----------------------------------------------
ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------

కూతురొక్కటి చాలు!

 • ఐదుగురు కుమారులున్నా చివరికి వృద్ధాశ్రమమే
 • ఒక్క కూతురున్నా అమ్మానాన్నకు అండగా ఉంటుంది
న్యూఢిల్లీ, ఆగస్టు 15: ‘‘కొడుకు పుడితే బాగుంటుందని, వృద్ధాప్యంలో అండగా ఉంటాడని చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ... నేను ఎంతో మందిని చూసిన అనుభవంతో చెబుతున్నా! ఐదుగురు కొడుకులను కని, పెంచి, వారికి ఆస్తులు పంచిన తల్లిదండ్రులు చివరికి వృద్ధాశ్రమాల్లో గడుపుతున్నారు. కానీ... ఒకే ఒక కూతురు ఉన్న తల్లిదండ్రులకు మాత్రం ఆ పరిస్థితి లేదు. తన పెళ్లిని, వ్యక్తిగత జీవితాలను సైతం త్యాగం చేసి అమ్మాయిలు అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకుంటారు. దయచేసి... ఆడశిశువులను గర్భంలోనే చిదిమి వేయకండి’’ అని ప్రధాని మోదీ తల్లిదండ్రులను కోరారు. 

తన తొలి ఎర్రకోట ప్రసంగంలో ఆడపిల్లలు, మహిళల సమస్యలపై మనసులు కదిలించేలా మాట్లాడారు. అత్యాచారాలు జరిగినప్పుడు తల సిగ్గుతో వేలాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు చేసిన ప్రతి మగవాడు... తల్లిదండ్రులకు కుమారుడే అని గుర్తు చేశారు. ‘‘ఇంట్లో పదేళ్లకుపైబడిన కూతురు ఉంటే తల్లిదండ్రులు అనేక జాగ్రత్తలు చెబుతారు. బయటికి వెళ్లిన ప్రతి సారీ... ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు అని అడుగుతారు. అదే కుమారుల విషయంలో ఇలా చేస్తున్నారా?’’ అని ప్రశ్నించారు. కుమార్తెలపై పెడుతున్న ఆంక్షలు కుమారులపైనా పెట్టాలని మోదీ తల్లిదండ్రులకు సూచించారు. ‘‘ తప్పు చేసిన ప్రతివాడూ ఒకరి  కొడుకే’’ అని వ్యాఖ్యానించారు.  

ఇది దేవుడి పని కాదు:

భ్రూణ హత్య నేరాల్లో భాగస్వాములు కావొద్దని వైద్యులను మోదీ కోరారు. ‘‘మీ గల్లా పెట్టెలు నింపుకొనేందుకు ఆడశిశువులను చంపొద్దు. ప్రస్తుతం వెయ్యిమంది మగ పిల్లలకు, 940 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ తేడాకు కారణం దేవుడు మాత్రం కాదు. ఆడ శిశువులను గర్భంలోనే చిదిమివేయడమే దీనికి కారణం’ అని తెలిపారు. అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదని‘ఇటీవలి కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ 64 పతకాలు సాధిస్తే, అందులో 29 మన మహిళా క్రీడాకారులే గెలిచారని’  తెలిపారు.

చీకటి కోసం వేచి చూడాలా?:

‘‘దేశంలో ఇప్పటికీ ఎందరో మహిళలు బహిర్భూమికి వెళ్లాలంటే... చీకటి పడటం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. వారి గౌరవాన్ని మనం కాపాడలేమా? అది మన బాధ్యత కాదా?’’ అని మోదీ ప్రశ్నించారు.  ‘‘మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. నేటికీ మన అమ్మ, అక్క ఇంకా బహిర్భూమికి వెళుతున్నారు. చీకటికోసం వేచి చూస్తున్నారు. వారి మనసు ఎంత క్షోభ పడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? వారికోసం ఓ మరుగుదొడ్డి నిర్మించలేమా?’’ అని ప్రశ్నించారు. దేశంలో ఇప్పటికీ స్కూళ్లలో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు లేవు. ఈ కారణంతోనే చాలామంది బాలికలు స్కూలుకెళ్లడంలేదు’’ అని మోదీ తెలిపారు. ఎంపీలాడ్స్‌ నిధులను స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్మాణానికి ఉపయోగించాలని ఎంపీలను కోరారు.
(from andhrajyothy daily)
Reactions:

Post a Comment

 1. చీకటి కోసం వేచి చూడాలా?:
  >>
  రామారావు తెలుగు మహిళా బహిర్భూమి పధకం ప్రవేశ పెట్టినప్పుడు దీనికి కూడా ఒక పధకమా అని చాలామంది నవ్వారు!వ్యవసాయం కోసం కూలీలు మా వూళ్ళో దొరకనప్పుడు తెల్లవారు ఝామున పొరుగూరు బైక్ మీద వెళ్తుంటే ఆడవాళ్ళు మా బైక్ వెలుతురుకి కంగారుగా లేచి నిల్చోవదం చూసి పాపం అంపించింది, నిజానికి ఇంత చిన్న విషయం కూడా అనత పెద్దదిగా కనిపిస్తుందంటే మనం యెంత మందకొడిగా వున్నామో కదా!

  ReplyDelete
  Replies
  1. అవును ఇప్పటికీ మన పల్లెల్లో బహిరంగ మల విసర్జన ఉండడం దారుణం. ఎన్.టీ.ఆర్ చేసిన చాలా మంచి ఆలోచనలలో అదొకటి. ఎందుకో అది అంత సక్సెస్ కాలేదు. ఇలాంటివాటికి వ్యక్తిగత మరుగుదొడ్ల పథకాలే బెటర్. అవీ వచ్చినా ఇంకా లెట్రిన్లు లేని ఇళ్లు నేటికీ కోకొల్లలు. మోడీ అప్రోచ్ చాలా బాగుంది. మగపిల్లలంతా అలా ఉండరు. ఆడవాళ్లంతా బుద్ధిమంతులు కాదు గానీ, జనరల్గా చూస్తే నేటి స్తితిలో మోడీ ఆడపిల్లల-మహిళల గౌరవం పెంచేలా మాట్లాడారు. ఇలాంటి మంచి మాటలు రావలసిన వారి నోట వస్తే మెసేజ్ లా వెళ్తాయి. అందులో మోడీ కృతకృత్యుడవుతున్నారు.

   Delete
 2. మగపిల్లలు అంత క్రూరులనుకోను. చదువు పేరుతో పిల్లల్ని కొట్టడం వల్ల వాళ్ళు పెద్దైన తరువాత తల్లితండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో వదిలేస్తుంటారు. ఆడ పిల్లల్ని చిన్నప్పటి నుంచే ఓర్పు, అణుకువ లాంటి మాటలు చెప్పి పెంచుతారు. అందు వల్ల మగ పిల్లల కంటే ఆడ పిల్లలకే ఎక్కువ సహనం ఉంటుంది. శారీరక ధర్మం అనేది మగపిల్లలకైనా, ఆడపిల్లలకైనా ఒకటే.

  ReplyDelete
  Replies
  1. అందుకే మోడీ చాలా జాగ్రత్తగా హితవు చెప్పారు. ఆడపిల్లలకి జాగ్రత్తలు చెప్పినట్లుగానే మగపిల్లలకీ చెప్పమన్నారు తప్ప మగ పిల్లలకి చెప్పని బుద్ధులు ఆడవాళ్లకి మాత్రం ఎందుకు? అనలేదు. ఇటీవల మురళీ మోహన్ చెప్పినదీ ఇదే ఉద్దేశంతో అయినా అతను కొంత లౌక్యం ప్రదర్శించలేకపోయారు.

   Delete
  2. మగపిల్లవానికి మార్కులు రాకపోతే అడుక్కుతింటాడనుకుని అతన్ని కొట్టి చదివించడం, ఆడపిల్లైతే చదువు అబ్బకపోయినా పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతుందనుకుని ఆమెని కొట్టకపోవడం..... ఇదంతా చూస్తోంటే ఏమనిపిస్తోంది? మగవాడైతే అడుక్కునైనా బతకగలడు కానీ ఆడదానికి మొగుడి దగ్గరే జీవితం అనే అభిప్రాయం ఉన్నట్టు అనిపించడం లేదా?

   మురళీమోహన్ విషయానికి వద్దాం. రేప్ అనేది dating కంటే పెద్ద సమస్య కాదు అని నేనన్నప్పుడు నన్ను తిట్టి ఎంత మంది పండగ చేసుకున్నారో నాకు తెలుసు. రేప్‌ల గురించి చర్చ జరుగుతోంటే మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడే మురళీమోహన్‌ని మాత్రం ఈ మగమహారాజులు aka పులిరాజాలు తిట్టరు.

