సమైక్యవాదికి టికెట్టా?: టీఆర్‌ఎస్‌
హైదరాబాద్‌/నర్సాపూర్‌, ఆగస్టు28 (ఆంధ్రజ్యోతి) : తొలినుంచీ సమైక్యవాదిగా ఉన్న జగ్గారెడ్డికి మెదక్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎలా కల్పించారని బీజేపీని.. టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అలాంటి పార్టీకి.. తమ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. మరోసారి కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గువ్వల బాలరాజుతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌కి అడ్రసే లేదని, అలాంటి పార్టీకి ప్రజలు ఓటు వేయబోరని కవిత ఎద్దేవా చేశారు. కాగా, మెదక్‌ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న జగ్గారెడ్డి పచ్చి ద్రోహి అని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి విమర్శించారు. బీజేపీకి పోటీ చేసే అభ్యర్థి దొరక్క చివరకు కాంగ్రెస్‌ నుంచి జగ్గారెడ్డిని అద్దెకు తెచ్చుకున్నారన్నారు. గురువారం మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా నిర్వహించిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల పేరిట కాంగ్రెస్‌ బ్రోకర్లు పెద్ద ఎత్తున దండుకున్నారని సీఐడీ విచారణలో అక్రమార్కులని తేలిన వారిని ఎవరినీ వదిలేది లేదని అందరినీ లోపలికితోస్తామన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఓ బచ్చా అని విమర్శించారు. ‘కేసీఆర్‌ కొడుకంత కూడా లేడు కేసీఆర్‌పై నోరు పారేసుకుంటున్నాడు’ అని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ సునీతారెడ్డిని బలికా బక్రా చేసిందన్నారు. మెదక్‌ పార్లమెంటు ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ను గుండెలకు హత్తుకుని గెలిపిస్తారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌ గౌడ్‌ పేర్కొన్నారు. సచివాలయంలోని మీడియాపాయింట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఇమేజ్‌ దెబ్బతీసేలా, ఇక్కడికి పరిశ్రమలు రాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఆటంకం కలిగించేలా విమర్శలు చేస్తున్నవారిని బహిష్కరించాల్సిన అవసరముందన్నారు. ఓయూ తెలంగాణ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్‌ బాల్‌రాజ్‌యాదవ్‌ మాట్లాడుతూ తాము మెదక్‌లో టీఆర్‌ఎస్‌కు మద్దతునిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ వ్యతిరేకి అయిన జగ్గారెడ్డికి టికెట్‌ ఇచ్చిన బీజేపీకి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ విమర్శించారు. వీరసమైక్యవాది జగ్గారెడ్డికి మెదక్‌ ఎంపీ టికెట్‌ ఎలా ఇచ్చారని టీఆర్‌ఎస్‌ నాయకుడు, మాజీ ఎంపీ మందా జగన్నాథం టీడీపీ, బీజేపీలను ప్రశ్నించారు. గురువారం తెలంగాణ సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగ్గారెడ్డికి ఎంపీ టికెట్‌ ఇచ్చి అమరుల త్యాగాలను బీజేపీ, టీడీపీలు కించపరిచాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును విమర్శించే స్థాయి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి లేదన్నారు. ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని ికిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలకు ఆయన సూచించారు. 
From andhrajyothy daily
Reactions:

Post a Comment

 1. నేను ఇప్పుడు మా పిన్నిగారి ఇంట్లో ఉన్నాను. సమైక్యవాదైన జగ్గారెడ్డికి తెలంగాణలో తికెత్ ఇవ్వడంపై ఆంధ్రాలో కూడా నవ్వుకుంటున్నారు.

  ReplyDelete
  Replies
  1. ఒక సమైక్యవాదికి తెలంగాణాలో టికెట్టు ఇచ్చినందుకే నవ్వు వస్తోందా?మరి సమైక్యవాది అయిన దాశరధికి విగ్రహం లేదని అంగలారుస్తుండటం చూస్తుంటే నాకు నవ్వాలో యేడవాలో అర్ధం కావడం లేదు, యేం చేస్తాం?నిజాము రాజు తరతరాల బూజు అని తిట్తిన దాశరధికీ గోరీలు కడ్తమురో అని నిన్నటివాళ్ళు చెడతిట్టిన నిజామునీ పక్క పక్కనే టాంకుబండు మీద నిలబెట్టే దృశ్యం తల్చుకుంటే నాకూ నవ్వాగడం లేదు!?

   Delete
  2. జగ్గారెడ్డికి తికెత్ ఇవ్వాలనుకుంటే ఏ విజయవాడ నుంచో అది ఇవ్వాలి కానీ కె.సి.ఆర్. సొంత నియోజకవర్గం నుంచి ఇస్తే నవ్వు రాదా?

   Delete
  3. సూరనేని గారు,

   విశాలాంధ్ర ఏర్పడ్డ దశలో చాలామంది ఎంతో గొప్ప ఆశావాదంతో చాలామంది సమైక్య వాదులుగానే వున్నారు. అందులో ఎక్కువమందికి 1969 లో భ్రమలు తొలగిపోయాయి. మిగిలిన వారిలో ఆలోచనల్లో కూడా 2001లో, 2009లో గుణాత్మకమైన మార్పు వచ్చింది.

   చరిత్రలో ఏదో ఒక సమయంలో సమైక్య వాదిగా ఉన్నవ్యక్తి ఎల్లప్పటికీ సమైక్యవాదేనని ముద్ర వేయలేం. చివరికి కెసిఆర్ కూడా ఒకప్పుడు సమైక్యవాదే కావచ్చు గాక.

   2009లో కాంగ్రెస్ ప్రకటన దరిమిలా తెలంగాణాకు చెందిన కాంగ్రెస్, బిజెపి, సిపిఐ, చివరికి సిపియం నాయకులు కూడా ప్రత్యేక తెలంగాణా వాదాన్ని వ్యతిరేకించని సమయంలో కూడా సీమాంధ్ర నాయకుల అడుగులకు మడుగు లొత్తుతూ గుడ్డి సమైక్య వాదాన్ని ప్రదర్శించిన వ్యక్తి జగ్గారెడ్డి. ఆ విషయం పైనే, అప్పటివరకు ఆయనకు తిరుగులేని సంగారెడ్డిలో కూడా ఓడించి ఆయనకు గట్టిగానే జనం బుద్ధి చెప్పారు.

   తెలంగాణా పోరాటంలో తనకంటూ ఒక చరిత్ర గలిగిన బిజెపి అటువంటి వ్యక్తిని అభ్యర్థిగా పెట్టి ఏవిధంగా గెలవగలనని అనుకుంటుందో అని అలోచించి నప్పుడు సీమాంధ్రులకు కూడా నవ్వు వస్తే ఆశ్చర్య మెందుకు?

   నిజామును బూజు అని తిట్టిన దాశరథి ఈరోజు గనక వుంటే ఇంకా చాలామంది అంతకన్నా కరడుగట్టిన వలస బాబుల బూజు దులిపేవాడేమో ఎవరికి తెలుసు?

   దుర్మార్గాలు చేసిన వారికి అవసరం మేరకు గోరీలు కట్టడమో, పొలిమేర అవతలికి తరిమి కొట్టడమో... అలాగే చేసిన మేలు మేరకు నెత్తికెత్తుకొవడమో... విగ్రహాలు పెట్టుకోవడమో... రెండూ చేయగలరు తెలంగాణా ప్రజలు.

   Delete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top