----------------------------------------------
ప్రశ్న పంపినవారు : పల్లా కొండల రావు.
------------------------------------------------

సమగ్ర సర్వేపై ఎన్నో అనుమానాలు, సర్వేకు ఒక్క రోజు ముందు కేసీఆర్ తన కుటుంబ ఆస్తులను వెల్లడించాలి : రేవంత్
హైదరాబాద్, ఆగష్టు 17 : తెలంగాణ ప్రభుత్వం ఈనెల 19న నిర్వహించనున్న సమగ్ర సర్వేపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సర్వేపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక మాట, అనధికారంగా మరో మాట చెబుతున్నారని విమర్శించారు. అధికారులతో కేసీఆర్ సంభాషణను మీడియాకు వినిపించారు.

రేవంత్ రెడ్డి విడుదల చేసిన టేప్‌లో కేసీఆర్ వ్యాఖ్యలు...

"ఆంధ్రా ఉద్యోగులు, విద్యార్థులను వెళ్లగొట్టేందుకే ఈ సర్వే అని, డిస్కరేజ్ చేస్తే వారే ఇక్కడి నుంచి వెళ్లిపోతారని... నా పని సాఫ్ అయిపోతుందని... దీన్ని నేను మైకులు పెట్టి చెప్పలేనని.. మహబూబ్‌నగర్‌లో వలసలు లేవని, ఎవరికోసమో సర్వే అపలేమని... ఎస్సీ వర్గీకరణ అంశం వదిలేయాలని'' రహస్య సమావేశంలో అధికారులతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.

పాలమూరు ప్రజలను కేసీఆర్ అవమానిస్తున్నారని, ఆయన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ అపరిచితుడిలా అవతారాలు మారుస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ వారితో సర్వే చేయించడం లేదని, సర్వే చేసేవారిలో 25 శాతం ఆంధ్రా ఉద్యోగులే ఉన్నారని ఆయన అన్నారు. ఎస్సీ వర్గీకరణను కూడా సర్వేలో చేర్చాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

సమగ్ర సర్వే వెనుక టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర ఉందని, తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు నిలుపుదల చేయడానికే ఈ సర్వే అని, దీన్ని తెలంగాణ ప్రజలు గ్రహించకుండా ఉండేందుకు... ఆంధ్రోళ్లకు వ్యతిరేకంగా రహస్య ప్రచారం చేస్తున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. 12 గంటల్లో 4 కోట్ల మంది సమాచారాన్ని ఎలా సేకరిస్తారని ఆయన ప్రశ్నించారు. సేకరణకు వచ్చిన ఎన్యుమరేటర్స్ సమాచారం కోసం బలవంతం చేస్తే కేసులు పెట్టాలని, మాదిగలంతా కేసీఆర్‌ను నిలదీయాలని రేవంత్‌రెడ్డి పిలుపు ఇచ్చారు.

సమగ్ర సర్వేకు ఒక్క రోజు ముందు టి. సీఎం కేసీఆర్ తన కుటుంబ ఆస్తులను వెల్లడించాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ తన కుటుంబ ఆస్తులు వెల్లడించరు కానీ... ప్రజలు తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలా? అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రజలు ఇచ్చే సమాచారం దుర్వినియోగం అయితే కేసీఆర్ జైలుకు వెళతారా? అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
(from andhrajyothy daily)
Reactions:

Post a Comment

 1. ఈ సర్వే ఉద్దేశం మంచిదే కావచ్చు.
  కాని ప్రజల్లో అనుమానాలు పోవటం లేదు ప్రభుత్వం ఎంత చెప్పినా ఏమి చెప్పినా.
  బ్యాంక్ ఖాతాలు ఇవ్వటం తప్పనిసరి కాదని హైకోర్టులో నిర్ణయం జరిగింది.
  ఐనా ఎవరైనా ఎన్నో వ్యక్తిగత వివరాలు ఇవ్వవలసిన పరిస్థితి!
  బ్యాంక్ ఖాతాలు, ఆస్తులవివరాలు, అధార్ కార్డులు, పాన్ కార్డులు, ఫోన్ నెంబర్ల వంతి సెన్సిటివ్ వివరాలు ఇవ్వటం వల్ల ముందుముందు ప్రజలకు ఇబ్బందులు రావచ్చును. ఇడెంటిటీ థెఫ్ట్ జరిగే అవకాశాలు మెండు.
  వ్యక్తిగత వివరాలు - పేర్లు, కులమతాలు, వయోలింగవివరాలు వంటివాటితో జతచేసి పై వివరాలవంటివీ ప్రభుత్వ సెర్వర్లలో ఎంతభద్రంగా ఉంటాయి?
  ఇవ్వన్నీ నమోదు చేసేందుకు వాడిన పత్రాలు ఎంత భద్రంగా ఉంటాయీ?
  ఒకప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైట్ ఒకటి పొరబాటున దర్శనం ఇచ్చింది ఉద్యోగుల సర్వీసు వివరాల డేటాబేస్‌తో సహా! ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తే స్పందన శూన్యం! పదేపదే చెప్పినా స్పందన రాలేదు. మార్పు రాలేదు.
  అసలే ప్రస్తుతం కొత్త ప్రభుత్వం. అన్నీ‌ ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్న పరిస్థితి. ఈ సర్వేకు వచ్చే వారిలో ఎందరు ఎంత సమర్థులూ ఎవరు ఎంత బాధ్యతతో‌నడుచుకునే వాళ్ళూ అన్నదీ చెప్పలేం.
  అందుచేత వివరాలు ఇచ్చే ముందు తస్మాత్ జాగ్రత జాగ్రత!

  ReplyDelete
  Replies
  1. సర్వేలు రెండు రకాలు. గణాంకాల వసూలు చట్టం (Collection of Statistics Act) ఆధారంగా జరిపే సర్వేలో ప్రజలు తమ వివరాలను ఖచ్చితంగా (mandatory on the pain of penal action) చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుత సర్వే ఆ చట్టం కింద జరగడం లేదు కాబట్టి ఏమి చెప్పాలో/ఇవ్వాలో లేదో అన్నది మన ఇష్టం.

   Delete
  2. జైగారూ, మీ జవాబుకు కృతజ్ఞ్జతలు.
   ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి. ఒక డ్రైవరు వృత్తిలో ఉన్న అబ్బాయి ఈ రోజు ఉదయం 'ఆంధ్రావాళ్ళకు ఈ సర్వే వర్తించదటకదా' అని ప్రశ్నించాడు. ఇన్ని వివరణలూ ఇంత (+/-) ప్రచారమూ, ఇంత భారీస్థాయిలో చర్చలూ జరిగాక కూడా ఇలా ఉంది పరిస్థితి!. ఐఛ్ఛికం అన్నది సరే. వివరాలన్నీ ఇస్తే మీకే మంచిది అని పదే పదే వినిపిస్తున్నారొక మాట. దాన్ని ఎలా తీసుకోవాలి. వివరాలు కొన్ని ఇవ్వకపోతే సాధింపులు ఉంటాయనా? అదలా ఉంచి, అన్ని వివరాలూ ఇలా ఇవ్వటంలో identity theft అనేది జరిగేందుకు అస్కారం పెరుగుతుందన్న అవగాహన ఎందరికి ఉంది? ఈ IT savvy ప్రభుత్వాలు ఏదైనా లీకేజీ జరిగితే నివారణ చేయలేవు కదా? వాటికలాంటి సమర్థత ఉందని భ్రమపడగలమా?

   Delete
  3. అపోహలు భయాలు ఉండడం వాస్తవమే కాదు సహజం కూడా. ప్రస్తుత రాజకీయ వాతావరణం నేపధ్యం మహిమ!

   వివరాలు ఏవి ఇవ్వకపోయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత లేని వారికి (ఉ. ఆదాయ పన్ను కట్టేవారు) నష్టం లేదు. సంక్షేమ పథకాలలో నిర్దేశించిన కనీస స్థాయికి లేదా "నిజమయిన దారిద్ర్యరేఖకు" దిగువ ఉన్నవారికి ఐడెంటిటీ చోరీ భయం అక్కరలేదు. These are two mutually non-intersecting sets.

   డేటాబేసు లీకు విషయం సంజయ్ జాజూ (తెలంగాణా అయితే హర్ప్రీత్ సింగ్) గారి దృష్టికి తీసుకు వెళ్ళమని విజ్ఞప్తి. గత ప్రభుత్వం పట్టించుకునేది కాదు కానీ ఇప్పుడు పరిపాలనా యంత్రాంగం చాలా మెరుగు అని వింటున్నాను.

   Delete
 2. ఒక్క సర్వేతో ప్రభుత్వంలో చొరబడ్డ అన్ని దోషాలూ క్షాళన అయిపోవు. ఈ సర్వే తరవాత కూడా బోగస్ కుటుంబాలూ, బోగస్ వ్యక్తులూ ప్రభుత్వపథకాల నుంచి లాభపడతారనేదాంట్లో నాకు ఎలాంటి సందేహమూ లేదు.

  ReplyDelete
  Replies
  1. అన్ని విషయాల్లోనూ- ప్రభుత్వోద్యోగుల తప్పులకి వాళ్ళనేమీ అనకుండా ప్రజల్ని మాత్రమే శిక్షించడం - ఇదీ TRS ప్రభుత్వ పంథాలా కనిపిస్తోంది.

   Delete
 3. ఆంధ్రా ఉద్యోగులు, విద్యార్థులను వెళ్లగొట్టేందుకే ఈ సర్వే అని, డిస్కరేజ్ చేస్తే వారే ఇక్కడి నుంచి వెళ్లిపోతారని... నా పని సాఫ్ అయిపోతుందని... దీన్ని నేను మైకులు పెట్టి చెప్పలేనని.. మహబూబ్‌నగర్‌లో వలసలు లేవని, ఎవరికోసమో సర్వే అపలేమని... ఎస్సీ వర్గీకరణ అంశం వదిలేయాలని'' రహస్య సమావేశంలో అధికారులతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.

  వీటికి సాక్ష్యం ఉందా? రేవంత్ రెడ్డిని ఎందుకు నమ్మాలి?

  ఎస్సీ వర్గీకరణను కూడా సర్వేలో చేర్చాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.

  రేవంత్ రెడ్డికి పిచ్చి గాని పట్టిందా? కులం పేరు అడిగినపుడు కంప్యూటర్ లో వర్గీకరణ ఎంత సేపు?

  సమగ్ర సర్వే వెనుక టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర ఉందని, తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు నిలుపుదల చేయడానికే ఈ సర్వే

  అవును, అనర్హులకు సంక్షేమ పథకాలు నిలుపుదల చేస్తామని వారు బహిరంగంగానే చెపుతున్నారు. అర్హులకు నిలుపు చేయడానికి సర్వే అవసరం ఏమిటి? చంద్రబాబు గతంలో చేసినట్టు పథకాలు రద్దు చేస్తే సరి!

  12 గంటల్లో 4 కోట్ల మంది సమాచారాన్ని ఎలా సేకరిస్తారని ఆయన ప్రశ్నించారు

  ఆయన, ఆయనతో మాట్లాడిస్తున్న బాబు రేపు చూస్తారుగా? ఒక్క రోజు ఆగలేరా? నా అంచనా ప్రకారం ఇలాంటి సర్వే ఓ ఆరు నెలల్లో చంద్రబాబు కూడా చేపించక పొతే అప్పుడడగండి.

