------------------------------------------------
ప్రశ్న పంపినవారు : YJs.
------------------------------------------------
Name:YJs 
E-Mail:Deleted
Subject:స్థానికతని నిర్ణయించేది యెలా? 
Message:కేసీఆర్ 1956 కి ముందు నుండి తెలంగాణాలో వున్నవారే తెలంగాణా వాళ్ళుగా గుర్తింపబడతారు అని అంటున్నారు.

ఆ లెక్కన, 1947 ఆగష్టు 15 నాటికి భారత దేశంలో ఉన్నవారే భారతీయులు అని అంటే తెలంగాణావాళ్ళు యేమవుతారు?
Reactions:

Post a Comment

 1. హైదరాబాద్ రాష్ట్రాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించడానికి బ్రితిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు కనుక 1947 నుంచి తెలంగాణా భారత దేశంలో భాగమే. ఇందులో సందేహం అవసరం లేదు.

  ReplyDelete
 2. ఫీజ్ రీఇంబర్స్‌మెంత్ ఖర్చు తగ్గించుకోవడానికి కె.సి.ఆర్. ఆ నియమం పెట్టాడు. దానికి అంత కంటే వేరే ఉద్దేశం లేదు.

  ReplyDelete
  Replies
  1. ఇందులో మనం చూడాల్సిన విషయం 'కేవలం ఫీజు విషయం' కాదు. Look at the big picture. స్థానికత 'ఇలా' నిర్వచించడం వలన చాల మంది విద్యార్ధులు నాన్ లోకల్ అయ్యే పరిణామం వుంది. నాన్ లోకల్ విద్యార్డులకి మెడికల్, ఇంజనీరింగ్ మరియు MCA /MBA కాలేజీలలో సీట్లు తెచ్చుకోవడం చాలా కష్టం.
   It will have after effects.

   Delete
  2. KCR had said that the nativity rule is applicable only for fee reimbursement and not for admission.

   Delete
  3. No, KCR had said that the nativity rule is applicable only for fee reimbursement and not for JOBS. He never mentioned about admissions.

   Delete
  4. Do some meaningful comment. Fee reimbursement is applicable only for SC/ST/BC. It does not mean others can neither be admitted into the college nor get jobs.

   Delete
 3. కుదిరితే http://jaigottimukkala.blogspot.in/2014/08/fast-financial-assistance-for-telangana.html చూడండి.

  ReplyDelete
  Replies
  1. చదివాను. చాలా బావుంది. ఏ గవర్నమెంటు నిర్ణయమైనా ప్రజలకు మేలు చేసేలా వుండాలి.

   Delete
  2. JaiGottimukkala, I have forwarded your post to some of my friends as well [Some are pro-Development-anti-state division [like me], a couple are pro-Telangana and a few are pro-Seemandhra]. Most of them felt that your analysis and blog post are praiseworthy. Just felt like sharing it here because I urge everyone to read that post. The post is informative [as usual stuff from JaiGottimukkala :)].

   Delete
 4. >>> కేసీఆర్ 1956 కి ముందు నుండి తెలంగాణాలో వున్నవారే తెలంగాణా వాళ్ళుగా గుర్తింపబడతారు అని అంటున్నారు.

  అది పూర్తిగా తప్పుదోవ పట్టించే వాక్యం. KCR అలా ఎప్పుడూ అనలేదు. తెలంగాణా ప్రభుత్వం ప్రకటించిన FAST అనే సంక్షేమ పథకానికి criteriaగా మాత్రమే 1956ను నిర్ణయించారు.

  >>> ఆ లెక్కన, 1947 ఆగష్టు 15 నాటికి భారత దేశంలో ఉన్నవారే భారతీయులు అని అంటే తెలంగాణావాళ్ళు యేమవుతారు?

  అసలు లెక్కే తప్పు అయినప్పుడు "ఆ లెక్కన" అంటూ పెడార్థాలు తీయడం అనవసరం.

  ReplyDelete
  Replies
  1. అది పూర్తిగా తప్పుదోవ పట్టించే వాక్యం. KCR అలా ఎప్పుడూ అనలేదు. తెలంగాణా ప్రభుత్వం ప్రకటించిన FAST అనే సంక్షేమ పథకానికి criteriaగా మాత్రమే 1956ను నిర్ణయించారు.
   అసలు లెక్కే తప్పు అయినప్పుడు "ఆ లెక్కన" అంటూ పెడార్థాలు తీయడం అనవసరం.
   // తప్పుదోవ పట్టించే వాక్యం కాదు తమ్మీ! పిల్లల ఫీజుల విషయమై ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. నేను అడిగిన ప్రశ్న కూడా దానికి సంబందించినదే.

   ఇందులో మనం చూడాల్సిన విషయం 'కేవలం ఫీజు విషయం' కాదు. Look at the big picture. స్థానికత 'ఇలా' నిర్వచించడం వలన చాల మంది విద్యార్ధులు నాన్ లోకల్ అయ్యే పరిణామం వుంది. నాన్ లోకల్ విద్యార్డులకి మెడికల్, ఇంజనీరింగ్ మరియు MCA /MBA కాలేజీలలో సీట్లు తెచ్చుకోవడం చాలా కష్టం. ఈ సంవత్సరం ఫైనల్ రాసే విద్యార్ధులకి వారి తల్లిదండ్రులకి అనవసర టెన్షన్ కాదా?

   Delete
  2. Currently it is only applicable to education assistance for higher education. Several times it is re-iterated by Telangana government about the same. If you want to close your eyes and ears, no one can help.

   >>>నాన్ లోకల్ విద్యార్డులకి మెడికల్, ఇంజనీరింగ్ మరియు MCA /MBA కాలేజీలలో సీట్లు తెచ్చుకోవడం చాలా కష్టం.

   As usual this is another baseless statement. We can not argue based on assumptions.

   Delete
  3. ఈ ప్రశ్న అడిగినాయన ఫీజ్ రీఇంబర్స్‌మెంత్ అనేది కమ్మవాళ్ళకీ, వెలమదొరలకీ కూడా వర్తిస్తుందనుకున్నాడు. ఫీజ్ రీఇంబర్స్‌మెంత్ అనేది రిజర్వేషన్‌లాగే కుల ఆధారితమైనది. దానికి వేరే హక్కులతో సంబంధం లేదు. ఫీజ్ రీఇంబర్స్‌మెంత్ లేనివాళ్ళకి కాలేజ్‌లలో చేరే అర్హత లేకపోతే కె.సి.ఆర్. సొంత కులంవాళ్ళకి కూడా ఆ అర్హత ఉండదు.

   Delete
  4. కమ్మవాళ్లకీ, వెలమవాళ్లకీ ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్ వర్తించదని మీరెలా అనుకుంటున్నారు ప్రవీణ్? వారికి కూడా ఆర్ధిక ప్రాతిపదికన ఇది వర్తింపజేస్తున్నారు. ఇతరులకు సలహా ఇచ్చేముందు మీరావిషయమై ఓసారి చెక్ చేసుకుంటే మంచిది.

