళు.అది తెలుసా నీకు?

   నువ్వు ఇవ్వాళ యే దాశరధి గురించి అంగ లారుస్తున్నావో ఆ దాశరధి నిజాము ని పడ దిట్టాడు.ఇవ్వాళ నువ్వు దాశరధి మంచోడు అనాలంటే నిజాము దొంగ వెధవ అనాల్సి వుంటుంది.నిజాము ని మంచోడు అనాలంటే దాసరధి నుంచి గద్దర్ వరకూ అందరూ పొగరుబోతు లవ్వాలి.చెప్పు. దాశరధిని కీర్తిస్తావా?నిజాముని కీర్తిస్తావా?ఏక ఇద్దర్నీ పక్క పక్కన పెట్టుకుని మందిరాలు కట్టి పూజిస్తావా?

   Delete
  9. @హరిబాబు: హైదరాబాదు అసెంబ్లీలో తీర్మానం అయ్యిందా, చెవిలో పువ్వు పెట్టనీకే నేనే దొర్కిన్నా. ఆంద్ర అసెంబ్లీ తీర్మానం ముచ్చట మాత్రం మీకు తెల్వకపాయే!

   గొరవం అంటే ఏందో నాకు తెల్వక అడుగుత. దాశరధి *కొన్ని రోజులు* విశాలాంధ్ర కావాలని అనుడు ఆయన ఇష్టం. ఆయన అన్నడు కాబట్టి గంగిరెద్దు లక్క తలాడించుడు గౌరవం కాదు దీవానాతనం.

   దాశరధి మంచోడో ఉస్మాన్ అలీ మంచోడో ఇద్దరు కొంచం కొంచమొ నా సోయి నాకున్నది. ఎవ్వల్ని అడగాల్నో వాళ్ళను అడుగుతం ఊరందరికి రంది ఎందుకు?

   "దాసరధి నుంచి గద్దర్"

   Narayanrao Pawar, Shaik Bandagi, Shoaibulla Khan, Kaloji Narayana Rao, Maqdoom Mohiuddin etc.

   Delete
  10. సూరనేని గారు,

   హైదరాబాదు తెలంగాణా అంతర్భాగం, అది లేకుండా తెలంగాణా ఇచ్చే అవకాశమే లేదు. అలాగే కర్నూలు గుడారాల్లో ఇమడలేక ఆంధ్రులు తెలంగాణలో కలిశారన్నది ఆంద్ర అసెంబ్లీలో సంజీవరెడ్డి ప్రసంగం సాక్షిగా అంతే వాస్తవం.

   ఇక ఈ విషయంలోకి దాశరధిని లాగడం అన్నది పూర్తిగా అసంబద్ధం. అది మీ పెరిగిన రక్తపోటుని మాత్రమే సూచిస్తోంది. స్వంత వివేచన లేకుండా దాశరధి ఒకాయన్ని తిట్టాడని, గద్దర్ ఇంకొకాయన్ని తిట్టాడని, గాంధీని ఫలానా ఆయన తిట్టాడని, రాజాజీని ప్రకాశం తిట్టాడని... ఇలా లింకులు పెట్టుకుంటూ పొతే... చివరకు ఎక్కడికీ వెళ్ళలేమన్నది మీరు గ్రహించాలి.

   ఇక వలసల విషయానికి వస్తే.. మీరు ఇప్పుడూ రావచ్చు, మీకంత సీను గనక వుంటే. దానికి సమైక్య రాష్ట్రంలో అధికారబలమే ఎందుకు కావాలి?

   Delete
  11. అసలు మీవాళ్ళు కలవదానికి వొప్పుకోకపోతే కలవదం యెలా జరిగింది?అంధ్రా నుంచి సైన్యం వెళ్ళి హైదరాబాదు రాష్ట్రాన్ని లొంగదీసుకుందా?

   Delete
  12. Who is unaware about the deceptive Gentlemen's Agreement?

   Delete
  13. ఇన్ని రోజులు అందరిదీ ఇప్పుడు మీది మాత్రమె ఎలా అయింది బై. ఇది మంది సొమ్ము గాక మరి ఏందీ? పోనీ హైదరాబాద్ ఇంత అభివృద్ది కావడం లో తెలంగాణా వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా? మొదట నిజాం కట్టిండు, తరువాత కేంద్రం నుండి ఏమైనా సంస్థలు వచ్చాయి అంటే అవి ఆంధ్ర ప్రదేశ్ కి రాజధాని అనే , తెలంగాణా లో ఉందని కాదు. ఇంకా ఏమైనా అభివృద్ది అయ్యింది అంటే ఇతర రాష్ట్రాల వారు (మార్వాడీ లు లాంటి వాళ్ళు), ఆంధ్రా CM ల ముందు చూపు , ఆంద్ర ప్రదేశ్ ప్రజలు పెట్టుబడి పెట్టడం వల్లనే( అది కూడా రాజధాని అందరిదీ అనుకుని). అంటే కానీ హైదరాబాద్ అభివృద్ది లో కానీ , బ్రాండ్ ఇమేజ్ లో కానీ తెలంగాణా వాళ్ళ పాత్ర దాదాపు శూన్యం. ఇన్ని రంగాలున్నాయి, తెలంగాణా వాళ్ళు ఏ రంగం లో హైదరాబాద్ అభివృద్ది లో ముందున్నారు చెప్పు? ఫార్మా? హాస్పిటల్స్? నగర అభివృద్ది ? మీడియా? ఎంటర్టైన్మెంట్? సినీ రంగం? ఒక్క రంగం చెప్పు. ఓహ్ బంద్ లు చేయడం లో, ఉన్న విగ్రహాలని కూలగొట్టడం లో (తాలిబాన్లు బుద్ధుడి విగ్రహాలు కూలగొట్టడం గుర్తుందా), దౌర్జన్యం చేయడం లో, కష్టపడకుండా అప్పనంగా కొట్టేయడం లో మాత్రం ముందున్నారు.

   ఇక ఇదే టపాలో మా రంది అందరికీ ఎందుకు అంటివి. ఆంద్ర మేలు కోరేవాడివి అయితే ఓకే. ఇంత ద్వేషించే వాడివి నీకెందుకురా బై ఆంద్ర రాజధాని గురించి. పైగా మా బతుకు మేం బతుకుతాం అంటిరి. బతకండి. ఎక్కడ పడితే అక్కడ ఏవేవో ఎందుకు పెడతారు? ఇంకో విషయం నిజం చెప్పితే నిష్టూరం ఎందుకు అంటివి. నిజాం చెప్పు కింద బాంచన్ కాల్మొక్తా అని పడి ఉన్నవాళ్ళు పటేల్ వచ్చి భారత దేశం లో విలీనం చేయక పోయి ఇప్పటికీ నీతో సహా అందరూ గోచీ కట్టుకుని కళ్ళు మొక్కుకుంటూ అలాగే ఉండే వాళ్ళు అంటే నీకు ఎలా ఉంటుంది. చెప్పేదేంటంటే అప్పుడు జరిగింది ఏంటో తెలుసుకోవాలను కుంటే మేము తెలుసు కుంటాం. మీ లాంటి చరిత్ర వక్రీకరులు చెప్పక్కర్లేదు. పనికి మాలిన మాటలు మాట్లాడకుండా ఏదైనా పనికి వచ్చే సూచనలు చర్చ ఉంటె చేయండి లేదంటే తెలంగాణా లో సవాలక్ష సవాళ్ళు ఉన్నాయి అంటిరి కదా వాటి మీద ద్రుష్టి పెట్టండి.

   Delete
  14. //మా ఊరు మాక్కాక ఇంకోల్లకు ఎందుకు వస్తది బై? పుక్కిటికి వచ్చింది గదా అని మంది సొమ్ము ముట్టే బుక్కడ వేషాలు మాకు రావు.//

   భద్రాచలం, పోలవరం ముంపు గ్రామాలు, ప్రస్తుతం తిరుమలలో టికెట్లలో 42% వాటా... ఒకప్పుడు ఇవేవీ తెలంగాణావారివి కాదు కదండీ..!!

   //దాశరధి మంచోడో ఉస్మాన్ అలీ మంచోడో ఇద్దరు కొంచం కొంచమొ నా సోయి నాకున్నది.//
   చివరి నవాబు గురించే కదా మీరు మాట్లాడేది? చివరి నవాబు మంచోడంటే... ఒకప్పుడు చేసిన తెలంగాణా పోరాటాన్ని అవమానించడమే..! అప్పటి ప్రజల పోరాటాలను కించపరచడమే అనిపిస్తుంది నాకు. వారి చేసిన పోరాటాలు, నిజాము అరాచకాలు ఒకసారి చదవండి.

   Delete
  15. @శ్రీకాంత్ చారి
   అధికార బలంతో రావడం ఏందీ రా బై దిమాక్ ఉండే మాట్లాడుతున్నావా? నా లాంటి సామాన్యుడు హైదరాబాద్ కి ఎలా వచ్చాడు అధికార బలంతోనా?