  మాదిగలంతా కేసీఆర్‌ను నిలదీయాలని రేవంత్‌రెడ్డి పిలుపు ఇచ్చారు

  మాదిగలే ఎందుకు నిలదీయాలి? ఓహో మందకృష్ణను ఉసిగొల్పడానికా ఇది?

  కేసీఆర్ తన కుటుంబ ఆస్తులు వెల్లడించరు కానీ... ప్రజలు తమ ఆస్తుల వివరాలు వెల్లడించాలా?

  ఆ రోజు ఎన్యూమరేటర్లు కెసిఆర్ ఇంటికి కూడా వెళ్తారుగా? బాధెందుకు? అలాగే రేవంత రెడ్డి, చంద్రబాబు ఇళ్ళకు కూడా వెళ్తారు మరి!

  ప్రజలు ఇచ్చే సమాచారం దుర్వినియోగం అయితే కేసీఆర్ జైలుకు వెళతారా?

  దుర్వినియోగం కాగలిగే సమాచారం ఏమీ అడగడం లేదు రేవంత రెడ్డీ! ఎలా దుర్వినియోగం అవుతుందో తమరే చెప్తే బాగుంటుంది. అలాంటి అవకాశం వుంటే కోర్టే సర్వేని నిలుపుదల చేసేది, రేవంత రెడ్డి వరకూ వచ్చేది కాదు.

  ReplyDelete
  Replies
  1. వీటికి సాక్ష్యం ఉందా? రేవంత్ రెడ్డిని ఎందుకు నమ్మాలి?

   ఆయన ఆ రహస్య సమావేశం తాలూకు రహస్య ఆడియో రికార్డింగ్ ఒకటి వినిపించాడండి. అదే సాక్షంగా విలేకర్ల సమావేశంలో వినిపించాడు.
   https://www.youtube.com/watch?v=YPz8Kso5cKs


   తెలంగాణా వ్యేతిరేక మీడియా వాళ్ళ మసాలాలు

   ఆంధ్ర జ్యోతి : "ఆంధ్రా ఉద్యోగులు, విద్యార్థులను వెళ్లగొట్టేందుకే ఈ సర్వే ........" రహస్య సమావేశంలో అధికారులతో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు.
   ఈనాడు: "ఆంధ్ర ప్రాంత వారిని వెళ్ళగొట్టడానికే ఈ సర్వే చేస్తున్నాం ......" అని కొందరు అధికారుల రహస్య బెహ్తిలో కెసిఆర్ చేసినట్లు వ్యాఖ్యలలో కూడిన ఆడియో రికార్డులను రేవంత్ రెడ్డి విలేకర్ లకు వినిపించారు. "

   ఆడియోలో కెసిఆర్ అన్నది
   ఇట్ల స్ట్రిక్ట్ చేసినట్లయితే టైట్ చేసినట్లయితే ఇక్కడ మనది సాగదురా నాయన ... సప్పుడుదేక మన దారి మనం చూసుకుందాం అని డిస్కరేజ్ అవుతారని ఐడియా. మన దారి మనం పడదాం అని వాళ్ళు పడితే మనకు సాఫ్ అవుతుందని ఐడియా.... ఇగ గిదేందుకు ఇదంతా బజార్ల పెట్టి చెప్పాలి ఇప్పుడు నేను ...


   ఈనాడు:"మహబూబ్ నగర్ నుండి ఎవ్వరూ వలసలు పోలేదు, పోయినోళ్ళు ఆ రోజు వస్తే మనోడు .. రాకుంటే మనోడు కాదు, ప్రత్యెక గడువక్కర్లేదు" అని కెసిఆర్ అన్నట్లు వ్యాఖ్యలను వినిపించారు.

   ఆడియోలో కెసిఆర్ అన్నది "పెద్ద సమస్యేం కాదు బ్రదర్, మునుపు చెప్పినంత మైగ్రెంట్స్ మహబూబ్ నగర్ లో ఇప్పుడు లేరు నాకు తెలుసు, మునుపు ఎంతైతే ఉండేనో ఇప్పుడు అంత డెన్సిటి లేదు ....... ప్రచారం చెయ్యండి, రమ్మని చెప్పండి, వచ్చి పొమ్మని చెప్పండి, వచ్చిన కాడికి వస్తరు, రానోళ్ళ గురించి మనం సర్వే ఆపలేం. "

   ఎవ్వరు వలసలు పోలేదు .... వస్తే మనోడు .. రాకుంటే మనోడు కాదు........ అనేది ఎక్కడి నుండి వచ్చింది?

   ఈ మీడియా వాళ్ళు ఎంత బాగా సున్నితంగా, చక్కగా జనాలను రెచ్చగోడతారో, వెన్నతో పెట్టిన విద్య మరి :-))

   Delete
  2. @కిరణ్ & శ్రీకాంత్ చారి
   అయితే కెసిఆర్ మాట్లాడిన దానిలో కుట్ర ఏమి లేదంటారా?

   Delete
  3. @Sree

   నేను రాసిన విషయం ఏమిటి , మీరు అడుగుతున్న ప్రశ్న ఏమిటి?

   Delete
  4. ఇది పూర్తి విడియో కాదు. మనకు చూపించింది అందులో కొన్ని భాగాలు మాత్రమే. సో, పూర్తి విడియో (సంభాషణ) .. బయటకి వస్తే గానీ ఆయన ఎవరిని గురించి ఏమి అన్నాడని చెప్పడం కష్టం. కాకపోతే, ఆ పూర్తి వీడియో పత్రికల వాల్లు వినే ఉండొచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డిదగ్గర పూర్తి సంభాషణ ఉండొచ్చు. కాబట్టి, వారు చెప్పేది మరీ అంత తీసి పారేయదగ్గ విషయం కాదు. చూద్దాం, ముందు ముందు ఎన్ని బండారాలు బయటపడతాయో.. అందునా కేంద్రం కూడా ఈ విషయం మీద సీరియస్ గానే ఉందని తెలుస్తోంది.

   Centre, Telangana on warpath over household survey in state
   http://timesofindia.indiatimes.com/india/Centre-Telangana-on-warpath-over-household-survey-in-state/articleshow/40418318.cms

   Delete
  5. ఆ ప్రెస్ మీట్ లో చెప్పినవి చెప్పినట్లు వార్తలుగా వెయ్యాల్సిన భాద్యత పత్రికలది, వాటికి కావలసిన మసాలాలు అద్దుకోవటానికి గ్రేట్ ఆంధ్ర లాంటి C క్లాస్ సైట్లు ఎలాను ఉన్నాయి :-)

   ప్రెస్ మీట్ లో అక్కడ చెప్పినది కాకుండా ఇంకా ఎక్కువ రాయాలనుకుంటే, ఆ వార్తలు రాసే పత్రికలకు టివిలు, వెబ్ సైట్ లు ఉన్నాయి కాబట్టి, అవసరమైతే అక్కడైనా ఆ పూర్తీ ఆడియోను అందుబాటులో ఉంచాలి. అదేది లేకుండా మసాలాలు రాస్తే అవి దురుద్దేశంతో కూడిన తప్పుడు రాతలుగానే, ఉద్రిక్తతలు పెంచటానికే అభద్దాలు రాస్తున్నారని పరిగణించాల్సి వస్తుంది. పూర్తీ ఆడియోలో ఈ పేపర్ వాళ్ళు రాసినవి ఉంటె నా అభిప్రాయం మార్చుకోవటానికి నేను సిద్దం. అలా వారు చెయ్యక పొతే ఆ పత్రికలను నేను పై కామెంట్లో చెప్పినట్లే బావించుకోగలను.

   ఇక కేంద్ర సీరియస్ విషయాన్ని నేను సీరియస్ గా తీసుకొను, ఎస్ఏంవో ల విషయంలో సీరియస్ అని గత నెల రోజులకు పైగా ఉదరగొడుతున్నారు, ఇంత వరకు ఏమి జరగలేదు. గవర్నర్ గిరి విషయంలో సీరియస్ అని అప్పుడు అన్నారు, ఇంతవరకు ఆ సీరియస్ నెస్ కనబడటం లేదు. పైనున్న వారు మన వారు కాబట్టి వారితో ఉత్తుత్తి సీరియస్ స్టేట్మెంట్ లు ఇప్పిస్తున్నారా ఏంటి అనే అనుమానం నాకు పెరుగుతుంది.

   సర్వే జరిగిపోయింది, డేటా ప్రభుత్వానికి వెళ్లి పోయింది. ఇక ఈ విషయంలో కేంద్రం చెయ్యగలిగినది ఏమున్నదో నాకు అర్థం కావటం లేదు, వారం ఆగితే ఈ సర్వే సంగతే జనం మరిచి పోతారు, కేంద్ర కూడా మరిచి పోతుంది. జనాలకు అప్పటికి ఇంకో హాట్ న్యూస్ తయారు కాకపోతుందా :-)

   Delete
  6. సంభాషణలు పూర్తిగా బహిర్గత పరచకపోవడమన్నది వ్యూహాత్మకమని నేను అనుకుంటున్నాను. బహుషా అటువైపునుండి వచ్చే రెస్పాన్సును భట్టి అది బయటకి రావచ్చు. కానీ, అక్కడ జరిగిన సంభాషనలు, మొత్తంగా తీసుకుని కాస్త ఆలోచిస్తే, ఆంధ్రజ్యోతి వారు కానీ, ఈనాడు వారు కానీ రాసిన వాటిలో అతిశయోక్తులు ఏమీ లేవని చెప్పొచ్చు. సహజంగా ఇలాంటివి రాసేప్పుడు పత్రికల వారు "అయ్యుండొచ్చు", "ఊహిస్తున్నాము" అంటు చెపుతారు. ఇక్కడ అలాంటిదేమీ లేకుండా డైరెక్టుగా "చెప్పాడు" అన్నట్లుగా రాసేశారు. ఆంధ్రజ్యోతీ, టీ.వీ9 ఎపిసోడ్లు జరిగిన తరువాత కూడా ఈనాడు తొందరపాటు రాతలు రాస్తుందని నేను అనుకోను. ఏదేమైనా, చూద్దాం, ఏమి జరుగుతుందో!! దీనికి సంబందించి ఈ ఘట్టం చివరిది కాదు.

   కేంద్రం చర్యలు తీసుకోవడం మాత్రం నాక్కూడా కాస్త అనుమానంగానే ఉంది. సహజంగానే కేంద్రం, రాష్ట్ర అంతరంగిక విషయాలలో జోక్యం చేసుకోవు(లేవు). కానీ, హైదరాబాదులో పరిస్థితులు చేయి దాటుతున్నట్లు అనిపిస్తే మాత్రం తమకు లభించిన ప్రత్యేక అధికారాలు (విభజన చట్టం ద్వారా లభించినవి) ఉపయోగించే అవకాశం కొట్టి పారేయలేం.

   //వారం ఆగితే ఈ సర్వే సంగతే జనం మరిచి పోతారు, కేంద్ర కూడా మరిచి పోతుంది. //
   ఈ సర్వే వారమాగితే మరిచిపోయేదని నేను అనుకోను. ఇంకా చెప్పాలంటే, ఇక ముందే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయనిపిస్తోంది. అయినా ఎలానూ FASTతో మొదలు పెట్టి అన్నీ ఒక్కోక్కటే తేటతెల్లమవుతాయి. ప్రస్తుతానికి Wait and see అనుకోవడమే..!