   పురుషాధిక్య సమాజంలో ప్రతి మగవాడూ పులిరాజానే. అతను గుప్త రోగాలు వస్తాయనే భయం లేకుండా అలా ఉంటాడు.

   ఆడ పిల్లని కనడం తప్పు కాదు. ఆడ పిల్లలకి సీతాసావిత్రుల కథలు చెప్పి వాళ్ళకి సమాజం గురించి ఏమీ తెలియకుండా చెయ్యడం మాత్రం తప్పే.

   ఆడ పిల్ల సమాజం గురించి తెలుసుకుని, "ఇది తప్పు, ఇది ఒప్పు" అని తనకు తానుగా నిర్ణయించుకుని, ఆ స్థితిలో తన తల్లితండ్రులని మంచిగా చూసికుంటే, అప్పుడు స్త్రీల జీవితాలలోని ఔన్నత్యం గురించి చర్చించొచ్చు.

   Delete
 3. మా అమ్మమ్మకు ఎప్పుడూ "ప్రతి మనిషికి చచ్చినంక ఏడ్చనీకే ఒక బిడ్డ ఉండాలే వారీ" అనేది.

  One daughter compulsory, sons are optional!

  ReplyDelete
  Replies
  1. ఆడపిల్ల గురించి ఎన్ని తియ్యని కబుర్లు చెప్పినా, మగపిల్లవాడు పుడితే బాధపడేవాళ్ళు ఉండరు. ఏవి గాలి కబుర్లో ఇక్కడ అర్థం కావడం లేదా?

   Delete
  2. //ఆడపిల్ల గురించి ఎన్ని తియ్యని కబుర్లు చెప్పినా, మగపిల్లవాడు పుడితే బాధపడేవాళ్ళు ఉండరు.//
   దీనికి ఏమిటి కారణం? సమాజంలో ఉన్న దుష్ట సాంప్రదాయాలు కాదా? ఆడ పిల్ల పుడితే చదివించాలి, కట్నం ఇచ్చి పెళ్ళి చేయాలి, అన్నీ చేసినా చివరకు ' ఆడ పిల్లే ' అవుతుంది కానీ ఈడ పిల్ల కాక పోయా. చది వి ఉద్యోగం చేస్తె సంపాదించి ఎవరి కి పెడు తుంది? మెట్టి నింటికే పెడుతుంది. అంతే కాక ప్యుడ మనస్తత్వంతో చూసే వారికి గౌరవ సమస్యలు ఎక్కువ. అమ్మాయి ప్రేమించకూడదు, అలా చేసినా పెళ్లి మాత్రం కులం తప్పిన వాన్ని చేసుకో కూడదు. పేరు ప్రతిష్టలు, వంశ గౌరవాలు కాపాడల్సింది ఆడపిళ్ల. మొగ వాడు ఏ పెంట నాకినా పరవా లేదు. వాడు చివరికి ఎంతమంది ఆడపిల్లలనైనా బోల్తా కొట్టి చివరకు తమకు క్ట్నం తెచ్చే ఆడ పిళ్లనే పెళ్లి చేసు కో గలడు! అంతే గాక బైట ఎన్ని వంశాంకురాల్లున్నా తమ ఇంట్లో ఒక వంశాంకురాన్ని కలిగిస్తాడూ- ఇన్ని పనులు చేస్తున్న '్మగ ' వాన్ని ఎవర్‌ వద్దంటారు. అన్నిటీ భావజాలం సొంత ఆస్తి లో ఉన్నప్పుడు దాని ఆడపిళ్ల ఏ విధంగాను దొహద పడనప్పుడు మన జనం వెర్రివాళ్లా ఆడపిళ్లను కనటానికి? ఈ బ్రతుకు భయం వెంటాడుతుంటే మగపిళ్లవాడు ముద్దు గాక ఆడపిళ్ల ఎట్లవుద్ది? దయ్యాలు వేదాలు వల్లించనట్లు ఆడ పిల్లలమీద పRa్మ ఒలక బోసే వారు, అదీ మన సమాజంలో !? ఎంత అహశ్చర్యం! అహశ్చర్యం!

   Delete
  3. ఒడియా భాషలో ఒక సామెత ఉంది. "తియ్యని మాటలు కడుపు నింపవు". ఆడది ఒక దేవత అని ప్రచారం చేస్తే సరిపోదు. దాని కంటే ముందు చాలా పనులు చెయ్యాలి. స్త్రీలని చెత్తగా చూపించే అశ్లీల సినిమాలని నిషేధించాలని కోరితే "వ్యక్తిగత విషయాలలో మోరల్ జజ్‌మెంత్‌లు ఇవ్వలేము" అని చెప్పి తప్పించుకుంటారు మన మేధావి వర్గంవాళ్ళు. స్త్రీని ఒక మనిషిగా గుర్తిస్తే చాలు, ఆడపిల్ల పుడితే ఇంటిలో దీపం వెలుగుతుందంటూ ఏవో కథలు చెప్పక్కరలేదు.

   Delete
  4. This comment has been removed by the author.

   Delete
 4. ఇతరుల్ని ట్రీట్ చేసే విషయంలో "ఆడ ఇలా, మగ ఇలా" అని జనరలైజ్ చెయ్యలేం. That sort of generalization sounds unrealistic and cruel. అది వాళ్ళవాళ్ళ వ్యక్తిగత మనస్తత్త్వాల్ని బట్టి మాత్రమే ఉంటుంది. జెందర్ ని బట్టి కాదు. అందుచేత ఈ విషయంలో మోడీని సమర్ర్థించలేకపోతున్నాను. He is just a politician but not an intellectual. So his attention will be on garnering more and more popularity by issuing politically correct statements.

  ReplyDelete
 5. మోదిగారు ఆడ పిల్లల పట్ల జరుగుతున్నా వివక్షత దృష్ట్యా అలా మాట్లాడి ఉండచ్చు. నిజానికి పిల్లలు ఉండేది, తాము పెద్దయిన తరవాత చూడటానికేనా? అలాంటి దృష్టితో పెంచితే అది వ్యాపారం అవుతుందే కాని సంసారం అవదు. వ్యాపారం అనగానే అందులో మోసాలు సర్వసామాన్యం. కాబట్టి ఆడ పిల్లలు కానీ మగ పిల్లలు కానీ, వారు పెద్దయిన తరవాత వారు మనని చూడాలి అనే బుద్ధితో కాకుండా, ప్రకృతిలోని మిగిలిన ప్రాణి కోటి ఎలా తమ సంతానోత్పత్తిని నిస్వార్ధంగా చూస్తుందో, అలా చూస్తే మగ పిల్లలైనా-ఆడపిల్లలైనా తమ తల్లిదండ్రులని...తల్లిదండ్రులగానే చూస్తారే తప్ప ఇన్వెస్టర్స్ గా చూడరు....

  ReplyDelete
  Replies
  1. చక్కటి వ్యాఖ్య.

   చిన్నప్పుడు మిమ్మల్ని సాకాం కాబట్టి, వృధ్ధులమయ్యాక మమ్మల్ని సాకండి అనడం వ్యాపరమే (reciprocal altruism అంటారు economics/socialogy పరిభాషలో). అలా చెబితే బాగుండదు కనుక దానికి ప్రేమ రంగు పూస్తాం. ఈ రంగు ప్రేమ వల్ల సంస్కృతీసాంప్రదాయాలు కలకాలం నిలిచినా practricalగా దేశం నష్టపోతుంది. పిల్లలకు తల్లిదండ్రులు బ్రతికున్నంతవరకూ సొంత కొన్ని వ్యవహారాల్లో స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి. At the same time పిల్లలు సోమరిపోతులైతే ఏమాత్రమూ సమాజానికి contribute చెయ్యకుండా తల్లిదండ్రుల కష్టార్జితంపై బ్రతికే వెసులుబాటు ఉంటోంది. తల్లిదండ్రులుకూడా child-centricగా జీవిస్తూ, తమ స్వేఛ్ఛను కాలరాసుకుంటున్నారు. ఎవరికివారు తమ తల్లిదండ్రులు కోరుకున్నట్లు జీవించి, తాముజీవించాలనుకున్నట్లుగా తమ పిల్లలను తీర్చుకొంటూ second-hand lives జీవించడంకూడా సరికాదు.

