క్రింది న్యూస్ కొమ్మినేని శ్రీనివాసరావు గారి వెబ్‌సైట్లోనిది. ఒరిజినల్ లింకు కోసం క్రింద చూడండి. ఇదే నిజమైతే తెలంగాణాలో ఆంధ్రజ్యోతిని బేన్ చేసినట్లే అక్కడ సాక్షిని, నమస్తే తెలంగాణాని బేన్ చేస్తున్నట్లే కదా? ప్రభుత్వాల ఈ పోకడలు ఎటు దారి తీస్తాయి? వార్తా పత్రికలు ఎంతమేరకు సమన్వయం కోల్పోతున్నాయి? ఇటువంటి వ్యవహారంలో రావలసిన మార్పులేమిటి?


For original link please click on below image


Reactions:

Post a Comment

 1. మీరు ప్రశ్నించే పద్ధతిలోనే ఏదో తేడా కనపడుతోంది. కొమ్మినేని ఆంధ్రజ్యోతి ప్రస్తావన తేలేదు. ఆంధ్రజ్యోతిని పత్రికా సమావేశాలనుండి తెలంగాణా ప్రభుత్వం ఎప్పుడూ బహిష్కరించ లేదు.

  మీరు ఎమ్మెస్వొల బ్యాన్ ను దృష్టిలో పెట్టుకున్నట్టైతే... T న్యూస్, V6 చానెళ్ళు సీమాంధ్రలో ఎందుకు టెలికాస్ట్ కావడం లేదో చెప్పగలరా?

  మీరు వుంచిన కొమ్మినేని వ్యాసంలో కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న బ్యాన్ గురించి వుంది. కెసిఆర్ పై, లేదా తెలంగాణా ప్రభుత్వపు విధానాలపై ఏదైనా వార్త (ఆరోపణ) వస్తే సూటిగా ప్రశ్నించే మీరు ఎందుకనో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆరోపణలను మాత్రం అంతే సూటిగా ప్రశ్నించడం లేదు. ఈ ప్రశ్నలో తెలంగాణా ప్రభుత్వాన్ని కూడా జోడించడంలో గల ఔచిత్యం ఏమిటో చెప్పగలరా? ఆ తర్వాత సమంజసాసమంజసాల గురించి మాట్లాడు కోవచ్చు.

  ReplyDelete
  Replies
  1. ట్-న్యూస్, వి6 చానెళ్లు ఎందుకు ప్రసారం కావడం లేదో నాకు తెలీదు. మీరు చెపితే నా అభిప్రాయం చెప్తాను.

   కొమ్మినేని ప్రస్తావించినమేరకే నేను ప్రశ్న అడగాలని ఏమి లేదు. నా ఉద్దేశం ప్రభుత్వాలు తమకు ఇష్టం లేని పత్రికలను లేదా చానళ్లను బేన్ చేయడం ఒక పక్క జరుగుతుంటే, మరో పక్క పత్రికలు తమకు నచ్చిన వారిని మోస్తూ న్యూస్ వ్యూస్ వెలువరించడం ఈ రెండింటిపైనా ఎక్కడో ఓ చోట మాత్రం సరిదిద్దే కార్యక్రమం ప్రారంభం కావాలి.

   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై నేను సూటిగా ప్రశ్నించడానికి భయమేమీ లేదు. కాకుంటే నేను తెలంగాణాలో ఉంటున్నాను కనుక, ఇక్కడి నిర్ణయాలే ఎక్కువ నాపై ప్రభావితం చూపడం సహజం. అయినా ఆ విషయంలో మీకు స్వేచ్చ ఉంది కదా? మీరేదైనా సూటిగా అడిగదలచుకుంటే నేనెప్పుడైనా ప్రశ్న పబ్లిష్ చేయకుండా ఉంచానా? ఇందాకే ఇంకొకరు నన్నడిగారు. ప్రజలో నా అభిప్రాయాలే అడుగుతున్నానని. నేను నా అభిప్రాయాల ప్రకారమే ప్రశ్నలు అడగగలను తప్ప ఇతరుల మనసులలో దూరి అడగలేను. ఆ అవసరమూ లేదు. అది మంచిది కూడా కాదు. నా అభిప్రాయాలే రైటని, మీ అభిప్రాయాలను చర్చించనీయకుంటే మాత్రం తప్పు.

   ఇక్కడ బ్లాగులోకంలో ఒకాయనకు కే.సీ.ఆర్ ని, మరోకరికి బీ.జే.పీని, ఇంకొందరికి కమ్యూనిస్టులని .... ఇలా విమర్శిస్తే కోపం వస్తుంటాయి. విమర్శలకు కోపపడితే లాభం లేదు. కించపరస్తేనే కోపం రావాలి.

   ప్రజలో అందరికీ సమానంగా ఉన్న సౌకర్యం ఏమిటంటే వారి అభిప్రాయాన్ని ప్రశ్నగా ఇతరులను కావాలని కించపరచకుండా కామెంటుగానూ ఉంచే అవకాశం ఉన్నది. అందరితో పాటు నాకు ఆ సౌకర్యమే ఉన్నది. నేనెలా ఆ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నానో ఇతరులూ అవే సౌకర్యాలను వినియోగించుకోవచ్చు. నాకు తెలిసి నేను ఏ ఒక్కరి ప్రశ్నను పబ్లిష్ చేయకుండా ఉంచలేదు.