   Delete
  5. ఫీజ్ రీఇంబర్స్‌మెంత్ లేనివాళ్ళు డబ్బులు కట్టి కాలేజ్‌లో చేరొచ్చు. అద్మిషన్ దొరకడం కష్టమయ్యే సమస్య ఇక్కడ లేదు.

   Delete
  6. ప్రవీణ్ గారు, నేను చెప్పిందేమిటి? మీరు బదులిచ్చింది ఏమిటి? ఫీజు రీ ఎంబర్స్మెంట్ కమ్మవారికి, వెలమవారికి కూడా లక్ష లోపు ఆదాయం ఉన్నవారికి ఇస్తున్నారని మీరు తెలుసుకుని ఇతరులకు సలహా ఇవ్వాలంటున్నాను. కావాలంటే ఆ విషయాన్ని మరోసారి చెక్ చేసుకోండి.

   Delete
  7. ఆయన ఆంధ్రా విద్యార్థులకి తెలంగాణలో సీత్ దొరకడం కష్టం అన్నారు కాబట్టి అందుకు సమాధానం చెప్పాను. ఫీజ్ రీఇంబర్స్‌మెంత్ ఎవరికి ఇచ్చినా దానికి అద్మిషన్‌లతో సంబంధం ఉండదు.

   Delete
 5. సీమాంధ్రలో ఫీజ్ రీఇంబర్స్‌మెంత్ కొనసాగుతుందో, లేదో చెప్పకుండా కె.సి.ఆర్.ని తిడుతూ చంద్రబాబు అసలు విషయం తొక్కి పెట్టే పని బాగానే చేస్తున్నాడు.

  ReplyDelete
  Replies
  1. I don't support CBN because he is also equally responsible for our current predicament.

   Delete
 6. ఏ కళాశాలల్లో ప్రవేశానికైనా లోకల్‌ నాన్‌లోకల్‌ నిర్ధారించడానికి చూసేది కనీసం ఏడు సంవత్సరాల చదువు ఏ జిల్లాలో చదివారో. . . అటువంటిది ఇంత పెద్ద రాష్ట్ర విభజన అంశంలో 1956 అంటే దాదాపు అరవై సంవత్సరాలు స్థానికత నిర్ధారణకు అంటే నవ్వురావడంలేదా మిత్రమా. . .
  అంటే 1956 తరువాత ఇక తెలంగాణాకు ఎవరూ వలస రాకూడదనా అర్ధం?
  లేక
  అలా వచ్చింది ఆంధ్రప్రాంతం వారే ఎక్కువ మంది కనుక వారిని తరిమేయాలన్న భావనా?

  ReplyDelete
  Replies
  1. Thats my point! The issue is not about fees reimbursement alone. If this rule is implemented, its going to affect a lot of things.

   Delete
 7. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మంచి కళాశాలలు లేవన్న కారణంగానే విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం పది సంవత్సరాల పాటు విద్యాసంస్థలో ఉమ్మడి ప్రవేశాలనే నిబంధన ఉంచింది. దీని ప్రకారమే నడుచుకుంటే సోదరరాష్ర్టాలకు మంచిది.

  ReplyDelete
 8. తమ రాష్ట్రాన్ని అభివృద్ధిపరచుకోవడానికి తగిన మార్గం అన్వేషించలేని చంద్రబాబు, తన అశక్తతను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని తనవైపునుండి మరలించడానికి ఆడుతున్న నాటకమే ఈ అభాండం! ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెగిరినట్టు...తన(సీమాంధ్ర) బాగు చూసుకోలేనివాడు...తెలంగాణ బాగు చూడగోరినట్టు...తన అనుయాయులచేతనే గాకుండా, ఇతరులచేతగూడా ఇలాంటి చవకబారు ప్రశ్నలను సంధింపజేయడం శోచనీయం.

  తన పేరును కూడా బహిర్గతపరచడానికి జంకేవారు, తెలంగాణ సీఎంను విమర్శించబూనుట దుస్సాహసం.

  సీమాంధ్రులు అడుగుపెట్టడంతో తెలంగాణ ఎంత నష్టపోయిందో లోకానికి తెలియదా? అక్రమార్కుల, కుటిలపాలకుల అక్రమాలకు, నిర్లక్ష్యానికి, ఉపేక్షకు గురైన తెలంగాణను పాపం అనడానికి బదులు, ఇంకా దోచడానికి దారులు వెదకడం అన్యాయం.

  అరవై ఏండ్లలో సీమాంధ్రలో అభివృద్ధి జరిగిందనడానికి ఉదాహరణ అక్కడ విమానాశ్రయాలు ఎన్నున్నయో లెక్కించండి...తెలంగాణలో ఎన్నున్నాయో లెక్కించండి. తెలంగాణలో ఒక్కటంటే ఒక్కటి ఉన్నదా? తెలంగాణకు రావలసిన విద్యుత్ ప్లాంట్లు సీమాంధ్రకు తరలడంలో ఎవరి లాబీ ఉందో అర్థం కావడం లేదా?

  ఇన్నివిధాల అన్యాయానికి గురైన తెలంగాణులకు మాత్రమే తెలంగాణ ముఖ్యమంత్రి అందించే ఫలాలు అందాలనడం సమంజసం కాదా? దీన్ని రాద్దాంతం చేయడమెందుకు?

  తెలంగాణ రాష్ట్ర వరాలు తెలంగాణులకే అందాలి. సీమాంధ్ర రాష్ట్ర వరాలు సీమాంధ్రులకే అందాలి. వేరే రాష్ట్ర ఫలాలు కూడా అనుభవించాలని చూసే వాళ్ళ కుట్రలను భగ్నపరచడానికే కేసీఆర్ 1956 ప్రణాళిక! అంతేగానీ ఇలాంటి సమంజసం లేని ప్రశ్నలు వేయడానికి కాదు.

  వీలైతే ఈ టపా చదవండి: http://ratnaalaveena.blogspot.in/2014/07/1956_29.html

  ReplyDelete
  Replies
  1. మందుగుండువారికి ముందు నా నమస్కారం. మీ బ్లాగులో నేను ఎన్నో కామెంట్లు రాసినా, కేవలం కొన్నింటినే మీరు ప్రచురించారు [మీరు సమాధానం ఇవ్వగలిగిన వాటికి మాత్రమే ఆ భాగ్యం కలిగింది]. మీ బ్లాగులో negativity చదవడం కన్నా చదవకపోవడమే మేలని అనుకుని అటురావడమే మానేసాను.

   తమ రాష్ట్రాన్ని అభివృద్ధిపరచుకోవడానికి తగిన మార్గం అన్వేషించలేని చంద్రబాబు, తన అశక్తతను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని తనవైపునుండి మరలించడానికి ఆడుతున్న నాటకమే ఈ అభాండం!
   //
   మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా దృష్టి మరలించడానికి ఆడుతున్న నాటకమే ఈ కామెంట్ అనిపిస్తోంది. మీ దగ్గర సమాధానం ఉందా? ఇవ్వండి. లేకపోతె, జలకిరణ్ లాగ టైం పాస్ ప్రశ్న అనుకుంటే మీరు సమయం వృధా చేసుకోనక్కరలేదు.

   ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెగిరినట్టు...తన(సీమాంధ్ర) బాగు చూసుకోలేనివాడు...తెలంగాణ బాగు చూడగోరినట్టు...తన అనుయాయులచేతనే గాకుండా, ఇతరులచేతగూడా ఇలాంటి చవకబారు ప్రశ్నలను సంధింపజేయడం శోచనీయం.
   // నేను చంద్రబాబును సమర్ధించను. నా లెక్క ప్రకారం తెలంగాణా సీమాంధ్ర రెండు ప్రాంతాలు బాగుండాలి. మీరు కూడా ఇలాగే ఆలోచిస్తే మంచిది. నా ప్రశ్నను చవకబారు ప్రశ్న అని తేల్చిన మీరు సమాధానం ఎందుకు ఇచ్చారు? మీ దగ్గర సమాధానం ఉందా? ఇవ్వండి.

   తన పేరును కూడా బహిర్గతపరచడానికి జంకేవారు, తెలంగాణ సీఎంను విమర్శించబూనుట దుస్సాహసం.
   // అంటే మీలాగా నేను పేరు బహిర్గతం చేసుకుంటే తెలంగాణా సీఎం ను విమర్శించొచ్చా? దుస్సాహసం? నాన్సెన్స్!

   సీమాంధ్రులు అడుగుపెట్టడంతో తెలంగాణ ఎంత నష్టపోయిందో లోకానికి తెలియదా? అక్రమార్కుల, కుటిలపాలకుల అక్రమాలకు, నిర్లక్ష్యానికి, ఉపేక్షకు గురైన తెలంగాణను పాపం అనడానికి బదులు, ఇంకా దోచడానికి దారులు వెదకడం అన్యాయం.
   //పొన్నాల లక్ష్మయ్య, కేశవరావు, హరీశరావు, కవితమ్మ, వినోద్ కుమార్, ముకేష్ గౌడ్ - మచ్చుకు కొన్ని పేర్లు. వీళ్ళు దోచుకోలేదా? వీళ్ళ ఆస్తిపాస్తులు మీకు తెలుసా. కేవలం చంద్రబాబు నాయుడు, రాజగోపాల్ లాంటి వారి పేర్లు మాత్రమే చెప్తారెందుకు? మా వాళ్ళు దోచుకోలేదు మీ వాళ్ళే దోచుకున్నారు అని చెప్పను. రాజకీయనాయకులు అందరు దోచుకున్నారు. ఈ మధ్య ఇళ్ళు పడగోట్టించారు. పోయిన సంవత్సరం కవితమ్మ వాళ్లకి మద్దతు తెలిపింది. ఈ సంవత్సరం ఆ వైపు కూడా రాలేదు. తీరా చూస్తె కొన్ని ఇళ్ళకి అనుమతి వుంది. లీగల్గా అన్ని డాకుమెంట్లు వున్నా నష్టపోయినది సామాన్యులు. ఇందులో తెలంగాణా వాడా ఆంద్ర వాడా అని కాదు. మీలాగ, నా లాగ సామాన్యుడు. మహేందర్ రెడ్డి ఇళ్ళు మట్టుకు ముట్టుకోలేదు.

   అరవై ఏండ్లలో సీమాంధ్రలో అభివృద్ధి జరిగిందనడానికి ఉదాహరణ అక్కడ విమానాశ్రయాలు ఎన్నున్నయో లెక్కించండి...తెలంగాణలో ఎన్నున్నాయో లెక్కించండి. తెలంగాణలో ఒక్కటంటే ఒక్కటి ఉన్నదా? తెలంగాణకు రావలసిన విద్యుత్ ప్లాంట్లు సీమాంధ్రకు తరలడంలో ఎవరి లాబీ ఉందో అర్థం కావడం లేదా?
   //ఇక్కడ ప్రశ్న యెక్కడ యెంత అభివృద్ధి జరిగింది అని కాదు మందుగుండుగారు! ఇలాంటి తలతిక్క నిబంధనల వలన అంతిమంగా ప్రజలే నష్టపోతారు/నష్టపోతున్నారు. నా మిత్రులు కొంత మంది తెలంగాణను ఉత్తర దక్షిణ తెలంగాణా గా విభజించాలి అని అభిప్రాయపడ్డారు. ఎందుకు? మీ వాదనకు ఊతమిచ్చే ‘యెక్కడ యెంత అభివృద్ధి జరిగింది?’ అభివృద్ధి అంతా హైదరాబాదులోనే. మిగతా తెలంగాణాని చిన్న చూపు చూసారంట!

   ఇన్నివిధాల అన్యాయానికి గురైన తెలంగాణులకు మాత్రమే తెలంగాణ ముఖ్యమంత్రి అందించే ఫలాలు అందాలనడం సమంజసం కాదా? దీన్ని రాద్దాంతం చేయడమెందుకు?
   //అన్యాయానికి గురయ్యేది సామాన్యుడు. ఈ సామాన్యుడికి ఆంద్ర, తెలంగాణా అనే భేదం వుండదు. ఇది మీరు గుర్తిస్తే చాలు.

   తెలంగాణ రాష్ట్ర వరాలు తెలంగాణులకే అందాలి. సీమాంధ్ర రాష్ట్ర వరాలు సీమాంధ్రులకే అందాలి. వేరే రాష్ట్ర ఫలాలు కూడా అనుభవించాలని చూసే వాళ్ళ కుట్రలను భగ్నపరచడానికే కేసీఆర్ 1956 ప్రణాళిక! అంతేగానీ ఇలాంటి సమంజసం లేని ప్రశ్నలు వేయడానికి కాదు.
   //సమంజసం లేని ప్రశ్నకి సమాధానం ఇచ్చి మీరు టైం వేస్ట్ చేసుకోకండి.

   వీలైతే ఈ టపా చదవండి: http://ratnaalaveena.blogspot.in/2014/07/1956_29.html
   //థాంక్స్ బట్ నో థాంక్స్

   Delete
 9. కేసీఆర్ 1956 కి ముందు నుండి తెలంగాణాలో వున్నవారే తెలంగాణా వాళ్ళుగా గుర్తింపబడతారు అని అంటున్నారు.

  ekkada annadu? source?

  ReplyDelete
  Replies
  1. ఇదిగో సోర్సు జలకిరణ్!

   http://www.youtube.com/watch?v=RCQRkAFK2uA

   Delete
  2. Y Js గారు,

   మీరు ఇచ్చిన సోర్స్ చూసాను. దాని ప్రకారం మీరు ప్రశ్నించాల్సిన ప్రశ్న ఏమిటంటే

   కేసీఆర్ 1956 కి ముందు నుండి తెలంగాణాలో వున్నవారే తెలంగాణా వాళ్ళుగా గుర్తింపబడతారు అని తీన్మార్ వార్తల్లో యాంకర్లు చెప్పారు.