   Delete
  2. కొన్ని సార్లు మానవత్వానికి అర్ధం స్పురించక ఏమైనా అంటుంటారు! వ్యాపారా సమాజం అన్నీ వ్యాపారంలో కలిపేసు కుంటారు. తల్లి దండ్రులు, పిల్లలు ఒకర్నోకరు పోషించటం వ్యాపార మైతే మానవ సంబందాలకు అర్ధమేమిటి? మానవ సంబందాలన్ని ఆర్దిక సంబందాలని కార్ల్‌ మార్క్స్‌ మహాను బావుడ్శు అన్నాడు.-ఎంటే మీ రంత ఆర్ధిక సంబందాల్లోనే బతకండి అని కాదు అర్ధం. పిల్లలు కనే తల్లి తండ్రులు తమపిల్లలు స్వయంగ బతక లేనంత బలహీనులు కాబట్టి వారిని పోషించి మనుషులుగా చేయాల్సిన బాధ్యత వారి ఉంది. ముసలి ప్రాయంలో స్వయం పోషకంగా బతకలేరు కాబట్టి వారి బాగోగులు చూసు కోవడం పిల్లల భాధ్యత. ఇది మానవ మనుగడకు అత్యంత ముఖ్యం. లేక పోతే ఆ పిల్లలు ఉండరు ఈ తల్లి దండ్రులు ఉండరు.
   యాన్‌ మిర్దాల్‌ అనే స్వీడన్‌ దేసపు రచయిత ఇలా చెప్తారు . స్వీడన్‌ లో ఒక ప్రాంతంలో వృద్దులైన తల్లి దండ్రులను ఇక కుదర్దు అని ఏదో ఒక పండుగ పేరుతో ఒక కొంద శిఖరం పైకి మూడు చ్క్రాల బండిలో తీసుకెల్లి పైనుండి కిందకు తోస్తారట. వారి కుటుంబంలొ ఎవరూ ఆ పని చెయ్యక పోయి ఆ వృద్దులే చేసుకుంటారట. ఇది ఒక సాంప్ర దాయంగా కొనసాగటం ఎంత దారుణాతి ధారుణం. మానవత్వం ఉన్న వారు ఎవరైనా దీన్ని అంగీకరిస్తారా? ఇటీ వల మన యువతలో కూడా ఇలాంటి దోరణి పెరిగి పోవడం భారతీయ సాంప్రదాయం అని చెప్పుకొనే వాల్లలో ఇది సిగ్గు చేటు! వ్యాపార సంస్కృతిలో ఇది సహాజంగా పెరిగిపోతు ఉంది.దీన్నే పాసిస్టు లక్ష్నం అంతార్ట.
   మాచిన్నపుడు ఒక క్ధ చెప్పేవారు. గుర్రం జత్కా తోలినంతకు దానికి పచ్చి గెడ్డి, ఉలవగుగ్గిళ్ళు పెట్టి మేపి తన బ్రతుకుదెరువుకు వాడు కొని గుర్రం ముసలిదై నడవలేని పరిస్తిస్తుల్లొ దాని ఎండు గాడి వేయడం కూడా దందగని ఎక్కడో వదిలి పెట్టె వాల్లట! ఇది ఆకధ సారంశం. హె రాం సినిమాలో పరుగెత్త లేక పడి పోయిన గుర్రాన్ని షూట్‌ చేస్తాడు కమల హాసన్‌ పాత్ర. అల్లంటిదె ఇది కూడా. కాదా?

   Delete
  3. ఆడపిల్ల పుట్టబోతోందని తెలిస్తే అబార్షన్ చెయ్యించుకోవద్దు అని చెపితే సరిపోదు. వరకట్న దురాచారాన్ని నిర్మూలిస్తాం అని ప్రమాణం చెయ్యాలి. 5 లక్షలు కట్నం ఇవ్వలేమనుకుని 20 వేలు ఖర్చుపెట్టి అబార్షన్ చెయ్యించుకుంటారు కానీ అది నేరమని తెలియక కాదు. మనిషి జీవితాన్ని భౌతిక పరిస్థితులు నడిపిస్తాయి కానీ కాగితాల మీద వ్రాసిన చట్టాలు కాదు.

   Delete
  4. వరకట్నం అనేది చట్టాలు చేస్తేనో, నీతి సుద్దులు చెబితేనో పోదు. ఇటీవల కాలములో వరకట్నం అనేది తగ్గు ముఖం పట్టింది అంటే అది ఎందుకో తెలుసా? ఆడవారు కూడా చక్కగా చదువుకొని, తమ కాళ్ళ మీద తాము నిలబడడం వల్ల. వరకట్నమైతే ఒక్కసారి వస్తుంది. అదే అమ్మాయి సంపాదిస్తే నెల నెల ఆదాయమే. సంసారములో చేదోడు వాదోడుగా ఉంటుంది (ఆర్థికంగా కూడా). ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే చాలా మంది మగవారు గ్రహిస్తున్నారు. పెళ్ళి చేసుకుంటే, ఉద్యోగం చేసే అమ్మాయినే చేసుకుంటాను అనే మగవారి సంఖ్య పెరుగుతోంది. అందుకే ప్రస్తుతం ఉద్యోగాలు చేసే స్త్రీలకు విపరీతమైన డిమాండు "మ్యారేజ్ మార్కెట్లో". కాబట్టి, ఆదర్శాలు అంటూ బుర్రలు బద్దలు కొట్టుకోకుండా, స్త్రీ విధ్య, ఉపాధి అనే విషయం మీద దృష్టి పెడితే, వరకట్నం, భరణం అనే దురాచారాలు వాటంతట అవే పోతాయి (అందరూ అమ్మాయిలిచ్చే వరకట్నం గురించే మాట్లాడుతారు, ఒక వేల విడిపోతే అబ్బాయిలు ఇవ్వాల్సిన భరణం గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడరెందుకో?).

   Delete
  5. This comment has been removed by the author.

   Delete
  6. వరకట్న దురాచారం ఎక్కడ తగ్గింది? ఉద్యోగం చేసే ఆడపిల్లల తండ్రులు కూడా కట్నాలు ఇస్తున్నారు. ఆడపిల్లలని doctor, teacher లాంటి ఉద్యోగాలైతే చెయ్యనిస్తారు కానీ పోలీస్ ఉద్యోగం లాంటివు చెయ్యనివ్వరు. అందుకే పోలీస్ శాఖలో మహిళా ఉద్యోగుల సంఖ్య 2% మాత్రమే కనిపిస్తుంది.

   Delete
  7. ఇంకో విషయం, ఆడపిల్లల బౄణహత్యలు వరకట్నం కూడా ఒక కారణం అవ్వచు. కానీ, దానికి మించిన పెద్ద కారణం, ఆడపిల్ల పరాయి సొత్తు అనే భావన. అమ్మాయి ఒక వయసు వచ్చిన తరువాత ఇల్లు దాటి అత్తారింటికి పోతుంది. ఇక తమను చూసుకునే బాధ్యత మగ పిల్లాడిదే అనే భావం. మగవారిపై సమాజం మోపిన బాధ్యత. మోడీ కూడా దాని గురించే చెప్పాడు. కాకపోతే, ఆదర్శ పురుషుడు కదా అందుకే ఆదర్శాన్ని కాస్త ఎక్కువ సాగదీసి, అబ్బాయిలకంటే అమ్మాయిలే గొప్పగా చూసుకుంటారు అని చెప్పేశాడు. సమాజములో స్త్రీలపట్ల వివక్ష పోవాలి అంటే, వరకట్నం అనే దురాచారం పోవడమే కాదు.. వృద్దాప్యములో తల్లిదండ్రుల బాధ్యతలు చూడడం అనేది కూతురు, కొడుకు ఇరువురూ సమానంగా పంచుకున్నప్పుడో లేక ఆ బేధం లేకుండా ఆ బాధ్యత నిర్వర్తించినప్పుడో జరుగుతుంది. అంత వరకూ ఈ దురాచారాలు పోవు. అలా చేయకుండా ఆదర్శాలు వల్లించడం అంటే నీటి మీద రాతలు రాయడమే.

   Delete
  8. భరణం గురించి నేను కావాలని మాట్లాడలేదు. విడాకులు తీసుకున్న స్త్రీ రెండో పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది కానీ 500 రూపాయల భరణం కోసం ఒంటరిగా ఉండిపోవాలనుకోదు. విడాకులు పొందిన పురుషునికి ఉద్యోగం లేకపోయినా అతనికి భార్య భరణం ఇవ్వాలి. అతను కూడా ఉద్యోగం చూసుకోవడానికో, రెండో పెళ్ళికో సిద్ధపడతాడు కానీ భరణం కోసం కోర్త్‌లో కేస్ వెయ్యడు.

