జబ్బుల బారిన పడే ప్రమాదమున్న వారితో పోలిస్తే, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకున్న వారు ఆరేళ్లు ఎక్కువగా జీవిస్తారని స్వీడిష్‌ అధ్యయనం తెలిపింది. ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల వృద్ధాప్యంలో స్త్రీలు5 ఏళ్లు , ఆరేళ్లు పురుషులు అదనంగా జీవిస్తారని అధ్యయనం కనుగొన్నది. అధిక బరువు, ధూమపానం, అధికంగా మద్యం సేవించడం వృద్ధులో మరణానికి దారిస్తాయి. 75 ఏళ్లుపైబడిన వారికి ఇవి వర్తిస్తాయా? లేదా? అనేది తెలియదు. దీని కోసం స్వీడన్‌కు చెందిన పరిశోధకుల బృందం 75 ఏళ్ల వయసున్న వారిని, జీవనశైలి వ్యాధులన్న వారిని విశ్లేషించారు. 1800 మందిని 18 ఏళ్లపాటు (1987-2005) పరిశోధకులు అనుసరించారు. వయసు, లింగం, వృత్తి, విద్య, జీవనశైలి ప్రవర్తనలు, సామాజిక సంబంధాలు, తీరిక వేళల్లో చేసే పనులను నమోదు చేశారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో 92 శాతం మంది మరణించారు. సగం మంది 90 ఏళ్లకుపైగా జీవించి, మరణించారు. వీరిలో బతికిన వారు ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. అంతేకాక విద్యాధికులు కూడా. వీరు ఆరోగ్యకరమైన జీవనశైలితో ఉన్నారు. సామాజిక సంబంధాలు ఎక్కువ. తీరిక వేళల్లో చాలా చురుగ్గా ఉంటున్నారు. ధూమపానం చేసే వారు, చేయని వారి కన్నా ఒక సంవత్సరం ముందుగానే చనిపోయారు. మధ్య వయసులో సిగరెట్‌ తాగడం ఆపేస్తే, దాని ప్రభావం మరణంపై పడుతుందని అధ్యయన ఫలితాలు చెబుతున్నాయి. మధ్యలో సిగరెట్‌ మానేసిన వారు కూడా ఎప్పుడు సిగరెట్‌ తాగని వారిలాగే ఎక్కువ కాలం జీవించారు. తీరిక వేళల్లో చేసే పనుల్లో శారీరక శ్రమకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. రెగ్యులర్‌గా ఈత కొట్టడం, నడవడం లేదా జిమ్నాస్టిక్స్‌ వంటి చర్యల వల్ల మిగతా వారి కంటే రెండేళ్లు ఎక్కువ జీవించారు. మొత్తంగా చూస్తే, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకున్న వారు మిగతా వారి కన్నా 5.4 ఏళ్లు ఎక్కువ కాలం బతుకుతారు. 
Reactions:

Post a Comment

  1. ఎంత కాలం బతికాము అనేదానికన్నా .. ఎంత ఆనందంగా.. ఎంత ఆరోగ్యంగా బతికామన్నదే ముఖ్యం. రోజు .. యోగా, వ్యాయామం చెయ్యటం చాలా ముఖ్యం. బాగుంది మీ వ్యాసం.

    ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు ధర్మం ధ్యానం నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నాకు నచ్చిన పాట నేను నేర్చుకున్నవి పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు బాల్యం బ్లాగు ప్రపంచం భారతీయం భారతీయ సంస్కృతి భాష మతం మంతెన వీడియోలు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా రాజకీయం రిజర్వేషన్లు వార్త-వ్యాఖ్య వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వీడియోలు వెబ్ మీడియా వేదాలు వ్యక్తిగతం శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top