   ఆ లెక్కన, 1947 ఆగష్టు 15 నాటికి భారత దేశంలో ఉన్నవారే భారతీయులు అని అంటే తెలంగాణావాళ్ళు యేమవుతారు?   నేను అడిగిన సోర్స్ కెసిఆర్ ఎక్కడ చెప్పాడు అని, ఇంకెవరో అయన చెప్పాడు అని చెప్పింది కాదు.

   Delete
  3. కేసీఆర్ అనకుండా తీన్మార్ యాంకర్లు అనేస్తారా? అంత దమ్ముందా?

   http://www.deccanchronicle.com/140717/nation-education/article/students-families-natives-telangana-prior-1956-eligible-fee

   http://namasthetelangaana.com/News/article.aspx?category=1&subCategory=2&ContentId=379415#.U91fTPmSySo

   పైన ఇచ్చిన లింకులు చూసి 'కేసీఆర్ ఇలా అన్నాడు అని DC వాళ్ళు చెప్పడం కాదు, నమస్తే తెలంగాణా పేపర్ చెప్పడం కాదు, ఆయన డైరెక్ట్ గా వన్-ఆన్-వన్ చెప్పిన వీడియో సోర్స్ చూపించు' అని అంటే తమరు కొంచెం వేచి చూడాలి. నేను కేసీఆర్ ఇంటికి వెళ్లి, ఆయన్ని నా ఎదురుగా కూర్చోబెట్టుకుని 'ఇలా మీరు చెప్తే గానే మా జలకిరణ్ నమ్మడం లేదు' అని చెప్పి, ఆయనని వొప్పించి చెప్పించి వీడియో తీసుకుని వస్తా.

   The Telangana Cabinet on approved 1956 as the cut-off year to determine the nativity of Telangana students on 26-Jul-2014.

   ఆ లెక్క ప్రకారం ఈ పాపంలో తెలంగాణా కాబినెట్ అందరికి భాగం ఉందా? ఒక్క కేసీఆర్ కి మాత్రమే అనుకున్నానే?

   Delete
  4. తీన్మార్ మల్లన్న విడియోలు సోర్స్ గా చూపించాలనే మీ ఐడియా సుపరండి :)

   కేసీఆర్ ఇంటికి వెళ్లి, ఆయన్ని నా ఎదురుగా కూర్చోబెట్టుకుని 'ఇలా మీరు చెప్తే గానే మా జలకిరణ్ నమ్మడం లేదు' అని చెప్పి, ఆయనని వొప్పించి చెప్పించి వీడియో తీసుకుని వస్తా.

   వండర్ఫుల్, అలా చేసినాక ఈ ప్రశ్న పోస్ట్ చేస్తే బాగుండేది. మనం దేని గురించి మాట్లాడాలి అనేది చాలా స్పష్టంగా ఉండేది.

   DC వాళ్ళు చెప్పడం కాదు, నమస్తే తెలంగాణా పేపర్ చెప్పడం కాదు

   మరేం చెయ్యమంటారండి? మీడియాలో ఎవరి ఎజండాలు వారికి ఉన్నాయి. ఆంధ్ర జ్యోతి వారు తప్పుడు వార్తలు రాసారు అని ఆరోపణలు వస్తే వారు కూడా ఆ ఆరోపణలను ఖండంచలేదు. ఎవరిని నమ్మలేము, ఎందుకంటే మీరేమో 'మొత్తంగా స్థానికత రూల్స్ మార్చేసారు' అని అంటున్నారు, అక్కడ శ్రీకాంత్ చారి గారేమో "FAST అనే సంక్షేమ పథకానికి criteriaగా మాత్రమే 1956ను నిర్ణయించారు" అని అంటున్నారు? ఇందులో ఎవరిని నమ్మాలి? మిమ్మల్ని మాత్రమే ఎందుకు నమ్మాలి? ఒక సంక్షేమ పథకానికి ఏవో అర్హతలు పెడితే అదేం చట్టపరంగా తప్పు కాదె? అందుకే అడిగాను, కెసిఆర్ అన్న విడియోను లేదా సంభదిత శాకా మంత్రి గారి విడియో లేదా సంబంధిత శాఖ విడుదల చేసిన GO ను మీరు సోర్స్ గా చూపెడితే అప్పుడు మీరు అడిగే ప్రశ్నలో నిజం ఉందని నమ్మి, మిగిలిన చర్చ కొనసాగించవచ్చు.

   ప్రశ్ననే తప్పయితే చర్చ అనేది శుద్ధ దండగ కదా :)

   సరే మీరు చూపించిన లాంటి సోర్సు ఇంకోటి
   https://www.youtube.com/watch?v=2D1pyWHcbD4

   పై విడియోలో ఫీజు పథకం కోసం పాత అంప్ర ప్రభుత్వం 50,000 కోట్లు ఖర్చు చేస్తే 20, 000 కోట్లు మాత్రం విద్యార్తులకు చేరింది అని మిగితాది దుర్వినియోగం అయ్యింది అని, అందుకే FAST అనే పథకాన్ని పకడ్భంది నియమాలతో తీసుకు వచ్చారు అని చెపుతుంది.

   https://www.youtube.com/watch?v=zd__5UwImCA

   మీరు నాకోసం(మరోసారి థాంక్సండి) కెసిఆర్ దగ్గరకు వెళ్లి విడియో పట్టుకొచ్చే శ్రమ మీకు ఎందుకు ఇవ్వటం అని నేనే ఒక విడియో పట్టుకొచ్చాను. పై విడియోలో 19.05 నుండి చూడండి. ఫీజు రిఎమ్బెర్స్మెంట్ పథకాన్ని రాదు చేసి, FAST అనే కొత్త పథకాన్ని మొదలు పెడుతున్నట్లు, ఆ పథకానికి 1956 నుండి ఉన్న వారిని అర్హులుగా తిసుకున్తున్నల్టు స్వయంగా కెసిఆర్ ప్రకటించారు.

   ఇక మీ ప్రశ్నే తప్పు కాబట్టి, ఈ చర్చను వెంటనే మూసి వెయ్యల్సినడిగా కొండల రావు గారిని కోరుకుంటున్నాను :))

   Delete
  5. This comment has been removed by the author.