   Delete
  2. మీకు తెలంగాణా ప్రభుత్వం ఆంధ్రజ్యోతి చానేల్ ను బేన్ చేయలేదని విశ్వాసం ఉన్నది. నాకు ఎమ్మెస్వోలతో కే.సీ.ఆరే ఆ పని చేయించాడని విశ్వాసం ఉన్నది. అక్కడ కూడా కొమ్మినేని అట అంటూ చెప్పారే తప్ప ఆధారాలు చూపలేదు. రెండు చోట్లా ఆధారాలు లేకున్నా రెండు చోట్లా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయనే నేను నమ్ముతున్నాను. మరో విషయం ఆంధ్రజ్యోతి కే.సీ.ఆర్ పై విషం కక్కుతూ చంద్రబాబుని ప్రమోటి చేయాలని ఎలా చూస్తుందో, సాక్షి అంతకంటే ఘోరంగా బాబుకు వ్యతిరేకంగా జగన్ కు బాకాగా ఉంటోందనేది మరవకూడదు. ఇక నమస్తే తెలంగాణా గురించి ప్రత్యేకంగా వ్యాఖ్యానించాల్సిందేమీ లేదు. ఇలా పత్రికలు కూడా కొన్ని పార్టీల కరపత్రాలుగా మారడం పత్రికా స్వేచ్చ అవుతుందా? ఈ రెండింటి విషయంలోనూ మార్పులు రావాలన్నదే నా పాయింట్. మిగతా ప్రశ్నలో కొద్దిపాటి వంకరలున్నా నాకు ఇతరుల్లా ప్రత్యేక చూపులేమీ లేవు. నా ప్రశ్న గోల్ ప్రభుత్వాలు పత్రికలపైన నిరంకుశంగా వ్యవహరించడం - పత్రికలు కొందరికి తొత్తులా ఉంటూ ఇతరులపై వ్యతిరేకంగా వార్త్లౌ వ్యూస్ వ్రాయడం పైనా మార్పులు రావాలని. ఈ అంశంపై అభిప్రాయాలు వస్తే చాలు. మిగతా తెలంగాణా- ఆంధ్రా ప్రభుత్వాల భజనలు - వ్యతిరేకతలు పక్కన పెడదాం.

   Delete
  3. కొండలరావు గారు

   ఇదే నిజమైతే తెలంగాణాలో ఆంధ్రజ్యోతిని బేన్ చేసినట్లే అక్కడ సాక్షిని, నమస్తే తెలంగాణాని బేన్ చేస్తున్నట్లే కదా?

   పై వాక్యం తెలంగాణా, ఆంద్ర ఒకే రకమైన బ్యాన్ విధించాయన్న అర్థం కలిగిస్తుంది. అది వాస్తవం కాదు. ఒకటి ఎం ఎస్ వోలు ప్రసారాల మీద బ్యాన్ విధించడం అయితే, మరొకటి ప్రభుత్వ అధికారిక ప్రెస్ మీట్ లకు విలేకరులను బహిష్కరించడం. కొమ్మినేని గారు "అట" అని చెప్పింది కేవలం "అనుమతి లేదు" అని చెప్పిన విషయం లో. వారిని లోనికి రానివ్వక పోవడాన్ని ఆయన స్పష్టంగానే చెపుతున్నారు.

   ఒక వేళ మీరు విశ్వసిస్తున్నట్టు MSO ల బ్యాన్ వెనుక కెసిఆర్ హస్తం ఉన్నప్పటికీ అవి రెండు వేరు వేరు విషయాలు. అవి రెండిటిని ఒక గాటిన కట్టి ప్రశ్నించడం నాకు అసంబద్ధంగా తోచింది. అంతకు మించి మీ ప్రశ్నించే హక్కును నేను ప్రశ్నించడం లేదు సార్.