   ఒక రూం లో ఉండి వంట చేసుకుని చదువుకునే వాడి దగ్గర నుండి పొట్ట చేత బట్టుకుని హైదరాబాద్కి వచ్చి ఏ అపార్ట్ మెంట్ వాచ్ మాన్ గానో ఇస్త్రీ పెట్టె పెట్టుకునో బతికే వాడు కూడా అధికార బలం తోనే హైదరాబాద్ కి వచ్చిండా? ఒక రూం లో ఉండి వంట చేసుకుని చదువుకునే వాడి దగ్గర నుండి పొట్ట చేత బట్టుకుని హైదరాబాద్కి వచ్చి ఏ అపార్ట్ మెంట్ వాచ్ మాన్ గానో ఇస్త్రీ పెట్టె పెట్టుకునో బతికే వాడు కూడా అధికార బలం తోనే హైదరాబాద్ కి వచ్చిండా? తెలంగాణా వేర్పాటు వాద ఉన్మాదం నుండి బయటకి వచ్చి మాట్లాడితే బాగుంటుంది.

   Delete
  16. @శ్రీ,

   "ఒరే శ్రీగా" అని మిమ్మల్నీ సంభోధిస్తూ వ్రాయగలను. కాని అది ఇక్కడ బాగుండదు. నాకు మీతో అంతటి అనుబంధమూ లేదు. నాతో వాదించాలనుకుంటే దయచేసి తమరు సరయిన భాష ఉపయోగిస్తే మంచిది. ఆ పైన కొండలరావుగారిష్టం.

   ఇక తమరి అభ్యంతరం సంగతి చూద్దాం.

   నేనన్నది...

   ఇక వలసల విషయానికి వస్తే.. మీరు ఇప్పుడూ రావచ్చు, మీకంత సీను గనక వుంటే.

   దీనర్థం... ఒక రూములో వుండి వంట చేసుకొనే వాడు, ఇస్త్రీ పెట్టె పెట్టుకొనే వాడు, వీళ్ళండరూ ఇప్పుడూ రావచ్చు అని. ఇప్పుడూ రావచ్చు అంటే ఇదివరకూ వచ్చారు అని... వారికి అధికార బలం అవసరం లేదు అని. అటువంటి సీను వుంటే రావడంలో ప్రాబ్లం లేదు అని.

   దానికి సమైక్య రాష్ట్రంలో అధికారబలమే ఎందుకు కావాలి?

   దీనర్థం... విడిపోయాక హైదరాబాదు రాలేమని డీలాపడేవారు కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకొనే వారేనని... మేం వెళ్ళగొట్టేదీ వాళ్ళనేనని. తమరి "పూరా దిమాక్"కు ఇప్పుడు సమజైందనుకుంటాను.

   Delete
  17. కర్నూలులో నేటి మెడికల్ కాలేజీ అప్పటి సెక్రటేరియేట్
   నేటి జిల్లా కోర్టు నాటి అసెంబ్లీ. ఇలా కర్నూలులో నేడు పలు ప్రఖ్యాత భవనాలు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్ర పరిపాలనా భవనాలు. ఈసారి ఎవరైనా ‘శామియానాలు.. డేరాలు’ అని పిచ్చి కూతలు కూస్తే చెప్పు తీసుకుని కొట్టేయండి హరిబాబుగారూ

   Delete
  18. This comment has been removed by the author.

   Delete
  19. @శ్రీకాంత్ చారి
   మీ భాషలో మాట్లాడితే అంత కోపం ఎందుకు ర బై. బండ బూతులు తిట్టి మా భాష ఇట్లానే ఉంటది అని మీరే అంటిరి (no offense to other telangana people)

   ఇక అనేవన్నీ అంటారు అదేమని అడిగితె దోచుకునే వాళ్ళతోనే మా పంచాయితీ అని మాట తిరగేస్తారు. మరి ఎవరైనా రావొచ్చు అనే వాళ్ళు సీను లాంటి కండ కావరం మాటలెందుకు? ఇక సీన్ గురించి మీతోనే చూడు మేము నేర్చుకోవాల్సింది. పోటీ పడలేక, చేత గాకనె కదా పెద్ద మనుషుల ఒప్పందాలూ వేర్పాటువాద ఏడుపులూ. లేకపోతె తెలంగాణా నడి బొడ్డున మిగిలిన ప్రాంతాల వాళ్ళంతా బాగుపడుతుంటే తెలంగాణా వాళ్ళు ఎందుకు రాణించలేకపోయారు.

   "దీనర్థం... విడిపోయాక హైదరాబాదు రాలేమని డీలాపడేవారు కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకొనే వారేనని... మేం వెళ్ళగొట్టేదీ వాళ్ళనేనని"
   ఒహో అయితే కేవలం అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచుకునే వాళ్ళు మాత్రమె ఇప్పుడు హైదరాబాద్ రాలేమని డీలా పడతార? మిగిలిన సామాన్య ప్రజలంతా ఏ ఇబ్బంది లేకుండా రావచ్చు అంటావ్. సరే కొత్తగా వచ్చే వాళ్ళ సంగతి వదిలెయ్యి. దశాబ్దాలుగా ఉన్న వాళ్ళ సంగతేంటి? వాళ్ళలో ఇస్త్రీ పెట్టె పెట్టుకునే వాడి పిల్లలకి ఎందుకు మిగిలిన వాళ్ళ లాగ హక్కులు ఇవ్వకుండా నిరాకరిస్తున్నారు (ఫాస్ట్ లాంటి పథకాలు పెట్టి ?). న్యాయంగా ఉద్యోగం తెచ్చుకుని రెండు మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ లోనే అన్ని బంధాలూ (సామాజిక, ఆర్ధిక) ఏర్పరచుకున్న వాళ్ళని సెక్రటేరియట్ గేటు దాటి రానివ్వం, జీతాలు ఇవ్వం లాంటి మాటలు ఏంటి (నేను అక్రమంగా ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళ గురించి మాట్లాడటం లేదు). వాళ్లకి హక్కులుండవా? ఆంధ్రా వాళ్ళు ఎక్కువగా ఉన్న కాలోనీ ల లోనే కూల్చివెతలు ఎందుకు జరిగాయి. అదే కాలనీ లో మంత్రి మహేందర్ రెడ్డి ఇల్లు ఉన్నా ఎందుకు కూల్చబడలేదు? పాత బస్తీ లోనే అక్రమ నిర్మాణాలు ఎందుకు కన్పించలేదు?
   అంటే నువ్వు చెప్పేదేంటంటే దశాబ్దాలుగా ఉన్నా కూడా వాడిని ఇక్కడి వాడిగా పరిగణించం. కొత్తగా వచ్చే వాళ్ళు సుబ్బరంగా రావచ్చు, సెకండ్ గ్రేడ్ సిటిజెన్ లాగ బతకొచ్చు. అంతే కదా.

   Delete
  20. @Sreekaanth chaari
   కలిసుండటం వల్లనే మా కన్యాయం జరిగిందని విడిపోతే యే న్యాయం వెయ్యి కాంతులతో వికసిస్తుందని వాళ్ళు అంటున్నారో ఇవ్వాళ్టి తెలంగాణా ఆ నమ్మకాన్ని కలిగించే విధంగా వుందా?యెన్నికల్లో గెలిచి మంత్రివర్గంలో వున్నవాళ్ళలో గానీ అక్కడ పై స్థాయిలో చక్రం తిప్పుతున్న వాళ్ళలో గానీ ఆ నమ్మకాన్ని కలిగించే కొత్త ముఖాలు మీ కెక్కడయినా కనబడినాయా?కేసీఆర్ కుటుంబమూ, రెడ్లూ మరియూ వెలమలూ హవా హవాయీ అన్నట్టుగా వున్నారు! కోడి పోయి కత్తి వచ్చె డం డం డం అన్నట్టు ఆంధ్రా రెడ్లు పోయి తెలంగాణా రెడ్లు వచ్చె డం డం డం అనేట్టుగా వున్న ఈ కొత్త సీసాలో పాత సారా తంతు కోసమేనా అంతగా అంగ లార్చింది?
   ref:http://harikaalam.blogspot.com/2014/09/blog-post.html

   Delete
  21. @Sree,

   ఏంట్రొరేయ్ శ్రీగా, నా భాషలో మాట్లాడాలని ఏదవ ప్రయత్నాలు చేత్తన్నావ్? నీకు రాదు గాని ఇక చాల్లేహె!!

   ఇది నా భాష కాదు, నీ భాష. నువ్వు నిందార్థక భాష వాడుతూ అది మీ భాష అనడంలోనే నీ కండ కావరం కనిపిస్తుంది. పైగా no offensive అనడం మీకే చెల్లుతుంది. ఎదుటివాడిని దూషిస్తే అది తెలంగాణా భాష, లేక పోతే ఆంధ్రా భాష అన్న నీ కండకావరం ముందు వదలాలి. అప్పటివరకూ నీకు నాకు పొసగదు.

   తెలంగాణా వారు రాణించారా రాణించలేదా అనేది చాలా పెద్ద చర్చ. అది నీలాంటి పూర్తి మెదడుగాళ్ళకు అర్థం కాదు. అయినా ప్రయత్నిస్తాను.

   అధికారం వున్నోడితోని అధికారం లేనోడు ఎప్పుడూ గెలిచి రాణించలేదు. ఉదాహరణకు APPSC పరీక్షలో 85% మార్కులొచ్చిన తెలంగాణ పిల్లలను కాదని 46% మార్కులొచ్చిన సీమాంధ్రులకు DSP పోస్టులు ఇవ్వడం వాస్తవం కాదా? డెంటల్ స్పెషలైజేషన్ లో ఒకటవ రాంకు వచ్చిన తెలంగాణా వాడిని వదిలేసి నాలుగో రాంకు వచ్చిన సీమాంధ్రుడికి సీటు కట్టబెట్టడం వాస్తవం కాదా? ఇలా బయట పడ్డవి కొన్ని, బయట పడనివి ఎన్నో. సమైక్య సీమాంధ్ర పాలన చరిత్ర మొత్తం అవినీతి, ప్రాంతీయ పక్షపాతపు రొచ్చు తప్ప మరేముంది? అందుకే అధికారపు దన్ను లేకుండా వచ్చి మీ రాణింపు ఋజువు చేసుకొమ్మన్నాను.