   Delete
  6. కిరన్ కుమార్ గారూ,

   మీవాదన నాకు విచిత్రంగా అనిపిస్తోంది. దెక్కన్ క్రానికలులో, తెలంగాణా పత్రికే అయిన నమస్తే తెలంగాణాలో వచ్చిన వార్తను నిరాధారమని కొట్టి పారేసేప్పుడు దానికి సాక్షాధారాలు ఏవన్నా ఉంటే చూపించడం బావుంటుంది. ఎందుకంటే, పేపర్లలో వార్తలు, ముఖ్యంగా ఇలాంటివి అంత సులభంగా రావు. వారి వద్ద సోర్సు ఉంటేనే వేస్తారు. అది కూడా ఒక రాష్ట్ర ముఖ్య మంత్రి విషయములో ఇంత అజాగ్రత్తగా ఉండరు. కాబట్టి, అది నమ్మదగ్గ Source గా నిరభ్యంతరంగా భావించ వచ్చు. కాదు అని చెప్పదలుచుకుంటే, అలా కే.సీ.ఆర్ ఎక్కడా అనలేదు అన్న వివరణతో కూడిన వార్త కానీ లేదా ఆ వార్తను ఖండిస్తూ, ఎవరైనా టీ.ఆర్.ఎస్ వారు చెప్పినట్టున్న క్లిప్పింగు కానీ చూపిస్తే నమ్మడానికి ఏ అభ్యంతరమూ లేదు.

   ఇక పేపర్లలో తప్పుడు వార్తలు అంటారా? పేపర్లు పులు కడిగిన ముత్యాలు అని నేను అనను కానీ, కొన్ని వార్తలను చూపించి, అన్ని వార్తలనూ నమ్మను అనడం మాత్రం సరికాదు. కే.సీ.ఆర్ చెప్పలేదు అనడానికి మీ దగ్గరున్న సోర్సు ఏదన్నా ఉంటే చూపించండి అంతవరకూ ఆ వార్త నిజంగానే భావించాల్సి ఉంటుంది.

   ఇక ప్రశ్న అడిగేందుకు ప్రాతిపదిక ఉండాలి అన్నది మీ మరో అభ్యంతరం. దక్కను క్రానికలులోనూ, నమస్తే తెలంగాణాలోణూ వచ్చిన వార్తే అందుకు ప్రాతిపదిక. కాబట్టి ఈ ప్రశ్న సముచితమైనదే అని నా అభిప్రాయం.

   ఇక ప్రశ్న విషయానికి వస్తే.. 1947 కు ముందు తెలంగాణా వారు ఎవరు అన్న ప్రశ్నకు నా సమాధానం ... నిస్సందేహంగా.. "భారతీయులు".

   Delete
  7. @YJ's
   //1947 ఆగష్టు 15 నాటికి భారత దేశంలో ఉన్నవారే భారతీయులు అని అంటే తెలంగాణావాళ్ళు యేమవుతారు?//

   వారంతా భారతీయులే అవుతారు. వారి స్పూర్తి, వారి కాంక్ష కూడా అదే.

   Delete
 10. కొండల రావు గారు,
  ఇదివరకు ఒక టపాలో ప్రశ్నలు అడగటానికి ఒక ప్రాతిపదిక ఉండాలి అనే చర్చ వచ్చింది. ఆ ప్రాతి పతికను మీరు త్వరగా తయారు చేస్తే బాగుంటుంది. ఇలాంటి వెన్నుముక లేని ప్రశ్నలను చర్చించే అవసరం తగ్గుతుంది. :-))

  ReplyDelete
  Replies
  1. రిజర్వేషన్ లేని కులాలకి ఫీజ్ రీఇంబర్స్‌మెంత్ వర్తించదు. అంటే దాని అర్థం ఫీజ్ రీఇంబర్స్‌మెంత్ లేనివాళ్ళందరూ తెలంగాణ పౌరులు కాదనా? ఫీజ్ రీఇంబర్స్‌మెంత్ పేరు చెప్పి "కె.సి.ఆర్. ఆంధ్రావాళ్ళని పాకిస్తానీలని చూసినట్టు చూస్తున్నాడు" అనడం అర్థం లేనిది.

   Delete
  2. ఇంతకు ముందు కూడా ఇలాంటి అర్థం లేని చర్చలే వచ్చినాయి. "హైదరాబాద్ విలీనం అయ్యి 60 ఏళ్ళు దాటినా ఇక్కడి స్కూల్‌లలో మంచి నీళ్ళు, బాత్‌రూంలు లేవు" అని కవిత అంటే దాని అర్థం మారుస్తూ ఒక పాకిస్తానీ వెబ్‌సైత్‌వాడు ఇంకేదో వ్రాసాడు. ఆ పాకిస్తానీ వెబ్‌సైత్‌వాడు వ్రాసినదాని ఆధారంగా బి.జె.పి.వాళ్ళు కవిత మీద విమర్శలు చేస్తే వాటి మీద కూడా ఇక్కడ చర్చ పెట్టారు. ఎద్దు ఈనింది అంటే దూడని కట్టెయ్యమన్నట్టు చర్చలు ఉండకూడదు.

   Delete
  3. @pravin

   కవిత ఆ మాటలే కాదు, ఇంకా చాలా మాటలు అన్నది అందుకే అప్పుడు ఆ చర్చ వచ్చింది. అది అర్థం లేని చర్చ కాదు. అర్థవంతమైన చర్చే.

   ఇక ఈ ప్రశ్నకు ప్రాతిపదిక దక్కను క్రానికలులోనూ, నమస్తే తెలంగాణాలోణూ వచ్చిన వార్తే. కాబట్టి ఈ ప్రశ్న సముచితమైనదే.

   Delete
  4. @శ్రీకాంత్ చారి
   Some one else come here to certifies him to say "ఇక ఈ ప్రశ్నకు ప్రాతిపదిక దక్కను క్రానికలులోనూ, నమస్తే తెలంగాణాలోణూ వచ్చిన వార్తే. కాబట్టి ఈ ప్రశ్న సముచితమైనదే".
   Kondala Rao garu, hope you are looking at all this non-sense.

   ఇక్కడ ఎవరూ లైన్ల మధ్య చదవడం లేదు. పేపర్లలో, వివిధ వార్తా ఛానెల్లలో వచ్చిన వాటినే చెబుతున్నారు. నీకు నచ్చనత మాత్రాన (ఒకవేల వారు చెప్పింది తప్పే అయినా ) నాన్ - సెన్స్ అంటూ కాకుండా మర్యాదగా .. అడగడం లేదా సక్రమంగా సమాధానం చెప్పడం మంచిది.

   Delete
  5. This comment has been removed by the author.

   Delete
  6. This comment has been removed by the author.