   Delete
  4. శ్రీకాంత్ చారి గారు, మీ సూచనలో న్యాయం ఉన్నది. అయితే నా టార్గెట్ వేరు కనుక నేనది లోపంగానో మీరనుకున్నవిధంగా కావాలనో ప్రశ్నించలేదు. మీరన్నట్లు అవి రెండు వేరు వేరు విషయాలు. నేననుకున్నదేమో పత్రికా స్వేచ్చ పేరుతో పెట్టుబడిదారులు పత్రికలనడ్డంపెట్టుకుని చేస్తున్న విషభావాల వీరంగం , దానిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు అహంకారంతో రాజ్యాంగయంత్రాన్ని ఉపయోగించడమనే రెండు తప్పులను చర్చకు పెట్టడం. అది కాస్తా ఇప్పుడున్న ఆంధ్రా-తెలంగాణా దురభిమానాల నేపథ్యంలో ప్రతీదీ కొంచెం ఎక్కువగా బూతద్దంలో చూస్తున్న తరుణంలో తూకం వేసి మరీ చర్చించాల్సి వస్తున్నదనుకుంటాను. నాకైతే చంద్రబాబు ఇరగదీస్తాడు కే.సీ.ఆర్ మూర్ఖుడన్న భావనైతే లేదు. కాకుంటే నేనున్నది తెలంగాణాలో కనుక నా టార్గెట్ ఎక్కువగా కే.సీ.ఆర్ పైననే ఉంటుంది. ఇది అత్యంత సహజమైన విషయం. నా అంచనా నిజమైతే తెలంగాణాలో జరిగితే అద్భుతాలు జరగాలి లేకుంటే తుగ్లక్ పాలనలా మిగలాలి. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖాయం. ఇది ప్రజల కోణంలోనుండి ప్రేమతో అనేదే తప్ప నేను కే.సీ.ఆర్ ని టార్గెట్ చేసినంత మాత్రాన అతను తుగ్లక్ అయిపోడు. మన నోటిదూల వాక్యంగా మిగలడం తప్ప. ఒక్కటి మాత్రం చెప్పగలను ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరచేలా కామెంట్లు లేదా చర్చలు చేయలేము. jvrao గారికి ఇదే బ్లాగు తెలంగాణా వారి ప్రయోజనాలకొసం ప్రశ్నలడుగుతున్నట్లుగా కనిపిస్తున్నది. మీకేమో కే.సీ.ఆర్ ని టార్గెట్ చేసుకున్నట్లుగా కనిపిస్తుందనుకుంటాను :) ( అందులో కొంత వాస్తవం ఉన్నది కూడా). ఇంకొందరికేమో BJP ని టార్గెట్ చేసున్నట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ నన్ను విమర్శించేవారందరికీ ఓ విజ్ఞప్తి ఏమిటంటే : నేను నా అభిప్రాయాలు , అంచనాల మేరకే ప్రశ్నలడుగుతాను. అభిప్రాయాలు వ్యక్తం చేస్తాను. కావాలని ఎవరినైనా కించపరిస్తే ఆత్మవిమర్శ చేసుకోవడానికి వెనుకాడను. నేనున్నట్లుగానే మిగతావారుండడానికి ప్రయత్నిస్తే ప్రజ వారికెప్పుడూ ఆటంకం కలిగించలేదు. ఎవరైనా మోడీని ఆకాశానికెత్తే ప్రశ్నలు న్యాయమైనవై పంపితే నేను పబ్లిష్ చేస్తాను. ఆంధ్రా ప్రభుత్వమేదైన తుగ్లక్ చర్యలు ప్రజలకు వ్యతిరేకంగా చేస్తే నేను ప్రశ్నించకపోతే మీవంటివారు పంపితే పబ్లిష్ చేస్తాను. ప్రవీణ్ ఎన్ని ప్రశ్నలు పంపినా (అందులో కొన్ని బాగుంటాయి. కొన్ని నాసిరకమైనవి ఉంటాయి) పబ్లిష్ చేస్తూనే ఉన్నాను. ఇక్కడ ప్రవీణ్ ని ఎందుకు ఉదహరించానంటే ప్రవీణ్ దగ్గర పెద్దగా హిడెన్ ఎజెండా ఉండదు. అతను ప్రజ ద్వారా ప్రశ్నలు పంపడంలో అందరికంటే ముందున్నాడు. ఆ సౌకర్యాన్ని ఇతరులు ఉపయోగించుకోకుండా నేనేదో ప్రవీణ్ ని ఎక్కువగా సమర్ధిస్తున్నాననేవారినీ చూశాను. నాకైతే ప్రవీణ్ అభిప్రాయాలతో ఎక్కువ శాతం వ్యతిరేకతే ఉంటుంది. ఆ విషయం ప్రవీణ్ కి కూడా తెలుసు. అంతమాత్రాన అతని భావ ప్రకటను తొక్కేయకూడదు కదా? ప్రవీణ్ అభిప్రాయాలతో నేను అత్యధికం విభేదించినా అత్యధికమైన ప్రశ్నలు ప్రజలో ప్రవీణ్ వే ఉన్నాయి. ఇదొక్క ఉదాహరణ చాలు ప్రజ నిష్పక్షపాతంగా ఉంటుందనడానికి. ప్రజ వేరు అందులో నా అభిప్రాయాలు వేరు అని గుర్తించాలని మనవి. నా అభిప్రాయాలే శాసనాలని నేనలేదు.అనుకోను. కొంచెం ఎక్కువ వివరణ అయినందుకు సారీ.

   మరో విషయం ఇక్కడ మీ కామెంట్లో ఓ వాక్యం బోల్డ్‌గా వచ్చింది అలా రావాలంటే ఏమి చేయాలి?

   Delete
  5. మరో విషయం ఇక్కడ మీ కామెంట్లో ఓ వాక్యం బోల్డ్‌గా వచ్చింది అలా రావాలంటే ఏమి చేయాలి?

   < b > మీరు రాయదలుచుకున్న వాక్యం < / b > ==> Please remove the extra spaces in < b > and < / b >

   అలాగే ఇటాలిక్ లో రాయాలి అంటే
   < i > మీరు రాయదలుచుకున్న వాక్యం < / i > ==> Please remove the extra spaces

   ఈ రెండు జోడించి రాయచ్చు
   < b >< i > మీరు రాయదలుచుకున్న వాక్యం < / i > < / b >
   =========
   For example:
   < b > మీరు రాయదలుచుకున్న వాక్యం < / b > ==> మీరు రాయదలుచుకున్న వాక్యం
   < i > మీరు రాయదలుచుకున్న వాక్యం < / i > ==> మీరు రాయదలుచుకున్న వాక్యం
   < b >< i > మీరు రాయదలుచుకున్న వాక్యం < / i >< / b > ==> మీరు రాయదలుచుకున్న వాక్యం

   Delete
  6. వివరణకు ధన్యవాదములు YJs గారు.

   Delete
  7. కొండలరావు గారు,

   నా అభిప్రాయం ప్రకారం ప్రశ్న సూటిగా వుండాలి. దొంక తిరుగుడుగానో కలగాపులగం గానో వుండకూడదు. అలా వుంటే సమాధానం కూడా అంటే దొంకతిరుగుడుగాను, కలగాపులగం గాను మారి పోతుంది. ఒకోసారి సమాధానం చెప్పడం అసాధ్యం కూడా కావచ్చు.