   Delete
  7. సంభాషణలు పూర్తిగా బహిర్గత పరచకపోవడమన్నది వ్యూహాత్మకమని నేను అనుకుంటున్నాను.

   ​1. రేవంత్ రెడ్డి గారు వాటిని విడుదల చెయ్యక పోయి ఉంటె మీరన్నట్లు అది వారి వ్యూహాత్మకం అని అనుకోగలం. అదే నిజమైతే పత్రికల వారు కూడా వాటిని మొత్తంగా విని ఉండక పోవచ్చు. వినని వారు అలా రాయటం ఎంత వరకు సమంజసం?

   2. ఒక వేల పత్రికల వారికి రేవంత్ గారు రహస్యంగా వినిపించిననూ ... పత్రికల వారు వారు రాసే వాటికి సాక్షాలుగా వాటిని రికార్డు చెయ్యవలసి ఉండాలిసింది. వారు రికార్డు చేసి కూడా జనులకు విడుదల చెయ్యక పోవటం అనేది కూడా పత్రికల వ్యూహాత్మకం అనేది అనైతికం. ఎందుకంటే పత్రికల వారు జనుల పక్షాన ఉండాలి, వాటిని విడుదల చెయ్యాలి. ఒక రాజకీయ నాయకుని వలే పత్రికల వారు ప్రవర్తించజాలరు.

   ఉదాహరణకు, ఈ సర్వే జనులకు తప్పని సరి కాదని ప్రభుత్వం కోర్టులో చెప్పుకుంది. ఇక్కడ పేపర్లో "వస్తే మనోడు .. రాకుంటే మనోడు కాదు" అని కెసిఆర్ అన్నట్లు రాసారు, అది చదివిన వారు సర్వేలో పాల్గొనటం తప్పని సరి అని అనుకోగలరు. అలా అనుకున్న వారు ఈ నిర్భంద సర్వే(అలా వారు అనుకుంటారు కాబట్టి) విషయమై ప్రభుత్వం పై ఆగ్రహం తెచ్చుకునే అవకాశం ఉంది, లేదా ప్రభుత్వం పై విశ్వాసం కోల్పోయే అవకాశం ఉంది. ఇవి రెండు తెలంగాణా రాష్ట్ర అభివుర్ద్దికి నిరోధకాలు కాగలవు. ఒక వేల పత్రికలూ కుట్ర పూరితంగా రాసిన విషయం నిజమైతే దాని దుస్పరినామం తెలంగాణా ప్రజలే వారికి తెలియకుండా అనుభవించ వలసి వస్తుంది, అది అన్యాయం కదా. ​


   ప్రస్తుతానికి Wait and see అనుకోవడమే..!

   అవునండి, ఏదో ఊహించుకోవటం, దానిపై వాదనలు చెయ్యటం కంటే వేచి చూడటం బెటర్ ఆప్షన్.

   Delete
  8. @Kiran Kumar K
   విశ్లేషనలు నిరభ్యంతరంగా చేయొచ్చు. కానీ, ఈ విధంగా అన్నారు అని చెబుతూ కొటేషన్ మర్కుల్లో (" .... " ) మార్కుల్లో రాసే దానికి మాత్రమే జాగ్రత్త అవసరం, అది ఉన్నది ఉన్నట్టుగా మాత్రమే రాయాలి. కే.సీ.ఆర్ సర్వేల్లో పాల్గొనని వారి గురించి మాట్లాడుతూ ( ఇండైరెక్టుగా పవన్, విజయశాంతీలను ఉద్దేశించి అన్నాడని పత్రికల ఉవాచ)

   "Those who want to stay here as tourists and guests, have not taken party in the survey".

   He further said “You are living here and getting all the amenities like drinking water, sewerage facility, street lights, roads and others. When the government is trying to find out what is total population, you are not taking part in it. Being here and you don't want to take participate, this is nothing but a social crime ,” he said.

   ఇలా అన్నారట. మరి కోర్టు కేవలం ఐచ్ఛికమే అన్న సర్వేను "కొంత మంది" కాదంటే, అలా అనాల్సిన అవసరం ఏమిటి? ఇలాంటివి విన్న తరువాత, పత్రికలు విశ్లేషనలు చేయడములో తప్పులేదు కదా..!

   మరో విషయం ఏమిటంటె, పత్రికలలో వచ్చే వార్తలకు సంబందించిన రికార్డింగ్స్ పత్రికల దగ్గర తప్పకుండా ఉంటాయి. లేకుండా రాస్తే అది వారికే ముప్పు. కే.సీ.ఆర్ పదే పదే పత్రికలు బాధ్యతగా మెలగాలని హెచ్చరిస్తున్నారు. రీసెంటుగా టైంస్ ఆఫ్ ఇండియాను కూడా హెచ్చరించారు. ఈ పరిస్థితులలో పత్రికలు అలాంటి సాహసాలకు ఒడికట్టవని (అది కూడా ఏకంగా కే.సీ.ఆర్ విషయములో) నా నమ్మకం. వారు మనకు ఆ సంభాషనలు మొత్తంగా చూపించకపోవడం అనేది నైతికంగా తప్పా కాదా అన్న విషయమీద నాకూ క్లారిటీ లేదు. కాకపోతే మనకు అడిగే హక్కుంది. ఎవ్వరైనా RTI ద్వారా ప్రశ్నిస్తే వారు చెప్పక తప్పదు.

   Delete
  9. ఆడియోలో కెసిఆర్ అన్నది
   ఇట్ల స్ట్రిక్ట్ చేసినట్లయితే టైట్ చేసినట్లయితే ఇక్కడ మనది సాగదురా నాయన ... సప్పుడుదేక మన దారి మనం చూసుకుందాం అని డిస్కరేజ్ అవుతారని ఐడియా. మన దారి మనం పడదాం అని వాళ్ళు పడితే మనకు సాఫ్ అవుతుందని ఐడియా.... ఇగ గిదేందుకు ఇదంతా బజార్ల పెట్టి చెప్పాలి ఇప్పుడు నేను .


   ఇది వివక్ష చూపించడం కాదా? ఇలాగే ప్రతి ఒక్కడు పక్కనోడిని వెళ్ళగొడదాం అనుకుంటే ఎవడికి వాడు తమ తమ సొంత వూరికి పోవాల్సిందే.

   ఇదెలా వుందంటే 'పోటీ పడి పక్కనోడి మీద గెలవడం కన్నా వాడిని తరిమేస్తే నేను సుళువుగా/ఆటోమేటిగ్గా నంబర్ వన్ అయిపోవచ్చు'

   తెలంగాణా బానిస బతుకు నుండి విముక్తి పొందింది అని చాలా మంది చంకలు గుద్దుకున్నారు. కానీ వాళ్ళు వొప్పుకోని విషయం ఏంటంటే ఒక సీమాంధ్ర వాడే ఇప్పుడు వాళ్ళ సీయం అని.

   Delete
  10. @YJs

   రేవంత్ రెడ్డి ఏవో ఆడియో ముక్కలు కట్ చేసుకొచ్చి పెట్టడం, దాన్ని మీరు సర్వేకి అంటగట్టడం బాగనే వుంది.

   >>> ఇట్ల స్ట్రిక్ట్ చేసినట్లయితే టైట్ చేసినట్లయితే ఇక్కడ మనది సాగదురా నాయన

   దేన్ని స్ట్రిక్ట్ చేయడం? సర్వేకి దీనికి సంబంధం ఏమిటి? పూర్తి ఫుటేజీ ఎందుకు ఇవ్వరు?

   >>> ఇట్ల స్ట్రిక్ట్ చేసినట్లయితే టైట్ చేసినట్లయితే ఇక్కడ మనది సాగదురా నాయన ... సప్పుడుదేక మన దారి మనం చూసుకుందాం అని డిస్కరేజ్ అవుతారని ఐడియా

   ఇప్పుడు రెండు వాక్యాలు కలిపి చూద్దాం. స్ట్రిక్టు చేయడం వల్ల వారి దారి వారు చూసుకునే పరిస్థితి ఎవరికి వస్తుంది? స్ట్రిక్టు చేస్తే వారి దారి వారు చూసుకునేది, లేకపోతే కొనసాగేది ఎవరు? సాధువులా, సంఘద్రోహులా?

   >>> ఇది వివక్ష చూపించడం కాదా? ఇలాగే ప్రతి ఒక్కడు పక్కనోడిని వెళ్ళగొడదాం అనుకుంటే ...

   ఆయన వెళ్ళగొడదాం అని ఎక్కడన్నాడు? అది మీ ఊహ. ఆయన కేవలం స్ట్రిక్టుగా వుండాలి అంటున్నాడని మీరే చెపుతున్నారుగా? ఉండకూడదా?

   >>> ఇదెలా వుందంటే 'పోటీ పడి పక్కనోడి మీద గెలవడం కన్నా వాడిని తరిమేస్తే నేను సుళువుగా/ఆటోమేటిగ్గా నంబర్ వన్ అయిపోవచ్చు'

   స్ట్రిక్టుగా వుండక పోతే పోటీలో గెలుస్తారన్న మాట! మాల్-ప్రాక్టీసులు, దొంగపనులూ చూసీ చూడనట్టు పోతే గానీ పోటీ పడరన్న మాట! ఎందుకు మాటిమాటికీ ఎవరూ తరిమేయకున్నా తరిమేస్తున్నారు తరిమేస్తున్నారు అని మీకు మీరే ఊహించుకుంటారు?

   >>> తెలంగాణా బానిస బతుకు నుండి విముక్తి పొందింది అని చాలా మంది చంకలు గుద్దుకున్నారు. కానీ వాళ్ళు వొప్పుకోని విషయం ఏంటంటే ఒక సీమాంధ్ర వాడే ఇప్పుడు వాళ్ళ సీయం అని.

   పోనీ మీరే చంకలు గుద్దుకోండి. ఎవరొద్దన్నారు?

   Delete
  11. రేవంత్ రెడ్డి ఏవో ఆడియో ముక్కలు కట్ చేసుకొచ్చి పెట్టడం, దాన్ని మీరు సర్వేకి అంటగట్టడం బాగనే వుంది.
   దేన్ని స్ట్రిక్ట్ చేయడం? సర్వేకి దీనికి సంబంధం ఏమిటి? పూర్తి ఫుటేజీ ఎందుకు ఇవ్వరు?

   >>> హ హ హ! నేనసలు సర్వే వూసే ఎత్తలేదు. దానిని దీనిని కలిపేసి తమరే ఊహించుకుంటున్నారు. నేను ‘గుమ్మడికాయ...’ అని కూడా అనకముందే భుజాలు ఎందుకు తడుము కుంటున్నారో!

   ఇప్పుడు రెండు వాక్యాలు కలిపి చూద్దాం. స్ట్రిక్టు చేయడం వల్ల వారి దారి వారు చూసుకునే పరిస్థితి ఎవరికి వస్తుంది? స్ట్రిక్టు చేస్తే వారి దారి వారు చూసుకునేది, లేకపోతే కొనసాగేది ఎవరు? సాధువులా, సంఘద్రోహులా?