   Delete
  7. నమస్తే తెలంగాణాలోని వార్తలో కొంత భాగం...
   -------------------------------------------------------
   అందుకే విద్యార్థుల స్థానికత నిర్ధ్దారణకు ఆ 1956నే ప్రామాణికంగా నిర్ధ్దారించబోతున్నది. 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు పూర్వంనుంచి తెలంగాణలో నివాసం ఉంటున్న తెలంగాణవాసుల పిల్లలకే ఫీజు పథకం వర్తింపజేయాలని సూత్రప్రాయంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనిప్రకారం ఫీజు రీయింబర్స్‌మెంట్ కోరే విద్యార్థుల తల్లిదండ్రులు, తాతలు తెలంగాణకు చెందినవారని విద్యార్థులు నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను విద్యార్థులు సమర్పించాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా కేవలం నిజమైన తెలంగాణ పిల్లలు మాత్రమే తెలంగాణ రాష్ర్టానికి చెందినవారమని నిరూపించుకోగలరు. 1956 తర్వాత వలస వచ్చినవారు, సీమాంధ్రులు తెలంగాణ స్థానికతను నిరూపించుకోలేరు.
   --------------------------------------------------------------------------

   ఇదీ నమస్తే తెలంగాణాలో ఉన్నైది. మీ అభ్యంతరం, ఇది అందరికీ వర్తించదు కేవలం విధ్యార్థులకు మాత్రమే వస్తుంది అన్నదే అయితే దానికి నా అభ్యంతరం లేదు. దాన్ని మీరు సింపులుగా చెప్పొచ్చు. అలానే నాన్సెన్సు అని మీరు ఒకరిని అంటే అది నాకు అనవసరం. కానీ, దానిలోనే నేను కోట్ చేసినదాన్ని కూడా కలిపి.. "some one else came to certify" అంటూ వెటకారాలు ఆడడం, దాన్నంతా నాన్-సెన్స్ అనడం, నాకు ఆమోద యోగ్యం కాదు. ఈ ప్రశ్నకు సరైన ప్రాతిపదిక ఉందా లేదా అనేది తరువాత, ముందు ఇలాంటి "చెత్త" వ్యాఖ్యలు తొలగించాలేమో..!!

   ప్రశ్న కాదు రెచ్చగొడుతున్నది. పక్కవాఉరు చెప్పింది వెక్కిరిస్తున్న విధానం రెచ్చగొడుతోందని గుర్తిస్తే మంచిది.

   Delete
  8. @ kirana kumar,
   ఈ ప్రశ్నకు వెన్నెముక అనేది స్థానికత అనేది ఎలా ఏర్పరచాలి. కాకుంటే కే.సీ.ఆర్ 1956 కంటే ముందున్న వారి విషయాన్ని ఎంతమేరకు ఎలా వర్తింపజేస్తాడనే దానిపై అంతా గందరగోళంగా ఉన్నది కొంత కాలమైతే క్లారిటీ వస్తుంది. మొత్తంగా కొన్ని విషయాలలో తెలంగాణా ప్రభుత్వం బేస్ లెవల్ లో మార్పులు తీసుకువస్తుంది.ఇందులో ప్రజల ప్రయోజనమెంత అనేది కొంత కాలం ఆగితే తేలుతుంది. ఫాస్ట్ పథకానికైనా 1956 నిబంధన తుగ్లక్ చర్య అవుతుందనేది నా అభిప్రాయమని గతంలోనే చెప్పాను. స్థానికతను నిర్ణయించేది ఎలా? అనేది అడిగనవారు వదిలేశారు. చెప్పేవారూ పట్టించుకోవడంలేదిక్కడ. ఇది తెలంగాణా-ఆంధ్రా ప్రాంతాల దురభిప్రాయం తలకెక్కిన నేపథ్యంలో ఎవరికనుకూలంగా వారు వాదనలు , ఋజువులు వెతుకుతున్నారు. అవి పెద్ద మేటర్ కాదు. ప్రభుత్వాలు అది చంద్రశేఖర్ అయినా చంద్రబాబు అయినా ప్రజలను ఏ విషయంలో ఇబ్బంది పెట్టినా మనం వ్యతిరేకించాలి. దీనికి ఆంధ్రా తెలంగాణా సెంటిమెంటల్ భావోద్వేగాల పరంపర అవసరం లేదనేది నా భావన. ప్రశ్నల విషయంలో పాలసీ కి కొంత సమయం పడుతుంది. నేను కొన్ని విషయాలు నోట్ చేసుకుంటున్నాను. బహుశా ఇది నిరంతర ప్రక్రియ. రాను రాను మరింత క్లారిటీ వస్తుందనుకుంటా. ఎందుకంటే మన వాళ్లలో ఇరుప్రాంతాలవారిలో చాలా విషయాలలో చర్చించగలిగే ఆర్టికల్స్ వ్రాయగలిగే మేధావులున్నారని అరధమవుతున్నది.అయితే భావోద్వేగాలలో సహనం కోల్పోతున్నారు తప్ప మిగతా అంతా మంచిగానే ఉంటున్నారు. ఈ పరిస్తితి ఎల్ల కాలం ఉండదు కనుక కొంత ఓపిక తప్పదేమో పాఠకులకు :)

   Delete
  9. మరో విషయం, ఈ స్థానికథ అనే విషయాన్ని సీమాంధ్రులు లేవనెత్తుతున్నది కూడా విధ్యార్థుల వరకే. అలా కాకుండా మిగిలిన వారిని స్థానికులు కాదు అన్నారని కాదు. ఎందుకంటే, చాలా మంది సీమాంధ్రులకు ఇక్కడ ఓటు హక్కు కూడా ఉంది. దాన్ని కాదనడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేడనుకుంటా..!!

   Delete
  10. కొండలరావు గారూ,
   మీరు అడిగింది సరైనది. అసలు "స్థానికథ" అనే దానికి ప్రమాణం ఏది? అనేది తేలాల్సి ఉంది. విధ్యార్థుల స్థానికథ, అలానె ప్రజలందరి స్థానికతకి కూడా. "1956 తరువాత వచ్చిన విధ్యార్థులు స్థానికులు కాదు" అనేది నిజమయితే, సదరు విధ్యార్థులు ఫీజుల విషయములో స్థానికతను కోల్పోయి, మిగిలిన అన్ని విషయాలలో స్థానికులుగా ఉంటారా? విచిత్రంగా లేదూ? ప్రస్తుతం ఈ విషయం ఇంకా ప్రాధమిక దశలోనే ఉంది. ముందు ముందు ఎన్ని మలుపులు తిరుగుతుందో ..!! ఇప్పుడు దీన్ని వ్యతిరేకించకపోతే ముందు ముందు ఇది మిగిలిన అన్ని విషయాలకూ విస్తరిస్తుంది అన్న భావన సీమాంధ్రులలో ఉన్నట్లనిపిస్తోంది. అలా అన్నింటికీ విస్తరించిన రోజున వ్యతిరేకిస్తే, విధ్యార్థులకు ఈ రూలు పెట్టినప్పుడు మీరు ఎందుకు అభ్యంతరం చెప్పలేదు? ఏమి చేస్తున్నారు అని అడిగేయగలరు. ఇతర విషయాలలో ఇలాంటి ప్రశ్నలు ఈపాటికే చూశాం కూడా (At least, in this praja blog).

   Delete
  11. కొండల రావు గారు,

   నేను కొంచం వివరంగా రాయాల్సింది. నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ వేరే అర్థం వచ్చినట్లుంది.

