మనకు విషయాలు తెలియాలంటే కేవలం పుస్తకాలు చదివితేనే తెలియాలనిలేదు. నేర్చుకోవడానికి నామోషీ ఫీల్ కాకుండా ఉంటే ప్రతీ చోటనుండి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు.

సమాజంలో ప్రతీ చోట మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. మంచి నుండి - చెడు నుండి రెండు చోట్లా మనం నేర్చుకోవచ్చు. 

పరిచయస్తులతో మాట్లాడేటప్పుడు, అపరిచితులతో మాట్లాడేటప్పుడు నేర్చుకోవచ్చు. 

ఇతరుల సంభాషణలు లేదా చర్చలను వీక్షిస్తూ నేర్చుకోవచ్చు. రైల్వేస్టేషన్లు - బస్స్టాండ్ లలో వెయిటింగ్ చెసే సందర్భంలో , గ్రామాలలో రచ్చ బండల దగ్గర చాలా చాలా గొప్ప విషయాలు మనం అబ్సర్వ్ చేసి నేర్చుకోవచ్చు. 

టీ.వీ వీక్షించేటప్పుడు మనకు తెలియని , తెలుసుకోవలసిన విషయాలు నేర్చుకోవచ్చు. చర్చలో పాల్గొనే వారు కష్టపడి చదవడం ద్వారా నేర్చుకున్నవి ఉదాహరణలకోసమో లేదా చర్చల్లో అవసరం కోసమో వాల్లు చెప్పినప్పుడు ఆ కష్టమంతా పడకుండా వారి అనుభవం నుండి మనం నేర్చుకోవచ్చు. 

ప్రయాణాలలో బోర్ కొట్టకుండా ఏదో మేగజైన్ లేదా బుక్ చదువుకునే అలవాటు చేసుకుంటే ప్రతి పుస్తకం లో ఏదొ ఒక ఉపయోగపడే అంశం తెలిసే అవకాశం ఉంటుంది.  

ఒక సినిమా చూసేటప్పుడు కొన్ని డైలాగులు అద్భుతమైన జీవిత సారాన్ని అందజేస్తాయి. అవి ఒక్క సారే వచ్చినవి కావు. ఆ రచయిత ఎంతో అనుభవం తో ఆలోచించి వ్రాసినవి అవి. అలాగే ఎక్కడైనా వ్యవహారం సాగుతున్నప్పుడు-ఏదైనా చదివేటప్పుడు ఆ వ్యక్తుల అనుభవం మనకు ఉపయోగపడుతుంది. ఆ విషయాలు నేర్చుకోవడానికి మనకు సమయం కలసివచ్చినట్లే.

ఉదాహరణకు ఈ మధ్య నేను హైదరాబాద్ వెళ్లాను అక్కడ పని మధ్యలో అనుకున్నదానికి కొంత సమయం గేప్ వచ్చింది. ఖాళీగా ఉండకుండా అధినాయకుడు సినిమాకి వెళ్లాను. అందులో ఇంగ్లాండ్ గురించి ఓ సన్నివేశంలో క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ లో అయితే ఇంతవరకూ వరల్డ్ కప్ గెలవలేదు అనే విషయం తెలుసింది. ఈ విషయం చాలామందికి చాలా ఈజీగా తెలియవచ్చు. కానీ క్రికెట్ పట్ల అంతగా ఆశక్తి లేని నాలాంటివాల్లకు ఏదైనా సందర్భంలో చెప్పేందుకు ఇది ఉపయోగపడుతుంది కదా? 

నాకప్పుడే మన బ్లాగులలో ఎక్కడో చదివిన ఓ విషయం గుర్తుకువచ్చింది. భౌగోళికంగా మన రెండు గోదావరి జిల్లాలంత లేని బ్రిటీష్ వాడి ఇంగ్లీష్ ప్రపంచ భాషగా రాజ్యమేలడానికి తేనెలొలుకు మన తెలుగు భాష కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కావడానికి కారణం బ్రిటీష్ వాడు అప్పట్లో వ్యాపారం పేరుతో దేశాలను ఆక్రమించుకుని వలసపాలన కొనసాగించడమే  కారణం తప్ప ఇంగ్లీష్ గొప్పతనం ఎంతమాత్రం కాదు. 