   >>> కేసిఆర్ అన్న మాటలు : ఒక్కటే కలవని జాతి ఆంధ్రోల్లు. వాల్లొక్కలే. ఈడున్న గుజరాతోల్లంతా ఎప్పుడో కలిసిపోయిండ్రు మాది అంటరిదివాల. వాళ్ళ గురించి మనకి అబ్జేక్షనే లేదీడ. కలవకుండా వుండి తెలంగాణా నెత్తి మీదెక్కి సవారి జేసి తెలంగాణాని అవమానంజేసి ఈ రోజు కూడా అహంకార పూరితంగా ప్రవర్తిస్తున్నది ఒక్కటే వీల్లొక్కలే. మొన్ననే మేము లెక్కలు దీసినం. ఇప్పుడీ విషయాలు జెప్పాల మీకు. ఎస్, ఆంద్ర కలెక్టర్లు ఎందరున్నరు. తీసి పక్కకు పెట్టేసినం నిన్న. ఆంద్ర MROs ఎందుకున్నరు యెంత మందున్నరు. పక్కకు పెట్టేసినం. ఈ రోజు ఈ మీటింగుల రావొద్దని జెప్పి జిల్లా కలెక్టర్లను రిక్వెస్ట్ జేసి, పక్కా తెలంగాణావాళ్ళని యేసి వాళ్ళని మాత్రమె వచ్చెటట్టు జెయ్యమని చెప్పి instructions ఇచ్చినం. ఇట్ల స్ట్రిక్ట్ చేసినట్లయితే టైట్ చేసినట్లయితే ఇక్కడ మనది సాగదురా నాయన ... సప్పుడుదేక మన దారి మనం చూసుకుందాం అని డిస్కరేజ్ అవుతారని ఐడియా. మన దారి మనం పడదాం అని వాళ్ళు పడితే మనకు సాఫ్ అవుతుందని ఐడియా.... ఇగ గిదేందుకు ఇదంతా బజార్ల పెట్టి చెప్పాలి ఇప్పుడు నేను .

   సాధువులూ , సంఘద్రోహులూ కాదు. కలెక్టర్లు మరియు MROs.

   ఆయన వెళ్ళగొడదాం అని ఎక్కడన్నాడు? అది మీ ఊహ. ఆయన కేవలం స్ట్రిక్టుగా వుండాలి అంటున్నాడని మీరే చెపుతున్నారుగా? ఉండకూడదా?

   >>> కేసిఆర్ అన్న మాట : ఇట్ల స్ట్రిక్ట్ చేసినట్లయితే టైట్ చేసినట్లయితే ఇక్కడ మనది సాగదురా నాయన ... సప్పుడుదేక మన దారి మనం చూసుకుందాం అని డిస్కరేజ్ అవుతారని ఐడియా.

   కేసిఆర్ స్ట్రిక్టుగా వుండాలి అంటే ఏదో హెడ్ మాస్టర్ లాగా స్ట్రిక్టుగా అని అనుకుంటున్నారా? సరే! మరి టైట్ చేయడం అంటే?

   KCR meant ‘restricting’. Not ‘strict’ in a literal sense. దీనినే పోమ్మనకుండా పోగ పెట్టటం అంటారు.

   స్ట్రిక్టుగా వుండక పోతే పోటీలో గెలుస్తారన్న మాట! మాల్-ప్రాక్టీసులు, దొంగపనులూ చూసీ చూడనట్టు పోతే గానీ పోటీ పడరన్న మాట!
   >>> నేను కేవలం పోటీ, గెలవడం రాసాను. మాల్-ప్రాక్టీసులు, దొంగపనులూ పోటీలో ఒక భాగం అని మీరు అనుకుంటున్నట్టున్నారు.

   ఎందుకు మాటిమాటికీ ఎవరూ తరిమేయకున్నా తరిమేస్తున్నారు తరిమేస్తున్నారు అని మీకు మీరే ఊహించుకుంటారు?
   >>> మన దారి మనం పడదాం అని వాళ్ళు పడితే మనకు సాఫ్ అవుతుందని ఐడియా ==> దీని భావమేమి తిరుమలేశా?

   పోనీ మీరే చంకలు గుద్దుకోండి. ఎవరొద్దన్నారు?
   >>> అసలు ఆంద్ర తెలంగాణా విడిపోయినప్పుడే నేను యెగిరి గంతేసా. మొత్తానికి సమస్య ఒక ముగింపుకి వచ్చింది, యిక ఎవరి మానాన వాళ్ళు బ్రతకొచ్చు అని. ‘తెలంగాణలో ప్రతి సమస్యకి మూలం ఆంధ్రోల్లు’ అన్న ఒక్క అజెండాతో కేసిఆర్ అండ్ కో పండగ చేసుకుంటున్నారు.

   నీకు సమజయ్యిగూడ నేనొప్ప అంటే నేనేం జేస్త శ్రీకాంత్ అన్నా?

   Delete
  12. @YJs

   >>> హ హ హ! నేనసలు సర్వే వూసే ఎత్తలేదు.

   ఇక్కడ చర్చ అంటా సర్వే మీద, రేవంత్ బయట పెట్టిన టేపు ముక్కాలా మీద నడుస్తుంది. తూచ్ అంటే చేసేదేం లేదు.

   >>> ఆంద్ర MROs ఎందుకున్నరు యెంత మందున్నరు. పక్కకు పెట్టేసినం.
   >>> కేసిఆర్ స్ట్రిక్టుగా వుండాలి అంటే ఏదో హెడ్ మాస్టర్ లాగా స్ట్రిక్టుగా అని అనుకుంటున్నారా? సరే! మరి టైట్ చేయడం అంటే?

   అంటే ఏమిటో మీరే చెప్పారుగా. ఒద్దు మొర్రో అంటే ఆంధ్ర ఉద్యోగులను అలోకేట్ చేస్తే మరింకేం జేస్తారు? జీతాలిచ్చి పక్కకు పెట్టినా తప్పేనా? ఇప్పటిదాకా వదిలినట్టు అచ్చోసిన ఆంబోతుల లెక్క వదలాలనా? దాన్ని రేవంత రెడ్డి తెచ్చి సర్వేకి కలపటం, మీరు ఇంకొంచం మసాల కలిపి "వెళ్ళగొడదాం" అనడం బాగానే వుంది. తెలంగాణా ప్రభుత్వం మొదటినుండీ చెపుతుంది "ఆంధ్రా ఉద్యోగులు మాకు వద్దు మొర్రో, వారిని అక్కడికే పంపండి" అని.

   >>> >>> మన దారి మనం పడదాం అని వాళ్ళు పడితే మనకు సాఫ్ అవుతుందని ఐడియా ==> దీని భావమేమి తిరుమలేశా?

   ఆయన పబ్లిగ్గానే చెపుతున్నాడు, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన ఆంధ్రా కలెక్టర్లను ఎమ్మార్వోలను వద్దన్నామని. గత సమైక్య ప్రభుత్వాలలో వాళ్ళు ఏం వెలగ బెట్టారో, కబ్జాకోర్లకు ఎలా కొమ్ము కాశారో అందరికీ తెలుసు. పోస్టింగ్ ఇవ్వక పొతే, పనులు అప్పజేప్పక పొతే వారంతా వారే వెళ్లిపోతారని భావం తిరుమలేశా.

   >>> అసలు ఆంద్ర తెలంగాణా విడిపోయినప్పుడే నేను యెగిరి గంతేసా.

   శుభం. మీ అధికారులను కూడా కాస్త అదే ఊపుతో తీసుకెళ్ళండి. అంతే కాని ఇక్కడే పోస్టింగులు కావాలి, అదీ హైదరాబాదు, రంగారెడ్డిలలో కావాలి, అవే కబ్జాకోరు వ్యవహారాలూ చేస్తాం అంటే కుదరదు.

   >>> తెలంగాణలో ప్రతి సమస్యకి మూలం ఆంధ్రోల్లు’ అన్న ఒక్క అజెండాతో కేసిఆర్ అండ్ కో పండగ చేసుకుంటున్నారు.

   ఆంధ్రాకి సంబంధించిన కొంతమంది తోనే సమస్య అన్న విషయంలో తేడా ఏం లేదు.

   >>> నీకు సమజయ్యిగూడ నేనొప్ప అంటే నేనేం జేస్త శ్రీకాంత్ అన్నా?

   నాకు సమజయ్యింది. మీరే కాస్త ఇబ్బంది పడుతున్నట్టుంది. కెసిఆర్ అన్నది విభజన జరిగినా ఇంకా ఇక్కడే పాతుకు పోయిన కొంత మంది ఆంధ్రా అక్రమార్క అధికార్ల గురించి. అంతేకాని రేవంత రెడ్డి చెప్పినట్టు, మీరు నమ్మినట్టు సర్వే గురించి "సీఎం కేసీఆర్ ఒక మాట, అనధికారంగా మరో మాట" చెప్పుడు కాదు అది.

   Delete
  13. @YJs
   //దీనినే పోమ్మనకుండా పోగ పెట్టటం అంటారు.//
   Exactly. ప్రస్తుతం జరుగుతున్నది అదే. చట్టబద్దంగా పంపించేయడం కుదరదు. కాబట్టి, పొగ పెట్టడం షురూ జేస్తున్నారు. పైకి మాత్రం మేము కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అంటారు. పనులన్నీ ఇలానే ఉంటాయి.

   Delete
  14. This comment has been removed by the author.

   Delete
  15. @శ్రీకాంత్ చారి
   //అంటే ఏమిటో మీరే చెప్పారుగా. ఒద్దు మొర్రో అంటే ఆంధ్ర ఉద్యోగులను అలోకేట్ చేస్తే మరింకేం జేస్తారు? జీతాలిచ్చి పక్కకు పెట్టినా తప్పేనా? ఇప్పటిదాకా వదిలినట్టు అచ్చోసిన ఆంబోతుల లెక్క వదలాలనా? దాన్ని రేవంత రెడ్డి తెచ్చి సర్వేకి కలపటం, మీరు ఇంకొంచం మసాల కలిపి "వెళ్ళగొడదాం" అనడం బాగానే వుంది. తెలంగాణా ప్రభుత్వం మొదటినుండీ చెపుతుంది "ఆంధ్రా ఉద్యోగులు మాకు వద్దు మొర్రో, వారిని అక్కడికే పంపండి" అని.//

   నిజాయితీకి కూడా ఆంధ్రా, తెలంగాణా అంటూ ప్రాంతాలు అంటగట్టడం మాత్రం హైలెట్. అవినీతి అనేది సర్వాంతర్యామి. దానికి కులం, మతం, ప్రాంతం, జాతి వగైరా వగైరాలు ఉండవు. తెలంగాణాలో అవినీతి అనేది, ఆంధ్రా ఉద్యోగులలోనే కాదు, తెలంగాణా ఉద్యోగులలో కూడా ఉంది. అలానే నిజాయితే అనేది కూడా ఇరువురిలోణూ ఉంది. మరలాంటప్పుడు ఆంధ్రా వాల్లను పక్కన పెడితే పనులు మహ గొప్పగా ఉంటాయని అనుకోవడం అమాయకత్వం తప్ప మరొకటి కాదు. ఈ ద్వేషాన్ని విడనాడి కాస్త స్థిమితంగా ఆలోచించడం నేర్చుకోండి.

   ఇదివరకు కూడా ఇలానే ఆంధ్రావాల్ల గురించి ఇలానే మాట్లాడారు. అప్పుడు కాటన్ దొర గురించి, బ్రౌన్ గురించి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు అవినీతికి ప్రాంతాలుండవని చెప్పాల్సి వస్తోంది. ఈ ప్రాంతీయ ద్వేషం దేనికి?