   Delete
  9. పోలీసు శాఖలో స్త్రీలు లేకపోవడానికి వివక్షే కారణమా? వివక్ష ఉండొచ్చు, కానీ అదొక్కటే కారణం మాత్రం కాదు. స్త్రీల ఆలోచణా ధోరని కూడా ఒక కారణం. పోలీసు శాఖే కాదు, కఠిన శ్రమ, కాస్త శారీరక దారుఢ్యం అవసరమైన చాలా పనులకి మగవారే ఎక్కువగా వెలుతూ ఉంటారు. దానికి వివక్ష కన్నా ఆయా స్త్రీ-పురుషుల తీసుకునే "ఛాయిస్" ఎక్కువ ప్రభావం చూపుతుంది. భారత దేశములోనే కాదు, అభివృద్ది చెందిన దేశాలలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ ఏకంగా స్త్రీలను సైన్యములోనూ, మరి కొన్ని రకాలైన వృత్తుల్లోనూ చేర్పించడానికి వివిధ రకాలైన వెలుసుబాట్లు, ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. అయినా సరే, వాటిలో మగవారి సంఖ్యతో పోలిస్తే ఆడవారి సంఖ్య చాలా తక్కువ. కఠోర శ్రమ కాకుండా, కమ్యూనిస్కేషన్లూ, నర్సింగ్ శారీరక శ్రమ ఎక్కువగా లేనివాటిల్లోనే స్త్రీలు అధిక శాతం ఉన్నారు. నిజం చెప్పాలి అంటే అక్కడ వారు పురుషుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాటిలో డామినేషన్ ఆడవారిదే.

   Delete
  10. స్త్రీలు శారీరకంగా బలహీనులనే అభిప్రాయం ఉన్నంత వరకు స్త్రీలపై రేప్‌లూ, లైంగిక వేధింపులు జరుగుతాయి. పోలీస్, సైనిక విభాగాల్లోకి స్త్రీలని తీసుకోవడానికి నిరాకరించినా లింగ వివక్ష ఎంత ఉందో అర్థమైపోతుంది.

   Delete
  11. స్త్రీ-పురుషుల మధ్య శ్రమ విభజన ఉన్నా అక్కడ సమానత్వాన్ని వెతకడం వృథా. స్త్రీలే స్వయంగా కొన్ని పనులు చెయ్యడానికి నిరాకరిస్తే అది సమాజ ప్రభావమే అనుకోవాలి. మూఢనమ్మకాలైనా, అభివృద్ధికర భావాలైనా సమాజం నుంచే పుడతాయి కానీ శూన్యం నుంచి పుట్టవు.

   Delete
  12. స్త్రీలు శారీరకంగా బలహీనులనే అభిప్రాయం ఉన్నంత వరకు స్త్రీలపై రేప్‌లూ, లైంగిక వేధింపులు జరుగుతాయి. పోలీస్, సైనిక విభాగాల్లోకి స్త్రీలని తీసుకోవడానికి నిరాకరించినా లింగ వివక్ష ఎంత ఉందో అర్థమైపోతుంది.

   స్త్రీలు పురుషులతో పోలిస్తే శారీరకంగా బలహీణులే. వాస్తవాన్ని అంగీకరించడానికి, అత్యాచారాలకీ సంబందం లేదు. సైనిక వర్గాలలో స్త్రీలను తీసుకోవడానికి నిరాకరించడం లేదు. స్పెషల్ డ్రైవులు ఏర్పాటు చేసి, వారికి కొన్ని వెలుసు బాట్లు, సౌకర్యాలు కలిపించి మరీ సైన్యం ఆహ్వానం పలుకిన దేశాలు చాలా ఉన్నాయి. అయినా అక్కడ స్త్రీలు సైనిక రంగములో చాలా స్వల్ప సంఖ్యలో ఉన్నారు. ప్రతీ దానికి సమాజాన్ని సాకుగా చూపడం పలాయన వాదం అవుతుంది. నిజంగా సమాజమే కారణమా లేక స్త్రీలే తమ కంఫర్ట్ కోసం నిరాకరిస్తున్నారా అన్న విషయాన్ని, పొలిటికల్ కరక్ట్ నేస్ మరియూ మూఢనమ్మకానికి సమాన స్థాయిలో ఉన్న వింత ఆదర్శాలను పక్కనబెట్టి నిష్పాక్షికంగా పరిశీలించాలి. అలా పరిశిలించకుండా ఏవో నాలుగు పడికట్టు ఆదర్శాలు వల్లెవేసినంత మాత్రాణ వాస్తవాలు అవాస్తవాలైపోవు.

   Delete
  13. స్త్రీలు శారీరకంగా బలహీనులైతే మహిళా కార్మికుల చేత గ్రానైత్ క్వారీలలో ఎందుకు పని చెయ్యిస్తున్నట్టు? క్వారీలో రాళ్ళు మొయ్యడం కంటే పోలీస్ ఉద్యోగంలో చేరి దొంగల వెనుక పరిగెత్తడం సులభం కాదా? మగవాడు బయట పని చెయ్యడం, ఆడది ఇంటి పని చెయ్యడం అనే భూస్వామ్య భావజాలం నుంచి మీరు బయటపడలేదు. స్త్రీ శారీరకంగా బలవంతురాలే. స్త్రీకి శారారక బలం తక్కువ అని నిజంగా నమ్మితే క్వారీలలో మహిళా కార్మికులు పని చెయ్యడాన్ని ఎందుకు నిషేధించకూడదు?

   Delete
  14. నేను చెప్పాల్సింది చెప్పాను ప్రవీన్. మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పుకుంటు పోయే ఓపిక ప్రస్తుతం నాకు లేదు. మీ ప్రశ్నకు మీరే సమాధానం వెతకడానికి ప్రయత్నించండి. నా తరపున నేను చెప్పాల్సింది చెబుతున్నాను. స్త్రీ శారీరకంగా బలహీణురాలు అనడం భూస్వామ్య భావజాలం కాదు. ఎందుకు అనేది కూడా మీరే శోధించండి ఓపిక ఉంటే లేదంటే వదిలేయండి.

   Delete
  15. స్త్రీకి శారారక బలం తక్కువ అని నిజంగా నమ్మితే క్వారీలలో మహిళా కార్మికులు పని చెయ్యడాన్ని ఎందుకు నిషేధించకూడదు

   స్రీకి శారిరక బలం పురుషుడితో సమానంగా ఉంటుందనే నువ్వు ఇరాక్ లో,బొకొ హరాం లో మహిళలు పురుషులతో యుద్దం చేసి వారిని ఎందుకు చంపలేకపోయారు?ఆదేశాల్లో ఎప్పుడు కొట్టుకు చస్తూంటరు కదా! వారి దగ్గర ఆయుధాల కొరవలేదు. వారు యుద్దం చేయదలచుకొంటే మహిళలకు ఇస్తారు. సిరియా, ఇరాక్ లలొ వందలమంది ఆడవారిని పట్టి బంధించి, బానిసలుగ మార్కేట్ లో వాళ్లను అమ్ముతూంటే వారెందుకు గమ్ముగా ఉన్నారు? వారే గాదయ్యో ప్రపంచవ్యాప్తంగా ఉండే ఫెమినిస్ట్ లు/మార్క్సిస్ట్ లు కూడా నోరు మెదపటం లేదు. గాజా మీద రోజు గోల చేసేవారికి ఇరాక్ లో సంఘటను కనపడవా?

   Delete
  16. Pls read this article

   Syrian mother's agony: why I made my teenage daughter become a child bride
   http://www.theguardian.com/world/2014/jul/17/syrian-mothers-child-brides

   Delete
  17. స్త్రీలు సహజాతంగానే పురుషునితో పోల్చి చూస్తే శారీరకంగా కొంత తక్కువ బలం కలిగి ఉంటుంది. కానీ స్త్రీ బలహీను రాలు కాదు. రేపులు జరగడానికి స్త్రీ శారీరక బలహీనురాలనే కారణమొక్కటే కాదు. చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి.

   Delete
  18. స్త్రీలకి క్వారీలలో ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు బలహీనులు అని ఎందుకు అనిపించదు? పురుషులకి ఉండే కోరికలే స్త్రీలకి కూడా ఉంటాయి. అయినా స్ర్రీలు పురుషులని రేప్ చేసిన సందర్భాలు ఒకటో, రెండో మాత్రమే ఉంటాయి. చాలా మంది, చివరికి స్త్రీలు కూడా స్త్రీల బలాన్ని తక్కువ అంచనా వెయ్యడమే ఇందుకు కారణం కాదా?