ఈ విషయాలను కేవలం విషయాలు ఎలా ఎక్కడనుండైనా నేర్చుకోవచ్చనేదానికి ఉదాహరణగా మాత్రమే చెప్పాను. ఒక్కో సినిమా ఒక్క డైలాగ్ తోనే ఆ సినిమా లైన్ అర్ధమవుతుంది. 

ఉదాహరణకు "పదిమందిని బ్రతికించడం కోసం చేసేదేదీ తప్పు కాదు" - కమల్ నాయకుడు. 

"వందమందికి మేలు చేయడం కోసం ఒక్కడిని చంపడానికైనా , చావడానికైనా సిద్దం" - జూనియర్ ఎన్.టీ.ఆర్ సిమ్హాద్రి.

మన బ్లాగులలో కొన్ని అంశాలపై కొందరు అద్భుతం గా వ్రాస్తున్నారు. వాటిని ఫాలో కావడం ద్వారా నేర్చుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉదాహరణలు చెప్పోచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రతిదాని నుండి నేర్చుకోవచ్చు. 

అయితే ఆ విషయాలను అరకొరగా కాకుండా అవసరాన్ని బట్టి మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

చాలా విషయాలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటాయి. పాత సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోని వాల్లు అలా చేసుకున్నవాల్ల కంటే వెనుకబడడం ఖాయం. విషయాలను అప్డేట్ చేసుకోనివారు ఆయా రంగాలలో పోటీవల్ల అవుట్ డేట్ అయ్యే ప్రమాదం ఉంది. 

డాక్టర్లు - లాయర్లు ..... ఇలా ప్రతీ వృత్తిలో ఉన్న వాల్లు ఆయా వృత్తులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ నేర్చుకోకపోతే చాలా వెనుకబడిపోవడం ఖాయం.

సమాజంను మించిన విశ్వ విద్యాలయం లేదు. ప్రస్తుత చదువులలో కేవలం డబ్బు సంపాదించుకోవడం కోసం మాత్రమే చదువులు నేర్పుతున్నారు తప్ప మిగతా లోక జ్ఞానం నేర్పరు. అదంతా సమాజం నుండే మనం నేర్చుకోవాలి.

ఈ లోకంలో ఉన్న జ్ఞానమంతా ఏ ఒక్కరికీ ఎప్పటికీ తెలియదు. మన జీవిత కాలం వెచ్చించినా జ్ఞానమంతా ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ప్రతి జ్ఞానం ఎప్పటికప్పుడు మెరుగవుతుంది. కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయి. అయితే పాతది లేకుండా కొత్తది లేదు అనే సంస్కారం మరువకూడదు.

చిన్న వాల్లనుండి , మనకంటే తక్కువ స్థాయి వాల్ల నుండి తెలుసుకునేందుకు ఇబ్బంది పడకూడదు. నామోషీ ఫీల్ కాకూడదు. ఒకరికి తెలిసిన విషయం మరొకరికి తెలియదు. 

అన్ని జ్ఞానాలు గొప్పవే. అన్నీ వాటి వాటి అవసరాల కోసం పనికి వస్తాయి. పీ.ఎం  (పనిమనిషి)  నుండి పీ.ఎం (ప్రైం మినిస్టర్) వరకూ ఎవరి పని వాల్లు చేస్తుంటారు. వాల్ల పనిలో వాల్లు నిష్ణాతులవౌతారు. పాలుపితికే పని పాలేరు చేసినంత నేర్పుగా ప్రైం మినిస్టర్ చేయలేక పోవచ్చు.

అందుకే ఎక్కడనుండి నేర్చుకోవడానికీ ఏ మాత్రం నామోషీ ఫీల్ కాకుండా సమాజం నుండి ప్రతి సందర్భం నుండి నేర్చుకునే ప్రయత్నాన్ని ఓ అలవాటుగా మార్చుకుందాం. 

