జనసేన అధినేత పవన్‌పై మరో వివాదం

హైదరాబాద్‌, ఆగష్టు 28 : జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్‌ కళ్యాణ్‌పై మరో వివాదం రేగింది. మహాత్మాగాంధీని కించపరిచారంటూ పవన్‌పై ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఫేస్‌బుక్‌లో పవన్‌ ఫోటోతో ఉన్న రూ.50 కరెన్సీ నోటును ఎవరో పోస్ట్‌ చేశారు. వందేళ్ల క్రితం పవన్‌ జన్మించి ఉంటే మన పచ్చ నోటు నిజంగా ఇలా ఉండేదని ఫేస్‌బుక్‌లో కామెంట్‌ చేయడం వివాదానికి కారణమైంది. మహాత్మాగాంధీని కించపరిచారంటూ ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో బాలరాజు, అరుణ్‌ అనే న్యాయవాదులు ఫిర్యాదు చేశారు.
(From andhrajyothy daily)

Reactions:

Post a Comment

 1. గాంధీ సంగతి తరువాత, పవన్ కళ్యాణ్ అభిమానుల పిచ్చి మాత్రం ముదిరింది.

  ReplyDelete
 2. అభిమానుల పిచ్చి వలన చిక్కులా?
  పిచ్చి అభిమానుల వలన చిక్కులా?

  ReplyDelete
 3. జనానికిప్పుడు అభిమానాలు స్థాయి దాటి పిచ్చి స్థాయికి చేరుకున్నాయి . మతాభిమానం,కులాభిమానం,వ్యక్తిగత అభిమానం...ఇలా అన్నీ పీక్ లోకెళ్ళి పిచ్చిగా స్థిరపడుతున్నాయి

  ReplyDelete
 4. థియేతర్ దగ్గర సినిమా పోస్తర్ ముందు జంతు బలులు ఇచ్చినప్పుడే వీళ్ళ వెఱ్ఱి ఏమిటో అర్థమైపోయింది. గుడిలో దేవుని బొమ్మని తీసేసి పవన్ కళ్యాణ్ విగ్రహాణ్ణి, చర్చిలో పవన్ కళ్యాణ్ ప్రతిరూపం ఉన్న శిలువనీ పెట్టే రకాలు వీళ్ళు.

  ReplyDelete
 5. అదంతా అలా ఉంచండి.
  ముందు ఈ విషయం చూదాం.
  ఈ వ్యవహారంతో స్వయంగా పవన్ కల్యాణ్‍కు సంబంధం ఏమిటీ?
  అటువంటప్పుడు, "పవన్‌ కళ్యాణ్‌పై మరో వివాదం" ఆనటం ఎందుకూ చెప్పండీ?

  ReplyDelete
  Replies
  1. వివాదిత ఫోటో పవన్ కళ్యాణ్ పార్టీ సైటులో వేసారని విన్నాను. (ఒకవేళ ఇది నిజమయితే) దీనికి నాకు సంబంధం లేదని అతను అనలేడు.

   అయితే ఈ విషయాన్ని మనం చర్చించడం అక్కరలేదు. అనవసరంగా దీనికి పబ్లిసిటీ ఇచ్చినట్టవుతుంది.

   Delete
 6. గాంధీ మీద కూడా పరువు నష్టం దావా వెయ్యాలి ఎందుకంటే మూడు సింహాల గుర్తు తీసేసి గాంధీ బొమ్మ పెట్టినందుకు, అది మూడు సింహాల గుర్తును అవమాన పరిచినట్టు కాబట్టి!
  అసలు ముందుగా అసలు మనం చెయ్యల్సింది గాంధీ బొమ్మ తొలగించి ప్రతీ పర్వదినాన్ని పురస్కరించుకుని వేరే వేరే గుర్తులతో ధనాన్ని ముద్రించాలి, అప్పుడే నకీలీ తగ్గుతుంది!

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top