   పోటీ గురించి మాట్లాడి అంతలోనే పిల్లి మొగ్గలు వేసి ఒక సంక్షేమ పథకాన్ని అడ్డు పెట్టుకోవడం మీకే చెల్లింది. అంటే సంక్షేమ పథకాల్లో లబ్ది చేకూరిస్తే గాని పోటీ పడలేరన్న మాట తమరు!

   మీ ప్రాంతానికి వస్తే ఏ గ్రేడు సిటిజెన్ గా బతకనిస్తారో అందరికీ తెలుసు. అందుకే గుజరాత్, ముంబాయి, గల్ఫ్ వదిలేసి మీదగ్గరికే పోలో మని వలస వెళ్తున్నారు మరి! మేం అలా కాదు. మీరు శుభ్రంగా అందరిలాగే బతకొచ్చు. కాని మా సంక్షేమ పథకాలు చూసి ఇక్కడికి వచ్చి బావుకుందామంటే మాత్రం కుదరదు.

   కూల్చి వేతల గురించి నీ అఙ్ఞానానికి చింతిస్తున్నాను. వాటిలో ఎన్నో తెలంగాణా వారికి కూడా వున్నాయని తమరి చానెళ్ళే చెప్పాయి.

   Delete
  22. హరిబాబు గారు,

   విడిపోతే ఏం జరుగుతుందో మాకు పూర్తి అవగాహన వుంది. విడిపోయినంత మాత్రాన సర్వం మారుతుంది అని మేం అనుకోలేదు. మేం పోరాడింది ప్రాంతీయ దోపిడీ పైననే. రెడ్డొచ్చి మొదలాడినట్టు ఇప్పుడు ప్రాంతీయ దోపిడీ లేనే లేదు అని మీరు మళ్ళీ మొదలు పెడితే సమాధానమిచ్చే ఓపిక నాకు లేదు. ఉందని మేం గుర్తించాం, పోరాడాం, సాధించాం. మిగతా సమస్యలు దేశం మొత్తమ్మీద ఎలా వున్నాయో తెలంగాణాలోనూ అలానే వుంటాయి. వాటికోసం మీరూ, నేనూ అందరూ కలిసికట్టుగా దేశవ్యాప్తంగా పోరాడి సరయిన చట్టాలను తీసుకు రావలసి వుంది. అప్పుడు గాని ఆ సమస్యలు పరిష్కారం కావు.

   Delete
  23. @sreekaanth chaari
   ఈ అవగాహనా, శాంతమూ, ఔన్నత్యమూ - కర్నూలు గుడారాలు అనకుండా - వుండి వుంటే అసలు ఈ రగడ అంతా రగిలేదే కాదు గదా?

   Delete
 5. @Sreekaanth chaari
  ఇక వలసల విషయానికి వస్తే.. మీరు ఇప్పుడూ రావచ్చు, మీకంత సీను గనక వుంటే. దానికి సమైక్య రాష్ట్రంలో అధికారబలమే ఎందుకు కావాలి?
  >>
  ఆంధ్రాలో రాజధాని యేర్పడిన మరుక్షనం మెడ మీద తలకాయ వున్న ఆంధ్రావాడెవడూ తెలంగాణాలో వుండడు! టాంక్ బండ్ మీద మా వాళ్ళ విగ్రహాలనే భరించలేని వాళ్ళు మనుషుల్ని వుండనిస్తారనుకోవడం భ్రమ!!పొమ్మనకుండా పొగబెడుతూనే పోకండి బాబులూ కడుపున బెట్టుక చూసుకుంటాం అని అనగలిగిన గొప్పవాళ్ళు మీరు!ఆ తైపు రెండురకాల మతలబులు మాకు అర్ధం కావు లెండి. నిజాము చెడ్దవాడని మాకెలా తెలిసింది? మీరు తిట్టిన తిట్లతోనే గదా మాకు తెలిసింది.మళ్ళీ నిజాము మంచోడు అంటున్నదీ మీరే.ఆ మాట ఇక్కద మా ముందు కాదు గానీ - నిజాము మూలంగా తమ కుటుంబాల్లో ప్రాణాలూ మానాలూ కోల్పోయిన కుటుంబాల్లోని వ్యక్తుల ముందు చెప్పండి, చెప్పగలరా?

  ReplyDelete
  Replies
  1. హరిబాబు గారు,

   మీ టైపు మతలబులేమిటో మాకు తెలుసు లెండి. ఎందుకు లేని గొప్పలు? రాష్ట్రం విడిపోయినా ఎవరి పత్రికలు, ఎవరి చానెళ్ళు ఇక్కడ నడుస్తున్నయో చూస్తలేమా? ఒక్కసారి మా చానెళ్ళు మా పత్రికలు మీ దగ్గర ఎంతవరకు నడుస్తున్నయి. మా విగ్రహాలు మీతాన ఎక్కడ వున్నయి చూసినంక మాట్లాడండి మీ వుదారత ఏందో.

   రాజధాని ఏర్పడ్డాక బ్యూరాక్రాట్లు పోతరేమో. వారు కాక లక్షలాది మంది సీమాంధ్రుల్లో ఎంత మండి పోతరో మీరే చూడొచ్చు. ఆ తర్వాత ఆలోచించొచ్చులెండి మీ మెడమీద తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో.

   పదే పదే, నిజాము, మానాలు అంటూ దెప్పి పొడవనవసరం లేదు. నిజాం హయాంలో మావారి మాన ప్రాణాలు తీసినట్టే, బ్రిటీషోడు మీ మానప్రాణాలు కూడా తీసిండు. అయినా కూడా చేసిన మంచి పనులు తలుచుకొని మీరు కింగ్ జార్జ్ హాస్పిటలు అని పిలుచుకుంటున్నరు. అంటే కాని కింగ్ జార్జ్ టైముల ఫలానా ఇంగ్లీషోడు ఆంధ్రా స్త్రీని ఉంపుడు గత్తెగ వుంచుకున్నడు, ఇంకోడు ఇంకొకామెను పాడు చేసిండు కాబట్టి ఆ ఆస్పత్రి పేరు మార్చాలి అని ఎందుకు అనుకోవడం లేదు? మీలాంటి పెద్దలు సరైన అవగాహన పెంచుకొని ఇటువంటి చిల్లర కామెంట్లకు దిగక పోతె బాగుంటది.

   Delete
  2. This comment has been removed by the author.

   Delete
  3. @sreekaanth chaari,
   పదే పదే, నిజాము, మానాలు అంటూ దెప్పి పొడవనవసరం లేదు....అంటే కాని కింగ్ జార్జ్ టైముల ఫలానా ఇంగ్లీషోడు ఆంధ్రా స్త్రీని ఉంపుడు గత్తెగ వుంచుకున్నడు,..
   >>
   మూర్ఖంగా మిమ్మల్ని మెప్పించతానికి కాకుండా ఒక విషయం చెప్తాను అర్ధం చేసుకోండి!స్త్రీ తన ఇష్టాపూర్తిగా చేసిన యే పనినీ మన సాంప్రదాయం తప్పు పట్టదు.
   సాక్ష్యాని వస్తే వ్యాసుడు "గంగ నిజాంగ దీప్తులు వెలయంగ" శంతనుడి తండ్రి అయిన సుతీక్ష్ణ మహారాజు తొడ మీద కూర్చుని వగలు పోయింది.ఆయన నేను ఇప్పుడు వీటికి స్పందించే మనస్తత్వంలో లేను, కూతురు కూర్చోవాల్సిన కుడి తొడ మీద కూర్చున్నావు, నా కొడుకు శంతనుడ్ని చూసుకో మన్నాడు. శివ సముద్రుల భార్య అయి వుండీ లోకంలో పాపా లన్నిట్నీ కడిగే గంగను ఆ సన్నివేశంలో నిలబెట్టేటప్పుడు వేదవ్యాసుడు యే విధమయిన సంకోచమూ పడలేదు.తన కావ్యంలోని పాత్రే అయినా తప్పు చేయిస్తున్నానేమో అని సందేహ పడలేదు.వాత్స్యాయనుడు పారదారికం అనే ఒక చాప్టరే రాసాడు - స్త్రీ తన భర్త ద్వారా లైంగిక సుఖం పొందలేకపోతే యెవరితో నైనా కోరిక తీర్చుకోవచ్చునని ఆ చాప్టర్ సారాంశం.

   మీరు పోల్చగూడని విషయాల్ని పోలుస్తున్నారు.నా జవాబు కరెక్టా కాదా అని ఆలోచించడానికే ఇంత సమయం తీసుకున్నాను.ఇవన్నీ మౌలికమయిన భారతీయత అనే మన కామన్ హెరిటేజికి సంబంధించిన విషయాలు.చాలా కాంప్లికాటెడ్, యెక్కువగా చర్చించడానికి గూడా మన పాండిత్యం చాలదు.