   Delete
  16. ఇంకో విషయం, సమైక్యంగా ఉన్నప్పుడు పాలించిన వారిలో తెలంగాణా వారూ ఉన్నారు, అంధ్రా వారూ ఉన్నారు. ఉద్యోగులలో తెలంగాణా వారూ ఉన్నారు, ఆంధ్రా వారూ ఉన్నారు. అవినీతి అధికారులలో కూడా ఇద్దరూ ఉన్నారు. దోచుకున్నవారు ఆంధ్రా తెలంగాణా అన్న భేదం లేకుండా దోచుకున్నారు. ఇబ్బంది పడ్డవారిలో కూడా ఆంధ్రా తెలంగాణా అన్న బేధం లేదు. తేడా ఉన్నదల్లా ఇప్పుడున్న ప్రాతియాభిమానం హద్దులు మీరిన వారిలోనే.

   Delete
  17. @Sri kanth

   >>> నిజాయితీకి కూడా ఆంధ్రా, తెలంగాణా అంటూ ప్రాంతాలు అంటగట్టడం మాత్రం హైలెట్.

   ఇక్కడ మాట్లాడుతుంది కొంతమంది ఆంధ్రా MROల గురించి. మొత్తం ప్రజల గురించి కాదు. మీరు అలా అర్థం చేసుకుంటానంటే చేసేదేం లేదు.

   MRO ఏమన్నా రాష్ట్ర స్తాయి అధికారా? ఆంధ్రా MROలు హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల్లో ఏవిధంగా పోస్టింగు ఇచ్చారు? అలా పైరవీ చేసుకుని వచ్చిన వారిని KCR ప్రభుత్వం పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకుంటే కొంతమందికి గగ్గోలెందుకు?

   ఈ విషయం పైన ఫేస్‌బుక్‌లో ఎం ఎస్ రెడ్డి గారు పెట్టిన కామెంటు షేర్ చేయదలిచాను..

   తెలంగాణా ఇమేజ్ ని దెబ్బ తీసే భారీ కుట్ర ???
   సి .ఎం ఆఫీస్ లో కూడా ప్రైవసీ లేదా ???
   రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టక్కర్లేదా ???

   తెలంగాణా ఇమేజ్ ని , రోజురోజుకి పెరుగుతున్న కెసిఆర్ ప్రతిష్టని దెబ్బతీసే భారీ కుట్ర ను తెలంగాణా వ్యతిరేక శక్తులు అమలు చేస్తున్నట్లు స్పష్టంగా అర్ధమౌతోంది . ఇటీవల ''కెసిఆర్ ఆడియో వ్యాఖ్యలు" అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు ఆస్కారం కల్పిస్తున్నాయి .
   సి .ఎం అధికారుల సమావేశంలో , అదీ సి .ఎం ఆఫీసులో కెసిఆర్ మాట్లాడిన మాటలు అని ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి వినిపించడమంటే ఇది దేనికి పరాకాష్ట ???
   అంటే కెసిఆర్ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారనేదానిపై రేవంత్ రెడ్డి సి .ఎం ఆఫీసులో నిఘా పెట్టారా ???
   అక్కడికి వెళ్ళే అధికారులు రేవంత్ కి ఏజెంట్ గా సి .ఎం వ్యాఖ్యలను రికార్డ్ చేస్తున్నారా ??? అలా చేయాల్సిన అవసరం ఏముంది ??? ఇలా తప్పుడు మార్గంలో కెసిఆర్ ఆడియో అంటూ బహిరంగంగా వెల్లడించిన రేవంత్ మీద చట్టపరంగా కేసు పెట్టాల్సిన అవసరం లేదా ???
   ఇంకా ఎంతమంది మంత్రులు , ఉన్నతాదికారుల విషయంలో ఈ స్పై వ్యవహారం కొనసాగుతోంది ???
   తెలంగాణా ప్రభుత్వ రధసారధి గా కెసిఆర్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను జీర్ణించుకోలేక ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ వ్యవహారాలకు పాల్పడుతున్నారా ???
   తాజాగా కొందరు మంత్రులు అవినీతికి పాల్పడడానికి ప్రయత్నించారనే ప్రచారాలను ఎందుకు చేస్తున్నారు ???
   ఎలాగైనా తెలంగాణా ఇమేజ్ ని దెబ్బ తీయాలనే కుట్ర భారీ స్థాయిలో జరుగుతున్నట్లు అనుమానం కలుగుతున్నది . వి వి ఐ పి లను అనుసరిస్తున్న అనుమానాస్పద వ్యక్తుల పట్ల నిఘా పెట్టాల్సిన అవసరం ఇంకా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నది .
   తెలంగాణా పోలీస్ డిపార్టుమెంటు లో అత్యంత సమర్ధులైన ఉన్నతాధికారులు అనురాగ్ శర్మ గారు , మహేందర్ రెడ్డిగారు , బత్తుల శివధర్ రెడ్డి గారు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణా ప్రజలు కోరుకుంటున్నారు .

   Delete
  18. @శ్రీకాంత్ చారీ ,
   నేను చెప్పేది కూడా ఆ కొంత మంది ఆంధ్రా MROల గురించేనండి. ఆంధ్రా వారందరి గురించి కాదు. ఆంధ్రా MROలు, తెలంగాణా MROలు ఇరువురూ .. ఆంధ్రా, తెలంగాణా జనాభాతో పోలిస్తే కొద్దిమందే. మరి ఒకప్రాంతానికి చెందిన "కొద్ది మంది" MROలు నీతి మంతులయ్యి, మరో ప్రాంతానికి చెందిన "కొద్ది మంది" MROలు అవినీతి పరులు అవడం ఏమిటి? అది కూడా వారి నీతి, అవినీతులకు "ప్రాంతం" కారణం కావడం ఏమిటి అని?

   మీరు పైన అన్నారు, "ఆంధ్రా ఉద్యోగులు మాకు వద్దు మొర్రో, వారిని అక్కడికే పంపండి" మొత్తుకుంటున్నాము అని. ఒద్దని మొత్తుకున్నంత మాత్రాన పంపడానికి వీలు లేదు. వాటికి కొన్ని రూల్సున్నాయి. వాటి ప్రకారమే జరుగుతుంది. ఆంధ్రా పరదేశమూ కాదు, అంధ్రావారు పరాయి పాలకులు కాదు. భారత దేశ పౌరులు. మాకు స్వాతంత్రం వచ్చేసింది, ఇక దయచేయండి అనడానికి తెలంగాణా దేశం నుండి విడిపోనూలేదు. ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది అంతే. ఉధ్యోగుల విభజన ఎలా జరగాలి అన్నదానిపై కమిటీలున్నాయి. వాటికి కొన్ని నిబంధనలున్నాయి. వాటి ప్రకారం పంపిణీలు చేసుకోండి, మాకే మాత్రం అభ్యంతరం లేదు. కాకపోతే, అలా పంపిణీలోనో, లేక ఇంకా పంపినీ జరగక చర్చల స్థాయిలో ఉన్నప్పుడో.. తెలంగాణాలో పనిచేస్తున్న "కొంత మంది" ఆంధ్రా MROలపై నిందలేయడం దారుణం. పైగా.. "అచ్చోసిన ఆంబోతుల్లాగా" వదలమంటారా అన్నారు. ఉద్యోగులను వారి పని చేసుకోనివ్వడం అచ్చోసిన ఆంబోతులను వదిలినట్టు వదలడమా?

   మనోభావాలు, ఆత్మాభిమానాలు తెలంగాణా వారికి మాత్రమే సొంతమా? మిగిలిన వారికి ఉండవా? అలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఉద్యోగుల్లో అవినీతి పరులున్నారు అనుకుందాం.. అప్పుడు అవినీతి నిరోధక శాఖ వారికి పని అప్పగించండి. లంచావతారులను కటకటాలు లెక్కపెట్టేలా చేయండి. ఎవరు కాదన్నారు?

   ఇదే మాటలు ఒక ఆంధ్రా వారి గురించి కాక, "కొంత మంది" ముస్లిములను అన్నా, కొంత మంది "సిక్కులను" అన్నా .. లేక "కొంత మంది" నల్ల జాతీయులను ఎవరైనా వేరోక చోట అన్నా ... ఫలానా అతను ముస్లిం కాబట్టి, అతనికి వారికి జీతాలిచ్చి పక్కన బెట్టండి, ఫలానా వారు నల్ల జాతీయులు కాబట్టి జీతాలిచ్చి పక్కన బెట్టండి .. అని మీరు అనుంటే దాన్ని ఏమనుండేవారో తెలుసు కదా? మొదటి రెండింటినీ "కమ్యునలిజం" అంటారు, రెండవ దాన్ని "రేసిజం" అంటారు. ఇవేనా Intolerance, Bigotry ఇలా విచిత్రమైన పదాలన్నీ వాడేవారు. ఇక్కడ దురదృష్ట కరమైన అంశమేమిటంటే వారు ఆంధ్రా వారు కావడం. ఏమన్నా చెల్లు బాటు అవుతోంది. మీరన్న మాటలు పైన రెండింటికన్నా ఏవిధంగా భిన్నంగా ఉన్నాయి చెప్పండి?

   //తెలంగాణా ఇమేజ్ ని దెబ్బ తీసే భారీ కుట్ర ???
   సి .ఎం ఆఫీస్ లో కూడా ప్రైవసీ లేదా ???
   రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టక్కర్లేదా ???//

   సలక్షనంగా పెట్టొచ్చు. కానీ ఎందుకు పెట్టలేదో అన్నది అందరికీ తెలిసిందే. అయినా, కే.సీ.ఆర్ గారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ అధికారులూ, ఎమ్మార్వోలూ, నాలాంటి ప్రెజానీకాలూ అందరినీ పరిపాలించడానికి ఎన్నుకోబడ్డ వ్యక్తి. ప్రజాస్వామ్యములో ఒకసారి ఎన్నుకోబడ్డాక అతను అందరికీ ముఖ్యమంత్రి అవుతాడే గానీ, కొందరికి కాదు. ఆయన కూడా అందరికీ ముఖ్యమంత్రిని అన్నట్లుగా తమ పర బేధం లేకుండా పాలించాలి గానీ ఇలా వారు ఆధ్రా వారు కాబట్టి పక్కనుండమని చెప్పాం అనడం భావ్యమా? కానీ, విచిత్రం ఆ హోదాలో ఉన్న వ్యక్తి అలా అనడం బాగానే ఉంది కానీ ఎవరో ఒకరు దాన్ని రికార్డు చేయడం మాత్రం మహానేరమయ్యింది ఇప్పుడు.

   Delete
  19. >>విశ్లేషనలు నిరభ్యంతరంగా చేయొచ్చు.

   అవునండి, చెయ్యొచ్చు. కాని సున్నిత విషయాలపై విశ్లేషనలు ఉద్రిక్తతలకే దారి తీస్తాయని అనేక టివి చర్చలు వందల సార్లు నిరూపించాయి.

   >>ఇండైరెక్టుగా పవన్, విజయశాంతీలను ఉద్దేశించి అన్నాడని పత్రికల ఉవాచ

   ఇక్కడే ఉండి వివరాలు ఇవ్వని వారిని , ఎక్కడో ఉండి రాలేని వారిని ఒక విధంగా ఎలా చూడగలం? రాజకీయ కారణాల కారణంగా వివరాలు ఇవ్వని వారిని, ఎక్కడో ఉండి రాలేక వివరాలు ఇవ్వలేని వారిని ఒకే రకంగా ఎలా చూడగలం? రాజకీయ కారణాలతో ప్రభుత్వానికి సహకరించని వారిపై రాజకీయ వ్యాఖ్యలు చేసాడు, రాజకీయాల్లో ఇవేమీ కొత్త కాదె?

