నేర్చుకున్నది నేర్పితే మరింత నేర్పరితనం పెరుగుతుంది. మనం నేర్చుకున్న విషయాలు మనకు గుర్తుండాలన్నా, అవి మరింత లోతుగా అర్ధం కావాలన్నా ఆ విషయాలను ఇతరులకు తెలియజేయాలి.  ఈ లోకం లో దొంగతనానికి గురికానిది పంచేకొద్దీ వన్నె పెరిగేదీ 'జ్ఞానం' మాత్రమే.

ఒక విషయం మనకు అర్ధమయినట్లే ఉంటుంది. కానీ ఇతరులకు చెప్పాలన్నా - పేపర్ పై పెట్టాలన్నా - ఇతరులతో చర్చ సందర్భంగా సమాధానం చెప్పాలన్నా మనం తడబడుతున్నామంటే దానర్ధం ఆ విషయం పై మనం పూర్తి పట్టు సాధించలేదని అర్ధం.

తినగ తినగ వేము తీయనవుతుంది. అనగననగ రాగమతిశయిల్లుతుందనేది వేమన చెప్పిన తత్వనీతి. అది తిరుగులేని సత్యం కూడా.  జ్ఞానానికి కూడా ఈ నీతి వర్తిస్తుంది. పైగా రాగం మనలో టేలెంట్ ఉన్నంత వరకే రాణించగలం . జ్ఞానం నేర్చుకున్న కొద్దీ విస్తరిస్తూ ఉంటుంది.

ఒక విషయంను మనం ఎదుటివారికి అర్ధమయ్యేలా చెప్పలేకపోతున్నామంటే ఆ విషయం మనకు పూర్తిగా అవగాహన కాలేదని గమనించాలని ఐనిస్టీన్ అంటాడు . 


మనకు తెలిసిన విషయం మనకు ఎంత తెలుసు అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది ?

మొదటిది ఇతరులకు మనకు తెలిసిన విషయాలు చెప్పేటప్పుడు, రెండవది మనకు తెలిసిన విషయాన్ని ఒక ఐటెం రూపం లో వ్రాసేటప్పుడు, మూడోది ఇతరులతో చర్చలో పాల్గొన్నప్పుడు .

అయితే ఇలా చేసేటప్పుడు మన లోపం తెలుసుకోవడమంటే మనం ఆ విషయాన్ని మరింత మెరుగు పరచుకోవడమే తప్ప ఓడిపోయినట్లో , ఇన్ఫీరియారిటీ కాంప్లెక్ష్ కు గురికావడమో, ఇతరుల ముందు తక్కువ కావడమో అనే భావానికి  గురి కాకూడదు. 

ఈ ప్రపంచం లో అందరికీ అన్ని విషయాలు ఎప్పటికీ తెలిసే అవకాశం లేదనేది గుర్తు పెట్టుకోవాలి. 

మనకు తెలిసిందే సరయినదని మొండివాదన చేయకూడదు. శాస్త్రీయంగా ఒక విషయం మనకు నిర్ధారణగా తెలిసినప్పుడు ఎంతైనా వాదించేందుకు జంక కూడదు. అదే సందర్భం లో ఎదుటివారు మనకంటే మెరుగైన వాదనను ఆధారాలతో శాస్త్రీయంగా చెప్పగలిగినప్పుడు నేర్చుకునేందుకు సంశయించకూడదు. ఎవరికీ అన్ని విషయాలు తెలియవు. ఎవరికి ఏ విషయం తెలిసినా అది సమాజం నుండే అనేది నిర్వివాదాంశం. ఎప్పటికప్పుడు సమాచారం ను అప్డేట్ చేసుకోవాలి.

అది సమాజానికి ఉపయోగకరమే అవుతుంది. విషయాలను మంచిగా నేర్పగలిగే ఓ ఉపాధ్యాయుడుని సమాజం పొందినట్లవుతుంది. ప్రతీదీ ఎప్పటికప్పుడు మారుతూ మెరుగవుతూ ఉంటుంది. వాటిని అప్డేట్ చేసుకోవాలన్నా ఇతరులతో చర్చించాల్సిందే. అసలు మనకు తెలిసిన విషయం ఇతరులతో చర్చించకుంటే మనం మరచిపోయే ప్రమాదమూ ఉంటుంది.

కొందరు మొండివాదన చేసేవారు - తమకు మాత్రమే విషయాలు బాగా అర్ధమవుతాయనుకునే వారూ - ఎదుటివారు చెప్పేది వినని వారు - ఇతరులపైనా , కొన్ని విషయాలపైనా మూర్ఖంగా గుడ్డి వ్యతిరేకత పెంచుకున్న వాళ్లు ఉంటారు. వారితో చర్చించడం వల్ల ఉపయోగ ముండదు. కావాలని అలా ప్రవర్తించే వారికి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే అటువంటి వారితో చర్చ సమయాన్ని వృధా + మనం డిస్టర్బ్ కావడం జరుగుతుంది. మనం ఎంత ప్రయత్నించినా వీళ్లు మారరు అనే నిర్ధారణకు వచ్చిన వారికి దూరం గా ఉండడం వల్ల ఆ సమయం తో మరికొన్ని ప్రయొజనకరమైన పనులు చేపట్టవచ్చు.

చర్చ సందర్భం గా లేదా ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునేటప్పుడు గుడ్డిగా అనుసరించకూడదు. దానికో శాస్త్రీయ పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. తెలుసుకున్నది నిర్ధారించుకోవాలి. నిర్ధారించుకున్నది నిరంతర చర్చల ద్వారా మరింత అవగాహన చేసుకుంటే ఇతరులకు మరింత తేలికగా చెప్పేందుకు వీలవుతుంది.

మొత్తం మీద మనం నిరంతరం నేర్చుకోవాలి. నిరంతరం విద్యార్ధిగానే ఉండాలి. అప్పుడే మంచి ఉపాధ్యాయుడిగా - వక్తగా  - రచయితగా మారే అవకాశం ఉంది. అలా చేయడమంటే సమాజానికి మేలు చేయడమే అవుతుంది. ఎందుకంటే మంచి భావాలు ఎంతగా వ్యాపిస్తే  సమాజంలో పౌరులు అంత మంచిగా తయారవుతారు. మరింత మెరుగ్గా మానవత్వపు విలువలు పరిఢవిల్లుతాయి. 
Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top