   ఇక్కడ విషయం అది కాదు, ప్రజల్ని రక్షించాల్సిన ప్రభువే ప్రజల మీదకి ఆ అజాకార్ల మందని పంపిచాడు(నేను సొంతంగా చూడలేదు, మీరు చెప్పినదే ఈ విష్యం కూడా), అయినా సమర్ధించుకుంటాం అంటే నాకు అభ్యంతరం లేదు.నేను ముందే చెప్పినట్టు మీరు ఒప్పించాల్సింది మమ్మల్ని కాదు - నిజాము మూలంగా తమ కుటుంబాల్లో ప్రాణాలూ మానాలూ కోల్పోయిన కుటుంబాల్లోని వ్యక్తుల ముందు చెప్పండి, చెప్పగలరా?

   Delete
  4. హరిబాబు గారు,

   ఏ రాజు చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం
   నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం - శ్రీశ్రీ

   మీరు చెపుతున్నది ఎలా వుందంటే... మోటుగా చెప్పాలంటే... మా వాళ్ళను బలవంతం చేసినట్టు, మీరు మీ అంత మీకై వెళ్ళినట్టు... ఇది వాస్తవమా? మీ చరిత్ర కారులే చెప్పాలి.

   నిజాము చరిత్ర గురించి మాట్లాడే మీరు బ్రిటిష్ పాలన గురించి కూడా అధ్యయనం చేయండి.
   http://listverse.com/2014/02/04/10-evil-crimes-of-the-british-empire/
   http://www.theguardian.com/commentisfree/2012/apr/23/british-empire-crimes-ignore-atrocities


   రజాకార్లను పంపిన నిజాం ఎంతటి నేరస్తుడో, క్రూరమైన దోపిడీ దార్లను పంపిన బ్రిటిష్ రాజూ అంతే నేరస్తుడు.

   ఏ రాజ్యమైనా తిరుగు బాటు చేసిన ప్రజలను తీవ్రంగా అణచి వేస్తుంది. అందులో మారణకాండ, మాన ప్రాణ హాని సర్వ సాధారణం. మేం వాటిని డాక్యుమేంట్ చేసుకున్నాం. మీరు గుర్తించడానికే నిరాకరిస్తున్నారు... అంతే తేడా.

   అంతెందుకు? రాజీవ్ గాంధీ పంపిన IPKF చేసిన దారుణాలను ఇక్కడ చూడండి.
   http://www.tchr.net/reports_commission_IPKF.htm

   అందుకని రాజీవ్ గాంధీని యుద్ధ నేరస్తునిగా పరిగణిద్దామా? అతని గుర్తులన్నీ చెరిపి వేద్దామా? గుజరాత్ లో మోడీ పాలనలో జరిగిన దారుణాలకు ఆయన ఎంతవరకు బాధ్యుడు?

   ఇలా మీరు మిగతావన్నీ పక్కకు పెట్టి కేవలం నిజాం పాలనలో జరిగిన అకృత్యాలను పదే పదే వేలెత్తి చూపబోవడం కూడా తెలంగాణా పై దాడిగానే భావించ వలసి వుంటుంది.

   తెలంగాణా పోరాటం తీవ్రరూపంలో వున్నపుడు సమైక్యాంధ్రలోని ప్రజాస్వామ్య ప్రభుత్వం ఎలా ప్రవర్తించింది. ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు ఆర్పి వేసి బాలికల హాస్టల్ లో ప్రవేశించి ఎందుకు దాడి చేసింది? ఆ రోజు ఆంధ్ర చానెళ్ళు మొత్తం మూగనోము పడితే, ఒక్క జీ TV లైవ్ కవరేజీ లేక పోతే పరిస్థితి ఏమై వుండేది?
   http://timesofindia.indiatimes.com/AP-cops-molested-Osmania-Univ-girls/articleshow/5587789.cms

   అంతటా జరిగినట్టే నిజాం పాలనలో అకృత్యాలు జరిగాయి. నైజాం ప్రజలు తిరగబడ్డారు కాబట్టి వారిపై మిగతా వారికంటే ఎక్కువగానే అకృత్యాలు జరిగాయి. అలాగే నిజాం పాలనలో మంచి పనులు కూడా జరిగాయి. నిజాం సాగర్ ప్రాజెక్టు, ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా, Orthopedic Hospital, Niloufer Hospital, గండిపేట చెరువు లాంటి ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయి.

   మేం దేనికదే గుర్తించాలి అంటున్నాం. మీరు నిజాం attrocities మాత్రమే గుర్తిస్తాం, అభివృద్ధిని గుర్తించం అంటున్నారు. మీకు మాకు అంతే తేడా.

   Delete
  5. @sreekaanth chaari
   మీరు చూపించిన లింకుల్లో మీరు నాకు తెలియని చరిత్రని యేమీ చూపించ లేదు.మీమీద జాలి ఇంకా యెక్కు వయింది!!ఇవ్వాళ హైదరాబాదులో వున్న పుంజీడు మందిని సంతోష పెట్టి రాజకీయంగా లాభపడతం కోసం నిన్నటి రోజున గొరీ కట్టాలని ప్రదర్శించిన ఆవేశాన్ని ఒక్కసారిగా మలిక తిప్ప లేక ఒక మధ్యేమార్గపు ట్రాన్సిషన్ కోసం రాజు లంతా వొకటే అని నిరూపించాలని మీరు పడే అవస్థలు చూస్తుంటే అయోమయంగా కూడా వుంది!!!
   ఇంగ్లీషు వాళ్ళు రజాకారు తండాల్ని జనం మీదకి పంపించారా?తుపాకులు పని చేస్తున్నాయో లేదో అని కాల్చి చూసి తేల్చుకున్నారా?ప్రపంచంలో యెవడి నన్నా హైదరాబాదు లోకి అడుగు పెట్టనివ్వండి గానీ తెలంగాణా వాళ్లని అడుగు పెట్ట వివ్వద్దని హుకుంలు జారీ చేసారా?ఇంగ్లీశు వాళ్ళు రైలు మార్గాలు వేసారు, టెలిగ్రాఫు తీగల్ని వేసారు అని కాంగ్రెసు వాళ్ళు అన్నారు గానీ మేము వొప్పుకున్నామా?వాళ్ళు లేకపోయినా అవన్నీ వచ్చి వుండేవని క్షాత్రం గల ప్రతివాడూ ఇంగ్లీషు వాళ్లని ప్రశంసించే వాళ్ళని కూడా ధిక్కరించటం లేదా?శత్రువులో మంచిని వెతికిన గాంధీ, అతని అనుయాయులూ తప్ప ఇంగ్లీషు వాళ్ళ ప్రభుత్వాన్ని పొగిడే వాడు యెవదయినా వున్నాడా ఈ దేశంలో?

   Delete
  6. హరిబాబు గారు,

   నామీద మీరు జాలి పడతారో మీ మీద నేను జాలిపడాలో తరవాత ఆలోచిద్దాం లెండి. పుంజీడు మందితో పొత్తు పెట్టుకున్నది మీ చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి. అందుకోసం వారు నిజాంను పొగడలేదే మరి? ఆ పుంజీడు మండికోసం బాబు గారు మోడీని నరరూప రాక్షసుడు అని కూడా తిట్టాడన్న సంగతి మరిచి పోయారా? అంతటివారికే నిజాం అవసరం లేనపుడు వేరే వారికి ఎందుకుంటుంది? ఆ పుంజీడు మంది కనీసం తెలంగాణా ఉద్యమానికి కూడా సాయపడ్డవారు కాదు గదా? అయితేనేం లెండి, వక్ర దృష్టితో చూడ దలుచు కున్నపుడు అన్నీ మనకు కావలసినట్టుగానే కనపడతాయి.

   1911లోనే నిజాం మరణశిక్ష రద్దు చేశాడన్న విషయం తెలుసా మీకు? బ్రిటన్‌లో భారతదేశంలో ఇప్పటికీ అది రద్దు కాలేదు. మరి అంతటి liberal భావాలు కలిగిన వ్యక్తి రజాకార్లను ఎలా పంపగలడు? విప్లవ కారులను తీవ్రంగా అణచి వేయాలని నిజాంపై వత్తిడి తెచ్చిందెవరో తెలుసా మీకు? పుంజీడు హిందూ జాగీర్దారులే. చరిత్రలో ఆ మకిల అంటినవారు చాలామంది వున్నారు.

   నిజాంని గాని, రజాకార్లను ఎవరూ నెత్తిన పెట్టుకోవడం లేదు. పైగా MIMతో అంట కాగింది ఆంధ్ర దోపిడీ దారులే. విషయం అలా వుంటే ఎప్పుడో ఏదో సండర్భంలో నిజాం చేసిన మంచి పనులను KCR పొగిడితే అదే సాకుగా దొరకబుచ్చుకొని చిల్లర వేశాలు వేయడానికి బయలుదేరడం వెనుక అసలు విషయం తెలంగాణ వాదాన్ని బలహీన పరచడానికి, తెలంగాణ ప్రజల్ని ఆత్మరక్షణలో పడేయడానికే తప్ప మరోటి కాదు.

   ఇప్పుడు కూడా అదే వంచన. అసలు ఇక్కడ జరగ వలసిన చర్చ ఆంధ్ర రాజధానిపై చంద్రబాబు కుప్పి గంతుల గురించి. కాని మీరు దీనిలోకి కావాలని నిజాం చర్చను పట్టుకొచ్చారు.