   సర్వేలో ఉన్న కొన్ని ప్రశ్నలపై కొందరికి అభ్యంతరం ఉండొచ్చు, అది వారి ఇష్టం. అందరికి పనికొచ్చేలా ఆ ప్రశ్న పత్రం తాయారు చేసారు, అంతే కాని అన్ని ప్రశ్నలు అందరి కోసం కాదు. ప్రశ్నలన్నీ నింపాల్సిన అవసరం కూడా లేదు. కనీసం పేరు, కుటుంభ సభ్యుల పేర్లు, అడ్రస్ రాసి మమా అనిపించినా పర్వాలేదు, దాని వలన ప్రభుత్వానికి ఎదో ఒక యుపయోగం ఉండొచ్చు. వారి వివరాలు, కుటుంభ సభ్యుల వివరాలు ఏ సినిమా వాళ్ళు ఇంటర్వ్యూకు వచ్చి అడిగినా చక చక చెప్పేస్తారు కదా, మరి పబ్లిక్ కు ఆల్రెడీ తెలిసిన అవే విషయాలను సర్వేలో రాయించేస్తే వచ్చే నష్టం ఏముంది? రాయించక పోవటానికి ఇంకేం కారణాలు ఉంటాయి? ఇలా సహకరించక పోవటానికి గల అసలు కారణాలు ఎవ్వరైనా ఊహించుకోవచ్చు. ఒక వేల సర్వే ఫ్లాప్ అయ్యి ఉంటె ఈయన హిరో అయ్యి ఉండే వారు కాబోలు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి సహకరించక పొతే వారు మాత్రం ఒక మంచి పాలన అందించగలరు? ఈ సర్వే వలన హైదరాబాదులో లెక్కలో లేని ఇల్లు ఇప్పుడు లెక్కలోకి వచ్చి సుమారు 500కోట్లకు పైగా ఆదాయం పెరుగుతుంది అని ఇంతకూ ముందు చదివాను, ముందు ముందు మరిన్ని ప్రయజనాలు కలగొచ్చు. ప్రజలు సహకరించక పొతే ఇలాంటివి ఎలా సాధ్యం? సర్వేలో మార్పులు కోరటం మంచిదే, కాని అసలు సర్వేనే లేకుండా చెయ్యాలని ఎంత మంది ప్రయత్నించలేదు? ఆ ప్రయత్నంలో ఉద్దేశాలు ఏమిటి?

   >>ఇలాంటివి విన్న తరువాత, పత్రికలు విశ్లేషనలు చేయడములో తప్పులేదు కదా..!

   విన్నా తరువాత అలాంటి విశేషణాలు ఎవరైనా చేసి ఉంటె నేను అసలు వాదననే మొదలు పెట్టి ఉండే వాడిని, వినక ముందే అన్నట్లుగా చేస్తున్న ప్రచారం పైనే నా నిరసన. అన్నా అనకున్నా ఎలాగు అదే ప్రచారం కదా ..... ఇక తేడా ఏముంది?

   >>పత్రికలలో వచ్చే వార్తలకు సంబందించిన రికార్డింగ్స్ పత్రికల దగ్గర తప్పకుండా ఉంటాయి. లేకుండా రాస్తే అది వారికే ముప్పు.

   లేవనే విషయం ఇదివరకు పలుమార్లు నిరూపితం అయ్యింది. నాయకులు నిలదీసినప్పుడల్లా 'సారి' చెప్పి తప్పించుకున్న సంఘటనలు కోకొల్లలు. ఇక ఆయా పత్రికల రహస్య(?) ఎజెండాలు అందరికి తెలిసినవే :-)

   Delete
  20. @Sri kanth

   >>> ఒద్దని మొత్తుకున్నంత మాత్రాన పంపడానికి వీలు లేదు. వాటికి కొన్ని రూల్సున్నాయి. వాటి ప్రకారమే జరుగుతుంది.

   అంతవరకు తన పాలన సజావుగా జరగడానికి వారిని బెంచి పై కూచోబెట్టే హక్కు, అధికారం KCRకు గూడా వుండి. దానికి గగ్గోలెందుకు అన్నాను. వారి ఉద్యోగాలేం పీకెయ్యడం లేదు, వారినేం వెళగొట్టడం లేదు. ఏదో బావుకుందామని పైరవీలు చేసుకొని ఇక్కడికి వచ్చిన వారు అదేమీ కుదరదని తెలుసుకొని వారంత వారే వెళ్ళిపోతారు. అదే KCR అన్నది.

   >>> ఉద్యోగులను వారి పని చేసుకోనివ్వడం అచ్చోసిన ఆంబోతులను వదిలినట్టు వదలడమా?

   వారి "పని" ఏమిటో వీరికి బాగా అర్థమైనట్టుంది!

   >>> ఉద్యోగుల్లో అవినీతి పరులున్నారు అనుకుందాం.. అప్పుడు అవినీతి నిరోధక శాఖ వారికి పని అప్పగించండి. లంచావతారులను కటకటాలు లెక్కపెట్టేలా చేయండి. ఎవరు కాదన్నారు?

   అదెలాగూ జరుగుతుంది. అంతకు ముందు వారిచేత మిగిలున్న దస్తావేజులు పూర్ణాహుతి కాకుండా ఆపాలి కాదా!

   >>> ఇదే మాటలు ఒక ఆంధ్రా వారి గురించి కాక, "కొంత మంది" ముస్లిములను అన్నా, కొంత మంది "సిక్కులను" అన్నా .. లేక "కొంత మంది" నల్ల జాతీయులను ఎవరైనా వేరోక చోట అన్నా ...

   మీరు మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు. అన్నది ఆంధ్రా వాళ్ళని కాదు. ఆంధ్రా నుంచి ప్రత్యేక పైరవీలు చేసుకొని, లేదా ప్రత్యేకమైన వారి సేవ చేసుకొని తరించడానికి విచ్చేసిన పెద్దమనుషులను గురించి. గత కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రా వారికి "విశేషాధికారలు" ఉండడం వల్ల వారు ఆంధ్రా నుండి వచ్చారు. అలాంటి అధికారాలు ఏ మరాఠీలకో వుండి వుంటే బహుశా ఆంధ్రా వారికి ఆ ఖర్మ పట్టి వుండేది కాదు.

   Delete
  21. నిస్వార్థంగా సీమాంధ్రలో వుండి ఉద్యోగం చేసుకుంటున్న MROలతో మాకు పేచీ ఏం లేదు, పైగా గౌరవం కూడా.

   Delete
  22. This comment has been removed by the author.

   Delete
  23. @Kiran Kumar K
   విశ్లేషనల అవసరం చాలా ఉంది. విశ్లేషనలు తప్పు దారి పట్టకుండా ఉండడమొక్కటే కావాల్సింది. ఇప్పటి వరకూ సర్వే విషయం మీద చేసిన విశ్లేషనలు తప్పు కావని నిరూపిస్తున్నట్లుగా ఉన్నాయి కదా కే.సీ.ఆర్ గారి మాటలు. ఒక వైపు హై కోర్టు ఐచ్ఛికమే అన్న సర్వేను, తప్పని సరిగా తీసుకోవాలని భావమొచ్చేట్లు చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడారు. కే.సీ.ఆర్ గారు ఒకడుగు ముందుకు వేసి, సర్వే తీసుకోని వారు టూరిస్టులు అనేశారు. ఆయన లక్ష్యం పవన్, విజయశాంతీలు అయ్యుండొచ్చు. కానీ, కోర్టు మాటలను నమ్మి ఐచ్ఛికమే అని వదిలేసిన వారి పరిస్థితి ఏమిటి? సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు అంటే అది ఉద్రిక్తతలకు దారి తీయదా? కే.సీ.అర్ గారి మాటతో పోలిస్తే పేపర్లలో విశ్లేషనలు ఏపాటివి? మీరు ఒకవైపు పేపర్ల విశ్లేషనలను వద్దంటునే, కే.సీ.ఆర్ మాటలు కేవలం రాజకీయ వాగ్భాణాలే అని ఎలా అనగలుగుతున్నారు?

   //ఇక్కడే ఉండి వివరాలు ఇవ్వని వారిని , ఎక్కడో ఉండి రాలేని వారిని ఒక విధంగా ఎలా చూడగలం? రాజకీయ కారణాల కారణంగా వివరాలు ఇవ్వని వారిని, ఎక్కడో ఉండి రాలేక వివరాలు ఇవ్వలేని వారిని ఒకే రకంగా ఎలా చూడగలం? రాజకీయ కారణాలతో ప్రభుత్వానికి సహకరించని వారిపై రాజకీయ వ్యాఖ్యలు చేసాడు, రాజకీయాల్లో ఇవేమీ కొత్త కాదె?//

   సర్వే ఐచ్ఛికం అయిన తరువాత వివరాలు ఇవ్వడం, ఇవ్వక పోవడం అన్నది వారి ఇష్టం. దానికి కారణం రాజకీయమా, మరొకటా అన్నది ముఖ్యం ఎలా అవుతుంది? కారణం ఏదైనా కావొచ్చు, సర్వేను తిరస్కరించే హక్కు వారికి ఉంది. అందులో రెండో ప్రశ్నకు తావు లేదు. ఇక సర్వే తీసుకోని వారిపై చేసిన వ్యాఖ్యలు రాజకీయం మాత్రమేనని కాసేపు అనుకున్నా, బాధ్యతా యుతమైన పదవులలో, అది కూడా సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారు, సర్వేలో పాల్గొనని వ్యక్తులని (వారు ఎవరైనా సరే) టూరిస్టులు అనడం, వారి చర్య సామాజిక నేరం అనడం బాధ్యతాయుతమైన పనేనా? ఒక ప్రతిపక్షనాయకునికీ, సాక్షాత్తూ ముఖ్యమంత్రికీ తేడాలేదా? సర్వే తీసుకోవడం తీసుకోకపోవడం వారి ఇష్టం అని ఉంటే సరిపోయేది కదా..!?

   సర్వే అనేది జరకుండా ఎంతో మంది ప్రయత్నించారు అని అంటున్నారు. వారి ఉద్దేశ్యాలేమిటి అని అడుగుతున్నారు. అసలు ఈ సర్వే ముఖ్య ఉద్దేశ్యం మీద ఉన్న అనేక అనుమాలు మీరెలా మరిచిపోతున్నారు. సర్వే కాదనే వారికి దిక్కారించాలన్న కోరికకన్నా, అభద్రతా భావమే ఎక్కువ అన్న విషయం గ్రహించలేనంత క్లిష్టమైన అంశం కాదు గదా?

   పత్రికలకు హిడెన్ ఎజెండా ఉంది అంటూన్నారు, అసలు సర్వేకే హిడెన్ ఎజెండా ఉంది అంటున్నాయి పత్రికలు. పత్రికలు హిడెన్ ఎజెండా ఉంది అని మీకు చెప్పే హక్కున్నట్లే, పత్రికలకు కూడా ఆహక్కు ఉంది. అది తప్పని భావిస్తే మరో పత్రికలో కానీ లేదా అధికరికంగా మరెవరైనా కానీ వివరణ ఇవ్వవచ్చు. దానిలో అభ్యంతరం పెట్టడానికి ఏమీలేదు.