   ప్రశ్న ఏంటి: కేసీఆర్ 1956 కి ముందు నుండి తెలంగాణాలో వున్నవారే తెలంగాణా వాళ్ళుగా గుర్తింపబడతారు అని అంటున్నారు. ..............
   ​నేనేమన్నాను: కెసిఆర్ కేవలం ఫీజు విషయం లోమాత్రమే అలా అన్నాడు (విడియో లింక్ ఇచ్చాను)
   మీరు ఏమంటున్నారు :ఈ ప్రశ్నకు వెన్నెముక అనేది స్థానికత అనేది ఎలా ఏర్పరచాలి.

   ఈ టపాలో ప్రశ్నకు మీరు చెపుతున్న దానికి నాకు పొంతన కనబడటం లేదు, క్షమించాలి. "స్థానికత అనేది ఎలా ఏర్పరచాలి" అనేది మరో ప్రశ్న, లేదా ఆ విషయాన్ని సూటిగా ప్రశ్నిస్తే ఈ అనవసర గందరగోళం ఉండేది కాదు. ఈ టపాలో అసలు స్థానికత సంబందిత చర్చలోకి నేను ఇంకా దిగనే లేదు! కెసిఆర్ అలా అన్నాడా లేదా అన్నదగ్గరే నా చర్చ.

   కెసిఆర్ అలా అనలేదు అనేది నిజమైతే, అడిగిన ప్రశ్ననే తప్పు అని నా ఉద్దేశం. అలా అనలేదు అనే దానికి నేను విడియో లింక్ జత చేసాను.

   వెన్నుముక గురించి
   -----------------------
   ప్రశ్న అడిగిన వారికి వారి ప్రస్తావిస్తున్న వార్త గురించి కొంతైనా అవగాహన ఉండాలి. వీలైతే ప్రశ్నలోనే వారి సోర్స్ ను పొందు పరచాలి. కెసిఆర్ అలా అనలేదు అని నేను విడియోతో నిరుపించాకా(అంతకు మించి ఆధారాలు అవసరం లేదు కాబట్టి) ప్రశ్ననే తప్పు అవుతుంది, అంటే వెన్నుముక లేనిది. కాబట్టి చర్చ కొనసాగించటం వృధా అని నా అభిప్రాయం. మీరు ఎఖిభావిస్తే కామెంట్స్ లాక్ చెయ్యగలరు. లేదంటే ఎందుకు ఎఖిబవిచటం లేదో రెండు వాఖ్యాలు రాయగలరు. అప్పుడు నా వాదనను సమిక్షించుకొవతానికి నాకు అవకాశం ఏర్పడుతుంది.

   ఆంధ్రప్రదేశ్, తెలంగాణా విషయాలపై ప్రశ్నలు ప్రచురించే ముందు కొంచం జాగురతతో ఉండాలని నా సూచన. లేకపోతె ఇరు వర్గాల వారు దూషించుకోవటం తప్ప ఒక మంచి చర్చ జరిగే అవకాశం తక్కువ. నేను ఇక్కడ కామెంట్లు రాయటం మొదలు పెట్టాక గమనించిన రెండు విషయాలు
   1. "1948కి ముందు మేము భారతియులము కాదు"(పాస్ట్టెన్స్) అని ఆయన అంటే, ప్రశ్నలో మాత్రం "మేము భారతియులము కాము"(ప్రసేంట్టెన్స్) అని అన్నట్లు రాసారు. నేను దానిపై నిరసన వ్యక్తం చేసిననూ ప్రశ్నను మార్చలేదు.
   2. ఈ టపాలో కెసిఆర్ ఏదో అన్నాడు అని రాసారు, అలా అనలేదని నేను విడియో చూపించాను. ఇంత వరకు మీరు ఆ విడియో పై మీ అభిప్రాయం వ్యక్త పరచలేదు.

   ఒకరు అననివి అన్నట్లుగా రాస్తే అనవసర గందరగోళం, పరస్పర దూషణలు తప్పా ఒక మంచి చర్చను ఆశించటం కష్టమే. అందుకే మీరు అన్నట్లు "అడిగనవారు వదిలేశారు. చెప్పేవారూ పట్టించుకోవడం లేదిక్కడ" జరిగింది అని నా అభిప్రాయం. ప్రశ్న సూటిగా ఉండాలి, జవాబులు కూడా సూటిగా ఉంటేనే చర్చకు పలితం ఉంటుంది. లేదంటే మీరు దేశ సరిహద్దుల గురించి ప్రశ్న వేస్తె, నిజాం మంచి వాడా లేదా, కవిత అన్నదాంట్లో తప్పొప్పులు ఏంటి, తెలంగాణా లాంటి చర్చలు జరిగాయి.

   ఈ టపా ప్రశ్నకు అవసరం లేని విషయం అయిననూ సందర్బం వచ్చింది కాబట్టి నేను ఒకటి వ్యాఖ్యానించదళిచాను. ఇదే కాకుండా మరే ఇతర విషయాలకైనా 1956 నిభందన అనేది తప్పుడు నిర్ణయం, నేను దీనిని వఎతిరేకిస్తాను. ఫీజు రిఎమ్బెస్మెంట్లాంటి పథకాలను పూర్తిగా రద్దు చేస్తే నేనే మొదటి మద్దతుదారుణ్ణి.

   Delete
  12. అవును కిరణ్ గారు. ఇక్కడి కామెంట్లు మీ సహజ శైలికి కాస్త భిన్నంగా వచ్చాయి. బహుశా ఇక్కడ చాలామందికి మీ గురించి ఎంత తెలుసో నాకు తెలీదు గానీ మీరు నాకు ప్లస్ లో తెలుసు కనుక మీపట్ల నాకో అంచనా ఉన్నది.

   ప్రశ్న ఏమిటి? :- స్థానికతని నిర్ణయించేది ఎలా? అందుకే అదే ప్రశ్నకు వెన్నెముక. అడిగినవారు కొంత గందరగోళపరచినదీ వాస్తవమే. కానీ ఆయనేమి అడిగినా నేను స్థానికతని నిర్ణయించేది ఎలా? అనేదానినే వెన్నెముకగా తీసుకుని చర్చించాలంటున్నాను. ఇది అందరికీ సూచనే తప్ప మీకు మాత్రమే సమాధానంగా గానీ మరోరకంగా గానీ చెప్పలేదు.

   ఇక మీరన్నట్లు మీరూ ఇతరులు + ప్రశ్న పంపినవారు కూడా అసలు విషయం వదిలేసి కే.సీ.ఆర్ ఏమి అన్నాడు? అన్నాడా? లేదా? ఋజువులేమిటి? ఆ ఋజువులకు విశ్వసనీయత ఏమిటి? ఏ పత్రిక విశ్వసనీయత ఎంత? ఇలా చాలా దూరం వెళ్లారనేది నా అభిప్రాయం.

   అవన్నీ ఎంత వాదించినా ఇప్పుడు తెగవు. ఎవరికి ఏమి లేదా కొన్ని వాస్తవాలు తెలిసినా ప్రస్తుత భావోద్వేగాలలో ఎటో ఓ వైపు మొగ్గు లేదా పక్షపాతంతో వాదిస్తున్నట్లుగా అనిపిస్తోంది.