   ఒక ఉదాహరణ చెపుతాను. నేను సోవియట్ భూమి కమ్యూనిజం ప్రచారాన్ని, కొన్ని పచ్చ పత్రికల తెలుగుదేశం ప్రచారాన్ని పోల్చినపుడు ఆ పోలిక సరికాదని మీరే అభ్యంతరం చెప్పారు. అంటే రెండూ ప్రచారం చేసుకున్నా, వాటిలో పూర్తి సామ్యం లేదు కాబట్టి పోలిక సరికాదు అని మీ వాదన. ఉదాహరణ మాత్రానికే అసంబద్ధమైన పోలిక సరికానప్పుడు, అటువంటి పోలికతో కూడిన ప్రశ్న ఎలా సంబద్ధమవుతుంది?

   ఇక బ్యాన్ విషయానికి వస్తే అది కేవలం ఏమ్మేస్వోలు చేసింది తప్ప ప్రభుత్వ ప్రమేయం లేదు అనే దానికి నేను జై గారు రకరకాల ఆధారాలను ఇచ్చాం. అవి మీరు చూడక పొతే ఇక్కడ మరోసారి పునరుక్తి చేస్తాను.

   1. కెసిఆర్ కన్నా కేంద్రం ఎక్కువ బలమైనది. కెసిఆర్ కి భయపడి బ్యాన్ చేసిన ఎం ఎస్ వోలు అంతకన్నా పెద్ద కేంద్ర ప్రభుతం చెప్పినా వినరా?
   2. కులదీప్ సహాని బిజెపి నాయకుడు. అతడు కేంద్రంలో అధికారంలో వున్నతమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కెసిఆర్ మాటలు ఎందుకు వింటాడు?
   3. దీనిలో కెసిఆర్ తప్పో, ప్రమేయమో వుంటే అది కోర్టులో ఎందుకు రుజువు కాలేదు? తమని కెసిఆర్ బెదిరించాడని (రాధాకృష్ణ తన పత్రికలో రాసినట్టు) ఎం ఎస్ వోలు కోర్టుకు నివేదించుకోవచ్చు కదా? కోర్టు రక్షణను కోరవచ్చు కదా?

   ఎం ఎస్ వొల బాన్ వెనుక కెసిఆర్ ఉన్నాడన్న మీ విశ్వాసానికి మీరు ఎలాంటి ఆధారాలు చూపలేదు సరికదా అదే విశ్వాసాన్ని మరొక ప్రశ్నలో కూడా జోడించడం, అది ప్రశ్నిస్తే మేం ఏదో కెసిఆర్ మీద ఈగ వాలనీయడం లేదని ఆరోపణలు ఎందుకు?

   నష్టాలకోర్చి సోవియట్ భూమి తన దేశ ప్రచారం చేసుకున్నట్టే, బ్యాన్ చేస్తున్నా నష్టాలు వస్తున్నా ఆంధ్రజ్యోతి తన పార్టీ ప్రచారం మానడం లేదు కదా? అని ప్రశ్నిస్తే ఎలావుంటుందో ఆలోచించండి.

   ఇక బోల్డుగా రావడం గురించి YJs గారు చెప్పారు.

   Delete
  8. శ్రీకాంత్ చారి గారు, ప్రశ్న సూటిగా ఉండడమనేది కాస్త నైపుణ్యం ఉంటేనే సాధ్యం. సూటిగా లేకున్నా డొంకతిరుగుడుగా మాత్రం ఉండకూడదు. ఈ ప్రశ్నసూటిగా లేకపోవడం + లోపాన్ని ఆల్రెడీ అంగీకరించి అలా ఎందుకు జరిగిందో నా అసలు ఉద్దేశం ఏమిటో మీకు ఈ ప్రశ్నకు గల కామెంట్లలోనే వివరించాను. మళ్లీ దానిగురించే అడిగడం విశాలత్వం తగ్గి ఇరుకుగా ఆలోచించడమవుతుందనిపిస్తోంది.

   చిత్తశుద్ధితో ఆలోచిస్తే రాష్ట్రంలో ప్రముఖ చానల్ ను ఎమ్మెస్వోలు బేన్ చేశాక కే.సీ.ఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమొక్కటి చాలు ఆధారంగా. పల్లెటూరిలో కూడా ఈ గొడవపై కనీస పరిజ్ఞానం ఉన్నవారు సైతం కే.సీ.ఆర్ తో పెట్టుకుంటే ఏంజరుగుతుందో రాధాకృష్ణకు తెలిసి వచ్చిందంటున్నారే తప్ప ఎమ్మెస్వోలు అంటే ఎవరు అనేది కూడా చాలామందికి తెలీదు.