   ఒకప్పుడు కొన్ని పత్రికలు సరైన ఆధారలూ, రికార్డింగులూ లేకుండా వార్తలను రాసిన విషయం నిజమే. కానీ, ప్రస్తుతం ఆంధ్రజ్యోతీ, టీ.వీ9 ఎపిసోడ్ల తరువాత పరిస్థితి మారింది అన్నది నా అభిప్రాయం. కావాల్సి వస్తే ఎవరైనా కేసు పెట్టొచ్చు. కోర్టుల్లో "సారీ"లు చెల్లవు.

   Delete
  24. @శ్రీకాంత్ చారి,
   //నిస్వార్థంగా సీమాంధ్రలో వుండి ఉద్యోగం చేసుకుంటున్న ంఋఓలతో మాకు పేచీ ఏం లేదు, పైగా గౌరవం కూడా.//
   అలాంటివారిని మీరు గౌరవించడం అనేది అభినందనీయమే కానీ అదే రకంగా నిస్వార్థంగా తెలంగానాలో పనిచేసే సిమాంధ్ర MRO లు కూడా ఉన్నారని గ్రహించకపోవడం తప్పని నేనంటున్నాను. ఇక్కడున్న MROలను పక్కన పెట్టడానికి ఉన్న కారణం ఏమిటి? వారు పైరవీలతో వచ్చారు, వారు సరిగా పనిచేయడం లేదు, వారు అవినీతి పరులు. కాబట్టి వారిని పని చేయనీయడం అంటే.. అచ్చోసిన ఆంబోతులని వదిలడం. నాకర్థమయ్యింది ఇదే. కానీ ఇవన్నీ నిజాలా? నిజాలనడానికి ఏ ఆధారాలున్నాయ్? ఆంధ్రా నుండి వచ్చిన వారే పైరవీలతో వచ్చారా? ఇక్కడ పైరవీలతో వచ్చిన వారు లేరా? ఇక్కడ లంచావతారులు లేరా? ఖచ్ఛితంగా ఉన్నారు. కానీ వారెవ్వరినీ పక్కన పెడుతున్నట్లు లేదే? ఆంధ్రావారిని మాత్రమే పక్కన పెడుతున్నారు, అది కూడా వారికి పైరవీకారులు, అవినీతి పరులూ అన్న ముద్ర వేసి మరీ? వారిని పక్కన పెట్టడానికి కారణం మీరన్న అవినీతి, పైరవీ, పనిచేయకపోవడం అన్నవి నిజమైతే తెలంగాణావారిని కూడా చాలా మందిని పక్కన పెట్టాలి. చెప్పడం కూడా సూటిగా ఫలానా వారు అవినీతి పరులు కాబట్టి పక్కన బెట్టినం అని చెప్పాలి. కానీ అలా జరగలేదు. వారిని పక్కన బెట్టడానికి ఉన్న ఏకైక కారణం వారు ఆంధ్రులవ్వడం ఒక్కటి తప్ప.

   అదెలాగూ జరుగుతుంది. అంతకు ముందు వారిచేత మిగిలున్న దస్తావేజులు పూర్ణాహుతి కాకుండా ఆపాలి కాదా!
   ఈ సమావేశానికి హాజరవ్వకపోతే వారు దస్తావేజులను పూర్ణాహుతి చేయలేరా? దానికీ దీనికీ ఏమిటి సంబంధం? మీరేదో పైన జీతాలిచ్చి పనిజేయనీయకుండా కూర్చోబెడుతున్నాం అన్నారేకానీ నిజానికి అలా ఏం జరగడంలేదు. అందరూ పనిచేసే జీతాలు తీసుకుంటున్నారు. దస్తావేజులు తగలేయడం అనేది జరగదు. అలా జరిగితే ఉద్యోగాలు ఊడతాయి. ప్రభుత్వాలు సహకరిస్తేనే ఆపని ఏఉధ్యోగి అయినా చేయగలడు.

   //మీరు మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు. అన్నది ఆంధ్రా వాళ్ళని కాదు. ...//
   కాకుండా ఎలా పోయింది? మీరు పైన రాసింది మీరే చదవండి. మీరు ఆంధ్రానుండి ఇక్కడికి వచ్చిన MROలనే అన్నారు. వారిని మీరు అలా అనడానికున్న ఏకైకా కారణం వారు ఆంధ్రా వాల్లు అవ్వడం. ఎందుకంటే, అలానే పైరవీలు చేసివచ్చిన వారు తెలంగాణా వారు కూడా ఉన్నారు. అసలు మీ వాఖ్యలో అవినీతి కన్నా "ఆంధ్రా నుండి రావడం" అనేదే హైలెట్.

   Delete
  25. @Sri kanth

   >>> అలాంటివారిని మీరు గౌరవించడం అనేది అభినందనీయమే కానీ అదే రకంగా నిస్వార్థంగా తెలంగానాలో పనిచేసే సిమాంధ్ర MRO లు కూడా ఉన్నారని గ్రహించకపోవడం తప్పని నేనంటున్నాను.

   ఇతర జొన్లనుండి తెలంగాణాలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు పైరవీలు చేసుకొని (అందుకు అధిక మొత్తం డబ్బు కూడా అవసరమవుతుంది) వచ్చారంటేనే వారి ఉద్దేశాలు ఏమయ్యుంటాయో తెలిసి పోతుంది. వారిలో నిజాయితీ వెదకడం శుద్ధ దండగ.

   ఇప్పటికీ ఎంతో మంది ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణా ప్రభుత్వంలో పని చేస్తున్నారు. మరి వారందరితో బాగానే పని చేయించుకుంటున్నారే! మీ లాజిక్ ప్రాకారం అందరినీ పక్కకు పెట్టాలిగా?

   మీరు గ్రహించ వలసింది ఎవరితో పనిచేయించుకోవాలో, ఎవరిని పక్కకు పెట్టాలో నిర్ణయించుకునే హక్కు తెలంగాణా ప్రభుత్వానికి వుందని. T, V6 చానెల్లని ఆంధ్రా అసెంబ్లీ లోనికి అనుమతించ పోవడం ప్రాంతీయ వివక్ష అవుతుందేమో తప్ప ఇది కాదు. అదీకాక ఆంధ్రా వివక్ష అయితే కేవలం హైదరాబాదు, రంగారెడ్డి వారిని మాత్రమే ఎందుకు పక్కకు పెట్టాలి, అందరినీ పెట్టాలిగా?

   >>> అలానే పైరవీలు చేసివచ్చిన వారు తెలంగాణా వారు కూడా ఉన్నారు. అసలు మీ వాఖ్యలో అవినీతి కన్నా "ఆంధ్రా నుండి రావడం" అనేదే హైలెట్.

   ఆ సంగతి నాకు తెలియదు. మీకు తెలిస్తే తెలంగాణా ప్రభుత్వాని చెప్పండి. నాకు తెలిసి జొను కాని జోను నుంది ఇక్కడికి వచ్చి పని చేస్తున్నారంటే అది పైరవీలు చెయ్యకుండా సాధ్యం కాదు. ఆంధ్రా వారు పైరవీ చేసి వచ్చారనడానికి ఆ ఒక్క ఋజువు చాలు.

   Delete
  26. "ఇప్పటి వరకూ సర్వే విషయం మీద చేసిన విశ్లేషనలు తప్పు కావని నిరూపిస్తున్నట్లుగా ఉన్నాయి కదా కే.సీ.ఆర్ గారి మాటలు. కే.సీ.అర్ గారి మాటతో పోలిస్తే పేపర్లలో విశ్లేషనలు ఏపాటివి?

   అందుకే నేను ముందే అన్నాను "అన్నా అనకున్నా ఎలాగు అదే ప్రచారం కదా ..... ఇక తేడా ఏముంది? " :-)

   ఒకవైపు పేపర్ల విశ్లేషనలను వద్దంటునే,

   పేపర్ వాళ్లు 'ఇలా అన్నాడు' అనే స్పష్టంగా రాసారు. అదెలా విశ్లేషణ అవుతుంది?

   కే.సీ.ఆర్ మాటలు కేవలం రాజకీయ వాగ్భాణాలే అని ఎలా అనగలుగుతున్నారు?

   అవి ఎవరిని ఉద్దేశించి అన్నారో అనే విషయం పై మీకొక అవగాహన ఉంది, అదే మీరు పైన రాసారు కూడా. అలానే అది చదివిన వారందరికీ కూడా ఆ వ్యాఖ్యలు ఎవరి గురించో అర్థం అయ్యింది. అసలు ఆయన అన్నదే , పవన్, రాములమ్మ లను గురించి విలేకరులు ప్రస్తావిచినప్పుడు.

   సర్వే తీసుకోని వారు టూరిస్టులు అనేశారు

   నేను ఇంకా ఆ తాలూకు విడియో చూడలేదు. కాని చదివిన దాని ప్రకారం 'వారు టూరిస్టులా ఉండాలనుకుంటున్నారేమో' అని అన్నట్లు చదివాను కాని 'వారు టూరిస్టులే' అని అనలేదు. రెంటికి తేడా ఉంది.

   సర్వే ఐచ్ఛికం అయిన తరువాత వివరాలు ఇవ్వడం, ఇవ్వక పోవడం అన్నది వారి ఇష్టం. దానికి కారణం రాజకీయమా, మరొకటా అన్నది ముఖ్యం ఎలా అవుతుంది?

   ప్రభుత్వానికి సహకరించాలి అనే చట్టం ఏది లేదు. కాని అది ప్రజల నైతిక భ్యాద్యత. నేను సహకరించను, కాని నాకు ప్రభుత్వం ఏమిచేయ్యటం లేదు అనే వారితోనే సమస్య.

   సర్వే తీసుకోవడం తీసుకోకపోవడం వారి ఇష్టం అని ఉంటే సరిపోయేది కదా..!?

   నాకు ఇష్టం లేదు కాబట్టి నేను సర్వేలో పాల్గొనలేదు అని పవన్ కూడా చెప్పలేడు. అందుకే అన్నాను ఇది కేవలం రాజకీయ వ్యాక్యలె.

   అసలు ఈ సర్వే ముఖ్య ఉద్దేశ్యం మీద ఉన్న అనేక అనుమాలు మీరెలా మరిచిపోతున్నారు.

   ప్రతి పక్షాల సంగతి పక్కన పెడదాం, వారు ఎవరైనా కూడా ప్రభుత్వాన్ని సమర్దించే అవకాశాలు తక్కువ.
   ఆ అనేక అనుమానాలు ఎవరికీ వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? ఆ ప్రశ్న మరియు జవాబు అందరికి తెలిసిందే. ప్రభుత్వం చేసే ప్రతి పనిలో ఆ కోణం మాత్రమె చూస్తాం అంటే ఎవ్వరు ఏమి చెయ్యలేరు. ఇది వరకే చెప్పాను, సర్వే నిర్భందం కాదు, ప్రశ్నలన్నీ నింపటం కూడా నిర్భందం కాదు అని. 'ఉద్దేశం' అదే అయితే రాష్ట్ర వ్యాప్తం గా ఇంత భారిగా సర్వేయ్ అది ఒక్క రోజులో చెయ్యనవసరం లేదు. ప్రభుత్వానికి కావలసిన సమాచారం మరో రకంగా కూడా తెచ్చుకోగలడు, కాక పొతే కాస్త ఆలస్యం.

   పత్రికలకు హిడెన్ ఎజెండా ఉంది అంటూన్నారు, అసలు సర్వేకే హిడెన్ ఎజెండా ఉంది అంటున్నాయి పత్రికలు.