   మీరడిగిన వాటికి ఆయన సరిగా లేదా సూటిగా సమాధానం చెప్పలేదు. పైగా మిమ్ములను, గుండు మధుసూధన్ రావు గారిని నిక్ నేంస్ తో వ్యాఖ్యానించడమూ పద్ధతి కాదు. కానీ ఆయన ఆ నిక్ నేంస్ తో పాటు ఇతర చర్చా చేశారు కనుక ప్రస్తుతానికి ఒకేసారి స్ట్రిక్ట్‌గా రూల్స్ పెట్టేంతగా శాసించే స్తితిలో ప్రజ బ్లాగు స్థాయి లేదు కనుక కొంత సమ్యమనం పాటించాలి. శ్రీకాంత్ చారి గారు చెప్పినట్లు ఒకేసారి కామెంట్ మోడరేషన్ లేదా కామెంట్లనన్నింటినీ ఒకేసారి డిలీట్ చేయలేము. కొంచెం కొంచెం దారిలో పెడదామండీ.

   ఆంధ్రప్రదేశ్, తెలంగాణా గురించి ప్రశ్నలుంచేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలనే మీ సూచనతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

   ఇందులో మీరు సమీక్షించుకునేదేమీ లేదు. ప్రశ్ననే తప్పనడం కాకుండా ప్రశ్న క్లారిటీగా ఉంచాలి అంటే సరిపోయేది. ప్రశ్న ఉంచాక లేదా కామెంట్ చేశాక ఎదుటివారు పద్ధతిగా ఈ టపాలో మీరడిగినట్లు లేదా ఎవరైనా ఎంత గుచి గుచి అడిగినా సరే ఓపికగా సమాధానం చెప్పగలగాలి. లేదా సోర్స్ ఇవ్వాలి. సోర్స్ ఇవ్వకపోతే నా అభిప్రాయం అనైనా చెప్పాలి.

   ఈ ప్రశ్న ఉంచినది yjs కనుక ఆయనే కే.సీ.ఆర్ ఎక్కడన్నారో ఆధారాలు చూపాలి. లేదా ఆయనే సమాధానం చెప్పాలి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ ప్రశ్నలో వెన్నెముక అంటూ ఉంటే స్థానికతను ఎలా నిర్ణయించాలి? అనేది మాత్రమే. మిగతా మేటర్ గురించి ఎవరు గింజుకున్నా తేల్చినా తేల్చకున్నా కే.సీ.ఆర్ అన్నా అనకున్నా ఆధారాలు చూపినా చూపకున్నా ప్రజలకు ఉపయోగపడేదేమీ లేదు. కానీ ఆధారాలు లేకుండా కే.సీ.ఆర్ నైనా అలా అనకూడదు. దానికి వారు సమాధానం చెప్పాలి.

   అయితే అలా ప్రశ్నలలో ఆధారం లేకుండా పంపిన వాటిపట్ల నేనేమి చేయాలనేది మాత్రం ఆలోచించాలి. పైన నేను చెప్పినది నా అభిప్రాయం మాత్రమే. నా అభిప్రాయం బ్లాగు నిర్వహణలో ప్రశ్నలు ఉంచే తీరుకు నిబంధనగా ఉంచడం పద్ధతి కాదనేది నాకు తెలుసు. కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని ఒప్పుకుంటున్నాను. ఆ విషయంలో ఇప్పటి అనుభవాలతో జాగ్రత్తలు తీసుకుంటాను. అవసరమైతే లింకులు ఆధారం చూపమని అడుగుదామనుకుంటున్నాను.

   1956 పై మీ అభిప్రాయం సరయినదే. నా అభిప్రాయమూ అదే. ఫీజు రీఎంబర్స్‌మెంటు రద్దు అంటే ప్రభుత్వమే ప్లానుడ్ గా విద్యాలయాల నిర్వహణ చేస్తే ఈ సమస్యలుండవు.

   ఈ ప్రశ్నకు కామెంట్స్ లాక్ చేయడమేనేదానిలో కూడా పైన శ్రీకాంత్ గారు చెప్పిన సూచన ఇప్పుడు మీరు చెప్పినది చూసి ఓ నిర్ణయం తీసుకుంటాను.

   స్థానికత ఎలా నిర్ణయించాలి? అనేది ప్రశ్నగా ఉంటే బాగుండేది.

   Delete
 11. కొండలరావు గారూ,

  కామెంట్లకు విషయములో ఒక టెక్నికల్ సూచన. మీ పోస్టుల్లో కామెంట్లు కొన్ని సార్లు వందలు దాటుతున్నాయి. అవి లోడవ్వడం దగ్గరనుండి చదవడం వరకూ ఇబ్బందిగానే ఉంటోంది. కాబట్టి కామెంట్లు 100 దాటితే వేరే పేజీలోకి వెల్లే విధంగా సెట్టింగ్స్ చేయొచ్చేమో చూడండి. ఎవరైనా కావాలనుకుంటే, అన్ని కామెంట్లూ ఒకే పేజీలో చూడొచ్చు లేదా వివిధ పేజీలలో చూడొచ్చు.

  అలానే కామెంట్లకు నంబర్స్ ఉండేలా చూడండి. అది చాలా సౌలభ్యంగా ఉంటూంది. ఉదాహరణకి, నేను మొదట పెట్టిన కామెంట్ కి "1". దానికి ఎవరైనా రిప్లై ఇస్తే .. దానికి 1-1 , 1-2 లేదా 2-1, 3-2, (రెండవ వ్యాఖ్యకి వచ్చిన మొదటి రిప్లై, మూడవ కామెంటుకు వచ్చిన రెండవ రిప్లై )అనే నంబరింగ్ వచ్చేలా చేయగలిగితే చాలా బావుంటుంది అన్నది నా అనుకోలు.

  ReplyDelete
  Replies
  1. మీ సూచన బాగుంది. అదెలా చేస్తారో నాకు తెలీదు. ఎక్కడైనా ఉన్నది మోడల్ ఇవ్వగలరా?

   Delete
  2. This comment has been removed by the author.

   Delete
  3. 7 రోజుల క్రితం టపాలకైతే కామెంట్ మోడరేషన్ ఉన్నది. కొత్తవాటికి లేదు. ఏ వ్యక్తిపరంగా ప్రజలో ఏ విషయంలోనూ ప్రత్యేకతలు కోపతాపాలూ ఉండవు శ్రీరాం గారు. ఏదైనా ఉంటే మీరన్నట్లు టెక్నికల్ నిబంధనలు లేదా ప్రజ పరంగా ఏర్పరచుకున్న పాలసీకి సంబంధించే ఉంటుంది. అంతకుమించి ఉంటే మీ సూచనలు ఏ విషయంలోనైనా నిరభ్యంతరంగా మెయిల్ చేయవచ్చు ఎప్పుడైనా.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top