   కే.సీ.ఆర్ అండ ఉంది కనుకనే కేంద్రం చెప్పినా ఎమ్మెస్వోలు వినడం లేదనేది నా అభిప్రాయం.ఇంత రాద్ధాంతం జరుగుతున్నా కేవలం ఎమ్మెస్వోల స్థాయిలో ఆ స్థాయిలో పట్టుదలగా ఉంటారని నేను అనుకోవడం లేదు. నేనే కాదు కాస్త విశాలంగా ఆలోచించినవారేవరైనా జరుగుతున్న పరిణామాలను బట్టి అదే అంచనాకు వస్తారనే అనుకుంటున్నాను. ప్రజలలో ఇది ఎమ్మెస్వోలకూ + రాధాకృష్ణకు గొడవలా చర్చించడం లేదు. రాధాకృష్ణ ఓవరేక్షన్ కు కే.సీ.ఆర్ సరైన ట్రీట్మెంట్ ఇచ్చారనుకుంటున్నారు. కానీ ఇది కేవలం రాధాకృష్ణ సమస్య కాదు. భావ ప్రకటనా స్వేచ్చ సమస్య. ఆంధ్రజ్యోతి చానెల్ నడవకపోతే ప్రజలకేమీ అద్భుతమైన విజ్ఞానం లేదా చైతన్యపరచే కార్యక్రమాలేవీ ఆగిపోవు. కానీ ప్రభుత్వాల వైఖరి ఇలా ఉండడం వల్ల పత్రికలలో మార్పు రాకపోగా నియంతృత్వం పెరగడానికి దారి తీస్తుంది. అదే సందర్భంలో పత్రికా స్వేచ్చ అనేదానికి అర్ధాన్ని వివరించాల్సిన అవసరం ఉన్నది. దానికై విస్తృతంగా చర్చలు నడవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎవడికి వాడు పత్రికాస్వేచ్చ అంటూ తమకు అనుకూలంగా వాదిస్తున్నారు. నాకు తెలిసి పత్రికలకు పౌరులకు మించిన స్వేచ్చ అనేది ప్రత్యేకంగా ఉండాల్సిన అవసరం లేదు. హక్కులున్నప్పుడు బాధ్యతలూ ఉండాలి. ఇవి రెండూ సమానంగా ఉండేలా చర్యలుండాలి ఎక్కడైనా.

   బీ.జే.పీ వారు లేదా కేంద్ర ప్రభుత్వం ఏమి చెపుతున్నారో అనేదానిని బట్టి పోల్చుకుని అంచనాకు రావడం కన్నా జరుగుతున్నదాని ప్రకారం అంచనాకు రావాలి.

   కోర్టులు కేవలం సాక్ష్యాధారాలను బట్టే తీర్పులు ఇస్తాయి. ఓ కోర్టు తీర్పుని పైకోర్టు కొట్టివేయవచ్చనేది మనకు తెలిసిందే. కోర్టులో తీర్పు ఉంటే న్యాయంగా ఉండొచ్చేమోగానీ ధర్మంగా ఉండే అవకాశాలు బహు తక్కువ. కోర్టులు - ప్రభుత్వాల కంటే ప్రజాతీర్పే మెరుగైనది. ప్రజల విశ్వాసం - నమ్మకమే మెరుగైనది. ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం చూరగొనేలా పరిపాలించాలి. కే.సీ.ఆర్ ప్రభుత్వం అయినా బాబు ప్రభుత్వం అయినా తమకు అనుకూలంగా లేని పత్రికలపట్ల అనుచిత వైఖరినే ప్రదర్శిస్తున్నాయనేదానిలో నాకైతే ఆవగింజంతైనా అనుమానం లేదు. అదే సందర్భంలో ఇంతకంటే కీలకమైనది పత్రికల విషప్రచారం గురించి ప్రస్తుతమైతే పత్రికల విశ్వసనీయత బాగా తగ్గింది కానీ పత్రికల ప్రచారానికి ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. అది బాగా దుర్వినియోగమవుతుందనేది నిజం. కే.సీ.ఆర్ అసెంబ్లీలో చర్చించినప్పుడు ఇదే బ్లాగులో చాలామంది వ్యతిరేకించినా నేను కే.సీ.ఆర్ ను సమర్ధించాను. ఆ విషయం కావాలని మరచిపోతే మాత్రం నన్ను అనుమానించేందుకు అవకాశం ఉంటుంది. ఏ విషయానికావిషయంగానే చూడడం మంచిది తప్ప వ్యక్తిగత రాగద్వేషాలకు లోనైతే అది బాకా అవుతుంది తప్ప చర్చ కాదు. అలాంటి చర్చలవల్ల ప్రయోజనం లేదు.

   మీరు ఎమ్మెస్వోల నిర్ణయాన్ని అంగీకరిస్తున్నారా? తప్పు పడుతున్నారా? తెలంగాణాలో ఆంధ్రజ్యోతి చానెల్ ను , సీమాంధ్రలో సాక్షి వంటివాటి పైనా అనుచిత చర్యలకు పాల్పడేవారెవరైనా ప్రభుత్వమైనా ఇతర సంస్థలైనా అటువంటి వాటిపైన మీ అభిప్రాయం ఏమిటి? దీనికి సమాధానం చెప్పుకుంటే నా ప్రశ్న టార్గెట్ అర్ధమవుతుంది తప్ప మరో కోణంలో చూస్తే ఆ కోణం చుట్టే చర్చ నడుస్తుంది. నేను కేవలం ఆ కోణం చుట్టూనే చర్చ తిరగాలనుకోవడంలేదు.

   సోవియట్ భూమి - జ్యోతి పత్రికకు పోలిక సరికాదనేది మీరు అంగీకరించారు. అయితే ఇక్కడ పత్రీకలపై లేదా చానెళ్లపై ఏవిధంగా ప్రభుత్వాలు లేదా మీరంటున్నట్లు ఎమ్మెస్వోలైనా కక్ష సాధింపు చర్యలు మాత్రమే పోల్చదగినవేనని నా అభిప్రాయం. ఆంధ్రజ్యోతి - సాక్షి లాంటి సంస్థల పొలిటికల్ ఎజెండాలు కూడా పోల్చదగినవే.