   అప్పుడు పుంజీడు మంది వోట్లకోసం మోడీని నరరూప రాక్షసుడని తిట్టిన మనిషి, ఇప్పుడు తన కులగజ్జితో, కమిటీ వద్దని మొత్తుకున్నా కూడా విజయవాడని రాజధాని చేస్తానని చెపుతుంటే, దాన్ని సమర్థించలేక మీరు పడుతున్న అవస్థలు చూసి నిజంగా నేను జాలి పడుతున్నాను.

   Delete
  7. This comment has been removed by the author.

   Delete
  8. రాజకీయ నాయకులతో నాకు యేనాడూ సంబంధం లేదు.నిన్నటి రోజున నిజాము అన్యాయాల గురించి మీరు చెప్తేనే తెలిసింది.ఇవ్వాళ మళ్ళీ మీరే పొగడ్దం చూసి అయోమయానికి గురయ్యాను. యెన్నికల్లో గెలవదానికి ప్రతీ వాడూ వాగే టెంపరరీ చెత్త మాటల్తో వాళ్ళకి వోటేసిన వాడికే సంబంధం వుందదు! రాజకీయ నాయకుల తాత్కాలికమయిన స్టేట్మెంట్లని గురించి కాదుగా మనం మాట్లాడుకుంటున్న ప్రస్తుత విషయం, సార్వకాలికమయిన చరిత్ర గురించి కదా!

   మీరు లింకుగా ఇచ్చిన ఇంగ్లీషు వాళ్ళ దారుణాలకి సంబంధించిన విషయమే తీసుకోండి.ఇక్కడ మనవాళ్ళ కన్నా షెరిడన్ అనే ఒక ఇంగ్లీషు వ్యక్తి భారత దేశంలో వాళ్ళ ప్రబ్జుత్వం చేసే అరాచకాల్ని గురించి తెలుసుకుని "భగవంతుడి పేరున నా శరీరంలోని అణువణువు తోనూ ఈ ప్రభుత్వాన్ని శపిస్తున్నాను" అని తిట్టి పోశాడు.యే జాతి అయితే మరొక జాతిని పీడించే దుర్మార్గం చేస్తుందో ఆ జాతిలోనే ఆ దుర్మార్గం తో సంబంధం పెట్టుకోకుండా వున్నట్లయినా, తిరస్కరించినా అతన్ని కూడా వాళ్లలోనే కలిపెయ్యటం తప్పు గనకనె మేము బ్రౌన్ నీ కాటన్ నీ గౌరవిస్తున్నాము.మీరు అలా కూడా చెయ్యటం లేదే? సతీ సహగమనం రద్దు చేశారు గదా, ధగ్గుల్నీ పిండారీల్ని అణిచేశారు గదా అని సైన్య సహకార మైత్రి తోనూ దత్తత స్వీకార చట్టాల తోనూ మనల్ని ఆక్త్రమించి మన నేత పనివాళ్ళు వేళ్ళు నరికేసుకునేటంతగా మనల్ని హింసించిన వాళ్ళలో మంచిని వెదికితే వాళ్ళ మీద తిరుగుబాటు చెయ్యగలిగే వాళ్ళమా? ఒకే కుటుంబంలో పుట్టిన దారా షికో - ఔరంగజేబు అనే భిన్న ధృవాల్ని చూశాక గూడా రాజు లందరూ ఒక్కటే అంటే యెలా కుదురుతుంది?

   అయినా మీ రాష్ట్రం, మీ నిజాము, మీ హైదరాబాదు, మీ చరిత్ర - మీరెట్లా మెలికలు తిప్పుకుంటారో మీ ఇష్టం! మాకేం కష్టం? ఒకే గొంతుతో ఒకే శృతితో రాఘవా స్వస్తి రావణా స్వస్తి అని సజ్జనుల్నీ దుర్జనుల్నీ సమ స్థాయిలో కీర్తించ గలిగిన మీ నిష్పక్షపాత బుధ్ధికి సవినమ్రంగా నమస్కరిస్తూ తక్షణమె ఈ చర్చ నుండి నేను పలాయనం చిత్తగిస్తున్నాను, అవధారయ!స్వస్తి!!
   P.S:
   మీరు చెపుతున్నది ఎలా వుందంటే... మోటుగా చెప్పాలంటే... మా వాళ్ళను బలవంతం చేసినట్టు,
   >>
   మీరు మా స్వాభిమానాన్ని గాయపర్చనంత వరకూ మేము మీ స్వాభిమానాన్ని గాయపర్చం.గతం గతః అనుకుని M.S. నారాయణ లెవెల్లో "కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్" అని చెప్పేసుకుని ప్రశాంతంగా వున్న మమ్మల్ని - అప్పుడు భవనాల్లోనే వున్నామని తెల్సి కూడా "కర్నూలు - గుడారాలు" అని - కెలకదం వల్లనే ఈ రగదంతా జరిగిందనేది తెలుసుకోండి.మరో సారి స్వస్తి!!

   Delete
 6. @హరిబాబు: హైదరాబాదు అసెంబ్లీలో తీర్మానం అయ్యిందా, చెవిలో పువ్వు పెట్టనీకే నేనే దొర్కిన్నా. ఆంద్ర అసెంబ్లీ తీర్మానం ముచ్చట మాత్రం మీకు తెల్వకపాయే!
  >>
  total MLAs in hyderabad asemblee 174
  ===========================================================================================
  MLAs expressed their views(including marathi anad kannada mlas ) 147
  MLAS supported Meger 103
  maintained neutral 16
  opposed merger 29
  -------------------------------------------------------------------------------------------
  Total telangaaNaa MLAs 94
  communists 36
  conress 40
  socialist party 11
  indipendents 9
  ------------------------------------------------------------------------------------------
  telangaaNaa MLAs disagreed merger 25
  telangaaNaa MLAs supported merger 59
  is this src anad data is wrong?

  src
  http://en.wikipedia.org/wiki/Gentlemen%27s_Agreement_of_1956

  ReplyDelete
  Replies
  1. జై ఆంధ్ర ఉద్యమం పేరు చెప్పి పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఎలా తుంగలోతొక్కారో మీరు చదవలేదా?

   Delete
  2. యాభయ్యెళ్లయినా వందేళ్లయినా ఆ అంధ్రోళ్లని తరిమి కొట్టాకే బాగు పడదాం అని వెనక్కి బడ్దారా?యెక్కడో కృష్ణా జిల్లా వాళ్ళు రాగిలిగారు కానీ పక్కనే వున్న మీరు మాత్రం రాలేకపోవడానికి కారణ మేమిటి?

   పెద్దమనుషుల వొప్పందం అనేది అప్పుడు మీకు ఇంగ్లీషు చదువులు నిజాము చెప్పించకపోవతం, మావాళ్ళు అందులో ముందు వుండతం చూసి మీకు మాపట్ల వున్న భయాలకి ఇచ్చిన గ్యారెంతీ. యాభయ్యేళ్ళ తర్వాత కూడా పెద్ద మౌనుషుల వొప్పందం గురించి యెత్తుకుంతున్నావు, అప్పటి నుంచీ ఇప్పటి వరకూ అదే స్థితిలో వున్నావా?

   Delete
  3. "is this src anad data is wrong"

   శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన లెక్కలు ఒక పీహెచ్డీ థీసిస్ నుంచి. ప్రస్తావన ప్రవేశ పెట్టారు కానీ చర్చ మాత్రమె జరిగింది.

   Delete
  4. This comment has been removed by the author.

   Delete
  5. In 1956 during the Reorganisation of the Indian States based along linguistic lines, the Telugu-speaking region of the state of Hyderabad State was merged with Andhra State.
   కేవలం చర్చతోనే సరిపెట్టి సభని ఆపేసారా?మరి ఆ వోటింగు దేనికి జరిగినట్టు!

   Delete
  6. హరిబాబు గారూ, శ్రీకృష్ణ కమిటీ ప్రస్తావించిన కేవీ నారాయణ రావు పీహెచ్డీ థీసిస్లొనె "the assembly adjourned on December 3 without taking any vote on the resolution" అని స్పష్టంగా ఉంది. అది జనానికి తెలియకుండా జాగ్రత్తగా దాచిపెట్టారు పుణ్యాత్ములు!

   హైదరాబాద్ అసెంబ్లీ అంటక రెండేళ్ళు ముందే విశాలాంధ్రను తిరస్కరించింది. తెలంగాణా వెతిరేకులు ఈ వాస్తవాన్ని కూడా బయటికి రాకుండా కాపాడగలిగారు.

   Delete
 7. సుమారు 150 మందికి 100 అంటే హైదరాబాదు అసెంబ్లీ లో అయిదింట నాలుగో వొంతు మెజార్టీ కలవడానికి వొప్పుకున్నారు, అవునా కాదా?

  ReplyDelete
  Replies
  1. కాదు. శ్రీకృష్ణ కమిటీ నంబర్లను చూసి నిజమనుకునేరు సుమీ!

   Delete
  2. అంతే శ్రీకృష్ణ కమితీకి మీరు తప్పుదు డాటా ఇచ్చారా?మీ దగ్గిర నుంచే గదా తీసుకున్నది,మీరూ ఇచ్చారుగా సమాచారం?

   Delete
  3. This comment has been removed by the author.