   Delete
  19. This comment has been removed by the author.

   Delete
  20. స్త్రీ పురుషునితో పోలిస్తే శారీరకంగా బలహీణురాలు అని మాత్రమే నేను అన్నాను. అంతే కానీ ఆమె ఏమీ చేయలేని దుర్భలురాలు అని అనలేదు. ఇక్కడ మగవారితో పోలిక పెట్టి, కాస్త బలహీణురాలే అని చెప్పడం జరిగింది అంతే.

   ఇక అత్యాచారాలు అంటారా? అసలు అత్యాచారాలకి, బలానికి నేను ఎక్కడ లింకు పెట్టాను? అది ప్రవీణుడి సృష్టి. మనం చెప్పిన పాయింటునుండి .. మనం చెప్పని పాయింటుకు లింకు కలిపి .. ప్రశ్నలు వేయడం ఆయనకు అలవాటే.

   అసలు శారీరక బలానికీ అత్యాచారానికీ సంబందం లేదని నేను దృఢంగా నమ్ముతాను. ఆఫీసుల్లో బాసు గారు (స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు) .. తన వద్ద పనిచేసే స్త్రీలపై లేదా పురుషులపై జరిపే అత్యాచారాలు తీసుకోండి? అక్కడ బలం, కండ బలం కాదు, స్థాన బలం. కండ బలం ఉన్న, లేకపోయినా ... స్థాన బలం చాలు అత్యాచారాలు చేయడానికి.

   శారీరక బలం లేకపోతే అత్యాచారాలు జరగవు అనుకోవడం ఆశాస్త్రీయమైన ఆలోచన.

   మరో విషయం పురుషులపై జరిగే అత్యాచారాలు ఒకటో రెండో కావు. చాలా ఉన్నాయి. కానీ, మన సో-కాల్డు పురుషాదిఖ్య సమాజములో పురుషులపై జరిగే అత్యాచారాలను .. అసలు అత్యాచారాలుగానే పరిగణించడం లేదు. ఇది సమాజములో ప్రబలంగా ఉన్న "సెక్సిస్టు" ధోరణికి నిదర్శనం. అదే కాస్తో కూస్తో అభ్యుదయ భావాలు కలిగిన దేశాలలో పురుషునిపై జరిగే అత్యాచారాలను కూడా తీవ్రంగానే పరిగణించాలన్న డిమాండు చేస్తున్నారు.

   ఇటీవలే అమెరికాలో జరిపిన అధ్యయనములో, అత్యాచారాలకు గురయ్యే పురుషులు దాదాపుగా స్త్రీలతో సమానంగానే ఉన్నారని తేల్చి చెప్పారు.

   "Men Are Raped Almost as Often as Women in America. We Need to Talk About This."

   "Last year the National Crime Victimization Survey turned up a remarkable statistic. In asking 40,000 households about rape and sexual violence, the survey uncovered that 38 percent of incidents were against men."

   అమెరికాలోని నేషనల్ క్రిమినల్ విక్టిమైజేషన్ సర్వే ప్రకారం, 40,000 వేల గృహాలలో సేకరించిన సమాచారం ప్రకారం 38 శాతం మగవారు అత్యాచారానికి లేదా లైంగిక హింసకీ గురయ్యారని తేల్చారు.

   పురుషులపై అత్యాచారాలు జరగవు వారికీ, లేదా అవి కేవలం ఒకటీ అరా మాత్రమే అనే వారికీ అసలు "రేప్" అనే అంశం మీద ఏమాత్రం అవగాహన లేదని చెప్పొచ్చు. అత్యాచారం, లైంగిక హింస అనగానే అదేదో పురుషులు స్త్రీలపి చేసేది అనే ఆలోచణా ధోరణిని మానేయండి. Don't be a rape apologist and become part of rape culture.

   Delete
  21. పైన నేను ఇచ్చిన సమాచారానికి సంబందించిన లింకు ఇవ్వడం మరిచిపోయాను. ఈ కింద వచ్చిన వార్తనూ, మరో సైటులో జరిగిన చర్చనూ చూడవచ్చు.

   When Men Are Raped
   ( http://www.slate.com/articles/double_x/doublex/2014/04/male_rape_in_america_a_new_study_reveals_that_men_are_sexually_assaulted.html )

   ఈ అధ్యయనం పై అంతర్జాతీయ(స్థాయి) వెబ్ సైట్లలో జరిగిన చర్చ ..
   ( http://groupthink.jezebel.com/when-men-are-raped-tw-rape-sexual-assault-1583373446 )


   Delete
  22. ఇక్కడ కావలసినవి బయలాజికల్ ఎవిదెన్సెస్. స్త్రీ పురుషునితో పోలిస్తే బలహీనురాలు అనడానికి బయలాజికల్ ఆధారాలు లేవు. స్త్రీలు బలహీనులు అని మన తాతలు నమ్మారు కనుక ఆ నమ్మకం నుంచి బయటపడలేకపోతున్నాం. మూడు కాళ్ళ కుందేలు వాదన మీద నిజం నిలవదు.

   Delete
  23. *పోలీస్, సైనిక విభాగాల్లోకి స్త్రీలని తీసుకోవడానికి నిరాకరించినా లింగ వివక్ష ఎంత ఉందో అర్థమైపోతుంది*

   సైనిక విభాగంలో పనిచేస్తూ యుద్దం లో పాల్గొనటమంటే అంత సులువైన పని కాదు. కష్టానికి దగ్గ పేరు ప్రఖ్యాతులు వస్తాయన్న గేరెంటి లేదు. యుద్దం అంటే కల్పనా చావ్లా వలే , అంతరీక్షంలోకి సురక్షితంగా నలుగురు జెంటిల్ మెన్ లతో పోయి, భూమి మీదకు తిరిగి వచ్చినంత సులువు కాదు. మిలటరి ఉండేది అవసరమైతే యుద్దం చేసి దేశాన్ని రక్ష్మించటానికి, దాని లక్ష్యం యుద్దాలు గెల్వటం. అంతేగాని సంగంలోని మార్పులను ప్రతిభింబిస్తూ, లెఫ్ట్ లిబరల్ విలువలను పాటించి మహిళలకు ఉద్యోగాలు కల్పించటం కాదు. ఇటువంటి ప్రయోగాలు అక్కడ చేస్తే, దేశానికి, మహిళలకు కూడా లాభం కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. మనకి యుద్దం వస్తే గిస్తే పక్క దేశాలతో వస్తుంది. మన పక్కదేశాలలో యుద్ద సమయం లో ఎమి జరుగుతుందో తెలిసే మాట్లాడుతున్నారా? బంగ్లాదేశ్ వార్ లో మహిళల పై జరిగిన ఘోరాలు చెప్పనలవి కాదు. పక్క దేశాస్థులకు ఇండియా వారు దొరికితే తల నరికి ఫెన్సింగ్ కి వేలడ తీస్తూంటారు. అది వారి సంస్కృతి లో ఒక భాగం. ఇప్పుడు సిరియ ఇరాక్ లలో జరిగే గొడవలలో అటువంటి సంఘటనలు చూడవచ్చు. అదే మనకి లక్ష మంది సైనికులు పట్టుబడితే అందరిని ఎమీ చేయకుండా వదలిపెట్టాము. అది మన సంస్కృతి..

   Delete
 6. మోదీ అన్నది సరైనదే అవ్వచ్చు. కానీ దానికి కారణంగా జెండర్‌ని మాత్రమే చెప్పలేం.

  ఒక typical Indian familyలో మగపిల్లల పెంపకం హెచ్చుసంపాదన లక్ష్యంగా ఉంటుంది. ఒకవయసు దాటాక ఇంటిదగ్గర సమయాన్ని పొద్దుపుచ్చడం నిరుత్సాహపరచబడుతుంది, మంచి విద్యాసంస్థలు దూరంగా ఉన్నా అందులో చదువు కిఒనసాగించే ప్రోత్సాహం కుటుంబంనుండి ఉంటుంది, ఇంటిలో శ్రమప్రధానమైన బయటిపనులేతప్ప ఇతరత్రా అప్పగించబడకపోవడంలాంటి కారణాలవల్ల మగ పిల్లలు ఒకరకమైన external focusతో పెరుగుతారు. తద్విరుధ్ధంగా ఇంటిపట్టునే పెరిగే ఆడపిల్లలు సహజంగానే తల్లిదండ్రులతో ఎక్కువ emotional bonding కలిగుంటారు.

  పెంపకాన్ని తారుమారుచేస్తే, ఫలితాలుకూడా తారుమారుగానే ఉంటాయని నేను అనుకుంటున్నాను.