   అలా ఆ వర్గం పత్రికలూ అనటంలో ఆశ్చర్యం లేదు. ఈ హిడెన్ ఎజండాలు ఎవరు మొదలు పెట్టారు అన్నది కూడా చూస్తే, ఈ సర్వే అనేది చాలా చిన్న విషయం. పత్రికల ఎజెండాలు సంవత్సరాలుగా నడప బడుతున్నవి అనేది తెలిసినదే.

   కావాల్సి వస్తే ఎవరైనా కేసు పెట్టొచ్చు.

   ఎవరి పరిధిలో వారు బాలా బలాలు చుపించుకున్తున్నారు. అంతా గేం. ఎవరికీ టైం వస్తే వారు చుపించుకున్తున్నారు.

   ఇక పచ్చిగా చెప్పాలంటే, ఈ ఎపిసోడ్ మొత్తం మళ్ళి ఇంకొక "తెలంగాణా vs సీమంధ్ర" వర్గాల ఎత్తులు పై ఎత్తులు.

   ధన్యవాదాలు శ్రీకాంత్ గారు,ఇక ఈ చర్చకు నావైపు నుండి స్వస్తి. ఒక వారం పాటు ఆఫ్లైన్ లోకి వెళ్తున్నాను. వెకేషన్ :-) ఈ చర్చ వలన మీ వైపు కోణం చూసే అవకాశం నాకు దక్కింది, ఎంతో కొంత కొత్తది నేర్చుకున్నాను.

   Delete
 4. కొండలరావు గారు & మిత్రులకు సూచన: ఇది ప్రస్తుత టపాకు సంబందించిన విషయం కాకపోయినా పంచుకోవాలని రాస్తున్నాను. మీ అందరి ప్రోత్సాహంతో నేను ఫాస్ట్ 1956 కటాఫ్ తేదీ మీద తెలుగులో అనువదించిన టపా చూడగలరు.

  http://jaigottimukkala.blogspot.in/2014/08/1956.html

  ReplyDelete
 5. కిరణ్ కుమార్ కేAugust 19, 2014 at 7:07 PM
  నేను రాసిన విషయం ఏమిటి , మీరు అడుగుతున్న ప్రశ్న ఏమిటి?

  శ్రీకాంత్ చారిAugust 19, 2014 at 7:10 PM
  ఏం కుట్ర వుంది?

  మీకర్ధం కాలేదా? లేక అర్ధం కానట్టు నటిస్తున్నారా? :)

  కేసిఆర్ అన్న మాటలు విన్న తరువాత కూడా మీకిందులో కుట్ర కుతంత్రం కనపడలేదు అంటే మీ వీరాభిమానం ఏ లెవెల్లో వుందో అందరికి తెలుస్తోంది.

  ReplyDelete
  Replies
  1. >>మీకర్ధం కాలేదా? లేక అర్ధం కానట్టు నటిస్తున్నారా? :)

   వీరాభిమాని అని నాకొక గుర్తింపు ఇచ్చినందుకు మొదట మీకు ధన్యవాదములు.

   మీకో చిన్న కథ చెపుతా.

   మేక, అది ఎలా ఉంటుంది, ఏం తింటుంది, ఏం చేస్తుంది అనే చాల విషయాలు మీకు చెప్పాను. అంతా విన్నాకా అప్పుడు మీరు నన్ను ఏమి అడిగారంటే 'అంటే దున్నపోతు తెల్లగా ఉంటుంది అని మీరు చెపుతున్నారా?' అని ??? :-)

   అననివి అన్నట్లుగా పత్రికల వారు రాసారు అని నేనేదో కామెంట్లు రాసుకుంటే అవి వదిలేసి ఇంకో ప్రశ్న అడిగితె నేనేం చెప్పను? 'కుట్ర ఉంది' అని నేను రాయలేదు. 'కుట్ర లేదు' అని కూడా నేను రాయలేదు. కనీసం నేను మిమ్మలిని అడిగిన తరువాత అయినా మీరు ఒక సారి సారి చూసుకొని ఉంటె బాగుండేది. :-))

   కెసిఆర్ ను సపోర్ట్ చెయ్యటమే నా ఉదేశం అయి ఉంటె అసలు నేను ఆ ఆడియో/విడియో లింక్ పోస్ట్ చేసే వాడినే కాదు.

   >>మీ వీరాభిమానం ఏ లెవెల్లో వుందో అందరికి తెలుస్తోంది.

   అందరు అంటే ఎవరెవరు? ఓహో ... అందరు అంటే మీ వర్గమా. మరో వర్గానికి మీ దృష్టిలో అసలు గుర్తింపే లేదా? హహ ... ఇది మాకు కొత్త కాదు లెండి, పర్లేదు.

   ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడటం నాకు అలవాటు, ఆధారాలతో మాట్లాడటానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. నేను ఒక తెలంగాణా వాదిని అని అందరికి తెలుసు. తెలంగాణా వాదులు అంటే ఖచ్చితంగా కెసిఆర్ అభిమానులు అయి ఉండాల్సిందే అని కొందరు అనుకుంటారు, అలా అనుకోవటం అనేది వారిష్టం, నాకేం నష్టం లేదు.

   చాలా మంది నాకు ఇచ్చినట్లే మీరు కూడా నాకొక గుర్తింపు ఇచ్చినందుకు ధన్యవాదములు. మీరు కేవలం నన్ను కేసిర్ వీరాభిమాని అనే అన్నారు, ఇదివరకు కొందరు లంగా గాడు, తెలబాను, తేవాదులు(తివ్రవాదులు అనే సౌండ్ వచ్చేలా)..... ఇలా చాల ఉన్నాయి లెండి, అలాంటి టైటిళ్ళు ఇచ్చారు :-) ... అలా నాకు టైటిళ్ళు ఇచ్చిన వారందరికి కృతజ్ఞతా పూర్వకంగా నేను వారి మోహంలో ఒక కొత్త కెసిఆర్ ను చూసుకున్నాను. అలాంటి వీరాభిమానం నాది ... లోల్.

   Delete
  2. @కిరణ్ కుమార్ కే
   అననివి అన్నట్లుగా పత్రికల వారు రాసారు అని నేనేదో కామెంట్లు రాసుకుంటే అవి వదిలేసి ఇంకో ప్రశ్న అడిగితె నేనేం చెప్పను?
   >>> "కెసీఆర్ అననివి అన్నట్లుగా పత్రికల వారు రాసారు" అనేదాంట్లో నేను మీతో ఏకీభవిస్తాను. కానీ కేసీఆర్ అన్న మాటలో? వాటి గురించి కూడా మాట్లాడకూడదా?

   'కుట్ర ఉంది' అని నేను రాయలేదు. 'కుట్ర లేదు' అని కూడా నేను రాయలేదు. కనీసం నేను మిమ్మలిని అడిగిన తరువాత అయినా మీరు ఒక సారి సారి చూసుకొని ఉంటె బాగుండేది. :-))
   >>> 'కుట్ర లేదా' అని అడిగింది శ్రీ గారు. 'వుందని రాయలేదు, లేదని రాయలేదు' మీరు పరిస్థితి డోలాయమానం గా ఉన్నట్టుంది. కేసీఆర్ అన్న మాటలు వింటే ఆంద్ర ఉద్యోగుల మీద వివక్ష చూపిస్తున్నాడని ఇట్టే అర్ధం అవుతుంది. కానీ మీరు దానిని వొప్పుకోరు.

   కెసిఆర్ ను సపోర్ట్ చెయ్యటమే నా ఉదేశం అయి ఉంటె అసలు నేను ఆ ఆడియో/విడియో లింక్ పోస్ట్ చేసే వాడినే కాదు.
   >>> వీడియో ఇస్తే సపోర్ట్ చేయ్యనట్టా? లేక చేసినట్టా? 'మా కేసీఆర్ ఒక టైగర్. కేసీఆర్ దెబ్బ, ఆంధ్రోడు అబ్బ' అంటూ గొప్పగా కొంత మంది ఈ వీడియో లింక్ ఎక్కడ పడితే అక్కడ పోస్ట్ చేస్తున్నారు. మీరు యే కేటగిరినో మీకే తెలియాలి.

   అందరు అంటే ఎవరెవరు? ఓహో ... అందరు అంటే మీ వర్గమా. మరో వర్గానికి మీ దృష్టిలో అసలు గుర్తింపే లేదా? హహ ... ఇది మాకు కొత్త కాదు లెండి, పర్లేదు.
   >>> ఇక్కడ మీరు రాసిన మేక దున్నపోతుల కధ చదువుకోండి. "మీ వీరాభిమానం ఏ లెవెల్లో వుందో అందరికి తెలుస్తోంది." అని నేను రాసాను. మీరు వర్గం అంటూ ఎక్కడికో వెళ్ళిపోయారు. అందరికి అంటే నా ఉద్దేశ్యం 'అందరికి'. నేను అన్ని మేకలకి అని రాస్తే, మరి మా దున్నపోతులో అని మీరు అడుగుతున్నారు. మళ్ళీ చెబుతున్నా. నీ వాళ్ళు, నా వాళ్ళు కన్నా మనం గొప్పది.

   ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడటం నాకు అలవాటు.
   >>> మరి శ్రీ గారు అడిగిన ఒక చిన్న ప్రశ్నకి సమాధానం ఇవ్వడం లేదెందుకో?

   చాలా మంది నాకు ఇచ్చినట్లే మీరు కూడా నాకొక గుర్తింపు ఇచ్చినందుకు ధన్యవాదములు. మీరు కేవలం నన్ను కేసిర్ వీరాభిమాని అనే అన్నారు, ఇదివరకు కొందరు...
   >>> అభిమానం ఉండొచ్చు. ఎవరూ కాదనరు. కానీ ఒక సీఎం కుర్చీలో కూర్చుని 'కలవని వాడు ఆంధ్రోడు. ఆంద్ర కలెక్టర్లను, MRO లను పక్కకు పెట్టేసినం' అని కేసీఆర్ అనడం ఎంతవరకు సమంజసం? మీరు కేసీఆర్ అన్న మాటలని వదిలేసి కేవలం పత్రికల వాళ్ళు ఇలా రాసుకొచ్చారు అనే దాని మీద ఫోకస్ చేసారు. నేను కేసీఆర్ అన్న దాని మీద ఫోకస్ చేసాను.

   శ్రీకాంతాచారి ముందేమన్నారు:"ఒద్దు మొర్రో అంటే ఆంధ్ర ఉద్యోగులను అలోకేట్ చేస్తే మరింకేం జేస్తారు?"
   కొంత సేపు తర్వాత "ఇక్కడ మాట్లాడుతుంది కొంతమంది ఆంధ్రా MROల గురించి. మొత్తం ప్రజల గురించి కాదు. "

   ఒకవేళ కేసీఆర్ 'అవినీతి కలెక్టర్ లని MRO లను పక్కకి పెట్టేసినం' అని అంటే ఇంత చర్చ అవసరమే లేదు. కానీ ఆంధ్రోల్లు కాబట్టే పక్కకు పెట్టేసినం అని చెప్పి, "ఇగ గిదేందుకు ఇదంతా బజార్ల పెట్టి చెప్పాలి ఇప్పుడు నేను" అని అనడం తోనె అర్ధం అవుతోంది. 'నా నోటితో చెప్తే గాని మీకు మన అజెండా అర్ధం కావడం లేదా? ఆంధ్రోడు పొతే మనకు దారి సాఫీ ఐతది.'

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top