   Delete
  9. కొండలరావు గారు,

   కొన్ని చానెళ్ళు చేసే విష ప్రచారాల్లాగా, మీరు కూడా దురుద్దేశాలతో భాషా వైచిత్రిని ప్రదర్శిస్తున్నారని నేను చెప్పడం లేదు. కాని మీ ప్రశ్న దాన్ని స్పురిస్తుంది అని మాత్రమె చెప్పదలిచాను. బహుశా అటువంటి వివక్ష గత ప్రభుత్వాలు, ప్రచార సాధనాలు, పుస్తకాలు ఇలా అనేక రకమైన మాధ్యమాల ద్వారా ఎదుర్కోవలసి రావడం వల్లనేమో, ప్రతీ దాన్ని కాస్తా ఎక్కువగానే పరిశీలించి చూడడం అలవాటైందనుకుంటాను.

   ఇక పొతే మీరు దీనంతటికి కెసిఆర్ మూలం అని బలంగా నమ్ముతుండడం వల్ల కూడా ఇటువంటి ప్రశ్నలకు ఆస్కారం కలుగుతోందని నాకు అనిపిస్తుంది. గతంలో ఈ విషయానికి సంబంధించిన ప్రశ్నల్లో మనం కూలంకషంగా చర్చించాం. ఆ విషయం పైన మీ పరిశీలనను, అభిప్రాయాలను తత్సంబంధిత ప్రశ్నలోనో, మరో అనుబంధ ప్రశ్న వేసుకొనో చర్చిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంతే కాని దానిపై స్పష్టత రాకుండా వేరొక ప్రశ్నతో అనుసంధానిస్తే వివాదాస్పత, గందరగోళం పెరుగుతుందే కాని తగ్గదని నా అభిప్రాయం.

   మీరు ఎం ఎస్ వోలతో కెసిఆర్ జోక్యం చేసుకొవచ్చుగదా అంటున్నారు. దాన్నే మీ ఆరోపణకు ప్రధాన ఆధారంగా చూపుతున్నారు. అలా జోక్యం చేసుకున్న కేంద్రం బొప్పికట్టించుకుంది. కోర్టులు ఎమేస్వోలకు ఊన హక్కును గుర్తించాయి, ఆదేశం ఇవ్వలేమని చెప్పాయి. ఇక కెసిఆర్ జోక్యం ఎందుకు చేసుకోలేదనే ప్రశ్న ఎలా వస్తుంది? చేసుకుంటే తానూ కూడా బొప్పి కట్టించుకోవలసి వస్తుందని ఆయన గురించి ఉండవచ్చు కదా?

   కాసేపు కెసిఆర్ వైపునుంచి ఆలోచిద్దాం. ఒకవైపు ఆయన అసెంబ్లీ బహిరంగంగానే ఆ చానెల్లను అభిశంసించి వున్నారు. అటువంటిది తానే వారివైపు ఎలా మధ్యవర్తిత్వం చేయగలదు? ఒకవేళ చేసినా కేంద్ర సమాచార శాఖ మంత్రి మాట వినని ఏమ్మేస్వోలు రేపు కెసిఆర్ మాట వినకపొతే చేయగలిగింది ఏముంది? అప్పుడు కూడా కెసిఆర్ పైకి ఒకటి చెపుతున్నాడు, లోలోపల ఇంకోటి చేస్తున్నాడు అని ప్రతిపక్షం అంటూనే వుంటుంది. ఇంకోవైపునుంది మరో పక్షం కేసిఆర్ ఆ చానెళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి ఇప్పుడు బ్యాన్ ఎత్తి వేయమంటున్నాడు అని ప్రచారం చేస్తుంది. తెలంగాణా మీద దాడి చేయడానికి సీమంద్ర కత్తులకు ఎప్పుడూ రెండువైపులా పదును వుంటుంది.

   Delete
  10. మీ సూచనలో విలువైన అభిప్రాయాలున్నాయి. వాటిని నేను చాలా పాజిటివ్‌గా తీసుకున్నాను. ప్రశ్నించేపద్ధతిలో తప్పు జరిగినదానిని కూడా గుర్తించాను. అది కావాలని చేసింది కాదు గనుక మరోసారి ఇలాంటి సమస్య వచ్చినప్పుడు జాగ్రత్తపడడానికి నాకు బాగా ఉపయోగపడే సూచననే మీరు చేశారు. ఆ భాగం మీకింతముందే అర్ధమయి ఉంటుందనుకున్నాను.

   దీనికి మూలం కే.సీ.ఆర్ అని నేననుకోవడం లేదు. మూలం పత్రికాధిపతుల అహంకారం ఒకరకమైన అజ్ఞానమే. తాము అతి తెలివిగా వ్రాసి ప్రజలను మేనేజ్ చేయగలగమనుకోవడమే. ఇప్పుడంటే కే.సీ.ఆర్ కేంద్రంగా వ్యాఖ్యానించగలం రాజీవ్ గాంధీ డిఫేమెషన్ బిల్లు తెచ్చినప్పుడు ప్రజలు వ్యతిరేకించారు. రామోజీరావు తన పత్రికలలో దాసరి పేరు బేన్ చేయడాన్ని ప్రజలు నిరసించారు. ఇలాంటివి చాలా చెప్పవచ్చు. ఓ పత్రిక యజమాని కాగానే రాజకీయాలను శాసించే లేదా బాగా ప్రభావం చేయాలనుకునే అహంకారాన్ని నేను ఎలా తప్పు పడతానో, రాజ్యాంగ యంత్రాన్ని అడ్డంపెట్టుకుని పాలకవర్గాలు ప్రజల హక్కులను కాలరాయడాన్ని అలాగే తప్పు పడతాను. దురదృష్టవశాతూ ఇక్కడి చర్చలలో ఏది మాట్లాడినా చాలా జాగ్రత్తలు తీసుకోవలసి వస్తున్నది. అది కూడా మనకి మంచిదేనేమో.