  ReplyDelete
  Replies
  1. @Iconoclaust
   వృద్ధుల సమస్య గురించి రంగనాయకమ్మ గారు వ్రాసిన వ్యాసం చదివాను. కొంత మంది తల్లితండ్రులు తమకి వృద్ధాశ్రమాలలో ఎలాంటి సమస్య లేదని చెప్పుకోవడం చూస్తోంటే వృద్ధాశ్రమాల సంస్కృతి ఎంత ఆమోదయోగ్యమైపోయిందో అర్థమవుతోంది.

   Delete
  2. @ Iconoclast , good analysis. #పెంపకాన్ని తారుమారుచేస్తే, ఫలితాలుకూడా తారుమారుగానే ఉంటాయని నేను అనుకుంటున్నాను.# పెంపకాన్ని తారుమారు చేయకపోయినా పెంపకాన్ని సరిచేసుకోవలసిన అవసరం చాలా అంశాలలో కీలకమైనది ప్రస్తుత మన సమాజంలో.

   Delete
  3. స్త్రీ శారీరికంగా ఎంతమాత్రం సహజబలహీనురాలు కాదు. బలహీనురాలిగా మలచబడిన బలహీనురాలు. ఏ సమాజాల్లో స్త్రీల భాగస్వామ్యం లేకుండా ప్రగతి సాదించలేదు. వ్యవసాయాన్ని కనిపెట్టింది స్త్రీలు మాత్రమే. దాన్ని అభివృద్ది చేసింది స్త్రీలే. ఆమె బలహీనతా అంత తల్లీవడమే. మొన్న మొన్నటి వరకు మన ఫ్యూడల్‌ సమాజాల్లో మగపిల్లలకు పెట్టిన ఆదపిల్లలకు పెట్టి పెంచలేదు. సంపాధంలో ఆమెకు రెండో స్థానమివ్వబడింది. ఆ సంపాధన కొరకు మగవాడికి పుష్టిగా తింది పెట్టి పెంచితే గానీ శారీరక శ్రమ చేసి కుటుంభాన్ని ఆధుకోడు. అందు వల్ల మగపిల్లలు ప్రత్యేకంగా శ్రద్దతో పెంచబడినాడు. అందు వల్ల శారీరకంగా బలవంతుడు. స్త్ర్రీ కి సంపాధన సీను లేదు కనుక ఇంట్లొ అందరూ తిని మిగిలింది తిని బతికింది. అమెకు సరైన పోషకాలు దొరక్క తరాలు మారేకొద్ది శారీరిక బలహీనత ఏర్పడింది. ఇంక రెండు తరాలు తరువాత మీరు బతికుంటే చాడండి ఆమె బలహీనతకు ఏ లోటు ఉండదు.

   Delete
  4. ఆడవాళ్ళని doctor, teacher లాంటి కొన్ని రకాల ఉద్యోగాలకే పరిమితం చేసి, ఆడపిల్ల పుడితే ఇంటిలో దీపం వెలుగుతుందని ప్రచారం చెయ్యడం ఎవరిని ఉద్ధరించడానికి? ఆడదాన్ని అమ్మ, అక్క, సహనశీలి, ఇంటి దీపం లాంటి ఉత్తుత్తి బిరుదులతో పొగడక్కరలేదు. ఆడదాన్ని మనిషిగా గుర్తిస్తే చాలు, ఆమె ఉద్దరించినట్టే.

   స్త్రీవాదం స్త్రీకి పురుషునితో సమాన హక్కులు ఉండాలని చెపుతుంది కానీ ఆడపిల్ల పుడితే దేవత పుట్టిందనుకోమని చెప్పదు.

   Delete
  5. *సంపాధన కొరకు మగవాడికి పుష్టిగా తింది పెట్టి పెంచితే గానీ శారీరక శ్రమ చేసి కుటుంభాన్ని ఆధుకోడు. అందు వల్ల మగపిల్లలు ప్రత్యేకంగా శ్రద్దతో పెంచబడినాడు. అందు వల్ల శారీరకంగా బలవంతుడు. స్త్ర్రీ కి సంపాధన సీను లేదు *

   స్రీ సహజ బలహీనురాలు కాకపోతే మగవాడికి "పుష్టిగా" పెట్టే తిండి వారికే పెట్టి ,మగపిల్లలకు మల్లే ప్రత్యేకంగా శ్రద్దతో పెంచి, శారీరకంగా బలవంతురాలిగా మలచి, వారి చేతే పనులు చేయించుకోవచ్చు కదా! తిండి తినేశారో అని మగవారి మీద పడి భోరున ఏడవడమెందుకు? కష్టం చేసుకొనే వారికి శక్తి కొరకు కొంచెం ఎక్కువ తిండి తింటే అది తప్పా?
   మీరు చెపితే మొదటి సారి గా వింట్టున్నాను వ్యవసాయాన్ని కనిపెట్టింది స్త్రీలు మాత్రమే అని. సాధారణంగా ఇటువంటి కొత్తకోణాలు కంచా అయ్యలయ్య గారు ప్రస్థావిస్థూంటారు. ప్యుడల్ సమాజం లో ఎంతో ప్రాముఖ్యత కలిగినవ్యవసాయాన్ని అభివృద్ది చేసిన స్త్రీలైతే వారికి సంపాధన సీను లేదు అని మళ్ళీ మీరే అనటం లో ఔచిత్య మేమిటి?

   Delete
  6. This comment has been removed by the author.

   Delete
  7. *ఆడదాన్ని అమ్మ, అక్క, సహనశీలి, ఇంటి దీపం లాంటి ఉత్తుత్తి బిరుదులతో పొగడక్కరలేదు..... స్త్రీవాదం స్త్రీకి పురుషునితో సమాన హక్కులు ఉండాలని చెపుతుంది *
   నువ్వు చెప్పింది నిజమే ప్రవీణ్! మానవులలో ఉండే మంచి,చెడు గుణాలు వారిలోను ఉన్నాయి. కాకపోతె వారిలో చాలా ఎక్కువగా ఉన్నట్లు పాత తరం వారు పొగిడారు, చాలా సింపథిటిక్ గా రాశారు. అంటె ఒకరిలో 25% ఉన్న గూణాలను 100% ఉన్నట్లు ఎక్కువ చేసి చూపారు.
   ఈ రోజు పేపర్లలలో వార్తలు చదువుతూంటే, వారికి మగవారికి మల్లే అన్ని లక్షణాలు కలిగినవారని తెలుస్తున్నాది. కొన్ని ముఖ్యాంశాలు. ప్రతియేట ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి ఐదు లక్షలమంది పురుషులు అత్యాచారానికి గురౌతున్నారు(ఈ వార్త నవ్య అనే వారపత్రికలో వచ్చింది). 40 ఏళ్ల ఒక మహిళ 25 సంవత్సరాల అతనితో పోన్ లో ప్రేమాయణం వెలగ బెట్టి,డబ్బులు గుంజుతూ బ్లాక్ మైల్ చేస్తూ, అతని చావుకు కారణమైంది. అంతేనా ప్రియుడి కోసం తల్లిని చంపిన కూతుళ్లు ఉన్నారు, పబ్లిసిటి కోసం పోలిసు పెద్దల పై నిందా రోపణలు చేసిన వారున్నారు. కాలనుగుణంగా ఎన్నో మార్పులు వస్తున్నయి, వాTiని గుర్తించి సమస్యలను పరిష్కరించుకోవాలి.

   Blackmailed by 'tele-lover', man kills self
   http://m.timesofindia.com/City/Delhi/Blackmailed-by-tele-lover-man-kills-self/articleshow/39437833.cms

   'Model who accused Mumbai DIG of rape wanted publicity for a TV show'
   http://zeenews.india.com/news/maharashtra/model-accusing-mumbai-dig-of-rape-wanted-publicity-for-a-tv-show_952511.html

   Gang of women thieves busted in Palghar
   http://timesofindia.indiatimes.com/city/mumbai/Gang-of-women-thieves-busted-in-Palghar/articleshow/39770407.cms

   16-year-old kills mother to marry lover in Haryana
   http://timesofindia.indiatimes.com/city/chandigarh/16-year-old-kills-mother-to-marry-lover-in-Haryana/articleshow/17316650.cms

   Kannada starlet honey traps a doctor, demands Rs 1 crore, police bust racket
   http://m.ibnlive.com/news/kannada-starlet-honey-traps-a-doctor-demands-rs-1-crore-police-bust-racket/483669-71-176.html

   Delete
 7. ఒక్కోసారి నాకేం అనిపిస్తుందంటే... "ఛీ, మగ బతుకు ... ఊర్లో కుక్కా బతుకుతోంది, మగాళ్ళూ బతుకుతున్నారు". కుక్కనైనా అప్పుడప్పుడూ "అది విశ్వాసం గల జంతువు" అని దాన్ని సుగుణాన్ని పొగుడుతూ ఉంటారు. మగాడికైతే ఆ ఫెసిలిటీ కూడా ఉండదు అనిపిస్తుంది. మగాడు అంటే ఒక పొటెన్షియల్ రేపిస్ట్ (అత్యాచారం చేయగల సామర్ధ్యం, అవకాశం, ఆలోచన కలిగిన వ్యక్తి).

