పార్టీకి రాజీనామా ప్రకటించిన మాజీ మంత్రి
తుమ్మల వెంటే ఎమ్మెల్సీ బాలసాని, జడ్పీ చైర్‌పర్సన్‌ కవిత
5న టీఆర్‌ఎస్‌లో చేరిక!
ఖమ్మం (ఆంధ్రజ్యోతి), ఆగస్టు 30: తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగే శ్వరరావు శనివారం రాజీనామా ప్రకటించారు. దీంతో రాష్ట్రవిభజన, సార్వత్రిక ఎన్నికల అనంతర పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో బలంగా ఉన్న జిల్లా ఖమ్మంలో ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ‘‘నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఆమోదించగలరు.’’ అంటూ పార్టీ అధినేత చంద్రబాబుకు ఏకవాక్య ప్రస్తావనతో తుమ్మల రాజీనామా లేఖ పంపారు. వచ్చే నెల 5న టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం రాత్రి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌తో సమావేశమైన తుమ్మల హైదరాబాద్‌నుంచి శనివారం ఉదయం ఖమ్మం చేరుకున్నారు. తన క్యాంప్‌ కార్యాలయంలో జిల్లాకు చెందిన ముఖ్యనాయకులు, కార్యకర్తల తో విస్తృతంగా చర్చించారు. ముఖ్య నేతలు, కార్యకర్తలంతా పార్టీ వీడడానికే మద్దతు పలకడంతో వెంటనే ఆయన రాజీనామా ప్రకటన చేశారు. ఆ వెంటనే ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లాపరిషత్‌ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు మువ్వా విజయ్‌బాబు, ఎగ్గడి అంజయ్య తదితరులు తమ రాజీనామా పత్రాలపై సంతకాలు చేశారు. తుమ్మల ప్రకటన నేపథ్యంలో జిల్లాలోని మండల గ్రామ స్థాయి నేతలు, ప్రజా ప్రతినిధులు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో టీడీపీ తీవ్ర సంక్షోభంలో పడింది. 
పార్టీ ఆవిర్భావం నుంచీ...
టీడీపీ ఆవిర్భావం నుంచీ తుమ్మల పార్టీలో క్రియాశీలక పాత్రే పోషించారు. 1982లో ఎన్టీఆర్‌ సమక్షంలో టీడీపీలో చేరిన తుమ్మల, 1983 ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయారు. 1985లో మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు ప్రసాదరావుపై సత్తుపల్లిలో గెలిచి ‘జలగం కోట’పైనే పచ్చజెండా ఎగురవేశారు. ఎన్టీఆర్‌ కేబినేట్‌లో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన తుమ్మల, 1994లో అదే స్థానం నుంచి గెలిచారు. పార్టీ సంక్షోభ సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచారన్న పేరుంది. చంద్రబాబు కేబినెట్‌లో ఎక్సైజ్‌, భారీనీటిపారుదల, రోడ్లు భవనాల శాఖల మంత్రిగా పనిచేశారు. కమ్యూనిస్టుల ఖిల్లాగా ఉన్న జిల్లాను టీడీపీకి కంచుకోటగా మలిచారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న గిరిజన గ్రామాల్లోనూ పసుపు జెండాను రెపరెపలాడించారు. దీంతో రాష్ట్రంలో టీడీపీకి బలంగా ఉన్న జిల్లాల్లో ఖమ్మం కూడా ఒకటిగా నిలిచింది. 
ఈ క్రమంలో మధుకాన్‌ సంస్థల అధినేత నామా నాగేశ్వరరావు జిల్లా రాజకీయాల్లోకి ప్రవేశించడంతో తుమ్మలకు ఎదురుగాలి వీయడం ప్రారంభమైంది. ఈ క్రమంలో చంద్రబాబు, తుమ్మల మధ్య దూరం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మలతో పాటు ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్సీ బాలసానికి టికెట్‌ కేటాయింపులో పార్టీ అధిష్టానం వ్యవహరించిన తీరుతో పార్టీ జిల్లా శాఖలో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఫలితంగా ఒక్క సత్తుపల్లి స్థానంతోనే టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జిల్లా రాజకీయ పరిస్థితులను అంచనా వేసిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, తుమ్మలను పార్టీలోకి ఆహ్వా నించారు ప్రభుత్వంలోనూ గుర్తింపు ఇస్తామని తుమ్మలకు భరోసా ఇవ్వడంతో ఆయన టీడీపీకీ రాజీనామా చేశారు. 
ఎవరెళ్లినా...పార్టీకేమీ కాదు:ఎర్రబెల్లి
తుమ్మల రాజీనామాపై టీడీపీ ఘాటుగానే స్పందించింది. ఎవరెళ్లినా పార్టీకేమీ కాదని తెలంగాణ టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెలి దయాకర రావు వ్యాఖ్యానించారు. ఎన్జీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడిన ఆయన తుమ్మల రాజీనామాపై ఘాటుగా స్పందించారు. పార్టీకి అండగా గ్రామ స్థాయిలో బలమైన కేడర్‌ ఉందని, కేడరే పార్టీకి బలమన్నారు. ఈ నేపథ్యంలో ఎంతమంది నేతలు పార్టీ వీడినా, తమకొచ్చిన నష్టమేమీ లేదని ఆయన చెప్పారు. తుమ్మల కోరిన విధంగా పార్టీ వ్యవహరించిందని చెప్పిన ఎర్రబెల్లి, తాజాగా జడ్పీ చైర్మన్‌ పదవిని కూడా తుమ్మల సూచించిన వ్యక్తికే కట్టబెట్దిందని గుర్తు చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా 15 ఏళ్ల పాటు మంత్రిగా కొనసాగిన తుమ్మలకు పార్టీ ఏం తక్కువ చేసిందని పార్టీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. మరో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌తో కలిసి ఎన్జీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో విలేకరులతో మాట్లాడిన తీగల, తుమ్మల నిర్ణయం సరైందికాదన్నారు. 
తుమ్మల కళ్లల్లో నీళ్లు!
పార్టీతో 33 ఏళ్ల అనుబంధాన్ని తెంచుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడి న సందర్భంగా తుమ్మల కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. పార్టీతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్న తుమ్మల భావోద్వేగానికి గురయ్యారు. రాజీనామా లేఖపై సంతకం చేస్తున్న సందర్భంగానూ తుమ్మల కళ్లు చెమర్చాయి. రాజీనామా లేఖపై సంతకం పెట్టిన వెంటనే ఆయన తన గదిలోకి వెళ్లి బోరున విలపించారు. ఈ సమయంలో ఆయన తన గదిలోకి ఎవ్వరినీ రానివ్వలేదు. జిల్లాలో పార్టీని ఇతర పార్టీలకు అందనంత ఎత్తులో నిలిపిన తుమ్మల రాజీనామా, ఆయన అనుచరులనూ తీవ్ర వేధనలోకి నెట్టేసింది.
(from andhrajyothy daily)
Reactions:

Post a Comment

 1. పేజా సేవ చేద్దామని మహత్తర ఆశయం తో శ్రీ తుమ్మల వారు పార్టీ మారుతుంటే మీ గోలేమిటి ?

  ReplyDelete
 2. 1983 - సత్తుపల్లి నియోజకవర్గం - ఓటమి - 6216 వోట్లతో
  1985 - సత్తుపల్లి నియోజకవర్గం - గెలుపు - 3818 వోట్లతో - చిన్న నిటి పారుదల శాఖ మంత్రి
  1989 - సత్తుపల్లి నియోజకవర్గం - ఓటమి - 6249 వోట్లతో
  1994 - సత్తుపల్లి నియోజకవర్గం - గెలుపు - 7594 వోట్లతో.
  1996 - సత్తుపల్లి నియోజకవర్గం - మద్యపాన నిషేధం శాఖ మంత్రి
  1996 - సత్తుపల్లి నియోజకవర్గం - మధ్య తరహ నిటి పారుదల శాఖ మంత్రి
  1999 - సత్తుపల్లి నియోజకవర్గం - గెలుపు - 31029 వోట్లతో
  1999 - సత్తుపల్లి నియోజకవర్గం - మద్యపాన నిషేధం శాఖ మంత్రి
  2001 - సత్తుపల్లి నియోజకవర్గం - రోడ్లు, భావనల శాఖ మంత్రి.
  2004 - సత్తుపల్లి నియోజకవర్గం - ఓటమి. 9536 వోట్లతో.
  2009 - ఖమ్మం నియోజకవర్గం - గెలుపు - 2472 వోట్లతో.
  2014 - ఖమ్మం నియోజకవర్గం - ఓటమి - 5609 వోట్లతో


  1983 - తెలంగాణా లో తెలుగుదేశం బలంగా లేదు, సత్తుపల్లి ఓడిపోయాము.
  1985 లో అన్న గారికి అన్ని ప్రాంతాల్లో ప్రభంజనం, సత్తుపల్లి గెలిచాము.
  1989 లో అన్నగారు కుడా ఒడి, ప్రతిపక్షంలోకి వచ్చాము, సత్తుపల్లి ఒడాము.
  1994 లో అన్న గారు కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష హోదా కుడా లేకుండా చేసారు, సత్తుపల్లి గెలిచాము.
  1999 లో చంద్రబాబునాయుడు గారు చేసిన అభివృద్ధి రాష్ట్రంలో ఇమేజ్ రూపంలో పని చేసింది, సత్తుపల్లి గెలిచాము. 2004 లో తెలుగుదేశం పార్టీ ఓడింది, సత్తుపల్లి ఓడిపోయము.
  2009 లో తెలంగాణా లో తెరాస, కమ్యునిస్టులతో కలిసి పోటి చేసాము, గెలిచారు.
  2014 లో కమ్యునిస్టులతో పొత్తు లేదు, ఓడిపోయాము.

  కమ్యునిస్టులు పక్కన ఉంటె గెలుస్తాము, పక్కన లేకపోతే ఓడిపోతాము,
  ఉన్న 10 మందిలో వర్గాలు తాయారు చేస్తాము.
  ఓడిపోతాము అనుకుంటే పార్టీని ఫణంగా పెట్టి అయిన ఇంకో నియోజకవర్గం అడుగుతాము,
  పక్కన ఉన్న వాడిని పగోడి పార్టీ తరుపున పోటి పెట్టేస్తాము. దానినే మళ్లీ రాజకీయము, వర్గము, అనుకుంటాము.
  నామ నామం పెడితే, మనం ఏమి పెట్టాము తుమ్మలా?

  ఇంతోటి దానికి ఏడుపులు బిల్డప్పులు వెధవ వేషాలు, పోతే పోయాడు, మళ్ళీ దానికి కుడా చర్చ సమాధానాలు :-)

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top