   వీళ్లకి ట్రీట్మెంట్ జరగాలి. కానీ ఎలా? అనేది మాత్రం చర్చ జరగాలి? ఇప్పుడున్న పద్ధతిలో మాత్రం కాదు. కే.సీ.ఆర్ ఆలోచన లేదా వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమే ఎమ్మెస్వోల నిర్ణయమని అనుకుంటున్నాను. నిజంగా అలా కాకుండా జరిగి ఉంటే నా ఆరోపణ తప్పవుతుంది. నేనైనా - నాలాగా అనుకునేవారెవరికైనా ఇలాంటి విషయాలలో ఆధారాలు దొరకవు. జరుగుతున్న పరిణామాలను బట్టి ఓ అంచనామేరకే ఆరోపించగలం. ఆరోపణలకే బెంబేలు పడకూడదు. అలా అని అరోఅపణలకు ఎదురు చెప్పకుండా కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఆరోపించినవారికి కొన్ని అభిప్రాయాలను అంటగట్టడం మాత్రం తప్పు.

   ఇక ఎమ్మెస్వోల అధికారాలు ఏమిటి? వాటిని ఎలా నియంత్రించాలనేదానిపై నిజానికి నాకు నాలెడ్జ్ లేదు. ఎమ్మెస్వోలు కేవలం పావులు మాత్రమే అనే అభిప్రాయంలో ఉన్నందున ఆ దిశగా నేను ఆలోచించలేకపోతున్నాను. అది నా లోపం కూడా కావచ్చు. మీరన్న వీ6, నమస్తే తెలంగాణాలను ఆంధ్రాలో బేన్ చేశారనేది ఎవరు అలా చేశారనేది నాకు తెలీదు. నాకు ఆంధ్రాలో ఏయే చానెల్స్ వస్తున్నాయో తెలియదు. ఆ దిశగా ఆలోచించలేదు.

   కావాలని తెలంగాణాపై నూరే సీమాంధ్ర కత్తులగురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. అవి నిజానికి తుప్పు పట్టిన కత్తులే. నేను కొన్ని బ్లాగులు పరిశీలిస్తే తేలింది ఏమిటంటే సీమాంధ్రలో అలా మాట్లాడేవారికంటే కే.సీ.ఆర్ నోటిదూల చాలా నయం. నేను కే.సీ.ఆర్ కు మాత్రమే నోటిదూల ఉందనుకునేవాడిని. అంతక్రితం సమైక్యమన్నవారు విడిపోతే నష్టమన్న నోళ్లే ఇప్పుడు మేము కావాలన్నా కలవమంటున్నారు. కేంద్రం అండ ఉందంటున్నారు. అంటే వీరు బాగుంటే రెండు నాలకల ధోరణిలో మాట్లాడతారన్నమాట. అలాంటి వారిని చూసినా , సీమాంధ్ర ప్రజలంతా అలాగే ఉన్నట్లు వాదించే తెలంగాణా వారిని చూసినా నాకు అసహ్యమేస్తుంది. అది సీ.ఎం అయినా చిన్నపాటి సామాన్యుడైనా. ఇక్కడే నేను ఇరుప్రాంతాల బ్లాగర్లనుండి వ్యతిరేకతను ఎదుర్కుంటున్నానిపిస్తోంది.

   కే.సీ.ఆర్ పై మీరన్న పద్ధతిలో ఆరోపణలు వచ్చే అవకాశం ఉన్నది. ఆరోపణలు వస్తాయని బాధ్యతలలో ఉన్న వ్యక్తులు మిన్నకుండడం భావ్యం కాదు.

   Delete
 2. This comment has been removed by the author.

  ReplyDelete
 3. కొండలరావు గారూ, ఇప్పటికే ఆంధ్రజ్యోతి వాళ్ళు కెసిఆర్ తమను టార్గెట్ చేసారని చేసిన ఆరోపణలను కూలంకుషంగా చర్చించాం (టీవీ9 గురించి ఎవరూ మాట్లాడలేదు). ఎటువంటి ఆధారాలు లేకుండానే మీకు ఈ విషయంలో గట్టి విశ్వాసం ఉందనీ, విశ్వాసం ఒక్కటే చాలునని చెప్పారు విని తరించాము.

  ఇప్పుడు చర్చ సాక్షి గురించి. మళ్ళీ ఇక్కడ కెసిఆర్ ప్రస్తావన చేయడం ఆవు వ్యాసం రాసినట్టు ఉంది.