  భారత దేశములో పురుషాధిక్యత ఉంది, ఇది పితృస్వామ్య సమాజం అని ముద్రేసేశారు. తరతరాలుగా ఈ పితృస్వామ్య ప్రపంచములో .. రక్షణ, పోషణ (Protect and Provide) అనేవి మగవాడి బాధ్యతలు. భారత దేశ జనాభా ఎంత? అందులో ఎంత మంది ముసలి వారు? వారిలో ఎంత మంది వృద్దాశ్రమాలలో ఉన్నారు, అనాధలుగా వదిలివేయబడ్డారు? అనే లెక్కలు ఒక్కసారి సరి చూసుకోండి. మగవారు నిజంగానే తమతళ్ళీదండ్రులను వీధుల్లో వదిలేస్తున్నారా అన్న విషయం అర్థమవుతుంది.

  ఇక్కడ కొంత మంది, "..పురుషులు తమ తళ్ళిదండ్రులను వదిలేసిన " ఉదాహరణలు చూపిస్తున్నారు. నిజమే, కొంత మంది మగవారు నిజంగానే అలా ప్రవర్తిస్తున్నారు. కాదన్ను. కానీ, అలా పవర్తించకుండా ఉండే మగవారు లేరా? ఉన్నారు, నిజానికి వీరే అధిక శాతం ఉన్నారు.

  నాకు తెలిసిన మగవారిలో చాలా మంది తల్లా ? పెళ్ళామా?? అన్న ప్రశ్న ఉద్బవించినప్పుడు తల్లిని సమర్ధించి 498A లాంటి కేసుల్లో బుక్కయి జైలు పాలైన వారున్నారు. జైలు నుండి వచ్చిన తరువాత, తననూ జైల్లో పెట్టినా క్షమించారేమో కానీ, తన తల్లిని మాత్రం ఇబ్బంది పెడితే, విడాకులు తప్ప మరే ఆప్షనూ ఎంచుకోని మగవారున్నారు. "మా అమ్మను ఇబ్బంది పెట్టింది, నేను ఆమెతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసి ఉండను" అని చెప్పిన మగవారి లెక్క ఎంతో CAW cell ("Crime Against Women" cell)లో పనిచేసే వారిని అడగండి చెబుతారు.

  వెరైటీ ఏమిటంటే, చాలా మంది స్త్రీవాదులు, (స్వయం ప్రకఠిత) ఆదర్శ పురుషులూ అలా తల్లికోసం భార్యను వదిలేయడం తప్పనీ, పెళ్ళాం తన తల్లిదండ్రులను వదులుకొని ... మళ్ళీ చెబుతున్నాను ... తల్లిదండ్రులను వదులుకొని భర్త వెంట వచ్చిందనీ సుద్దులు చెబుతారు. ఇక కమ్యూనిస్టులైతే .. దానికి పెట్టుబడి దారి విధానం ఏవిధంగా కారణమో, దానికి పరిష్కారం 19 వ శతాబ్దములో మార్క్సు రాసిన "ఆల్- యిన్- వన్" గైడు లాంటి ఫలానా పుస్తకములో ఏవిధంగా ఉందో ఏకరువు పెడతారు. ఎందుకంటే అప్పుడు ఫోకస్ అనేది తల్లి కోసం భార్యను వదిలేయకూడదు అని మగవారికి సుద్దులు చెప్పడం మీద ఉంటుంది కాబట్టి.

  అదే ఫోకస్ అనేది తల్లిదండ్రులను ఆడవారు బాగా చూసుకుంటారా? మగవారు బాగా చూసుకుంటారా అనే విషయములోకి వస్తే మాత్రం, ఎవ్వరికీ " ఆడపిల్ల తల్లిదండ్రులను వదులుకొని వస్తుంది" అనేది గుర్తుకురాదు. కేవలం మగవారిలో కొంత మంది తల్లిదండ్రులను వదిలివేయడం అనేదే గుర్తుకువస్తుంది. (ఇక్కడ ఆడపిల్ల తల్లిందండ్రులను వదిలేసి వస్తుంది అనేది నేను "కట్టుబాట్ల పరంగా జరుగుతుంది" అని మాత్రమే చెబుతున్నాను. వారికి తమ తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు అని చెప్పడం లేదు, అది మగవారి బాధ్యత, చాలా మంది మగవారు కష్ట నష్టాలకు ఓర్చి నెరవేరుస్తున్న భాధ్యత అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశ్యం).

  పాముకు రెండు నాలుకలుంటాయి... "రెండు నాల్కల స్వభావం" అనే జాతీయం కూడా మనకు తెలుసు. కానీ, ఆదర్శ పురుషుల విషయములోకి వస్తే మాత్రం .. ఆ మహానుభావులకి నోరంతా నాలుకలే. లెక్కలేనన్ని నాలుకలు. ఆదర్శాలు వల్లెవేసేప్పుడు ఒక్కో నాలుకతో ఒక్కో ఆదర్శాన్ని వల్లెవేస్తూ ఉంటారు.

  ReplyDelete
  Replies
  1. "ఆడపిల్ల తల్లిదండ్రులను వదులుకొని వస్తుంది అనేది గుర్తుకురాదు"

   అయ్యా! ఇది ఇలా ఉండటమే ధర్మమని ఈమధ్య రామాయణం గురించి చాగంటివారి ప్రవచనాలు విన్నాకే అర్ధమయ్యింది. పెళ్ళయిన ఆడపిల్లకి first preference అత్తింటివారు కావాలేతప్ప, పుట్టింటివారు కారాదు అని ఆయన తెగబోలెడు passionateగా బోధించారు. బహుశా మీరు ఏది 'ధర్మము' (righteous) అన్న విషయంలో ఆయనతో చర్చించాల్సి ఉంది.

   మనలాంటి ప్రాచ్యదేశాలలో చట్టంకన్నా, మెజారిటీ ప్రజల మతవిశ్వాసాలు ఉరఫ్ ఆచారాలు ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకొంటాయన్నది తెలిసినవిషయమే (కనుకనే అన్నా హజారే వెనుక నిలచిన 'నిక్కమైన భారతీయులు' తల్లిదండ్రుల ఆజ్ఞమేరకు కట్నాలు తీసుకొని, కులపు పిల్లనే పెళ్ళాడెదరు/పెళ్ళాడినారు, ప్రజలు లంచానికి{తాము చెల్లించవలసినదానికి} వ్యతిరేకముగా ఉద్యమించినారేగానీ కట్నానికి{తమకు చెల్లించవలసినదానికి} వ్యతిరేకముగాకాదు). Let's agree, we had brought up sons with the impression that women are inferior to them (and vice versa) with the only consolation being that we have our Islamic friends being our compatriots (and to a greater extent our Christian 'masters') for the cause.

   Point made

   Delete
 8. This comment has been removed by the author.