   Delete
  4. మరి మీరు అప్పుదు చోద్యం చూసి ఇప్పుదు ఆ పేర్లు చెప్పి వాళ్ళు మోసం చేసారు అంటున్నారు, అంతేనా?యాభయ్యేళ్ల నుంచీ చేసింది అదే కదా, మీరు పని చెయ్యాల్సిన టైములో చెయ్యరు, అంతా అయిపోయాక వాడు మమ్మల్ని మోసం చేసాడు అనటం. శ్రీకృష్ణ కమిటీ కి మీరూ సమాచారం ఇచ్చారు గదా మీరు సరయిన డటా ఇస్తే తీసుకోనన్నాడా? ఇంక ల.పా మీదా లో.స మీదా పడి యేడవట మెందుకు?

   Delete
  5. మేము మొత్తుకున్నా ఎవరూ వినలేదు. పైగా మమ్మల్ని తాగుబోతు రజాకార్ నక్సలైటు తెలబాన్ వగైరా మాటలని కొట్టిపారేశారు. అన్నీ తెలిసిన మీరే ఇలాగంటే ఎలా!

   Delete
 8. ఒక మోసపూరిత ఒప్పందాన్ని అందరూ ఒప్పుకుంటే ఏమిటి, 90% మంది ఒప్పుకుంటే ఏమిటి?

  ReplyDelete
  Replies
  1. అప్పటి మీ హైదరాబాదు శాసన సభలో మీవాళ్ళు చేసిందాన్ని గురించి నువ్వు ఇవ్వాళ ఈ మాట అంటున్నావు, అవునా కాదా?అంతే మీ పెద్దాల మీదనే మీకు గౌరవం లేదు అని నేనంటున్న మాతని నిజం చేస్తున్నావు.

   Delete
  2. సమైక్యాంధ్ర పాలనలో పెద్ద మనుషుల ఒప్పందం నిజంగా అమలు జరిగి ఉంటే అది ఎప్పుడు అమలు జరిగిందో చెప్పండి. పెద్ద మనుషుల ఒప్పందంలో భాగమైన ముల్కీ నిబంధనలని అమలు చేసినందుకే కదా జై ఆంధ్ర ఉద్యమం చేసి పి.వి.నరసిమ్హారావుని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసారు. ఇంత ద్రోహం చేసే ఉద్దేశం ఉన్నప్పుడు పెద్ద మనుషుల ఒప్పందమనేదే తీసుకురావడం ఎందుకు?

   Delete
 9. @jai
  1940 నుండి ఆంద్ర లోల్లంతా రాజధాని కోసమే. ముందు మదరాసు కావాలన్నారు. తరువాత బెజవాడ కర్నూల్ మద్దతుదారులు కొట్టుకొని సిగపట్టులు పట్టారు. రెంటి మధ్య "రాజీ" పడి హైదరాబాదు మాదన్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రహసనం షురూ :)
  >>
  వుద్యమ కాలంలో యేవో అన్నారు, విడిపోయాక యెవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నాం.మీ సకల జనుల సర్వేయ్ని మేమూ హాపీగా మెచ్చుకున్నాం.తెలంగాణా ప్రజలు కూడా మంచిగా బతికితే బాగుందు ననుకుంటున్నాం.కానీ ఇక్కద ఇపుడు అప్పటి విషయాలు కెలికి వెక్కిరించడం - "సిగపట్లు, హైదరాబాదు మాదన్నారు, ప్రహసనం" అనే వెక్కిరింతలు అవస్రమా?కొంచెము కూడా సమ్యమనము లేదా?ఇక యెప్పటికీ మీరు ఇంతేనా?

  ReplyDelete
  Replies
  1. హరిబాబు గారూ, ఉదయం నడుస్తున్నప్పుడు ఆ తరువాత కూడా వాస్తవాలు వాస్తవాలే, చరిత్ర చరిత్రే తప్ప మారదు కదా. నిజం చెబితే నిష్టూరం ఎందుకు బ్రదర్!

   Delete
  2. @jai
   చరిత్ర చరిత్రే తప్ప మారదు కదా. నిజం చెబితే నిష్టూరం ఎందుకు బ్రదర్!
   >>
   మీకు వున్న బొక్కల్ని తడిమితే మరి మీకెందుకు అంత వులుకు?స్వాభిమానాలు మీకు తప్ప మాకు వుందకూడదా?యెన్నేళ్ళు సాగదీస్తారు అనే అడుగుతున్నాను,మరో యాభయ్యేళ్ళు, వందేళ్ళు ఇలాగే ఒకరి చరిత్రనీ వాస్తవాల్నీ మరొకరు తవ్వుకుంటూ గడుపుదామా?నేను అంటున్నది బాధ్యత గలిగిన పెద్దమనుషులూ అంటున్నది ఒకటే - తప్పులు జరిగీతే అన్ని ప్రాంతాల వారి నుంచీ జరిగాయి,యెవరూ పత్తిత్తులు కారు అని!

   Delete
  3. నాకు ఉడుకేమీ లేదండీ మీరు నిశ్చింతగా అడగండి. ఓపికున్న కాడికి జవాబు ఇస్తాను.

   ఇక ఆంధ్రుల గురించి నేను అడగడం మానేసినా ఇతరులు మానాలని ఏమీ లేదు. చరిత్ర పునరావృత్తం అవుతుంటే కొత్తగా కొందరు నిలదీస్తారు.

   నేను శ్రీబాగ్ ఒడంబడిక గుర్తు చేస్తే కొందరు "మా విషయాలలో నువ్వెందుకు" అన్నారు! ఇప్పుడు అదే విషయాన్ని వాళ్ళే అడుగుతుంటే సమాధానం లేదు.

   History repeats itself, first as a tragedy then as a farce!

   Delete
  4. కర్నూల్‌లో రాజధాని పెట్టాలంటూ కర్నూల్, కడపలలో ఆందోళనలు జరుగుతున్నాయి. కమ్మ పత్రికలలో ఈ వార్తలు రావు కానీ ఉద్యమకారులు పెట్టిన ఫొతోలు ఫేస్‌బుక్‌లో కనిపిస్తాయి.

   Delete
  5. @జై
   ఎప్పుడూ 1937లో చేసుకున్న ఒప్పందం ఇప్పుడు పాటించడం ఏంటి. ఆ తరువాత స్వతంత్రం వచ్చే రెండు మూడు సార్లు స్టేట్ ఆకారం మారే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏవి వెనకబడ్డ ప్రాంతాలో వాటి మీద ద్రుష్టి పెట్టి వాటికి ఎదగడానికి అవకాసం కల్పిస్తే చాలు. ఇక ఇలాంటివి మీ దోస్తులకి చెప్పు చాల మంది బ్రెయిన్ 1956 లో స్టక్ అయ్యింది పాపం. విని చప్పట్లు కొడతారు.

   Delete
  6. @శ్రీ: 1956లొ మేము స్టాక్ అప్ అయినా మీకు నష్టం లేదు కదా, మా గురించి రంది చెయ్యొద్దు. 1937 కెల్లి ఆంద్ర రాష్ట్రం ఆకారం మారి మళ్ళీ దాదాపు అదే షేపుకు వచ్చింది. ఇక శ్రీబాగ్ ఒడంబడిక విషయం నాతొ కాదు అడుగుతున్నా సీమ వారితో తేల్చుకోండి.

   Delete
  7. @Jai
   ఎందుకు నష్టం లేదు ర బై. 1956 కి ముందు ఉన్నవాళ్లకి మాత్రమె ఫీజు ఇస్తామంటే 1956 గాల్లంతా (మీరు దానికి మినహాయింపు, దాన్ని మీరు ఖండించారు కాబట్టి) చప్పట్లు, కేరింతలు. ఇట్లా టైట్ చేస్తే వాళ్ళ దారి వాళ్ళు పడతారు, మనది మనం(?) చూసుకోవచ్చు అంటే చప్పట్లు కేరింతలు. అంటే కొన్ని దశాబ్దాలుగా ఉన్న వాళ్ళని నూకేసి సీమంద్రుల కష్టార్జితం తో కూడా అభివృద్ది అయిన హైదరాబాద్ ని దమ్మిడీ పని చేయకుండా ఫ్రీ అనుభవిద్దాం అనే కుత్సిత బుద్ది తో నష్టం కాక ఇంకేంది.
   నేనూ సీమలో పుట్టినోదినే. ఇక శ్రీబాగ్ ఒప్పందం గురించి నేను సీమ వాళ్ళని అడుగుడేంది. ఇక మీ గురించి రంది చేయాల్సిన అవసరం నాకు లేదు. అలాగే మీరు కూడా అనవసరం అయిన కామెంటరీ(ముందు మదరాసు కావాలన్నారు. తరువాత బెజవాడ కర్నూల్ మద్దతుదారులు కొట్టుకొని సిగపట్టులు పట్టారు లాంటివి) ఆపితే బాగుంటుంది.

   Delete
  8. సీమాంధ్రుల కష్టంతో హైదరాబాదు అభివృద్ధి చెందిందా, ఇంకా అదే పాత పాట!

   "సీమ వారితో" అన్న మాటను "సీమ తరఫున రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న వారితో" అని మార్చండి.

   మీకు అనవసరం అనిపించిన మాత్రాన వాస్తవాలు సమిసిపొవు.