Reactions:

Post a Comment

* మీ వ్యాఖ్యలు తెలుగులోనే వ్రాయండి
* పోస్టుతో సంబంధంలేని, సంయమనం లేని, ఎవరికీ ఉపయోగం కాని వ్యాఖ్యలు వద్దు.
* నింద వేరు - విమర్శ వేరు, ఎవర్నీ గాయపరచకుండానే విమర్శించవచ్చు.
* పుల్లవిరుపుగా తీసిపారేయటం వల్ల అసహనం ఉపశమిస్తుందేమో, ఒరిగేదేమీ లేదు.
* ఏదైనా నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కాస్త సున్నితంగా, విశదంగా చెప్పండి. .
* అనవసర వ్యాఖ్యలు తొలగించబడతాయి.
* తెలుగులో వ్రాయటానికి ఈ బాక్సులో ఇంగ్లీష్‌లో టైప్ చేయండి.
* మద్యలో ఇంగ్లీష్ పదాలు టైప్ చేయాలనుకుంటే CTRL+G నొక్కండి.
* మరల తెలుగుకోసం కూడా CTRL+G ఉపయోగపడుతుంది.
* తెలుగులో వచ్చిన మేటర్ ని కాపీ చేసి క్రింద కామెంట్ బాక్స్ లో ఉంచడం ద్వారా మీ కామెంట్ పబ్లిష్ అవుతుంది.

అధ్యయనం అవినీతి ఆదూరి హైమవతి ఆధ్యాత్మికం ఆరోగ్యం ఆర్ధికం ఇంటర్వ్యూ ఎన్నికలు కత్తెరింపులు కథ కవిత కార్యక్రమాలు కుటుంబం కులం చట్టం-న్యాయం చట్టసభలు చరిత్ర చర్చావేదిక చేయెత్తి జై కొట్టు తెలుగోడా! జనవిజయం జై గొట్టిముక్కల తెలంగాణ తెలంగాణా పునర్నిర్మాణం తెలుగు భాష తెలుగు-వెలుగు తెలుగుజాతి మనది నమ్మకాలు-నిజాలు నరసింహారావు మద్దిగుంట నవ్వుతూ బ్రతకాలిరా నా ప్రయాణం నా బ్లాగు అనుభవాలు నాకు నచ్చిన పాట నేను చదివిన పుస్తకం నేర ప్రపంచం నేరాలు-ఘోరాలు పత్రికా స్వేచ్చ పరిపాలన పరిశోధనలు పర్యావరణం పల్లా కొండల రావు పల్లె ప్రపంచం పల్లె సమస్యలు పల్లెప్రపంచం పిల్లల పెంపకం పురస్కారాలు పోరాటం ప్రకృతి జీవన విధానం ప్రక్రుతి జీవన విధానం ప్రజ ప్రజ వ్యాసములు ప్రజా రవాణా ప్రభుత్వ పథకాలు ప్రముఖులు ప్రవీణ్ కుమార్ ప్రశ్న ఫన్నీ ఫోటోలు బాల్యం బుల్లితెర బ్లాగు ప్రపంచం భారతరత్న భారతీయం భారతీయ సంస్కృతి భావ ప్రకటన భావప్రకటన భాష భూగోళం మంచి అలవాట్లు మంచి పాటలు మతం మంతెన వీడియోలు మధుర గీతాలు మల్లంపల్లి స్వరాజ్య లక్ష్మి మహనీయులు మహిళ మానవ వనరులు మానవ సంబంధాలు మానవ హక్కులు మానవహక్కులు మార్కెటింగ్ మార్క్సిజం మీడియా మెదడుకు మేత మెరాజ్ ఫాతిమా మేగజైన్ మేగజైన్ ప్రమోషన్ యువత యోగా రమేష్ బండారు రాజకీయం రాజ్యాంగం రామకీర్తనలు రాష్ట్ర విభజన రిజర్వేషన్లు రేగింగ్ లింక్స్ వార్త-వ్యాఖ్య వార్తలు వి. శాంతి ప్రబోధ వికాసం విగ్రహాలు-ఆగ్రహాలు విజ్ఞానం విద్య విద్యా విధానం వినోదం వీడియోలు వృక్షో రక్షతి రక్షిత: వృద్ధాప్యం వెంకట రాజారావు.లక్కాకుల వెబ్ మీడియా వేమన పద్యాలు వ్యక్తిగతం వ్యక్తిత్వ వికాసం వ్యవసాయం శుభాకాంక్షలు శ్యామలరావు తాడిగడప సమాజం సంస్కృతి సహాయం సాహిత్యం సిద్ధాంతం సినిమా సూరానేని హరిబాబు సేకరణలు సైన్స్ స్పూర్తి
 
Top