  ReplyDelete
 9. @శ్రీకాంత్
  మనదేశం లో మగవారు వారి బాధ్యత ను ఎంతో బాధ్యత గా నిర్వహిస్తుండబట్టే సమాజం చక్కగా నడుస్తున్నాది. వాళ్లు బాధ్యత తీసుకోవటం మానేసి ఉంటే ప్రభుత్వాలు చేతులెత్తి చతికల పడేవి. నమో ప్రభుత్వానికి ప్రస్తుత మధ్యతరగతి లో వచ్చిన మార్పుల పైన అవగాహన ఉంది. రైట్ వింగ్ థిక్ టాంక్ లో చాలా మంది యురోప్ ,రష్యాలలో ఫెమినిస్ట్ ఉద్యమాలు కుటుంబ వ్యవస్థను ఎలా కుప్ప కూల్చాయో పూర్తిగా అవగాహన ఉంది.వాళ్లు ఆ అనుభవాలను బిజెపి మంత్రులతో పంచుకొంట్టున్నారు. ప్రస్తుతం దీవాల తీసిన యురోప్ ప్రభుత్వాలకు సింగిల్ పెరేంట్ వల్ల పడే భారం రానున్న రోజులలో మోసే స్థితి లో లేవు. ఇప్పటికే యురోప్లో డ్రగ్స్,గాంబ్లింగ్, వ్యబిచారం పైన వచ్చే ఆదాయాన్ని జిడిపిలో లెక్క వేయటం మొదలుపెట్టారు. రేపు ప్రభుత్వాలకు జిడిపి తగ్గినపుడల్లా దానిని పెంచటానికి చర్యలు తీసుకొంటాయి. దానర్థం పరోక్షంగా ఈ వ్యసనాలను చూసి ఛూడనట్లు వీలైతే పూర్తిగా వాటి మీద ఉండే నిబందనలను తొలగిస్తాయి. దాని వలన అక్కడ కొద్దో గొప్పో ఉన్న కుటుంబ వ్యవస్థకి సవాలు ఎదురౌతుంది. గత సంవత్సరం బ్రిటన్ బెడ్ రూం టక్స్ అని ఒకటి వేసింది, అది సింగిల్ పేరెంట్ వారకి భారం గా పరిణమించిందని వాపోయారు. ఆందోళనలు చేశారని వార్తలు వచ్చాయి. స్రీ,పురుష,బాల ,జంతువుల హక్కులకు రక్షణ కల్పించటం , జెండర్ ఇక్వాలిటిస్ మీద మరి ఎక్కువ ఫోకస్ చేస్తే, ఆ భారాన్ని ఏ ప్రభుత్వాలు మోయలేవు.

  ReplyDelete
 10. అయ్యా యూజీగారూ....

  బ్రిటీషువారి పాలనలో ఇంగ్లండ్‌కన్నా well maintained state భారతదేశమని చెప్పుకొనేవారు. But that didn't prevent us from fighting for freedom. సార్! మీరన్న అతిగొప్ప కుటుంబ వ్యవస్థను నిలబెట్టడానికి కొందరు తమ వ్యక్తిత్వాలను త్యాగం చెయ్యాల్సొస్తే, కొందరిని sub-humansగా treatచేస్తే తప్ప ఆ అతిగొప్ప వ్యవస్థ నిలబడలేకపోతే, it better to dogs. మీరు గీతకి అవతలివైపును నిల్చొని మన 'వ్యవస్థ' ఇంతగొప్పదీ, అంతగొప్పదీ అని వ్యాఖ్యానాఒలు చేస్తున్నారు కానీ, దానికోసం ఎంతమంది తమ వ్యక్తిత్వాలను (తమకు తెలీకుండానే) త్యజించారు అన్నది మీకు పట్టదు. గీతకు ఇటువైపున్నవారికో ప్రశ్న : మీరు అలాంటి త్యాగాలు ఏం చేశారు? ఒక మత ప్రచారకుడు, మాకు భావదాస్యం చెయ్యండి, మేము మీకు కావాల్సిన ఆర్ధిక వెసులుబాటును కల్పిస్తాము అంటే మీరు చేస్తారా? మరి ఎందుకుసార్ స్త్రీలుచేస్తున్న భావదాస్యాన్ని అదేదో తప్పనిసరి తంతు అని వెనకేసుకువస్తారు?

  ReplyDelete
 11. This comment has been removed by the author.

  ReplyDelete
 12. స్వాతంత్ర పోరాటం ఎన్నో కారణాల వలన చేశారు. బ్రిటిష్ వారి పూర్వం మన దేశాన్ని సుమారు 700-800 సంవత్సరాలు పాలించిన వారి పాలన కన్నా బ్రిటిష్ వారిది తప్పక మెరుగై ఉండవచ్చేమో,తరువాత దశలో బ్రిటిష్ వారి పాలన దిగజారింది. ఇద్దరు ఇద్దరే. వారి గురించి వివరాలు ఇస్తాను తీరిక ఉన్నపుడు చదువుకోండి.
  1. భారతదేశం బ్రిటిష్ వారి పాలన గురించి ఈ క్రింది వివరాలు చూడండి.
  http://www.oldindianphotos.in/2011/03/indian-famine-sufferers-magic-lantern.html
  http://www.oldindianphotos.in/2009/12/bengal-famine-of-1943-part-2.html
  http://jambudveep.wordpress.com/2011/01/08/an-explanatory-note-on-the-famines-in-india/

  10 Evil Crimes Of The British Empire
  No 1 is Bengal famine
  http://listverse.com/2014/02/04/10-evil-crimes-of-the-british-empire/

  To be continued ...

  ReplyDelete
 13. *మీరన్న అతిగొప్ప కుటుంబ వ్యవస్థను నిలబెట్టడానికి ,వ్యక్తిత్వాలను త్యాగం చెయ్యాల్సొస్తే,.... *
  మీ మొత్తం ప్రశ్న బాగా పరిశీలిస్తే దానిలో ఎన్నో కోణాలు దాగిఉన్నాయి.అంతర్లీనంగా గత శతాబ్దాలలో జరిగిన అన్యాయలను గురించి , వివాహం తరువాత సంస్కృతి/సమాజం/వ్యవస్థ వలన వ్యక్తిగత స్వేచ్చకి కలిగే ఆటంకం గురించి మాట్లాడుతున్నట్లు అర్థమౌతున్నాది.1900 సంవత్సర కాలం లో ప్రజల యవరేజ్ ఆయుర్దాయం 35సంవత్సరాలు. మీరు ఒక సారి ఆలోచించండి అంత తక్కువ కాలం జీవించే కాలంలో వ్యక్తిగత స్వేచ్చ గురించి ఆలోచించి, తపించి, సాధించుకోవలనే ఆలోచన ఉంట్టుందా! మీరు ఆరోజులలో అవిలేవని ఆలోచిస్తున్నారేగాని, ఆకాలంలో జీవించిన వారెవరు వాటి గురించి ఇప్పటివారిలా ఆలోచించలేదు. పైగా ఎప్పుడు కరువు కాటకాలు. బంగాల్ కరువు పోటొ లు చూశారు గదా! ఆటువంటి విపత్కర సమయంలో పదవులలో ఉన్నవారు,చదువుకొన్నవారు, తెలివి ఉన్నవారు ఎవరైనా కరువు కాటకాలు గురించి ఆలోచిస్తారా? లేక వివాహ వ్యవస్థ, వ్యక్తిగత స్వేచ్చ గురించి ఆలోచిస్తారా? ఇంకాకొన్ని శతాబ్దాల వెనుకకు వెళితే ఏడారి మూకల దండయాత్రలవలన, ఎప్పుడు శతాబ్దలు దేశంలోఎదో ఒకచోట ఇప్పుడు సిరియా,ఇరాక్ పరిస్థితి కొనసాగుతూండేది.

  ReplyDelete
 14. This comment has been removed by the author.

  ReplyDelete
 15. *ఎందుకుసార్ స్త్రీలుచేస్తున్న భావదాస్యాన్ని అదేదో తప్పనిసరి తంతు అని వెనకేసుకువస్తారు?*
  ఈ రోజులలో స్రీలు ఎలాజీవించాలనుకొంటారో అది వారి ఇష్టం. పెళ్ళి చేసుకొబోయే ముందు ఆలోచించుకొని వారి నిర్ణయాలను వాళ్లు తీసుకోవచ్చు. చదువుకొన్న వారందరు ఈ రోజుల్లో అదే చేస్తున్నారు కదా! స్చేచ్చ గా జీవించాలనుకొనేవారు , ఆ జీవితం కొరకు తపించాలి. స్వేచ్చగురించి అందరు మాట్లాడేవారే గాని, పుస్తకాలు రాసేవారే గాని, నిజంగా అంత స్వేచ్చ గా ఉండాలని కోరుకోరు. స్వేచ్చ జీవితం పుస్తకాలలో చదివినంతగా, ఊహించుకొన్నంత గా అట్రాక్షన్ గా ఉండదు. ఇతరులు అలా జీవించేవారిని చూసి చాలా అట్రాక్ట్ అవ్వవచ్చు. అది వేరే విషయం. ఎవరైనా నూటికి నూరు శాతం తన బాధ్యతను తాను తీసుకొని, ఇతరులను పల్లెత్తు మాట అనకుండా జీవితం గడపటానికి చాలా ధైర్యం, తెలివితేటలు కావాలి. సామాన్య ప్రజలు స్వేచ్చ కన్నా బంధాలలో,ఇచ్చి పుచ్చుకోవటాలలో ఆనందం వెతుకొంటారు. వివాహ వ్యవస్థలో ఉండలనుకోవటం, భావదాస్యంలో ఉండడం కాదు.

  ReplyDelete
 16. This comment has been removed by the author.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top