   Delete
  9. @Jai
   మరి పోనీ ఎవరి కష్టంతో అభివృద్ది చెందిందో చెప్పు. హైదరాబాద్ అభివృద్ది లో తెలంగణా వాళ్ళ పాత్ర ఏంటో చెప్పు. తెలంగాణా నుండి ఎవరు ఏ రంగ అభివృద్ది లో ముందున్నారో చెప్పు. quoting my response again on the topic
   "హైదరాబాద్ ఇంత అభివృద్ది కావడం లో తెలంగాణా వాళ్ళ పాత్ర ఏమైనా ఉందా? మొదట నిజాం కట్టిండు, తరువాత కేంద్రం నుండి ఏమైనా సంస్థలు వచ్చాయి అంటే అవి ఆంధ్ర ప్రదేశ్ కి రాజధాని అనే , తెలంగాణా లో ఉందని కాదు. ఇంకా ఏమైనా అభివృద్ది అయ్యింది అంటే ఇతర రాష్ట్రాల వారు (మార్వాడీ లు లాంటి వాళ్ళు), ఆంధ్రా CM ల ముందు చూపు , ఆంద్ర ప్రదేశ్ ప్రజలు పెట్టుబడి పెట్టడం వల్లనే( అది కూడా రాజధాని అందరిదీ అనుకుని). అంటే కానీ హైదరాబాద్ అభివృద్ది లో కానీ , బ్రాండ్ ఇమేజ్ లో కానీ తెలంగాణా వాళ్ళ పాత్ర దాదాపు శూన్యం. ఇన్ని రంగాలున్నాయి, తెలంగాణా వాళ్ళు ఏ రంగం లో హైదరాబాద్ అభివృద్ది లో ముందున్నారు చెప్పు? ఫార్మా? హాస్పిటల్స్? నగర అభివృద్ది ? మీడియా? ఎంటర్టైన్మెంట్? సినీ రంగం? ఒక్క రంగం చెప్పు. ఓహ్ బంద్ లు చేయడం లో, ఉన్న విగ్రహాలని కూలగొట్టడం లో (తాలిబాన్లు బుద్ధుడి విగ్రహాలు కూలగొట్టడం గుర్తుందా), దౌర్జన్యం చేయడం లో, కష్టపడకుండా అప్పనంగా కొట్టేయడం లో మాత్రం ముందున్నారు. "


   సీమ తరఫున కంటే ఏ ప్రాంతం వాళ్ళు ఆ ప్రాంతానికి రాజధాని కావాలనుకుంటున్నారు. మంచిదే. కానీ ఇప్పుడు ఎక్కడైతే ప్రదర్సనలు చేస్తున్నారో అక్కడంతా రాజధాని పెట్టడం సాధ్యం కాదు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ రాజధాని ఉంటె మంచిదో అక్కడ పెడితే బాగుంటుంది కానీ 1937 నాటి ఒప్పందాలూ, ప్రదర్సనలు బట్టి రాజధాని నిర్ణయించడం సమంజసం కాదు. ఈ విషయం పై నేను రాసిన టపా : http://manadiksuchi.blogspot.com/2014/05/blog-post_8535.html
   ఎక్కడ పెట్టినా (ఇప్పుడు రాజధాని కావాలని ప్రదర్సనలు చేసినోల్లె) మా మాజీ సోదరుల్లాగా దోచుకోవడానికే మా ఊరిని రాజధాని చేసారు అనకపోతే అదే పదివేలు.

   Delete
  10. ఎక్కడ పెట్టినా (ఇప్పుడు రాజధాని కావాలని ప్రదర్సనలు చేసినోల్లె) మా మాజీ సోదరుల్లాగా దోచుకోవడానికే మా ఊరిని రాజధాని చేసారు అనకపోతే అదే పదివేలు.
   -----
   Well Said Sree.

   Delete
  11. @Jai
   శ్రీగారు రాసింది : సీమంద్రుల కష్టార్జితం తో కూడా అభివృద్ది అయిన హైదరాబాద్ ని...

   "కేవలం" సీమంద్రుల కష్టార్జితం తో అని శ్రీగారు రాయలేదు. గమనించగలరు

   Delete
 10. ప్రవీణ్ గారికి,

  ఎందుకు కమ్మ వారంటే ఇంత ద్వేషం. కమ్మ పత్రికలు, కమ్మ టి.వి.లు అంటూ? కమ్మ వారు పత్రికలు పెట్టటమే నేరమా? టి.వి.లు పెట్టటమే నేరమా? పత్రికలలో ఏవైనా అవాస్తవాలు వ్రాస్తే అవి కేవలం కమ్మ పత్రికలు మాత్రమే రాస్తాయా? ఇతరులు అన్నీ నిజాలే చెబుతున్నారా? సమైక్య ఆంధ్ర ప్రదేశ్ లో అవకాశం వున్న ప్రతి వాడు ఇతరులను దోచుకున్నాడు. దీనికి తెలంగాణ ప్రాంతం వాడు, ఆంధ్ర ప్రాంతం వాడు, కమ్మ, రెడ్డి, కాపు, దళితులు అని తేడాలేమీ లేవు. ఒకవేళ ఆంధ్రా ప్రాంతం వాళ్ళు మాత్రమే దోచుకున్నది నిజమయితే తెలంగాణా వాళ్ళ సహకారం లేకుండా దోచుకోగలరా? దయచేసి ఒక ప్రాంతం వాళ్ళని, ఒక కులం వాళ్ళని నిందించడం మానుకోవలసిందిగా కోరుతున్నాను.

  ReplyDelete
 11. విజయవాడని రాజధాని చెయ్యడానికి రాయలసీమవాళ్ళు ఒప్పుకోరు. ఇప్పటికే సినిమాలలో రాయలసీమవాళ్ళని వేలిముద్రలు వేసేవాళ్ళుగా, బాంబులతో బంతులాడుకునేవాళ్ళుగా చూపించి వాళ్ళని alienate చేసారు మన కోస్తా నిర్మాతలు. విజయవాడ వచ్చి, రాయలసీమ యాసలో మాట్లాడి, తమని విచిత్రంగా చూసేవాళ్ళకి ముఖం చూపించుకోవాలని రాయలసీమ ప్రజలు అనుకోరు.

  ReplyDelete
  Replies
  1. "విజయవాడని రాజధాని చెయ్యడానికి రాయలసీమవాళ్ళు ఒప్పుకోరు."
   నిజమే. కానీ అందుకు కారణం ఏదో సినిమాలలో కామెడీ గా చూపించారనో, ఇంకోటో కాదు. పోటీ పడలేమని. ఇక సినిమాలలో కామెడీ కారెక్టర్స్ కి రాయలసీమ యాస అనే కాదు, గోదావరి యాస పెట్టారు, నెల్లూరు యాస పెట్టారు, తెలంగాణా యాస పెట్టారు, శ్రీకాకుళం యాస పెట్టారు, పక్క రాష్ట్ర భాషలైన తమిళ్ యాస పెట్టారు.దాన్ని అలాగే చూస్తె బాగుంటుంది. ఇలా ప్రతీ దానికి లొల్లి చేస్తూ, ఒకరికి ఒకరిని శత్రువులుగా మార్చే ప్రయత్నం విరమిస్తె మంచిది. మీకు సమ్మగా ఉంటుంది కానీ ప్రజలు నష్టపోతారు. చూద్దాం రేపు తెలంగాణా లో సినిమాలు వస్తాయి కదా అసలు కామెడీ వేషాలకి తెలంగాణా యాస పెట్టకుండా ఉంటారేమో.

   Delete
 12. @jai anad other telangaana friends:
  jai:History repeats itself, first as a tragedy then as a farce!
  my answer"
  History never repeat the same scene again!I know history very well. History is moving in a spiral. if you see with only one dimension, It looks like circle, but If you see from another Dimension using perspective, you could know the fact that no two points in history are similar. When you analyze a scene, you have to take both magnitude and multitude.

  Shall I need to explain further?
  http://harikaalam.blogspot.in/2014/08/blog-post_29.html

  ఈ రెండు రాష్ట్రాలూ విడిపోయి కొన్ని నెల లయింది. ముందుకి చూడాల్సిన టైములో యెప్పుడో కర్నూలు గుడారాల గురించి యెత్తడం వేళాకోళపు మాటలు వాడటం మర్యాదా భంగం.మీరు మీ పొరుగు రాష్ట్రంలో జరిగే సంగతుల గురించి వ్యాఖ్యానిస్తున్నారనేది గుర్తుంచుకోండి.విశ్లషణలు యెన్నయినా చెయ్యవచ్చు, వాటికి మా ఆహ్వానం.అందరమూ యెక్కడో అమెరికా లో జరిగే సంగతుల్ని గురించి మాట్లాడుకుంటూనే వుంటాం కదా!అంతకన్నా యెక్కువ మాత్రం చెయ్యొద్దు.

  నా వైపు నుంచి నేను యెలా వుంటున్నానో మీకు తెలుసు.ఆంధ్రా ఆకాశరామన్న బ్లాగులో కూడా మనం ఒకరికి ఒకరు తెలుసు.అక్కడ మీరు గమనించారో లేదో గానీ ఆంధ్రావాళ్ళు మిమ్మల్ని గురించి నీచంగా వ్యాఖ్యలు చేస్తుంటే అడ్డుకున్నాను.నా ధాటికి వాళ్ళు కూడా తగ్గారు.కొందరు నన్ను కూడా బ్లాగు యజమానిగా పొరబడ్డారు కూడాను.(సహజంగా బ్లాగు యజమానులే అలా చేస్తారు?)నా తత్వం ఒకటే స్థాయి తక్కువ మాటల్ని నేను మాట్లాడను, యెదటివాళ్ళ నుంచి సహించను.