  ReplyDelete
  Replies
  1. జై గారు, మీరు తరించినా తన్మయం చెందినా అది మీ వ్యక్తిగతం. పత్రీకల స్వేచ్చను కాల రాయడం, పత్రికలను అడ్డుపెట్టుకుని కుళ్లు రాజకీయాలు చేయడం ఇవి రెండూ ప్రజాస్వామ్యానికి ప్రమాదం. కే.సీ.ఆర్ పై ఈగ వాలకూడదన్న మీ పట్టుదల పట్ల కూడా నాకు అభ్యంతరముండాల్సిన పని లేదు. కొందరికి ఆవు వ్యాసంలా , కొందరికి ఆనందం కలిగించేదిగా ఉండి ఉండవచ్చు. నా టార్గెట్ మాత్రం పైన శ్రీకాంత్ చారి గారికి చెప్పినప్రకారం పత్రికా రాజకీయాలు - రాయాంగ యంత్రం రెండూ శృతిమించకుండా ఉండాలనే కోరికే తప్ప ప్రత్యేక ఎజెండాలేమీ లేవు. అవి ఉన్నవారికి రంధ్రాన్వేషణ బూతద్దంతో చూడడం ఉంటుంది కనుక కొన్ని సమస్యలు తప్పవు. నేను ఆల్రెడీ చెప్పాను కే.సీ.ఆర్ ను ప్రత్యేకంగా అన్నా అనకపోయినా ఇక్కడ ప్రశ్నకు వచ్చే నష్టమేమీ లేదు. బాబు ప్రభుత్వం చేసినా , కే.సీ.ఆర్ ప్రభుత్వం చేసినా పత్రికా స్వేచ్చను హరించే చర్యలు ఏ ప్రభుత్వంలో జరిగినా తప్పే. మీరేమో ఆంధ్రజ్యోతి చానెల్ ను ఎమ్మెస్వోలు మూసివేయడాన్ని ఒకరకంగా - అక్కడ సాక్షిని అధికారిక ప్రెస్మీట్లకు రానివ్వకపోవడాన్ని ఒకరకంగా చూస్తున్నారు. ఇక్కడేమో ఆధారాలు అడుగుతున్నారు. అక్కడేమో అటని ఆధారంగా చేసుకుని దీనికేమంటారు వేమూరి వారంటున్నారు? ఎవరు ఏమన్నా మనం చెప్పాలనుకుంటున్నది పత్రికలను లేదా చానళ్లను బేన్ చేయవద్దనే కదా? ఆ దిశగా చర్యలు తీసుకోని ప్రభుత్వాలను తప్పు పట్టాలి కదా?

   Delete
  2. కెసిఆర్ మీద ఈగేం ఖర్మ ఏనుగు పడ్డా నాకు అనవసరం. మీకు ఈ విషయంలో ఎందుకు అనుమానం వచ్చిందో నాకు అర్ధం కావడం లేదు.

   Delete
 4. ప్రస్తుతం రాజకీయవిషయాలమీద వ్యాఖ్యానించే ఆసక్తి నాకు లేదు.
  కాని ఒక్క విషయం మాత్రం ప్రస్తావించాలని ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను.
  ప్రజాస్వామ్యవ్యవస్థ యొక్క మూలస్థంభాలలో పత్రికలనూ చెప్పారు.
  ప్రజస్వామ్యవ్యవస్థలు అన్నీ రాజకీయాలతో నిండిపోవటం లేదా రాజకీయప్రభావంతో నడుస్తూ ఉండటం అనేది మంచిది కాదు.
  పత్రికలు రాజకీయపార్టీలచేతుల్లో పనిముట్లుగా పనిచేయటం అభిలషణీయం కాదు.
  పత్రికలు ప్రభుత్వకరపత్రాల్లాగా పనిచేయటం అభిలషణీయం కాదనటం పై వాక్యార్థంలో భాగమే.
  పత్రికలమీద పెత్తనాలు ఎలా జరుగుతున్నదీ దాని వలన అవి విస్వసనీయతను ఎలా కోల్పోతున్నదీ సమాజంలో అందరికీ అవగాహనలోకి వచ్చి తీరుతుంది.
  అందుచేత చైతన్యవంతమైన సమాజం అటువంటి చవకబారు పోకడలను నిరోధించగలదు.
  కొన్నాళ్ళో మరికొన్నాళ్ళో కొన్ని పత్రికలు పార్టీలప్రచారసాధనాల్లాగా ఉండగలిగినా అవి అలా హెచ్చుకాలం‌ మనలేవు.
  ఇక్కడ పత్రికలు అన్నది ప్రతీకార్థపదమే - నిజానికి అన్నిరకాల మీడియాకు ఈ పదాన్ని విస్తృతీకరించాలి.
  ఈ రోజున ఒక ప్రభుత్వం లేదా అధికారపార్టీ లేదా ప్రతిపక్షపార్టీ ప్రత్యక్షంగానో పరోక్షంగానో మీడియామీద పెత్తనం చేస్తే అది స్త్వరంగానే వ్యతిరేకఫలితాల నిస్తుంది. అందుచేత హెచ్చుగా భయపడవలసిందేమీ లేదు.

  ReplyDelete

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

p v satyanarayana video's vrk diet vrk videos అధ్యయనం ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ కత్తెరింపులు కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం చరిత్ర జనవిజయం తెలుగు-వెలుగు నమ్మకాలు-నిజాలు నవ్వుతూ బ్రతకాలిరా నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం పరిపాలన పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు ప్రకృతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భాష మతం మంతెన వీడియోలు మనం మారగలం మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మార్క్సిజం మీడియా మెరాజ్ ఫాతిమా రాజకీయం రాజ్యాంగం రిజర్వేషన్లు లింక్స్ వార్త-వ్యాఖ్య వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు విజ్ఞానం విద్య వినోదం వీడియోలు వెంకట రాజారావు.లక్కాకుల శుభాకాంక్షలు సమాజం సంస్కృతి సాహిత్యం సినిమా సైన్స్ స్పూర్తి
 
Top