  ReplyDelete
  Replies
  1. హరిబాబు గారూ, చరిత్ర ఒకేరకంగా పునరావృత్తం కాదు కానీ మూలకారణాలు మారనంతవరకు పర్యవసానాలు అదేరకంగా ఉంటాయి. To prevent a non-conformity from recurring, you have to eliminate the root cause permanently.

   మనం ముందుకు చూసినా వెనక్కు చూసినా వాస్తవాలు మారవు. పదేళ్ళలో మమ్మల్ని ఎన్నో మాటలు అన్నారు. ఏవీ మరిచిపోయే ఉద్దేశ్యం నాకయితే లేదు.

   నేను కూడా మీలాగే ఎవరు ఎవరిని నీచంగా మాట్లాడినా వ్యతిరేకిస్తాను. ఇదే కోవలో చెందిన శ్యామలీయం మాస్టారు లాంటి వారు ఎందరో ఉన్నారు. ఇది మన సహజగుణం.

   Delete
 13. @Jai
  “कैकु ऐसे लोगोंको पाला पढ़ना पड्रा है? ऐसे लोगोंका जिनके मू हम लगना ही नहीं चाहते हमारे पीछे क्यों पड़े है?” అని ఒకప్పుడు రాశారు.

  మళ్ళీ “1940 నుండి ఆంద్ర లోల్లంతా రాజధాని కోసమే. ముందు మదరాసు కావాలన్నారు. తరువాత బెజవాడ కర్నూల్ మద్దతుదారులు కొట్టుకొని సిగపట్టులు పట్టారు. రెంటి మధ్య "రాజీ" పడి హైదరాబాదు మాదన్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రహసనం షురూ :)” అని రాయడం మీకే చెల్లింది.

  ఒకప్పుడు మీరు రాసిన మాట: “బోడి ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ఉంటె ఎంత లేకపోతె ఎంత. దేశానికి పట్టిన పీడా పోయింది.”

  ఇప్పుడు మీరు రాసిన మాట: “నేను కూడా మీలాగే ఎవరు ఎవరిని నీచంగా మాట్లాడినా వ్యతిరేకిస్తాను. ఇదే కోవలో చెందిన శ్యామలీయం మాస్టారు లాంటి వారు ఎందరో ఉన్నారు. ఇది మన సహజగుణం.”

  “తె.రా.స భారతదేశ సార్వభౌమాధికారాన్నే ధిక్కరించాలనుకుంటున్నదా?” అని శ్యామలీయం గారు ప్రశ్న వేస్తే, మీరెంత గింజుకున్నారో? :)

  వేళాకోళంగా కించపరిచేలా దెప్పి పొడిచేలా అనాల్సిన మాటలు అన్నీ అనేసి ‘ఇది మన సహజగుణం’ అంటూ మన భుజాలు మనమే చరుచుకుంటే భలే వుంటుంది కదా? మిమ్మల్ని చూస్తె నవ్వుతో పాటు జాలి కూడా వేస్తోంది.

  ముందు 1956 నాటి తెలంగాణా మాత్రమే కావాలి అన్నారు. తర్వాత భద్రాచలం, ఆ తర్వాత పోలవరం, అటు తర్వాత తిరుపతి టిక్కెట్లలో రిజర్వేషన్.
  ముందు ‘తెలంగాణా ఇస్తే, తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేస్తాం’, ‘దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాం’. మరి ఇప్పుడో?
  ముందు ‘మా నీళ్ళు దోచుకున్నారు’ అని అన్నవాళ్లు ఇప్పుడు ఆంధ్రాకి ఎందుకు నీరు వదులుతున్నారు?

  వీర తెలంగాణాకి వేరు తెలంగాణాకి తేడా చూపించారు.

  ReplyDelete
  Replies
  1. నాకూ జాలిగానే వుంది, వాళ్ళ చరిత్ర గురించయినా వాళ్లకి సరిగ్గా తెలుసా అని!

   18వ తేదీ ఆంధ్రజ్యొతి లో పరబ్రహ్మ శాస్త్రి గారు శాసనాలూ పురాణాలూ పరిశోధించి ఒక విషయం చెప్ప్పారు.అసలు ఆంధ్ర పదం తెలంగాణా ప్రాంతంలో వున్న తెలుగు వాళ్లకీ తెలుగు అనే పదం ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న మనకీ వాడే వాళ్ళు.అందువల్లనే నిజాము వ్యతిరేక పోరాటానికి పెట్టుకున్న వేదికకి ఆంధ్ర మహా సభ అని పేరు పెట్టుకున్నారు అప్పటి తెలంగాణా మేధావులు!

   ఇప్పుడు ఆంధ్రా అనేదాన్ని మనకి దఖలు పర్చేసి తిట్టటం వల్ల జరిగిందేమిటంటే వాళ్ళ ఆంధ్రత్వాన్ని కూడా మనకే ఇచ్చెయ్యటం. వాళ్ళ రాష్ట్రం పేరుని తెలంగాణా స్టేట్ అని రిజిస్టర్ చేయించుకోవడం, మన రాష్ట్రం పేరులో ఆంధ్ర వుండటం ద్వారా ఆ పదం మీద పూర్తి హక్కు మనకే వచ్చింది,

   Delete
  2. మీలాగే ఎవరు ఎవరిని నీచంగా మాట్లాడినా వ్యతిరేకిస్తాను
   ------
   తెరాసా వాళ్ల పిచ్చి కూతలను కాని, బ్లాగులలో ఆంధ్రోళ్లు, వలసదారులు అంటూ నిరంతర ఘోషను కాని, ఆ సైడు నుండి వచ్చే పిచ్చి కూతలను ఒక్కసారి అంటే ఒక్కసారి ఆ బ్లాగులలో వ్యతిరెకించారా తమరు??

   ఇదే కోవలో చెందిన శ్యామలీయం మాస్టారు లాంటి వారు ఎందరో ఉన్నారు. ఇది మన సహజగుణం.
   -----
   మీ గుణం ఏమిటో మీ కామెంట్ లు చాలా కాలం నుండి చదువుతున్న వాళ్లు, వెరే వాళ్ళు చెప్పాలి కాని, ఎవరి సహజ గుణం ఏమిటో వాళ్ళకు వాళ్లు డప్పు వేసుకోవటాన్ని, శ్యామలీయం లాంటి వారితో కలిపేసుకోవటాలను చూస్తే మా తెలుగు మాస్టారు అనే డైలాగు ఒకటి గుర్తుకు వస్తుంది, ఆయన దాన్నే స్వ@/&మర్ధనం అనే వారు :)

   Delete
  3. @Hari Babu Suraneni
   ఇప్పుడే చదివాను. మన చరిత్ర గురించి మనం చదువుకోవలసింది, నేర్చుకోవలసింది చాల వుంది.

   ఇక చర్చ విషయానికొస్తే A.P రాజధానిపై అనిశ్చితి ఎందుకు ఏర్పడుతోంది? ఎవరి రాజకీయాలు వారివి.

   అటు తెలంగాణాలో ప్రోగ్రెస్ వుందో లేదో నాకు తెలీదుగానీ, ఇటు రాజధాని కోసం తెగ కసరత్తులు చేసారు/చేస్తున్నారు. నా అభిప్రాయం: రాయసీమలో రాజధాని వుంటే మంచిది.

   మన పరిపాలనా యంత్రాంగం అంతా computerized అయినప్పుడు, రెండు రాజధానులు వుండడం ఆచరణ సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఒకటే రాజధాని వుండాలి. మరో సారి 'లైట్స్, కెమెరా ఆఫ్, న్యూ స్టేట్' అనే దుస్థితి రాకుండా, అభివృద్ధి రాష్ట్రం అంతటా జరగాలి.

   @క్రిష్ణ
   క్రిష్ణక్రిష్ణ! :) ఈరోజుల్లో పరనింద స్వస్తుతి ఎక్కువ అయ్యాయి.

   Delete
 14. రాజధాని అంటే హైదరాబాదులా ఉండాలి అనే అభిప్రాయం మార్చుకుంటే సగం సమస్యలు తీరిపోతాయి.
  అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్ భవన్, హైకోర్టు లాంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ ఒకేచోట ఉండేలా, పరిపాలనకి అవసరమైనంత రాజధాని కట్టుకుంటే చాలు. వీలైతే ఒక సమావేశం కర్నూలులో జరిగేలా అక్కడ రెండో అసెంబ్లీ భవనం నిర్మించుకుంటే సరిపోతుంది. మిగతా సంస్థలు మాత్రం ఒకేచోట ఉండకుండా వికేంద్రీకరిస్తే బాగుంటుంది.

  ReplyDelete
 15. చంద్రబాబు అతితెలివి బాగానే ఉంది. విజయవాడని రాజధాని చెయ్యొద్దని శివరామకృష్ణన్ చెప్పాడని మంగళగిరిని రాజధాని చేస్తాడట! విజయవాడ నుంచి మంగళగిరి 11 కి.మి. మాత్రమే దూరం. తెలంగాణకి వనస్థలిపురాన్ని రాజధాని చేస్తే ఏమి తేడా వస్తుందో, ఆంధ్రాకి మంగళగిరిని రాజధాని చేస్తే అదే తేడా వస్తుంది.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top